ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్‌ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్‌లో

MG Comet EV launching soon check details - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఎంజి మోటార్ ఇండియా త్వరలోనే నగరాల్లో రోజువారీ ప్రయాణాలకనుగుణంగా ఉండేలా ఒక స్మార్ట్ కారును తీసుకొస్తోంది. ‘కామెట్‌’ పేరుతో స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని లాంచ్‌ చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లలో అందిస్తున్న Wuling Air EV ఆధారంగా తన 'కామెట్'ని తీసుకొస్తోందని సమాచారం. కేవలం 2,900mm పొడవుతో, కామెట్ Tiago EV , CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుంది.

(ఇదీ  చదవండి: నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!)

ఒక్క ఛార్జ్‌తో 150-200 కిలోమీటర్ల రేంజ్‌తో కామెట్‌ వస్తోంది. ఇది 25 kWh బాటరీ, 50kW మోటారుతో అందుబాటులోకి రానుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బాటరీ మెరుగైన బాటరీ లైఫ్, పెర్ఫార్మన్స్‌తో  అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహన దారులకు అలరించనుంది. 

డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్ , ఇతర కనెక్టెడ్ ఫీచర్స్ తో ప్రీమియం వాహనాలకు ఏమాత్రం తగ్గకుండా కామెట్ మార్కెట్లోకి రానుంది.  ఇక  ధర విషయానికి వస్తే రూ. 10 లక్షలోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పార్కింగ్ స్థలాల లేమి, కాలుష్యం మధ్య ఎంజీ  కామెట్ వేగవంతమైన, సరసమైన, భవిష్యత్తు పరిష్కారమని కంపెనీ పేర్కొంది.
    
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top