మైక్రో ఎలక్ట్రిక్​  కారు వచ్చేస్తోంది..అత్యంత చౌక ధరలో

India Cheapest Electric Car PMV EaS E Launching on November 16 - Sakshi

సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్‌ కానుంది.  పీఎంవీ ఎలక్ట్రిక్​ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్​ వెహికిల్​ పీఎంవీ ఎలక్ట్రిక్​ ఈఏఎస్​-ఈ  కారు నవంబరు 16న విడుదల కానుంది.  దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముంబై ఆధారిత పీఎంవీ ఎలక్ట్రిక్​ సంస్థ (పర్సనల్​ మొబిలిటీ వెహికిల్​) ఇండియాలో తన తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ మైక్రోకార్  EaS-Eని ఆవిష్కరించనుంది. 

EaS-E ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్‌ అంచనాలు 
కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు  మూడు వేరియంట్‌లలో  లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్‌కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లేత గోధుమరంగు, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్  రంగుల్లో లభ్యం. పీఎంవీ ఎలక్ట్రిక్​ సంస్థ ఫౌండర్​ కల్పిత్​ పటేల్​  సమచారం ప్రకారం ఈ వెహికల్‌ ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ​ 120-200 కి.మీ  పయనిస్తుంది. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతంది.  ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ని ఆఫర్​ చేస్తున్నట్టు  కంపెనీ తెలిపింది. 

పీఎంవీ ఎలక్ట్రిక్​ ఈఏఎస్​-ఈలో డిజిటల్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, యూఎస్​బీ ఛార్జింగ్​ పోర్ట్​, ఏసీ, రిమోట్​ కీలెస్​ ఎంట్రీ, రిమోట్​ పార్క్​ అసిస్ట్​, క్రూజ్​ కంట్రోల్​, సీట్​ బెల్ట్స్​ వంటివి ఉన్నాయి.  ఇంకా మైక్రో ఎలక్ట్రిక్​ కారు 550కేజీల బరువుతో పొడవు 2,915ఎంఎం, విడ్త్​ 1,157ఎంఎం, హైట్​ 1,600 ఎంఎంగానూ,  వీల్​బేస్​ 2,087ఎంఎంగా, గ్రౌండ్​ క్లియరెన్స్​ 170ఎంఎంగా ఉంటుందట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top