ఎద్దుల బండ్లు, గుర్రాలను ప్రయాణానికి ఉపయోగించిన మానవుడు.. నేడు విమానంలో ప్రయాణించేదాకా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో కార్లు, బైకులు లెక్కలేనన్ని అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఇంటికి ఒక వాహనం ఉండేది, కానీ నేడు ఒక్కక్కరికి ఒక్కో వాహనం అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కొన్ని దేశాల్లో వాహనాలు దాదాపు జనాభా సంఖ్యకు దగ్గరగా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ కార్లు ఏ దేశాల్లో ఉన్నాయో చూసేద్దాం..
➤న్యూజిలాండ్: సుమారు 869 కార్లు / 1000 మంది
➤అమెరికా (USA): సుమారు 860 కార్లు / 1000 మంది
➤పోలాండ్: సుమారు 761 కార్లు / 1000 మంది
➤ఇటలీ: సుమారు 756 కార్లు / 1000 మంది
➤ఆస్ట్రేలియా: సుమారు 737 కార్లు / 1000 మంది
➤కెనడా: సుమారు 707 కార్లు / 1000 మంది
➤ఫ్రాన్స్: సుమారు 704 కార్లు / 1000 మంది
భారతదేశంలో 1000 మందికి సరాసరిగా 34 కార్లు & 1000 మందికి 185 ద్విచక్ర వాహనాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పైన వెల్లడించిన దేశాల వరుసలో చూస్తే.. ఇండియా చాలా దూరంలో ఉంది.
ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..


