అజిత్ పవార్ సతీమణి తొలిప్రసంగం.. ఏమన్నారంటే | Sunetra Pawar First Speech As The Deputy Chief Minister Of Maharashtra, Comments On Ajit Pawar Death | Sakshi
Sakshi News home page

అజిత్ పవార్ సతీమణి తొలిప్రసంగం.. ఏమన్నారంటే

Feb 1 2026 4:28 AM | Updated on Feb 1 2026 4:34 PM

Sunetra Pawar speech as the Deputy Chief Minister of Maharashtra

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో ఆమె సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె తొలిప్రసంగం చేశారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సునేత్రా పవార్ మాట్లాడుతూ" దాదా అకాల మరణం నాకు వ్యక్తిగతంగా  దుఃఖాన్ని కలిగించడమే కాకుండా మహారాష్ట్ర మెుత్తాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన నాకిచ్చిన కర్తవ్యనిష్ఠ, పోరాటంలో బలం, ప్రజల పట్ల నిజాయితీగల నిబద్ధతే నాకు నిజమైన పునాదులు" అని ఆమె అన్నారు. తన దుఃఖాన్ని దిగమింగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడమే తన లక్షంగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.

రైతులు, మహిళలు, యువత, కార్మికుల కోసం దాదా ఎంతో సేవ చేశారని తాను కూడా ఆ పరంపరను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఇంతటి కష్ట సమయంలో మహారాష్ట్ర ప్రజలు ఇ‍చ్చిన మద్దతు తన అసలైన బలం అని తెలిపింద ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్, మహాత్మా పూలే, అంబేద్కర్ భావజాలాల పట్ల విధేయతతో ఉంటానని సనేత్ర పవార్ తెలిపింది.

అయితే ఇటీవల బారమతికి ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా అజిత్ పవార్ పయణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు అందులో పయణిస్తున్న వారందరూ మృతిచెందారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement