VolkswagenTaigun:యానివర్సరీ ఎడిషన్‌: అదరిపోయే ఫీచర్స్‌, కలర్స్‌

Volkswagen Taigun Anniversary Edition launch India new features colour - Sakshi

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ ఎస్‌యూవీ తొలి వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్‌  చేసింది. టైగన్ ఎస్‌యూవీని లాంచ్‌ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా   కొన్ని  స్పెషల్‌ ఫీచర్లతో  ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌గా సరికొత్తగా లాంచ్‌ ‌చేసింది. రైజింగ్ బ్లూ కలర్‌,  ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్‌లో  ఇది అందుబాటులో ఉంది.  స్టాండర్డ్ టైగన్‌తో పోలిస్తే  ఇందులో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ , ఇతర ఫీచర్లతో తీసుకొచ్చింది.


డైనమిక్ లైన్‌లో తీసుకొచ్చిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ స్పెషల్ ఎడిషన్ రెండు ఇంజీన్లతోరానుంది. 1.0 TSI MT & ATలో అందుబాటులో ఉన్న టాప్‌లైన్ వేరియంట్. "1" వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌తో స్పోర్టియర్ లుక్స్‌తో అదరగొడుతోంది. ఇందులో హై లగ్జరీ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, విండో వైజర్‌లతో సహా ప్రత్యేకంగా  డిజైన్‌చేసిన 11 అంశాలు ఉన్నాయి.

సెఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే  టైగన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్,  6 వరకు ఎయిర్‌ బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు, రివర్స్ కెమెరా, ISOFIX, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ సిస్టమ్ లాంటి పూర్తి స్థాయి 40+ భద్రతా ఫీచర్లను జోడించింది. అదనంగా  3 పాయింట్ సీట్ బెల్ట్‌లతో పాటు వెనుకవైపు 3 ఎడ్జస్టబుల్‌ హెడ్‌రెస్ట్‌ కూడా  ఉంది. 

టైగన్ యానివర్సరీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్‌తో కూడిన 1.0L TSI ఇంజన్,  5000 నుండి 115PS (85 kW) గరిష్ట శక్తిని, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక. 5500 ఆప్‌పిఎం  వద్ద  గరిష్ట టార్క్ 178 టార్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. 

1.5L TSI EVO ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ,  7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో అమర్చబడి ఉంటుంది, ఇది 150PS (110 kW) గరిష్ట శక్తిని 5000, 6000 rpm  వద్ద, 5000 టార్క్ అందిస్తుంది. ఈ స్పెషల్‌ ఎడిషన​ ధరలు రూ. 15.40 లక్షలు- రూ. 16.90 లక్షల వరకు ఉంటాయి. 

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌లో టాప్ 3 ఫైనలిస్ట్‌గి నిలిచి ప్రపంచస్థాయిలో టైగన్‌ ఖ్యాతిగడించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగా టైగన్ కస్టమర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. టైగన్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 40 వేల  కంటే ఎక్కువ  ఆర్డర్‌లను సాధించగా , 22వేల టైగన్‌లను డెలివరీ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top