తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్‌ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.
లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్(21) రాణించింది. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్(9) మాత్రం విఫలమయ్యారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్‌ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్ 28న జరగనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా


