శ్రీలంక- పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య లంకపై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో దంబుల్లా వేదికగా రెండో పోరులోనైనా గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న లంకకు చుక్కెదురైంది.
మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా సమయానికి మ్యాచ్ ప్రారంభం కాకపోగా... ఆ తర్వాత వర్షం దంచికొట్టడంతో ఆట సాధ్యపడలేదు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది.
శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగ, దసున్ షనక(కెప్టెన్), దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, త్రవీన్ మాథ్యూ, మతీశ పతిరణ, దునిత్ వెల్లలగే, కమిందు మెండిస్, కుశాల్ పెరీరా.
పాకిస్తాన్ జట్టు
సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా జూనియర్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖవాజా నఫే, ఉస్మాన్ తారిఖ్, అబ్దుల్ సమద్
చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ


