మన ఆహార, వ్యవసాయ రంగాలకు పూర్తి రక్షణ  | Commerce Minister Piyush Goyal trade deal statement | Sakshi
Sakshi News home page

మన ఆహార, వ్యవసాయ రంగాలకు పూర్తి రక్షణ 

Feb 5 2026 5:37 AM | Updated on Feb 5 2026 5:37 AM

Commerce Minister Piyush Goyal trade deal statement

అమెరికాతో ఒప్పందం పట్ల ఆందోళన అక్కర్లేదు  

పార్లమెంట్‌లో మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చిచెప్పారు. మన దేశ ఆహార, వ్యవసాయ రంగాలకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణలు ఉన్నట్లు తెలిపారు. ఆయన బుధవారం తొలుత లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని అన్నారు.

 అమెరికాతో ఒప్పందం వల్ల మనకు లాభం చేకూరుతుందని ప్రకటించారు. అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఎగుమతుల విషయంలో మన పోటీ సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం హఠాత్తుగా కుదిరిందని కాదని, భారత్, అమెరికా మధ్య పలు దఫాల చర్చల తర్వాతే తుదిరూపు వచ్చిందని స్పష్టంచేశారు. ఇది సమతుల్య, పరస్పర ప్రయోజనాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement