ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 విజయం సాధించిన తరువాత.. షఫాలీ వర్మ కొత్త ఎంజీ సైబర్‌స్టర్ కారును కొనుగోలు చేశారు. మూడు ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కురాలైన మహిళల్లో ఒకరైన వర్మ.. 2025లో ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టులో భాగంగా ఉండటంతో పాటు 2023 ఆసియా కప్ & 2023 U-19 T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా ఆటలో గణనీయమైన విజయాన్ని సాధించారు. ఇక ఈమె కొనుగోలు చేసిన కారు విషయానికి వస్తే..
ఎంజీ సైబర్‌స్టర్
సైబర్‌స్టర్ అనేది ప్రపంచ మార్కెట్‌కు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన మొట్టమొదటి రోడ్‌స్టర్. దీనిని సంస్థ ప్రీమియం డీలర్‌షిప్లలో మాత్రమే M9 ఎలక్ట్రిక్ MPVతో విక్రయిస్తోంది. జూలై 2025లో అమ్మకానికి వచ్చినప్పటి నుంచి.. సైబర్‌స్టర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ కారు మొదటి రెండు నెలల్లో 250 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. కాగా ఈ కారు కోసం ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలు కావడం గమనార్హం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎంజీ రోడ్‌స్టర్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్ మోటార్ AWD పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 77 kWh బ్యాటరీతో 528 bhp & 725 Nm టార్క్ అందిస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 580 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ కార్లు ఉన్న దేశాలు
మంచి డిజైన్ పొందిన ఈ కారు.. టాప్ రూఫ్‌తో సరైన స్పోర్ట్స్ కారు మాదిరిగా కనిపిస్తుంది. క్యాబిన్ స్టీరింగ్ వెనుక ట్రై-స్క్రీన్ డిస్ప్లేతో డ్రైవర్-సెంట్రిక్ లేఅవుట్‌ను కూడా ఉంది. బోస్ ఆడియో సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటివి ఈ కారులో ఉన్నాయి. సైబర్‌స్టర్ EV ప్రస్తుతం ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్).


