మాట్లాడుతున్న ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను వ్యాపారీకరణ చేస్తున్నాయని అఖిల భారత డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ఆరోపించారు.
► ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర
అనంతపురం, సప్తగిరి సర్కిల్ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను వ్యాపారీకరణ చేస్తున్నాయని అఖిల భారత డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తూ పేదలకు విద్యను దూరం చేస్తోందన్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహానికి విద్యార్థులు బలవన్మరణాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంతో మత భావాలను, అశాస్త్రీయమైన భావాలను విద్యార్తులపై రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 27,28 న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్ యూసీఐ జిల్లా కార్యదర్శి అమర్‌నాథ్ ,ఏఐడీఎస్‌ఓ జిల్లా అ«ధ్యక్షుడు నాగరాజు, తదతరులు పాల్గొన్నారు.