భారత్‌కు బై చెప్పం..! | Nissan Has No Plans To Exit Indian Market, Check More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు బై చెప్పం..!

May 29 2025 12:50 AM | Updated on May 29 2025 12:38 PM

Nissan has no plans to exit Indian market

మరో 3 కొత్త కార్లు తెస్తున్నాం 

నిస్సాన్‌ ఇండియా ఎండీ వత్స 

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ మోటార్స్‌ భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమిస్తోందంటూ వస్తున్న వార్తలను కంపెనీ ఇండియా ఎండీ సౌరభ్‌ వత్స ఖండించారు. అలాంటి యోచనేదీ లేదని స్పష్టం చేశారు. అంతేగాకుండా 2027 నాటికి మరో మూడు కొత్త కార్లను ప్రవేశపెట్టబోతున్నామని, ఈ ఏడాది ఇంకో 20 డీలర్లను నియమించుకోబోతున్నామని వత్స తెలిపారు.

 భారత్‌లో జాయింట్‌ వెంచర్‌ సంస్థ రెనో నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా (ఆర్‌ఎన్‌ఏఐపీఎల్‌)లో నిస్సాన్‌కి ఉన్న 51 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు రెనో మార్చి 31న ప్రకటించింది. దీంతో నిస్సాన్‌ భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమించేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వత్స వివరణ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తాము దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, తమ తయారీ, కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు మొదలైనవన్నీ యథాప్రకారంగానే అమలవుతాయని తెప్పారు. 

2026 మొదటి త్రైమాసికంలో సెవెన్‌ సీటర్‌ బీ–సెగ్మెంట్‌ ఎంపీవీని, ఆ తర్వాత 2027 తొలి నాళ్లలో ఫైవ్‌.. సెవెన్‌ సీటర్‌ సీ–ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నట్లు వత్స తెలిపారు. కొందరు డీలర్లు తప్పుకోవడంతో ప్రస్తుతం డీలర్‌íÙప్‌ల సంఖ్య 160కి పరిమితమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి దీన్ని 180కి పెంచుకోనున్నామని వత్స వివరించారు. 

మరోవైపు,  ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్‌జీ రెట్రోఫిట్‌మెంట్‌ కిట్‌తో కూడా తమ మాగ్నైట్‌ ఎస్‌యూవీ లభిస్తుందని చెప్పారు. అదనంగా రూ. 74,999 చెల్లిస్తే ఈ సదుపాయాన్ని పొందవచ్చన్నారు. తొలి దశలో ఢిల్లీ–ఎన్‌సీఆర్, మహారాష్ట్ర, కేరళ తదితర 7 రాష్ట్రాల్లోని ఆథరైజ్డ్‌ డీలర్‌íÙప్‌ల ద్వారా సీఎన్‌జీ కిట్‌ ఇన్‌స్టాలేషన్‌ను ఆర్డరు చేయొచ్చని, రెండో దశలో దీన్ని మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement