దుబాయ్‌లో ‘వరల్డ్ గవర్నమెంట్స్‌ సమ్మిట్’ | World Governments Summit to Be Held in Dubai from February 3 5 | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ‘వరల్డ్ గవర్నమెంట్స్‌ సమ్మిట్’

Jan 19 2026 4:11 AM | Updated on Jan 19 2026 4:20 AM

World Governments Summit to Be Held in Dubai from February 3 5

భవిష్యత్ ప్రభుత్వాల రూపకల్పన లక్ష్యంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ నిర్వహించనున్నారు. వాతావరణ మార్పు, ఆరోగ్యం, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), విద్య వంటి కీలక రంగాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం వేదికగా నిలవనుంది. ఈ సమావేశంలో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా పాల్గొననున్నారు.

ప్రపంచ స్థాయి శాస్త్రీయ సవాళ్లపై చర్చించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం, వరల్డ్ లారియేట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ట్యూరింగ్ ప్రైజ్, వోల్ఫ్ ప్రైజ్, ఫీల్డ్స్ మెడల్ విజేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో 35 మందికి పైగా దేశాధినేతలు, 150 అధికారిక ప్రతినిధి బృందాలు, అలాగే సుమారు 6,000 మంది సందర్శకులు హాజరుకానున్నారు. వినూత్న పాలన విధానాల రూపకల్పనలోను, ప్రజా సంక్షేమానికి పటిష్టమైన భరోసా కల్పించడంలోను ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను పాలనలో ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చో ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు మార్గాలు సుగమమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement