2023 Audi Q3: 2023 ఆడి క్యూ3 బుకింగ్స్‌ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు  

2023 Audi Q3 Bookings Open First 500 Customers Get Benefits - Sakshi

సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్‌యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంచింది.  రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు.  ఈ ఏడాది  చివరి నాటికి  డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్‌ చేసిన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్‌ , బిగ్‌ ఇన్వెస్టర్‌గా అదానీ)

వినూత్న డిజైన్,బెస్ల్‌ఇన్‌ క్లాస్‌ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్‌ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్‌లైన్‌లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3  2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.  ప్రీమియం ప్లస్  అండ్‌, టెక్నాలజీ,  క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది.  (Moto G62 5G:మోటో కొత్త  5జీ స్మార్ట్‌ఫోన్‌, స్పెషల్‌  ఎట్రాక్షన్‌ ఏంటంటే?)

అలాగే, మొదటి 500 మంది కస్టమర్‌లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్‌ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్‌టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్‌ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది.

2023 ఆడి క్యూ3లో  2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్‌లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top