governments
-
ఈశాన్య రాష్ట్రాలతో గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎంవోయూ
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ తెలిపారు. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు నిర్వహిస్తున్న తాము ఈశాన్య రాష్ట్రాల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా ఆయిల్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 5 వరకూ ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి పాల్గొన్నాయి. -
బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్.. ఇప్పుడు రిస్క్‌గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్లైన్లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు. -
పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆండ్రాయిడ్ స్పైవేర్ ‘హెర్మిట్’ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులను ఆయా ప్రభుత్వాలు 'హెర్మిట్' ఎంటర్ప్రైజ్-గ్రేడ్ ఆండ్రాయిడ్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడించారు. సైబర్-సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ థ్రెట్ ల్యాబ్ టీంఈ మాలావేర్ను గుర్తించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను అణిచి వేసిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్‌లో కజకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నామని ఈ బృందం పేర్కొంది. జాతీయ భద్రత ముసుగులో వ్యాపార వేత్తలు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేయడానికి వారిపై నిఘాకు తరచుగా వాడు కుంటున్నారని పరిశోధకులు హెచ్చరించారు. హెర్మిట్ అనేది మాడ్యులర్ స్పైవేర్. ఆడియోను రికార్డ్, ఫోన్ కాల్ల డైవర్షన్ అలాగే కాల్ లాగ్‌లు, ఫ్రెండ్స్, ఫోటోలు, లొకేషపన్లను లాంటి వాటిని ఎస్ఎంఎస్ ద్వారా డేటాను చోరీ చేస్తుంది. ఈ మాలావేర్ టెలికమ్యూనికేషన్ కంపెనీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల అప్లికేషన్లను కూడా ప్రభావితం చేశాయని లుకౌట్ బృందం తెలిపింది. 'హెర్మిట్' అని పేరు పెట్టిన ఈ స్పైవేర్‌ను ఇటాలియన్ స్పైవేర్ ఆర్సీఎస్ ల్యాబ్,టెలీ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ కంపెనీTykelab Srl సహకారంతో అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే హెర్మిట్ నిఘా ఇదే మొదటిసారి కాదు. 2019లో అవినీతి నిరోధక చర్యలో ఇటాలియన్ అధికారులు దీనిని ఉపయోగించారట.ఆర్సీఎస్ ల్యాబ్ మూడు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ప్రసిద్ధ డెవలపర్. ఇది కూడా పెగాసస్ డెవలపర్ ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస్, ఫిన్ఫిషర్ని సృష్టించిన గామా గ్రూప్‌ల మాదిరిగానే అదే మార్కెట్లో పనిచేస్తుంది. అలాగే ఇది పాకిస్తాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్మెనిస్తాన్లోని సైనిక, గూఢచార సంస్థలతో నిమగ్నమై ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. -
ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే పిటిషన్ల అవసరం ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్), ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో ‘ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానం వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినందుకు ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు తమను(న్యాయమూర్తులు) విలన్‌గా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసును మూసివేయబోమని స్పష్టం చేసింది. కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పింది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను ఆసుపత్రులను సిద్ధం చేయడానికి వీలుగా నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుగురు సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. తాము సూచించిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. -
విద్య–వైద్యమే ప్రగతికి పట్టుగొమ్మలు
ఏ దేశం గానీ, ప్రాంతం గానీ, రాష్ట్రం గానీ ప్రగతి పథంలో నడుస్తున్నది అని చెప్పాలంటే ఆ దేశం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించి, ఆచరిస్తున్న తీరును పరిశీలించి చూడాలి, అవి ప్రగతి వైపు పరుగెత్తుతున్నాయంటే వారు సేవారంగాలైన విద్యా, వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడాలి. ఎందుకంటే పౌరులు ఆరోగ్యంగా వుంటే అన్నిరంగాల్లోనూ పని పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయి. పౌరులెప్పుడూ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతుంటే ఆ ప్రాంతం ఆర్థిక పరిపుష్టి పొందలేక వెనకబడిపోవడం ఖాయం. ఇక సేవారంగంలో రెండవ అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్య.. వ్యాపారస్తులకు ధారాదత్తమై విద్యారంగం వ్యాపారంగా మారిపోయి డబ్బున్న కొద్దిమందికే పరిమితమవడంతో రాష్ట్రాల్లో, దేశాల్లో అక్షరాస్యత ఇంకా ఇంత శాతమేనని లెక్క పెట్టుకొనే స్ధితిలోనే ఉండిపోతున్నాయి. విద్యా, వైద్య రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఈ అమూల్యమైన సేవారంగాలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడంతో ప్రజలు ఎన్ని అవస్ధలు పడుతున్నారో ఈ కరోనా కాలమే రుజువు చేస్తోంది. ప్రజలకు కనీసం వైద్య పరీక్షలు చేసే సత్తా ప్రభుత్వాలకు లేకపోవడం, వారికి వైద్యం అందించాలంటే కనీస సదుపాయాలైన వసతి, ఆక్సిజన్, మందులు లేక ప్రభుత్వాలు చేతులెత్తేయడం, వైద్య పరీక్షలు సహితం నిలిపేయడం సిగ్గుచేటైన విషయం. పిల్లల చదువులు ఎలా కొనసాగాలి, ప్రత్యామ్నాయం ఏమిటి అన్న ధ్యాసలేకుండా చదువుతో ప్రభుత్వానికి ఏమి పని, ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి అనే వైఖరి చాలా రాష్ట్రాల్లో వుంది. కానీ దేశం మొత్తంపై ఇందుకు మినహాయింపు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం, కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి ప«థకంతో తల్లులందరూ తమ పిల్లలను సర్కారు బడికి పంపేలా చేయడంతో పాటు తిండికలిగితే కండకలదోయ్.. అనే కవివాక్కులు నమ్మి ఆంధ్రా సర్కారు ప్రభుత్వ బడులకు వచ్చే బడుగు జీవుల పిల్లలందరికీ సమతుల పౌష్టికాహారం అందించడానికి కంకణబద్ధమవడం నిజంగా సంతోషించదగిన విషయం. పాఠశాలలకు కొత్త శోభ తెచ్చి ప్రైవేటును తలదన్నేలా తీర్చిదిద్దడమంటే తెలుగు తల్లికి వీరగంధం పూయడమే. ఈ చర్యలు రాష్ట్రంలో విద్యా గంధం విరబూయాలనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు దర్పణం. బడుగు బతుకులకు ఇంగ్లిష్ విద్య వద్దని ఏపీలో రాజకీయ జీవులు అరచి గీపెట్టినా ఆ బడుగు జీవుల పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందివ్వడానికి కంకణబద్ధుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యపట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెబుతున్నారు. ఇక ప్రజారోగ్యం విషయానికి వస్తే కరోనా పరీక్షల్లో దేశంలోనే ప్ర«థమస్థానంలో నిలచి, ఏపీ సీఎం వైఎస్ జగన్ తమ రాష్ట్రం ప్రజలకు అండగా నిలవడం, పథకం ప్రకారం కరోనాను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ఓ ఎత్తు కాగా, ప్రజారోగ్యం కోసం శాశ్వత ప్రాతిపదికన 1,088 అంబులెన్సులు ఒకే రోజు ప్రవేశపెట్టి వాటిని ఆషామాషీగా రోడ్డుపై తిరిగే డబ్బాల్లాగా గత పాలకుల రీతిన చేయకుండా, అత్యాధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా వాటిల్లో సహితం పిల్లల కోసం ప్రత్యేకించిన అంబులెన్సులు ప్రవేశపెట్టడాన్ని అభినందించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు సేవారంగాలైన విద్యా, వైద్య రంగాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్న కేరళలోని విజయన్ ప్రభుత్వం, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మానవాభివృద్ధిలో ముందడుగు వేసి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. అదే సమయంలో ఈ విద్యా, వైద్య రంగాల్లో వెనకబడ్డ రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలబడటం ఖాయం. అభివృద్ధికి పట్టుగొమ్మలైన విద్యను, వైద్యాన్ని ప్రభుత్వ రంగం నుండి తరిమికొట్టి ప్రైవేటు రంగానికి కట్టబెట్టినన్ని రోజులూ అభివృద్ధి ఒక వర్గానికే పరిమితమౌతుంది. వ్యాసకర్త: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం, 93910 24242 -
పడిపోతున్న ఆదాయంతో సవాలే..
ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలన్స్ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది. నవంబర్ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది. స్థూల ఎన్పీఏలు పెరగొచ్చు స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కారణంగా బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2019 సెప్టెంబర్ నాటికి ఇవి 9.3 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 9.3 శాతం స్థాయిలోనే స్థిరంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 12.7 శాతం నుంచి 13.2 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో ఇది 3.9 శాతం నుంచి 4.2 శాతానికి.. అదే విధంగా దేశంలో పనిచేసే విదేశీ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2.9% నుంచి 3.1 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎన్బీఎఫ్సీ రంగంలో స్థూల ఎన్పీఏలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నికర ఎన్పీఏలు మాత్రం స్థిరంగా 3.4 శాతం వద్దే ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) నిర్దేశిత 20% కంటే తక్కువగా 19.5 శాతం వద్ద ఉంది. రూ.5 కోట్లు దాటితే చెప్పాలి.. రూ.5 కోట్లు, అంతకుమించి రుణాల సమాచారాన్ని.. భారీ రుణాల కేంద్ర సమాచార కేంద్రానికి (సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలని పెద్దసైజు కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులున్న అన్ని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాలనను మెరుగుపరిచి వృద్ధికి తోడ్పడాలి: దాస్ కంపెనీలు, బ్యాంకులు పాలనా ప్రమాణాలను మెరుగుపరుచుకుని, దేశ ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు తోడ్పడాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోయిన విషయం విదితమే. అలాగే, చాలా కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. వినియోగం, పెట్టుబడులను పునరుద్ధరించడం అన్నవి ప్రధాన సవాళ్లుగా దాస్ పేర్కొన్నారు. బోర్డుల్లో మంచి కార్పొరేట్ పరిపాలన అన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమైన అంశమనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల సందర్భంగా దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
రూపాయి లేదు..వైద్యమెలా!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: కష్టాలు, కన్నీళ్లు దిగమింగి బీటెక్ పూర్తి చేసిందామె. ఏడాది క్రితమే అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చి ఎస్సార్ నగర్ హాస్టల్లో ఉంటూ ఓ వైపు ప్రత్యేక కోర్సులు, మరోవైపు ఇంటర్వూ్యలకు హాజరవుతూ అదృష్టా న్ని పరీక్షించుకుంటోంది. శనివారం ఓ కంపెనీ ఇంటర్వూ్యకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. ఇది శనివారం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) దుస్థితి. ప్రసుత్తం ఆమె గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వద్ద కుబ్రా తల్లిదండ్రులు చేతిలో రూపాయి లేక విలవిల.. అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం తండ్రి అబ్దుల్ అజీం. పెయింటర్‌గా సాదాసీదా జీవనం సాగిస్తూ కూతురు కుబ్రాతో పాటు కుమారుడు కాలిఖ్ను ఉన్నత చదువులు చదివించాడు. ఆయన సంపాదనంతా పిల్లల చదువులు, జీవనోపాధికే సరిపోయింది. ప్రమాదం గురించి తెలియగానే కుబ్రా తండ్రి, తల్లి, సోదరుడు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నగ రానికి చేరుకున్న కుబ్రా తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం రూ.లక్షా పది వేలు అయ్యాయని చెప్పారు. కుబ్రాకు ఒళ్లంతా గాయాలున్నాయని, ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని, చెల్లిస్తే మిగతా వైద్యం చేస్తామని తెలిపారు. అప్పటికే హైదరాబాద్‌లోని సమీప బంధువుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఫీజు చెల్లించిన అబ్దుల్ రూ.5 లక్షల కోసం తనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశాడు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రి ఎదుటే భార్య, కుమారుడితో విషాదంగా గడిపేశాడు. చేతిలో రూపాయి లేక కుబ్రాకు వైద్యం ఎలా చేయిం చాలో తెలియక సతమతమవుతున్నాడు. కుబ్రాను ఆస్పత్రిలో చేర్చించిన పోలీసులు ఆపై అటు కన్నెత్తి చూడలేదని వారు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కుబ్రా సోదరుడు ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాము నిరుపేదలమని, రూ.5 లక్షలు చెల్లించే స్థోమత తమకు లేదని తన అక్క ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను వేడుకున్నాడు. -
ఉపేక్షిస్తే ఇక ఉపద్రవాలే!
స్థానిక పాలనా సంస్థల నిర్వాకాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ ఒప్పందాల వరకు పర్యావరణానికి అంతటా విఘాతాలే! నిజాయితీగా పర్యావరణ పరి రక్షణ జరుపడానికి ప్రభుత్వాలే అతి పెద్ద ప్రతిబంధకాలు. రాజకీయ విధాన నిర్ణ యాలు–అమలే అవరోధాలు. ఇది అన్ని స్థాయిల్లో జరుగుతోంది. ‘ఆవులు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా...?’ అన్న చందంగా కార్పొరేట్లు, కంపెనీలు, పరిశ్రమలు, జన సమూహాలు... ఇలా ఎవరికి వారు విచ్ఛల విడిగా కాలుష్య కారకాలవుతున్నారు. వెరసి సమస్య రోజురోజుకూ జఠిలమౌతోంది. శాస్త్రవేత్తల అంచనాల్ని మించి భూతాపోన్నతి హెచ్చుతోంది. వాతావరణ మార్పులు వేగం పుంజుకున్నాయి. ధృవపు మంచు అసాధారణంగా కరుగుతోంది. సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. తీర నగరాలు ప్రమాదపు అంచుకు జారుతున్నాయి. వర్ష రుతుక్రమం మారి వ్యవసాయ రంగం వికటిస్తోంది. ఎడారీకరణ వేగం పుంజుకుంది. అంతటా ప్రతి కూల ప్రభావం పడి ఆహారోత్పత్తి మందగిస్తోంది. ఇబ్బడి ముబ్బడి వినియోగంతో శిలాజ ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రత్యా మ్నాయ–పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. అంత తేలిగ్గా నశించని ప్లాస్టిక్ భూమి, సముద్రం అని హద్దుల్లేకుండా సర్వత్రా వ్యాపిస్తోంది. ఇంటా బయటా గుట్టలుగా పేరుకుపోతోంది. ఇతరత్రా వ్యర్థాల నిర్వహణ కూడా దేశంలో నిరాశాజనకంగా ఉంది. భవిష్యత్తు భయం పుట్టిస్తోంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రతి పాదించిన పదిహేడు సుస్థిరాభివృద్ది లక్ష్యాల (ఎస్డీజీ) సాధనవైపు అడుగులు తడబడుతున్నాయి. న్యాయస్థానాలు కల్పించుకొని మంద లిస్తే తప్ప చలించని స్థితిలో ప్రభుత్వాలున్నాయి. అంతర్జాతీయ, జాతీయ ఒప్పందాలు, చట్టాలు, రాజ్యాంగ నిర్దేశాల ప్రకారం ప్రతిదీ నిర్వహించాల్సింది, నియంత్రించాల్సింది ప్రభుత్వాలే! అవి సక్ర మంగా నడిస్తేనే కార్పొరేట్లు అదుపాజ్ఞల్లో ఉంటాయి. పౌర సమాజం బాధ్యతగా వ్యవహరిస్తుంది. అంతే తప్ప, అన్నిసార్లూ న్యాయస్థా నాలే పరిస్థితి చక్కదిద్దాలంటే, సరైన నిర్వహణతో ఆదుకోవాలంటే అదంత తేలిగ్గా అయ్యేది కాదు. అంపైర్లు ఎన్ని మార్లని ఆటను ప్రభా వితం చేస్తారు...? ఆటగాళ్లు, జట్లు ప్రతిభ ప్రదర్శిస్తే తప్ప గెలు పోటముల్ని అంపైర్లే నిర్ణయించజాలరు. కానీ, చీటికి మాటికి న్యాయ స్థానాలు, న్యాయప్రాధికార సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తలెత్తుతోంది. వ్యర్థాల నిర్వహణ, ఇసుక విధానం, మొక్కల పెంపకం నుంచి అణు విద్యుదుత్పత్తి, అటవుల సంరక్షణ, భూతా పోన్నతి నిలువరించడం వరకు అన్నీ పెనుసవాళ్లే! పాలనా వ్యవస్థల సమర్థ నిర్వహణతోనే వాటిని ఎదుర్కొగలం. అందుకు, ఒక కొత్త జీవావరణ రాజకీయ సంస్కృతి అవసరం కనిపిస్తోంది. సర్కార్లు చేస్తున్నది మేలా? కీడా? తమ అధికారాల కోసం అరిచి అల్లరి చేసే ప్రభుత్వాలు, రాజ్యాంగ విహిత బాధ్యతల్ని విస్మరిస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తోందని కేంద్రంపై పెడబొబ్బలు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవంక స్థానిక సంస్థల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తుంటాయి. నిధులు, అధికా రాలు కల్పించకపోగా రాజ్యాంగం కల్పించిన వాటి అధికారాల్ని దొడ్డిదారిన లాక్కుంటాయి. సహజవనరుల పరిరక్షణ, వ్యర్థాల నిర్వ హణ, స్థానికంగా ఆదాయవనరుల పరికల్పన వంటి విషయాల్లో స్థానిక పాలనా సంస్థలకుండే అప్రతిహత అధికారాల్ని అవి కొల్లగొ డుతుంటాయి. ఈ నిర్వాకాలవల్ల గ్రామ పంచాయితీలకుండే నిర్ణయా ధికారం గాలికిపోతుంది. సహజవనరులకు విఘాతం కలిగించే ప్రభుత్వ విధానాల వల్ల తలెత్తే సామాజిక, పర్యావరణ ప్రభావాల అధ్యయనాలు కూడా సర్కారు జరిపించడం లేదు. జరిపినా, పలు నిర్బంధాల నడుమ వాటిని తూతూ మంత్రంగా ‘అయింద’ని పిస్తారు. గోదావరి నది వెంట 39 కిలోమీటర్ల నిడివి, 1400 హెక్టార్ల మేర (మేడిగడ్డ–అన్నారం బరాజ్‌ల వరకు) పూడిక తీసివేత పేరుతో ఇసుకు కొల్లగొట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తప్పుబట్టింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బుధవారం తీవ్రంగా మందలించింది. ‘ఇది పూడిక తీసివేత కాదు, విధ్వంసం’ అంది. ఆ ముసుగులో నదిగర్భం నుంచి 4 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించుకుపోవడాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించింది. పర్యావరణ అనుమతి తీసుకోకపోవడం, పర్యావరణ ప్రభావాల అధ్యయనమే జరిపించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో కీలకమైన పర్యావరణ చట్టాలేవీ రావడానికి ముందే, స్థానిక సంస్థల అధికారాలు–బాధ్యతలకు సంబంధించి... రాత్లమ్ మున్సిపా లిటీ కేసు (1980) విచారిస్తూ జస్టిస్ కృష్ణయ్యర్ ఓ గొప్ప మాట చెప్పారు. ‘పబ్లిక్ న్యూసెన్స్..... అనేది చట్ట ప్రకారం అందించాల్సిన సామాజిక న్యాయానికే ఓ సవాల్’ అన్నారు. ‘.... పద్ధతి, మర్యాద, గౌరవంగా బతకడం అనేవి మానవహక్కుల్లో రాజీపడటానికి వీల్లేని అవిభాజ్య అంశాలని, వాటి పరిరక్షణ స్థానిక పాలనా సంస్థల ప్రాథ మిక కర్తవ్యమ’ని ఆ తీర్పులో విస్పష్టంగా చెప్పారు. ‘స్వచ్ఛభారత్’ పేరుకే తప్ప, బాధ్యతాయుత కర్తవ్య నిర్వహణ స్థానిక సంస్థలు చేయట్లేదు. ప్రచార యావ తప్ప రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నదీ అంతంతే! పౌర సమాజం కూడా ఈ విషయంలో నిర్మాణాత్మక పాత్ర, బాధ్యత తీసుకోవాలి. చాలా చోట్ల అది జరగట్లేదు. ఫలితంగా ఆ కార్యక్రమమే మొక్కుబడిగా మారింది. పెనుభూతాన్ని అడ్డుకునేదెలా? మనిషి దైనందిన జీవితంలో భాగమైన ప్రమాదకర ప్లాస్టిక్కును నియంత్రించడం ఎలా? ఈ సమస్య ప్రపంచమంతటికీ ఓ సవాల్ విసురుతోంది. కరిగించి, మరో రూపంలో తిరిగి వాడడం సాధ్యపడే మందపు ప్లాస్టిక్‌తో పెద్దగా ఇబ్బంది లేదు. పునర్వినియోగం లేకుండా ఒకేసారి వాడి–పాడేసే పలుచని ప్లాస్టిక్ అత్యంత ప్రమా దకారి. రోజువారీ అనేకానేక అవసరాలకు విచ్చలవిడిగా మనం వీటిని వాడుతున్నాము. చేతి సంచులు, కప్పులు, పార్శిల్ కవర్లు, ప్యాకింగ్‌కు వినియోగించే ర్యాపర్లు, రవాణా అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రతకు వాడే సన్నని వ్యాక్యూమ్ కవర్లు.. ఇలా వివిధ రూపాల్లో పలుచని ప్లాస్టిక్ ఉంటోంది. ఇది కరగదు, తరగదు, నాశన మవకుండా వేయి సంవత్సరాల పైనే మనుగడలో ఉంటుంది. దీంతో రకరకాల ఇబ్బందులున్నాయి. భూమిపైన, భూపొరల్లో, వివిధ జల వనరుల్లో, సముద్ర గర్భంలో గుట్టలుగా పేరుకుపోతూ మనిషి మను గడకు సవాల్‌గా మారింది. ఆహారంతో పాటు తక్కువ పరిమాణం, సూక్ష్మ రూపంలో ఇది జంతువుల, మనుషుల కడుపుల్లోకి వెళు తోంది. కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకూ కారణమౌతోంది. ప్రధాని మోదీ, జాతినుద్దేశించి పది రోజుల కింద ‘మనసులో మాట’ చెబుతూ ప్లాస్టిక్ పెనుభూతంపై విరుచుకుపడ్డారు. ‘హానికర ప్లాస్టిక్ రహిత భరతమాత’ను తీర్చిదిద్దుకోవాలని జాతికి పిలుపునిచ్చారు. పునర్వినియోగం లేని తక్కువ మందపు ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించ బోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సంకేతాలిచ్చారు. మనిషి పరిణామ–ప్రగతి క్రమంలో ప్లాస్టిక్ క్రియాశీల భూమిక నిర్వహిం చింది. కానీ, కాలక్రమంలో చెడ్డ ప్లాస్టిక్ వల్ల ఉపయోగకరమైన మంచి ప్లాస్టిక్కూ అపకీర్తి వస్తోందని, సర్కారు ప్రచారంలోకి తెచ్చిన ఒక వీడియో టాక్‌లో కేంద్ర మంత్రి జావదేకర్ అన్నారు. 50 మైక్రాన్ల లోపు మందపు ప్లాస్టిక్ చేతి బస్తాలు, స్ట్రాలు, కప్పులు, కవర్లు తది తరాల్ని అక్టోబరు 2 (గాంధీ జయంతి) నుంచి నిషేధించే ఆలోచన ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పౌర సమాజం సహకరించి ప్రత్యామ్నాయాల్ని వినియోగించాలని కోరారు. తక్కువ మందపు ప్లాస్టిక్ వినియోగంపైనే ఇన్నాళ్లు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో నిషేధం ఉండేది. అసలు ఉత్పత్తే లేకుంటే వినియోగం ఉండదు కదా! ఉత్పత్తినెందుకు నిషేధించరు? అనే ప్రశ్న జనసామా న్యంలో ఉదయించేది. ప్లాస్టిక్‌ను నిషేధించడం, లేదా అందుకోసం ఒక చట్టం తీసుకురమ్మని ఆదేశించడం తాము చేయజాలమని సుప్రీంకోర్టు 2016 (కరుణ సొసైటీ కేసు)లో స్పష్టం చేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత అనేది న్యాయస్థానం ఉద్దేశం. కఠిన నిబంధనలు, విధి విధానాలు రూపొందించుకొని అమలు చేయొ చ్చంది. బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఇందుకు సరిపోయే చట్టాలు– నిబంధనలు తెచ్చి, పకడ్బందీగా అమలుపరచడానికి ఉన్నత న్యాయ స్థానం తీర్పేమీ అడ్డంకి కాదు. కోట్లాది మందిని తరలించాల్సిందే! సముద్ర తీర ప్రాంతాల జనావాసాలు భవిష్యత్తులో పెను ప్రమా దాన్ని ఎదుర్కోబోతున్నాయి. కారణం, వేగంగా సముద్ర జలమట్టం పెరగటమే! నాగరికత వికాస క్రమంలో పెద్ద సంఖ్యలో జనుల వల సలకు గమ్యస్థానాలైన మహానగరాలెన్నో సాగరతీరాల్లోనే వృద్ధి చెందాయి. ఇప్పుడవే ప్రమాదంలో పడ్డాయి. కర్బన కాలుష్యాల క్రమం ఇలాగే ఉంటే, భూతాపోన్నతి ఇదే రీతిన పెరిగితే... సమీప భవిష్యత్తులోనే ధృవప్రాంతపు మంచు శిఖలు కరిగి సముద్ర మట్టాలు అసాధారణంగా పెరుగనున్నాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ముసాయిదా పత్రమొకటి ఇటీవల వెల్లడించింది. ఈ ప్రమాద ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇది అత్యంత వేగంగా నష్టం కలిగిస్తుందన్నది నివేదిక సారం. ఉత్తర దక్షిణ ధృవాల్లోని గ్రీన్లాండ్, అంటార్కిటి కాలు వేగంగా కరిగిపోతున్నాయి. కర్బన ఉద్గారాలవల్ల, ఇతర కాలుష్యాల కారణంగా పెరిగే భూతాపొన్నతే ఈ మంచు ఖండాల్లోని ప్రస్తుత సంక్షోభానికి కారణం. ‘వాతావరణ మార్పులపై ఏర్పడ్డ అంతర్ప్రభుత్వాల కమిటీ’ (ఐపీసీసీ) ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఇది. ఇప్పటికే మత్స్య సంపద తరుగుదల మొదలయింది. మానవ కారక కాలుష్యాన్ని తగు చర్యలతో నియంత్రించకుంటే, ఉత్తర ధృవపు మంచుకొండలు ఈ శతాబ్దాంతానికి కనీసం 30 శాతం కరిగి పోతా యనేది అధ్యయనం. అదే జరిగితే, 2050 నాటికి చిన్ని చిన్న దీవులు, కడలి తీరాల్లోని మహానగరాలు తీవ్ర ‘సముద్ర జల మట్టాల’ సమ స్యను ఎదుర్కోనున్నాయి. భూతాపోన్నతి 2 డిగ్రీలు మించి పెర క్కుండా కట్టడి చేసినా, 2100 నాటికి సముద్రమట్టాలు 43 సెంటీ మీటర్లు పెరుగుతాయనేది పరిశీలన. అప్పుడు సాగరతీరాల నుంచి 25 కోట్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఒక వైపు అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అంతర్జాతీయ రాజకీయ పరిణా మాల్నే శాసిస్తోంది. ముప్పిరిగొనే ఈ ప్రకృతి విపత్తులు ఇంకే విపరి ణామాలకు దారితీస్తాయో తెలియదు! పాలకులు, ప్రభుత్వాలు, పౌరసమాజం సమన్వయంతో చొరవ చూపితేనే సమస్య తీవ్రతను కట్టడి చేయగలవు. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మహిళలపై దాడులను ప్రతిఘటించాలి
సాక్షి, బాపట్ల: మహిళలపై దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం స్థానిక అంబేడ్కర్ భవన్లో జరిగిన సభలో విష్ణు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను సమర్ధంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. హిందూత్వ ఫాసిస్టు దాడులను, పితృస్వామిక, కులోన్మాద దాడులు, అత్యాచారాలు, హత్యలపై ప్రతిఘటించే విషయమై మహిళలను చైతన్యపరచాలని కోరారు. వివక్షను, దోపిడీని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి శీలం యేసమ్మ, తెనాలి డివిజన్ అధ్యక్షురాలు టి.కల్పన, పల్లవి, కొండా అన్నమ్మ, జి.మరియమ్మ, పి.లక్ష్మి, అజిత పాల్గొన్నారు. -
అనవసర యంత్రాలతో అధిక హాని
అత్యధిక వ్యయంతో కూడిన వ్యవసాయ యంత్రాల అనవసర భారం వల్లే దేశీయ వ్యవసాయం దురవస్థల పాలవుతోందని గుర్తించకపోవడం వలన వ్యవసాయిక ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలు తమ రైతులకు మరిన్ని యంత్రాలను అమ్మడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. వరి పంట కోతల కాలం సమీపిస్తుండటం, ఢిల్లీలో వాయు కాలుష్యం భీతి కలిగిస్తుండటం వల్ల, ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ పంట కోతలు పూర్తయ్యాక మిగిలే దుబ్బు తగులబెట్టడం లేదా తొలగించడం పేరిట మరిన్ని యంత్రాలను రైతులకు అంటగట్టేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. పంటకోతలు పరాకాష్టకు చేరుతున్నందున, పంజాబ్ 27,972 వ్యవసాయ యంత్రాల సరఫరాను లక్ష్యంగా పెట్టుకుంది. వరి నాటు యంత్రాలు, పంట కోత యంత్రాలు, దుబ్బును తొలగించే యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు వంటి పలు రకాల పనిముట్లు వీటిలో భాగం. ఇక హరియాణాలో అలాంటి 40 వేల యంత్రాలను ఇప్పటికే 900 కిరాయి కేంద్రాలకు, వేలాది విడివిడి రైతులకు ప్రత్యక్ష కొనుగోలు పద్ధతిలో సరఫరా చేశారు. రైతులకు కలుపుతీత, వరిపంట కోత యంత్రాన్ని –హ్యాపీ సీడర్ మెషీన్– 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇకపోతే కో–ఆపరేటివ్ లేదా రైతుల బృందాలకు దీన్ని 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు ఇది వరం లాంటిది. చాలా కాలంగా ఈ యంత్రాలను అమ్మడానికి వీరు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నారు. పంజాబ్‌లో లక్ష ట్రాక్టర్లు అవసరమైన చోట ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్రాక్టర్లను ఉనికిలోకి తెచ్చారు. ఒక యంత్రం అవసరమైన చోట పంజాబ్ రైతులు ఆరు నుంచి ఎనిమిది వరకు అదనపు యంత్రాల భారాన్ని ఎందుకు మోస్తున్నారనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ట్రాక్టర్లను మోతాదుకు, అవసరానికి మించి మోస్తుండటమే పంజాబ్ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాల్లో అధిక యంత్రాల వినియోగం రైతుల రుణభారాన్ని మరింతగా పెంచుతోంది. వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సబ్సిడీ కేటాయింపును పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఎంత హ్రస్వ దృష్టితో ఉంటున్నాయో అర్థమవుతుంది. ఈ కేటాయింపుల అసలు లక్ష్యం వ్యవసాయదారుల పేరుతో వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు సహాయం చేయడమేనా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. గతంలో కూడా పాలీ హౌస్‌ల (పాలిథిన్ షీట్ల నీడలో చేసే వ్యవసాయం)ను ఏర్పాటు చేయడానికి వాటి పరిమాణాన్ని బట్టి రూ. 25 లక్షల భారీ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ పాలీ హౌస్‌లలో 80 శాతం కంటే ఎక్కువగా పని చేయడం లేదని అనేక అధ్యయనాలు కోడై కూస్తున్నాయి. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువ కాదు. అయితే పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లకు ఏది అవసరమో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గతంలోనే సూచిం చారు. దుబ్బును తగులబెట్టకుండా, తొలగించడానికి కేంద్రప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలను మదుపు పెట్టాల్సి ఉంది. ‘క్వింటాల్ దుబ్బు తొలగింపునకు కనీసం రూ. 100లు ఇవ్వాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేశాం. ఈ మొత్తం రూ. 2 వేల కోట్లకు సమానం’ అని చెప్పారాయన. అమరీందర్ సింగ్ చెప్పింది యథార్థం. కానీ అంత డబ్బు తమ వద్ద లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అయితే జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదించిన 6.9 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఒక చిన్న మొత్తాన్ని ఈ దుబ్బు తొలగింపు సమస్య పరిష్కారం కోసం ఎందుకు వెచ్చించలేరో అర్థం కాదు. కానీ వ్యవసాయం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయి చూపిస్తుంటుంది. పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు తీసుకుంటున్నందుకు తమపై పడుతున్న అదనపు ఖర్చులకోసం గాను ఎకరాకు రూ.6 వేలను పరిహారంగా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పైగా పంజాబ్‌లో పనికి ఆహార పథకంలో 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న రూ. 4 వేల కోట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేకపోతోంది. పంట కోతల అనంతరం పొలంలో మిగిలే దుబ్బు నిర్వహణను పనికి ఆహార పథకంలో భాగం చేసినట్లయితే ఖాళీగా ఉన్న రైతుకూలీలకు పని కల్పించడమే కాకుండా, దుబ్బును తగులబెట్టడం ద్వారా కలుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించవచ్చు కూడా. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
ఖమ్మంవ్యవసాయం: లారీ యజమానుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని స్వీకెల్ రిసార్ట్స్ అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర లారీ యజమానుల సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు పూర్తయినా లారీ రవాణా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోలేదన్నారు. సమస్యలను వివరిస్తూ ప్రభుత్వానికి అనేకమార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. మంత్రులను కలిసినా, నిరసన, ఆందోళనలు, బంద్ వంటి కార్యక్రమాలను చేపట్టినా ప్రభుత్వాల నుంచి కనీస స్పందన లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించిన పన్నులనే ఇప్పటికీ చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా ప్రీమియంను ప్రతి ఏడాది పెంచ డం బాధాకరమన్నారు. ఎగుమతులు, దిగుమతులను కూడా లారీ యజమానులపై మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలంలో డీజిల్ ధరలు రూ. 50 నుంచి రూ. 75లకు పెరిగాయని, వాటికి అనుగుణంగా కిరాయిలు పెరగలేదన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలను ఆమోదించారు. కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం ఖమ్మం అధ్యక్ష, కార్యదర్శులు నకిరకంటి సత్యంబాబు, బోజెడ్ల పూర్ణచందర్రావు, వరంగల్, కరీంగర్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, మణుగూరు. ఇల్లెందు, కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు చెందిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘పిల్’ అంటే ఎందుకు గుబులు?
సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు. ‘మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే వ్యక్తి ఎంత నీతిమంతుడైనా ఒక సామాన్య మనిషిగా ఆయనకూ బలహీనతలు ఉంటాయి. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఎంత సత్యసంధుడనుకున్నా, ముక్కుసూటి మనిషనుకున్నా ఆయనకు సంపూర్ణాధికారాలను మాత్రం కట్టబెట్టకూడదు.’ – డా. బీఆర్ అంబేడ్కర్ (రాజ్యాంగ రూపకల్పన సందర్భంగా) ‘ప్రధాన న్యాయమూర్తి సహ న్యాయమూర్తులకు ధర్మాసనాలను కేటాయించే విషయంలో దాదాపు అంబేడ్కర్ భావనే ఇంగ్లండ్‌లో కూడా వ్యక్తమ యింది. అయితే కేసులు కేటాయించిన న్యాయమూర్తుల పట్టికకు ప్రధాన న్యాయమూర్తిని సారథిగా (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రకటించే సంప్రదాయం ఉంది. కానీ ఆ సంప్రదాయం వెర్రితలలు వేసి క్రమంగా అది ఇంగ్లండ్ ప్రజలు తలపెట్టిన రాజకీయ మహోద్యమాలనే శాసించే న్యాయమూర్తులు పాక్షిక ధర్మాసనాలను ఏర్పాటు చేసుకునే సంప్రదాయానికి లార్డ్ చాన్స్లర్లు తెరలేపారు. ప్రధాన న్యాయమూర్తిని విశ్వసించాలన్న సూత్రం సాంఘిక ధర్మమైనా ఆ విశ్వాసం శాశ్వత సంపూర్ణ ధర్మంగా నిలవగలదని నమ్మలేం. సంప్రదాయం అనే మత్తులో పడే న్యాయవాద సోదరులందరికీ ఇంగ్లండ్ అనుభవం ఒక ఉదాహరణ. తాత్కాలికంగా న్యాయమూర్తుల మధ్య ఆంతరంగిక సర్దుబాట్లు/ పరిష్కారం కుదిరినట్టు కన్పించినా భారత న్యాయవ్యవస్థలో అంతటా సవ్యం గానే ఉందని ప్రపంచానికి చెప్పాలనుకున్నా–మహా అయితే అదంతా అతుకుల బొంత ‘పట్టీ’గానే మిగిలిపోతుంది. ఇంతకూ ఇప్పుడు జరగవలసిన అసలు చికిత్స–బహిరంగ చర్చ ద్వారా పార్లమెంట్ ప్రత్యేకమైన సుప్రీంకోర్టు చట్టాన్ని ఆమోదించడం. ఈ బహిరంగ చర్చలో సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న పౌర సమాజం, న్యాయవ్యవస్థ న్యాయవాద సంఘాలు, విభిన్న రాజకీయాభిప్రాయాలు గలవారు అంతా పాల్గొనాలి.’ – ప్రొ. అర్ఘ్యసేన్గుప్తా, 18–1–18 (సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్) న్యాయవ్యవస్థకూ, ప్రభుత్వ పక్షంగా పాలకవర్గాలకూ మధ్య కొన్ని మాసాలుగా, ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లుగా ఏదో ఒక సంఘర్షణ తలెత్తడం కనిపిస్తూనే ఉంది. ఆయా సందర్భాలలో ప్రజా సమస్యల మీద, ప్రాథమిక హక్కుల రక్షణలో ప్రభుత్వాలు పక్కదారులు తొక్కినప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు అండదండలనిచ్చిన ఉదాహరణలు కూడా తక్కువేమీ కాదు. అందులో ఒకటి అత్యవసర పరిస్థితిలో సాధించిన విజయం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా తన పదవీ రక్షణ కోసం ఎమర్జెన్సీ విధించారు. బీజేపీ వారు సమయం వచ్చినప్పుడల్లా నాటి అత్యవసర పరిస్థితి ప్రకటన మీద విరుచుకుపడుతూనే ఉంటారు. కానీ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అదే రాజ్యాంగం పేరిట అనుసరిస్తున్న విధానాలు కూడా కాంగ్రెస్ పోకడలనే గుర్తు చేస్తూ, ప్రజాకంటకంగా మారిపోతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పాలకులు చేసిందీ, ఇప్పుడు బీజేపీ–ఎన్డీఏ పాలకులు కూడా చేస్తున్నదీ ఒక్కటే– రాజ్యాంగ నిబంధనలను, ఆదేశాలను, సెక్యులర్ వ్యవస్థా నిర్దేశాలను ప్రజాహితంగా అమలు చేయడంలో దారుణంగా విఫలం కావడం. పెడధోరణులు నిజం కార్య నిర్వాహక అధికారాల పేరిట న్యాయవ్యవస్థ నిర్వహణలో నేరుగానో, నర్మగర్భంగానో బీజేపీ పాలకులు జోక్యం చేసుకునే స్థితికి చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి సుప్రీంకోర్టు, ధర్మాసనాలు, ప్రధాన న్యాయమూర్తి, కొందరు న్యాయమూర్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిళ్లకు లోనవుతున్నట్టు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని కేసుల విచారణ, కొన్ని ధర్మాసనాలు, వాటికి కొన్ని కేసుల కేటాయింపు తీరుతెన్నులు ప్రజాక్షేత్రంలో చాకిరేవుకు అవకాశం కల్పించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న ‘పాక్షిక ధోరణి’ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జస్టిస్ చలమేశ్వర్, మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహిం చడం సంచలనం కలిగించింది. ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ఆ నలుగురు కూడా కాదనలేదు. కానీ ఆ కేటాయింపులు న్యాయ వ్యవస్థ నిర్వహణ యంత్రాంగం కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తికి సరి సమానులైన తోటి సీనియర్ న్యాయమూర్తులను కూడా సంప్రదించాలని, తద్వారా కేసుల కేటాయింపు జరగాలని ఆ నలుగురు ఆకాంక్షించారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ నలుగురు ఒక విశిష్టమైన, విజ్ఞానదాయకమైన ప్రకటన జారీ చేశారు: ‘దేశం రుణం తీర్చుకోవడానికే మేం నలుగురు న్యాయమూర్తులం పత్రికా గోష్టిని ఏర్పాటు చేశాం. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఏ ధర్మాసనానికి బదలాయించాలన్న విషయం గురించి తలెత్తిన సమస్యే మేం పత్రికా గోష్టిని ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న కారణం’ (13–1–18). నేతలనుబట్టి మారుతున్న న్యాయం సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ నేత అమిత్ షాకు ప్రమేయం ఉందన్న ఆరోపణే ఈ కేసు నాలుగేళ్లు నానడానికి అసలు కారణమన్న మాట ఉంది. అమిత్ షా నిర్దోషి అని కింది కోర్టు ప్రకటించినప్పటికీ, జస్టిస్ లోయా హఠాన్మరణం పూర్వరంగంలో ఈ కేసును తిరగదోడాలని బొంబాయి న్యాయవాదుల సంఘంలో మెజారిటీ సభ్యులు, ఒక పత్రికా రచయిత, ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారు. ఇది అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామం గురించి పిటిషనర్ల తరఫున వాదించిన సుప్రీం కోర్టు న్యాయవాదులు దుష్యంత దావే, ఇందిరా జైసింగ్ ఇలా ప్రకటించారు: ‘లోయా మృతి కేసును పునర్విచారించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించడానికి చెప్పే కారణాల్లో తీవ్రమైన వైరుధ్యాలున్నాయి. జస్టిస్ లోయా మరణం విషయంలో స్వతంత్ర విచారణ జరక్కుండా నిరోధించడంలో ఆసక్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి మరెవరో కాదు, మీ కక్షిదారుడేనని, అతనే అమిత్‌షా అనీ దావే, అమిత్‌షా తరఫున వకాల్తా వహించిన సుప్రీం లాయర్ సాల్వేకు చెప్పారు’ (‘ఫ్రంట్‌లైన్’: హిందూ గ్రూపు, 16.2.18). ఇదొక్క కేసే కాదు, యూపీ, ఒరిస్సాలలోని మెడికల్ కాలేజీ వ్యవహారాల్లో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్న రిటైర్డ్ జడ్జి విషయంలో విచారణ జరపడానికి ప్రధాన న్యాయమూర్తి తాత్సారం చేశారని కూడా నలుగురు న్యాయమూర్తులూ అభియోగం మోపడంతో వ్యవస్థ పరువు బజారున పడినట్టయింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యమనేది ‘అత్యంత అభ్యుదయకర ధర్మాసన చైతన్య శక్తి’గా వర్ణిస్తూ, ఈ ‘పిల్’ సుప్రీంకోర్టు రూపురేఖలనే మార్చి, ప్రజల న్యాయస్థానంగా మారుస్తుందని ఆశించినవారు జస్టిస్ జీబీ రెడ్డి. జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ‘నా న్యాయ చట్టం మనిషి జీవితానికి విరుద్ధంగా నడిచే పక్షంలో ఆ చట్టాన్ని తుంగలో తొక్కేయడం మంచిది కాని, దాన్ని సవాలు చేయడం కాదు’ అన్నారు. అంతేగాదు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు (దాని వెనుక ఒక ముఖ్యమంత్రి, ఒక న్యాయమూర్తి నడిపిన కథ కూడా బట్టబయలయింది). పిల్ అంటే ఎందుకు ఆగ్రహం? తాజా పరిణామం అంత కంటే దారుణం – ఉన్నావ్‌లో జరిగిన బాలిక అత్యాచారం కేసులో న్యాయం జరగాలని కోరుతూ అడ్వకేట్ ఎం.ఎల్. శర్మ సుప్రీంలో ‘పిల్’ దాఖలు చేశారు. ‘లైంగిక వేధింపులకు గురైన బాలిక తరఫు బంధువు నీకెవరైనా ఉన్నారా? నీవు బాధితుడివి కాదు కదా! రేప్ కేసులకు నీకు సంబంధం ఏమిటి?’ అని ధర్మాసనమే ప్రశ్నించింది. ఇది సబబా? ఇంతకూ అసలు రహస్యం– ఒక బీజేపీ లెజిస్లేటర్ ఈ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బీజేపీ నాయకుడి కేసులో అనుకూల తీర్పు చెబితే రూ. 100 కోట్ల నజరానా ఇస్తారని బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహిత్ షా జస్టిస్ లోయాకు ఆశ చూపినట్టు ఒక ఆరోపణ ఉంది. తమ సోదరుడు జస్టిస్ లోయాయే తమకు ఈ సంగతి చెప్పాడని ఆయన తోబుట్టువులు అనూరాధ బియాని, సరితా మంధానీ చెప్పారు. ఇది నిజమా? అబద్ధమా? ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లోయా కేసుకు ‘భరత వాక్యం’ పలకడంతో కథ కంచికి వెళ్లినట్లేనా? వెళ్లినా గానీ పార్లమెంటులోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి అనేక ఆరోపణలు సంధించి ప్రధాన న్యాయమూర్తిపైన చరిత్రలో తొలిసారిగా అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే దాని పర్యవసానం ఏమిటి? మిరాజ్కర్ కేసులో ఒకసారి సుప్రీంకోర్టు గొప్ప వ్యాఖ్యానం చేసింది: ‘రహస్యమనే కారు చీకటిలో, దుష్ట ప్రయోజనాలతో అడుగడుగునా దుర్మార్గపు ఆలోచనలు కళ్లాలు లేని గుర్రాలుగా స్వైర విహారం సాగిస్తాయి’. సరిగ్గా ఇలాంటి అంధకారంలోనే నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు పత్రికా గోష్టి నిర్వహించి వెలుతురును ప్రసాదించారు. ‘ఈ వెలుగును ఆర్పేసి, అంతర్గతంగా తమ మధ్య సర్దుబాట్లు చేసుకుంటూ సమస్యను తమలో తాము సర్దుకోవడం అంటే తలెత్తిన తీవ్రమైన మౌలిక సమస్య కోరుకుంటున్న శాశ్వత పరిష్కారానికి విరుద్ధమని గమనించాల’ని ఒక లీగల్ పండితుడు గొంతు విప్పాడు. సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల తరఫున దేశాన్ని, జాతిని ఉద్దేశించి విడుదల చేసిన (12.1.18) అపూర్వ సందేశం నిరాడంబరతకు, నికార్సయిన దేశభక్తికి అరమరికలు లేని నిండు మనస్సుకు ఉద్దీపన శక్తిగా భావిం చాలి: ‘నేటినుంచి ఇరవైయ్యేళ్ల తరువాత న్యాయమూర్తులమైన మమ్మల్ని – జస్టిసెస్ చలమేశ్వర్ రంజన్ గోగోయి/లోకూర్/కురియన్–తమ ఆత్మల్ని అమ్మేసుకుని, అత్యంత కీర్తిగన్న సుప్రీం సంస్థ ప్రయోజనాల్ని గాలికి వదిలేసి పోయారని ఏ జ్ఞాని, విజ్ఞానీ భావించకుండా ఉండేందుకే ఇప్పుడే ఈ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాం’. ఈ పరిణామాల దృష్ట్యానే ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల పదవుల్ని కూడా ప్రజాస్వామీకరించాలని, ఒక వ్యక్తి వద్దనే అధికారాలు కేంద్రీకృతమై ఉండరాదని ఇది కేసుల బదలాయింపులో, న్యాయమూర్తులకు కేటాయించే ధర్మాసనాల విషయంలో (రోస్టర్స్) చాలా అవసరమని చెప్పారు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రైతులకు పరిహారం ఇవ్వరా..?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్ : వడగండ్ల వర్షాలతో పంట నేలపాలవుతున్నా, పిడుగుపాట్లతో రైతులు మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ...పంట నష్టంపై ఇంతవరకు అధికారులెవ్వరూ క్షేత్రస్థాయికి వెళ్లలేదని, రైతులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పటివరకు కనీసం పరామర్శించని సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుబంధు పేరుతో వారిని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
రైతు కంట కన్నీరు ఆగదా?
లాంగ్‌మార్చ్ జరిగి, రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం రాతపూర్వకహామీ ఇచ్చిన తర్వాత కూడా తగిన కార్యాచరణతో రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం లేదు. వ్యవసాయ సంక్షోభం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల పరిస్థితి ఇదే. 2017లో ఢిల్లీలో తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా చేసిన ఆందోళన, పంజాబ్, హరియాణాలో రైతుల అలజడి, మహారాష్ట్ర ‘లాంగ్‌మార్చ్’ దేశంలోని రైతుల కష్టాలకు, కడగండ్లకు నిదర్శనం. రైతాంగానికి సంబంధించిన వార్తలు పత్రికల పతాకశీర్షికలలో కనిపించడం అరుదు. ఇటీవల మహారాష్ట్ర రైతాంగం, ఆదివాసీలు సుమారు 30 వేల మంది నాసిక్ నుంచి ముంబై వరకు 10 రోజులు ఎర్రజెండాలు పట్టుకొని కదం తొక్కిన చారిత్రక ఘటన దేశంలోని యావత్ మీడియాకు ప్రధాన వార్త కావడం గమనార్హం. లాంగ్‌మార్చ్‌గా పిలుచుకున్న మహారాష్ట్ర రైతుల ఉద్యమంలో అనేక ప్రత్యేకతలు కనిపించాయి. అడుగడుగునా ప్రజల మద్దతు లభించింది. మంచినీరు, ఆహారం స్వచ్ఛందంగా అందించి వారు సంఘీభావాన్ని ప్రదర్శించారు. చిన్న అవాంఛనీయ సంఘటనకు పాల్పడకుండా దేశ ప్రజల మన్ననలను, సానుభూతిని రైతులు పొందగలిగారు. న్యాయమైన డిమాండ్లు ‘లాంగ్‌మార్చ్’ వెనుక అనేక కారణాలున్నాయి. ప్రదర్శన ద్వారా అవన్నీ ప్రజల్లో చర్చకు వచ్చాయి. రైతుల డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల ‘లాంగ్‌మార్చ్’ విజయవంతం అయిందని చెబుతున్నారు. కానీ, ఆ హామీ అమలైనప్పుడే విజయమని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు రైతాంగం ఏడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. రుణమాఫీ అమలు, ఆదివాసీలకు అటవీభూములపై యాజమాన్య హక్కులు; స్వామినాథన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరల అమలు; కరవు, వరదలు, చీడపీడలవల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లింపు, సూపర్ హైవేలు, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులకు బలవంతంగా భూముల సేకరణ నిలుపుదల చేయడం, విద్యుత్ బిల్లుల బకాయిల రద్దు మొదలైనవి వారి డిమాండ్లలో ప్రధానమైనవి. రుణమాఫీ హామీని మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలోనే బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు పూర్తిగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా రుణభారాన్ని కుదించి విడతల వారీగా నిధులు కేటాయించి బకాయిలు రద్దు చేసిందో, అదేబాటలో మహారాష్ట్ర ప్రభుత్వం నడిచింది. రూ. 34,000 కోట్ల రుణమాఫీ చేస్తే 89 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది. ప్రధానంగా తొలివిడత చేసిన రుణమాఫీలో కౌలు రైతులు లేరు. రుణమాఫీ ప్రకటించి 6 నెలలు అయినా 10% రైతులకు మాత్రమే అమలైంది. మహారాష్ట్రలో అధిక శాతం పోడు వ్యవసాయం చేసే రైతులున్నారు. వారికి రుణమాఫీ వర్తింపజేయడం లేదు. మహారాష్ట్ర రైతుల ఆందోళనకు మరో కారణం నకిలీ విత్తన సమస్య. హైబ్రీడ్ రకాల విత్తనాల బదులుగా దేశీయంగా తయారుచేసే విత్తనాలే ఉపయోగించాలనీ అది దేశభక్తికి సంకేతమనీ ఆరెస్సెస్ ప్రచారం చేయడం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వంతపాడటంతో రైతులు దేశవాళీ విత్తనాలే కొనుగోలు చేస్తున్నారు. వాటికి చీడపీడల్ని తట్టుకొనే శక్తిలేదు. ఫలితంగానే 84% వ్యవసాయ భూముల్లో రైతులు పత్తిసాగు చేస్తే పింక్‌బోల్ వర్మ్ వ్యాధి సోకింది. రైతులు నిలువునా మునిగిపోయారు. దీనికితోడు జనవరి చివరివారంలో కురిసిన అకాల వర్షాలు చాలా ప్రాంతాల్లో పంటను దెబ్బతీశాయి. మరఠ్వాడా, నాగ్‌పూర్, అమరావతి, యవత్మల్, నాసిక్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా కరవు ఏర్పడింది. వీటన్నింటి కారణంగా 2017–18లో మహారాష్ట్రలో సాధారణ పంటకంటే 37% పంట దిగుబడి తగ్గింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మహారాష్ట్రలో వ్యవసాయాభివృద్ధి రేటు 8.3% తగ్గి నెగటివ్ గ్రోత్ నమోదయింది. దీనికితోడు ఫడ్నవీస్ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, ఎక్స్‌ప్రెస్‌వే, నదుల అనుసంధానం పేరుతో బలవంతపు భూసేకరణ చేపట్టింది. దీనివల్ల అనేక ఆదివాసీ, గిరిజన గ్రామాలు విధ్వంసానికి గురవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే గత రెండు దశాబ్దాలలో 65,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈ ఏడాది సగటున రోజుకు 9 మంది రైతులు తనువులు చాలించిన దయనీయస్థితి నెలకొంది. రైతుల ఆందోళనకు మరో కారణం అటవీ భూమి హక్కుల బదలాయింపు. పుష్కరం క్రితమే, ఆనాటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చేసింది. అటవీశాఖ పరిధిలో ఉన్న గిరిజన భూములపై యాజమాన్య హక్కును వారికే బదలాయించాలని చట్టంలో ఉంది. కానీ, నేటివరకు దేశంలో అమలు జరగడం లేదు. అందుకే మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో 25.61%; థానేలో 13.9% మంది ఉన్న గిరిజనులు లాంగ్‌మార్చ్‌లో ముందువరుసలో నిలిచారు. హైవేల నిర్మాణాలు, నదుల అనుసంధానం ప్రాజెక్టులు మొదలైన ప్రతిపాదిత అభివృద్ధి పనుల్లో అధిక సంఖ్యలో నష్టపోతున్నది గిరిజనులే. రైతులు, గిరిజనుల్లో చైతన్యాన్ని రగలించి లాంగ్‌మార్చ్‌కు సమాయత్తం చేసింది అఖిల భారత కిసాన్ సభ. ఆర్నెల్ల గడువు కోరిన ప్రభుత్వం 30 వేల మందితో సాగిన లాంగ్‌మార్చ్‌కు ఫడ్నవిస్ ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ఆర్నెల్లు గడువుకోరింది. ఆరుగురు మంత్రుల కమిటీ రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం రాత పూర్వక హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపైకి మళ్లింది. ప్రభుత్వం ఇటీవల ఏడో వేతన కమిషన్ నివేదిక అమలుకు ఒప్పుకొంది. అర్బన్ మెట్రో ప్రాజెక్టు, శివాజీ విగ్రహ ఏర్పాటు మొదలైన భారీ వ్యయంతో కూడుకొన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రైతుల డిమాండ్లను తీర్చడానికి నిధుల సర్దుబాటును ఏవిధంగా చేయగలదన్న అనుమానం అందరిలో కనిపిస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలు ప్రకటించడం కేంద్రం పరిధిలో ఉంది. అధికారంలోకి రాగానే మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందించిన అఫిడవిట్లో ఉత్పత్తి వ్యయానికి 50% పెంచి కనీస మద్దతు ధరలు ఇస్తామని పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చేది సందేహమే! నిజానికి దేశ వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాల్సింది కేంద్రమే. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చాటుకోవడం కోసం 2015లో అప్పటివరకూ ఉన్న ‘వ్యవసాయ మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్)’ను ‘వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ’ అని మార్చింది. అలాగే ఈ శాఖకు గతంలో ఉన్న ‘ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రైతు శ్రేయస్సు’ అనే లక్ష్యాలను మార్చుకొని 2022– 23 నాటికల్లా రైతు ఆదాయం రెట్టింపు చేయడాన్ని లక్ష్యంగా ఏర్పరచుకుని ప్రచారం చేస్తుంది. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం రైతుల ఆదాయం 2022–23 నాటికి రెట్టింపు కావాలంటే, ఏడేళ్ల పాటు రైతుల ఆదాయం ఏటా 10.4% మేర పెరగాలి. గత దశాబ్దన్నర కాలం అనుభవాలను విశ్లేషించి చూస్తే 1993–94 నుంచి 2004–05 వరకు అంటే దశాబ్దాల కాలంలో రైతుల ఆదాయంలో కనిపించిన వృద్ధి 3.3% మాత్రమే. 2004– 05 నుంచి 2011–12 మధ్యకాలంలో రైతుల ఆదాయాభివృద్ధి 5.52% మేర పెరిగింది. మద్దతు ధరల్లో గణనీయమైన పెరుగుదల లేకుండా రైతుల ఆదాయం రెట్టింపు కాజాలదని స్వామినాథన్ నిరూపించినప్పటికీ కేంద్రం కనీస మద్దతు ధరలను శాస్త్రీ యంగా పెంచడానికి సిద్ధంగా లేదు. కారుణ్య మరణాలకు అనుమతి కోరిన రైతులు జీవించడం సాధ్యం కాని పరిస్థితులలో రోగులు కారుణ్య మరణాలు కోరుకోవడంలో తప్పులేదంటూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు చనిపోయేందుకు అనుమతినివ్వాలని గవర్నర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లకు లేఖలు రాయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పండించిన పంటకు సరైన ధర లభించక.. అప్పుల బారిన పడ్డామని, జాతీయ రహదారి కోసం ప్రభుత్వం సేకరించిన తమ భూములకు తగిన పరిహారం చెల్లించలేదని రైతులు పేర్కొంటూ తమ కుటుంబాలను పోషించుకొనే పరిస్థితి లేనందున తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని వారు వేడుకొన్నారు. లాంగ్‌మార్చ్ జరిగి, రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం రాతపూర్వకహామీ ఇచ్చిన తర్వాత కూడా తగిన కార్యాచరణతో రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం లేదు. వ్యవసాయ సంక్షోభం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల పరిస్థితి ఇదే. 2017లో ఢిల్లీలో తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా చేసిన ఆందోళన, మధ్యప్రదేశ్‌లోని మందసర్‌లో పోలీసు కాల్పుల్లో రైతులు హతం అయిన దారుణ ఉదంతం; పంజాబ్, హరియాణాలో రైతుల ఆందోళన, తాజాగా మహారాష్ట్ర ‘లాంగ్‌మార్చ్’ దేశంలోని రైతుల కష్టాలకు, కడగండ్లకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయవృత్తి లాభసాటిగా లేకపోవడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వలసలను నివారించాలంటే వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా రూపొందించడం మినహా మరోమార్గం లేదు. కేంద్రం, రాష్ట్రాలు అభివృద్ధి మంత్రం జపిస్తూ పట్టణాలు, నగరాల్లో ఫ్లైఓవర్లు, 4 లైన్ల రహదారులు, బుల్లెట్ ట్రైన్లు మొదలైన ఆకర్షణీయమైన ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే. కానీ వ్యవసాయరంగంపై అధికశాతం ఆధారపడిన వారి సౌకర్యాలు, సంక్షేమాన్ని విస్మరించడం వల్లనే నేడు రైతులు రోడ్లెక్కుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నట్టు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లాంటి ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకూడదు. డా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు
న్యూఢిల్లీ: ‘ప్రభుత్వాలు మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నాయి. పర్యా వరణ పరిరక్షణ, ప్రజల ప్రయోజ నాల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు రూ.లక్ష కోట్లను ఇతర కార్యక్రమాల కోసం మళ్లించారు’ అని దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళ వారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్యనిర్వాహక వ్యవస్థపై తాము చాలా నమ్మకం పెట్టుకున్నామని, అయితే అధికారులు ఎటువంటి పనీ చేయడం లేదని, దీనికి సంబంధించి కోర్టు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే న్యాయస్థానాలు పరిధి దాటుతున్నాయని విమర్శలు వస్తున్నాయంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ పేర్లతో నిధులను సృష్టించారని, ఇలా సేకరించిన భారీ మొత్తం నిధులను పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగిం చాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, బస్టాండ్ల పునరుద్ధరణకు, కాలేజీల్లో సైన్స్ లేబొరేటరీల నిర్మాణానికి వినియోగించామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందు కోసమైతే ఆ నిధులను కేటాయించారో.. అందుకోసం మాత్రమే వాటిని వినియోగించాలంది. ‘మీరు ఆ నిధులను దారిమళ్లించారు. మా నమ్మకాన్ని వమ్ము చేశారు. మేము చిన్న మొత్తం గురించి మాట్లాడటం లేద’ంటూ.. ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని చెప్పింది. -
ఆహార కల్తీ కట్టడిలో విఫలం
సాక్షి, హైదరాబాద్ : పండ్లు, ఇతర ఆహార పదార్థాల కల్తీకి అడ్డుకట్ట వేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, దృఢ సంకల్పం లేకపోవడం వల్లే కల్తీ వ్యాపారులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించింది. పండ్లను, ఆహార పదార్థాలను భయం భయంగా తినాల్సిన పరిస్థితులు ఉన్నాయని.. ఏది కల్తీయో, ఏ పండును రసాయనాలతో మగ్గించారో.. ఏది తింటే ఏమవుతుందో తెలియడం లేదని పేర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే అందరం విషపూరిత ఆహారాన్ని తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. వ్యాపారులకు డబ్బు, లాభాపేక్షే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టడం లేదని.. వారిని కఠినంగా శిక్షించే యంత్రాంగమేదీ లేకపోవడమే దీనికి కారణమని పేర్కొంది. ఆహార కల్తీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించాలని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి, తమ ముందుంచాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు కల్తీ ద్వారా ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు విచ్చలవిడిగా కార్బైడ్ వినియోగిస్తున్న తీరుపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజాప్రయోజ వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ కేసులో కోర్టు సహాయకారిగా (అమికస్ క్యూరీ) వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆహార కల్తీకి సంబంధించి అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని కోర్టుకు విన్నవించారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి కేవలం 48 మంది ఆహార తనిఖీ అధికారులు మాత్రమే ఉన్నారని.. అదే తమిళనాడులో ఏకంగా 521 మంది, చిన్న రాష్ట్రమైన గోవాలోనూ 24 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5న ఈ కేసు విచారణకు వచ్చిన తరువాతే.. అధికారులు మేల్కొని ఆయా మార్కెట్లలో తనిఖీలు చేశారని, ఈ ఏడాది చేపట్టిన మొదటి తనిఖీలు ఇవేనని కోర్టుకు తెలిపారు. ఇక ఆహార భద్రత చట్టం కింద అధికారుల నియామకాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం వివరించారు. గత విచారణ సందర్భంగా ఏపీలో 622 మంది అధికారులను నియమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కోర్టుకు చెప్పారని... కానీ తాత్కాలిక పద్ధతిలో 29 మందిని మాత్రమే నియమించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నెలకు మూడు తనిఖీలేనా..? విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. అధికారులు నెలకు మూడే తనిఖీలు చేసినట్లు అర్థమవుతోందంటూ.. తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉండాలని స్పష్టం చేసింది. కార్బైడ్ ఉపయోగించిన పండ్లను తింటే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదుల వివరణను ధర్మాసనం తప్పుబట్టింది. ‘‘అవగాహన కల్పించడం సమస్యకు పరిష్కారం కాదు. అసలు మనం కొనే పండు కార్బైడ్ వాడి మగ్గబెట్టిందా? కార్బైడ్ వాడనిదా? అన్న విషయం ఎలా తెలియాలి? ఎలా గుర్తించాలి? ఇందుకు ఓ విధానం ఉంటే తప్ప ప్రయోజనం ఉండదు..’’అని స్పష్టం చేసింది. అసలు ఇప్పటివరకు ఎంత మంది కల్తీ వ్యాపారులను జైలుకు పంపారంటూ.. కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎప్పటికి మారుతుందని నిలదీసింది. -
‘అర్హత లేకున్నా వారసత్వ రాజకీయాలు..’
సాక్షి, నెల్లూరు: ప్రభుత్వం ప్రాజెక్టులపై శ్రద్ధపెట్టడం లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలు రైతులకు అందుతాయని ఆయన అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో బుధవారం మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు తమ సంతానాన్ని అర్హత లేకున్నా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లభించటం లేదని చెప్పారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో.. ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. -
రైతుల గోడు పట్టని ప్రభుత్వాలు
అనంతపురం అగ్రికల్చర్: అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబునాయుడు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం మానేశాయని అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ నాయకులు విమర్శించారు. దేశవ్యాప్తంగా 160 రైతు సంఘాలతో ఏర్పాటైన అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) చేపట్టిన దేశవ్యాప్త కిసాన్ ముక్తియాత్ర అనంతపురం చేరిన సందర్భంగా సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో రైతులతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే శాశ్వత రుణవిముక్తి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో నవంబర్ 20న చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు యోగేంద్రయాదవ్, పీఎం సింగ్, మధ్యప్రదేశ్ ఎంపీ రాజుశెట్టి, కవిత కురుగంటి, డాక్టర్ సునీలం, అవిక్సాహాతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, ఏపీ రైతాంగ సమాఖ్య నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పెద్దిరెడ్డి, ఏపీ రైతు సంఘం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, పి.రామచంద్రయ్య, రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షుడు పి.వెంకటరామయ్య, మానవహక్కుల నేత చంద్రశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో, ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. అరకొర రుణమాఫీ, మొక్కుబడి రాయితీలు, గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 11,500 మంది, 2015లో 13వేల మంది, 2016లో 13,500 మంది, ఈ ఏడాది 10వేల మంది రైతులు వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చే స్థోమత లేక బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అనంతపురం లాంటి జిల్లాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందన్నారు. లక్షలాది మంది రైతులు, కూలీలు పొట్టకూటి కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. పాలకుల వైఖరి చూస్తే జైజవాన్–జైకిసాన్ కాకుండా మర్ జవాన్–మర్ కిసాన్లా తయారైందన్నారు. కార్పొరేట్ శక్తులు, పారిశ్రామికవేత్తలు అడగకున్నా వందల ఎకరాల భూములు ఇవ్వడం.. వందలు, వేల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయానికొచ్చే సరికి బడ్జెట్ లేదనడం, కంటి తుడుపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. -
అన్ని ప్రభుత్వాల సారాంశం ఒక్కటే
తమ హక్కులకోసం, మనుగడ కోసం ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేయటం నరేంద్ర మోదీతోనే మొదలు కాలేదు. తొలి ప్రధాని నెహ్రూ హయాంలో, బ్రిటిష్ హయాంలో, బహుశా అంతకుముందు నుంచి కూడా ఇది కొనసాగుతోంది. మోదీ తర్వాత కూడా ఇదే జరగనుంది. తన కంటే ముందున్నవారు పాటించిన దాన్ని మోదీ కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. భాషలో మాత్రమే తేడా ఉంటోంది తప్ప, వైఖరి మాత్రం అప్పుడూ ఇప్పుడూ కూడా కఠినంగా ఉంది. భారత్‌ను ఉదారవాద వ్యతిరేక దేశంగా మారుస్తున్నారన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తప్పుగా మోపే ఆరోపణల్లో ఒకటి. ఉదారవాద వ్యతిరేకత (ఇల్లిబ రల్) అనే పదానికి అసహనం అనీ, వాక్ స్వేచ్ఛపై ఆంక్షలకు మద్దతు ఇవ్వడం అని అర్థం. ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుగా నిందిస్తున్నారని నేనంటాను. ఎందుకంటే భారత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కూడా ప్రత్యేకించి ఉదారవాద స్వభావంతో లేదని వాస్తవాలు చూపుతున్నాయి. దశాబ్దాలుగా కొన్ని సమస్యల పరిష్కారంపై పనిచేస్తున్న పౌర సమాజ బృందాలు, ప్రభుత్వేతర సంస్థలు నేను చెప్పిన అంశాన్ని ససాక్ష్యంగా నిర్ధారిస్తాయి. ఆదివాసీలు, కశ్మీరీలు, ఈశాన్య భారత ప్రజల హక్కుల వంటి సమస్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నవి కావు. దశాబ్దాలుగా ఈ సమస్యలు మనని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేదా ఈ ప్రధానమంత్రే సమస్యలన్నిటికీ కారణం అని భావించడం తప్పు. ఖనిజ సంపదకు సంబంధించి అత్యంత సుసంపన్నంగా ఉండే ఆదివాసీ భూములను కొల్లగొట్టడం అనేది నెహ్రూ హయాంలో, ఇంకా చెప్పాలంటే ఆయన కంటే ముందే మొదలైంది. ఆదివాసీలకు వ్యతిరేకంగా అత్యంత అసహ్యకరమైన, అత్యంత తలబిరుసుతనంతో కూడిన చర్యలను మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టారు. కొద్దిమంది చేస్తున్నారని చెబుతున్న నేరాలకు గానూ ఆదివాసులందరినీ శిక్షిస్తున్నారు. మధ్యభారత్ ప్రాంతంలో వేలాది పారామిలటరీ బలగాలు తిష్టవేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2015 అక్టోబర్ నెలలో ‘మావోయిస్టు వ్యతిరేక చర్యలు : ఛత్తీస్‌గఢ్, గగనతలం నుంచి ప్రతీకార దాడులు కొనసాగించనున్న భారత వాయుసేన’ శీర్షికతో పత్రికలు వార్త ప్రచురించాయి. భారత వాయుసేన తన సొంత ప్రజలపై ఆకాశం నుంచి దాడి చేయడానికి రష్యన్ తయారీ ఎమ్ఐ–17 హెలికాప్టర్లను ఉపయోగిం చిందన్నది ఆ వార్తా కథనం సారాంశం. వాయుసేన ‘విజయవంతంగా దాడుల’ను కొనసాగించిందని ‘మూడు ఐఎఎఫ్ హెలికాప్టర్లు బీజాపూర్ ప్రాంతంపై విహరించి, దాడులు చేశాయ’ని వార్తలు తెలిపాయి. దాడులు అంటే ‘తక్కువ ఎత్తులో విహరిస్తున్న యుద్ధ విమానం నుంచి పదేపదే బాంబులతో దాడి చేయడం అనీ లేదా మెíషీన్ గన్లతో కాల్పులు జరపటం’ అనీ అర్థం. భారత దేశం గురించి పరిచయం ఉన్నవారికి దేశంలో జనం ఏమాత్రం లేని ప్రాంతాలు అంటూ ఏవీ లేవని తెలిసే ఉంటుంది. మరి మన వాయుసేన పైనుంచి బాంబులతో, మెషీన్ గన్ కాల్పులతో సైనిక చర్యల ప్రాక్టీస్ చేసిన ప్రాంతంలో ఏం జరిగి ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ స్థాయి హింస ఆ ప్రాంతానికి కొత్త కాదనీ, బ్రిటిష్ కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే అంతకు ముందునుంచి కూడా ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేస్తోందన్నదే ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఇదంతా మోదీతోనే ప్రారంభమైందని భావించడం తప్పు మాత్రమే కాకుండా వాస్తవ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి అలాంటి ఊహే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మోదీకి ముందు, భారత రాజ్య వ్యవస్థ తన పౌరులతో ఇలాగే వ్యవహరించింది, దురదృష్టవశాత్తూ మోదీ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తుంది కూడా. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో నేను కొన్ని నెలల క్రితం సంభాషిం చాను. కశ్మీర్ నుంచి సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్ఎస్పీఎ)ని భారత ప్రభుత్వం ఎత్తివేయాలని ఆయన చెప్పారు. అయితే తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిదంబరం ఈ అభిప్రాయాన్నే వ్యక్తీకరించి ఉంటే అది మరింత విశ్వసనీయంగా ఉండి ఉండేదని నేను భావిస్తున్నాను. కశ్మీరీల ఆందోళనపై ప్రస్తుత ప్రభుత్వ కఠిన వైఖరిపట్ల చింతిస్తున్నవారు.. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి కఠిన వైఖరినే ప్రదర్శించాయని తెలుసుకోవాలి. ఏమంటే దాని వ్యక్తీకరణే కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమందిని చంపించింది. కానీ అది ఈ విషయంపై మృదువుగా మాట్లాడుతుంది. బీజేపీ కఠిన పదాలు వాడుతుంది. రెండు పార్టీల మధ్య ఉన్న అసలు వ్యత్యాసం ఇదే. తన ప్రజల అవసరాలు, హక్కులకు భిన్నంగా ఉండే ప్రాథమ్యాలపైనే భారత రాజ్యవ్యవస్థ పనిచేస్తూ వచ్చింది. భారత్‌ను లూఠీ చేస్తూ తన సొంత ప్రయోజనాల కోసం మన వనరులను తరలిస్తోందని మనం బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని విమర్శిస్తూంటాం. 1943 నాటి బెంగాల్ కరువు ఉదాహరణను యుద్ధ విధాన ఫలితంగా చూపుతుంటారు. ప్రజలు ఆకలిదప్పులకు గురవుతూ, అవిద్యావంతులుగా ఉన్న ప్రాంతంలో అది నిజంగా నీతిబాహ్యమైన ప్రవర్తనే. అయితే, ప్రజాస్వామ్య పం«థాలో ఇది ఎంత భిన్నంగా ఉందని నేను ఆశ్చర్యపోతుంటాను. గత సంవత్సరం భారత వాయుసేనకు 36 యుద్ధ విమానాలకోసం మనం రూ. 59,000 కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ఏడు భారత నావికాబలగం కోసం 57 యుద్ధవిమానాలపై రూ. 50,000 కోట్లు ఖర్చుపెడుతున్నాం. సంవత్సరానికి రూ. 33,000 కోట్ల ఆరోగ్య బడ్జెట్ (వాస్తవానికి అరుణ్ జైట్లీ హయాంలో దీనిపై కోత విధించారు) ఉంటున్న దేశంలో ఇలా జరుగుతోంది. ప్రతి వారం 10 వేలమంది భారతీయ పిల్లలు పోషకాహార లేమి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ల కోసం మనం మరికొంత డబ్బు వెచ్చించలేం కానీ మన సాయుధబలగాల కోసం మాత్రం మరిన్ని ‘బొమ్మ’లను మాత్రం కొంటుంటాం. ఇది మాత్రం బ్రిటిష్ రాజ్ కాలం నాటి అనైతిక చర్య కాదా? ఈ కొత్త యుద్ధ విమానాలు మనకు తప్పనిసరి అవసరమేనా అని ఎవరైనా కేసు పెట్టగలరా? పెట్టలేరు. మన దేశంలో దీనిపై కనీసం చర్చకూడా జరపరు. దేశంలో అన్ని ప్రభుత్వాలూ ఇదే వైఖరిని అవలంభిస్తున్నాయి. పైగా చాలా విషయాల్లో ప్రస్తుత ప్రధానమంత్రితో ఎవరైనా విభేదించవచ్చు కానీ తనకంటే ముందున్నవారు పాటించిన దాన్ని ఈయన కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
► ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కడప కార్పొరేషన్: మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా మహిళలకు ఎంతో ఉన్నత స్థానముందని, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ టీడీపీ అధకారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అరాచకాలు, దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు వారు మహిళలకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చీరెలు పంపిణీ చేశారు. మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి, శ్రీలక్ష్మి, సంధ్యారాణి, క్రిష్ణవేణి, సుశీల మ్మ, తులశమ్మ, పద్మ పాల్గొన్నారు. -
ప్రభుత్వాల కన్నా సీఈవోలే బెటర్
ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలకు.. ప్రభుత్వం, వ్యాపారం, మీడియా, ఎన్జీవోలపై రానురాను నమ్మకం సన్నగిల్లుతోంది. సర్వే నిర్వహించిన 28 దేశాల్లో ఈ రంగాలపై మూడింట రెండు వంతుల మంది ప్రజలకు నమ్మకం పోయిందని ‘ఎడల్మేన్’ కమ్యూనికేషన్ గ్రూప్ తెలిపింది. పైగా ఈ నమ్మకం ప్రతి ఏటా క్షీణిస్తూ వస్తోందని తన సర్వేలో తేలినట్లు ఆ గ్రూప్ పేర్కొంది. సర్వే ఫలితాల ప్రకారం వ్యాపార రంగానికి సంబంధించి కార్పొరేట్ సీఈవోలను ఎంత మంది విశ్వసిస్తారని ప్రశ్నించగా, 37 శాతం మంది మాత్రమే అవునని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే సీఈవోలను విశ్వసించే వారి సంఖ్య 12 శాతం తగ్గింది. అయినా ప్రభుత్వాలకన్నా సీఈవోల పట్ల ఎక్కువ మంది విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. సర్వే నిర్వహించిన 28 దేశాల్లో ప్రభుత్వాల పట్ల 29 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా పట్ల ప్రజల విశ్వాసం గతేడాదికన్నా పడిపోయినా ప్రభుత్వం కన్నా మీడియానే ఎక్కువ మంది విశ్వసించడం విశేషం. గతేడాది మీడియాను 48 శాతం మంది ప్రజలు విశ్వసించగా, ఈసారి అది 43 శాతానికి పడిపోయింది. 28దేశాలకుగాను 17 దేశాల్లో మీడియా పట్ల విశ్వాసం తగ్గింది. మీడియా పట్ల విశ్వాసం కోల్పోయిన దేశాల్లో భారత్ కూడా ఉంది. అయినా ఈ దేశాల ప్రజలు ఇప్పటికీ మీడియాను ఉన్నతమైన వ్యవస్థగానే పరిగణిస్తున్నారు. -
పౌర హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
* తుళ్ళూరులో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం * అంబేడ్కర్ కల్పించిన పౌరహక్కులపై ప్రసంగించిన ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతలు తుళ్లూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తుళ్లూరులోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజదాని ప్రాంత సీఐటీయూ నాయకుడు జె.నవీన్ ప్రకాష్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కెవీపీఎస్ అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపినా, ,ప్రశ్నించినా వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, రాజకీయ కక్షలకు దిగడం వంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అన్నారు. మేధావులు, ,ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఏకమై హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజు, ఈశ్వరరావు, సీపీఎం నాయకులు ఎం.రవి, జె.వీర్లంకయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల కిషోర్, నందిగం సురేష్, ప్రజాసంఘాల నేతలు స్వచ్ఛంద సంస్థల నేతలు రామారావు, బిళ్ళా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
జీవించే హక్కును హరిస్తున్న ప్రభుత్వాలు
- పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ ఎస్.శేషన్న కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జీవించే హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ ఎస్.శేషన్న ఆరోపించారు. ఆదివారం స్థాణఙఖ సీఆర్ భవన్లో రాజ్యాంగాన్ని గౌరవిద్దాం..ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుందాం అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సుకు పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ శేషయ్య, హైదరాబాద్‌కు చందిన సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు లతీఫ్ అహ్మద్‌ఖాన్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సదర్భంగా శేషయ్య మాట్లాడుతూ...ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో రెండు రాష్ట్రాల పోలీసులు 30 మంది అమాయక గిరిజనులు, మహిళలను కాల్చి చంపారని, అయినా ఆత్మరక్షణ కోసమే ఎన్కౌంటర్ చేయాల్సి వస్తోందని చెప్పడం విరుద్ధమన్నారు. ఏఓబీ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల పేర్లను బయట పెట్టాలన్నారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ కావడంతోపై వారిపై ఐపీసీ 302 ప్రకారం హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లతీఫ్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ..రాజాధాని పేరిట మూడు పంటలు పండే భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకోవడం దారుణమన్నారు. కమ్యూనిస్టు యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫీడెల్ క్యాస్ట్రో, ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు మైకేల్‌బాబుకు ఘన నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాస్, పౌరహక్కుల నేత శివనాగిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సీమను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– బీడీఎస్ఎఫ్ శిక్షణ తరగతుల్లో వక్తలు కర్నూలు(అర్బన్): అభివృద్ధి విషయంలో రాయలసీమ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని పలు విద్యార్థి, ప్రజా సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. రవి అధ్యక్షతన జరిగిన ఈ తరగతులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, రాయలసీమ ప్రజా వేదిక కన్వీనర్ సీవై రామన్న, రాయలసీమ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ టి. శేషఫణి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమకు చెందిన యువత, విద్యార్థులు సీమ అభివృద్దే ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఇచ్చిన హామీని నేటి వరకు కూడా పాలకులు నెరవేర్చలేదన్నారు. సంక్షేమ వసతి గృహాలను రద్దు చేసి రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చడంతో బాల కార్మికులు పెరిగిపోతున్నారన్నారు. సీమలోని పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని, రాయలసీమ వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, ఐటీ కారిడార్, గుంతకల్లులో రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గుండ్రేవుల రిజర్వాయర్, హంద్రీనీవా, సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జె. రాజరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సురేష్, కర్నూలు డివిజన్ కార్యదర్శి ఎం. వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
గుంటూరు వెస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నవర్గాలకు సేవకులుగా మారిపోయి, సామాన్యవర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ పూర్తిగా అమలుచేయాలని, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయిస్తున్న ఒక్క రూపాయిలో 99 పైసలు 15 శాతంగా ఉన్న ప్రజలకు చేరుతోందని, కేవలం ఒక్క పైసా మాత్రమే 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరుతోందని, ఇది దారుణమైన పరిస్థితి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా ఒక్కో పర్యాయం మెయిన్ ప్లాన్‌లోకి కలుపుతున్నారని విమర్శించారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లకు పోరాటాలు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ను పూర్తిగా అమలుచేయడానికి, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అన్ని సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరారు. -
పెన్షన్ ప్రభుత్వాల భిక్షకాదు
♦ ఏఐఎస్జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం ♦ కాంపన్సేటరీ పెన్షన్ స్కీం రద్దు కోసం 2న దేశవ్యాప్త సమ్మె సాక్షి, హైదరాబాద్: పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వాలు వేసే భిక్ష కాదని, అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎస్జీఈఎఫ్) చైర్మన్ ముత్తుసుందరం అన్నారు. కాంపన్సేటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు, పాత పెన్షన్ స్కీం అమలు కోసం ఉద్యోగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలన్నారు. సీపీఎస్ రద్దు, ఐటీ పరిమితి పెంపు, ఖాళీల భర్తీ వంటి డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ముత్తుసుందరం ప్రసంగించారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 తరువాత నియమితులైనవారికి పాత పెన్షన్ స్కీంను రద్దు చేసి కాంపన్సేటరీ పెన్షన్ స్కీంను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ఉద్యోగుల సాంఘికభద్రతకు ఉద్దేశించిన పెన్షన్‌ను ప్రభుత్వాలు ఆర్థికభారం పేరుతో ఉద్యోగులకు దక్కకుండా చేస్తున్నాయని అన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. తమిళనాడు తరహాలో సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కోసం టీఎన్జీవో కృషి చేస్తోందని చెప్పారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, దేశవ్యాప్త సమ్మె కోసం జిల్లాలవారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీఎన్జీవో నేతలు హమీద్, రేచల్ తదితరులు మాట్లాడారు. -
ప్రభుత్వాల విద్యా వ్యాపారీకరణ
► ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర అనంతపురం, సప్తగిరి సర్కిల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను వ్యాపారీకరణ చేస్తున్నాయని అఖిల భారత డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తూ పేదలకు విద్యను దూరం చేస్తోందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహానికి విద్యార్థులు బలవన్మరణాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంతో మత భావాలను, అశాస్త్రీయమైన భావాలను విద్యార్తులపై రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 27,28 న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్ యూసీఐ జిల్లా కార్యదర్శి అమర్నాథ్ ,ఏఐడీఎస్ఓ జిల్లా అ«ధ్యక్షుడు నాగరాజు, తదతరులు పాల్గొన్నారు. -
నేడు లీకేజీపై పభుత్వనికి CID నివేదిక
-
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం
కడప రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయని టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశం ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఈ ప్రాంతం అనుకూలంగా లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యానించడం తగదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఇక్కడ ఉన్న అనుకూల అంశాలను వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై స్పందించాలని సాయిప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎల్.నాగసుబ్బారెడ్డి, వెంకటశివ, డబ్లు్య రాము, గంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల అభివృద్ధే ధ్యేయం: పిడమర్తి
కలకోవ(మునగాల): తెలంగాణలో దళితుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కారర్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని కలకోవలో దళితులకు మూడు ఎకరాల భూమి సేకరణలో భాగంగా ఆయన గ్రామాన్ని సందర్శించి దళితులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చిర్రా శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పిడమర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హుడైన ప్రతి దళితునికి మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పది వేల ఎకరాల భూమిని మూడువేల రెండు వందల మంది దళితులుకు పంపీణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.361కోట్లు వెచ్చించిదన్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో దళితులకు మూడెకరాల భూమి పంపీణీ చేసేందుకు అవసరమైన భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం ఒక్కో ఎకరాకు రూ.ఏడు లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులను చైతన్యవంతులను చేసి భూమిని కొనుగోలు చేసేందుకు అధికారులు సమాయత్తం మవుతున్నారన్నారు. తొలుత కలకోవకు చేరుకున్న పిడమర్తి రవికి టీఆర్ఎస్ గ్రామశాఖ, మండల శాఖ ఆ«ధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గ్రామశివారులో గల అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కోదాడ నియోజక వర్గ ఇన్చార్జ్ కె.శశిధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గరిణె కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కోదాటి అరుణ, ముస్కుల సైదిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, విద్యార్థి జేఏసీ నాయకులు కందుల మధు, స్థానిక నాయకులు కాసాని మల్లయ్య, అమరగాని వీరభద్రం పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవిని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తా
మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే, మధిర –––––––––––––––––––––––––– నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీరుస్తా ప్రజా అవసర పనులు పూర్తి చేయిస్తా సర్కారు నియంత పోకడలు పోవద్దు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేలకోట్ల అవినీతి మధిర: ‘ప్రతిపక్షాలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. నియంత పోకడ పోతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. పైగా..మాటలతో, భ్రమలతో కాలం వెళ్లదీస్తున్న పాలన ఇది. ప్రజల అవసరాలకనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయించాల్సి ఉండగా..ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. పేదలకు ఇళ్లు దక్కడం లేదు. ప్రాజెక్ట్‌లు పూర్తి కావడం లేదు. కానీ..వేల కోట్లు మాత్రం అవినీతి రూపంలో స్వాహా అయిపోతున్నాయి. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తా. ప్రభుత్వాన్ని నిలదీస్తా, ప్రజా పక్షాన నిలుస్తా..’ అని మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. జాలిముడి ప్రాజెక్ట్‌తో సస్యశ్యామలం.. మధిర మండలంలోని వైరానదిపై జాలిముడి వద్ద నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్‌తో మధిర, బోనకల్ మండలాల్లో ఐదు వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలం అవుతుంది. తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల పరిధిలోని 53 గ్రామాలకు మంచినీరు అందుతుంది. త్వరలోనే దీనిద్వారా నీటిని సరఫరా చేయిస్తాం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని అధికారపార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వారికి ధైర్యం ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన నిబద్ధత చాటుకోవాలి. పథకాల అమలుపై.. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సమర్థంగా అమలు చేయడం లేదు. గతంలో కాంగ్రెస్ పాలనలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104 సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటి పథకాలను నీరుగారుస్తున్నారు. అప్రాధాన్యత పనులకు ప్రభుత్వం వెంపర్లాడుతోంది. పరిపాలన అనుభవంలేని, బాధ్యతలేనివారు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఎన్నికల హామీలపై.. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు..ఇలా ఏ హామీ నెరవేర్చడం లేదు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న నాయకులను బెదిరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గ్రామజ్యోతి, మన ఊరు–మన ప్రణాళిక వంటి కార్యక్రమాల్లో స్థానిక సంస్థలకు కావాల్సిన పనులను గుర్తించి..ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడంలేదు. కేంద్ర నిధులను కూడా పక్కదారి పట్టించడం దుర్మార్గం. ప్రతినెలా ఒకోటో తారీఖున కాకుండా పింఛన్లను నెలచివర్లో ఇస్తున్నారు. బ్యాంకులకు వెళ్లే క్రమంలో పలువురు వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి. ప్రాజెక్ట్ పనులపై.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 70–80శాతం వరకు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరిగింది. మరికొన్ని నిధులు కేటాయిస్తే..పూర్తికానున్నాయి. ఇందిరా సాగర్, రాజీవ్‌సాగర్‌కు రూ.475కోట్లు పూర్తిచేస్తే అవి వినియోగంలోకి వస్తాయి. కానీ రూ.8వేలకోట్లతో సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ æచేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్ట్‌కు రూ.26వేలకోట్ల నిధులతో పూర్తిచేయకుండా రూ.84వేలకోట్లకు పెంచి రీడిజైనింగ్ పేరుతో అవినీతికి తెర లేపుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలపై.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాలకు వివరిస్తున్నాం. పార్టీ సంస్థాగత నిర్మాణం అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడను. -
కార్మిక హక్కులు కాలరాస్తే ఖబడ్దార్
► ప్రభుత్వానికి సీఐటీయూ నేతల హెచ్చరిక ► ముగిసిన జిల్లా మహా సభలు ఆదోని: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా 10వ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న పలు అంశాలపై చ ర్చించారు. మొదటి రోజు స్థానిక మున్సిపల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అజయ్‌కుమార్, పట్టుభద్రుల ఎమ్మెల్సీ గేయానంద్, సీఐటీయూకు మద్దతుగా ఉన్న పలు కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్రస్థాయిలో దుయ్య బట్టారు. రెండో రోజు ఆదివారం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు జెండా ఆవిష్కరించి సభనుప్రారంభించారు. ఇటీవలే మృతి చెందిన యూనియన్ సీనియర్ నాయకుడు పర్శ సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. సభ ప్రాంగణానికి ఆయన పేరు పెట్టారు. కార్మిక సమస్యలు, వాటి పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కార్మిక ప్రతినిధు లు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై 8 తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సీఐటీయూ ప్రకటించింది. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూ ర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి రా ధాకృష్ణ, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర న్న, మహానంద రెడ్డి, నాయకులు తిప్పన్న పాల్గొన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
► ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్‌తో భావితరాలకు మేలు ► పనులను పరిశీలించిన కలెక్టర్ కరుణ రాయపర్తి : ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్ర భుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లి, గన్నారం గ్రా మాల్లో ఇంకుడుగుంతలు, ఫాం పాండ్ నిర్మాణాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు నీటి ఇబ్బందులు తీరాలంటే ప్రతీ ఒక్కరు తమ గృహాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ భూముల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని ఆమె సూ చించారు. ఆ తర్వాత ఆమె ఉపాధి హామీ కూ లీలతో మాట్లాడుతూ పనుల నిర్వహణ మెళకువలు పాటించాలన్నారు. ఇదేక్రమంలో తీవ్ర మైన ఎండలు ఉన్నందున వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పిటీసీ సభ్యురాలు వంగాల యాకమ్మ, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీఓ శంకరి, టీఆర్ఎస్ నాయకుడు జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు వశపాక కుమారస్వామి, బెల్లి యాదమ్మ, వశపాక మారయ్య పాల్గొన్నారు. -
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..
► మంత్రి జోగురామన్న ► పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆదిలాబాద్ రూరల్ : గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపిస్తుంద ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామం లో మిషన్ కాకతీయ పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేఆర్కే కాలనీలో ఇండ్ల స్థలాల పట్టాలను లబ్ధిదారుల కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలన లో రెండు సంవత్సరాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 112 కోట్లు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ఏర్పాటు అనంతరం 22 మాసాల్లోనే వివిధ రోడ్డు పనులకు రూ.1471 కోట్లను మం జూరు చేసి పనులు సైతం పూర్తి చేయడం జరి గిందని తెలిపారు. అభివృద్ది పనుల్లో భాగంగా మావల గ్రామపంచాయతీలో సీఆర్ఆర్ గ్రాం ట్ కింద చేపట్టిన పనులు ప్రారంభించారు. 7వ నెంబర్ జాతీయ రహదారి నుంచి సుభాష్‌నగర్ వరకు 1.17 కిలో మీటర్లతో రూ. 73 లక్షల వ్యయంతో, కేఆర్కే కాలనీలో 2.3 కిలో మీటర్ల మేర నిర్మించిన బీటీ రోడ్డు రూ.1.22 లక్షల వ్యయంతో రోడ్డు పనులు చేపట్టడం జరి గిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుం దని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగి రి అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, ఎంపీటీసీలు ఉమాకాంత్ రెడ్డి, మెస్రం సంగీ త, రాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరె రాజ న్న, పీఆర్ ఈఈ, డీఈ రవిప్రకాష్, ఏఈ మనోహర్, అసిస్టెంట్ ఏఈ అనిల్‌రెడ్డి, పాల్గొన్నారు. -
బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి
వీణవంక: చల్లూరు సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడీ సుదర్శన్, బాలలహక్కుల ప్రజాధ్వని జిల్లా అధ్యక్షురాలు శోభారాణి డిమాండ్‌చేశారు. చల్లూరులో బాధితురాలిని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిందితుల్లో ఇద్దరు మైనర్లు అని పోలీసులు ప్రకటించడంలో అనుమానాలున్నాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారి వెంట చిట్యాల సంపత్ ఉన్నారు. ఎస్సైని ఉద్యోగం నుంచి తొలగించాలి దళిత యువతి అత్యాచార ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని ఉద్యోగం నుంచి తొలిగించాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ డిమాండ్‌చేశారు. చల్లూరులో బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలికి షరతులు లేకుండా ఎస్సై ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాలని కోరారు. -
పండితులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
స్వరూపానందేంద్ర సరస్వతి విమర్శ సాక్షి, విశాఖపట్నం: పండితులను, దేవాలయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పెందుర్తి శారద పీఠంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 రాష్ట్రానికి అంతగా బాగోలేదని.. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగడం కోసం ఈనెల 14 నుంచి 18 వరకు శారదా పీఠంలో సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామిలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నామని స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 18వ తేదీ కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పండితులను రప్పించి వారిని స్వర్ణ కంకణధారణతో సత్కరిస్తామని వివరించారు. -
అన్నమూ అక్షరమూ లేని చదువులు
విశ్లేషణ డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవకముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా? గుండె కలుక్కుమంటుంది. ఏ బడిలోనో ఏదో ఘోరం జరిగినప్పుడు. ఏ మారు మూల ఊరు బడిలోనో కాదు మహానగరం మధ్యలోనే మాస్టారింట్లో వెట్టి చాకిరీ చేయనందుకు ఓ మైనారిటీ చిన్నారిని బడినుంచి గెంటివేసినందుకు. అందుకే కాదు. ఒళ్ళంతా పుళ్ళయి రక్తసిక్తమైన ఒంటికింత మందు లేనప్పుడు తోటి విద్యార్థులు గేలి చేస్తుంటే మనసు చిన్నబుచ్చుకున్న నా విద్యార్థి కళ్ళల్లో దీనత్వం చూసినప్పుడు హృదయం విలవిల్లాడుతుంది. చిట్టచివరి బెంచీలో కూర్చొని రోజూ నిద్రపోతున్న విద్యార్థికి క్రమేణా చూపు తగ్గిపోతోందని అందుకు అతని పేదరికం, పౌష్టికాహారలోపమే కారణమని తెలి సినప్పుడు మనసు మెలితిప్పే బాధ. నాలుగు అక్షరం ముక్కలతో పాటు నాలుగన్నం మెతుకులు వారికి సక్ర మంగా అందడం లేదనే చింత నిత్య ఉపాధ్యాయుడిగా ఉన్న నన్నింకా వేధిస్తూనే వుంది. స్వచ్ఛ భారత్‌పై యావత్ దేశం చర్చించుకుంటున్న ప్పుడు మరుగుదొడ్లు లేక ఒకే చోట పదే పదే మూత్ర విసర్జన చేసి ఆడపిల్లలు జబ్బుపాలై నందుకు, ఇన్ఫెక్ష న్లతో గైనిక్ వ్యాధులతో విలవిల్లాడు తున్నందుకు; నగ రంలోని ఓ పాఠశాలలో ఒకే తరగతి గదిలో తగిలించిన అమ్మాయిల సెలవు చీటీలన్నింటిలోనూ ‘‘కడుపునొప్పి తో బడికి రాలేకపోతున్నాను’’ అన్న వాక్యాలే చదివిన ప్పుడు గుండె గొంతులో చిక్కుకున్నట్టవుతుంది. ఎక్కడో గిరిజన గూడేల్లో ఆడపిల్లలపై జరిగిన అత్యాచారం ఫలి తంగా చిట్టితల్లులే కన్నతల్లులుగా మారిన దుర్మార్గాల్ని చూసినప్పడు ఒళ్ళు జలదరిస్తుంది. డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవక ముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశా లల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా? పిల్లల రోజువారీ శారీరక, ఆరోగ్యపరమైన, మానసిక మార్పులు గమనించే వ్యవస్థ మనకి ఎందుకు లేకుండా పోయింది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. (యుక్తవయస్సులో ఉన్న చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల బాధ్యతెవ్వరిదో ఎవరికి తెలియాలి? కేవలం ఉపాధ్యాయుడిదేనా? లేక కేవలం ప్రధానోపాధ్యాయుడిదేనా? లేదంటే అక్షరజ్ఞానం కూడా లేని కూలినాలి చేసుకునే పేద తల్లిదండ్రులదా?) ఇప్పుడు సమాధానం వెతకాల్సింది సరిగ్గా ఈ ప్రశ్నకే. పైవన్నీ ప్రశ్నలే సమాధానం లేని ప్రశ్నలు. ఒక ప్పుడు పివి నరసింహారావు ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలల్లో నర్సింగ్ వ్యవస్థ ఉండేది. విద్యార్థులను అంటి పెట్టుకొని ఒక నర్సు ఉండేది. వారికి వచ్చే జబ్బులు, వారికి ఎదురయ్యే శారీరక అనారోగ్య సమస్యలు గమనించి, వారికి తగిన సూచనలు చేసేది. అవసరమైతే వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించే వ్యవస్థ ఉండేది. ఆ తరువాత కూడా చాలా కాలం వరకు పాఠశాలల్లో ప్రతి మూడు నెలలకో, లేక ఆరునెలలకో ఓ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ ప్రభుత్వమే మెడికల్ క్యాంపులు నిర్వహించేది. వారి ఆరోగ్య పరిస్థితులను రికార్డు చేసేది. అవసరమైన మేరకు పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే తల్లిదండ్రు లకు వారి సమస్యలను వివరించేది. పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సప్లిమెంట్స్ సైతం కొన్ని చోట్ల ప్రభుత్వమే ఉచితంగా అందజేసేది. కానీ ఇప్పుడా వ్యవస్థ లేనేలేదు. ఆ విధానం కనుమ రుగైపోయింది. ఈ కారణంగానే చిన్నవయస్సులోనే జబ్బుని గుర్తించి నయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. విద్యాహక్కు చట్టం కారణంగా ఇప్పటికే బడిగడప తొక్కనటువంటి వర్గాల పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు, దళిత, ఆదివాసీల పిల్లలు, వికలాంగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ ఈ వర్గాలకు చెందిన ఎందరో పిల్లల పేర్లు పాఠశాలల్లో నమోదైనప్పటికీ, వారి శారీరక అసౌకర్యం వల్ల, అత్యధిక కాలం పాఠశాలలకు దూరంగానే ఉంటున్నారు. కాబట్టి వారిని పాఠశాలల్లో చేర్చడం ఎంత ప్రధానమో, వారికి క్రమం తప్ప కుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అంతకన్నా ప్రధానం అన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాల్సి వుంది. పిల్లల విద్య, వైద్యం, పౌష్టికాహారం ఈ మూడిం టినీ ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నప్పుడు విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు జరుగుతుంది. ఎందరో వైద్యులు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. అటువంటి వారి సాయం తీసుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం కార ణంగా బడికి వెళ్ళలేని పరిస్థితులు లేకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. కాబట్టి సమస్య తలెత్తిన ప్పుడు గగ్గోలు పెట్టడం కంటే, ఎవరినో ఒకరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కంటే శాశ్వత పరిష్కారానికి యత్నించడం సబబుగా ఉంటుంది. అలాగే కిశోర బాలికలకు పౌష్టికాహారంతో పాటు నెలనెలా అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ని ప్రభు త్వమే ప్రతి పాఠశాలకు సరఫరా చేయాలి. అతి తక్కువ ధరకు సైతం వాటిని తయారుచేసే అవకాశం వున్నచోట నుంచి ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు అంద జేయడం అత్యవసరం. వీటన్నింటికీ తోడు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవ సరం ఎంతైనా వుంది. మరుగుదొడ్లపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ఏ రాష్ట్రప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనైనా మరుగుదొడ్ల సమస్య తీవ్రతను పాలకులు గుర్తిస్తే మంచిది. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ చుక్కా రామయ్య -
'యువతను పోరాటాల వైపు మళ్లిస్తాం'
శ్రీకాకుళం: ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే కాలానికి రోజులు చెల్లాయని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాట నేతలు పేర్కొన్నారు. గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి మళ్లీ ఊపిరి పోస్తామని...యువతను పోరాటాల వైపు మళ్లిస్తామని నేతలు వ్యాఖ్యానించారు. భూమి సాగు పట్ల రైతుల అభిప్రాయం మారడం వల్లే తుళ్లూరులో భూపోరాటం నీరు గారిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలను ప్రభుత్వాలు మభ్యపెట్టే రోజులు పోయాయని... ఇక ప్రజలు సహనం వహించే పరిస్థితి లేదని దీనిని ప్రభుత్వాలు కనువిప్పు చేసుకోవాలని 1967 శ్రీకాకుళం సాయుధ పోరాట నేతలు సూచించారు. -
పర్యటనలు తప్ప మోదీ చేసింది ఏమీ లేదు
-
సర్కారుపై సమర శంఖం
-
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
- యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు - మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సోమేష్‌యాదవ్ కామారెడ్డి రూరల్ : యాదవుల హక్కులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సోమేష్‌యాదవ్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గాంధారి మండలం మాతు సంగెంలో యాదవ సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మండలానికి ఒక యాదవ సంఘం భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ప్రతి గ్రామంలో గొర్రెలు, మేకలను మేపుకోవడానికి 5 నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించేవారని, దీన్ని ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 559, 1016 ప్రకారం ప్రతి గ్రామానికి 5 నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో యాదవ సంఘం భవనాన్ని నిర్మించుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యే, ఎంపీ నిధులను తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం యాదవులు ఐక్యంగా ఉండాలన్నారు. గొర్రెల, మేకల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, యాదవులను బీసీ డి నుండి బీసీ ఎ లోకి మార్చాలని, గొర్రెల, మేకలకు ప్రభుత్వమే బీమా చెల్లించాలని, మిల్క్ డైరీ చైర్మన్ పదవులను యాదవులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్ అర్కల ప్రభాకర్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, కృష్ణాయాదవ్, వెంకట్‌యాదవ్, మల్లేష్‌యాదవ్, సుధాకర్‌యాదవ్, లద్దూరి లక్ష్మీపతియాదవ్ తదితరులు ఉన్నారు. -
రైతు సమస్యలు విస్మరించి విదేశీ పర్యటనలా..!
రైతాంగ సమస్యలు పరిష్క రించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహిం చింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. రైతు సమస్యలు విస్మరించి విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడింది. - జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి - ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి - మాజీ మంత్రి డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి - కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా - సొంత పూచీకత్తుపై అరెస్టు, విడుదల సంగారెడ్డి మున్సిపాలిటీ : రైతు సమస్యలను విస్మరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు విదేశీ పర్యటనలు చేస్తున్నారని డిసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామనిని చెప్పి, ఇప్పుడు వడ్డీ కట్టాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సీఎం నియోజకవర్గంలోని గజ్వేల్ ప్రాంతంలోని రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఇంత వరకు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. తమకు ఓట్లు వేసినా వేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సైతం ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలుకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకు ముందు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బండి నర్సాగౌడ్, బొంగుల రవి, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. నాయకుల అరెస్టు విడుదల .. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్తో పాటు మరో 50 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరగాలి
కడప అగ్రికల్చర్ : సమ్మెతో ప్రభుత్వాలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలని కార్మిక సంఘాల నేతలు పిలుపు నిచ్చారు. మంగళవారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో కార్మిక సంఘ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మీ, హరికృష్ణ, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను సవరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. సంఘాలు ఏర్పాటు చేయనీయకుండా కార్మికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు అవసరమైన విధంగా సవరణలు చేయడం లేదన్నారు. సెప్టంబరు నెల 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరు పాల్గొనాలని విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు. 1923లో కార్మిక చట్టం, 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం, 1948లో వేతనాల చెల్లింపుల చట్టం, 1952లో భవిష్యనిధి చట్టం తీసుకువచ్చినా ఆ చట్టాలన్నీ 60, 70 ఏళ్లనాటివేనని తెలిపారు.వీటన్నింటిని సమయానుకూలంగా కంపెనీలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారేగాని కార్మికులకు ఉపయోగపడడం లేదన్నారు. చట్ట సవరణ ముసుగులో హక్కులు కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కార్మిక చట్ట సవరణలో కనీస వేతనాలు రూ. 15000లు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్‌తో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలోకి వెళ్లాలని కోరారు. సదస్సులో ఐఎన్టీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకొమ్మదిన్నె సుబ్బరాయుడు, నగర అధ్యక్షుడు వెంకటరామరాజు, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామ్మోహన్, వైఎస్సార్‌టీయుసీ అధ్యక్షుడు అందె సుబ్బరాయుడు, బీఎంఎస్ జోనల్ కార్యదర్శి రమణ,హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుబ్బిరెడ్డి, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొని మాట్లాడారు. -
గాడితప్పిన ‘పరిషత్’ పాలన
- 36 మండలాలకు 19 మందే ఎంపీడీఓలు - 16 ఈఓపీఆర్డీ పోస్టులూ ఖాళీ - ఏళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు - పదోన్నతులను గాలికొదిలిన ప్రభుత్వాలు ఇందూరు : గ్రామాల అభివృద్ధికి బాటలు వేసే మండల పరిషత్ కార్యాలయాలు ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలు, అధికారులతో కళకళలాడిన ఈ కార్యాలయాలు ఇప్పుడు వెలవె లబోతున్నాయి. రెగ్యులర్ ఎంపీడీఓలు లేకపోవడం, నిధుల లేమితో పాలన గాడి తప్పింది. అధికారులు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. 17 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కిందిస్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించలేదు. ఫలితంగా మండల పరిషత్‌ను అధికారుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. ఇన్‌చార్జ్‌లు పని భారం మోయలేకపోతున్నారు. జిల్లాలోని 36 మండలాల్లో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ, ఇతర కారణాలతో ప్రస్తుతం 17 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంపీడీఓలున్నారు. సగం మండలాల్లో సూపరింటెండెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ ఎంపీడీఓలకు జిల్లా పరిషత్‌లో ఒకరికి డిప్యూటీ సీఈఓగా, మరొకరికి ఏఓగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఈఓపీఆర్డీ పోస్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మండలానికి ఒకరు చొప్పున 36 మండలాలకు 36 మంది రెగ్యులర్ అధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 16 మండలాల్లో ఈ పోస్టులు అధికారులు లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్ కార్యకలాపాలు చూడటం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధిహామీ, మరుగు దొడ్ల నిర్మాణం, మండల పరిషత్ సమావేశాల నిర్వహణ, ఇతర పనులతో పనిభారం తీవ్రమైందని ఇన్చార్జ అధికారులు వాపోతున్నారు. 718 గ్రామ పంచాయతీలు, 477 క్లస్టర్లకు 236 మంది మాత్రమే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. పదోన్నతులు లేకపోవడం కూడా ప్రధాన కారణం... ఎంపీడీఓ, ఈఓపీఆర్డీల కొరత వెనుక ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా దాదాపు 41 మంది సూపరింటెండెంట్లు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. నిజానికి 5 సంవత్సరాలు ఇదే పోస్టులో పనిచేసిన వారికి ఎంపీడీఓగా పదోన్నతి కల్పించాలనే నిబంధన ఉంది. ప్రభుత్వాలు తమను రెగ్యులర్ చేస్తాయనే ఆశతో పనిచేసిన సూపరింటెండెంట్లు చాలా మంది ఉద్యోగ విరమణ పొందారు. అయితే పదోన్నతుల విషయంతో పాటు తమకు గెజిటెడ్ హోదా కల్పించాలనే డిమాండ్‌తో పంచాయతీ రాజ్ కమిషనర్‌ను కలుస్తూనే ఉన్నారు. కానీ,పదోన్నతులకు మాత్రం మోక్షం లభించడం లేదు. అతిగా ఒత్తిడి చేస్తే కోర్టులో కేసు ఉందని చెప్పి బుకాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే ఎంపీడీఓ పోస్టులను సీనియార్టీ జాబితా ప్రకారం 35 శాతం సూపరింటెండెంట్లకు, 35 శాతం ఈఓపీఆర్డీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలి. 30 శాతం పోస్టులను నేరుగా ప్రభుత్వమే భర్తీ చేయాలి. 1998 సంవత్సరం తర్వాత ఒక్కరికి కూడా పదోన్నతులు కల్పించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తే జిల్లాలో ఖాళీ ఉన్న 17 ఎంపీడీఓ, 16 ఈఓపీఆర్డీ పోస్టులు ఎప్పుడో భర్తీ అయ్యేవి. ఖాళీ అయిన ఈఓపీఆర్డీ, సూపరింటెండెండ్ పోస్టులు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతుల ద్వారా లభించేవి. పదోన్నతులు చేపట్టాలి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వద్దకు చేర్చాలంటే మండల పరిషత్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి మండల పరిషత్‌తో ఎంపీడీఓతో పాటు, సూపరింటెండెండ్, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో 36 మండలాల్లో 50 శాతం ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. తద్వారా పాలన సాధ్యం కావడం లేదు. ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాలు పదోన్నతుల విషయాన్ని మరిచిపోయాయి. ఏళ్లుగా పదోన్నతులు లేక ప్రధాన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. ప్రభుత్వం పదోన్నతులు వెంటనే చేపట్టాలి. - గోవింద్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు -
‘ధరలను అరికట్టలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి’
నిర్మల్‌రూరల్ : పెరుగుతున్న నిత్యవసరాల ధరలను అరికట్టలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి గద్దల శంకర్, జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్లో బుధవారం పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దల శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యవసరాల ధరలను ఏమాత్రం అరికట్టలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికీ పప్పుల ధరలు చుక్కలనంటుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా అధ్యక్షుడు దేవోళ్ల గంగాధర్ మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తలకు ఈ నెల 26న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 25మందికి తగ్గకుండా హాజరు కావాలని పేర్కొన్నారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిదాస్ హస్డే, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ పట్ల బాపురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మార రాజన్న, నిర్మల్, ముథోల్, బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల అధ్యక్షుడు బొరోళ్ల ముత్యం, రవిచంద్రగౌడ్, హెచ్.ప్రకాశ్, డాక్టర్ గంగాధర్, రొడ్డ నారాయణ, హరినాథ్, పుట్టి పోశెట్టి, మనోజ్, జంగుబాబు, గంగయ్య, రాజేశ్వర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
- ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల సబ్సిడీ అందిస్తున్నాయని, దేశానికి వెన్నుముక అయిన రైతులకు అందించే రాయితీల విషయంలో వెనుకంజ వేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. పాలకొల్లు మార్కెట్‌యార్డులో గురువారం రైతులకు సబ్సిడీపై పవర్టిల్లర్లు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సభకు ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అధ్యక్షత వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 878 మంది రైతులకు పవర్ టిల్లర్లు పంపిణీ చేయాల్సి వుండగా కొందరికే అందించారన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా చేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ప్రభుత్వవిప్ అంగర రామమోహన్, ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా సబ్సిడీపై 30 పవర్టిల్లర్లు, మూడు వరికోత యంత్రాలు, 20 ఆయిల్ ఇంజన్లు, వంద టార్పాలిన్లు పంపిణీ చేశారు. మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, యలమంచిలి ఎంపీపీ బొప్పన సుజాత, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, ఆత్మ చైర్మన్లు అందే కోటి వీరభద్రం, ఆరిమిల్లి రామశ్రీనివాస్ (చిన్ని), వీఎస్టీ కంపెనీ ప్రతినిధి ప్రసాద్, శ్రీరామ ఆటోమొబైల్స్ అధినేత బలుసు శ్రీరామమూర్తి, ఏడీఏ పి మురళీకృష్ణ, ఏవో ఇడవలూరి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
అప్పట్లోనూ నల్లకుబేరులు..
నల్లడబ్బు బెడద ఇప్పుడే కాదు, పదిహేడో శతాబ్దం నాటికే ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా ఉండేది. రహస్యంగా డబ్బు కూడబెట్టుకుని, బయటకు సామాన్యంగా కనిపించే ‘పెద్ద’మనుషుల నుంచి పన్నులు వసూలు చేయడం మరింత గడ్డు సమస్యగా ఉండేది. ఇలాంటి వాళ్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టేందుకు 1696లో అప్పటి ఇంగ్లాండ్ ప్రభుత్వం ‘కిటికీ పన్ను’ను అమలులోకి తెచ్చింది. భవంతులకు ఉన్న కిటికీల సంఖ్య ఆధారంగా పన్ను వసూలు చేసేవారు. ఇంగ్లాండ్ బాటలోనే స్కాట్లాండ్, ఫ్రాన్స్ కూడా ఈ పన్నును అమలులోకి తెచ్చాయి. ఎక్కువ కిటికీలు ఉన్న ఇళ్లలో నివసించేవారు సహజంగానే ధనవంతులై ఉంటారని అప్పటి సర్కారు నమ్మకమే కాదు, అది కొంతవరకు నిజం కూడా! అయితే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు తెలివి మీరిన నల్లకుబేరులు తమ భారీ భవంతులకు పరిమితికి మించి ఉన్న కిటికీలను పూర్తిగా మూసేయించుకునే వారు. కిటికీలపై పన్ను విధించడమంటే ప్రజలకు ఆరోగ్యంగా జీవించే హక్కును దారుణంగా కాలరాయడమేననే విమర్శలు రావడంతో చివరకు ఇంగ్లాండ్ ప్రభుత్వమే దిగివచ్చి, ఈ పన్నును 1851లో రద్దు చేసింది. -
రైతు సమస్యలపై పాదయాత్ర
ధార్వాడ నుంచి బెళగావి వరకు హెచ్.డి.కుమారస్వామి సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో బాగంగా ధార్వాడ నుంచి బెళగావి వరకు జేడీఎస్ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ కుమారస్వామి వెల్లడించారు. బెంగళూరులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26న ధార్వాడ నుంచి పాదయాత్ర ప్రారంభమై 29న ఉదయం బెళగావిలో ముగుస్తుందని తెలిపారు. అంతేకాకుండా అదేరోజు అక్కడ నిర్వహించే బృహత్ సమావేశంలో వేలాదిమంది రైతులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. 80 కిలోమీటర్ల పాటు సాగే ఈ పాదయాత్రలో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు సామాజిక వేత్తలు కూడా పాల్గొంటారన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రాష్ట్రంలో చెరుకు, పట్టు, దానిమ్మ, ద్రాక్ష రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారన్నారు. సరైన మా ర్కెటింగ్ సదుపాయాలు లేక పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఏడాదినుంచి చక్కెర కర్మాగాయార యాజమాన్యం చెరుకు రైతులకు బకాయిలను చెల్లించ డం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చక్కెర కర్మాగారాలు రైతులకు దాదాపు రూ.4,600 కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా కుమార స్వామి తెలిపారు. ఇక చైనా నుంచి పట్టును దిగుమతి చేసుకుంటుండటంతో స్థానిక పట్టు రైతులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవసా య మార్కెటింగ్ కమిషన్ ఆశించిన ఫలితాలను ఇవ్వ డం లేదని అన్నారు. అందువల్లే రాష్ట్రంలోని రైతులందరూ ఇబ్బం దులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏఐ సీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ , ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సం క్షేమం పట్ల నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ప్రభుత్వమే అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై ఆయన ఎందుకు పెదవి విప్ప డం లేదు.’ అని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'ఎన్నికల హామిలను తుంగలో తొక్కారు'
-
పెరుగుతున్న గర్భిణీ మరణాలు
- ఐదేళ్లలో 270 మంది మృతి పింప్రి: గర్భిణీ మహిళల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వారి మరణాలను మాత్రం అరికట్టలేకపోతోంది. స్థానిక సంస్థల ద్వారా అనేక పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పుణేలో 2010-11లో 37, 2011-12లో 45, 2012-13లో 64, 2013-14లో 53, ఏప్రిల్1వ తేదీ 2014 నుంచి మార్చి 2015 వరకు 66 గర్భిణీ మరణాలు సంభవించినట్లు కార్పోరేషన్ ఆరోగ్య విభాగం ప్రకటించింది. గత ఐదేళ్లలో 66 మంది గర్భిణీలు మరణించడం ఆదోళనకు గురి చేస్తుంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా గర్భిణీ మహిళలు, శిశువుల సంరక్షణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉచిత అంబులెన్స్, ఆరోగ్య సేవలు, సలహాలు, సందేహాలకు గ్రామీణ ప్రాంతాల్లో వాలెంటీర్లను ఆరోగ్య విభాగం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయంగా కార్పొరేషన్ సహాయక ఆరోగ్య అధికారి డాక్టర్ వైశాలీ సాబణే మాట్లాడుతూ.. సమయానికి ఆరోగ్య సదుపాయాలు అందకపోవడం, రక్త పోటు, వికారం, డెంగీ లాంటి వ్యాధుల వల్ల మృతుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు సమయానికి అందుబాటులోలేక పోవడం లాంటి కారణాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. గర్భిణీ మృతుల వివరాలను సేకరించి ఆయా ప్రాంతాలలో జన జాగృతి, ఆరోగ్య వైద్య సదుపాయాలను కార్పొరేషన్ కల్పించాల్సినఅవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘మేడే’ మోగించాలి నిరంకుశ ప్రభుత్వాలపై ‘రణభేరి’
ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం కోసం పోరాటానికి మేడే ప్రతీక. 1830 నుంచి 1850 వరకు యూరప్ కార్మికవర్గం పనిగంటల తగ్గింపునకై ప్రాణార్పణలతో పోరు చేసింది. 1850లో బ్రిటన్ ప్రభుత్వం 12 గంటల పనిదినం చట్టం చేయడం యూరప్ కార్మికవర్గానికి పర్వదినంగా మారిందంటే ఆ నాటికి పనిగంటలు ఎంత దుర్భరంగా ఉండేవో ఊహించుకోవచ్చు. యూరప్ కార్మికవర్గం పారిస్ కమ్యూన్లో ఘోరంగా దెబ్బతిన్న కాలంలో వారి పోరాట బావుటాను విశ్వవీధుల్లో ఎగరేసింది అమె రికా కార్మిక వర్గం. ఆ చరిత్రకు మరో పేరు మేడే. ఎనిమిది గంటల పరిశ్రమ, 8 గంటల విరా మం (నిద్ర), 8 గంటల వినోదం (విద్య, విజ్ఞానం, క్రీడలు వగైరా) కోసం రోజును మూడు సమ విభా గాలుగా వర్గీకరించడం ద్వారానే కార్మికుడిని కేవలం కూలీగా కాకుండా పరిపూర్ణ మనిషిగా చూడగలమ న్నది 150 ఏళ్ల క్రితం కార్మిక సంస్థల భావన. పని, నిద్ర తప్ప ఇతర అవసరాలు కూలివాళ్లకు అక్కర లేదన్న ఆనాటి అమానుష వ్యవస్థకు ఇది పూర్తి భిన్న మైన వాదన. దీంట్లోనుంచే 8 గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా క్రమంగా అమలులోకి వచ్చింది. మానవ సమాజం వందేళ్ల క్రితం నాటి ఆధునీ కరణ నుంచి యాంత్రీకరణ, సాం కేతీకరణ, కంప్యూటరీకరణ, అంత ర్జాలం ద్వారా ఎంతో ముందుకు సాగినా పరిపూర్ణ మానవుడు భావ న ఇంకా పూర్తిస్థాయిలో ఫలించ లేదు. 8 గంటల పని దినాన్ని ఆరు గంటల పనిదినంగా పురోగమించ డానికి బదులుగా, 8 నుంచి 10, 12, 14 గంటల పనిదినంవైపు నేడు అడుగులు పడుతున్నాయి. పెట్టుబడిదారీ వేతన బానిసత్వ రద్దుకోసం పోరాడ టమే తమ లక్ష్యమని, 19వ శతాబ్దంలో ఉరికంబమె క్కబోయే ముందు మేడే వీరులు అమెరికా న్యాయ స్థానంలో ప్రకటించారు. కానీ 13 దశాబ్దాల తర్వాత మళ్లీ 8 గంటల పనిదినం కోసం కార్మికవర్గం పోరా డాల్సి రావడం విషాదకరం. నేటి భారతదేశంలో 40 కోట్లకు పైగా అసంఘటిత కార్మిక వర్గానికి 8 గంటల పనిదినం అందని ద్రాక్షపండే. 8 గంటల పని నడు స్తున్న పాత పరిశ్రమల్లోనే 12 గంటలపాటు పని చేసే ఒప్పంద, పొరుగు సేవలు, వలస కార్మికులు కొత్తగా చేరుతుండటం ఒకెత్తు కా గా, ఐ.టీ, బీపీఓ వంటి అత్యాధు నిక బానిసత్వ పరిశ్రమల్లో అత్యు న్నత విద్యావంతులు 10 లేదా 12 గంటల పనిదినానికి అలవాటు పడుతుండటం మరో ఎత్తు. రాజస్థాన్ నుంచి ఆంధ్రప్ర దేశ్ వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికచట్టాలకు తిరోగమన సవరణలు చేస్తున్నాయి. మార్చినెలలో ఏపీ శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు ప్రభు త్వం ఆదరాబాదరాగా కార్మిక చట్టాల సవరణలకు దిగడం వ్యూహాత్మకమైంది. చంద్రబాబు తాను మా రిన మనిషినని చెబుతూనే పాత చీకటి చరిత్రను పునరావృతం చేస్తున్నారు. సింగపూర్, చైనా తదితర దేశాల విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాట కోసం స్వదేశీ కార్మిక వర్గంమీద యుద్ధప్రకటన చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు తీరు కూడా ఇలాగే పోటీపడుతోంది. కార్మికుల ఆకలి కేకలు పట్టించుకో కుండా విదేశీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమలకై తెగ ఆరాటపడుతోంది. తాము కార్మికవర్గ హక్కులను ఎంత ఎక్కువగా కాలరాస్తే, విదేశీ పెట్టుబడులు అం త ఎక్కువ స్థాయిలో ఇక్కడకు వస్తాయన్న తాత్విక సిద్ధాంతంతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు, నిర్వాసిత సమస్యలు, బలవంతపు భూసేకరణ, బూటకపు ఎదురుకాల్పు లు తదితర ప్రజావ్యతిరేక విధానాలవల్ల రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం, కూలీలు, ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. అలాంటి బాధిత వర్గాల ప్రజలకంటే కార్మిక వ ర్గం ఒకింత ఎక్కువ సమరశీలమైంది. మేడే సంద ర్భంగా కేవలం 8 గంటల పనిదినం, జీతభత్యాలు, జీవన ప్రమాణాల మెరుగుదలకే పరిమితం కాకుం డా ప్రజావ్యతిరేక ప్రభుత్వాలపై పోరుకు దిగే చారి త్రక పాత్రను పోషించేందుకు కార్మికవర్గం దీక్ష పూ నాలి. ఇదే మేడే వీరులకు నిజమైన నివాళి. (మేడే కార్మిక పోరుకు నేటికి 129 ఏళ్లు) పి. ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు జాతీయ కార్యదర్శి మొబైల్: 9490700715 -
బీడీ కార్మికులకు మేలు చేయండి
దేశ వ్యాప్తంగా బీడీ కార్మికులు దయనీయస్థితిలో అనాగరికంగా బతుకుతున్నారు. దశాబ్దాలుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నెన్ని ప్రభు త్వాలు మారినా, మారుతూ వస్తున్నా బీడీ కార్మికుల బతుకులు మారడంలేదు. విద్య, భృతి, వసతి, ఆహార సరఫరా కార్డులు, వారి పిల్లలకు చదువులు, ఉపకార వేతనాల మంజూరీ ఆరోగ్యభద్రత కార్డులు మొదలైనవి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తుని కాకు సేకరణ విషయంలోనూ, వంద బీడీ కట్టల ధర చెల్లింపులోను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బీడీ కార్మికుల కూలి రేట్లను పెంపు చేయడం చాలా అవసరం. మహిళా బీడీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా నిరక్షరాస్యులైన వారి కోసం ప్రత్యేక పాఠశా లలు ఏర్పర్చడం, వారు చదువుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యలను తప్పక చేపట్టాల్సి ఉంది. ముప్పై ఏళ్ల వయస్సుకు పైబడిన మహిళా బీడీ కార్మికుల కోసం నెలవారీ భృతిని రెండు వేల రూపాయల దాకా పెంచడం వంటివి చేయాల్సి ఉంది. బీడీ కార్మికులలో పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే తేడా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి మేలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు అందరికీ, కొంత ప్రీమియం తీసుకొని బీమాను వర్తింపజేస్తే ఎంతో బాగుంటుందని కేంద్ర బీడీ కార్మికశాఖ అధికారులను, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. - కూర్మాచలం వెంకటేశ్వర్లు ఎం.ఎం.తోట, కరీంనగర్ -
‘రీయింబర్స్మెంట్’పై స్పష్టత ఎప్పుడో
ఇంకా తేలని స్థానికత వివాదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో లక్ష మందికిపైగా విద్యార్థులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో చదువుతున్న దాదాపు 80 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతోపాటు ఆంధ్రా ప్రాంతంలో చదువుతున్న సుమారు 40 వేల మంది తెలంగాణ విద్యార్థులు కూడా తమకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నది తేలక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్థానికత అంశం ముడిపడి ఉన్న ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివసిస్తున్న ఏపీ విద్యార్థులకు ఇది పెద్దసమస్యగానే ఉంది. ఓవైపు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నా ఇంకా ఈ విషయంలో స్పష్టత రాకపోవడం మరోవైపు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు వేదన చెందుతున్నారు. జటిలంగా మారిన సమస్య: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులందరికీ (స్థానికతతో సంబంధం లేకుండా) రీయింబర్స్మెంట్ చేసిన పక్షంలో తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల భారం పడనుంది. అదే సమయంలో ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆ ప్రభుత్వం కొన్ని పదుల కోట్ల మేర చెల్లించాలి. ఆర్థికభారం పెరుగుతుందన్న కారణంతో రెండు ప్రభుత్వాలు ముందుగా ఎవరు నిర్ణయం తీసుకుంటారోనని వేచి చూస్తూ విద్యార్థులతో దోబూచులాడుతున్నాయి. తెలంగాణకే చెందిన వారిగా (స్థానికులుగా) ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకునే విద్యార్థులకు ‘ఫాస్ట్’ను వర్తింపజేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉంటున్న ఏపీ విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. ఎమ్మార్వోలు నేటివిటీ సర్టిఫికెట్లకు బదులు ఫలానా ఇంట్లో నివసిస్తున్నారని మాత్రమే పత్రాలు ఇస్తున్నారు. -
విపత్త్తులను ముందే పసిగట్టగలం
టీఈడబ్ల్యూసీ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ పదేళ్ల కిందటి సునామీ బాధితులకు ఇంకా పునరావాసం అందలేదని వ్యాఖ్య టీఈడబ్ల్యూసీ సదస్సులో ప్రసంగించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: సునామీ, తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగ ట్టే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. హైదరాబాద్‌లోని భారత జాతీయ మహా సముద్రాల సమాచార వ్యవస్థ (ఇన్కాయిస్) ప్రాంగణంలో ఉన్న ‘సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం (టీఈడబ్ల్యూసీ)’ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన కేంద్రంగా పేరుగాంచిందని ఆయన చెప్పారు. ‘టీఈడబ్ల్యూసీ సాధించిన పురోగతి, భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం ‘ఇన్కాయిస్’లో జరిగిన సదస్సులో హర్షవర్ధన్ మాట్లాడారు. ఏడేళ్ల కింద ఏర్పాటైన సునామీ హెచ్చరికల కేంద్రం దేశవ్యాప్తంగా సముద్ర తీరాల్లో 350 చోట్ల పరికరాలను ఏర్పాటు చేసుకుని, తీరప్రాంత ప్రజలకు నిత్యం ప్రమాద హెచ్చరికలను అందజేస్తోందని తెలిపారు. పదేళ్ల కింద 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో దేశవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారని, తల్లిదండ్రులను కోల్పోయి ఎంతోమంది చిన్నారులు అనాథలయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆ ఘటన జరిగి పదేళ్లుదాటినా గత ప్రభుత్వాలు బాధితులకు సరైన పునరావాసం కల్పించలేకపోయాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 26 శాతం మంది ప్రజలు సముద్రతీరానికి సమీపంలో నివసిస్తున్నారని, వైపరీత్యాల సమయంలో వారి ప్రాణాలను రక్షించేందుకు టీఈడబ్ల్యూసీ కేంద్రం ఎంతగానో దోహదపడుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఇటీవలి హుద్‌హుద్ తుపాను నుంచి ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు. హిందూ, పసిఫిక్ మహా సముద్రాల పరిధిలోని 16 దేశాలకు ఈ సునామీ హెచ్చరికల కేంద్రం సేవలందిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. వైపరీత్యాల నిర్వహణపై శిక్షణ.. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లకు శిక్షణ ఇప్పించే యోచన చేస్తున్నామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి తెలిపారు. జపాన్ వంటి దేశాలు తమ సునామీ హెచ్చరికల కేంద్రాన్ని రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేసుకోగా... మనదేశంలో కేవలం రూ. 240 కోట్లతో ఏర్పాటైన టీఈడబ్ల్యూసీ ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచిందని చెప్పారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇటువంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేశ్‌నాయక్, మాజీ కార్యదర్శులు పీఎస్ గోయల్, హర్షగుప్తా, ఇన్కాయిస్ డెరైక్టర్ సతీష్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. పోలియో సమూల నిర్మూలనకు వ్యాక్సిన్ పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు, రాబోయే తరాలు దీని బారిన పడకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యాక్సిన్ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళికలను సాకారం చేసే దిశలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) రంగంలో వివిధ ప్రాజెక్టులను రూపుదిద్దేక్రమంలో తమ శాఖ కీలకపాత్రను పోషించనున్నదని చెప్పారు. సునామీ హెచ్చరికలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ఐఐసీటీ, ఐఐటీ, ఐఐఎం, తదితరాల ఆర్ అండ్ డి సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నా, దక్షిణాదిలో ఎందుకు అంతగా పుంజుకోలేకపోతోందన్న ప్రశ్నకు ఈ రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉందని, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందన్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని, దీనిని పార్టీ కార్యకర్తలు బలంగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రమంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, హనీఫ్ అలీ, ఎం. చంద్రయ్య తదితరులున్నారు. -
ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాలు
వెంకటాపురం: ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని, ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పార్టీ 18వ డివిజన్ మహాసభల సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా తమ్మినేని పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్రవ్యాప్తంగా కేవలం 600 మందికి 1500 ఎకరాలు మాత్రమే పంచి చేతులు దులుపుకుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పేదలకు ఇళ్లు, పింఛన్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ తదితర పథకాలు పూర్తిస్థాయిలో అమలవడం లేదని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామన్న హామీ మాటలకే పరిమితమైందని, ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. గిరిజనుల సాగులోగల పోడు భూములకు పట్టాలిచ్చి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే పోరాటాలకు దిగేందుకు సీపీఎం సిద్ధంగా ఉందన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సాధనపల్లి ఆనంద్‌ను ఈ సభలో తమ్మినేని సన్మానించారు. ఈ సభలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, నాయకులు బి.వెంకట్, ఎజె.రమేష్, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, యలమంచి రవికుమార్, బ్రహ్మచారి, గడ్డం స్వామి, మర్లపాటి రేణుక , గ్యానం సారయ్య, వంక రాములు, సరియం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం దౌర్భాగ్యం..!
ఆదిలాబాద్ టౌన్ : ‘పిల్లలందరూ బాగా చదువుకోవాలి.. తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలని..’ ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న మాటలు బాగానే ఉన్నా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను విద్యాశాఖ తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించాలని ఇదివరకే రెండుసార్లు ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవంటే విద్యాశాఖ తీసుకుంటున్న బాగోగు చర్యలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థినులు బయటకు వెళ్లలేక.. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక.. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. ఇంకొన్ని చోట్ల అయితే.. తప్పనిసరిగా భావించి ఆరుబయటకు వెళ్తున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్న జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్ 1, ఎస్బీహెచ్ఎస్, ఆర్పీఎల్, బాలికల ఉన్నత పాఠశాలలతోపాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేవు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ విజిట్ చేయగా.. విద్యార్థుల ఇబ్బందులు వెలుగులోకొచ్చాయి. జిల్లాలో పరిస్థితి... జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మరుగుదొడ్లు కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించారు. అయితే ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా అధికారులు లెక్క చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1114 మంజూరు కాగా 1054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. 2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యం గల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నాయని ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న డ్రాపౌట్ల సంఖ్య.. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవడంతో విద్యార్థినులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతూ చాలా మంది విద్యార్థినులు సక్రమంగా పాఠశాలకు హాజరు కావడం లేదు. మరికొంత మంది చదువు మానేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదని తెలుస్తోంది. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేక ఉపయోగంలోకి రావడం లేదు. నిధుల దుర్వినియోగం.. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు వాటిని తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో పాతవాటికే రంగులు పూసి నిధులు కాజేసిన దాఖలాలు ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో కాంట్రాక్టర్లు నాసిరకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో నిర్మించిన కొన్ని నెలలకే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఏదేమైనా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో విద్యార్థినులకు శాపంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థినుల డ్రాప్‌ఔట్ సంఖ్యను తగ్గించి వారి సమస్యను తీర్చాలని పలువురు కోరుకుంటున్నారు. నిలిచిపోయిన న్యాప్కిన్ల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు గతంలో పంపిణీ చేసిన న్యాప్కిన్లు ప్రస్తుతం అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకుని రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నెప్జల్ పథకం కింద ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు 2011-12 విద్యా సంవత్సరంలో దాదాపు 60 వేల మంది బాలికలకు న్యాప్కిన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యార్థులకు వాటి తయారీపై విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. రెండేళ్లుగా ఈ పంపిణీ నిలిచింది. దీంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. - సత్యనారాయణరెడ్డి, డీఈవో ఈ విద్యా సంవత్సరంలో 626 పాఠశాలలకు మరుగుదొడ్లను కలెక్టర్ మంజూరు చేశారు. వీటిని ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు చూస్తున్నారు. పాఠశాలలో పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతాం. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండి వినియోగం లేని వాటిని వినియోగించేలా చూడాలని ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. -
ఉపాధ్యాయులతో పెట్టుకుంటే నూకలు చెల్లుతాయ్
కలెక్టరేట్ వద్ద జీవో పత్రాలను దగ్ధం చేసిన ఎస్టీయూ కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాలకు నూకలు చెల్లినట్లేనని, కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచిన ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్థి చెబుతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు లెక్కల జమాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు జయరామయ్య హెచ్చరించారు. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు అక్రమ బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సంబంధిత జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనుకూలమని, నీతి, నిజాయితీ, పారదర్శకత గల వారమని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ విధానానికి స్వస్తి చెప్పి 317 మంది ఉపాధ్యాయులను డొడ్డిదారిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. లక్షలాది రుపాయలు ముడుపులు తీసుకుందని ప్రభుత్వంపై ఆరోపించారు. పలుకుబడి, డబ్బులున్నవారికే ఈ ప్రభుత్వం వత్తాసు పలకడం చూస్తే, ఇది కార్పొరేట్ ప్రభుత్వంలా ఉందన్నారు. సంబంధిత జీవోను ఉపసంహరించుకోకపేతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఎస్టీయూ హెచ్చరించింది. -
ఇంటర్ పరీక్షలకు ఉమ్మడి కమిటీ!
వేర్వేరు పరీక్షలపై గవర్నర్ విముఖత! సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధికారులతో కూడిన ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేందుకు అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మంత్రులు గంటా శ్రీనివాసరావు, కె .జగదీష్‌రెడ్డిలతో ఇటీవల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అనుసరించి ఈ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే ఉమ్మడి కమిటీ, ఉమ్మడి పరీక్షలకు వీలుంటుంది. గురువారం ఇద్దరు మంత్రుల భేటీ జరిగి ఉంటే దీనిపై చర్చ జరిగి ఉండేది. కానీ ఆ సమావేశం జరగకపోవడంతో ఈ ప్రతిపాదనలపై ప్రాథమిక స్థాయి చర్చ కూడా సాగలేదు. ఇరు ప్రభుత్వాలు అంగీకారానికి వస్తే రెండు ప్రభుత్వాల ఉన్నతాధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పరచి ఇంటర్మీడియెట్ ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు అవకాశ ముంటుందని అధికారులు పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 95లోని అంశాల ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉమ్మడిగానే జరగాలని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. వేర్వేరుగా నిర్వహిస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన మంత్రుల భేటీ సందర్భంగా స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. గవర్నర్ అభిప్రాయం ఉమ్మడి పరీక్షల నిర్వహ ణకే అనుకూలంగా ఉండడంతో అధికారులు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా... ఇరు ప్రభుత్వాలు ఏమేరకు అంగీకరిస్తాయోనన్న సందేహంలో ఉన్నారు. -
మహిళల నెత్తిన వడ్డీ రాయితీ
డ్వాక్రా మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. కానీ ఇకనుంచి మేం వడ్డీ లేకుండా రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తాం. అంతేకాకుండా గతంలో ఉన్న వడ్డీ బకారుులు సైతం వచ్చే నెల మొదటి వారంలో చెల్లిస్తాం’’ - ఇది మంత్రి హరీష్‌రావు శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో చెప్పిన మాట. మా సంఘం తరఫున ఈఏడు మార్చిలో రూ.5లక్షలు బ్యాంకు నుంచి అప్పుగా తెచ్చుకున్నం. నెలనెలా వడ్డీ రాయితీ ఇస్తామని సర్కార్ చెప్పింది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. బ్యాంకువారు ఇప్పటికే రూ.50వేల దాకా వడ్డీ వసూలు చేసిండ్లు. మాకు లోన్ ఇచ్చి ఏం లాభం’’ - ఇది మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ప్రగతి మహిళా సంఘం సభ్యుల ఆవేదన. మేడిపెల్లి: మహిళల ఆర్థిక స్వావలంబనలో భాగంగా గత ప్రభుత్వాలు పావలా వడ్డీ, వడ్డీలేని రుణం పథకాలను ప్రవేశపెట్టారుు. దీంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం వాటికి నెలనెలా వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయూలి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం మొదలు ఇప్పటివరకు మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లించలేదు. తమ నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తుండడంతో అదనపు భారం పడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లేదట జిల్లాలో మొత్తం 46,738 మహిళా సంఘాలుండగా ఇందులో 45,144 సంఘాలు వివిధ బ్యాంకుల నుంచి రూ.570.31 కోట్ల రుణాలు తీసుకున్నారుు. వీరు తీసుకున్న రుణాలకు ప్రతీ నెల ప్రభుత్వం నుంచి సుమారుగా రూ.2.5 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు రూ.22.62 కోట్ల వడ్డీ రాయితీ ఇంతవరకు రాలేదు. బడ్జెట్ లేదనే సాకుతో ప్రభుత్వం తొమ్మిది నెలలుగా వడ్డీ చెల్లించడం లేదు. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు పావలావడ్డీకి రుణాలు ఇవ్వగా, అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ వడ్డీలేని రుణాలు అందజేసింది. అటు తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ అందజేయలేదు. వారి నిబంధనలు వారివే... మహిళా సంఘాలన్నింటికి వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలు ఇస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ వాస్తవంలో బ్యాంకులు తమ నిబంధనల ప్రకారమే వడ్డీ వసూలు చేస్తున్నారుు. ఒక్కో మహిళా సంఘం రూ.3లక్షల లోపు(రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు) రుణం పొందితే రూ.0.50 వడ్డీ పడుతోంది. అలాకాకుండా రూ.3లక్షలకు పైగా(రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు) రుణం తీసుకుంటే రూ.1.25 వడ్డీ పడుతోంది. ఈ విషయంలో మహిళా సంఘాలు ఎంత మొత్తుకున్నా వారి మాట బ్యాంకర్లు వినడం లేదు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న వడ్డీని త్వరగా చెల్లించాలని, రూ.3లక్షలకుపైగా రుణాలు తీసుకున్న సంఘాలకు అదనపు వడ్డీరేటును తగ్గించాలని మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 46,738 జిల్లాలో మహిళా సంఘాలు 45,144 రుణం తీసుకున్న సంఘాలు రూ.570.31 కోట్లు తీసుకున్న రుణం మొత్తం నెల రావాల్సిన వడ్డీ (రూ.కోట్లలో) మార్చి 2.50 ఏప్రిల్ 2.70 మే 2.44 జూన్ 2.55 జూలై 2.76 ఆగస్టు 2.01 సెప్టెంబర్ 2.66 అక్టోబర్ 2.50 నవంబర్ 2.50 మొత్తం 22.62 -
చెట్ల కింద బతుకులు
అడవుల్లో వన్యప్రాణులే కాదు అటవీప్రాంతంలో ప్రాణం ఉన్న మనుషులూ ఉంటున్నారన్న విషయం ఈ పాలకులకు తట్టటం లేదు.. వారి బతుకులూ పట్టటం లేదు. బడుగుల బాగుకు ‘పథకం' పన్నామని చెప్పుకునే ప్రభుత్వాలకు గూడేల్లో ఉండే చెంచుజాతుల గోడు చెవికెక్కడం లేదు. బడి, గుడి కాదు గదా కనీసం కూడు, గూడు కూడా అందని పండ్లుగానే మారి అలమటిస్తున్నారు. మట్టిమానుల్లో దొరికే దుంపలతో కడుపునింపుకుంటున్న బతుకుల అభ్యున్నతికి స్థానిక ప్రజాప్రతినిధులే పూనిక వహించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిధులతోవారి బతుకుల్లో వెలుగులు పూయించాలి. వెల్దుర్తి అటవీ ప్రాంతంలో నివసించే చెంచుల బతుకుల్లో మార్పు రావటం లేదు. చెంచుల అభివృద్ధికి ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు చెబుతున్న అనేక సంక్షేమ పథకాలు వారి దరి చేరడం లేదు. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో 14 చెంచు గూడేలు ఉన్నాయి. శిలువకొండతండా, దావుపల్లి, బొటుకులపాయతండా, సేవానాయక్‌తండా, పిచ్చయ్యబావితండా, లోయపల్లి , జెండాపెంట, రామచంద్రాపురం, హనుమాపురంతండా, గుడిపాడుచెరువుగూడెం ఉన్నాయి. వీటిల్లో దాదాపు 400 చెంచు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అనేక ఏళ్ల నుంచి అటవీ ప్రాంతంలో ఉన్నాఇప్పటికీ పూరిళ్లల్లోనే ఉంటున్నారు. విద్య, ఆరోగ్యం వీరికి అందని ద్రాక్షగా మారాయి. అటవీ ప్రాంతంలో లభించే పండ్లు, కట్టెలు విక్రయిస్తూ బతుకుతున్నారు. కుంకుడుచెట్టుతండాకు 40 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం అవి శిధిలావస్థకు చేరుకున్నాయి. ఆ తరువాత ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి. ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన అనుభవదారి ధ్రువీకరణ పత్రాల కోసం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయానికి నడిచి వచ్చి దరఖాస్తులు అందించారు. గూడేలు అటవీ ప్రాంతంలో ఉన్నందు వల్ల అనుభవదారి సర్టిఫికెట్లు మంజూరు చేయడం కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దాంతో వారంతా జిల్లా కేంద్రం గుంటూరు చేరుకుని కలెక్టర్‌కు దరఖాస్తులు అందజేసినా ఫలితం లేకుండాపోయింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద గుడిపాడుచెరువు గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి రూ. 40 లక్షలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు చేసుకొని అరకొర రాబడితో బతుకు లాగిస్తున్న చెంచుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాల్సి వుంది. -
బలిపీఠంపై బక్క రైతు
పంటలు పండక.. అప్పులు తీరక..దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు నెల రోజుల్లో జిల్లాలో 15 వుంది ఆత్మహత్య నర్సంపేట : తొలకరి వర్షం కురవగానే పుడమితల్లి వుట్టివాసనతో పులకరించిన రైతన్నలు నేడు పంటలు చేతికందే పరిస్థితి లేకపోవంతో చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. జిల్లాలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్-16 వరకు 15 వుంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధాన నీటి వనరులు ఉన్నా వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌లో వరి పంట సాగు కాలేదు. పత్తి, మొక్కజొన్న, మిర్చి సాగు చేసినా నీరందకపోవడతోరైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్‌లో 8 వుంది ఆత్మహత్య చేసుకోగా ఈనెల 15 వరకు ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ముగ్గురు ఉరి వేసుకుని చనిపోగా 12 వుంది పురుగుల వుందు తాగి తనువు చాలిం చారు. ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సం పేటలోనూ పంటలు పండే పరిస్థితి లేక ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 421 జీఓ ఏం చెబుతోంది..! వర్షాలు కురవక కరువు నేపథ్యంలో రైతులకు దిగుబడి రాక అప్పుల బాధ భరించలేక బలవన్మరణం చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయూంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 421 జీఓను విడుదల చేశారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1,50,000 చెల్లించేలా నిర్ణయుం తీసుకున్నారు. ఈ జీవోను ఆ తర్వాతి ప్రభుత్వాలు తుంగలో తొక్కడంతో మృతిచెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు. పరిహారం అందించాల్సిందిలా.. గ్రావూల్లో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే తహసీల్దార్, వుండల వ్యవసాయు అధికారి, గ్రావు రెవెన్యూ అధికారి మొదటి దశలో ప్రాథమిక విచారణ చేస్తారు. అనంతరం డివిజన్‌స్థాయిలో ఆర్డీఓ, డివిజనల్ పోలీస్ అధికారి(డీఎస్పీ), వ్యవసాయు శాఖ సహాయు సంచాలకులు(ఏడీఏ) రైతు ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తారు. అది పూర్తయిన తర్వాత కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత బాధిత రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తారు. ఇంటి పెద్ద ఆత్మహత్యతో డేరాలో దుర్భర జీవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు నేదురు యాకలక్ష్మి. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల తిమ్మంపేట గ్రామం. వీరిది సామాన్య రైతు కుటుంబం. ఎకరం వ్యవసాయ భూమి ఉండగా సేద్యం చేసుకుంటూనే కుమారస్వామి, యాకలక్ష్మి దంపతులు కూలీకి వెళ్తూ జీవనం సాగిస్తుండేవారు. వారికి కూతురు అనిత, కుమారుడు అనిల్ ఉన్నారు. రెండేళ్ల క్రితం కూతురు అనితకు పెళ్లి చేశారు. అనిల్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులన్నీ కలిపి రూ.3 లక్షల వరకు తీర్చాల్సి ఉంది. అప్పు తీరాలంటే వ్యవసాయంతో కష్టమని ఈ ఏడాది కుమారస్వామి ఇదే గ్రామంలో ఓ ఆసామికి ఏడాదికి రూ.80 వేలకు పాలేరుగా చేరాడు. అప్పుల బాధతోనే ఉన్న కుమారస్వామి సెప్టెంబర్ 26న గ్రామంలో గుండం చెరువు తూముకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి కనీసం ఉండటానికి ఇల్లు లేక నల్ల టార్పాలిన్‌ను గుడారంలా వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని మృతుడి భార్య వేడుకుంటోంది. -
ప్రేమాయలో పడొద్దు
ఉన్మాద చర్యలను ఖండించిన విద్యార్థులు శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ‘సాక్షి’ చర్చావేదిక కుత్బుల్లాపూర్/గాజులరామారం: వయసు ప్రభావం.. ఆధునిక సంస్కృతి తెస్తున్న వింత పోకలడల వ్యామోహం కలిసి యువత ‘ఆకర్షణ’లో పడుతున్నారు. దీనికే ‘ప్రేమ’ అని పేరుపెట్టి ఊహల్లో తేలిపోతున్నారు. అమ్మాయి పలకరిస్తే చాలు ఏదోలా అయిపోయి కలల్లో మునిగిపోతున్నారు. తీరా అటు నుంచి అనుకున్న స్పందన రాకుంటే బతుకునే బలిపెడుతున్నారు. ‘ప్రేమించలేదని దాడి, ప్రేమికురాలిపై అనుమానంతో దాడి, ఇతరులతో చనువుగా ఉంటుందని దాడి’ ఇలా జరుగుతున్న ప్రతి దాడి వెనుకా ‘ప్రేమ’ మైకమే ఉంటోంది. ఈ తరహా ఉన్మాదంతో అమాయకులైన యువతులను బలి తీసుకుని వారి కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. దాడులకు పాల్పడ్డవారు తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో మొన్న యువతిపై కళాశాలలో తోటి విద్యార్థుల ముందే దాడి.. నిన్న అనుమానంతో ప్రేమికురాలిని మేడపై నుంచి తోసి హత్యాయత్నం ఘటనలు సంచలనమయ్యాయి. ఈ విషాదకర ఘటనలపై ‘సాక్షి’ కొంపల్లి శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో బుధవారం నిర్వహించిన చర్చా వేదికలో యువత తమ మనోభావాలను వ్యక్తపరిచింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిస్తే అది ప్రేమ కాదని రెండు మనసులు పూర్తి స్థాయిలో కలిస్తేనే ప్రేమ అని స్పష్టం చేశారు. అభిప్రాయ బేధాలు వస్తే కూర్చోని మాట్లాడుకోవాలే తప్ప ఈ తరహా దాడులకు తెగబడటం తగదని సూచించారు. ప్రభుత్వాలు కూడా ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి త్వరగా కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ఎవరి జాగ్రత్తలో వారు.. మన ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పు రావాలి. కొన్ని విషయాల్లో అబ్బాయిలదే తప్పని అనడం కరెక్ట్ కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అబ్బాయిలతో చనువుగా ఉన్నా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. - అనూష ప్రేమా.. ఆకర్షణ..? అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ప్రేమలో ఉంటే అది ప్రేమా.. ఆకర్షణ అనేది ముందుగా నిర్ధారణకు రావాలి. నిజమైన ప్రేమలో ఈ తరహా దాడులు జరగవు. ఇలాంటి విషయాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. - సుమ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా తప్పు కాదు. కానీ వారి మధ్య ఆ ప్రేమ ఎంత వరకు ఉంటుందనేదే ప్రశ్న. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంటే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు స్థానం ఉండదు. - నిఖిత తేలికగా తీసుకోకూడదు.. అబ్బాయిలు అమ్మాయిల వెంటపడడం, వారిని టీజ్ చేయడం సహజం. కానీ అది శృతి మించకూడదు. అదేపనిగా వేధిస్తుంటే ఘాటుగానే స్పందించాలి. అయినా వినకపోతే తేలికగా తీసుకోకుండా పెద్దవారికి సమస్య తెలియజేయాలి. - రితూ దాడులకు పాల్పడటం శాడిజం ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆమెను అంతం చేయాలనుకోవడం సరైనది కాదు. అలాంటిది ప్రేమ కాదు. హత్యలు, దాడులకు పాల్పడితే దానిని శాడిజం అంటారు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. - మనీషా ఇద్దరిలోనూ మార్పు రావాలి ప్రేమోన్మాద చర్యలు జరిగినప్పుడు కేవలం అబ్బాయిలను టార్గెట్ చేయడం సరైంది కాదు. అయితే ఇలాంటి దాడులను అందరూ ఖండించాలి. అయితే ఇద్దరి ప్రవర్తనలో మార్పు రావాలి. మన సంస్కృతి సాంప్రదాయాల అనుసరించి మెలిగితే ఇలాంటి ఘటనలు జరగవు. - ప్రవీణ్ కుమార్ కఠిన శిక్షలు ఉండాలి క్షణికావేశంలో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. హద్దులలో ఉంటే ఇలాంటివి జరగవు. ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నే ఉన్నాయంటే లోపం మన చట్టాలలోనే ఉన్నది. విదేశాలలో ఇలాంటి ఘటనలకు కఠిన శిక్షలు విధిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చట్టంలో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. - రమేష్ ఇలాంటి ఘటనలు బాధాకరం అమ్మాయిలు వస్త్రధారణకు, హవాభావాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. సమయ సందర్భాలను బట్టి ప్రవర్తించాలి. అబ్బాయిలకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాని గుర్తిస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి. మన కుటుంబంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించాలి. - దీపిక సంపతి, ఎస్ఎస్ఐఎం డెరైక్టర్ అడ్మినిస్టేట్ -
రూరల్ సర్వీస్‌ను రద్దు చేయాలి
ఆందోళనకు దిగిన జూ.వైద్యులు దత్తాత్రేయనగర్/సుల్తాన్‌బజార్: పీజీ వైద్యులు రూరల్ సర్వీస్ చేయాలనే ప్రతిపాదనను తొలగించాలని ఉస్మానియా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం ఆస్పత్రిలో అత్యవసర సేవల మినహా అన్ని సేవలు బహిష్కరించి గేటు వద్ద బైఠాయించారు. జూడాలు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కమిటీలు వేసి కాలయాపన చేశాయని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూరల్ సర్వీస్ చేయాలనే నిబంధనను తొలగించి, పీజీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించాలన్నారు. సుల్తాన్‌బజార్‌లో: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రుల్లోను జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. దీంతో వచ్చిన రోగులు ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం కోఠి డీఎంఈ కార్యాలయం ముందు జూడాలు బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సంఘీభావం తెలిపింది. జూడాల తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రద్దు చేసినట్టు సంవత్సర కాలం గ్రామాల్లో పని చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్, టీచింగ్ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిమ్స్‌తో సమానంగా రెసిడెన్షియల్ విధానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు. -
‘పౌర సంబంధాలు’ లేవయా..!
సమాచార శాఖకు నిర్లక్ష్యపు జబ్బు సరెండర్ చేసినా మారని అధికారుల తీరు సమన్వయ లోపంతో సతమతం ఫైళ్లు మాయమవుతున్నా.. పట్టింపు కరువు సాక్షి, హన్మకొండ : ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడం... పథకాలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రధాన విధి. జిల్లా పౌరసంబంధాల శాఖకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. కొంత కాలంగా ఈ విధులను పక్కనబెట్టేసింది. సాధారణ పాలన వ్యవహారాలను కూడా నిర్వహించలేని దుస్థితికి చేరుకుంది. పౌర సంబంధాల శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ జి.కిషన్ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన జిల్లా పౌర సంబంధాల అధికారి జిల్లా కేంద్రంలో ఉండకపోవడంతో చార్జ మెమో సైతం ఇచ్చా రు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల విషయంలో పౌర సంబంధాల శాఖ నిర్లక్ష్యపు ధోరణి కొనసాగడంతో కలెక్టర్ ఏకంగా డీపీఆర్ఓను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. జిల్లాస్థాయి అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. ఈ ఘటనతోనైనా... సమాచార, పౌరసంంధాల శాఖ యంత్రాంగంలో మార్పు వస్తుందని అందరూ ఆశించారు. కానీ... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వారి వైఖరి మారలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేకపోయూరు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై పలు శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతా అధ్వానం జిల్లాలో గతంలో డీపీఆర్ఓ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు. ఇద్దరు డివిజనల్ పీఆర్ఓలు, ఇద్దరు ఏపీఆర్ఓవలు సమన్వయంతో విధులు నిర్వర్తించేవారు. మేడారం జాతరలోనూ వారే పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మేరకు సమాచార శాఖ వ్యవస్థలో మార్పులు జరిగాయి. జిల్లా పౌర సంబంధాల అధికారి పోస్టును డిప్యూటీ డెరైక్టర్ పోస్టుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ మార్పు తర్వాత డీడీ పోస్టులోకి బాలగంగాధర తిలక్, డీపీఆర్ఓగా వెంకటసురేష్ వచ్చారు. అప్పటికే పరిపాలనా పరంగా అధ్వానంగా ఉన్న డీపీఆర్ఓ కార్యాలయంలో వీరిద్దరి రాక తర్వాత పరిస్థితి ఇంకా దయనీయంగా మారినట్లు సమాచారం. సమన్వయలోపంతో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కలెక్టర్ కార్యక్రమాల వివరాలను సైతం సమాచార సాధనాలకు చెప్పే పరిస్థితి లేకుండా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంతో కార్యాలయంలోని పలు కీలక ఫైళ్లు పోయాయి. ఇవి ఎన్ని అనే దానిపై స్పష్టత రావడంలేదని డీపీఆర్ఓ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పనితీరు సరిగా లేని కారణంగా డీపీఆర్ఓ వెంకటసురేష్‌ను కలెక్టర్ సరెండర్ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. గతంలో డీపీఆర్ఓగా పనిచేసిన ఒక అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించినా... సదరు వ్యక్తి బాధ్యతలను స్వీకరించలేదు. దీంతో పరిస్థితి మరింతగా దిగజారినట్లు తెలుస్తోంది. ఫలితంగా పౌర సంబంధాల శాఖ ఎవరికీ సంబంధం లేని శాఖగా మారింది. -
వ్యవసాయం కుదేలు
కేపీఆర్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీసీ బయ్యారెడ్డి ప్రభుత్వాల వైఖరే కారణం కోలారు : ప్రభుత్వాల ఉదాసీనత, ప్రైవేటీకరణ వైఖరి వల్ల రాష్ర్టంలో వ్యవసాయ రంగం కుదేలవుతోందని కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీసీ బయ్యారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కేపీఆర్‌ఎస్ తాలూకా ఏడవ సమ్మేళనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ప్రభుత్వాలు తిలోదకాలిచ్చాయని అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండటంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మరో వైపు రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయడం మండిపడ్డారు. దీంతో దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఓ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఆధారపడగా ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఇతర పార్టీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదన్నారు. రైతులకు వ్యవసాయ రుణంపై ఇచ్చే రాయితీలు కంపెనీల పాలవుతోందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పట్టులో ఐదు శాతం కోలారు నుంచే వస్తోందన్నారు. అయితే పట్టు ఉత్పత్తిదారుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు పట్టు చీర కొనే స్థితిలో లేరన్నారు. తాలూకాలో వర్షాలు లేక వ్యవసాయ కార్యకలాపాలు స్తంభించాయన్నారు. తక్షణమే ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఏడాదికి 200 పనిదినాలు కల్పించి రోజుకు రూ. 300 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. బగర్‌హుకుం సాగు భూములను పంపిణీ చేయాలని, శాశ్వత నీటి పారుదల సౌలభ్యాలు కల్పించాలని, పాడి, పట్టు పరిశ్రమను కాపాడుతూ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేపీఆర్‌ఎస్ జిల్లాధ్యక్షుడు పీఆర్ సూర్యనారాయణ, తాలూకా అధ్యక్షుడు కుర్కి దేవరాజ్, టీఎం వెంకటేష్, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతోనే..
పుంగనూరు: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలుస్తూ.. వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాను ముందుకు పోతున్నట్టు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పుంగనూరు మండలం పట్రపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజకీయరంగ ప్రవేశం చేపట్టిన రోజు నుంచి దశాబ్దాలుగా ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను పరిష్కరించడమే ఆశయం గా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతియేటా రెండుసార్లు నేరుగా ప్రజలను కలుసుకునేందుకు అధికార యం త్రాంగంతో వెళతానన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రెండుసార్లు పర్యటిస్తుండటంతో గ్రామ సమస్యలపై అవగాహన వస్తుందన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు అభివృద్ధికి కొంత మేరకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గ్రామ పర్యటనలు చేపట్టి, ప్రజలతో మమేకం కావాలని కోరారు. ఎన్నికలు వచ్చేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు మోసాలను జనం గుర్తించారని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి మినహా మరేమీ జరగలేదని తెలిపారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు స్వార్థంతో పేద ప్రజలను నట్టేట ముంచేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీమాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్రమణ్యయాదవ్, చంద్రారెడ్డి యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
జగడమే..!
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నడుమ అగాధం ఇరు రాష్ట్రాల మధ్య తీవ్రమవుతున్న కయ్యాలు పీపీఏల రద్దు నుంచి ఎమ్మెల్యే క్వార్టర్ల వరకు లొల్లే నువ్వా.. నేనా అన్నట్లు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రులు కీలకాంశాలపై ఎవరి వాదన వారిదే.. రాజీకి ససేమిరా ఉభయతారక పరిష్కారాలపై కేంద్రమూ వెనుకంజ సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ రోజురోజుకీ రెండు రాష్ట్రాల మధ్య ముదురుతున్న వివాదాలకు ఇవే నిదర్శనం. ఇవి కూడా మచ్చుకు కొన్నే! తెలుగు బంధాన్ని పంచుకుంటున్న ఇరు రాష్ట్రాలు.. ఇప్పుడు తగువులాడుకుంటున్నాయి. ప్రతి విషయంలోనూ నువ్వా నేనా అనుకుంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య పేచీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏ ఒక్కరూ మెట్టు దిగడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాలని ఓ సలహా ఇవ్వడమే తప్ప ఈ వివాదాల్లో పెద్దన్న పాత్ర పోషించేందుకు కేంద్రం విముఖంగా ఉంది. ఇప్పటికే విద్యుత్ వివాదంలో జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు విషయంలో కేంద్రం ఓ కమిటీని నియమించినా పరిస్థితిలో మార్పు లేదు. మరోవైపు ఈ జగడాలపై సయోధ్య సాధించే దిశగా చర్చలు జరిపేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చొరవ కనిపించడం లేదు. పెద్ద పెద్ద అంశాలు మొదలుకుని చివరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కేటాయింపు వంటి విషయాల్లోనూ కీచులాటలు చోటుచేసుకుంటున్నాయి. తమ నిర్ణయాలు, వాదనల పట్ల పట్టువిడుపులు ప్రదర్శించని రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చివరకు ప్రజలనే ఇబ్బందులకు గురిచేస్తోంది. పీపీఏల రద్దుతో మొదలు..: రాష్ర్ట విభజన జరిగిన కొత్తలోనే ఆంధప్రదేశ్ ప్రభుత్వం జెన్కో పీపీఏలను రద్దు చేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య లొల్లి మొదలైంది. అసలే విభజన కారణంగా కరెంటు లోటు ఏర్పడిన తమకు పీపీఏల రద్దు నిర్ణయంతో మరింత నష్టం వాటిల్లుతోందని తెలంగాణ సర్కారు రుసరుసలాడింది. దీనిపై కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) జోక్యం చేసుకుని ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించినా అంతిమంగా అదేమీ సత్ఫలితాలనివ్వలేదు. ఈలోపు సీలేరు విద్యుత్ కేంద్రం సహా పోలవరం ముంపు ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం చట్ట సవరణ చేపట్టడం.. ఇరు రాష్ట్రాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. కౌన్సిలింగ్‌పై గందరగోళం తెలంగాణ అభ్యంతరాలు చెబుతున్నా.. ఉన్నత విద్యా మండలి బుధవారం ఇంజనీరింగ్ ప్రవే శాల కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ అంశం సుప్రీం విచారణలో ఉందని, తమ ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడం తగదని అసహనం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజా నోటిఫికేషన్‌ను పట్టించుకోకూడదని నిర్ణయించింది. తమ కౌన్సిలింగ్ని తామే నిర్వహించుకుంటామని ఆ రాష్ర్ట విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కలిసి నాటకాలాడుతున్నారని విరుచుకుపడ్డారు. జేఎన్టీయూ వీసీని కూడా రంగంలోకి దింపి.. కాలేజీలకు అసలు అఫిలియేషన్లే లేవన్న కొత్త మెలిక పెట్టారు. అన్ని ప్రమాణాల మేరకు నడుస్తున్న కాలేజీలకే అఫిలియేషన్లు ఇస్తామని టీ-సర్కారు పేర్కొంది. అఫిలియేషన్లు లేని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఎలా నిర్వహిస్తారంటూ తన వాదనను తెరపైకి తీసుకొచ్చింది. నిజానికి పదేళ్ల పాటు ఉమ్మడి అడ్మిషన్లు ఉండాలని విభజన చట్టం పేర్కొంటోంది. అడ్మిషన్లు ఆలస్యమై పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండగా.. తమ ప్రమేయం లేకుండా విధాన నిర్ణయాలేమిటంటూ తెలంగాణ ప్రభుత్వం గుర్రుమంటోంది. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కనీసం హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా తెరవబోమని తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం బుధవారం ప్రకటించింది. దీంతో అయోమయంలో పడటం విద్యార్థులు, తల్లిదండ్రుల వంతైంది. విడివిడిగా అడ్మిషన్ల ప్రక్రియ ఎలా సాధ్యమో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. రవాణా వాహనాలపై పన్ను వివాదం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రవాణా వాహనాలపై చెక్‌పోస్టుల వద్ద పన్ను విధించాలని తెలంగాణ రవాణా శాఖ తాజాగా నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. టీ-సర్కారు ఆదేశాలపై స్టే విధిస్తూ.. ఉమ్మడి రాష్ర్టంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 2015 వరకూ వసూలు చేయొద్దని కోర్టు తీర్పునిచ్చింది. ఇక జాతీయ నిర్మాణ సంస్థ(నాక్) డెరైక్టర్ జనరల్(డీజీ) నియామకంపైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆర్ అండ్ బీ ఈఎన్సీని నాక్ డీజీగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. నాక్ భవనంలో ఒక ఫ్లోర్‌ను కూడా తీసేసుకుంది. అయితే, విభజన చట్టం ప్రకారం.. ప్రైవేటు సొసైటీగా ఏర్పాటైన నాక్కు ఏపీ సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నాక్ డీజీని ఏపీ సీఎం నియమించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే బుధవారం నాక్ డీజీగా ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబ్ను నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులిచ్చారు. అయితే ఆయనను బాధ్యతలు చేపట్టనివ్వబోమని తెలంగాణ ఉద్యోగులు భీష్మించుకున్నారు. స్థానికత చిచ్చు 1956 సంవత్సరం కన్నా ముందు నుంచి తెలంగాణలో ఉంటున్న వారినే స్థానికులుగా పరిగణిస్తామని, వారికి మాత్రమే ఫీజుల చెల్లింపు పథకాన్ని(ఫాస్ట్) వర్తింపజేస్తామని టీ-సర్కారు ప్రకటించడం, ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు కూడా జారీచేయడం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఈ ప్రాతిపదికపై హైదరాబాద్‌లో ఏళ్లుగా జీవిస్తున్న సీమాంధ్రులతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు ఆధ్వర్యంలో ఓ అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లివచ్చింది. తెలంగాణ సర్కారు నిర్ణయం ఇన్నాళ్లూ స్థానికతను నిర్ధారిస్తున్న రాష్ర్టపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని, 1956 ప్రామాణికతను ప్రస్తుతం ఫీజులకే పరిమితం చేసినా.. భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల విషయంలోనూ వర్తింపజేసే ప్రమాదముందని ఏపీ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడుతూ ఉత్తర్వులు జారీచేయడంతో.. వెంటనే కోర్టుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సిద్ధమైంది. దీనిపై ఏజీతో సంప్రదింపులు కూడా మొదలెట్టింది. ! క్వార్టర్లపైనా రచ్చ రచ్చ! తమ ఎమ్మెల్యేలకు కేటాయించిన క్వార్టర్లను వెంటనే ఖాళీ చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన క్వార్టర్లను ఏపీ ఎమ్మెల్యేలు వారం రోజుల్లో ఖాళీ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నీరు, విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని బుధవారం హెచ్చరించారు. వివాదాల జాబితా ఇంకెంతో.. - డెల్టా తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయిస్తే, వాటిని నారుమళ్లకు వాడేస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. తర్వాత బోర్డు జోక్యం చేసుకుని విడతల వారీగా నీటిని విడుదల చేయించింది. - ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను కృష్ణా ట్రిబ్యునల్ తాజాగా తేల్చాల్సి ఉంది. కానీ తమకు బచావత్ ట్రిబ్యునల్ నుంచీ అన్యాయమే జరుగుతోందని, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోణంలో ఎప్పుడూ వాదించలేదని, అందుకని అన్ని రాష్ట్రాల వాదనలు విని కొత్తగా వాటాలను పునఃకేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ లేవనెత్తింది. - తుంగభద్రపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ కెనాల్ ఎత్తు పెంపు వ్యవహారం కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల మధ్య కొట్లాటగా మొదలై.. ఇప్పుడు రెండు రాష్ట్రాల నడుమ వివాదంగా మారింది. పోలీస్ బందోబస్తుతో పనుల్ని త్వరగా చేయించాలని కర్ణాటకపై తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. - గోదావరి ప్రాజెక్టులకు సాగునీటి అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం మరో వివాదానికి తెరలేచింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ ధోరణి సరికాదంటూ కేంద్రానికి లేఖ రాయనుంది. - ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు విశేషాధికారాల్ని కల్పించాలని, ఈ మేరకు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ సమర్థిస్తోంది. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాల్సిన అవసరం లేదని వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ ముసుగులో రాజధానిని రాష్ట్రపతి పాలన కిందకు తీసుకొస్తున్నారని మండిపడుతోంది. - రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఉన్న ఉద్యోగుల పంపకంపై కసరత్తు చేస్తున్న కమలనాథన్ కమిటీ పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నట్లే వ్యవహరిస్తోందని, ఆ దిశలోనే మార్గదర్శకాల్లో 18ఎఫ్ పేరాను పొందుపరిచిందని తెలంగాణ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
లెక్క లేనితనం!
బందరు మున్సిపాలిటీలో అవకతవకలు ఆడిట్ అధికారులకు సహకరించని సిబ్బంది 15 రోజులుగా కొనసాగుతున్న ఆడిట్ రూ. 70 లక్షల ఖర్చుకు లెక్కలు లేని వైనం..! లోపాలపై ప్రభుత్వానికి నివేదిక ! మచిలీపట్నం మున్సిపాలిటీలోని లొసుగులను కప్పిపుచ్చేందుకు ఆడిట్ అధికారులకు సిబ్బంది ఏ మాత్రం సహకరించడంలేదు. అరకొర సమాచారం.. అడ్డగోలు సమాధానాల వల్ల ఆడిట్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇప్పటి వరకు సుమారు రూ.70లక్షల ఖర్చులకు లెక్కలు లేవని గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మున్సిపాలిటీకి గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మచిలీపట్నం టౌన్ : అతిపురాతన మున్సిపాలిటీగా పేరొందిన మచిలీపట్నం పురపాలక సంఘంలో అవకతవకలు కూడా అదే స్థాయిలో పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో లొసుగులపై పదేళ్లుగా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవటంతో సిబ్బందిని పట్ట పగ్గాల్లేవు. దీంతో జమాఖర్చులకు లెక్కా పత్రాలు కూడా లేకుండా పోయాయి. ఖర్చుల వివరాలు తెలిపే క్యాష్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఓచర్లు తదితర వివరాలేమీ ఇక్కడ కనిపించడంలేదు. మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు కూడా సరైన వివరాలు లేవని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆడిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పొంతనలేని సమాచారం.. మున్సిపల్ ఉద్యోగులు ఆడిట్ సిబ్బందికి అందజేస్తున్న సమాచారంలో పొంతన ఉండటంలేదు. పట్టణంలోని ఓ బ్యాంక్ ఖాతాలో ఉన్న దాదాపు రూ.70 లక్షలను వివిధ పనులకు వినియోగించినట్లు చెబుతున్నారు. మున్సిపల్ సిబ్బంది చెబుతున్న ఖర్చుకు సంబంధించిన పాస్ పుస్తకాలు, క్యాష్ పుస్తకాలు, డీడీల పుస్తకాలు లేకపోవటంతో ఆడిట్ సిబ్బంది ఏం చేయాలో అర్థంకాక అల్లాడుతున్నారు. 15 రోజులుగా ఆడిట్ మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2003-04 సంవత్సరం నుంచి ఆడిట్ జరగాల్సి ఉంది. గత పదిహేను రోజులుగా 2009-10 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆడిట్ అధికారులు ఏ రికార్డు అడిగినా మున్సిపల్ సిబ్బంది మాత్రం ఏసీబీ వారు తీసుకెళ్లారని చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లాలోని ఇతర ఏ మున్సిపాలిటీలో కూడా ఇంతగా ఆడిట్ పెండింగ్‌లు లేకపోవటం గమనార్హం. జమాఖర్చులకు సంబంధించి పాస్ పుస్తకాలు, క్యాష్ పుస్తకాలు, ఓచర్లు, రశీదులు ఆడిట్ అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఇవ్వకపోవటంతో ఆడిట్ ముందుకు సాగటం లేదు. ఇద్దరు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, ఏడుగురు ఆడిటర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. అయితే మున్సిపల్ సిబ్బంది నుంచి సహాయనిరాకరణ ఎదురవుతుండటంతో ఆడిట్ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఆడిట్ పూర్తికాకపోవటంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మున్సిపల్ సిబ్బంది సహకరించడం లేదు : ఆడిట్ ఆర్జేడీ మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది ఆడిట్ నిర్వహణకు ఏ మాత్రం సహకరించడం లేదని స్టేట్ ఆడిట్ ఆర్జేడీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆడిట్ ప్రక్రియను పరిశీలించేందుకు శనివారం మచిలీపట్నం వచ్చిన ఆయన సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీల్లో పెండింగ్ ఆడిట్‌ను ఆగస్టులోపు పూర్తిచేయాల్సి ఉందన్నారు. అందువల్లే తాము పంచాయతీరాజ్ ఆడిట్‌ను కూడా పక్కనబెట్టి మున్సిపాలిటీల ఆడిట్‌ను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వేరే ప్రాంతాలకు చెందిన ఏడుగురు ఆడిటర్లను, ఇద్దరు ఏఏవోలను డెప్యూటేషన్‌పై ఇక్కడికి పంపామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో అక్కడి సిబ్బంది ఆడిట్ అధికారులకు సహకరిస్తుండగా, మచిలీపట్నంలో మాత్ర పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఇక్కడున్న వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కమిషనర్ ఎ.మారుతిదివాకర్ను కలిసి ఆడిట్‌కు సహకరించాలని కోరారు. ఆర్జేడీ వెంట జిల్లా ఆడిట్ అధికారి ఎల్.ఫిరోజ్, ఏఏవోలు ఎ.వెంకన్నబాబు, ఎం.లక్ష్మీకుమార్, సీనియర్ ఆడిటర్ టీవీ రమణ, సిబ్బంది ఉన్నారు. -
ఆదివాసులను ఆగం చేయొద్దు
కల్వకుర్తి : ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను గౌరవించి పరి పాలన సాగించాలని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ఆదివాసీ గిరిజనులను ఆగం చేయడానికి కుట్ర పన్నిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావే శానికి కోదండరాంతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్‌లు అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రకృతి ఒడిలో ప్రజలను ఆహ్లాదపరుస్తున్న పాపికొండలు, అటవీ ప్రాంతం ప్రాజెక్టు నిర్మాణంతో కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ నిర్మించి నా 100కు గరిష్టంగా 5 నుంచి 10 ఎకరాల వరకు నష్టం వాటిల్లుతుందని, ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 22 శాతం నష్టం జరుగుతుందన్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసులను, నిరుపేదలను అణిచివేసే కుట్ర జరుగుతోందని కోదండరాం విమర్శించారు. ప్రజలు ఉద్యమించాలి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు, నాయకులు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని, ఈ సమస్యపై దేశవ్యాప్త చర్చ జరగాలని ప్రొ.హరగోపాల్ అభిప్రాయపడ్డారు. అమాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి అందరు ఒక్కతాటిపైకి వస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రకృతి ప్రళ యం వస్తే ఖమ్మం జిల్లాలోని ప్రజలతో పా టు, ఆంధ్ర ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు హాని కల్గిస్తుందన్నారు. విడిపోయినా ఉమ్మడి విధానాలా.? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా అనేక అంశాల్లో ఉమ్మడి విధానాన్ని కొనసాగించడం దుర్మార్గమని తెలంగాణ ఇంజనీయర్ల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ దేశ్‌పాండే విమర్శించారు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, హైకోర్టు, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్లను వేర్వేరుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం జరిగేవరకు పోరాటం పోలవరం బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని పాల మూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి స్పష్టం చేశారు. తమ సంఘం కేవలం జిల్లాకే పరిమితం కాద ని, తెలంగాణలోని 10 జిల్లాల్లో ఎక్కడ సమస్య తలెత్తినా పోరాటాలు చేయడానికి ముందుంటుందన్నారు. చుండూరు బాధితులకు న్యాయం జరగాల్సి ఉంద ని, వారి పోరాటానికి తమ మద్దతుం టుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, న్యాయవాదులు వెంకట్‌గౌడ్, రాంగోపాల్, రమేష్‌గౌడ్, జేఏసీ తాలూకా చైర్మన్ జంగయ్య, కన్వీనర్ సదానంద్‌గౌడ్, టీఎన్జీవో తాలూ కా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, ఆమన్‌గల్, వెల్దండ జేఏసీ నాయకులు, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకలు పాల్గొన్నారు. -
ఇది ‘పాడి’యేనా..!
పెరిగిన ఎండలతో కరువైన పశుగ్రాసం విలవిల్లాడుతున్న పశువులు జిల్లాలో 20 శాతం తగ్గిన పాల దిగుబడి వేసవికి లేని ప్రత్యేక ప్రణాళిక నివేదికలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు పాడి పంట అన్నారు పెద్దలు..పంటపోతే పాడి ఆదుకుంటుంది. ఆరుగాలం ఇంటిల్లిపాదీ కష్టించినా, వ్యవసాయం కలిసిరావడం లేదు. ఎంత ఎక్కువ సేద్యం చేపడితే అంత ఎక్కువ అప్పుల్లో రైతు కూరుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు పాడివైపు ఆసక్తి చూపుతున్నారు. పశుపోషణ చేపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏకైక మార్గమైన పాడికి నేడు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఉదాశీనత కారణంగా ఈ రంగం కూడా రైతుకు ఆదరవు కాకుండా పోతోంది. మరో పక్క ఎండలు పెరగడంతో పశుగ్రాసం కొరత ఏర్పడి పరోక్షంగా పాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. నర్సీపట్నం/యలమంచిలి: పాడిపరిశ్రమపై ఎండల ప్రభావం కనబడుతోంది. పశుగ్రాసం కొరతతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. వాటిపోషణకు అన్నదాతలు అష్టక ష్టాలు పడుతున్నారు. వేలాది కుటుంబాలను ఆదుకుంటున్న పాడిపరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా ఆవులు నాలుగు లక్షలు, గేదెలు రెండు లక్షల వరకు ఉంటాయి. వీటిలో 50 శాతం పశువులు పాల దిగుబడిని ఇస్తుంటాయి. వీటి నుంచి రోజుకు లక్షల లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. విశాఖ డెయిరీ, సుప్రజ, హెరిటేజ్, తిరుమల డెయిరీలు రైతుల నుంచి పాలు సేకరించి, వివిధ రకాలైన ఉత్పత్తుల ద్వారా అమ్మకాలు చేస్తుంటారు. ఎండల తీవ్రత, వర్షాభావం కారణంగా విశాఖ డెయిరీ పాలసేకరణ జూన్ 5 నాటికి 7.02లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 6.66లక్షల లీటర్లకు దిగజారింది. జిల్లాలోని పలు ప్రైవేట్ డెయిరీలలోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పశువులకు రోజుకు 1.25 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరమవుతుంది. రైతులు మెట్టభూముల్లోనే పశుగ్రాసం పెంపకం చేపడతారు. వర్షాభావంతో పంటపొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. అంతటా పశుగ్రాసం కొరత ఏర్పడింది. మార్కెట్లోదాణా ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. కనీసం పశువులకు తాగునీరు కూడా అందించలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పాలసేకరణ చేస్తున్న యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాల దిగుబడి తగ్గిపోయింది. విశాఖ డెయిరీకి రోజుకు రెండువేల లీటర్ల వరకు సరఫరా చేస్తున్న పలు పాల సేకరణ కేంద్రాలకు ప్రస్తుతం వెయ్యి లీటర్లకు మించి రావడం లేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ఎక్కువమం ది రైతులు పాడిపరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు నుంచి మూడు పశువులు ఉంటున్నాయి. ఇక పల్లెల్లో పలువురు యువకులు పాడిపడిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా పలువురు రైతులు ఎండలకు భయపడి ఇళ్లవద్దనే అందుబాటులో ఉన్న ఎండుగడ్డితో కాలం నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో కిలో తౌడు రూ.10ల నుంచి రూ.15లు, నూకలు రూ.20నుంచి రూ.25ల వరకు ఉండడంతో దాణా కొనుగోలు రైతులకు ఆర్థిక భారంగా మారింది. విశాఖ డెయిరీ ద్వారా సరఫరా చేసే దాణా ధరలు కూ డా నెలన్నర క్రితం పెంచేశారు. ప్రస్తుతం 50 కిలోల దాణా రు.550లకు రైతులకు పంపిణీచేస్తున్నారు. జిల్లాలో పలు పాల సేకరణ కేంద్రాల్లో గత 20రోజులుగా దాణా అందుబాటులో లేకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పాలదిగుబడిపై ప్రభావం కనబడుతోంది. పూటకు రెండు లీటర్ల వరకు పాలిచ్చే పశువు లీటరుకంటే తక్కువ ఇస్తోందని చెబుతున్నారు. దీంతో రోజువారీ ఆదా యం తగ్గి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసవి ప్రణాళిక ఏదీ? జిల్లాలో అధికశాతం వర్షాధార భూములు కావడంతో ఏటా వేసవిలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో పాడి రైతులకు రాయితీపై ఎండుగడ్డిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది అటువంటి ప్రణాళికకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాస్తున్న ఎండలపై స్పందించిన ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పశువులకు ఎంత గ్రాసం అవసరముంది? అందుబాటులో ఎంత ఉంది? ఎంత మేర అవసరం? అనే దానిపై పూర్తి వివరాలివ్వాలంటూ ఆదేశించింది. దీనిపై వెటర్నరీ జేడీ వి.వెంకటేశ్వరావు మాట్లాడుతూ వేసవిలో గ్రాసం కొరతపై నిల్వ విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న పశుగ్రాసం కొరతపై ప్రభుత్వానికి నివేదించి, వారి ఆదేశం మేరకు తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. -
పేదలకందని ‘ప్రయివేటు’ విద్య
ఉచిత విద్యకు యాజమాన్యాలు ససేమిరా అమలు కాని విద్యాహక్కు చట్టం స్పందించని ప్రభుత్వాలు నష్టపోతున్న పేద విద్యార్థులు నర్సీపట్నం : పేద విద్యార్థుల్లో విద్యా సుగంధాలు పరిమళించేందుకు ప్రభుత్వాలు ప్రత్యే క చట్టాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో దానికి అనువైన పరిస్థితులు కల్పించకపోవడం వల్ల అమలు కావడం లేదు. ప్రభుత్వ విద్యను మెరుగుపరచడం, పేద విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ప్రయివేటు విద్యాసంస్థల్లోనూ పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. కానీ దీనిపై ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఒప్పందం కుదరలేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. దీనికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. ఒకటి నుం చి 8 తరగతుల వరకు వీటిని అమలు చేయా లి. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తే జిల్లాలోని ప్రస్తుతమున్న సుమా రు 700 పాఠశాలల్లో 25 వేలకు మించి విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రయివేటు పాఠశాలల్లో అందించే విద్యకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇందుకు అంగీకరించలేదు. తమ సంస్థల్లో మంచి వసతులతో నాణ్యమైన విద్యా బోధన ఉంటుంది కాబట్టి ఫీజుల్ని మరింత పెంచాలని డిమాండ్ చేశాయి. ఆ విధంగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలంటూ ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై అయిదేళ్లుగా ఏమీ తేలకపోవడంతో ఒక వ్యక్తి ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటిస్తే పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. -
ఏ పేరులో ఏముందో?!
విడ్డూరం పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బోలెడన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఏ పేరైతే పిలవడానికి బాగుంటుంది, ఏ పేరైతే కలిసి వస్తుందంటూ వంద లెక్కలు వేస్తారు. అయితే కొన్ని దేశాల్లో మన లెక్కలు పని చేయవు. ఎందుకంటే... కొన్ని పేర్లను ఆయా ప్రభుత్వాలు నిషేధిం చాయి. మనకి ఎంత నచ్చినా కూడా ఆ లిస్టులో పేరు కనుక పెట్టామో... జైలుకు పోవాల్సిందే! మలేసియాలో పిల్లలకు జంతువులు, పురుగులు, పండ్లు, కూరగాయలు, రంగుల అర్థాలు వచ్చే పేర్లు పెట్టకూడదు. హిట్లర్, వోతీ లాంటి చాలా పేర్ల మీద అక్కడ బ్యాన్ ఉంది. ఐస్‌ల్యాండ్‌లో క్రిస్టీ/క్రిస్టా, కరొలినా లాంటి పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే వాటిలో ‘సి’ అనే అక్షరం ఉంటుంది కదా! ఆ దేశ అక్షరమాలలో ‘సి’ ఉండదు. కాబట్టి ఆ అక్షరంతో వచ్చే పేర్లు పెట్టకూడదు! పేర్ల విషయంలో నార్వే దేశం చాలా కఠినంగా ఉంటుంది. కొన్ని వేల పేర్ల మీద నిషేధం ఉంది ఆ దేశంలో. వాటిలో ఏదైనా పెడితే కేసు పెడతారు. గతంలో ఓసారి... అధికారులు చెప్పినట్టుగా తన బిడ్డ పేరు మార్చనందుకు ఓ మహిళను రెండు రోజులు జైల్లో కూడా పెట్టారు! జర్మనీలో ఆండర్సన్ అన్న పేరు పెట్టకూడదు. అదే విధంగా టేలర్, టాబీ, రిలే, క్విన్ లాంటి పేర్ల మీద నిషేధం ఉంది. లింగ నిర్థారణ చేసే విధంగా పేర్లు పెట్టడానికి ఆ దేశం ఒప్పుకోదు! న్యూజిలాండ్‌లో ప్రిన్స, ప్రిన్సెస్, కింగ్, మేజర్, సార్జెంట్, నైట్ లాంటి పేర్లు పెట్టకూడదు. అవి స్థాయిని సూచిస్తాయి కాబట్టి కొందరి మనోభావాలు దెబ్బతింటాయంటుందా ప్రభుత్వం! పోర్చుగల్ ప్రభుత్వం నిషేధించిన పేర్ల జాబితా దాదాపు 41 పేజీలు ఉంటుంది. కారణమేంటో తెలియదు కానీ... అందులో మోనాలిసా అన్న పేరు కూడా ఉంది. అంతేకాదు... అక్కడ పిల్లలు పుట్టే సమయానికే పేరు ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకంటే బర్త సర్టిఫికెట్లో నమోదు చేసిన పేరునే జీవితాంతం ఉపయో గించాలి. ముద్దు పేరు రాస్తే కుదరదు! -
పండ్ల మీద పన్ను..
కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా పన్నుల మోతకు ఎవరూ అతీతం కాదు. ఆదాయపు పన్ను కావొచ్చు లేదా అమ్మకం పన్ను కావొచ్చు.. ప్రాపర్టీ ట్యాక్సు కావొచ్చు ఏదో ఒక రూపంలో వడ్డన ఉంటూనే ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని చిత్ర విచిత్ర పన్నులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని.. వెండింగ్ మెషీన్ ఫ్రూట్ ట్యాక్స్.. తాజా పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలో వెండింగ్ మెషీన్ల నుంచి కొంటే మాత్రం పర్సుకు చేటు చేస్తాయి. ఎందుకంటే.. మెషీన్ల నుంచి తాజా ఫలాలపై కాలిఫోర్నియాలో 33% పన్ను వడ్డిస్తారట. అమెరికాలో టాప్ 10 అసాధారణ పన్నుల్లో ఇది చోటు దక్కించుకుంది. సిగరెట్ల మోత.. సిగరెట్ల మీద భారీ ట్యాక్స్‌లతో ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే, చైనాలోని హుబై ప్రావిన్స్ మరో అడుగు ముందుకెళ్లింది. ప్రజలు మరింత ఎక్కువగా సిగరెట్లు తాగేలా ప్రోత్సహించి.. తద్వారా మరింత పన్నులను రాబట్టుకోవడంపై దృష్టి పెట్టింది. సంక్షోభాల నుంచి ఎకానమీ సురక్షితంగా ఉండాలంటే అధికారులు ఏటా 400 కార్టన్ల సిగరెట్లు ఊదిపారేయాలంటూ 2009లో హుబై ప్రావిన్స్‌లోని ఒక గ్రామం ఆదేశించింది. టీచర్లకు కూడా స్మోకింగ్ కోటా విధించింది. టార్గెట్లు అందుకోకపోయినా.. పక్క రాష్ట్రాల కంపెనీల సిగరెట్లు తాగుతూ పట్టుబడినా జరిమానాలతో వాతలు పెట్టింది. టాటూలపై ట్యాక్స్ అమెరికాలోని ఆర్కాన్సాస్ ప్రభుత్వం 2005లో టాటూలపైనా ట్యాక్స్ విధించి ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రోలసిస్ ట్రీట్మెంట్ను కూడా ఇందులోకి చేర్చింది. -
ఇల్లు.. నిల్లు..
అర్ధంతరంగా మాయమైన ‘వాంబే’ పదేళ్లుగా పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో దాదాపు పది లక్షల మంది సొంత ఇళ్లు లేక అల్లాడుతున్నారు. వీరిలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన పేదలే ఎక్కువ. ఇలాంటి పేదల కోసం ప్రభుత్వాలు పలు గృహనిర్మాణ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. వేటినీ సవ్యంగా పూర్తి చేయకపోవడంతో పేదల సొంతగూడు కల నెరవేరడం లేదు. ఆరంభ శూరత్వంగా ప్రారంభమై, అవాంతరాలతో మధ్యస్తంగా నిలిచిపోయిన పలు గృహనిర్మాణ పథకాల్లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) ఒకటి. దాదాపు దశాబ్దం క్రితమే ఈ పథకం ప్రారంభించినప్పటికీ, నేటికీ లబ్ధిదారుల ఎంపికే పూర్తికాని దుస్థితి. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త సర్కారు హయాంలోనైనా పేదల సొంతగూటి కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే. దశాబ్దం కిందట ప్రారంభమైనా.. దాదాపు దశాబ్దం క్రితం పేదలకు గృహ సదుపాయం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6,036 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో 19 కాలనీల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను దాదాపు రూ.92.30 కోట్లు ఖర్చు కాగలదని అప్పట్లో అంచనా వేశారు. ఇందులో రూ. 80.86 కోట్లు గృహనిర్మాణాలకు కాగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.44 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అనంతరం ఆ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి జీహెచ్ఎంసీకి బదలాయించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడం.. ఎంపికైన లబ్ధిదారులు తాము చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించకపోవడం.. లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడం.. తదితర కారణాలతో ఈ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పథకం అమలుపై శ్రద్ధ చూపేవారు కరవై పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కొన్ని కాలనీల్లో పూర్తయిన ఇళ్లు ఆక్రమణల పాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల స్థానే థర్డ్‌పార్టీలు చేరాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్టిం చుకునే అతీగతీ లేకుండా అసంపూర్ణంగా మిగిలాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులే చేరినప్పటికీ.. చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించలేదు. మొత్తానికి పథకం నిష్ర్పయోజనమైంది. -
సాకారం కానున్న కలల ‘మెట్రో’
గడువులోగా గమ్యం సాకారం కానున్న కలల ‘మెట్రో’ జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో ట్రయల్ రన్ హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ వర్గాల ఆశాభావం మెట్రో రైల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నగర వాసి కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ... కొలువుదీరనున్న నూతన ప్రభుత్వాలు లాంటి హడావుడిలున్నా గడువులోగానే మెట్రోరైలు పట్టాలెక్కనుంది. 2017 జనవరి ఒకటి నాటికి అనుకున్న లక్ష్యాన్ని సాధించనుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 20 లక్షలమంది ప్రయాణికులకు ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి విముక్తి కల్పించనుంది. సాక్షి,సిటీబ్యూరో : నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం మెట్రో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. విభజనప్రభావం మెట్రో పనులపై పడబోదని హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ, నిధుల కేటాయింపు, అవసరమైన ఒప్పందాలు తదితర ప్రక్రియలన్నీ 2011 చివరి నాటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఎల్అండ్టీ సంస్థ పలు జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనుంది. ఈ విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు ఎదురుకాబోవని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడా,మియాపూర్-ఎస్.ఆర్‌నగర్,ఎల్బీనగర్-మలక్‌పేట్,మెట్టుగూడా-బేగంపేట్ రూట్లలో పిల్లర్లు,వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు,స్టేషన్ల నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)ప్రాజెక్టుగా పేరొందిన హెచ్ఎంఆర్ (హైదరాబాద్ మెట్రో రైల్) పథకాన్ని రూ.16,112 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ఎల్అండ్టీ సంస్థ రూ.12,674 కోట్లు, కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1458 కోట్లు కేటాయించనున్నాయి. భూసేకరణ,స్థిరాస్తులకు పరిహారం చెల్లింపు, పునరావాసం, స్కైవాక్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1980 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు పనులు మే 2012లో మొదలయ్యాయి. త్వరలో ట్రయల్ రన్.. నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రూట్లో జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో మెట్రో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రూట్లో ఇప్పటికే మెట్రో పట్టాల్ పరుచుకున్నాయి. సిగ్నలింగ్, విద్యుదీకరణ పనులు త్వరలో పూర్తికానున్నాయి. ఇటీవలే మెట్రో రైలు కొరియా నుంచి ఉప్పల్ మెట్రో డిపో చేరిన విషయం విదితమే. కాగా ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో అత్యాధునిక మెట్రో స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పక్షి ఆకృతిలో ఉండే ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దేందుకు కార్మికులు,నిపుణులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.ఉప్పల్ మెట్రో డిపో పనులు కూడా సుమారు 85 శాతం మేర పూర్తయ్యాయి. ఇప్పటికి 42 శాతం పనులు పూర్తి మూడు కారిడార్ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 2748 పిల్లర్లకు గాను ఇప్పటివరకు 892 పిల్లర్ల ఏర్పాటు, వాటి మధ్య వయాడక్ట్ సెగ్మెంట్ల అమరిక పూర్తి. నాగోల్-మెట్టుగూడా రూట్లో పిల్లర్లు,సెగ్మెంట్ల అమరిక, పట్టాల ఏర్పాటు. మొత్తం ప్రాజెక్టు పనుల్లో 42 శాతం పనులు పూర్తయ్యాయి. 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 30 కిలోమీటర్లలో పనులు త్వరలో పూర్తి. -
మద్దతు మూరెడు..ఖర్చు బారెడు
2013-14కు వరి మద్దతు ధర పెంపు గత ఏడాది కంటే కేవలం రూ.60 పెంచిన కేంద్రం ధరల పెరుగుదల..ప్రకృతి విపత్తులతో అన్నదాతలు కుదేలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ధరల పెరుగుదల ఒకవైపు.. ప్రకృతి విపత్తులు మరోవైపు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అరకొరగా చేయి విదిలిస్తూ చేతులు దులుపుకొంటున్నాయి. నష్టపరిహారాల మాటెలా ఉన్నా.. వరి మద్దతు ధర పెంపు విషయంలో కేంద్రం రైతులపై కనికరం చూపడం లేదు. దీంతో పంటల పెట్టుబడికి.. దిగుబడిపై వస్తున్న రాబడికి పొంతన లేకుండా పోతోంది. ఈ ఏడాదైనా వరి మద్దతు ధరను కేంద్రం అధికంగా పెంచుతుందని రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. అయితే ఈ ఏడాది కూడా క్వింటాకు కేవలం రూ.60 వరకు మాత్రమే పెంచి రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో రబీ వరి కోతలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. వాతావరణం సహకరిస్తే ఖరీఫ్ సాగును సకాలంలో చేపట్టాలని భావిస్తున్నారు. రూ.60 పెంపు ఏటా ఖరీఫ్ సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు మే, జూన్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం వరితో పాటు వివిధ రకాల పప్పుధాన్యాలకు మద్దతు ధర పెంచడం ఆనవాయితీ. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ(సీఏసీపీ) వరి, గోధుమ, ఇతర పప్పుధాన్యాలకు ఎంత వరకు మద్దతు ధర పెంచాలనే దానిపై నివేదిక ఇస్తుంది. దీనికి అనుగుణంగా తొలుత వ్యవసాయ శాఖ, తరువాత ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నాక కేంద్రం మద్దతు ధర పెంచుతుంది. అయితే గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో పర్యటించిన సీఏసీపీ చైర్మన్ అశోక్ గులాటీ వరికి మూడేళ్ల పాటు మద్దతు ధర పెంచే అవకాశం లేదని ప్రకటించారు. ఇప్పటికే వరికి మద్దతు ధర ఎక్కువగా ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల సమయం కావడంతో కేంద్రం మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2013-2014కు సంబంధించి ధాన్యం సాధారణ రకం క్వింటాకు రూ.1310, గ్రేడ్-ఎకు రూ.1345గా పెంచారు. గత ఏడాది సాధారణ రకానికి రూ.1250, గ్రేడ్-ఎకు రూ.1280గా ఉండేది. గత ఏడాది కంటే కేవలం రూ.60, రూ.65 మాత్రమే పెంచడంతో రైతన్నలు నైరాశ్యంలోకి జారుకున్నారు. ధరలు విపరీతం పంటల సాగుకు రైతులు కష్టకష్టాలు పడుతున్నారు. విత్తనాల నుంచి కూలీల వరకు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా పెట్టుబడులు రెట్టింపవుతున్నాయి. కానీ దిగుబడిపై వస్తున్న రాబడి మాత్రం కనిపించడం లేదు. దీంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ఖరీఫ్ సగటు పెట్టుబడి ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దిగుబడి ఎకరాకు 26 నుంచి 28 బస్తాలు(ఒక్కో బస్తా 75 కేజీలు) వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రైతుకు ఎకరాకు రూ.2 వేలు నుంచి రూ.2500 మించి మిగిలే పరిస్థితి లేదు. మూడేళ్లుగా వరుసగా కరువు, వరదలు కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో రైతులు లాభాలను మరిచిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. రుణ అర్హత కార్డులు ఉన్నా కూడా రుణాలు అందక.. అప్పులు చేసి వేసిన పంట చేతికందక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ధర పెంపుపైనే రైతులు ఆశలు పెట్టుకోగా కేంద్రం ఊసూరుమనిపించింది. స్వామినాథన్ సిఫార్సులపై ఆశలు వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు గతంలో ఎన్డీఏ ప్రభుత్వ సారధి వాజ్‌పాయి నియమించిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మోడీ నేతృత్వంలో ఏర్పడే ఈ ఎన్డీఏ ప్రభుత్వమైనా నెరవేరుస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ కమిటీ సిఫార్సుల్లో ప్రధానమైనది లాభసాటి ధర. పంట దిగుబడికి 50 శాతం లాభాన్ని కలిపి దాన్నే మద్దతు ధరగా ప్రకటించాలని స్వామినాథన్ సూచించారు. ఆ సిఫార్సులను యూపీఏ ప్రభుత్వ పక్కనపెట్టింది. ప్రస్తుతం ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టడంతో ఆ సిఫార్సులు అమలుకు నోచుకుంటాయో లేదో వేచి చూడాలి మరి. -
ఒకే సచివాలయం..రెండు ప్రభుత్వాలు