టాటా పంచ్‌ ఈవీ వచ్చేసింది | Tata Punch EV launched in India | Sakshi
Sakshi News home page

టాటా పంచ్‌ ఈవీ వచ్చేసింది

Jan 18 2024 6:19 AM | Updated on Jan 18 2024 6:19 AM

Tata Punch EV launched in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పంచ్‌ ఎలక్ట్రిక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలై రూ.14.49 లక్షల వరకు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది.

ఒకసారి చార్జింగ్‌తో 25 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 190 ఎన్‌ఎం టార్క్‌తో 120 బీహెచ్‌పీ,  అలాగే 114 ఎన్‌ఎం టార్క్‌తో 80 బీహెచ్‌పీ వర్షన్స్‌లో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్‌సీ, ఈఎస్‌పీ, క్రూజ్‌ కంట్రోల్, 360 లీటర్ల బూట్‌ స్పేస్‌ వంటి హంగులు ఉన్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంది. డెలివరీలు జనవరి 22 నుంచి ప్రారంభం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement