ప్రళయం పోస్ట్‌పోన్‌.. యుగాంతం ఇప్పట్లో లేనట్లే! | Ghana Ebo Noah apocalypse Prediction Postponed | Sakshi
Sakshi News home page

ప్రళయం పోస్ట్‌పోన్‌.. యుగాంతం ఇప్పట్లో లేనట్లే!

Dec 25 2025 1:47 PM | Updated on Dec 25 2025 1:57 PM

Ghana Ebo Noah apocalypse Prediction Postponed

ప్రళయాన్ని మానవమాత్రులైనా అంచనా వేయగలరా?.. అదేం సినిమానా? పోస్ట్‌పోన్‌ కావడానికి అనుకుంటున్నారా?. లక్షల మందిని మోసం చేసిన ఓ వ్యక్తి మాటల గురించే ఇక్కడ చెప్పబోతున్నాం. డిసెంబర్‌ 25వ తేదీన పెద్ద ప్రళయం పుట్టుకొస్తుందని.. దాని ప్రభావంతో యుగాంతం తప్పదని ప్రచారం చేసిన ఆ వ్యక్తి ఇప్పుడేమో మాట మార్చేశారు మరి!.. 

ఘనాకు చెందిన మత గురువు ఎబో(Eboh Noah) లెక్క తప్పింది. క్రిస్మస్‌ నాడే మహా జలప్రళయం మొదలుకాబోతోందని హెచ్చరికలు జారీ చేసిన ఇతగాడు.. ఇప్పుడు అబ్బే దేవుడు కొంతకాలం దానిని వాయిదా వేశాడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తనను తాను దైవ దూతగా ప్రకటించుకున్న నోహా.. ఈ ప్రళయం పేరు చెప్పుకునే లెక్కలేనంత విరాళాలు సేకరించడం ఈ ఎపిసోడ్‌లో కొసమెరుపు. 

30 ఏళ్ల ఎబో.. ఈ ఏడాది ఆగస్టులో ‘‘జరిగేది.. జరగక మానదు’’ అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ఈ క్రిస్మస్‌ తేదీన ప్రపంచమంతా జోరు వాన మొదలవుతుందని.. అది మూడేళ్లపాటు ఆగకుండా కురిసి  ప్రపంచం మునిగిపోతుందని, అయితే ఆ జల ప్రళయంలో మూడేళ్లపాటు తట్టుకోగలిగే పడవలను నిర్మించే బాధ్యత దేవుడు తనకు(నోహానని చెబుతూ) అప్పగించాడని అనుచరుల్ని నమ్మ బలికాడు. 

ఆ అనుచరులు ఆ ప్రచారం విస్తృతంగా జరపడంతో..  ఎబోకి ఎబో జీససగా, ఎబో నోహాగా పేరు దక్కింది. ఈ మాటలు నమ్మిన లక్షల మంది తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి డబ్బులు ఇచ్చారు. తీరా.. ఆ తారీఖు వచ్చేసరికి.. ఆ యుగాంతం వాయిదా పడిందని చెబుతున్నాడు. దేవుడు మానవాళికి ఇంకొంత సమయం ఇచ్చాడని.. అలాగే మరింత మందిని రక్షించేలా ఆర్క్‌ ప్రాజెక్టు(భారీ పడవల నిర్మాణం) విస్తరించాలని ఆదేశించాడని చెబుతున్నాడు. 

అయితే ఎబో డూమ్స్‌డే హెచ్చరికలపై పలువురు మండిపడుతున్నారు. బైబిల్‌ ప్రకారం.. ప్రళయం ఏనాడో వచ్చిందని, మరొకటి వచ్చే ప్రసక్తే లేదని.. మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని జనాలను మోసం చేయడం సరికాదని ఎబోకు హితవు పలుకుతున్నారు. ఇంకోవైపు.. జనాల నుంచి సేకరించిన సొమ్ముతో ఎబో విలాసాలు అనుభవిస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement