breaking news
Education Department
-
నానాకాలం చదువులు
‘వానాకాలం చదువు’లంటారు. ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల వానకీ, చదువుకీ చుక్కెదురే. చెట్ల కిందో, అరుగుల మీదో, అంతంతమాత్రపు కప్పు కిందో బడులు నడిపేటప్పుడు; చక్కా నడిచి పోడానికి పక్కారోడ్లు లేనప్పుడు వానాకాలంలో చదువుకు గంట కొట్టి ఇంటికి పరిమితమవక తప్పదు. వెనకటి కాలంలో చదువు చెప్పే రోజులతో సమానంగా నిషేధించే రోజులూ ఉండేవి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి మొదలైన తిథుల్లో, గ్రహణం పట్టినప్పుడూ అధ్యయనం కూడదు. వాటిని ‘అనధ్యయన దినా’లనేవారు. వేదాలు, ఇతర రహస్య విద్యల వల్లింపైతే వర్షాకాలంలో పూర్తిగా నిషిద్ధం. నేర్చుకున్నది మాత్రం నెమరు వేసుకోవచ్చు. క్రమంగా కేలండర్ మారిపోయి వర్షర్తువూ, చదువుల ఋతువూ ఒకేసారి మొదలవడం ప్రారంభించాయి. మినహాయింపులున్నా ఆ రెంటి మధ్యా వైరుద్ధ్యం పోయి సయోధ్య వెల్లివిరుస్తోంది. వానలతో పచ్చదనాన్ని తెచ్చుకుని కొత్త ఉత్సాహాన్ని నింపుకొనే ప్రకృతితో చదువుల ఋతువు పోటీపడుతూ రహదారులనూ, బడితావులనూ పిల్లల సందడితో వర్ణరంజితమూ, కర్ణరంజితమూ చేస్తోంది. మరోపక్క విచిత్రంగా ముల్లు ఈ కొస నుంచి పూర్తిగా దాని వ్యతిరేక దిశకు తిరగడమూ జరుగుతోంది. చదువుల అభావ దినాలు పోయి ఉల్బణ దినాలు వచ్చాయి. ఋతు నిర్బంధాలూ, తిథివార నిషేధాలూ పోయి చదువుల కేలండర్ ‘సార్వకాలికత’ను తెచ్చుకుంటోంది. వానా కాలం చదువులు పోయి నానాకాలం చదువులొచ్చాయి. అది మరోరకం వైపరీత్యానికి దారి తీసింది. అంతటా కాకపోయినా, అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో వేసవి సెలవులు కుదించుకుపోతున్నాయి. ప్రత్యేకించి పబ్లిక్ పరీక్షలు రాయబోయే పిల్లలకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ పైన వేసవి పొడవునా ట్యూషన్ తరగతులకు హాజరవడం అనివార్యమవుతోంది. భుజాలను వంచే పుస్తకాల బరువుకు తోడు మస్తకాలను భయాందోళనలతో నింపే చదువు బరువూ పెరిగిపోతోంది. ‘స్కూలు వర్కు’ను మించి ‘హోము వర్కు’ నివ్వడంతో బడికీ, ఇంటికీ తేడా చెరిగిపోయి, వేరే వృత్తి ఉద్యోగాల్లో తలమునకలయ్యే తల్లితండ్రులే టీచర్లు గానూ మారి, అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. తల్లుల పరిస్థితి మరీ ఘోరం. ఉద్యోగానికి అదనంగా వంటపనీ, ఇంటిపనీ, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే ఉపాధ్యాయిని పాత్రనూ పోషించవలసి వస్తోంది. స్త్రీ, పురుష బాధ్యతల మధ్య అసమానతలు కొనసాగుతున్న పరిస్థితిలో గృహిణికి ఇదెంత భారమో ఊహించగలం. స్కూలు ఫీజులూ, ఇతరత్రా వసూళ్ల రూపంలో వేలు, లక్షలు ధారపోస్తున్నా తల్లితండ్రులకు ‘టీచరీ’ రూపంలో ఈ అదనపు చాకిరీ తప్పడం లేదు. ఆటపాటలతో సహా ఇతరేతర మానసికోల్లాసాలకు ఒకటి, రెండు గంటలైనా ఒత్తిడి లేని స్వేచ్ఛా సమయం చిక్కని పిల్లల పాలిట చదువు అక్షరాలా ‘నిర్బంధ’ విద్యే అవుతోంది. విద్యాసంస్థలు చదువు బరువు తగ్గించకుండానే అదనపు వేళల్లో ఆటపాటల బరువునూ మోపడంతో పిల్లలకసలే ఊపిరి సలపడం లేదు. దేశంలో విద్యాబోధన ఎంత శాస్త్రీయంగా జరుగుతోందో పట్టించుకునే వ్యవస్థ అసలేదైనా ఉందా, చదువులు పిల్లల శారీరక మానసిక వికాసానికేమైనా సాయపడు తున్నాయా అన్న ప్రశ్నలు తల్లితండ్రుల నుంచే ఎదురవుతున్నాయి. పరీక్షలలో సాధించాల్సిన మార్కుల గరిష్ఠ శాతం కూడా ఇప్పుడు మారిపోయింది. తదుపరి చదువుకు ఏ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలోనైనా సీటు రావడానికి డెబ్బై, ఎనభై శాతం మార్కులు కూడా సరిపోవడం లేదు, తొంభై శాతం దాటి తీరాల్సిందే. దాంతో పిల్లల్లో పోటీ, అసూయ, అలజడి, ఆందోళన, ఒత్తిడి పెరిగి పోతున్నాయి. తమ చదువూ, భవిష్యత్తుల గురించి తల్లితండ్రులు కనే కలల భారం పిల్లల కను రెప్పల మీద పడి వాళ్ళ నిద్రను హరిస్తోంది.పిల్లల్లో గ్రహణశక్తి, చురుకుదనం పెరిగిన మాట నిజమే కానీ, మొత్తంగా నేటి ఈ చదువుల తీరు ఆదర్శవంతమేనా అన్న సందేహం మాత్రం వదలకుండా వేధిస్తూనే ఉంది. ఇక చదువుల్లో రకరకాల అసమానతలు పెరగడమే తప్ప తగ్గుతున్న జాడలేదు. ఉజ్జ్వల భవిష్యత్తు వైపు నడిపించే చదువుల నిచ్చెనపై చివరి మెట్ల మీద చతికిల బడుతున్నవారు నేటికీ అసంఖ్యాకమే. ఇంకోవైపు నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రభుత్వాలు ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. నూటయాభయ్యేళ్ళ క్రితం, బ్రిటిష్ వలస పాలన ప్రారంభం నాటికి మూడు శాతం పైచిలుకు ఉన్న అక్షరాస్యత ఇప్పుడు ఎనభై శాతానికి చేరడం, విడిగా చూసినప్పుడు ఒకింత ఊరటే కానీ, ఎన్నో దేశాలతో పోల్చితే ఈ పెరుగుదల వేగమూ, శాతమూ ఏమంత విశేషం కావని పెదవి విరిచేవారూ ఉన్నారు. ఇందులో మళ్ళీ ప్రాంతీయంగా, జెండర్ పరంగా అంతరాలూ యథాతథం. ఎప్పుడో కానీ సోదిలోకి రాని ఈశాన్య రాష్ట్రాలు అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండటం ఒక విశేష మైతే, ఎంత ప్రామాణికమో తెలియదు కాని, బిహార్‌తో కలసి ఆంధ్రప్రదేశ్ ఆ పట్టికలో అడుగు బొడుగు స్థానాలలో కనిపించడం కలవరపరిచే విషయం. ఇక చదువుల నాణ్యత విషయానికొస్తే, పట్టికలో మన దేశం స్థానం ఉసూరుమనిపించే మరో అధ్యాయం. చదువుకీ, మంచి రాబడిగల ఉద్యోగాలకూ పీటముడి పడిన దశలో విద్యాభ్యాసం పూర్తిగా పరుగు పందెంగా మారి పిల్లల్ని విపరీత శ్రమకూ, అలసటకూ గురిచేస్తున్న మాట నిజం. చదువుల మరో పరమార్థమైన జ్ఞాన సముపార్జనకు కూడా పెద్ద పీట వేస్తూ ఎప్పటికది నిలకడ తెచ్చుకుంటుందో, పిల్లల్ని పరీక్షల భయతీరాన్ని దాటించి వైజ్ఞానికపు వెలుగుల ఉల్లాస తీరం వైపు నడిపిస్తుందో కాలమే తేల్చాలి. -
ప్రపంచ దేశాల ప్రోగ్రెస్ కార్డు
ఒక చిన్న పాఠశాల గది నుంచే ఒక దేశం మారవచ్చు ఒక నోట్‌బుక్ పేజీ నుంచే ఒక తరం చరిత్రను తిరగరాయవచ్చు అందుకే, ప్రపంచం మొత్తం విద్యావిధానమే అభివృద్ధికి ఆలంబన కాగలదని విశ్వసిస్తోంది.ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఒక అద్భుతమైన రేసులో ఉన్నాయి. అయితే, ఇది రన్నింగ్ రేసు కాదు, రీడింగ్ రేసు! ఈ రేసులో పరుగులు తీసేది విద్యార్థులే అయినా, ఫలితాలు మాత్రం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇక్కడ కుల, మత, వర్ణ భేదాలకు చోటు లేదు – ఒక్కటే అవసరం: విద్యపై నిబద్ధత! దేశాలన్నీ పాఠశాల వేదికపై ఎగబడి, చదువు అనే శక్తిమంతమైన ఆయుధంతో భవిష్యత్తులో తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇందుకోసం, ఆ పక్కన క్యాలిక్యులేటర్ పెట్టుకుని, స్మార్ట్ బోర్డు ముందు నిలబడి, ల్యాబ్ కోట్స్ వేసుకుని ప్రభుత్వాలు తమ విద్యా వ్యవస్థలపై ఉన్న విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి.కాని, ఈ రేసులో ఎవరు ముందున్నారో, ఎవరు ఇంకా నిద్రలోనే జోగుతున్నారో తెలుసుకోవడానికి ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ సంస్థ 2025 సంవత్సరానికి విద్యా నాణ్యత ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని దేశాలు దుమ్మురేపేలా టాప్ గేర్‌లో దూసుకెళ్తుంటే, మరికొన్ని మాత్రం ఖాళీ బ్యాగు వేసుకుని, ఫస్ట్ పీరియడ్ మిస్ చేసుకున్నట్లుగా దిగాలుగా ఉంటున్నాయి. ఇంకా, ఇందులో ఏ దేశానికి పరీక్షల్లో ఎన్ని మార్కులొచ్చాయి? ఎవరు టాప్ స్కోర్ కొట్టారు? ఎవరు ‘పాస్’ అయ్యారు? మరెవరు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో రెడ్ లై¯Œ దాటి నిలబడినవాళ్లు? వంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచ విద్యా పోటీకి ఒక స్పష్టమైన ఫలితాల బోర్డు ఇది!ప్రపంచ దేశాల విద్యా ప్రమాణాలను విశ్లేషించేటప్పుడు మూడు ప్రధాన అంశాలను ఆధారంగా తీసుకున్నారు. అవేంటంటే: 1. ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్థిరత్వం, ప్రభావం2. విశ్వవిద్యాలయాల గ్లోబల్ ఆకర్షణ 3. విద్యలో ప్రపంచ స్థాయి నాణ్యతఈ మూడు విభాగాల్లో మెరుగైన ఫలితాలను సాధించిన దేశాలు ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశాల్లో ముందంజలో ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మార్పు దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇంకా కొన్ని దేశాల్లో ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితి ఉంది. ఉదాహరణకు చాద్, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండటంతో, అవి అభివృద్ధికి ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. 2025 సంవత్సరానికి ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ జాబితాను ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ విడుదల చేసింది. అందులో టాప్ 10 దేశాలు విద్యారంగంలో ముందు వరుసలో నిలిచాయి – అవేంటో చూద్దాం!దక్షిణ కొరియామేధాశక్తిదక్షిణ కొరియా అంటే కేవలం కే– పాప్, టెక్నాలజీ మాత్రమే కాదు, దాని అసలైన శక్తి అక్కడి విద్యా వ్యవస్థలో ఉంది. చిన్న దేశం అయినా, గణితశాస్త్రం, సాంకేతిక విద్యా ప్రమాణాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోంది. ఒక అధ్యయనంలో 15 ఏళ్ల విద్యార్థులలో చైనా తర్వాత అత్యధిక ఐక్యూ స్కోర్లు సాధించిన దేశం ఇదే! ఇది క్రమశిక్షణ, కుటుంబాల సహకారం, ప్రభుత్వ ప్రాధాన్యాల వలనే సాధ్యమైంది. ఇక్కడ చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, టెక్నాలజీతో మిళితమై, పిల్లల భవిష్యత్తుకు మార్గం వేస్తోంది.డెన్మార్క్ఒత్తిడిలేని బోధనవైకింగ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందిన డెన్మార్క్ నేడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలలో రెండో దేశంగా నిలుస్తోంది. జనాభా అరవై లక్షలే అయినా, చదువులో దీని స్థానం గొప్పది. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన పెంపొందించడం, ఒత్తిడిలేని బోధన ఈ దేశం ప్రత్యేకతలు. ఇక్కడ చదువు అనేది పరీక్షల కోసమే కాదు, జీవిత పాఠాలను నేర్చుకునే మార్గం. ప్రభుత్వం విద్యపై సమగ్రంగా ఖర్చు చేస్తూ, సమానావకాశాలు కల్పిస్తుంది. పాఠశాలలోనే పిల్లలు చర్చా వేదికల్లో పాల్గొంటూ సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ విధానాల వలనే డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలోనూ చేరింది.నెదర్లండ్స్స్వేచ్ఛగా ఆలోచించే విద్యార్థులే నెదర్లాండ్స్ లోని విద్యా విధానం కేవలం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించారు. తక్కువ ఒత్తిడి, ఎక్కువ చర్చలతో పిల్లలు చదవటం ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడ చదువు కేవలం పాఠశాలలోనే కాదు, సమాజంలో కూడా నేర్చుకోవాల్సిన ప్రక్రియగా ఉంటుంది. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ పెట్టుబడులతో నాణ్యమైన బోధన అందించడం, టెక్నాలజీని తరగతి గదికి తీసుకురావడం ఈ దేశాన్ని ముందు వరుసలో నిలిపాయి. జనాభాలో మెజారిటీ డచ్ వారే అయినా, వలసదారులకు కూడా సమానమైన విద్యా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది విద్యలో సమానత్వానికి నిజమైన ఉదాహరణ.బెల్జియంఅందరికీ విద్యభిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే, చదువే అసలైన మార్గం అని బెల్జియం చెబుతుంది. అత్యుత్తమ విద్యా విధానాల్లో విశేషంగా ఎదుగుతూ, అగ్రస్థానాల్లో నిలుస్తోంది ఈ దేశం. రాజధాని బ్రసెల్స్ యూరోపియన్ యూనియ¯Œ కు కేంద్రంగా ఉండటం, దీని విద్యా ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఇక్కడి విద్యా వ్యవస్థ బహుభాషా విధానం, సమానత్వం ఆధారంగా ఉంటుంది. డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో విద్య అందుతుండటంతో పిల్లలలో బహుభాషా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, ఫ్లెమిష్, వాలున్, జర్మన్ వలసదారులు అందరూ చదువులో భాగస్వాములవడం ఇక్కడ సాధారణం. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్లోవేనియావలసదారులకూ సమాన విద్యకేవలం 20 లక్షల జనాభా ఉన్నా ఈ చిన్న దేశం వంద శాతం అక్షరాస్యతతో ఐదవ స్థానంలో ఉంది. నాణ్యమైన బోధన, ప్రభుత్వం మద్దతు, వలస వచ్చిన జనాభాకు కూడా సమానంగా విద్యను అందించడంతో ఇది సాధ్యమైంది. చదువు సమాజాన్ని ఏకీకృతం చేసే మార్గంగా ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఉదాహరణగా ఈ దేశం నిలిచింది. జపాన్క్రమశిక్షణ శక్తి పురాతన దేవాలయాలు, మౌంట్ ఫుజీ వంటి ప్రకృతి అందాలతో పాటు, జపా¯Œ విద్యా రంగంలోనూ విశేషమైన గుర్తింపు పొందింది. ఇక్కడ విద్యా వ్యవస్థ క్రమశిక్షణ, కఠిన శ్రమ, నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే పిల్లలు గణితం, శాస్త్రం, సాంకేతికతలో చురుకుగా మారతారు. ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన బోధన పద్ధతులు ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు. జపా¯Œ లో 98 శాతం జనాభా జాపనీస్ ప్రజలే. జాతి పరంగా ఏకత్వం ఉన్నా, విద్యకు విస్తృత దృక్కోణంలో ఉంది.జర్మనీఉచితంగా ఉన్నత విద్యకోటలు, ఆధునిక నగరాలతో ప్రసిద్ధి గాంచిన జర్మనీ, విద్యా రంగంలోను అగ్రగామిగా నిలుస్తోంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన రంగాల్లో ఇది ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇక్కడ విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఉచిత ఉన్నత విద్యతోపాటు ప్రభుత్వ మద్దతుతో విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల ప్రాక్టికల్ స్కిల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మతాలు, భాషలు భిన్నమైనా, చదువు విషయంలో సమానత్వం కొనసాగుతుంది.ఫిన్లండ్చదువు చల్లగా, బతుకు హాయిగా స్వచ్ఛమైన సరస్సులు గుర్తొచ్చే దేశం ఫిన్లండ్. ఇక్కడ విద్య అనేది పోటీకి సిద్ధం చేసే మార్గం కాదు, బలమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. ఒత్తిడిలేని తరగతులు, ప్రాజెక్టు ఆధారిత బోధన, విద్యార్థులే కేంద్రంగా రూపొందించిన పద్ధతులు ఫిన్లండ్ విద్యకు ప్రత్యేకత తీసుకొచ్చాయి. పరీక్షలు తక్కువ, ఆలోచన ఎక్కువ ఇక్కడి విద్యార్థుల విజయ రహస్యం. ఈ దేశం ప్రపంచ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో ఉండటానికి కారణం కూడా ఇదే!నార్వే ఆలోచనా శక్తి పెంచే బోధననార్దన్ లైట్స్ వంటి ప్రకృతి అద్భుతాలకు నిలయమైన నార్వే, విద్యా ప్రమాణాల్లో ముందంజలోనే ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ స్వేచ్ఛ, సమానత్వం, నాణ్యతతో కూడినది. విద్యార్థులలో ఆలోచనాశక్తిని పెంచేలా బోధన సాగుతుంది. ప్రభుత్వ మద్దతుతో విద్య ఉచితంగా అందుతూ, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అలాగే, నార్వే జీవన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. చదువుతో పాటు అక్కడ లభించే ఉన్నతమైన ఆరోగ్యసేవలు కూడా విద్యార్థుల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.ఐర్లండ్విద్యలో వైవిధ్యంటెక్నాలజీ ఆధారిత విద్యా రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశం ఐర్లండ్. రాజధాని డబ్లి¯Œ వంటి నగరాల్లో వలసదారుల పెరుగుదలతో విద్యలో వైవిధ్యం పెరిగింది. ఇక్కడ విద్యా విధానం ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశం, సాంకేతిక, జైవ శాస్త్ర రంగాల్లో విద్యను శక్తిగా వినియోగిస్తోంది. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా ఉంటూ అనేక అంతర్జాతీయ విద్యార్థులకు ఆశ్రయంగా మారింది.ఈ జాబితా నుంచి మనం గమనించగలిగేది ఏమిటంటే అత్యుత్తమ స్థాయిలో విద్యను అందిస్తున్న దేశాలు అన్నీ ఏకకాలంలో ఆర్థికంగా, సాంకేతికంగా, సమాజపరంగా కూడా ముందున్నాయి. వీటిల్లో వంద శాతం అక్షరాస్యతతో స్లోవేనియా అత్యుత్తమ విద్యా నాణ్యతకు ఒక అద్భుత నిదర్శనం. మిగతా దేశాలలో అక్షరాస్యత శాతం గణాంకాలు అందుబాటులో లేవు గాని, విద్యా నాణ్యత అత్యుత్తమంగా ఉండడం వల్ల వాటి స్థానం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశాలు తమ విద్యా విధానాలను సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించు కొని, విద్యార్థులకు ఒత్తిడి లేని, పరిశోధన ప్రాతిపదికన ఉన్న, ఆచరణాత్మకమైన విద్యను అందిస్తున్నాయి. ఫలితంగా ఈ దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఉచిత లేదా తక్కువ ధరల్లో ఉన్నత విద్య అవకాశాలు, స్వేచ్ఛాయుత విద్యా వాతావరణం కనిపిస్తున్నాయి.ఇండియాఇంకా ‘వికాస దశ’లోనే! ఇండియా అంటేనే విశాలమైన సంస్కృతి, శాస్త్రవేత్తలు, ఐటీ మేధావులు గుర్తొస్తారు. కాని, ప్రపంచ విద్యా రంగపు ర్యాంకింగ్స్‌లో చూస్తే, మన దేశం ఇంకా ‘వికాస దశ’లోనే ఉంది. 2025 విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ 101వ స్థానంలో నిలవడం కొంచెం చేదుగా అనిపించినా, ఇది మన విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. మన పక్కనున్న దేశాల పరిస్థితి చూస్తే చిన్న దేశాలైన నేపాల్ 56, భూటాన్ 88వ స్థానాల్లో మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. పాకిస్థాన్ 136, అఫ్గానిస్తాన్ 146, బంగ్లాదేశ్ 122వ స్థానాల్లో మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో అసలైన షాక్ ఏంటంటే, మన పొరుగునే ఉన్న చైనా మాత్రం 13వ స్థానంలో మెరిసిపోతూ ప్రపంచానికి చదువుల దారులు తెరుస్తోంది.మన వెనుకబాటుకు కారణాలుఇందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల లోపం అని చొప్పొచ్చు. అందుకే మన అక్షరాస్యత రేటు 74 శాతం దగ్గరే నిలిచిపోయింది. కాని, మార్పు మొదలైంది. నూతన విద్యా విధానం, డిజిటల్ లెర్నింగ్, గ్రామీణ విద్యపై దృష్టి, బాలికల విద్యకు ప్రాధాన్యం వంటి చర్యలు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. అయితే, టాప్ 10లోకి వెళ్లాలంటే ప్రాథమిక విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ, సమానత్వం కీలకం. ఇప్పుడు ఉన్నదంతా ప్రారంభం మాత్రమే! సరైన దిశగా నడిస్తే, భారతదేశం కూడా భవిష్యత్తులో ప్రపంచ విద్యా శిఖరాలను అధిరోహించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జోన్ లో ఉన్నాయి. స్కూల్‌కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే!చిన్న దేశాల గొప్ప విజయాలుఒకప్పుడు ‘చిన్న దేశాలు’ అనే పేరు వింటే, మనకు గుర్తొచ్చేది వాటి పరిమిత వనరులు, అభివృద్ధి లోపం, పెద్ద దేశాల మీద ఆధారపడే పరిస్థితులు. కాని, ఇప్పుడు? అవే చిన్న దేశాలు పుస్తకాలతో పరుగు తీస్తూ, ప్రపంచ విద్యా వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, లాట్వియా, ఇస్టోనియా, లిథువేనియా... వీటి పేర్లు చాలామందికి టూరిజం బ్రోషర్ల ద్వారా మాత్రమే తెలిసి ఉండొచ్చు కాని, ఇప్పుడు ఇవే దేశాలు విద్యలో వందశాతం అక్షరాస్యతతో టాప్ లైన్ లో నిలబడ్డాయి! చదువు విషయంలో ఇవి చిన్న దేశాలు కాదు, చదువుల మహారాజులు! నేపాల్ (71 శాతం) భూటాన్ (72 శాతం) వంటి హిమాలయాల మధ్యన ఉన్న దేశాలు కూడా అక్షరాస్యతలో అగ్రస్థానానికి చేరుతున్నాయి. 2025 నాటికి ప్రపంచం మొత్తం అక్షరాస్యత సగటు 72.91 శాతం అంటే, ఈ చిన్న దేశాల ప్రభావం ఎంత ఉంటుందో ఊహించండి! వనరులు తక్కువైనా, విజన్ పెద్దది. డబ్బు లేకపోయినా, గొప్ప సంకల్పం ఉంది. ప్రభుత్వాల నిబద్ధత, విద్యా విధానాలలో స్పష్టత, ప్రతి పాఠశాలలో బలమైన ఫౌండేషన్... ఇవే ఈ దేశాలను అగ్రస్థానాలకు చేర్చాయి.టాపర్లాంటిది! విద్యా వ్యవస్థలో టాప్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, చదువులో టాప్ స్కోర్ వస్తుందన్న గ్యారంటీ లేదు! పేరుకు ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా నంబర్ వన్. కానీ సబ్జెక్ట్ వైజ్‌లో చూస్తే? గణితంలో 38వ స్థానం, సై¯Œ ్సలో 24వ స్థానం – అచ్చం ‘టాపర్’ ముసుగులో ‘బోర్డర్ పాస్’ అన్నట్టు! ‘బిజినెస్ ఇన్సైడర్’ అనే సంస్థ ఇచ్చిన గణాంకాలు, బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ లెక్కలు– ఇలా ఒక్కో సంస్థ ఒక్కో విధంగా మార్కులు వేస్తుండడంతో, ర్యాంకింగ్ ఒక పజిల్లా మారిపోయింది. ఎక్కడైనా పుస్తకాలతో కప్పేసి ‘ఉత్తమ విద్యా సంస్థ’ అన్న ట్యాగ్ పెడితే సరిపోదు. అసలైన విషయాలు చూడాలి. పిల్లలు చదువుతున్నారా? టీచర్లు బాగా బోధిస్తున్నారా? ప్రభుత్వ పెట్టుబడులు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అనే విషయాలు కూడా కీలకమే! ఇక ‘గ్లోబల్ సిటిజన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ వంటి సంస్థలు బాగానే మ్యాటర్‌ను పసిగట్టాయి. విద్యా వ్యవస్థ అంటే చిన్నారి స్కూల్ అడ్మిషన్ నుంచీ పెద్దల అక్షరాస్యత వరకూ మొత్తం జీవన ప్రయాణాన్ని గమనించాలి అని అంటున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే టాప్ ర్యాంక్ అనేది పేపర్లో ఉండే డిజైన్ మాత్రమే! అసలైన చదువు ఏమిటో, అది జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చూసే చూపు అవసరం. లేదంటే టాపర్ గుండెల్లోని ర్యాంక్ కాస్త, రిజల్ట్ వచ్చాక ‘ఒక్క మార్క్ మిస్ అయ్యింది!, లేకుంటే నేనే టాప్’ అని అంటాయి. విద్య అనేది కేవలం ఒక పాఠశాల గది వరకు మాత్రమే పరిమితమైంది కాదు. అది వ్యక్తిని మారుస్తుంది. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది; కుటుంబం మారితే సమాజం మారుతుంది; సమాజం మారితే దేశం మారుతుంది. అందుకు విద్యే మార్గం, విజ్ఞానమే శక్తి.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జో¯Œ లో ఉన్నాయి. స్కూల్‌కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే! -
ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం
-
‘ప్రైవేటు’ పుస్తకాల దందా!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం కూడా తోడు కావటంతో విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుగుతోంది. ప్రభుత్వ అధికారిక పుస్తకాలకు అదనంగా వర్క్షీట్ల పేరుతో లెక్కాపత్రం లేకుండా తామిచ్చే పుస్తకాలే కొనాలని స్కూళ్ల యాజమాన్యాలు హుకుం జారీచేస్తుండటంతో తల్లిదండ్రులు మౌనంగా ఆ భారాన్ని భరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు, వాటికి తగిన నోట్ పుస్తకాల కొనుగోలు విషయం తల్లిదండ్రులకు పెద్దగా భారం కాదు. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.1,000 లోపు ఖర్చుతో పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపిక చేస్తున్న పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఒక విద్యార్థికి ఏడాదిపాటు చెల్లించే ట్యూషన్ ఫీజులో కనీసం మూడో వంతు భరించాల్సిన పరిస్థితి వస్తోంది. దండుకోవడమే లక్ష్యం.. రాష్ట్రంలో 41,628 పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 11,454. వీటిలో ఒకటి నుంచి పదోతరగతి వరకు 34,92,886 మంది ఉంటే.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు 3,55,254 మంది ఉన్నారు. నర్సరీ నుంచి పదోతరగతి వరకు 38,48,140 మంది ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలతోపాటు అదనంగా మరికొన్ని పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు విక్రయిస్తున్నాయి. వీటిని పుస్తకాల పబ్లిషర్లతో కలిసి రూపొందిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి.. ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర)పైఒక్క పైసా తగ్గించకుండా బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. సగటున ఒక్కో తరగతికి రూ.6,370 చొప్పున పాఠ్యపుస్తకాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల విక్రయాలను లెక్కిస్తే ఏటా దాదాపు రూ.2 వేలకోట్లకు పైగానే వ్యాపారం జరిగినట్లు స్పష్టమవుతోంది. బిల్లుకు చెల్లు.. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే 85 శాతం విద్యార్థులు పుస్తకాలను కొనుగోలు చేశారు. అయితే, ఈ ‘ప్రైవేటు’పుస్తకాల విక్రయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఎక్కడా లెక్కా పత్రం కనిపించకుండా జాగ్రత్తపడుతున్నాయి. చాలా స్కూళ్లలో పుస్తకాలకు నగదు మాత్రమే స్వీకనిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం ఇవ్వటంలేదు. పుస్తకాలు కొనుగోలుకు సంబంధించిన బిల్లులు (రసీదు) కూడా ఇవ్వటం లేదు. దీంతో ఈ వ్యాపారం గుట్టుగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పుస్తకాల విక్రయంపై ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించటంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పుస్తకాల వ్యాపారంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన దాదాపు రూ.457 కోట్లు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ఖాతాలోకే చేరుతున్నాయి.ప్రైవేటు పాఠశాలల్లో తరగతులవారీగా విద్యార్థుల సంఖ్య ఇలా... తరగతి విద్యార్థుల సంఖ్య 1 4,40,556 2 3,91,179 3 3,70,029 4 3,81,757 5 3,52,503 6 3,37,579 7 3,26,280 8 3,26,280 9 2,83,494 10 2,83,229 పుస్తకాల ధరలు రెట్టింపు చేశారు... నాకు ఇద్దరు పిల్లలు. 4, 5వ తరగతి చదువుతున్నారు. వీరికి గతేడాది పుస్తకాల కోసం రూ.8 వేలు ఖర్చు చేస్తే... ఈసారి ఏకంగా 15 వేలు చెల్లించాల్సి వచ్చింది. గతేడాది 4వ తరగతి విద్యార్థికి రూ.4 వేలు పుస్తకాలకు చెల్లిస్తే... ఈ ఏడాది రూ.8 వేలు అయ్యింది. అనవసరమైన పుస్తకాలు కట్టబెడుతున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి బోధన, అభ్యసన మాత్రం పట్టించుకోరు. చివరకు పాతసామాను వాడికి అమ్ముకోవాల్సిందే. – అఖిల, విద్యార్థి తల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న పుస్తకాల బ్యాగులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ పాఠశాలకు చెందినవి. ఆ పాఠశాలలో పుస్తకాలు కొనుగోలు చేసినవారికి ఈ బ్యాగులో పెట్టి ఇస్తున్నారు. పుస్తకాల కోసమే స్కూలు యాజమాన్యం ఈ బ్యాగులు ప్రింట్ చేయించింది. అయితే, పుస్తకాలు కొనుగోలుకు సంబంధించి బిల్లు(రసీదు) మాత్రం ఇవ్వడం లేదు. రసీదు ఇవ్వాలని విద్యార్థుల తల్లదండ్రులు అడిగితే... రసీదు పుస్తకాలు లేవంటూ తెల్లకాగితంపై చీటీ రాసి చేతులు దులుపుకుంటున్నారు. తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాలు విక్రయించటం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే నిబంధనల మేరకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ లేదా దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. – రేణుక, జిల్లా విద్యాశాఖ అధికారి, వికారాబాద్ జిల్లా ప్రభుత్వంలో 3.. ప్రైవేటులో 6..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు 3 పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ మాత్రమే ఉంటాయి. 3, 4,5వ తరగతుల విద్యార్థులకు నాలుగు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ ,ఈవీఎస్ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) పుస్తకాలు ఇస్తారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు ఆరు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో మూడు లాంగ్వేజెస్, మూడు ఆప్షనల్స్ ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పుస్తకాలకు బదులు ప్రైవేట్ పాఠశాలలు సబ్జెక్టువారీ పుస్తకాలను ఎంపిక చేసుకొని అమలు చేస్తున్నారు. దీంతో ఒకటో తరగతి నుంచే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్. సైన్స్, సోషల్ పుస్తకాలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పుస్తకాలను అనుసరిస్తూ వాటికి వర్క్ బుక్‌లను కూడా అదనంగా జోడిస్తున్నారు. -
రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్‌గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్గాదేశవాళీ క్రికెట్లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్ దశ.. ఐపీఎల్‌తో మారిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్‌డ్రాపౌట్? ఇలా క్రికెట్ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
డిగ్రీ ప్రవేశాలపై గందరగోళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ విద్య ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. జూన్ నెల ముగిసిపోతున్నా ప్రవేశాల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ మధ్య కొరవడిన సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి అకడమిక్ వ్యవహారాల్లో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలి పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిల్లో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువే! కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో సమస్య ఎంతకీ తెగకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు ముగింపు దశలో ఉండగా ఈ నెలాఖరు నుంచి తొలి ఏడాది తరగతులను ప్రారంభించనుంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఏపీలో ప్రవేశాల ఊసే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. తెలంగాణాలో ‘దోస్త్’ పోర్టల్ ద్వారా ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలు చేపడితే.. ఏపీ తిరోగమనంలో ఆన్లైన్ ప్రవేశాల రద్దుకు ముందుకెళ్తోంది. ఉన్నత విద్యాశాఖలో బహిరంగంగా ఇంత జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ తన శాఖను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అభిప్రాయ సేకరణలో తీవ్ర జాప్యం కూటమి సర్కారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలపై ఆది నుంచి విషం కక్కుతూనే ఉంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ మేజర్‌ను తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సర్కారు ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ డ్యూయల్ మేజర్ విధానాన్ని సిఫారసు చేసింది. నెల రోజుల కిందట ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇచ్చింది. కళాశాలల నుంచి కోర్సు కన్వర్షన్ కోసం దరఖాస్తులనూ ఆహ్వానించింది. అయితే, డ్యూయల్ మేజర్‌పై ఉన్నత విద్యాశాఖ నోట్ రూపంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి ఇప్పటికీ అతీగతీ లేదు. ఇప్పుడు, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డిగ్రీ కళాశాలలకు వెళ్లి విద్యార్థులు, లెక్చరర్ల నుంచి అభిప్రాయాలు సేకరించడం చర్చనీయాంశమైంది. కమిటీ సిఫారసులు చేసిన ఇన్ని రోజుల తర్వాత అభిప్రాయ సేకరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలోని ట్రిపుల్ మేజర్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సింగిల్ మేజర్ విధానాన్ని రద్దు చేసి డ్యూయల్ మేజర్‌ను అమలు చేస్తే.. ఏపీలో డిగ్రీ చదివిన విద్యార్థులు మూడు రకాల డిగ్రీ పట్టాలతో కనిపిస్తారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుందని కొందరు అధికారులు వాదిస్తున్నారు. అందుకే సింగిల్ మేజర్ విధానంలో పొరపాట్లను సవరించి కొనసాగించాలని చెబుతున్నారు. అఫిలియేషన్ ప్రాసెస్ ఎక్కడ?విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గతంలో ఈ ప్రక్రియ ఉచితమే. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ సాంకేతిక విభాగం డబ్బులు ఇస్తే తప్ప చేయబోమని తెగేసి చెబుతోంది. ఒక్కో కళాశాల రూ.3,500 చెల్లించాల్సి ఉంది. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా.. అన్ని కళాశాలలు వర్సిటీల నుంచి అఫిలియేషన్ పొందాల్సి ఉండగా.. ప్రక్రియ నిధులతో ముడిపడి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు కళాశాలలను సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్‌కు కన్వర్ట్ చేయడానికి సమయం పడుతుంది. వీటన్నింటి ఫలితం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.కళాశాలలకు నోటీసులు..ప్రస్తుతం 1300 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో గత మూడేళ్లలో 270 కళాశాలల్లో 25శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉన్నాయి. సున్నా ప్రవేశాలు ఉన్నవి 3 కళాశాలలు ఉన్నాయి. వీటికి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక కమిటీ ఎదుట ఆయా కళాశాలలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిస్తే తప్ప ఆ కళాశాలలకు అనుమతులు విషయం తేలదు. వీటితోపాటు కొత్తగా నియోజకవర్గ, మండల హెడ్ క్వార్టర్లో కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. డిగ్రీ విద్యలో 4.55 లక్షల సీట్లు ఉంటే పట్టుమని 39 శాతం సీట్లు కూడా భర్తీ కావట్లేదు. ఇలాంటి తరుణంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సాంకేతిక సౌరభం
వనపర్తిటౌన్: వనపర్తి ఎడ్యుకేషన్ హబ్‌కు కేరాఫ్‌గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించే వారు. 1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. రాజా రామేశ్వర్రావు ఔదార్యం.. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు. ఆరు కోర్సులతో.. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది. 55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాల.. వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్‌లోని హనుమాన్, శంకర్‌గంజ్‌లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది. ఉపాధి అవకాశాలు మెండు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్ కౌన్సిల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జగన్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి విద్యాపర్తిగా గుర్తింపు.. రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి ఉన్నత స్థాయికి చేర్చింది.. వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది. – గణేశ్‌కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి విద్యకు పెద్దపీట.. నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి -
అంతా మీ ఇష్టమేనా..?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అధికారులే అడ్డు పడుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల సమన్వయలోపంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతోందని ఆయన అన్నట్టు సమాచారం. అసలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను ఎందుకు ఆపుతున్నారో చెప్పా లని అధికారులను నిలదీసినట్టు తెలిసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. ముఖ్యంగా సాంకేతిక విద్యామండలి, విద్యాశాఖ ముఖ్య అధికారుల పనితీరుపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల మధ్య కొనసాగుతున్న కోల్డ్‌వార్‌పై సీఎం సీరియస్ అవ్వడంపై అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం... సమావేశంవివరాలు ఇలా ఉన్నాయి. పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ చేపట్టాలని గతంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఉన్నత విద్యామండలి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక, ఉన్నతవిద్య అధికారులు అడ్డుపడటం వివాదానికి కారణమైంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఉన్నత విద్యామండలిపై నిందలెందుకు ? ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఇప్పటి వరకూ అనేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలను దిగి్వజయంగా నిర్వహించారని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాలేదని సీఎం సమావేశంలో కొనియాడారు. కేవలం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ విషయంలోనే సమస్య ఎందుకు వస్తుందని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ‘మండలి అధికారులు ఇష్టానుసారం చేస్తున్నారు’అంటూ విద్యాశాఖ అధికారులు అనడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. వ్యక్తిగత సమస్యలతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించేలా చేయడం సరికాదని అన్నట్టు సమాచారం. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో తాను స్వయంగా మాట్లాడతానని, ఆయన సంస్కరణలపై పట్టుదలగా ఉన్నారని సీఎం అన్నట్టు తెలిసింది. సాంకేతిక విద్య అధికారుల ప్రమేయం లేకుండా కౌన్సెలింగ్ చేపడతామని ఉన్నత విద్యామండలి చెప్పడమే నేరంగా భావించడం సరికాదని సీఎం హితబోధ చేసినట్టు తెలిసింది. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై కమిటీ వేయాలనే ప్రభుత్వ ఆలోచన కూడా కౌన్సెలింగ్ జాప్యానికి కారణమన్న అధికారుల వాదనతో సీఎం ఏకీభవించలేదని తెలిసింది. అధికారులంతా ఒకసారి కూర్చొని వ్యక్తిగత అంశాలుంటే మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడిబాటపై అసంతృప్తి బడిబాటపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మందిని చేర్చడమే లక్ష్యంగా చేపట్టిన బడిబాట ఆశించిన పురోగతి సాధించలేదని ఆయన అన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులే ఈ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్నారని, ఇక క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందన ఉంటుందని సీఎం అన్నట్టు సమాచారం. ప్రభుత్వ బడులను అదనపు కలెక్టర్లు సందర్శించాలి : సీఎం ప్రతీజిల్లా అదనపు కలెక్టర్ వారంలో రెండుసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సమావేశ వివరాలపై బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 48 వేల మంది చేరినట్టు సీఎం తెలిపారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త గదులను నిర్మించాలని అధికారులకు చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలల్లో వసతులు కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల వంట చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన ఉండటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంతా ఇంటర్లో చేరేలా చూడాలన్నారు. ఇంటర్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి వర్సెస్ సాంకేతిక విద్యామండలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ఈ విభాగాల మధ్య అగాధం పెరుగుతోంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వడానికి మొత్తం రంగం సిద్ధమైన తరుణంలో సాంకేతిక విద్యామండలి మోకాలొడ్డింది. ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించేది లేదంటూ కరాఖండీగా తేల్చిచెప్పినట్టు సమాచారం. వాస్తవానికి కిందిస్థాయి అధికారులు మంగళవారం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రభుత్వం కూడా అనుమతించిందని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు. అయితే ఈ సమాచారం బహిరంగపర్చడంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య అధికారులు మండి పడుతున్నారు. తమను సంప్రదించకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇస్తామన్న ప్రచారం సరికాదన్నారు. ఈ తరహా ప్రకటనలు చేయడంపై సాంకేతిక విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అసలు షెడ్యూల్ ఇవ్వాల్సింది తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు అంటున్నారు. అధికారుల సమన్వయ లోపం కారణంగా కౌన్సెలింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల నెలన్నర ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. అవునంటే.. కాదంటూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్, అనుబంధ గుర్తింపు, సీట్ల పెంపుపై యూనివర్సి టీల వీసీలు, ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యామండలి అధికారుల మధ్య ఏమాత్రం సమన్వయం కుదర డం లేదు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొత్తం యూనివర్సిటీలు పూర్తి చేశా యి. గుర్తింపు ఇవ్వడానికి సిద్ధమైన తరుణంలో విద్య, సాంకేతిక విద్య ఉన్నతాధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తారు. కాలేజీలను పూర్తిగా తనిఖీ చేసేందుకు కమిటీ వేయాలంటూ సాంకేతిక విద్యామండలి ప్రభుత్వం వద్ద కొత్త వాదన లేవనెత్తింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నలివ్వడంతో అఫ్లియేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. కౌన్సెలింగ్‌లో కాలేజీలు పాల్గొనాలంటే ముందు గుర్తింపు ఇవ్వాలి. ఇంత వరకూ కమిటీ ఏర్పాటుకు మార్గదర్శకాలు రాలేదు. అప్పటి వరకూ గుర్తింపు ఇవ్వకుండా ఆపడం ఏమిటని వీసీలు అంటున్నారు. ఉన్నతాధికారులు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారని, వీసీలపై పెత్తనం చెలాయించే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఓ యూనివర్సిటీ వీసీ అన్నారు. ఫీజుల వ్యవహారంపైనా ఇదే పేచీ కొనసాగుతోంది. ప్రైవేట్ కాలేజీల ఆడిట్ నివేదికలు పరిశీలించిన ఎఫ్ఆర్సీ తుది నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఫీజులు ఖరారైనట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించడంతో సాంకేతిక విద్యామండలి అధికారులకు ఆగ్రహం వచ్చింది. అసలు ఫీజులు ఎలా పెంచుతారంటూ సాంకేతిక విద్య అధికారి ఒకరు అభ్యంతరం లేవనెత్తారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం వరకూ చేరవేశారు. దీంతో ఫీజుల ఖరారు ఆగిపోయింది. జీవో రాకుండా కౌన్సెలింగ్ కుదరదు ఫీజులపై ప్రభుత్వం జీవో ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి అధికారులు అంటున్నారు. అప్పటి దాకా కౌన్సెలింగ్ వాయిదా వేయాలని చెబుతున్నారు. అయితే, ఉన్నత విద్యామండలి మాత్రం ఫీజుల వ్యవహారంతో పనిలేకుండానే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ఒకవేళ ఫీజులు పెంచితే ఆ తర్వాత కాలేజీలు వసూలు చేసుకోవచ్చనే షరతును కౌన్సెలింగ్ షెడ్యూల్లో పెడతామని తెలిపింది. ఫీజుల వ్యవహారంపై ప్రైవేట్ కాలేజీలు కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే జీవో ఇవ్వకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని సాంకేతిక విద్యామండలి అధికారులు అంటున్నారు. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ నెలాఖరు వరకూ కొత్త సీట్లపై స్పష్టత ఇస్తుంది. కొత్త సీట్ల వ్యవహారం తేలకుండా రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహించడం సరికాదని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఒకవేళ కొత్త సీట్ల పెంపు అనివార్యమైతే ఆఖరి కౌన్సెలింగ్‌లో వీటిని పొందుపరిస్తే సరిపోతుందని ఉన్నత విద్యామండలి అంటోంది. ఇలా భిన్న వాదనల మధ్య కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా పడటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే న్యాయ సలహా తీసుకోవాలనే ఆలోచనలో సాంకేతిక విద్యామండలి ఉంది. -
విద్యార్థుల్లో జిజ్ఞాస ఎంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల పఠనాసక్తి, వారిలోని సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక పరీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని బేస్‌లైన్ టెస్ట్‌గా చెబుతున్నారు. పరీక్ష నిర్వహణ, విద్యా సామర్థ్యాల పరిశీలనకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్సీఈఆర్టీ మంగళవారం జిల్లా అధికారులకు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వీటిని నిర్వహిస్తారు. సంవత్సరానికి మూడుసార్లు జరిగే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, చివరలో ఇంకోసారి పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్‌గా జరిగే పరీక్షలకు ఇవి భిన్నంగా ఉంటాయనిఅధికారులు తెలిపారు. పాఠశాలహెచ్ఎంలు ప్రతీ విద్యార్థికి సంబంధించిన మార్కులను యాప్‌లో పొందుపరుస్తారు. వీటి ఆధారంగా విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు? ఏ జిల్లాల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఎస్సీఈఆర్టీ పరిశీలించి, విద్యార్థుల స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.పరీక్ష విధానం ఇదీ.. ఈ ప్రక్రియ మొత్తం ఎస్సీఈఆర్టీ నేతృత్వంలోనే నడుస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి పరిశీలన ఈ విభాగమే చూస్తుంది. ఇది తరగతి వారీగా మారుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో అనర్గళంగా చదవడం, రాయడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం తప్పనిసరి. దీని ఆధారంగానే పరీక్ష నిర్వహిస్తారు. పిల్లలు సరళ పదాలు, గుణింతాలు ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను చదవాలి. తెలుగు పదాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత వేగంతో చదివితేనే ఆ విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్యలు గుర్తించడం కూడికలు, తీసివేతలు సమస్యల సాధన, 3, 4, 5 విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారం వంటివి చేయాలి. 6–10వ తరగతి వారికి పాఠ్యాంశాల్లో కనీస ప్రశ్నలు వస్తాయి. ఇందులో విద్యార్థి ఎంత వేగంతో సమాధానం ఇస్తున్నాడు? ఇచ్చేదాంట్లో సరైన సమాధానం శాతం ఎంతమేర ఉందనే దాన్ని సామర్థ్యానికి కొలమానంగా తీసుకుంటారు. 9, 10 తరతుల విద్యార్థులను కొంత తికమక పెట్టే రీతిలోనూ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు, సంవత్సరంలో నిర్వహించే పరీక్షలకు ఏ సంబంధం ఉండదని అధికారులు తెలిపారు. -
తనిఖీలతో బోధనెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలకు టీచర్లనే నియమిస్తూ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు దుమారం రేపుతున్నాయి. టీచర్ల సంఘాలు దీన్ని అనాలోచిత నిర్ణయమని విమర్శిస్తున్నాయి. ఈ నిర్ణయం పాఠశాలల్లో టీచర్ల కొరతను మరింత పెంచుతుందని, పైరవీలకు ద్వారాలు తెరిచినట్టే అవుతుందని పలువురు టీచర్లు అంటున్నారు. ఈ విధానంపై పాఠశాల విద్య ఉన్నతాధికారులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇప్పటివరకు ఉన్నతాధికారులకే.. రాష్ట్రంలో 24 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పర్యవేక్షణకు ప్రతి మండలంలో మండల విద్యాధికారులు ఉంటారు. సాధారణంగా ప్రధానోపాధ్యాయుడికే పదోన్నతి కల్పించి ఎంఈఓగా నియమిస్తారు. గత ఏడాది వరకు ఒక్కో హెచ్ఎంకు ఐదు మండలాల వరకు పర్యవేక్షణ బాధ్యత ఉండేది. గత సంవత్సరం పదోన్నతుల కారణంగా ఒక్కో మండలానికి ఒక్కో ఎంఈఓ వచ్చారు. వీరితో పాటు మండల రిసోర్స్ పర్సన్స్ కూడా ఉంటారు. వీళ్లంతా పాఠశాలలను తనిఖీ చేసి, జిల్లా విద్యాధికారికి ప్రతి నెల నివేదిక ఇస్తారు. డీఈఓ ద్వారా ఇది రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు చేరుతుంది. స్కూళ్లల్లో విద్యార్థుల హాజరు పట్టిక నిర్వహణ, సిలబస్ సకాలంలో పూర్తవుతుందా లేదా? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలపై నివేదికలు ఇస్తారు. కానీ, ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయులకే ఈ బాధ్యతను అప్పగించడం వివాదానికి కారణమైంది. సమస్య ఏమిటి? రాష్ట్రంలో 1.06 లక్షల మంది ప్రభుత్వ టీచర్లున్నారు. కొన్ని స్కూళ్లల్లో టీచర్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువ ఉన్నారు. ఈ లెక్కన దాదాపు 6 వేల మంది టీచర్లు మిగులు ఉన్నారనేది ప్రభుత్వం వాదన. కానీ విద్యార్థులు తక్కువ ఉన్నా అన్ని సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుందని, ఈ లెక్కన ఇంకా టీచర్ల అవసరం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పదేళ్ల బోధన అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ రోజూ రెండు స్కూళ్లను తనిఖీ చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పదేళ్ల సరీ్వస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్లు కూడా రోజూ రెండు స్కూళ్లు తనిఖీ చేయాలి. ఉన్నత పాఠశాలల్లో కూడా స్కూల్ అసిస్టెంట్లనే తీసుకుంటారు. వీళ్లు మూడు నెలల్లో50 స్కూళ్లు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. స్కూల్ హెచ్ఎం కేడర్ కంటే ఎస్ఏ, ఎస్జీటీ కేడర్ తక్కువ. ఇలాంటి వారిచేత స్కూళ్లను తనిఖీ చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది టీచర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తే బోధనకు టీచర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పైరవీలకు దారులు తనిఖీల కోసం టీచర్ల ఎంపిక ఎలా చేస్తారనే దానిపై విద్యాశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నియామకానికి ఏదైనా రాత పరీక్ష నిర్వహిస్తారా? కిందిస్థాయి అధికారుల సిఫార్సుల మేరకే ఎంపిక చేస్తారా? అనేది తెలియడం లేదని సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే డిప్యుటేషన్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. పర్యవేక్షణ కోసం నియమించేవారు రోజూ స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పేరుతో ఇతర సొంత పనులు చేసుకునే వీలుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగే అవకాశం ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం హైస్కూళ్లలో గెజిటెడ్ హెచ్ఎంలు పని చేస్తారు. వీరికన్నా తక్కువ స్థాయి ఉన్న స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణకు నియమించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇదెక్కడి న్యాయమో అధికారులే చెప్పాలి. పైగా బోధన కుంటుపడే వీలుంది. తక్షణమే ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలి. – ఆర్ రాజగంగారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు. ప్రమాణాలు తగ్గుతాయి పదేళ్ల అనుభవం ఉన్నవారిని ఏడాది పొడవునా తనిఖీలకే వినియోగిస్తే ప్రభుత్వ స్కూళ్లల్లో బోధకుల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరికాదు. – యం సోమయ్య, టి లింగారెడ్డి, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
మధ్యాహ్న భోజనం బాగుందా?
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యాశాఖ తనిఖీలకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో తనిఖీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను సంసిద్ధం చేస్తోంది. ఇవి ఆకస్మిక తనిఖీలు చేపడతాయి. మధ్యాహ్న భోజన నాణ్యత, అందిస్తున్న తీరు, గతంలో ఎదురైన అనుభవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిననేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో భోజన నాణ్యతకు పాఠశాల ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేయాలని ప్రభుత్వం సూచించింది. భోజనం వంట దగ్గర్నుంచి, భోజన శాలల్లో పరిశుభ్రత పాటించడం వరకు హెచ్ఎంలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎక్కడైనా తేడా వస్తే ఈ విద్యాసంవత్సరంలో హెచ్ఎంలకు చర్యలు తప్పవని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆహారం కలుషితమైనా, నాణ్యత తగ్గినట్టు తేలినా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. – సాక్షి, హైదరాబాద్నాణ్యత ఎలా? గత సంవత్సరం అనేక చోట్ల ఆహారం కలుషితమై, విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు రాజకీయ దుమారం రేపాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మధ్యాహ్నం భోజనంలో నాణ్యత, శుభ్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే, అవసరమైన బడ్జెట్ లేకుండా ఆశించిన పురోగతి ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ మెనూ మార్చాలి. ఏ వారం ఏం పెట్టాలనే మెనూను పాఠశాల విద్య ఖరారు చేసింది. అన్నం, పప్పుచారు, బిర్యానీ, అరటి పండ్లు, గుడ్లు ఇలా రోజుకొకటి అందించాలి. 1–5 తరగతుల విద్యార్థులకు గుడ్డుతో కలిపి ఒక్కొక్కరికి రూ.8.69.. 6–8 తరగతుల వారికి రూ.11.79.. 9–10 తరగతుల విద్యార్థులకు రూ.11.79 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి రూ.99,22,56,492.5 బడ్జెట్ ఇస్తున్నారు. ఇంకా రూ. 38,10,38,935 అదనంగా ఇస్తే తప్ప నాణ్యమైన భోజనం అందించడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపున నిత్యావసరాలు పెరుగుతుంటే సరిపుచ్చడం ఎలా అని హెచ్ఎంలు అంటున్నారు. ఏం జరిగినా తమనే బలి చేయడం సరికాదని విన్నవిస్తున్నారు. ప్రతి రోజూ నివేదిక రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు? మధ్యాహ్న భోజనంలో ఏయే పదార్థాలు వినియోగించారు? వాటిని ఎక్కడ? ఎప్పుడు కొనుగోలు చేశారు? అనే వివరాలను హెచ్ఎంలు ఆన్లైన్లో పొందు పర్చేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. వీటిని మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షిస్తారు. హెచ్ఎంలు పంపే వివరాలను ఎంఈవో పరిశీలించి, జిల్లా విద్యాశాఖాధికారి, అక్కడి నుంచి పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు పంపుతారు. ఇందులోనే బియ్యం, నిత్యావసరాల నిల్వలను పేర్కొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంఈవోలు వారానికి కనీసం మూడు స్కూళ్లను పరిశీలిస్తారు. మధ్యాహ్న భోజనం అందించేటప్పుడు నేరుగా నాణ్యతను పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక బృందాలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయి. ఎక్కడన్నా లోపాలుంటే తక్షణమే చర్యలు తీసుకునే వీలుందని అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాణిజ్యవేత్త నందన్ నీలేకని సారథ్యంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలు అందించే సేవలివీ.. –ఎక్‌స్టెప్ ఫౌండేషన్ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు మ్యాథ్స్‌పై బేసిక్స్‌ను అందిస్తుంది. –ఫిజిక్స్‌వాలా ఇంటర్మీడియట్ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది. –ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌పై శిక్షణ ఇస్తుంది. –ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. –పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణ ఇస్తుంది. –ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది. -
మిడిమిడి జ్ఞానమా.. అతి తెలివా!?
సాక్షి, అమరావతి : ‘ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటీ చేయని వ్యక్తి కీలక విద్యా శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం’ అని విద్యా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో.. వాటిలో ఎంత మంది విద్యార్థులున్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేశ్‌కు కొత్తేం కాదని ప్రజలు అంటున్నారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. యూడైస్‌పై మాట్లాడిన తీరు చూస్తుంటే విద్యా రంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘యూడైస్ ప్లస్’లో అంగన్వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారంటున్నారు. ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’.. సంక్షిప్తంగా యూడైస్ ప్లస్‌గా పేర్కొనే వెబ్సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.యూడైస్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్లోడ్ చేస్తారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్లోడ్ చేస్తారు. చిల్లరమల్లర వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (1–12) వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్టులోని పేజీ నంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ మేనేజ్మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి. వీటిలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్టులోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా తగదని, అయినా లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ సెల్ఫ్ గోల్ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు పరిపక్వత లేదు. నన్ను విమర్శించే స్థాయి అంతకంటే లేదు. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి వంద రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏ మాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోంది. పదో తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్య శాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద చల్లాలని సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారు. ఏ లెక్కలు పడితే.. అవి ఇందులో చేర్చడానికి కుదరదు. ఇంగిత జ్ఞానం లేని లోకేశ్‌కు ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు లోకేశ్‌ను కాదు.. ఆయన్ను విద్య శాఖ మంత్రిని చేసిన చంద్రబాబును అనాలి. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గానీ విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రినీ బుద్ధి గడ్డి తినిందా లోకేశ్?లోకేశ్‌కు ఏపాటి అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసు. ఏడాది కాలంలో విద్యా శాఖను భ్రష్టు పట్టించారు. ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను యూడైస్‌లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? చదువు సంధ్యలు సరిగా అబ్బలేదు. కనీసం ప్రెస్‌మీట్‌కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా! తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు కోత పెడుతున్నావు? దీనిపై గతంలో నువ్వు విమర్శలు చేయలేదా? ఇప్పుడు నీ బుద్ధి గడ్డి తింటోందా? కలెక్టర్ స్వయంగా ఆమోదించిన డేటాలో తప్పులు ఉన్నాయని ఎలా అంటావు? సరే.. ఒక్కటైనా నిరూపించావా? – ఆదిమూలపు సురేశ్,రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి -
విద్యా ప్రమాణాల పెంపే మా లక్ష్యం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(శుక్రవారం. జూన్ 13) విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్‌లో వారు తమకు ఇష్టమైన రంలగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్‌కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. -
గురుకులాలకు తాళాలు!
సాక్షి, హైదరాబాద్: అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు గురుకుల పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. వేసవి సెలవుల అనంతరం గురువారం గురుకులాలకు వచ్చిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు గేట్లకు వేసిన తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రిన్సిపాళ్లు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చర్చలు జరపడంతో మధ్యాహ్నం తర్వాత కొన్నిచోట్ల యజమానులు తాళాలు తీశారు. గురుకులాలూ షురూ..: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పాఠశాల లు తెరుచుకున్నాయి. మిగతా స్కూళ్లతో పాటు గురుకుల విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకల్లా తరగతులు ప్రారంభం కావాల్సి ఉండడంతో గంట ముందే ప్రిన్సిపాళ్లు పాఠశాలలకు చేరుకున్నారు. అయితే ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు భవనాలకు పాఠశాల సిబ్బంది వేసిన తాళాల స్థానంలో భవన యజమానుల తాళాలు కనిపించాయి. అద్దె బకాయిలు చెల్లించే వరకు తాళాలు తీసే ప్రసక్తే లేదని యజమానులు ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి స్పష్టం చేశారు. మరికొందరు తమ భవనాలు వెంటనే ఖాళీ చేయాలని తేల్చిచెప్పడంతో పాఠశాలల సిబ్బంది, బడికెళ్లేందుకు వచ్చిన పిల్లలు బయటే నిలబడాల్సి వచ్చింది.జనరల్ మినహా అన్నీ అద్దె భవనాల్లోనే..రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా... విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ ఉంది. వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకులాలన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తుండగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు సంబంధించిన 662 గురుకుల విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇందులో పలు పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. అద్దె బకాయిలు చెల్లిస్తేనే తాళాలు తొలగిస్తామని స్పష్టం చేయగా... మరికొందరు మాత్రం భవనాలను ఖాళీ చేయాలని తేల్చిచెప్పారు. దీంతో పాఠశాల సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు గేటు బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.రూ.215 కోట్ల బకాయిలుప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు నెలకు సగటున రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బకాయిల మొత్తం రూ.215 కోట్లకు చేరింది. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులపై సంబంధిత యజమానులు గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే అద్దె చెల్లించాలంటూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. 63 గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలంటూ ఆయా భవనాల యజమానులు గత నెలలోనే సంబంధిత ప్రిన్సిపాళ్లకు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల కాలేదు.కాస్త ఉపశమనం..గురుకుల పాఠశాలలకు తాళాలు పడే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సంబంధించిన అద్దె బకాయిల్లో కొంతమేర చెల్లించేలా చర్యలు తీసుకుంది. దాదాపు 10 నెలల బకాయిలు ఉండగా.. మూడు నుంచి నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులకు ఆర్థికశాఖ మోక్షం కలిగించింది. ఈ మేరకు నిధులను సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లకు విడుదల చేసింది. వారు భవనాల యజమానులకు చెల్లించేందుకు గురువారం హడావుడిగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే యజమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే త్రైమాసికంలో (జూలై నెలాఖరులో) మిగిలిన బకాయిలు విడుదల చేస్తారని, అప్పటివరకు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో, చాలాచోట్ల మధ్యాహ్నం తర్వాత యజమానులు తాళాలు తీశారు.చేసిన పనులకు బిల్లులు రాలేదని ..– సిద్దిపేట జిల్లాలో బడికి కాంట్రాక్టర్ తాళంచేర్యాల (సిద్దిపేట):పాఠశాల అభివృద్ధిలో భాగంగా రెండేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ బడికి తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా ఆకునూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల క్రితం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద కాంట్రాక్టర్ డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టి టైల్స్, విద్యుత్ పనులు చేశారు. ఇందుకు సంబంధించి రూ.8.5 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్ పలుమార్లు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్ గురువారం పాఠశాల పునఃప్రారంభం రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకముందే పాఠశాల గేటుకు తాళం వేశారు. అయితే విద్యాశాఖ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ నీరేష్ వెంటనే అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడించడంతో తాళం తీశారు. -
నేటి నుంచి బడిగంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉ.9 గంటలకు బడిగంటలు మోగనున్నాయి. ప్రాథమిక పాఠశాలలు మ.3.20 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు సా.5 గంటల వరకు కొనసాగుతాయి. హైసూ్కళ్లలో సా.4 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం గంట సమయం (ఐచ్ఛికం) ఆటలు లేదా స్టడీ అవర్‌కు కేటాయిస్తారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను గతనెలలో ప్రాథమిక స్కూళ్ల విద్యా కేలండర్‌ను విడుదల చేసిన విద్యాశాఖ.. బుధవారం హైస్కూల్ అకడమిక్ కేలండర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకు గాను 83 రోజులను వివిధ సెలవులుగా ప్రకటించింది. మిగిలిన 233 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఇక సాధారణ బడులకు సెపె్టంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. అలాగే, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు సెపె్టంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు.. డిసెంబరు 21 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ప్రతి శనివారం అన్ని పాఠశాలల్లోను ‘నో బ్యాగ్ డే’ కొనసాగుతుంది. ఆ రోజు విద్యేతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికి ఏడు పేరెంట్స్–టీచర్స్ సమావేశాలుఇక విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే (ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్) ముందు పేరెంట్స్–టీచర్స్ సమావేశం (పీటీఎం) నిర్వహిస్తారు. ఏడాదిలో మొత్తం ఏడు పీటీఎంలు ఉంటాయి. వీటిలో జూన్ 25న, నవంబరు 25న మెగా పీటీఎంలు ఉంటాయి. ఆగస్టులో తెలుగు భాషోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి విద్యార్థులకు 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల్లో రాజకీయ విజ్ఞానం పెంచేందుకు కొత్తగా అసెంబ్లీ పర్యటనను చేర్చారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 8–10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఎంపికైన వారికి అమరావతిలోని శాసనసభ సందర్శించే అవకాశం కల్పిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు కొత్తగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా టెన్త్ విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించే మార్చిలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పిస్తారు. -
బడిబాట పట్టేనా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాలకు పంపింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. బడిబాట షెడ్యూల్ ఇదీ..6వ తేదీ: స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వా మ్యం చేస్తూ గ్రామసభలు నిర్వహించాలి. 7వ తేదీ: టీచర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో: అంగన్వాడీ కేంద్రాల సందర్శన. డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతోపాటు ప్రత్యేక అవస రాలున్న పిల్లలను గుర్తించి, అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11వ తేదీ: అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.12వ తేదీ: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి న పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదే రోజు వి ద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలి. 13వ తేదీ: ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.16వ తేదీ: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (లిప్) దినోత్సవం నిర్వహించాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టులవారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17వ తేదీ: ఇంటిగ్రేటెడ్ విద్య. బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18వ తేదీ: తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర అధునిక సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.19వ తేదీ: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించాలి. తగ్గుతున్న ప్రవేశాలుప్రభుత్వ స్కూళ్లలో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. అదే కాలంలో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 31.17 లక్షల నుంచి 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా ప్రవేశాలు తగ్గటానికి కారణంగా భావిస్తున్నారు. కాగా, బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తూతూమంత్రంగానే పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
భద్ర హరి పాట శాలలో తొలకరి
జూన్ 2న కేరళలో బడులు తెరుచుకోనున్నాయి. ఒకటో క్లాసులో చేరే పిల్లల కోసం అన్ని స్కూళ్లలో ‘ప్రవేశోత్సవం’ చేయడం కేరళ విద్యాశాఖకు ఆనవాయితీ. అయితే ఈసారి ఆ ఉత్సవానికి పాట రాయించాలనుకున్నారు. ప్రకటన ఇస్తే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భద్ర హరి రాసింది. ఎంపికైన ఆ పాట అన్ని స్కూళ్లలో స్వాగత గీతం కానుంది.కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ ఉదంతం చెబుతోంది. అక్కడ జూన్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఆ వేళ విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు, కొత్త విద్యార్థులను స్కూల్లో చేరేలాప్రోత్సహించేందుకు ‘ప్రవేశోత్సవం’ నిర్వహిస్తారు. ఇది ప్రతి ఏట కేరళ విద్యాశాఖ నిర్వహించే వేడుక. కాని ఈసారి స్వాగత గీతాన్ని తయారు చేసి పిల్లలకు వినిపించాలని సంకల్పించారు. గత సెప్టెంబర్‌లో పాటను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను అదూర్‌లో జూనియర్ ఇంటర్ చదువుతున్న భద్రహరి చూడటంతో మన కథ మొదలవుతుంది.రెండు రోజుల్లో పాట రాసిందిభద్రహరి ఐదో క్లాస్ నుంచి కవిత్వం రాస్తోంది. వాళ్ల నాన్న హరీంద్రనాథ్ అదూర్‌లో డిప్యూటీ తాసిల్దార్‌గా పని చేస్తున్నారు. అమ్మ సుమ టీచర్. పదో తరగతిలో ఉండగా ‘ధనుర్మాస పౌర్ణమి’ పేరుతో కవితా సంకలనాన్ని వెలువరించిన భద్రహరి కేరళ ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ‘కళా ఉత్సవం’లో కవిత్వం రాసి బహుమతులు పొందింది. ప్రభుత్వ ప్రకటన చూశాక బడికి వచ్చే పిల్లల కోసం పాట రాయాలనుకుంది. ‘మజా మేఘంగళ్’... పల్లవితో మొదలెట్టి రెండు రోజుల్లో పాట పూర్తి చేసింది. ‘నేను పదేళ్ల క్రితం మొదటిసారి బడికి వెళ్లడం గుర్తుకొచ్చింది ఈ పాట రాసేప్పుడు. కేరళలో చినుకులు మొదలైన వేళే బడులు తెరుచుకుంటాయి. పిల్లలు రంగురంగుల రెయిన్ కోట్లలో బడికి వస్తారు. కొందరు గొడుగులు తెస్తారు. మొదటిసారి చేరే పిల్లలు తల్లిదండ్రుల చేయి పట్టుకుని మొదటి అడుగు వేస్తారు. అదంతా నా మొదటి చరణంలో రాశాను. రెండో చరణంలో కేరళలో జరుగుతున్న శాస్త్ర, సాంకేతిక పురోగతిని చె΄్పాను. మూడో చరణంలో వ్యవసాయంలోను, సాంస్కృతికంగాను కేరళ ఘనతను చాటాను’ అని తెలిపింది భద్రహరి.ముఖ్యమంత్రితో కలిసి...పాట రాశాక భద్రహరికి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే వారం రోజుల క్రితం ఆమెకు విద్యాశాఖ నుంచి ఫోన్ వచ్చింది ‘మీ పాట స్వాగత గీతంగా ఎంపికైంది’ అంటూ. ‘ఆ రోజున నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంది భద్రహరి. ‘నేను రాసిన పాటకు నేనే ట్యూన్ కట్టి మొదట మా అమ్మానాన్నలకు వినిపించాను. వారు చాలా బాగుందని అన్నారు. అయితే ప్రభుత్వ కోరిక మేరకు సంగీత దర్శకుడు అల్ఫాన్స్ జోసఫ్ ఆ పాటకు తన ట్యూన్ కట్టి పాడారు. పాట చాలా బాగా వచ్చి వైరల్ అయ్యింది. జూన్ రెండున ముఖ్యమంత్రి విజయన్ కలవూర్లో జరిగే ప్రవేశోత్సవంలో ఈ పాటను ఆవిష్కరిస్తారు. ఆ వేడుకకు ఆయనతో పాటు పాల్గొనమని నాకు ఆహ్వానం అందింది’ అంది భద్రహరి.ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ ఎం.పి.సి, బై.పిసిల వైపే ఇంకా మొగ్గుతున్నా పదో క్లాస్‌లో టాప్ మార్కులతో పాసైన భద్రహరి ఇంటర్లో ఆర్ట్స్ తీసుకుంది. మలయాళ భాషలో పై చదువు చదివి లెక్చరర్ కావాలనుకుంటోంది. కవయిత్రిగా గుర్తింపు పొందాలనుకుంటోంది. సమాజం కవిత్వానికి విలువ ఇవ్వకపోయినా పిల్లలకు తెలుసు కవిత్వం ఎంత గొప్పదో. దానిని ఎలా గౌరవించాలో. భద్రహరి వంటి విద్యార్థులే నిజమైన సాహిత్య, సాంస్కృతిక పరిరక్షకులు. -
టెన్త్ విద్యార్థులపై చెరగని ‘రిమార్కు’
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్)/నూజివీడు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పదో తరగతి ఫలితాల్లో తీవ్రస్థాయి తప్పులు జరగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై విద్యార్థి లోకం మండిపడుతోంది.. తమ బిడ్డల భవిష్యత్ ముడిపడి ఉన్న పరీక్ష పత్రాలను ఇంత అడ్డగోలుగా దిద్దుతారా? అంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు.. లేనిపోని ఆర్భాటాలకు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా? అంటూ విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. రికార్డుల పిచ్చితో వారంలో పేపర్లు దిద్దేశామంటూ గొప్పలు పోవడం వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విద్యారంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో కూటమి సర్కారు ‘ఫెయిల్’ అయిందని తేల్చి చెబుతున్నారు. ఫెయిలైనవారిలో 60% మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్‌కు నమోదు చేసుకోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉంటుందని పేర్కొంటున్నారు. వాల్యుయేషన్‌లో ఇంత ఘోరంగా విఫలమైనవారు.. రీ వాల్యుయేషన్‌లో అయినా సరిగ్గా వ్యవహరిస్తారనే నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నారా లోకేశ్.. నోరు మెదపరేం..? ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత 66,363 మంది పేపర్ల రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 11 వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కులు మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డే ప్రకటించింది. వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం అని గొప్పలు పోయేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్ద పొరపాటే చేసింది. దీంతో హడావుడి చేసి.. ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి వేగంగా పేపర్లు దిద్దించిన సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ నోరు మెదపరేం? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పే లోకేశ్.. స్వయంగా తన శాఖలో జరిగిన దారుణంపై ఉలుకుపలుకు లేకుండా ఉండడం ఏమిటని నిలదీస్తున్నారు. వేగంగా మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తెచ్చి, టీచర్లకు ఎక్కువ పేపర్లు ఇవ్వడమే తప్పులు దొర్లడానికి కారణమని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసిన సర్కారు.. మరి మంత్రిగా విఫలమైన లోకేశ్‌ను ఎందుకు తప్పించడం లేదని సూటిగా అడుగుతున్నారు. జీవితంపై దెబ్బకొట్టారు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రభుత్వ విభాగాల్లోని ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో మెరుగైన విద్యను పొందే అవకాశం దక్కుతుంది. ఊహించని విధంగా ఫెయిల్ కావడంతో అనేకమంది విద్యార్థులు ఐఐఐటీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీట్లు పొందలేకపోయారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సాయం చేస్తుంటాయి. తప్పుల మూల్యాంకనం కారణంగా ఇప్పుడీ అవకాశాలు చేజారాయి. ఈ నేపథ్యంలో ఎవరిది తప్పు..? మాకెందుకీ శిక్ష? అని విద్యార్థులు నిలదీస్తున్నారు. తమ మనో వ్యథను ఎవరు తీరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారాయికాగా, ఈ ఏడాది 45,96,527 పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. 16,482 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 5,494 మంది స్పెషల్ అసిస్టెంట్స్, 2,747 మంది చీఫ్ ఎగ్జామినర్స్ ఇందులో పాల్గొన్నట్లు చెప్పారు. రోజుకు ఒక్కో ఉపాధ్యాయుడు 40 పేపర్లు దిద్దినట్టు వివరించారు. కొన్నేళ్లుగా 44.50 లక్షల నుంచి 47.80 లక్షల వరకు జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 99.76 శాతం కచ్చితత్వంతో పేపర్లు దిద్దామని.. 34,709 మంది విద్యార్థులు జవాబు పత్రాల రీచెకింగ్‌కు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారినట్లు తెలిపారు.‘కార్పొరేట్ ఇంటర్’ కొమ్ముకాయడానికే హడావుడి!ఇంటర్ తరగతులను హడావిడిగా ప్రారంభించి కార్పొరేట్లకు కొమ్ముకాయడానికే పదో తరగతి పేపర్లు త్వరగా దిద్దించారు. మూల్యాంకనంలో ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. దీనికి ఉపాధ్యాయులను బలి చేయడం దారుణం. విద్యా సంస్కరణల పేరుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇచ్చామని మంత్రి లోకేశ్ గొప్పలు చెబుప్పడం సిగ్గుచేటు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేశారు? ప్రభుత్వం విద్యార్థుల నుంచి వసూలు చేసిన రీవాల్యుయేషన్ ఫీజు తిరిగి చెల్లించాలి. –ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్రావు, ప్రసన్నకుమార్ విద్యార్థుల జీవితాలతో మంత్రి లోకేష్ చెలగాటం విద్యా వ్యవస్థను మంత్రి లోకేశ్ గాలికి వదిలేశారు. టెన్త్ ఫలితాలు వారం రోజుల్లోనే వెల్లడించేస్తాం అని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. ప్రభుత్వ తప్పిదం పిల్లల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. –ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ ప్రతిభావంతులను ఫెయిల్ చేయడమేనా రికార్డు? వారం రోజుల్లో మూల్యాంకన ప్రక్రియ ముగించాలనే అనవసర ఒత్తిడితోనే తప్పులు దొర్లాయి. తక్కువ సమయంలో ఫలితాలు ప్రకటించామని ప్రభుత్వం రికార్డుగా చెప్పుకొంటోంది. 66,363 పేపర్ల రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తులు రావడం, 11 వేలపైగా పేపర్లలో విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కులు మారడం ఏం రికార్డు? –ఆలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ లోకేశ్ గొప్పలు.. విద్యార్థులకు తిప్పలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం విషయంలో ఉన్న శ్రద్ధ పదో తరగతి విద్యార్థులకు సరైన ఫలితాలను విడుదల చేయడంలో లేదు. తక్కువ సమయంలోనే ఫలితాలు విడుదల చేశామని ప్రభుత్వం, మంత్రి లోకేశ్ గొప్పలు చెప్పుకొంటే.. తమ ప్రతిభకు తగ్గట్లుగా మార్కులు రాక విద్యార్థులు మనో వేదనకు గురయ్యారు. –ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ విద్యార్థులను అంధకారంలోకి నెట్టిందికూటమి ప్రభుత్వం పది పరీక్షల మూల్యాంకనంతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తప్పుల మూల్యాంకనంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలి. –ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదుపిల్లల మార్కుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. –బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వై.గోపీ -
దేశమంటే కేంద్రం కాదోయ్!
‘ఇండియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ చిక్కుల్లో పడింది. న్యాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలు అందరికీ సమానంగాఅందిస్తూ, ఇండియాను ఆధునిక, ప్రజాస్వా మిక, లౌకిక రాజ్యంగా మార్చడమే రాజ్యాంగ అభిమతం. ఇండియా కాషాయ రంగు ఒక్కటే పులుముకున్న దేశంగా ఉండాలన్న భావన ఏనాడూ లేదు. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలతో విలసిల్లే వైవిధ్యభరిత దేశమే లక్ష్యంగా రాజ్యాంగ రచన జరిగింది. ఈ వైవిధ్యత నేడు పెను సవాలు ఎదుర్కొంటోంది. ఇండియాలోని ఒక్కో రాష్ట్రం స్వరూప స్వభావాలు ఒక్కోవిధంగా ఉంటాయి. కాబట్టి వాటిమధ్య రాజకీయ, ఆర్థిక బలాబలాల సమతుల్యత సాధించడం ముఖ్యం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రస్తుత డీలిమిటేషన్ (నియో జకవర్గాల పునర్విభజన) కసరత్తు వల్ల పార్లమెంటులో వెయిటేజ్ తగ్గుతుంది. అలా చేయలేని విఫల రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరిట అధిక పార్లమెంటు స్థానాలిచ్చి సత్కరిస్తున్నారు. పార్లమెంటరీ నియో జక వర్గాల సంఖ్యను ఇప్పుడున్న స్థాయిలోనే శాశ్వతంగా స్తంభింప జేయాలి. డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపేయాలి.విద్య పూర్తిగా రాష్ట్రాలదే!ప్రపంచం ఇప్పుడు సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. విద్యా ప్రమాణాలే సమాజాల ప్రగతిని శాసిస్తాయి. కేంద్ర నిర్వహణలోని ఉన్నత విద్యావిధానం చాలావరకు విఫలమైంది. విద్య యావత్తూ రాష్ట్ర జాబితాలోకి రావాలి. ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల అధికార పరిధి నుంచి రాష్ట్రాలను విముక్తం చేయాలి. వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యను మెరుగుపరచడం మాత్రమే నేటి జాతీయ అవసరం. నాణ్యమైన విద్యలో రాష్ట్రాలు పరస్పరం పోటీ పడేవిధంగా విధానాలు ఉండాలి. అంతేతప్ప, సగటు స్థాయి కేంద్రీకృత నిర్వహణ సంస్థలకు తలొగ్గే పరిస్థితి ఉండకూడదు. కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) చెల్లించి పంటలను కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ఏవో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకే పరిమిత మైంది. ఇలా సేకరించడం అంటే సబ్సిడీ ఇవ్వడమే. వ్యవసాయ సాగుభూమి ప్రాతిపదికగా, ఈ సేకరణ అన్ని రాష్ట్రాలకూ వర్తింప జేయాలి. ఆహారధాన్యాల్లో తృణధాన్యాలు ఎక్కువ భాగం ఆక్రమి స్తాయి కనుక అన్ని రాష్ట్రాల్లో వాటి సేకరణకు గ్యారెంటీ ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో ఇలా సేకరణ చేయడం సాధ్యం కాదనుకున్నప్పుడు, ఆ యా రాష్ట్రాలకు అందుకు బదులుగా గ్రాంట్ల రూపేణా పరిహారం ఇవ్వాలి.గంగా పరివాహకేతర ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, రాగి, జింకు, నికెల్ వంటి ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయి. ఈ వనరులు ఎవరి భూమి కింద ఉన్నాయో వారికి చెందాలి. అన్ని ఖనిజాల మీద ఆ యా రాష్ట్రాలకే తవ్వకం హక్కులు కట్టబెట్టాలి. వాటి ద్వారా సమకూరే ఆదాయాలు సైతం వాటికే సంక్రమించాలి.పన్నుల్లో వాటా రాష్ట్రాలకు ముందే ఇచ్చేయాలి!రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తి సాధించినప్పుడే నిజమైన సమాఖ్య వ్యవస్థ సాధ్యమవుతుంది. అంటే రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులుండాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం, పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ప్రస్తుతం 42 శాతం వాటా దక్కాలి. అలా జర గటం లేదు. కేంద్రం వద్ద నిధులు కేంద్రీకృతమవుతున్నాయి. దీనికి తోడు, రాష్ట్రాలకు రావలసిన పన్ను బకాయిలను తొక్కిపట్టే ధోరణి పెరుగుతోంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయాన్ని కేంద్రం తన పథకాల కోసం వాడుకుంటోంది. దీని నివారణకు మార్గాలు ఆలోచించాలి. పన్ను చెల్లింపు మూలం వద్దే రాష్ట్రాలకుచెందాల్సిన వాటా మినహాయించే విధానం అవసరం. దీనివల్ల సకాలంలో రాష్ట్రాలకు నిధులు అంది, అవి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలుగుతాయి. నిధుల బదిలీలో జాప్యం జరిగితే ఆర్బీఐ రేట్ల ప్రకారం వడ్డీ చెల్లించే నిబంధన కూడా ఉండాలి.అలాగే, రాష్ట్రాలకు తమ సాంస్కృతిక చారిత్రక వనరులను పరిరక్షించుకునే హక్కు ఉంది. కేంద్రం తన అధీనంలోని ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారా ఈ పరిరక్షణ హక్కును కాపాడటంలో విఫలమైంది. పురాతన కట్టడాలు, కళాఖండాల సంపద నాశనమవుతోంది. ఈ బాధ్యతను నేరుగా రాష్ట్రాలకే అప్పగించాలి. ఏఎస్ఐ వద్ద ఉండే రాష్ట్రాల నిధులను తక్షణం బదిలీ చేయాలి. ఏఎస్ఐ, కేంద్ర సాంస్కృతిక శాఖ సంకుచిత భావజాలంతో కొన్ని ప్రాంతాల మీద అధిక ప్రేమ కనబరచే ధోరణి పెరుగుతోంది.సైన్యంలో ఆ ఒక్క రాష్ట్రమేనా?సైనిక దళాలు, పారామిలిటరీ దళాల నియామకాలు కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. పరిమిత కాల సర్వీసు, జీవితకాల పెన్షన్, ఇతర బెనిఫిట్స్ కారణంగా యుద్ధ జాతులుగా పరిగణనలో ఉన్న వారికి మిలిటరీలో ఎక్కువ అవకాశాలు దక్కి వారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఇది ఎలా జరుగుతోందో ఉదాహరణలతో పరిశీలిద్దాం. మద్రాస్ రెజిమెంట్ భారత సైన్యంలో అత్యంత పురాతనమైన పదాతిదళం. నీలగిరుల్లోని వెల్లింగ్టన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెజిమెంటులో 21 బెటాలియన్లు ఉన్నాయి. దక్షిణ భారతం అంతటికీ చెందిన దాదాపు 27 కోట్ల మంది (భారతీయుల్లో 22 శాతం) దీని పరిధిలోకి వస్తారు. అదే సిక్కు రెజిమెంటును తీసుకుంటే, కేవలం 80 లక్షల జనాభా నుంచి దీనికి ఎంపికలు జరుగుతాయి. ఈ ఒక్క రెజిమెంటులోనే 22 పదాతిదళ బెటాలియన్లు ఉన్నాయి. కేవలం 3 కోట్ల జనాభా ఉన్న పంజాబు రాష్ట్రంలోని అన్ని రెజిమెంట్ల కిందా కలిపి 74 బెటాలియన్లు ఉంటాయి. గ్రామీణ యువ తకు అద్భుత ఉపాధి అవకాశాలు కల్పించే ఒక సంస్థలో ఆ యాప్రాంతాల ప్రాతినిధ్యంలో ఇంతటి అసమానత ఉండటం సమంజసం కాదు. ఇతర ప్రాంతాల నుంచి సైనిక దళాల్లోకి నియామకాలు పెంచాల్సి ఉంది.ఇక మీడియా విషయానికి వద్దాం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడి యాలు రెండూ భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. పైగా, వీటిని కేంద్ర ప్రభుత్వం, బడా వ్యాపార సంస్థలు అదుపు చేస్తున్నాయి. గమ నించవలసిన అంశం ఏమిటంటే, ఈ రెండూ ప్రముఖంగా ఉన్నా, నేటికీ రేడియో వార్తలు దేశంలో అధిక సంఖ్యాకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అదుపు చేస్తోంది. రేడియో వార్తలను ఎఫ్ఎం బ్యాండ్స్ మీద ప్రసారం చేయడానికి స్థానిక ఔత్సాహికులను అనుమతించాలి. ప్రింటు, టీవీ ప్రసార మాధ్యమాల నిర్వహణను ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు రెండూ చేపట్టే అనుమతి ఉన్నప్పుడు, అత్యధికులకు అందుబాటులో ఉండే రేడియో ద్వారా సమాచారం అందించడానికి ప్రయివేటు, రాష్ట్ర ప్రభు త్వాలకు ఎందుకు అనుమతి ఇవ్వరో అర్థం కాని విషయం.అన్ని జాతులకూ వర్గాలకూ సమాన గౌరవం దక్కినప్పుడేఇండియా సమైక్యత వికసిస్తుంది. ప్రతి ఒక్కరికీ తమ వాణి వినిపించే అవకాశం కల్పించిన రాజ్యాంగం రాష్ట్రాలను ఒక రాజకీయ సమాహా రంగా కూర్చింది. అందుకు భిన్నంగా దేశాన్ని ఏకవర్ణంగా, ఏకశిలగా మార్చే ఎలాంటి ప్రయత్నం చేసినా అది దుస్సాహసం అవుతుంది. అదే జరిగితే రాజ్యాంగ మౌలిక భావన కుప్పకూలుతుంది. యూని యన్ విచ్ఛిన్నం అవుతుంది.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత , మోహన్ గురుస్వామి- mohanguru@gmail.com -
ఉపాధ్యాయ బదిలీల్లో గందరగోళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలపై గందరగోళం నెలకొంది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా పీఎస్ హెచ్ఎం (ప్రైమరీ స్కూల్) పోస్టుల భర్తీకి నిబంధనలు విడుదల చేసింది. ఇందులో.. 4,706 మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పీఎస్ హెచ్ఎం పోస్టులుగా మార్పుచేసింది. వీటిల్లో జిల్లా పరిషత్ యాజమాన్యానికి 4,556.. ప్రభుత్వ యాజమాన్యానికి 55, మున్సిపాలిటీ యాజమాన్యానికి 95 పోస్టులు చొప్పున మంజూరుచేసింది. ఇప్పుడీ పోస్టుల భర్తీలో విద్యాశాఖ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. దీనివల్లే సరైన బదిలీల విధానాన్ని విద్యాశాఖ ఇప్పటివరకు బహిర్గతం చేయట్లేదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పైగా.. తమ ప్రతిపాదనలను పట్టించుకోకుండా విద్యాశాఖ ప్రతిపాదించిన అంశాలనే ఖరారు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపిస్తున్నాయి. విద్యాశాఖ ప్రతిపాదనలు ఇలా.. » జిల్లాల వారీగా కన్వర్షన్ చేసిన పీఎస్ హెచ్ఎంల పోస్టులను మిగులు సబ్జెక్టు పోస్టుల సంఖ్య నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తారు. ఏ సబ్జెక్టుకు ఎన్ని అని కేటాయిస్తారే తప్ప ఏ సబ్జెక్టుకు ఏ ఖాళీ అనేది నిర్ధారించరు. అనంతరం.. బదిలీకి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో పీఎస్ హెచ్ఎం పోస్టు కోరుకునే వారి నుంచి సమ్మతి తీసుకుంటారు. సమ్మతి తెలిపిన వారిని సబ్జెక్టు బదిలీ జాబితాలోకి అనుమతించరు. » తదుపరి.. సమ్మతి ఇచి్చన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల సమ్మిళిత సీనియారిటీ జాబితా తయారుచేసి పీఎస్ హెచ్ఎం బదిలీలకు శ్రీకారం చుడతారు. ఈ ప్రక్రియకు ముందు బదిలీలకు దరఖాస్తు చేసుకుని ఇప్పటికే పనిచేస్తున్న పీఎస్ హెచ్ఎంల బదిలీలు జరుపుతారు. మిగిలిన ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు ప్రదర్శిస్తారు. ఈ రెండో ప్రతిపాదన ఇష్టంలేని స్కూల్ అసిస్టెంట్లను వారి సబ్జెక్టు బదిలీలకు, సమ్మతి ఇచ్చి బదిలీకి నోచుకోని వారిని కూడా సబ్జెక్టువారీ బదిలీలకు అనుమతిస్తారు. రెండు ప్రతిపాదనల్లోనూ ఎవరి సమ్మతిలేని పక్షంలో జాబితా చివరి ఉపాధ్యాయులకు కచ్చితంగా స్థానం కల్పిస్తారు. మిగులు ఎస్‌ఏలకు ప్రాధాన్యత కల్పించాలి.. ఇదిలా ఉంటే.. పీఎస్ హెచ్ఎం ఖాళీల భర్తీలో మిగులు స్కూల్ అసిస్టెంట్లకు ప్రాధాన్యత కల్పించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు.ఉపాధ్యాయ సంఘాలను పట్టించుకోని విద్యాశాఖ..ఇక విద్యాశాఖ ఇచ్చిన ఈ రెండు ప్రతిపాదనల్లో రెండో దానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మొగ్గుచూపగా మరికొన్ని వీటికంటే ఉత్తమమైన మార్గాన్ని చూపించాలని కోరాయి. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో సబ్జెక్టుల వారీగా పీఎస్ హెచ్ఎం ఖాళీలను బదలాయింపు చేసిన తర్వాత మండల స్థాయిలో కూడా సబ్జెక్టుల వారీగా ఖాళీలను విభజించాలని.. తద్వారా సబ్జెక్టుల వారీగా బదిలీలకు ఆప్షన్లను ఆహ్వానించాలని ప్రతిపాదించాయి. దీన్ని విద్యాశాఖ నిర్ద్వందంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మూడో ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. మిగులు ఖాళీల సర్దుబాటుతో ఏర్పడిన పీఎస్ హెచ్ఎం ఖాళీల భర్తీలో మిగులు ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలని ప్రతిపాదిస్తున్నాయి. ఇప్పటికే బదిలీలకు దరఖాస్తు చేసుకున్న పాత పీఎస్ హెచ్ఎంలను, మిగులు స్కూల్ అసిస్టెంట్ల సమ్మిళిత జాబితాతో పాటు పదోన్నతికి అనుమతించిన ఉపాధ్యాయుల జాబితాను అనుసంధానం చేసి ఉమ్మడి సీనియారిటీ జాబితాతో పీఎస్ హెచ్ఎం ఖాళీలను భర్తీచేయాలని కోరుతున్నాయి. తద్వారా సీనియారిటీ పాయింట్ల ప్రతిభతో పాటు మిగులు ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు. ఇక బదిలీకి నోచుకోని స్కూల్ అసిస్టెంట్లు యథాతథంగా ఆయా సబ్జెక్టుల బదిలీల జాబితాలోకి వెళ్లేలా చూడాలని విద్యాశాఖ ముందుకు కొత్త ప్రతిపాదనలు తెస్తున్నారు. ఇలా చేయడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, మొత్తం ప్రక్రియ సులభతరం అవుతుందని చెబుతున్నారు. -
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు. -
మిగులు టీచర్ల దిగులు
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది. మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్‌వోడీ పూల్‌లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్‌వోడీ పూల్‌లో ఉంచారు. నిన్న 1,902.. నేడు 1772 మంది రాష్ట్రంలో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్‌వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్‌వోడీ పూల్‌కు అప్పగించిన 1,902 మందికి అదనం. వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘స్పెషల్’ టీచర్ల మాటేంటి? ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్‌ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్
-
అర్హతలో బాలికలు.. ర్యాంకుల్లో బాలురు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)లో బాలికలే పైచేయి సాధించారు. అయితే, టాప్ ర్యాంకుల్లో మాత్రం బాలురే ముందు వరుసలో ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో టాప్ ర్యాంకులు అత్యధికంగా బాలురకే దక్కాయి. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 73.26 శాతం అర్హత సాధిస్తే, అగ్రి, ఫార్మసీ సెట్లో 87.82 శాతం మంది అర్హత సాధించారు. ఈఏపీసెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు తన నివాసంలో విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్‌రెడ్డి, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. టాపర్లంతా బాలురే ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ సెట్‌కు 2,20,326 మంది దరఖాస్తు చేసుకుంటే, 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,51,779 మంది (73.26 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 86,762 మంది దరఖాస్తు చేసుకుంటే, 81,198 మంది పరీక్ష రాశారు. వీరిలో 71,309 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ సెట్లో బాలికలు 73.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 72.79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. అగ్రి, ఫార్మసీ సెట్లో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం అర్హత సాధించారు. అయితే, టాప్ ర్యాంకుల్లో ఎక్కువగా బాలురే కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌లో మొదటి పది ర్యాంకులు బాలురకే దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంకు చెందిన పల్లా భరత్‌చంద్ర మొదటి ర్యాంకు దక్కించుకుంటే, హైదరాబాద్‌కు చెందిన ఉడగండ్ల రమాచరణ్రెడ్డి రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మూడో ర్యాంకు కూడా ఏపీకి చెందిన పమ్మిన హేమసాయి సూర్యకార్తీక్‌కు వచ్చింది. నాన్–లోకల్ కోటాను ఈ ఏడాది నుంచి ఎత్తివేయటంతో ఏపీకి చెందిన విద్యార్థులు సెట్ రాయడం వరకే అర్హులు. వారికి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించరు. అగ్రి, ఫార్మసీ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో 9 ర్యాంకులు బాలురకే దక్కాయి. హైదరాబాద్‌కు చెందిన సాకేత్‌రెడ్డి మొదటి స్థానం పొందారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బ్రాహ్మిణి రెండ్ల ఐదవ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకర్లు....డాక్టర్‌గా పేద ప్రజలకు సేవ చేయాలని ఉంది డాక్టర్‌గా పేద ప్రజలు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా మంచి ర్యాంక్ ఆశిస్తున్నా. తల్లిదండ్రుల, అధ్యాపకులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే టాప్ ర్యాంక్ సాధించగలిగా. – సాకేత్‌రెడ్డి, 1వ ర్యాంకర్డాక్టర్ కావాలన్నదే లక్ష్యం కష్టపడి చదవటం వల్లే మూడో ర్యాంక్ సాధించగలిగాను. సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్ బైపీసీలో 992 మార్కులు వచ్చాయి. ఇటీవల ‘నీట్’పరీక్ష రాశాను. మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్ ఫలితాలు విడుదలయ్యాక ఎంబీబీఎస్‌లో చేరతాను. – చాడా అక్షిత్, 3వ ర్యాంకర్గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. నేను ప్రతి రోజూ 16 గంటలు చదివాను. ఇందులో మంచి ర్యాంక్ వచి్చనప్పటికీ నా దృష్టి మొత్తం నీట్‌పైనే ఉంది. గొప్ప డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. – సాయినంద్, 4వ ర్యాంకర్మెడిసిన్ చదివి ప్రజలకు సేవ చేస్తా మెడిసిన్ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించాను. అధ్యాపకులు కూడా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. –బ్రాహ్మిణి రెండ్ల, 5వ ర్యాంకర్,వైద్యవృత్తి పట్ల నాకు ఆసక్తి వైద్యవృత్తి పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల శిక్షణతో ర్యాంకు సాధించగలిగా. నీట్లో కూడా మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నా. – గుమ్మడిదల తేజస్, 6వ ర్యాంకర్డాక్టర్ కావడం నా కల డాక్టర్ కావడం నా కల. వైద్య వృత్తిలో చేరి పేద ప్రజలకు సేవ చేస్తా. నీట్లో సైతం మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రణాళికాబద్ధంగా చదవడంవల్లే మంచి ర్యాంక్ సాధించగలిగాను. – కొలను అఖీరానంద్రెడ్డి, 7వ ర్యాంకర్పేదలకు వైద్య సేవలు అందిస్తా డాక్టర్‌గా మారి పేదలకు సేవ చేయాలని ఉంది. నీట్లో కూడా టాప్ టెన్‌్త ర్యాంక్ ఆశిస్తున్నా. మెదటి నుంచి డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. ఆ దిశలోనే పట్టుదలతో చదివా. ఆసక్తి లేకపోయినా కళాశాల అధ్యాపకుల సలహాతోనే టీజీ ఈఏపీసెట్ పరీక్ష రాశాను. నీట్ పరీక్ష అంతకంటే బాగా రాశాను. అధ్యాపకుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంక్ సాధించగలిగాను. – భానుప్రకాష్‌రెడ్డి, 8వ ర్యాంకర్ ఇంజనీరింగ్ ర్యాంకర్లు...ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. ఎంసెట్‌లో 2వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల గైడెన్స్‌తో ర్యాంకు సాధించగలిగా. – ఉడగండ్ల రామచరణ్‌రెడ్డి, 2వ ర్యాంకర్ సివిల్ సర్వీసెస్ టార్గెట్ సివిల్ సర్వీసెస్ సాధించటం నా లక్ష్యం. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయాలని ఉంది. ఇటీవల జేఈఈ మెయిన్‌లో జనరల్ కేటగిరీ 75వ ర్యాంక్, ఓబీసీలో 10వ ర్యాంక్ సాధించా. ఇంజనీరింగ్ పూర్తి కాగానే సివిల్స్‌కు సిద్ధమవుతా. – సూర్యకార్తీక్, 3వ ర్యాంకర్ ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా ఐఐటీ బాంబేలో సీటు సాధించడం లక్ష్యం. జేఈఈ మెయిన్‌లో 70వ ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంక్ సాధించగలిగా. ఐఐటీ తర్వాత సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం కావాలని ఉంది. – లక్ష్మీ భార్గవ్, 4వ ర్యాంకర్ ఐఐటీ బాంబేలో చేరటమే లక్ష్యం ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదవటమే నా లక్ష్యం. ప్రస్తుతం ఈఏపీ సెట్లో 5వ ర్యాంక్ రావటం సంతోషంగా ఉంది. ఈ పరీక్ష కోసం ప్రణాళికాబద్ధంగా చదివాను. – వెంకటగణేష్ రాయల్, 5వ ర్యాంకర్భవిష్యత్లో సివిల్స్‌కు ప్రిపేరవుతా ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావటం సంతోషంగా ఉంది. నా అసలు లక్ష్యం సివిల్స్ సాధించటం. భవిష్యత్‌లో సివిల్స్‌కు ప్రిపేరవుతా. నా సోదరి కూడా సివిల్స్ సాధించింది. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియా 31వ ర్యాంక్ సాధించా. ఓబీసీ కేటగిరీలో మూడో ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సీరియస్‌గా చదువుతున్నాను. –రుస్మిత్ బండారి, 7వ ర్యాంకర్తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది ఈఏపీ సెట్లో ర్యాంక్ సాధించడానికి దేవుడి దయ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. మంచి ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. కళాశాల ప్రిన్సిపాల్, డీన్ పూర్తి సహకారం అందించారు. – అర్జా శామ్యూల్ సాత్విక్, 9 ర్యాంకర్డాక్టర్ కావటమే లక్ష్యం డాక్టర్ కావటమే నా లక్ష్యం. అందుకోసం కష్టపడి చదివాను. దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాను. నీట్ కోసం శిక్షణ తీసుకుంటూనే ఈఏపీ సెట్ రాశాను. – శశికిరణ్, 10వ ర్యాంకర్ -
మిగులుపై గుబులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు గుబులు రేపుతోంది. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే, గత ప్రభుత్వంలో చేసిన జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసిన పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలతో రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మిగులు (సర్ప్లస్) ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాలలోనే ఎనిమిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిలకడలేని కొత్త నిబంధనలతో మిగులు సమస్య ఏర్పడింది. 2023లో ఉపాధ్యాయ బదిలీల్లో ఈ సమస్య లేదని, జీవో నంబర్ 47 ప్రకారం మిగులు ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపులో సమన్యాయం పాటించి న్యాయం చేశారని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. జీవో నంబర్ 117 అమల్లో భాగంగా మిగులు ఉపాధ్యాయులకు పాత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని, కొత్త పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని (పాత, కొత్త స్టేషన్) రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించారు. కానీ, ఇటీవల విద్యా శాఖ విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో అనేక లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే పాయింట్లు కోరుకుంటే వారికి ప్రస్తుత రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన బదిలీలలో మిగులు ఉపాధ్యాయులకు పాత, కొత్త స్టేషన్ల (పాఠశాల)లో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు సర్వీసు పాయింట్లు కేటాయించారు. దీనికి అదనంగా రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇచ్చి న్యాయం చేశారు. అంతేగాక సర్ప్లస్ ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్లు (స్పౌజ్ వంటివి) ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిగులు ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు.ఇప్పుడంతా గందరగోళంజీవో 117 రద్దులో భాగంగా చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. పాఠశాలల మెర్జింగ్, సబ్జెక్టు టీచర్ల తొలగింపుతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పెంచడంతో దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు (సర్ ప్లస్) ఏర్పడుతున్నారు. విద్యాశాఖ కొత్త నిబంధనలతో సర్ ప్లస్ అయిన ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల కంటే మెరుగైన స్థానాలకు బదిలీ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రక్రియ నడుస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాఠశాలలో పని చేసిన కాలానికి ఇచ్చే స్టేషన్ పాయింట్లను కోరుకునే వారికి రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. కొత్త పాఠశాలలో పని చేసిన కాలానికి స్టేషన్ పాయింట్లు కోరుకున్న వారికి మాత్రమే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామనడంతో మిగులు టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త పాఠశాలల్లో రెండు నుంచి నాలుగేళ్ల సర్వీసు గలవారే మిగులుగా మారుతున్నారు. వీరు పాత పాఠశాలలో ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పని చేశారు. ప్రస్తుత బదిలీల్లో వీరే నష్టపోతున్నట్టు తెలుస్తోంది. 2023లో ఇచ్చినట్టుగా పాత, కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్లకు స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వమే బలవంతంగా బదిలీ చేస్తున్నందున న్యాయం చేయాలని మిగులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉపాధ్యాయ చర్చల్లో కొందరికే ప్రాధాన్యంబదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విద్యా శాఖ గత ఎనిమిది నెలలుగా ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందులో కేవలం 9 గుర్తింపు సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించారు. కీలకమైన 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను దూరం పెట్టారు. దీంతో రిజిస్టర్డ్ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయ సమస్యలపై నిర్వహించే సమావేశాల్లో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలేగానీ, కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ఆ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సమావేశాల్లో ఐదు నెలల క్రితం ఒకసారి అవకాశం కల్పించారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశానికి మాత్రమే గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే, అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక నిర్వహించిన ఈ సమావేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
ఫీ'జులుం'..
మదనపల్లె సిటీ: వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలలు ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాయి. ఇది వరకకే తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి 40 శాతానికిపైగా ఫీజులు పెంచుతూ వారి తల్లిదండ్రుల సెల్ఫోన్లకు సమాచారం పంపుతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భయంతో బెంబేలెత్తుతున్నారు. పోటీ ప్రపంచంలో బడి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజులు పెంచినా తప్పనిసరిగా చెల్లించే పరిస్థితి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.జిల్లాలో మదనపల్లె, రాయచోటి, పీలేరు, రాజంపేట ప్రాంతాల్లో సీబీఎస్ఈ కింద ఎల్కేజీలోనే ప్రవేశాలకు దాదాపు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. పాఠశాలలో వసతులు, సౌకర్యాలను బట్టి ఇవి మరింత ఎక్కువగా ఉంటున్నాయి. పాఠశాలకు రవాణా సౌకర్యం,యూనిఫాం, పాఠశాలల్లో ప్రత్యేక రోజుల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, పరీక్షల రుసుం తదితర వాటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వెరసి ఒకటో తరగతి చదివే విద్యార్థికి ఏడాదికి సగటున రూ.80వేలు వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ప్రశాంత్‌నగర్‌కు చెందిన కిషోర్‌కు ఒక కూతురు. మూడో తరగతి పూర్తి చేసిన ఆ పాపను ఓ కార్పొరేట్ బడిలో చేర్పిద్దామని ఇటీవల అక్కడికి వెళ్లగా నాలుగో తరగతి ఫీజు రూ.62 వేలుగా తేల్చేశారు. మూడో తరగతికి కిషోర్ కట్టిన ఫీజు రూ.36 వేలు, ఏకంగా రెట్టింపు అడగడంతో కంగుతిన్న కిషోర్ కొత్త బడిలో చేర్పిద్దామనే ఆలోచనకు స్వస్తి పలికి పాత పాఠశాలలోనే కొనసాగించాలనే నిర్ణయానికొచ్చారు. వాల్మీకిపురం కోనేటికట్టకు చెందిన శ్రీనివాస్ తన మూడేళ్లు కొడుకును ప్లే స్కూల్లో చేర్చిద్దామని వెళ్లగా ఏడాదికి ఫీజు రూ.30 వేలు అని చెప్పింది స్కూల్ యాజమాన్యం. వచ్చే విద్యా సంవత్సరం(2025–26)కి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, ఆలస్యమైతే మరో రూ.5 వేలు ఎక్కువవుతాయని చెప్పగా తొలి దశ కింద రూ.10వేలు కట్టి అడ్మిషన్ ఖాయం చేసుకున్నారు. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన శశివర్థన్,శ్వేత దంపతులకు ఇద్దలు పిల్లలు. సీబీఎస్ఈ సిలబస్ ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీలో తన కుమారుడిని చేర్పించడానికి ఫీజుల వివరాలు ఆరా తీశారు. ఏడాదికి రూ.56 వేలు ఫీజు, రవాణా, యూనిఫాం, ఇతర ఖర్చులు అదనమని చెప్పడంతో తక్కువ ఫీజు ఉన్న ఇతర పాఠశాలలో చేర్పించాలని నిర్ణయానికి వచ్చారు. కనిపించని ఫీజు బోర్డులుప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు బోర్డులు ఎక్కడా కన్పించడం లేదు. ఏ తరగతికి ఎంత ఫీజు వివరాలు ఆయా పాఠశాలల్లో బోర్డుల్లో కనబరచాలి. అలాంటిది ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. చర్యలు తీసుకోవాలిఅధికంగాఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. వేసవి సెలవుల్లోనే కొన్ని కార్పోరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీజులతో పాటు అదనంగా పుస్తకాలు వంటి వాటి పేరుతో అధికంగా డబ్బులు గుంజుతున్నారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. –మాధవ్, ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి -
అమ్మాయిలు అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలే పైచేయిగా నిలిచారు. అటు ఉత్తీర్ణతా శాతంలోనూ, ఇటు అత్యధిక మార్కుల్లోనూ అసాధారణ ప్రతిభను కనబర్చి ఔరా అనిపించారు. తొలి 10 స్థానాల్లో ఏకంగా 8 మంది అమ్మాయిలుండగా, ఇద్దరు మాత్రమే అబ్బాయిలున్నారు. మొత్తమ్మీద బాలురు 91.32 శాతం ఉత్తీర్ణులైతే, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ‘సాక్షి’కి అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన సిర్ప కృతి, కామారెడ్డి జిల్లాకు చెందిన నిమ్మ అన్షిత 600కు గాను 596 మార్కులతో స్టేట్ టాపర్లుగా నిలిచారు.టాప్–10 స్థానాల్లో నిలిచిన వారి మార్కుల మధ్య తేడా కేవలం రెండు మార్కులే కావడం గమనార్హం. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కన్నా గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. ఈమేరకు బుధవారం టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షలకు 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,733 మంది ప్రైవేటు (కంపార్ట్మెంట్) విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో మొత్తం 4,60,519 మంది పాస్ కాగా, 92.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మెమోలో గ్రేడింగ్‌తోపాటు మార్కులు టెన్త్ ఫలితాల వివరాలను పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి వివరించారు. 4,629 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని, రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఫలితం వచ్చిందన్నారు. మహబూబాబాద్ 99.29 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ముందు వరుసలో ఉందని, వికారాబాద్ 73.97 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయని తెలిపారు. ఇతర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ 92.78 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులను కూడా మెమోలో పొందుపర్చారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య పరీక్షల విభాగం వెల్లడించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియకు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. -
విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు
-
నేటి నుంచి వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీలు జూన్ 2న, పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే, అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 6న విధుల్లో చేరాలని విద్యా శాఖ ఆదేశించింది. -
డీఎస్సీకి వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ రాసే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. అభ్యర్థుల గరిష్ట వయసును 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. 2024 జూలై 1 నాటికి ఈ వయసును పరిగణిస్తామని, ఈ ఒక్కసారికే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పలు పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ సాక్షి, అమరావతి: పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజాబాబు చెప్పారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు– సీనియర్ పౌరుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. 27న మధ్యాహ్నం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 27న ఉదయం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 పరీక్ష ఉంటుంది. ఏపీ ఫిషరీస్ సర్వీస్‌లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలో భాగంగా ఈనెల 28న ఉదయం పేపర్–1, 30న ఉదయం పేపర్–2, మధ్యాహ్నం పేపర్–3 పరీక్ష జరగనుంది. ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోసు్టల రాత పరీక్ష ఈనెల 28న ఉదయం, మ«ద్యాహ్న సమయాల్లో నిర్వహించనుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల పరీక్ష ఈనెల 28, 29 తేదీల్లో జరగనుంది. -
ఫీజు చెల్లిస్తేనే.. పై తరగతికి
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లలో చేరిన పేద విద్యార్థులను పై తరగతులకు పంపేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. తాము నిర్ణయించిన ఫీజు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్లు కొనసాగిస్తామని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక జిల్లా విద్యా శాఖ అధికారులను ఆశ్రయిస్తే ‘సెటిల్ చేసుకోవాలి’ అంటూ సలహా ఇస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఆర్టీఈ చట్టం కింద పేద పిల్లలకు కేటాయించారు. విద్యాశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా గత మూడు విద్యా సంవత్సరాల్లో 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. వీరిలో చాలా మంది నిరుపేదలు కావడంతో ఫీజులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. ఫీజులపై ఏడాది క్రితమే హైకోర్టు ఇచ్చిన తీర్పును యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తల్లిదండ్రులపై భారం పెరిగిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుపేదల చదువు కోసం అమలు చేసిన ఆర్టీఈ చట్టం ప్రవేశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మొత్తం ఫీజు కోసం యాజమాన్యాల ఒత్తిడి ఆర్టీఈ చట్టం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం జీవో నంబర్ 24 ప్రకారం ఫీజులను ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, పట్టణ ప్రాంతాల్లో రూ.8,500 స్కూలు ఫీజుగా నిర్ణయించి 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకం తీసుకున్న తల్లిదండ్రులు ఈ ఫీజు మొత్తాన్ని చెల్లించాలని, మిగిలిన వారికి ప్రభుత్వమే ఆయా స్కూళ్లకు చెల్లించేలా నిబంధన విధించింది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తక్కువగా ఉందని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై వాదనలు ముగిసే నాటికి రెండు విద్యా సంవత్సరాలు పూర్తయి మూడో ఏడాది ప్రారంభమైంది. అనంతరం జీవో నంబర్ 24లో ఉన్న ఫీజులు సరిగా లేవని, కొత్తగా ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. దీంతో స్కూళ్ల యాజమాన్యాలు కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని పిల్లల తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచాయి. ఆయా స్కూళ్లు నిర్ణయించిన వార్షిక ఫీజు మొత్తం (స్కూలును బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేలు) చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అమ్మఒడి తీసుకున్న వారు స్కూళ్లకు నిర్ణీత మొత్తం ఫీజుగా చెల్లించారు. ఈ విద్యా సంవత్సరం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వక పోవడంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం మరింత పెరిగిపోయింది.ఫీజు అంచనాపై తీరిగ్గా ఇప్పుడు కమిటీ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం–2009 (ఆర్టీఈ) కింద ఏటా పేద పిల్లలకు అందిస్తున్న ఉచిత విద్యలో భాగంగా ఇటీవల ఫీజులు నిర్ణయించేందుకు పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గా సమగ్ర శిక్ష ఎస్పీడీ కనీ్వనర్‌గా మరో తొమ్మిది మంది అధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. జీవో నంబర్ 24పై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ కమిటీని ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికంటే ముందే ప్రభుత్వం నియమిస్తుంది. మూడు నెలల్లో నివేదికను ఇస్తుంది. డిసెంబర్లో సమావేశమై విద్యార్థుల ఫీజులను నిర్ణయిస్తుంది. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి రెండు వారాల క్రితం కమిటీ వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కమిటీని త్వరగా వేసి ఉంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఉపాధ్యాయులకు త్వరలో స్థానచలనం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం–2025 నేపథ్యంలో తొలుత జీవో 117ను రద్దుచేసి అనంతరం బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలను విద్యాశాఖ మూడుసార్లు ప్రకటించి, సవరించే అవకాశం కల్పించింది. తాజాగా మూడోసారి ఇచ్చిన అవకాశంలో టీచర్లు మరోసారి తప్పులను సరిచూసుకునే అవకాశాన్ని ఈనెల10 వరకు ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఈ నెల 20న తుది సీనియారిటీ జాబితాను వెల్లడించనుంది. దీని ప్రకారం మే నెల మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించి, ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఒకే పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలను (ఆప్షనల్స్) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తమ పాఠశాలను ఎంపిక చేసుకునే వీలు లేదు. తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు. తర్వాత ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియను మే 30 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. పని సర్దుబాటు ఆదేశాలు రద్దు2024–25 విద్యా సంవత్సరం ఈ నెల 23న ముగుస్తుంది. బదిలీల నేపథ్యంలో గతంలో పని సర్దుబాటు, డిప్యుటేషన్లపై స్థానికంగా స్థాన చలనం పొందిన ఉపాధ్యాయులకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేయాలని డీఈవోలను విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశించింది. ఆయా ఉపాధ్యాయులను ఈ నెల 22న రిలీవ్ చేయాలని, వారు విద్యా సంవత్సరం ముగింపు రోజు (ఏప్రిల్ 23) తప్పనిసరిగా తిరిగి పాత స్థానాల్లో చేరాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ చొప్పున దాదాపు 13 వేలకు పైగా స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 7,500 మోడల్ స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 40 మంది విద్యార్థులున్న స్కూళ్లలో 1–5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. మిగిలిన స్కూళ్లకు ఉపాధ్యాయులను ఎలా కేటాయిస్తారన్న దానిపై స్పష్టత లేదు. -
విద్యాశాఖపై సమీక్ష.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమంటూ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని, అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం సూచించారు.విద్యా రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని.. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలని సీఎం సూచించారు. వనరులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలని సీఎం సూచించారు. వివిధ రాష్ట్రాల్లోని పర్యటనలు, ఆయా రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.1960 దశకం నుంచి ప్రస్తుతం వరకు విద్యా వ్యవస్థలోని తీసుకువచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యార్థుల సృజనాత్మక శక్తి, ఆలోచనాధోరణిని ఎలా హరించి వేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీవన నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు. -
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫాం తయారీలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకొచ్చింది. సగటు కొలతలకు బదులు కచ్చితమైన కొలతలతోనే యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి కొలతలనూ టైలర్లు వ్యక్తిగతంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులంతా దీన్ని విధిగా పాటించాలని ఆదేశించింది. గతం మాదిరి కాదు... గతంలో యూనిఫాంకు కొలతలు తీసుకొనే పద్ధతి వేరుగా ఉండేది. విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించే వారు. ఎత్తు, లావు ఆధారంగా 10 మందిలో ఒకరి కొలత తీసుకొని మిగతా వారికి కూడా అదే కొలతలతో కుట్టేవాళ్లు. దీనివల్ల కొందరికి పొట్టిగా, మరికొందరికి వదులుగా యూనిఫాం ఉంటోంది. దీంతో కొంత మంది విద్యార్థులు టైలర్ల దగ్గరకు వెళ్లి అవసరమైన సైజ్ మేరకు యూనిఫాంలో మార్పులు చేయించుకుంటున్నారు. నిరుపేద పిల్లలు మాత్రం ఇచ్చిందే వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ సిఫార్సులు, స్థానిక హెచ్ఎంల ఫిర్యాదుల దృష్ట్యా ప్రతి విద్యార్థికీ కచ్చితంగా కొలతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుస్తులు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థి నుంచి ఫిర్యాదు వస్తే తిరిగి దాన్ని సరిచేయాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి పూర్తిగా సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు నిక్కర్ బదులు ఫ్యాంట్లు ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 19.91 లక్షల మంది విద్యార్థులు.. రెండేసి జతలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 19.91 లక్షల మంది విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఇందుకు అయ్యే వస్త్రం కోసం ప్రభుత్వం రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. స్థానిక స్వయం సహాయక సంఘాల చేత యూనిఫాం కుట్టిస్తోంది. ఇందుకుగాను వారికి కుట్టుకూలి కింద రూ. 30 కోట్లు చెల్లించనుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాంను విద్యార్థులకు అందించాల్సి ఉంది. సాధ్యాసాధ్యాల మాటేమిటి? ప్రభుత్వ ఆదేశాలపై స్వయం సహాయక బృందాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలిచ్చేటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులనూ తెలుసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వస్త్రం సేకరించి జిల్లాలు, మండలాలకు పంపేందుకే మే ఆఖరు వరకు సమయం పడుతుందని అంటున్నాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే యూనిఫాం కుట్టి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టైలరింగ్ మహిళలు అంటున్నారు. అదీగాక.. ప్రతి విద్యార్థికి వస్త్రం సగటున అర మీటరే వస్తోందని.. దీనివల్ల కొందరికి సరిపోవట్లేదని చెబుతున్నారు. ప్రతి జతకు ప్రభుత్వం ఇచ్చే రూ. 75 కుట్టుకూలి కనీస వేతనంగా కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక బృందంలో కనీసం నలుగురు చొప్పున ఉండే సభ్యులు పాఠశాలల చివరి పనిదినంలోగా కొలతలు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సొంతంగా కొలతలు తీసుకొని పంపిస్తే తమకు తేలికగా ఉంటుందని చెబుతున్నారు. టెన్షన్ పెడితే ఎలా? ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలీ కనీసం ట్రాన్స్‌పోర్టు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వస్త్రం సగటున ప్రతీ విద్యార్ధికి 50 సెంటీమీటర్లే వస్తుంది. అదీగాక 15 రోజుల్లో కుట్టి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితినీ ప్రభుత్వం ఆలోచించాలి. టెన్షన్ పెడితే ఎలా? ప్రతీ స్కూల్‌కు వెళ్ళి కొలతలు తీసుకొని, యూనిఫాం అందించాంటే 45 రోజులు పడుతుంది. అంత సమయం ఎక్కడిస్తున్నారు. కొలతలు వాళ్ళే తీసి ఇవ్వాలి. అప్పుడే సమయం కలిసి వస్తుంది. – ఎ. మాధవీగౌడ్ (టైలర్, కరీంనగర్) ఎక్కువ మంది టైలర్లను తీసుకుంటే సమస్యకు పరిష్కారం ప్రతి విద్యార్ధికి కచ్చితమైన కొలతలతో యూనిఫాం అందించాలనే నిర్ణయం సరైందే. సరిగా కుట్టలేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే టైలర్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కుట్టడానికి ఎక్కువ మందిని పెడితే సమస్య పరిష్కారం అవుతుంది. – పరాంకుశం రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధాయుల సంఘం పూర్వ అధ్యక్షుడు) -
గణితం ప్రశ్నలు బయటకు..
నిజాంసాగర్/కామారెడ్డి టౌన్: పదో తరగతి గణితం పేపర్లోని ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పైగా ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ కూడా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రం నుంచి బుధవారం గణితం ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. వాటికి సంబంధించిన సమాధానాల చిటీలు కూడా సెంటర్లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో ఎస్ రాజు, తహసీల్దార్, పంచాయతీ అధికారి, ఎంఈవో, పోలీసులు విచారణ జరిపారు. వాస్తవమని తేలడంతో పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆపీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తమ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కలిసి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజీలు చేయొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా, పలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏడుగురి అరెస్టు గణితం ప్రశ్నల లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ‘ఓ తండ్రి తన కుమారుడి కోసం ఎగ్జామ్ సెంటర్లో తాత్కాలికంగా వాటర్ సప్లయ్ చేసే ఓ వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటకు తెప్పించాడు. బయట సంజయ్ అనే మరో వ్యక్తి ఈ ప్రశ్నలను సేకరించాడు. కొంతమంది మీడియా ప్రతినిధులు అతడి నుంచి ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో జాదవ్ సంజయ్, షేక్ ముబీన్(వాటర్‌మ్యాన్), కాండే మనోజ్ (జీపీ కారోబార్), విద్యార్థులు ఇబాత్‌వార్ ఫిలిప్స్, ఇబాత్‌వార్ వరప్రసాద్, మీడియా ప్రతినిధులు మెహరీ హనుమండ్లు, కొప్పుల గంగాధర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశాం’అని ఎస్పీ తెలిపారు. -
'పరీక్షల్లో' ప్రభుత్వం ఫెయిల్
సాక్షి, అమరావతి: ఇప్పటికే విద్యారంగ సంస్కరణలను నీరుగార్చి, చదువులను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు.. పరీక్షల వ్యవస్థను సైతం మూడు లీకులు.. ఆరు మాస్ కాపీయింగ్ల స్థాయికి దిగజార్చేసింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన నిర్వాకాలే దీనికి నిదర్శనం. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థపైనే నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కనీసం ప్రశ్న పత్రాల ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నా పత్రాన్ని మార్చేసిన ఘనత కూటమి సర్కారులోనే కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది 10,58,893 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,49,884 మంది టెన్త్ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసున్నారు. ప్రభుత్వ నిర్వాకాలు వారి భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ పరీక్ష అయినా పకడ్బందీగా నిర్వహించారని, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2022లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్ లీక్‌కు జరిగిన యత్నాలను సమర్థంగా అడ్డుకుని కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు వేగంతో నిర్వహించి భర్తీ చేసిందని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.⇒ మార్చి 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసేలా మాస్ కాపీయింగ్ వ్యవహారాలు పలు చోట్ల వెలుగు చూశాయి. ఈనెల 21న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ, బీ కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్‌కు తెర తీశారు.లీకేజీలకు కేరాఫ్ బాబు పాలనటీడీపీ అధికారంలో ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకై విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో పదో తరగతి పేపర్ లీకైంది.పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల అరెస్ట్, వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు టెన్త్ పేపర్ లీక్... 9 మంది అరెస్టుపదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు సంబంధించి వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని ఖాజీపేట మండలం ఏటూరు గ్రామం అల్లాడుపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వల్లూరు జడ్పీ హైసూ్కల్ కేంద్రంలో ప్రశ్నా పత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్ బాయ్ సాయి మహేష్ షేర్ చేసేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్ స్కూల్ టీచర్ విఘ్నేష్‌రెడ్డి అలియాస్ విఘ్నేష్, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, మాథమేటిక్స్ టీచర్ శ్రీకాంత్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ గెస్ట్ టీచర్ శ్రావణి, టీచర్ మధుయాదవ్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెంటెండ్ ఎం.రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్ ఎం.రమణ వీరిలో ఉన్నారు. ప్రశ్నాపత్రం లీక్‌పై డీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక్కడ విద్యార్థులకు స్లిప్పులు అందించడం.. పుస్తకాలు ముందుంచి జవాబులు రాస్తూ ఉపాధ్యాయులు పట్టుబడ్డ వ్యవహారం బట్టబయలైంది. దీంతో 11 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు హెచ్ఎంలు, రికార్డు అసిస్టెంట్ సహా మొత్తం 15 మందిని సస్పెండ్ చేశారు. ⇒ వైఎస్సార్ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రం లీక్ చేసి వాట్సాప్‌లో తిప్పారు. ఈనెల 24న ఇక్కడ పదో తరగతి లెక్కల పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. స్కూల్లో ఓ వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పని చేస్తున్న వ్యక్తికి పంపినట్లు తేలింది. నిషిద్ధ ప్రాంతంలో వాటర్ బాయ్ వద్ద స్మార్ట్ ఫోన్ లభించడం విస్మయం కలిగిస్తోంది. ఉత్తీర్ణత పెరగాలంటూ ఒత్తిళ్లు..విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అస్తవ్యస్థ నిర్ణయాలతో చదువులను నీరుగార్చిన ప్రభుత్వం పరీక్షల్లో మాత్రం అత్యధికంగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ ఉపాధ్యాయులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఒకపక్క ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జూన్‌లో ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ వరకు సాగదీసింది. అయినా నూరు శాతం పూర్తి చేయలేదు. మరోపక్క ‘అర్జెంట్ రిపోర్టు’ పేరుతో రోజూ మెస్సేజులు పంపుతూ బోధనను గాలికొదిలేసింది. తీరా పరీక్షల నాటికి ఫలితాల కోసం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటూ టీచర్ల మెడపై కత్తి వేలాడదీసింది! మీరు ఏం చేసినా సరే.. గతంలో కంటే ఎక్కువగా ఉత్తీర్ణత నమోదు కావాలంటూ హెచ్చరించింది. తన గొప్పల కోసం పాస్ శాతం పెరగాలని విద్యాశాఖ మంత్రి ఆదేశిస్తుండగా.. ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ఆయా సబ్జెక్టుల్లో పర్సంటేజ్ పెరగకుంటే నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని స్లిప్పులు రాసే స్థితికి దిగజార్చారు. ఇంటర్ పేపర్లో తప్పులు.. ⇒ మార్చి 5న జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో ముద్రణ తప్పులు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. 8వ ప్రశ్న కింద ‘అడ్వర్టైజ్మెంట్ చదివి సమాధానాలు రాయాలని ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే ప్రశ్నలో ఏముందో గుర్తించలేని రీతిలో ముద్రించారు. ఈ విషయాన్ని నెల్లూరులో గుర్తించి ఉన్నతాధికారులకు చేరవేసి సరిదిద్దేసరికి గంట సమయం గడిచిపోయింది. దీంతో కొన్ని చోట్ల బోర్డుపై రాయగా మరికొన్ని చోట్ల ప్రశ్నపత్రంలోని అంశాలను ఇని్వజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. 13వ ప్రశ్న కూడా గందరగోళంగా ముద్రించడంతో విద్యార్థులు మొత్తం పది మార్కులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ⇒ 15వ తేదీన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో 14వ ప్రశ్న అకడమిక్ సిలబస్ నుంచి ఇవ్వగా విద్యార్థులు జవాబులు రాశారు. తీరా గంట గడిచిన తర్వాత ప్రశ్నలో తప్పుందంటూ మార్పు చేశారు. ఓ కార్పొరేట్ కాలేజీ ముద్రించుకున్న సిలబస్‌కు అనుగుణంగా దీన్ని మార్చినట్లు తెలిసింది. ⇒ మార్చి 11న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలోని పెనుమాక జూనియర్ కాలేజీలో ఓ ప్రైవేట్ కాలేజీకి మేలు చేసేలా మాస్ కాపీయింగ్ జరిగింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ సెంటర్ కేటాయించారు. ఇంటర్ రెండో ఏడాది గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇక్కడ మాస్ కాపీయింగ్ ప్రారంభమైంది. ఈ ఘటన తాడేపల్లిలోని మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో చోటు చేసుకోవడంతో రహస్యంగా ఉంచారు. సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇని్వజిలేటర్లను మార్చి చేతులు దులుపుకొన్నారు. ⇒ ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అరగంట ఆలస్యంగా పేపర్ ఇవ్వగా ఎలాంటి అదనపు సమయం ఇవ్వకుండా నిర్దిష్ట సమయానికే తిరిగి తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని ఇంటర్ అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. సెల్ఫ్ సెంటర్లు...నిబంధనల ప్రకారం విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్ష సెంటర్ కేటాయించకూడదు. కానీ ఈ దఫా ఇంటర్ పరీక్షల్లో 1,535 సెంటర్లలో దాదాపు 300 సెల్ఫ్ సెంటర్లే ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు సైతం 800కిపైగా సెల్ఫ్ సెంటర్లే ఉండటం, వీటిలో అత్యధికం కార్పొరేట్ స్కూళ్లే కావడం గమనార్హం. -
ప్రైవేటు జిత్తులకు చిత్తవ్వాల్సిందేనా?
ముప్పై ఏళ్ల ఆర్థిక సంస్కర ణల తర్వాత పరిధులు దాటి ప్రభుత్వంలోకి చొరబడు తున్న ప్రైవేటీకరణ వల్ల కొన్ని కొన్ని రంగాల్లో ‘రాజ్యం’ ఉనికే ప్రశ్నార్థకం అవుతు న్నది. పైగా విషయం సున్నిత మైన జ్ఞాన రంగానికి మూల మైన ఉన్నత విద్యకు సంబంధించింది కావడం వల్ల ‘ఎలీట్’ అనబడే ఎగువ మధ్యతరగతి ఆలోచనాపరుల చురుకైన జోక్యం అవసరం అవుతుంది. ప్రభుత్వ పరిధిలోకి ‘ప్రైవేట్’ చొచ్చుకు రావడం వల్ల నిర్వీర్యమవుతున్న విద్యా ప్రమాణాలు కారణంగా తెలుగు సమాజానికి మిగిలే నామర్దాపై లోతైన సమీక్ష అవసరమైన దశకు మనం చేరాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004–2014 మధ్య పలు స్టేట్ యూనివర్సిటీలు రావడం, ప్రభుత్వం అందించిన ‘ఫీజు రీయింబర్స మెంట్’ దన్నుతో ఆర్థిక–సామాజిక బలహీన వర్గాలు కొంతమేర ప్రయోజనం పొందడం జరిగాయి. కొద్దిపాటి ప్రయత్నంతో విదేశాల్లో విద్యా–ఉపాధి అవకాశాలు పెరిగిన కాలం అది. అయితే ‘జాతీయ విద్యా విధానం–2020’ పేరుతో దేశమంతా ‘స్టేట్ యూనివర్సిటీ’లలో సంస్కరణలు అమలును ‘నీతి ఆయోగ్’ తప్పనిసరి చేసింది. సంపన్నులు తమ పిల్లల్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంత ఖర్చుకైనా వెరవకుండా చదివిస్తారు. కానీ దిగువ మధ్యతర గతి పరిస్థితి అదికాదు. వాళ్లకు నాణ్యమైన విద్య అందడం కల కాకూడదు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుగా మొదలై ఆర్థిక సంస్కరణల కాలంలో ‘డీమ్డ్ యూనివర్సిటీలు’గా చలామణీ అవుతూ, ఉన్నత విద్యా వ్యాపారం చేస్తున్న చోట... ఉన్న ప్రమాణాలు గురించిన చర్చ ఇది. యాజమాన్యాలకు తమ వాణిజ్య ప్రయోజనాలు ప్రధానం అవుతుంటే, వాటి ప్రమాణాలు వడకట్టి మరీ వర్గీకరించే సమీక్ష బాధ్యతలు చూసే ‘న్యాక్’ (నేషనల్ ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్) పరపతి పలచబడిన సందర్భం ఇది.ఇటీవల నీతి ఆయోగ్ 2011–2021 మధ్య చేసిన మదింపులో ‘తెలుగునాట యూనివర్సిటీల ప్రమాణాలు ఏ మాత్రం బాగాలేవు’ అని తేలింది. మూడు అంశాలను అది పరిశీలించింది. 1. విద్యా ర్థుల స్థూల నమోదు, 2. విద్యార్థి– టీచర్ నిష్పత్తి,3. లింగ సమానత్వ సూచిక. ఈ మూడు అంశాల్లో దేనిలోనూ మొదటి పది స్థానాల్లో మనం లేము. ప్రభుత్వం కంటే ప్రైవేట్ క్వాలిటీ బాగుంటుంది అనేది మన నమ్మకం. గడచిన ముప్పై ఏళ్లలో డిగ్రీతో మొదలై పీజీ, పీహెచ్డీ వరకు ఎదిగిన మన యూని వర్సిటీ చదువుల్లోకి భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగం ప్రవేశించినా, నీతి ఆయోగ్ మదింపు అలా ఉందంటే, మన ప్రమాణాలు అనుమానమేగా! రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కూడా కొత్త యూనివర్సిటీలు వస్తుంటే అమరావతి చుట్టూ భూములు ఇవ్వడం, వాళ్ళు భారీ భవనాలు కట్టడం... ఇలా మన దృష్టి అంతా ‘షోకేసింగ్’ మీదే సరిపోయింది.ఈ యాజమాన్యాల రాజకీయ రంగ ప్రవేశంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వ– ప్రైవేట్ ప్రయోజనాలు ఒక్కటయ్యాయని పిస్తున్నది. అమరావతి సమీపాన ఉన్న ఒక డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన ఉదంతం వెనుక పైన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అంటే విషయం సులువుగా బోధపడుతుంది. సీబీఐ అరెస్ట్ చేసిన పదిమంది ముఖ్యుల్లో ఒక వైస్– ఛాన్స్లర్ ఉండడం దేశాన్ని ఉలిక్కి పడేట్టుగా చేసింది. తమ యూనివర్సిటీకి ‘ఏ ప్లస్ ప్లస్’ ర్యాంకింగ్ రాబట్టడం కోసం న్యాక్ నుంచి తనిఖీకి వచ్చే ‘పీర్ రివ్యూ వర్స్’కు ముందే నగదు, విలువైన బహుమతులతో యాజమాన్యం వారిని ప్రలోభపరిచింది అనేది సీబీఐ అభియోగం. నింది తులు ఉన్నత విద్యారంగంలో పలు విభాగాలలోని ప్రమాణాలను సమీక్షించడంలో నిపుణులు. అరెస్ట్ వార్త వెలుగులోకి వచ్చిన మూడు వారాల్లో సుమారు 900 మంది పీర్ రివ్యూవర్స్‌ను శాశ్వతంగా న్యాక్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒక ఆంగ్లపత్రిక ప్రతినిధికి న్యాక్ డైరెక్టర్ గణేశన్ కన్నాభిరాన్ జరిగింది ఏమిటో చెబుతూ– ‘మా వద్ద పీర్ రివ్యూవర్స్ జాబితాలో 5,000 మంది ఉన్నారు. వీరి పనిని సమీక్షించే కసరత్తు గత 18 నెలలుగా మా వద్ద సాగుతున్నది కనుకనే, ఈ విషయం తెలిసిన వెంటనే వారిపై వేటు సాధ్యమయింది. ఇకముందు మా వడపోత ‘హైబ్రీడ్ మోడల్’లో ఉంటుంది’ అన్నారు. జరిగిన దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొ‘‘ ఎం. జగదీశ్ కుమార్ స్పందిస్తూ – ‘యూజీసీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతి పత్తి కలిగిన న్యాక్‌లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల తర్వాత ర్యాంకింగ్ ఇచ్చే విషయంలో పారదర్శకత, చిత్తశుద్ధి పెంచే విధంగా న్యాక్ సమూల సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ఎక్రిడిటేషన్ జారీ విషయంలో న్యాక్ దృఢ చిత్తంతో అనుసరిస్తున్న పరిపాలనా విధానాన్ని, నిర్దేశించిన రూల్స్ అమలుచేయడానికి తీసుకుంటున్న చొరవను యూజీసీ అభినందిస్తున్నది’ అన్నారు.వారం తర్వాత విశాఖపట్టణంలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రైవేట్ పుస్తక ఆవిష్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇద్దరూ ఒకే వేదికపైన ఉన్నారు. అక్కడున్న ‘ప్రభుత్వ భూమి–కేంపస్ గోడ’ వివా దాన్ని దృష్టిలో ఉంచుకుని, తన ప్రసంగంలో సీఎం ‘...ఇటువంటి యూనివర్సిటీని మీరు కూల్చివేయా లని అనుకుంటారా’ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలో చించాల్సిన ప్రశ్న అది. జ్ఞానరంగానికి మూలమైన ఉన్నత విద్య ప్రమాణాలు ‘ప్రైవేట్’ వల్ల ప్రమాదంలో పడినప్పుడు, ‘రాజ్యం’తో పాటు పౌర సమాజమూ అప్రమత్తం కావాలి.వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
కొంపముంచిన ట్రంప్!
-
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన సంతకం
-
అంకెల్లో పెరిగింది శాతంలో తగ్గింది
తాజా బడ్జెట్లో ప్రభుత్వం విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.1,816 కోట్లు ఎక్కువని పేర్కొంది. మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ వాటా 7.57 శాతంగా ఉంది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపు పెరిగినా, మొత్తం బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపుల శాతం తగ్గింది. 2024–25 బడ్జెట్ మొత్తం రూ.2,74,058 కోట్లు. ఇందులో విద్యా రంగం కేటాయింపులు రూ.21,292 కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో 7.77 శాతం. కానీ 2025–26 మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు. ఇందులో విద్యారంగానికి కేటాయింపులు రూ.23,108 కోట్లు. అంటే 7.57 శాతం. అంటే 2024–25తో పోల్చుకుంటే ఈసారి విద్యకు 0.20 శాతం మేర కేటాయింపులు తగ్గాయన్నమాట. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బోధన, విశ్వవిద్యాలయాల ఆధునీకరణ, బోధనా సిబ్బంది నియామకాలు, ఉన్నత విద్యలో సాంకేతిక పురోగతి, నైపుణ్యాభివృద్ధి కల్పన, ప్రభుత్వ వర్సిటీల పరిధిలో తీసుకొచ్చే కొత్త కంప్యూటర్ కోర్సులకు మౌలిక వసతులు కల్పనకు సరిపడా నిధుల కేటాయింపు జరగలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. విద్య పద్దులో ఇవీ కీలకాంశాలు.. పాఠశాల విద్యకు రూ.19,341.23 కోట్లు కేటాయించారు.గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.13,763 కోట్లు ఎక్కువ. కేటాయింపుల్లో 91 శాతం టీచర్లు, సిబ్బంది వేతనాలకే ఖర్చవుతుంది. గత ఏడాది కొత్తగా 10 వేల మంది టీచర్లనియామకం చేపట్టారు. దీంతో వేతనాల ఖర్చు పెరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా26 వేల ప్రభుత్వస్కూళ్ళున్నాయి.వీటిల్లో 3 వేల స్కూళ్ళల్లో డిజిటల్ విద్య, మరో 1,500 స్కూళ్ళల్లో ఏఐ టెక్నాలజీతో బోధనచేపడతామని ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో రూ.50 కోట్లు ఖర్చవుతుందని విద్యాశాఖ అంచనా వేయగా..ప్రస్తుతబడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించారు. పరీక్షల నిర్వహణకు రూ.6 కోట్ల నుంచి రూ.7.50 కోట్లకు నిధులు పెంచారు. ఉన్నత విద్యలో సమూల మార్పుల దిశగా అనేకనివేదికలు రూపొందించారు. ఇప్పటికే వర్సిటీల్లో కొత్త కోర్సులు తీసుకొచ్చారు. కంప్యూటర్ అనుబంధ కోర్సులకు ప్రత్యేక మౌలిక వసతుల కల్పన అవసరం. వీటికోసం రూ.500 కోట్లు కావాలని ప్రతిపాదించినా వాటి ఊసు లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రూ.2,900 కోట్లే.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రూ.11,600 కోట్ల మంజూరుకు పాలనపరమైన అనుమతులూ ఇచ్చింది. కానీ ప్రస్తుత బడ్జెట్లో ఈ స్కూళ్ళ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.2,900 కోట్లే కేటాయించింది. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు వెచ్చించినా, ఈ ఏడాది మొదలు పెట్టే స్కూళ్ళ సంఖ్య 15కు మించే అవకాశం లేదు. నైపుణ్యాభివృద్ధి దిశగా కాలేజీల్లో స్కిల్ కోర్సులు, ఏఐ విద్యా విధానం ప్రతిపాదనలు సిద్ధం చేసినా... వీటికి నిధుల కేటాయింపును చూపించలేదు. పారిశ్రామిక కార్పస్ ఫండ్ నుంచి వీటిని అమలు చేయాలనే ఆలోచనతో ఉంది. 6 గ్యారంటీలు 56 వేల కోట్లుసాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలైన ఆరు గ్యారంటీల కోసం బడ్జెట్లో రూ.56,084 కోట్లు కేటాయించారు. వీటికి వరుసగా రెండో ఏడాది కూడా ప్రాధాన్యమిస్తూ గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే రూ.9వేల కోట్ల వరకు అదనంగా ప్రతిపాదించడం విశేషం. రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, సన్నధాన్యానికి బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టు బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. రైతు భరోసాకు గత ఏడాది కంటే రూ.3వేల కోట్లు పెంచగా, గత ఏడాది తరహాలోనే పింఛన్లకు నిధులు చూపెట్టారు. అంటే ఈసారి కూడా పింఛన్ల పెంపు హామీ పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అవసరమయ్యే 4 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.12,571 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఇళ్ల నిర్మాణంలో కేంద్రమిచ్చే సాయం పోను ఈ నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గృహలక్ష్మికి తగిన కేటాయింపులు చేశామని అంటున్నాయి. అయితే, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున భృతి ఇస్తామనే ముఖ్యమైన గ్యారంటీతోపాటు ఆరు గ్యారంటీల్లోని ఇతర అంశాలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే ఆ గ్యారంటీల అమలుకు మరో ఏడాది ఆగాల్సిందేనన్న మాట. రోడ్లు, భవనాల శాఖకు రూ.5,907 కోట్లుసాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖకు ప్రభుత్వం రూ.5,907 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రీజినల్ రింగురోడ్డుకు గత బడ్జెట్లో చూపినట్టుగానే రూ.1,525 కోట్లను చూపింది. భూసేకరణకు వీటిని వినియోగించనున్నారు. గత బడ్జెట్లో ఈ నిధులను చూపినా, వాటిని వినియోగించలేదు. ఇక మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి రూ. 50 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది. జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల కోసం రూ.300 కోట్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.251 కోట్లు కేటాయించింది. హైబ్రిడ్ యాన్యూట్ మోడ్‌లో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను రూ.300 కోట్లను బడ్జెట్లో చూపింది. -
పేద పిల్లలకు చదువెందుకంటోన్న ఆటవిక పాలకులు
-
ఏపీలో విద్యారంగ విధ్వంసానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు సర్కార్
-
మెరిట్ కం రోస్టర్ పద్ధతిలోనే టీచర్ల సీనియారిటీ జాబితా
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ కం రోస్టర్ పద్ధతిలోనే తయారు చేస్తారని విద్యా శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఈ జాబితాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సంఘాలు వెలిబుచ్చిన సందేహాలకు వివరణ ఇచ్చారు. ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్ ప్రమోషన్‌కు అర్హత గల అందరు ఎస్ఏల సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారని తెలిపారు. డీఈవో పూల్ పండిట్ల ప్రమోషన్ విషయమై కోర్టు కేసు ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. పేరెంట్ కమిటీల నిర్ణయం మేరకే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతానికి హైసూ్కల్ ప్లస్‌లను కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌లో విలీనమైన వారికి విలీనం అయ్యేటప్పుడు ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనల మేరకే సర్వీస్ వెయిటేజీ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రైవేటు కళాశాలల మాదిరిగానే ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు ఒకే తరహా సెలవులు ఉండేలా చూస్తామన్నారు. -
1,532మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేత (ఫొటోలు)
-
విలీనంపై ‘ఎస్’ అనాల్సిందే!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల మూసివేత వైపే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎంతో శ్రమకోర్చి తెచ్చుకున్న బడులను సర్కారు విలీనం వైపు నడిపిస్తోంది. ఇందుకు గ్రామస్తులు అంగీకరించకపోయినా.. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ‘నో’ అని చెప్పినా ‘ఎస్’ అనిపించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకమోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా తక్కువ ఎన్రోల్ ఉన్న బడుల్లోని విద్యార్థులను ఒక్కచోటకు చేర్చే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో దూరం వెళుతున్న విద్యార్థులకు రవాణా చార్జీలను ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. గత ప్రభుత్వం జీవో నం.117 తీసుకొచ్చి పాఠశాలలను విచ్ఛిన్నం చేసిందని ఓపక్క విషం చిమ్ముతూనే.. మరోపక్క ఉన్న బడులను మూసివేసే ప్రక్రియ ప్రారంభించింది. మండల స్థాయిలో ఎంఈవోలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు విలీన ప్రక్రియను వివరించి ఒప్పించాలని, మండలంలోని ఏ క్లస్టర్లో ఏ పాఠశాలను ఎలా మార్పు చేశారో చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంఈవోలు కాంప్లెక్స్ చైర్మన్లతో సమన్వయం చేసుకుంటూ క్లస్టర్లో ఉన్న ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆ గ్రామంలోని పాఠశాలలను ఎలా మార్పు చేస్తున్నారో సంబంధిత గ్రామ పెద్దలు, స్కూల్ మెనేజ్మెంట్ కమిటీలకు తెలియజేయాలని ఆదేశించారు. ఆయా పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్చారా? బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? లేదా మోడల్ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? అనేది వారికి వివరించి వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో’ అని చెప్పకుండా చూడాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గ్రామాల సెంటిమెంట్‌పై కన్నెర్ర గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల, గుడి అనేవి స్థానికుల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలు. వీటిని మూసివేసేందుకు, తరలించేందుకు స్థానికులు అంగీకరించరు. అయినప్పటికీ స్థానికుల అంగీకారంతో పనిలేకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ ఎంపీపీ స్కూల్‌ను విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం మూసివేసింది.స్థానికులు ఎంతగా ప్రాథేయపడినా పట్టించుకోలేదు. పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని గత వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వంలో గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా తిరిగి తెరిపించారు. ఇప్పుడు ఈ పాఠశాలలోని విద్యార్థులను మరో బడిలో విలీనం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల వరకు ఉన్నట్టు అంచనా. గత ప్రభుత్వంలో జీవో నం.117 ద్వారా హైసూ్కళ్లకు కిలోమీటరు లోపు దూరం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతుల విద్యార్థులు సబ్జెక్టు టీచర్ బోధన కోసం హైస్కూళ్లలో విలీనం చేశారు. మిగిలిన తరగతులను అదే ప్రాథమిక పాఠశాలలో కొనసాగించారు. ప్రస్తుతం 65 మంది ఎన్రోల్ ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తామని, అంతమంది విద్యార్థులు లేకుంటే సమీపంలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులను తరలించాలని ఎంఈవోలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 3–5 కి.మీ. పైగా దూరం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. విలీన ఒత్తిడి భరించలేమంటున్న ఉపాధ్యాయులు ఆదర్శ పాఠశాలల ఏర్పాటు క్రమంలో ఓ పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, లేదా 3–5 తరగతులను తీసుకొచ్చి ఎంపిక చేసిన పాఠశాలలో కలపడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను అదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారులు బెదిరించడం తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి పాఠశాలలో మన బడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పిస్తే వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలోనే ప్రాథమిక పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగవుతాయని.. ఇదంతా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకే అన్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు 40 లేదా 45 మంది పైగా ఎన్రోల్ ఉన్న స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా మార్చి, మిగిలిన పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సీనియారిటీ తెలియక.. పదోన్నతుల తికమక
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు రాష్ట్ర విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. జిల్లాలు, క్యాడర్ వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి పాత జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈవో) అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని ఆదేశించింది. వాటిపై ఉపాధ్యాయులు అభ్యంతరాలను సైతం చెప్పాలని, ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించింది. అయితే, సీనియారిటీ జాబితాలో తాము ఎక్కడున్నామో తెలియక ఉపాధ్యాయలు గందరగోళానికి గురవుతున్నారు. ఆన్లైన్లో చూస్తే జిల్లాల్లోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాకు బదులు ఒక్క ఉపాధ్యాయుడి వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయ పోస్టుకు సబ్జెక్టు వారి సీనియార్టీ జాబితాలను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్) ఆధారంగా వెబ్సైట్లో ఉంచారు.అయితే, ఇప్పటికే ప్రకటించిన పదోన్నతుల సీనియార్టీ జాబితాల్లో పలు రకాల సమస్యలు ఉత్పన్నమైనట్టు సమాచారం. పలు జిల్లాల్లో కులాల కేటగిరీ నమోదులో అనేక తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల డీఎస్సీ ర్యాంకులు కూడా అందుబాటులో లేకుండానే ర్యాంకులు ప్రకటించినట్టు చెబుతున్నారు. ఇలా అయితే చాలామంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎస్సీ ర్యాంకులు లేకుండానే.. పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సీనియార్టీని నిర్ణయించాలంటే వారి డీఎస్సీ ర్యాంకు కీలకం. అయితే, పలు జిల్లాల్లో కొన్ని బ్యాచ్‌ల టీచర్లకు చెందిన ర్యాంకుల వివరాలు లేవని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ర్యాంకులను నమోదు చేయడంలోను, డీఎస్సీ ర్యాంకులు భద్రపరచడంలోను అలసత్వం చూపడంతో ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తోంది. ఒక్క ర్యాంకు తేడా ఉన్నా ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే అవకాశం ఉంది. తద్వారా పదోన్నతి కూడా కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం సబ్జెక్టు వారీగా పదోన్నతులు ఇచ్చే పోస్టుల సంఖ్య కూడా తెలియజేయకుండా సీనియార్టీ జాబితాను ప్రకటించాలని జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పదోన్నతులు కల్పించే పోస్టుల సంఖ్యకు మూడు రెట్లు ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించి, అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. కానీ.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి వివరాలను సీనియార్టీ జాబితాలో పొందుపరచడం గమనార్హం. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయుల కలబోతగా సీనియార్టీ ప్రకటించాల్సి ఉండగా.. సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సబ్జెక్టుల వారీగా పదోన్నతులకు అర్హులైన ఎస్జీటీల జాబితా ప్రకటించాల్సి ఉండగా.. అన్ని సబ్జెక్టులకు అర్హులైన ఉపాధ్యాయులతో జాబితాను ప్రకటించారు. దీనివల్ల పదోన్నతి పొందాల్సిన ఉపాధ్యాయుడు సబ్జెక్టు సీనియారీ్టలో ఎక్కడున్నారో.. తనకంటే ముందున్న వారు అసలైన సీనియర్లు అవునో కాదో తెలుసుకునే అవకాశం లేదు. సీనియారిటీ ర్యాంకుల్లో గందరగోళం ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ 1984 నుంచి జరిగిన డీఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. నాటి డీఎస్సీల్లో వారు సాధించిన ర్యాంకు ఆధారంగా సీనియారిటీని నిర్ణయించాలి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో ర్యాంకులు లేకుండానే జిల్లా స్థాయిలో నచి్చన నంబర్లను కేటాయించి, అదే సీనియర్ నంబర్‌గా చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదముంది. ఉదాహరణకు 2002లో జరిగిన డీఎస్సీలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు 128 ర్యాంకు సాధించి ఎస్జీటీగా సరీ్వసులో చేరగా, ఇప్పుడు అతనికి సీనియారిటీ జాబితాలో 1,356 ర్యాంకు కేటాయించారు. అదే డీఎస్సీలో మొదటి ర్యాంకు ఉపాధ్యాయునికి 1,384 సీనియార్టీ నంబర్ చూపించారు. డీఎస్సీ మొదటి ర్యాంకు ఉపాధ్యాయునికి ఏమైనా రిమార్కు ఉంటే చూపించాలి. కానీ అదీ చేయలేదు. దీంతో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలను డీఎస్సీ ర్యాంకులు ఆధారంగా పూర్తిగా పరిశీలించాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ లోగా చెప్పాలని ఆదేశించడం తగదని, పారదర్శకంగా ర్యాంకులు ప్రకటించి, అప్పుడు అభ్యంతరాలు కోరాలని పేర్కొంటున్నారు. సీనియారిటీ జాబితాలో తప్పులు సీనియారిటీ జాబితాలో అనేక తప్పులున్నాయి. 1984 డీఎస్సీ నుంచి అన్ని డీఎస్సీల రోస్టర్ కమ్ మెరిట్ ఎంపిక జాబితాలు జిల్లాల వారీగా వెబ్సైట్లో ఉంచాలి. కొన్ని జిల్లాల్లో విద్యాశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా ర్యాంకులు కేటాయించారు. లిస్టు బహిర్గతం చేస్తేనే జాబితాలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుంది. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, కోశాధికారి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఇచ్చిన ర్యాంకుల్లో పొంతన లేదు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉంచిన ప్రమోషన్ సీనియారిటీ జాబితా సరిగా లేదు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ వారికి, ప్రమోషన్లు తీసుకున్న వారికి ర్యాంకులు చూస్తే చాలా తేడా కనిపిస్తోంది. అలాగే, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40గా ఉండాలి. అప్పుడే ఎక్కువ మందికి పదోన్నతులు వస్తాయి. – లెక్కల జమాల్‌రెడ్డి, అధ్యక్షుడు, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డీఎస్సీ ర్యాంకుల జాబితా ప్రకటించాలి సీనియార్టీ జాబితాలో ఉపాధ్యాయులకు ర్యాంకుల వివరాలు ఇచ్చినప్పటికీ స్పష్టత లేదు. అన్ని డీఎస్సీల బ్యాచ్‌లకు సంబంధించి ఉపాధ్యాయుల మెరిట్ ర్యాంకుల జాబితా ప్రకటించాలి. డీఎస్సీ మెరిట్ ర్యాంకుతో పాటు మార్కుల వివరాలు తెలపాలి. రోస్టర్ ర్యాంకు, మెరిట్ ర్యాంకు వివరాలపై స్పష్టత ఇవ్వాలి. – సీవీ ప్రసాద్, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ అమరావతి -
డీఎస్సీపై సర్కారు డ్రామాలు..
మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేస్తా..!– ఎన్నికల సభల్లో టీచర్ పోస్టుల ఆశావహులకు చంద్రబాబు హామీ16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం..– గతేడాది జూన్‌లో సీఎంగా చంద్రబాబు ప్రకటన!మెగా డీఎస్సీకి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం..– తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట! గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇదే మాట చెప్పారు!సాక్షి, అమరావతి: ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది! అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. త్వరలో.. త్వరలో... అంటూ తొమ్మిది నెలలు గడిచిపోయినా డీఎస్సీపై అతీగతీ లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచించిన టీడీపీ కూటమి సర్కారు టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది! ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తయితే.. టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరోఎత్తు! రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా.. కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీలపై విద్యాశాఖ వివరాలు.. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని ‘హెల్ప్ ద పీపుల్’ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. నోటిఫికేషనే లేకుండా భర్తీపై హామీలా? రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసన సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకూ నోటిఫికేషన్ ప్రక్రియే చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో 13.28 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఎన్సీపీసీఆర్ రాసిన లేఖ నోరు విప్పని సర్కారు ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్.. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10 శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు (13.28 శాతం) ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా... మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10 శాతానికి మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు సూచించింది. పది లక్షల మంది పడిగాపులు..దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్ధికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తూ పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను కుదించడం.. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు.10 లక్షల మంది పిల్లలపై ప్రభావం..రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1 : 40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,78,984 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు. -
Bangladesh: షేక్ హసీనా మాయం.. భారత్ సహకారం తుడిచివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం(Government of Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాపై తీవ్ర వివక్ష చూపింది. దేశంలోని పాఠ్యపుస్తకాలలో ఆమె పేరును తొలగించింది. పాఠశాల పాఠ్యపుస్తకాలలో ప్రధాన మార్పులు చేసిన దరిమిలా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఇదేవిధంగా పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోతున్నట్లు కనిపించే ఒక చారిత్రక ఫోటోను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించారు.గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పలు అల్లర్ల దరిమిలా షేక్ హసీనా(Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఏర్పడిన నూతన ప్రభుత్వం పాఠశాల పుస్తకాలలో పలు మార్పులు చేసింది. వాటిలో భారతదేశానికి సంబంధించిన వివరాలలో కూడా మార్పులు చేసింది. షేక్ హసీనాకు సంబంధించిన అన్ని చిత్రాలు, అధ్యాయాలను పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం పాత్రను తొలగించనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీతో పాటు ముజిబురహ్మాన్ ఉన్న ఫోటోలను తొలగించారు.పుస్తకాల వెనుక కవర్ పేజీపై షేక్ హసీనా విద్యార్థుల కోసం అందించిన సందేశాన్ని తొలగించారు. హసీనాపై తిరుగుబాటు జూలై 2024లో ప్రారంభమైంది. ఈ తిరుగుబాటుకు సంబంధించిన ఫొటోలను నూతన పాఠ్యపుస్తకాల వెనుక కవర్ పేజీపై ముద్రించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ మార్పులను నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డ్ (ఎన్‌సీటీబీ)చేసింది. ఇందుకోసం బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ 57 మందికి పైగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలకు చెందిన 441 పుస్తకాలలో ఈ విధమైన మార్పులు చేశారు. 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ఇప్పటికే ముద్రితమయ్యాయి.డిసెంబర్ 1971లో భారత్, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యింది. దీనిని వివరిస్తూ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయం ఉంది. దీనిలో ఒక చారిత్రక ఛాయాచిత్రం ఉంది. చిత్రంలో పాకిస్తాన్.. భారత్‌కు లొంగిపోవడాన్ని చూపుతుంది. పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ తమ లొంగుబాటు పత్రాన్ని భారత సైన్యం లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు అందిస్తున్నట్లుంది. అయితే ఈ ఫోటోను ఇప్పుడు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు.ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లా ప్రధాని ముజిబురాహ్మాన్ సంయుక్తంగా ఉన్న ఫొటోను తొలగించారు. ఈ ఫొటో ఫిబ్రవరి 6, 1972 నాటిది. ఇంతేకాకుండా బంగ్లా జాతీయ జెండా, జాతీయ గీతాన్ని పుస్తకాల మొదటి పేజీ నుండి తొలగించి వెనుక భాగంలో ముద్రించారు. నిపుణుల బృందం పుస్తకాలలో జాతీయ జెండా, గీతం అవసరం లేదని భావించింది. వీటిని పూర్తిగా తొలగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని విద్యాశాఖాదికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. -
డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనుకుంటే..
తెలుగు నేలపై పుట్టి మొత్తం దక్షిణాదిలో విద్యను వ్యాపారీకరించిన రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు (corporate colleges) పిల్లలు, తల్లిదండ్రుల కలలపై వ్యాపారం చేస్తున్నాయి. ఇటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఎందరో పిల్లల జీవితాలు ఇవి చేసే వ్యాపారంలో సమిథలవుతున్నాయి.నేడు భారతదేశంలో ఆత్మహత్యలు అనేది ఒక జాతీయ సామాజిక సమస్యగా మారిపోయింది. భారతదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సగటున ప్రతిరోజూ సుమారుగా 36 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. మనదేశంలో ప్రతి సంవత్సరం ఆత్మ హత్యల ద్వారా సుమారుగా 7–8 శాతం వరకు విద్యార్థులు మరణి స్తున్నారు. గత 25 ఏళ్లుగా (1995 నుండి 2021 వరకు) దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులను భారత్ ఆత్మహత్యల ఫలితంగా కోల్పోయింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా, వార్షిక ఐసీ–3 కాన్ఫరెన్స్– ఎక్స్పో– 2024 (ఆగస్టు 28)లో ‘విద్యార్థుల ఆత్మహత్యలు: ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా’ నివేదిక విడుదల చేయబడింది. మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2% పెరుగుతుండగా, విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4% పెరిగాయని ఈ నివేదిక ఎత్తి చూపింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో వార్షికంగా 4% పెరిగాయి. 2022లో మొత్తం ఆత్మహత్యల్లో 53% మంది విద్యార్థులు ఉన్నారు. 2021, 2022 మధ్య విద్యార్థులలో మగపిల్లల ఆత్మహత్యలు 6% తగ్గగా, బాలికల ఆత్మహత్యలు 7% పెరిగాయి అని ఐసీ–3 ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక పేర్కొంది.చాలా మంది దిగువ – మధ్యతరగతి నేపథ్యాల వారు కార్పొరేట్ కాలేజీల్లో చేరి ఇటు ఫీజులు కట్టలేక, అటు కాలేజీల్లో ఉన్న ఒత్తిడి వాతావరణాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉండే అసహజ వాతావరణం తల్లిదండ్రులకు తెలిసినా... వాటిలో చేరితేనే తమ పిల్లలు మంచి ర్యాంకు పొంది డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనే నమ్మకంతో వాటిల్లోనే చేరుస్తున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణా కమిటీలు నియమించి చేతులు దులుపుకొంటున్నాయి. తమ డబ్బు, పలుకుబడులతో అవి మేనేజ్ చేయగలుగుతున్నాయి.చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?ఆత్మహత్య చేసుకున్న వారిలో చాలామంది నిరాశా నిస్పృహలకు లోనైనవారే ఉంటారు. ఏ వైపు నుంచి కూడా ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో మాత్రమే వారు ఈ చర్యకు పాల్పడతారు. చనిపోకముందే చాలా సార్లు మాటల ద్వారా, చేతల ద్వారా చనిపోవాలనే ఆలోచనను వ్యక్తపరుస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ మాటలు – చేతల్లోని భావాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడకపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకనే విద్యాసంస్థలలో కచ్చితంగా ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తించి సహాయమందించే ఏర్పాట్లు చెయ్యాలి. భావిభారత యువతను కాపాడుకోవాలంటే కార్పొరేట్ కాలేజీలపై కన్నేసి ఉంచాల్సిందే.-డాక్టర్ బి. కేశవులు ఎండి. సైకియాట్రీ, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ -
బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
న్యూఢిల్లీ: దేశంలో పేరెన్నికగన్న విద్యాలయాల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) ఒకటి. ఈ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో చదివిన పలువురు పెద్ద రాజకీయ నేతలుగా ఎదిగారు. వీరిలో చాలామంది క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) పరిధిలోని వివిధ కళాశాల్లో చదివి బడా నేతలుగా ఎదిగిన వారి జాబితాలో అరుణ్ జైట్లీ, శశి థరూర్ మొదలుకొని మొన్ననే ఢిల్లీ పీఠమెక్కిన రేఖాగుప్తా కూడా ఉన్నారు. మరి.. వీరిలో ఎవరెవరు ఏ కాలేజీలో చదివారనే వివరాల్లోకి వెళితే..శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్అరుణ్ జైట్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 1973లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్ ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఎల్ఎల్బీ పట్టా పొందారు.విజయ్ గోయెల్: కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయెల్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎం.కామ్ పట్టా పొందారు.జితిన్ ప్రసాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్.. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో డిగ్రీ పట్టా పొందారు.సెయింట్ స్టీఫెన్స్ కళాశాలశశి థరూర్: కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Iyer) సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బీ.ఎ. పట్టా పొందారు.వీరభద్ర సింగ్: మాజీ కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బీ.ఎ. ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు.ఖుష్వంత్ సింగ్: ఖుష్వంత్ సింగ్ రచయితగా, న్యాయవాదిగా, పాత్రికేయునిగా, దౌత్యవేత్తగా పేరొందారు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు.హిందూ కళాశాలడాక్టర్ సుబ్రమణియన్ స్వామి: రాజకీయవేత్త, ఆర్థికవేత్త, క్యాబినెట్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.రావు ఇంద్రజిత్ సింగ్: భారత ప్రభుత్వ మాజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ హిందూ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.మీనాక్షి లేఖి: భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.రాంజస్ కళాశాలచౌదరి బ్రహ్మ ప్రకాష్: ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.సోమనాథ్ భారతి: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి, రాంజస్ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.సరూప్ సింగ్: 1990లో మొదట కేరళ గవర్నర్‌గా, ఆ తర్వాత గుజరాత్ గవర్నర్‌గా పనిచేసిన సరూప్ సింగ్, రాంజస్ కళాశాల నుండి బీ.ఎ. ఇంగ్లీష్ చదివారు.కిరోరి మాల్ కళాశాలనవీన్ పట్నాయక్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.మదన్‌లాల్ ఖురానా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మదన్‌లాల్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ప్రవేశ్ వర్మ: ప్రవేశ్ వర్మ ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.హన్స్‌రాజ్ కళాశాలకిరణ్ రిజిజు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అజయ్ మాకెన్: ప్రస్తుత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్అనుప్రియ పటేల్: పార్లమెంటు సభ్యురాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల నుండి బీ.ఎ. పట్టా పొందారు.మేనకా గాంధీ: మాజీ ఎంపీ, మహిళా, శిశు అభివృద్ధి మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా గాంధీ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దయాల్ సింగ్ కళాశాలపంకజ్ సింగ్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్ 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా పొందారు. ఆయన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు.అల్కా లాంబా: జాతీయ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా 1996లో దయాళ్ సింగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దౌలత్ రామ్ కళాశాలరేఖ గుప్తా: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా అందుకున్నారు.ఇది కూడా చదవండి; Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు -
మన చదువులు భేష్
సాక్షి, హైదరాబాద్: ‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన సాగాలి. యువతకు కాలేజీ స్థాయిలో విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’. ఇవీ మన విద్యారంగంపై సాధారణంగా వ్యక్తమయ్యే అభిప్రాయాలు. కానీ ఈ అభిప్రాయాలకు భిన్నంగా దేశ యువత స్పందించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ విద్యా విధానానికే జైకొట్టింది. కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిత భేషుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. టోఫెల్, జీఆర్ఈ తదితర పరీక్షల నిర్వహణ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 18 దేశాల్లో యువతను సంప్రదించిన ఈ సంస్థ.. వారి అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది. మన విద్యావ్యవస్థపై.. మన దేశ విద్యావ్యవస్థ బాగుంటుందని ఈటీఎస్ సర్వేలో పాల్గొన్న 70% మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో విద్యావ్యవస్థ మరింత పురోగమిస్తుందని 76% మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30% మందే తమ విద్యావ్యవస్థ బాగుంటుందని.. భవిష్యత్తులో విద్యావ్యవస్థ పుంజుకుంటుందని 64% మంది పేర్కొన్నారు. నాణ్యమైన విద్య.. కష్టంగానే మన విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం క్లిష్టంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని 78 శాతం మంది పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. దీనివల్ల దేశ విద్యా వ్యవస్థ పురోగతికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. నాణ్యమైన కోర్సులు, సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందని కూడా పేర్కొన్నారు. కెరీర్లో ముందంజలో నిలిచే అవకాశం ఇక కెరీర్ కోణంలో ప్రస్తుత అవకాశాలతో మందంజలో నిలవడానికి ఆస్కారం ఉంటుందని 69 శా>తం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59 శాతంగానే ఉండటం గమనార్హం. అదేవిధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగాల కొరత విద్యావ్యవస్థ, కెరీర్ కోణంలో ఆశాభావం వ్యక్తం చేసిన మన విద్యార్థులు.. నూతన ఉద్యోగాల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అలాగే విద్య ఖరీదైన విషయంగా ఉందని 33 శాతం మంది, నైపుణ్యాల పురోగతిలో కొరత ఉందని చెప్పారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయని 88 శాతం మంది పేర్కొన్నారు. ఏఐ.. అవకాశాల వేదిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐను ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. 53 శాతం యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఏఐ లిటరసీ ఉందని భావిస్తుండగా 43 శాతం మంది ఉద్యోగులే అందులో ఉన్నత స్థానంలో ఉన్నామని పేర్కొంటున్నారు. అంటే ఈ రెండు వర్గాల మధ్య 12 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే ఏఐ నైపుణ్యాలను గుర్తించేందుకు దేశంలో 79 శాతం యాజమాన్యాలు ప్రామాణిక విధానాలు పాటిస్తున్నాయని నివేదిక పేర్కొంది. వాస్తవ పరిస్థితులపై అవగాహన నేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ కోసం కాలేజీ స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగుపడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా ఉన్నతవిద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు. – ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ -
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు గండికొడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్స్–2025 ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఆరు (బీజేపీయేతర) రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశానికి.. తెలంగాణ విద్యాశాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి బదులుగా శ్రీధర్‌బాబు హాజరయ్యారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల విద్యామంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ‘ఇప్పటి వరకు విశ్వవిద్యాయాల ఉపకులపతుల నియామకాన్ని చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా ఉన్న సెర్చ్ కమిటీ చేపట్టేది. అసలు రాష్ట్రాలకు సంబంధమే లేకుండా వీసీల నియామకం చేపట్టేలా డ్రాఫ్ట్ రూపొందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్నత విద్యకు తెలంగాణ ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అవసరమైన చోట కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది’.. అని మంత్రి వెల్లడించారు. అయితే దీనిని ప్రోత్సహించాల్సిందిపోయి ఆటంకాలు కల్పించడమేమిటని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఉప కులపతులుగా పరిశ్రమల అధిపతులను, బ్యూరోక్రాట్లను, బయటి వ్యక్తులను నియమించే అవకాశాన్ని కల్పించాలన్న డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌లోని ప్రతిపాదనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో మూడు వేల మంది విద్యార్థులుంటేనే గ్రేడింగ్‌లు ఇస్తామని, ఉన్నత గ్రేడ్లు వస్తేనే కేంద్ర ప్రోత్సాహకాలు అందుతాయన్న ప్రతిపాదనను కూడా శ్రీధర్ బాబు వ్యతిరేకించారు. ఇది ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు కలిగించే చర్య అని ఆరోపించారు. పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే చర్య బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనడం పేదలను ఉన్నత విద్యకు దూరం చేసే ఆలోచనగా మంత్రి శ్రీధర్‌బాబు అభివర్ణించారు. ‘దేశ సరాసరి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కేవలం 28 శాతం మాత్రమే ఉంది. అంటే ఉన్నత విద్య చదవాల్సిన వయసులో ఉన్న యువతలో నూటికి 28 మంది మాత్రమే కళాశాలల్లో చేరుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే ఎంట్రన్స్ పెట్టాలనే ఆలోచనలు ఆటంకాలు సృష్టిస్తాయి. ఇప్పటిదాకా వైస్ చాన్స్లర్ల పదవీకాలం 3 సంవత్సరాలు ఉండగా యూజీసీ రెగ్యులేషన్స్‌లో 5 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన సరికాదు’.. అని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్, కరెస్పాండెన్స్ కోర్సులకు అనుమతులివ్వబోమని చెప్పడం విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. డ్రాఫ్ట్ యూజీసీ నిబంధనలు తెలంగాణకు ఆమోదయోగ్యంగా లేవని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే అధికారికంగా లేఖ రాయడాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యకు సంబంధించిన ఏ ప్రతిపాదనలైనా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిబంధనలు రూపొందించాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. యూజీసీ రెగ్యులేషన్స్ –2025లోని 15 అంశాలను వ్యతిరేకిస్తూ, అమలును నిలిపివేయాలని రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశం ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. -
విద్యపై ప్రకృతి ప్రకోపం
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడి గాలులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాఠశాల విద్యకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్స్ (యునిసెఫ్) అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది ప్రకృతి విపత్తులతో 85 దేశాల్లో 242 మిలియన్ల మంది విద్యార్థులు ప్రీ–ప్రైమరీ నుంచి అప్పర్ సెకండరీ వరకూ విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ప్రతి ఏడుగురు విద్యార్థుల్లో ఒకరి పాఠశాల విద్యపై వాతావరణ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు స్పష్టం చేసింది. విపత్తుల కారణంగా విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో దిగువ, మధ్య ఆదాయ దేశాలే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది విద్య అంతరాయానికి గురైన 242 మిలియన్ల మంది విద్యార్థుల్లో 74 శాతం మంది అల్పాదాయ దేశాలకు చెందిన వారున్నారు. భారత్‌లోనూ 5 కోట్ల మంది 2024 విద్య అంతరాయానికి తీవ్రమైన వేడిగాలులు ప్రధాన కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గతేడాది భారత్‌లో 5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వేడిగాలుల కారణంగా భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాలు గణనీయమైన ప్రభావాలను చవిచూశాయి. ఈ దేశాల్లో కనీసం 118 మిలియన్ల మంది పిల్లలకు చదువుల్లో అంతరాయం ఎదురైంది. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడినవారు 171 మిలియన్ల మంది ఉంటారని అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యంత తరచుగా విద్య అంతరాయాలు సంభవించాయి. 18 దేశాలలో తరగతులు నిలిపేశారు. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలలో 16 మిలియన్ల మంది పిల్లలపై ప్రభావం పడింది. ఆఫ్రికాలో 107 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండగా.. వీరిలో 20 మిలియన్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగానే పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. 2050–2059 మధ్య తీవ్ర వాతావరణ సంక్షోభాలను ప్రపంచ దేశాలు చవిచూడనున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. 26వ స్థానంలో భారత్ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (సీసీఆర్‌ఐ) పేరిట స్కోరింగ్ ఇచ్చింది. ఇందులో భారత్‌కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్ 14, బంగ్లాదేశ్, 15, ఆఫ్ఘనిస్తాన్ 25 స్థానాల్లో ఉన్నాయి. -
తక్షణమే ప్రక్షాళన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధులు, నియామకాల లేమితో కునారిల్లుతున్నాయని.. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ తేల్చినట్టు సమాచారం. బోధన సిబ్బంది కొరత, తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకురావడం, అరకొర నిధులు వంటి కారణాలతో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. ప్రస్తుతం కనీస స్థాయి పరిశోధనలైనా చేపట్టలేని దైన్య స్థితిలో వర్సిటీలు ఉన్నాయని.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టకుంటే కనీస ప్రమాణాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నట్టు సమాచారం.ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి.. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, నేరుగా పరిశీలించిన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలతో ఈ నివేదికను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి.పోటీ ఎక్కడ?మన వర్సిటీలు కనీసం జాతీయ స్థాయిలోనూ పోటీ పడలేని పరిస్థితి ఉందని విద్యా కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో రెండింటికి ‘జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్)’ గ్రేడ్ కూడా రాలేదని.. ‘ఎ’ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్న వర్సిటీలు కేవలం రెండేనని కమిషన్ వర్గాలు తెలిపాయి. వర్సిటీల్లో 2,825 అధ్యాపక పోస్టులుండగా.. ప్రస్తుతమున్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమేనని.. బోధన, బోధనేతర సిబ్బందిని కలిపి చూసినా 74 శాతం పోస్టులు ఖాళీయేనని పేర్కొన్నాయి. అంతా తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారని తెలిపాయి.ప్రాజెక్టులు డొల్ల.. పరిశోధనలు కల్ల.. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కీలకమైన పరిశోధనలు క్రమంగా తగ్గుతున్నాయి. 2020–21లో రూ.52.45 కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. ఇక్కడ 1,267 మంది బోధన సిబ్బందికిగాను 340 మందే రెగ్యులర్ వారున్నారు. మిగతా అంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారే. వారికి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఈ వర్సిటీకి గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల పరిశోధన ప్రాజెక్టులూ అరకొరగానే వస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆయువు పట్టు అయిన జేఎన్టీయూహెచ్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.200 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకున్నవారు లేరు. వర్సిటీలో 410 మంది ఫ్యాకల్టీకిగాను ఉన్నది 169 మందే. దీనితో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.⇒ మెరికల్లాంటి గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) క్రమంగా వైభవాన్ని కోల్పోతోంది. 2008 నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం దారుణం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.⇒ పాలమూరు వర్సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని కమిషన్ దృష్టికొచ్చింది. పేరుకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినా రూ.7 కోట్లు కూడా అందడం లేదని.. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిధుల కోసం విద్యార్థుల పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, బోధన రుసుములపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోందని అంటున్నారు. ⇒ తెలంగాణ వర్సిటీకి 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైతే... ఉన్నది 61 మందే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీని అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. వర్సిటీకి కనీసం రూ.250 కోట్ల తక్షణ నిధులు అవసమని అంచనా.⇒ కాకతీయ వర్సిటీలోనూ పరిశోధనలు సగం మేర తగ్గిపోయాయి. 405 అధ్యాపక పోస్టులకుగాను 83 మందే రెగ్యులర్ వారు. మిగతా అంతా తాత్కాలిక సిబ్బందే. నిజానికి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులను కలిపితే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని అంచనా.యూనివర్సిటీల స్థాయి పెరగాలివిశ్వవిద్యాలయాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కాదు.. అంతర్జాతీయ గుర్తింపు అవసరం. అది సాధ్యం కావాలంటే వర్సిటీల స్థాయి, ప్రమాణాలు పెరగాలి. బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. లైబ్రరీ, పరిశోధన అవకాశాలు, సరికొత్త టెక్నాలజీలను సమకూర్చాలి. ఈ అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేశాం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం. – ఆకునూరి మురళి, విద్యా కమిషన్ చైర్మన్ -
బడికి ఉరి!.. ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రతి గ్రామంలో రెండు, మూడు వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే.. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యా శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 3–5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్టు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో–117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే.. తెచ్చిన మార్పు ఓ ఐదేళ్లపాటు కొనసాగాలి, తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ.. ఇక్కడ జీవో117 ద్వారా 2022 జూన్‌లో తెచ్చిన విధానాలను కేవలం రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ.. జీవో–117లో ఉన్న మంచి పోయి.. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాల విద్యను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది.కొత్త విధానంతో 10 వేల సబ్జెక్టు టీచర్ల మిగులుజీవో–117 రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దుచేసి, ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసురావాలి. కానీ.. ఈ మూడు విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు.. ఏలూరు జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఐదో తరగతిలో 27 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ నమోదైంది. ఆరో తరగతిలో 19 మంది, 7వ తరగతిలో 17 మంది, 8వ తరగతిలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత తరగతులు ఉన్నందున ఇక్కడ ఆరుగురు స్కూల్ అసిస్టెంట్లు బోధన అందిస్తున్నారు. అయితే, 6, 7, 8 తరగతుల్లో మొత్తం 50 మంది విద్యార్థులే ఉన్నందున కొత్త మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడ యూపీ స్కూల్‌ను రద్దు చేస్తారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులు 27 మంది 2025–26 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో కొనసాగితే అప్పుడు 6, 7, 8 తరగతుల్లో 63 మంది, 9వ తరగతిలో 14 మంది మొత్తం 77 మంది ఉన్నందున ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తారు. కానీ.. అక్కడ బోధనకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను రద్దు చేసి, ఎస్జీటీలను మాత్రమే ఇస్తుంది. అంటే హైస్కూల్‌గా మారినా పరిస్థితి మెరుగుపడకపోగా.. ఉన్న పోస్టులు సైతం వెళ్లిపోయి అప్‌గ్రేడ్‌కు బదులు డౌన్‌గ్రేడ్ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,760 ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఇలాగే మారే ప్రమాదముంది. ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవో–117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. దీంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు 8 సెక్షన్లు కొనసాగుతున్నాయి. 180 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కరు చొప్పున.. గణితం, ఇంగ్లిష్‌కు ఇద్దరు చొప్పున 12 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపిస్తే ఉన్నత తరగతుల్లో 140 మంది విద్యార్థులతో 5 సెక్షన్లే మిగులుతాయి. దీంతో ఒక గణితం, ఒక ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, మరో రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు తగ్గిపోతాయి. ఇలానే జీవో–117 ద్వారా 3–5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున మూడు చొప్పున 10 వేల పోస్టులు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10 వేల స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. ఇంత భారీగా మిగులుతున్న స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు.34 వేల ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావంప్రస్తుతం జీవో–117 ప్రకారం ఉన్నత, యూపీ స్కూళ్లకు కి.మీ. పరిధిలో ఉన్న 4,731 ప్రాథమిక పాఠశాలలోని 3–5 తరగతులను విలీనం చేశారు. వీరికి సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నారు. అలాగే, 1, 2 తరగతుల్లో 10 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్నా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 117 జీవోను రద్దు చేసి, 3–5 తరగతులను తిరిగి వెనక్కి తెస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి, ఇతర పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతులను వాటిలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతేగాక, 3–5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగించకుండా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలంటూ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం కి.మీ. పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులనే విలీనం చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 34 వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో విలీనం చేస్తారు. దీని ప్రకారం మూడో తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కి.మీ. దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో చేరాలి. ఇక 1, 2 తరగతుల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన అప్పటి టీడీపీ సర్కారు.. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక ఎత్తయితే ప్రస్తుతం మారుమూల గ్రామాలు, పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాల్లో (హేమ్లెట్స్) దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 1–5 తరగతులు చదివే విద్యార్థులు తరగతికి నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు. కూటమి కొత్త మోడల్ ప్రకారం ఇకపై వీటిలో 3 నుంచి 5 తరగతులు చదివే వారు ఇకపై గ్రామం దాటిపోవాల్సిందే.ఆ హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టు ఉండదుప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు రెండు వేల హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా.. 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. అదేవిధంగా విద్యార్థుల సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుల కేటాయింపులోనూ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను బదిలీ చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లు లెక్కించి ఆమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. దాని ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ఎన్రోల్మెంట్ మొదటి 53 మంది వరకు ఒక సెక్షన్, 54 నుంచి 88 వరకు రెండో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్‌గా గుర్తించి టీచర్లను ఇచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 54 మంది విద్యార్థుల వరకు ఒక సెక్షన్, 55 నుంచి 94 వరకు రెండో సెక్షన్, 95 మంది నుంచి 3వ సెక్షన్‌గా నిర్ణయించారు. కొత్త దానికంటే పాత విధానంలోనే ఐదుగురు విద్యార్థులు తక్కువకే మూడో సెక్షన్ మంజూరు చేశారు. ఇలా విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధ్యాయుల మిగులతో డీఎస్సీపై ప్రభావం కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటివరకు నోటిఫికేషన్ జాడ లేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15 వేలకు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్ అసిస్టెంట్లే దాదాపు 5 వేలకు పైగా, ఎస్జీటీలు మరో 10 వేలు మిగిలే అవకాశం ఉంది. దీంతో డీఎస్సీలో ఖాళీలను ఎక్కడ నుంచి చూపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్ అమరావతిఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీవో–117 రద్దు చేస్తున్నందున అంతకు ముందున్న వ్యవస్థను పునరుద్ధరించి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారానికి 10 పీరియడ్లు గణితానికి కేటాయించాలని, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లను కొనసాగించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టని పక్షంలో జీవో–117 రద్దు వల్ల హైస్కూల్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్నత పాఠశాల విద్య నిర్వీర్యం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది. -
Telangana: 'స్మార్ట్'గా సర్కారీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు. ఉచిత రవాణా వ్యవస్థ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. -
డీఎస్సీపై పూటకో మాట.. రోజుకో మెలిక
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఏడు నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా.. వాయిదాలకు మరిన్ని కారణాలు వెదుకుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం. దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినన్ని పోస్టులు లేకపోవడంతోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు జూన్ 13న మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్‌లో డీఎస్సీ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అయితే, కొత్తగా బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ జారీ చేశారు. టెట్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయింది. అయినా.. డీఎస్సీ నిర్వహణకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ పేరుతో హడావుడి ఎన్నికల వేళ 25 వేల టీచర్ పోస్టులని చెప్పినా.. 16,347 పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రక టించింది. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకు న్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పి స్తామంటూ ఆగస్టులో టెట్ పరీక్షలు నిర్వహించేలా జూలై 2న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ గస్టులో పరీక్షలంటూ పేర్కొంది. ఇది చేయకపో గా మళ్లీ టెట్‌కు డీఎస్సీకి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెపె్టంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితా లు వచ్చి రెండు నెలలు గడిచినా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం వెలవడలేదు. మరోపక్క ప్రకటించిన పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో (ఆశ్రమ్) దా దాపు 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వి ధానంలో పని చేస్తు న్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర ప న్నింది. వారికి డీఎస్సీలో ఎ లాంటి వెయిటేజీ ఇ వ్వకుండానే దాదాపు 1,150 ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. పైగా గత కొన్ని నెలలుగా ఈ విభాగం కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారి దృష్టి మళ్లించేందుకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఆలస్యం చేయడానికేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నా విజయ రహస్యం ఇదే.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి
సాక్షి,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు చట్టాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన.. ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్, సాధించిన విజయాలతో పాటు.. రానున్న రోజుల్లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ స్థానంలో ఉండి ఎలాంటి సంస్కరణలు చేయనున్నారు.. ఇలా మొదలైన కీలక అంశాలపైన సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌కి ఈయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయగలరు. -
5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ రెండు తరగతుల్లో ఫైనల్ పరీక్షలో ఫెయిలైనప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు ఇప్పటిదాకా వీలుండేది. ఇకపై అలా కాదు.. ‘5వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ఫైనల్ పరీక్షా ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కలి్పంచాలి. ఆ పరీక్షలోనూ ఫెయిలైతే వారిని తిరిగి 5వ తరగతిలోనే కొనసాగించడం తప్పనిసరి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించని వారికీ ఇదే వర్తిస్తుంది. రెండోసారి పరీక్ష రాసే విద్యారి్థని క్లాస్ టీచర్, తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి. విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలి’అని కేంద్రం విడుదల చేసిన గజెట్ పేర్కొంది. అయితే, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయకుండా ఏ ఒక్కరినీ స్కూల్ నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టానికి 2019లో చేపట్టిన సవరణతో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్ విధానం’రద్దు చేశాయి. విద్య రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, గజెట్‌ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని కోరింది. 𝐔𝐧𝐢𝐨𝐧 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 𝐚𝐛𝐨𝐥𝐢𝐬𝐡𝐞𝐬 𝐭𝐡𝐞 '𝐍𝐨 𝐃𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲':Students in classes 5 and 8 who fail the annual exam can retake it within two months. If they fail again, they won't be promoted, but the school will not expel a… pic.twitter.com/AW4KRz8ch3— All India Radio News (@airnewsalerts) December 23, 2024 -
టార్చ్ బేరర్
ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు.’ ఇది ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఓ డైలాగ్. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్చ్ బేరర్‌గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.ఎంపీగా మొదలైన జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్ చేసుకున్న లీడర్!జగన్ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్‌ను పెంచి పోషించారు. కానీ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కష్టపడ్డారు. ఏపీలోని పల్లెల బిడ్డలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? ‘నాడు – నేడు’తో బడికి కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 73 వేల కోట్లు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తే జగన్ క్షేత్ర స్థాయిలో కనిపించేలా చేశారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం... ఇలా ఆయన చేపట్టినవి ఎన్నో!దేశ చరిత్రలో ఏ నాయకుడిపై జరగనంత వ్యక్తిత్వ హననం జగన్‌పై జరుగుతోంది. జగన్ వీటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా సైకోలు జగన్‌పై నిత్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్‌లలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ కూర్చొన్నా, మాట్లాడినా, నవ్వినా, చూసినా పిచ్చిపిచ్చి రాతలతో పోస్టులు, రీల్స్ పెడుతున్న వారి కుటుంబాల్లో ఎంతోమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారు!జగన్‌కు పడటం కొత్త కాదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లే వ్యక్తికి ఎలా లేచి నిలబడాలో బాగా తెలుసు. ఏదో మేజిక్ వల్ల గెలిచిన కూటమి పెద్దలు ఆయన పని అయిపోయిందని ఇప్పుడు సంబర పడుతూ ఉండొచ్చు. ఏపీలో అధికా రంలోకి వచ్చిన కొన్ని నెలలకే చంద్రబాబు అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఒకప్పటిలా సంక్షేమం అందకపోవడంతో జనం నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రజల బాగు కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికీ ఫెయిల్ కాడు. ఎందుకంటే వారి సంకల్ప బలం చాలా గొప్పది. నిజమైన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు!– వెంకట్ -
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్, స్టూడెంట్స్, టీచర్స్ ఈవెంట్ గిన్నిస్ బుక్‌లో శాశ్వతంగా లిఖించదగ్గ కార్యక్రమమని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. శనివారం బాపట్ల మున్సిపల్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ దేశంలో నంబర్ వన్ అయిందంటే తాను అమలు చేసిన విజనేనన్నారు. ఇప్పుడు 2047 విజన్ తెచ్చానన్నారు. ప్రైవేట్ పాఠశాలలకంటే బెటర్‌గా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను చదివిస్తామన్నారు. ఏడాదికి మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏటా డిసెంబర్ 7న మెగా ఈవెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోని అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. తన హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించి.. 1.50 లక్షల మందికి టీచర్ పోస్టులు ఇచ్చామన్నారు. 16,347 మెగా డీఎస్సీ పోస్టులు జూన్ నాటికి భర్తీ చేస్తామన్నారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ ఉంటుందన్నారు. 117జీవో 4 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాని పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఏడాదికి పాఠశాలల్లో పెనుమార్పులు తెస్తామన్నారు. కాగా సభకు చ్చిన ఓ విద్యార్థి తండ్రి గుండెపోటుకు గురైతే నడిపించుకుంటూ తీసుకెళ్లడం ఆందోళనకు గురి చేసింది. సభకు ఎనిమిదో తరగతి చదువుతున్న సాహుల్ అనే విద్యార్థి తండ్రి పఠాన్‌బాజీ హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హైస్కూలుకు పిలిపించారు. సీఎం వచ్చే వరకు అందరినీ అక్కడి నుంచి లేవకుండా ఉంచారు. కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదు. ఈ వాతావరణం మధ్య ఇమడలేక 11 గంటల సమయంలో పఠాన్‌బాజీ గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే మెడికల్ క్యాంపు ఉన్నప్పటికీ వీల్‌చైర్ కూడా లేకపోవటం, అంబులెన్సు లేకపోవటంతో బాధితుడిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. -
కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లల భవిష్యత్తును నాశనం
-
విద్య విషయంలో ప్రభుత్వం క్షమించరాని తప్పు చేస్తోంది: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటిని కమ్ముకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆరు నెలలు పూర్తి కావస్తోన్నా ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నారు.ఈ మేరకు బుధవారం వైఎస్సార్ జిల్లాలో మాట్లాడుతూ.. ‘సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యం చేసింది. జగన్ ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. అయిదు సంవత్సరాలు కుంటు లేకుండా అమ్మబడి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారు. వైఎస్ జగన్ హయాంలోని ‘నాడు-నేడు’ చాలా గొప్ప పథకం. రాష్ట్ర ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ప్రశంసించారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే ఎత్తేశారు. 8వ తరగతి వారికి ఇచ్చే ట్యాబ్‌ల పథకం అటకెక్కింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం విద్యార్థులకు శాపం లా మారింది.’ అని మండిపడ్డారు. -
‘ఉత్తమ’ టీచర్.. చెత్త పనులు
మంచిర్యాల అర్బన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. అభంశుభం తెలి యని బాలి కల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం మంగళ వారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఓ పాఠశాలలో ఎస్ఏ(తెలుగు) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.సత్యనారాయణ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ప్రధానోపా ద్యాయురాలితో పాటు డీఈవో యాదయ్యకు సమాచారం అందించారు. ఆయన మంగళవారం ఎంఈవో, సెక్టోరల్ అధికారులను విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో విచారణ చేప ట్టారు. సత్యనారాయణ అసభ్యకరంగా తాకుతు న్నాడని, కళ్లు మూసుకుని ధ్యానం చేయాలంటూ సెల్ఫోన్లో చిత్రీ కరించాడని బాలికలు పేర్కొన్నారు. మాటల్లో చెప్పరాని విషయా లను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. విచారణ అధికారులు వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని బయటకు రావాలని తల్లిదండ్రులు పదేపదే పిలి చినా రాకపోవడంతో ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. కాగా, సత్యనారాయణ గతంలో ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. -
APలో మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు
-
ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
-
కాలానికి అనుగుణంగా విద్యాబోధన ఉండాలి: సరితా జాదవ్
బంజారాహిల్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యావిధానాలతో పాఠశాలలను ఎలా సిద్దం చేయాలనే అంశంపై నిర్వాహకులు దృష్టి సారించాలని యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ సూచించారు. ’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్‌లో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలోని 281 సీబీఎస్ఈ స్కూళ్లకు చెందిన ప్రిన్స్పల్స్. అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సరికొత్త విద్యావిధానాలు, మారుతున్న పరిస్థితులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ మాట్లాడుతూ..గ్లోబల్ ఎడ్యుకేషన్ విధానానికి అనుగుణంగా విద్యాబోధనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం స్కూళ్లలో ఏర్పాటు చేసుకోవాల్సిన మౌళిక సదుపాయాలు, పరిశోధనలపై దృష్టి పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు సన్నద్ధం చేయడంలో ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ అజంతా సేన్, ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ కాథన్ దుష్యంత్ శుక్లా, హెచ్ఎస్ఎస్ సీ చైర్మన్ అమీర్ ఖాన్, వైస్ చైర్పర్సన్ డా. ఎబెనీజర్, సెక్రెటరీ రోజా పాల్,డా. సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు పోయినా పట్టించుకోరా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుíÙతమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా? అని మండిపడింది. ‘ఒకే పాఠశాలలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేనట్లు అనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పని చేస్తారా?’అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఫుడ్ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. అధికారులు ఏం చేశారు.. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (డిసెంబర్ 2వ తేదీ) వాయిదా వేసింది. చట్టం అమలే లేదు.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానమంత్రి పోషణ్ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదు. అర్హులైన మహిళలు, పిల్లలకు సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రకారం మెనూ అందించడం లేదు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 20న 100 మంది.. 26న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోచోట చిన్నారి మృతి చెందింది. కరీంగనర్ జిల్లా గంగాధర్ మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి మధ్యాహ్న భోజనం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజన్ ఘటనల విషయంలో అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘జిల్లా విద్యాశాఖాధికారులు నిద్రపోతున్నారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవత్వం లేకుండా వ్యవహరిస్తారా? నవంబర్ 20న, 24న, 26న.. ఒకే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా ఉన్నతాధికారులకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? ఇంత సాంకేతిక యుగంలో వారం క్రితం జరిగిన ఘటనపై వివరాలు లేవంటూ వాయిదా కోరతారా? ఘటన జరిగింది మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. హైదరాబాద్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్ లేదా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. మమ్మల్నే నిర్ణయం తీసుకోమంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేస్తాం. పాస్ ఓవర్ (స్పల్ప వాయిదా)కు గానీ, వాయిదాకుగానీ అంగీకరించం. వెంటనే ఏఏజీ వచ్చి సమాధానం చెప్పాలి’అని ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ధర్మాసనం ముందు ఏఏజీ హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని జిల్లాల్లో ఆహార నాణ్యతను పరీక్షించండి పాఠశాలల్లో ఆహార కలుషితంపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని ధర్మాసనానికి ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ‘చిన్నారులే ఈ రాష్ట్ర ఆస్తులు, భవిష్యత్ ఆశాకిరణాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ నెల 20న ఉప్మా తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే దాన్ని మార్చాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడు సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఫుడ్ పాయిజన్‌పై పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం. రెండు రోజుల సమయం ఇవ్వండి’అని కోరారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఆహార శాంపిల్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్లను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం– 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువలను పరిశీలించాలని సూచించింది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఫుడ్ పాయిజన్ ఘటనలతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో వివరంగా తెలుపుతూ డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక అందజేయాల ఆదేశించింది. -
YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
కులగణనతో ఏ ఇబ్బంది ఉండదు, ఎవరి రిజర్వేషన్లు తొలగించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్న సీఎం.. అన్ని వర్సీటీలకు వీసీలను నియమించామని చెప్పారు. రూ. 650 కోట్లతో పాఠశాలలను బాగు చేస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం సందరర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్ధులే బాగస్వాములు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితమైన ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం భోజనం పెట్టిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తాం. నాణ్యమైన బోజనాన్ని విద్యార్థులకు అందించాలి. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. మసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల మూసివేతతో విద్యకు పేదలు దూరమయ్యారు.చదవండి: అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కుల గణన జరగాలి. కేంద్రం మెడలు వంచి కుల గణన జరిపి రిజర్వేషన్తు తీసుకొస్తాం. కుల గణనతో ఎవరి రిజర్వేషన్లు తొలగించం. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెంచడం కోసమే. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలికొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాను. కులగణను అడ్డువచ్చే ద్రోహులను సమాజంలోకి రానివ్వొద్దు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి.’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
సర్కారు చదువులు చతికిల!
సాక్షి, అమరావతి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యా రంగం పరిస్థితి తయారైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమైందో చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి, సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి, అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి, లేని పాఠశాలల్లో నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మందిని మిగులు చూపించి.. 9,075 మందిని మాత్రమే సర్దుబాటు బదిలీ చేశారు.అయితే, ఈ ప్రక్రియలో ఎన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉంది.. ఎక్కడ మిగులు ఉన్నారు.. వారిని ఏం చేయాలి.. అనే ప్రాథమిక ఆలోచన కూడా చేయకుండానే విద్యా శాఖ అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3,758 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3–8 తరగతులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, అక్కడున్న విద్యార్థుల బోధనను గాలికి వదిలేశారు. 502 హైస్కూల్ ప్లస్‌లను సర్దుబాటు నుంచి మినహాయించడంతో కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులే లేకుండాపోయారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లకు అనువుగా రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకు వర్తింపజేసి, అత్యంత జూనియర్ ఎస్జీటీలను హైస్కూళ్లకు.. ఉన్నత పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు పంపించారు.విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు » ఈ విద్యా సంవత్సరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. జూన్ చివరి వారంలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించి, మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దాంతో పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సంఘాలతో సమావేశాలు నిర్వహించి, మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇలా రెండుసార్లు జరగడంతో సెపె్టంబర్ నెలాఖరు దాకా సర్దుబాటు బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సర్దుబాటులో తమకు నష్టం జరిగిందని వందల సంఖ్యలో ఉపాధ్యాయులు పాఠశాల విద్య కమిషనరేట్‌కు వినతులు పంపుతున్నారు.» సర్దుబాటు మార్గదర్శకాల ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మందికి మించి విద్యార్థులుంటే స్కూల్ అసిస్టెంట్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే తక్కువ రోల్ ఉన్న స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను హైస్కూళ్లకు బదిలీ చేసి, వారి స్థానంలో ఐదు లేదా ఆరుగురు ఎస్జీటీలను సర్దుబాటు చేస్తామన్నారు.» వాస్తవానికి ఆయా స్కూళ్లల్లో ఉన్న సబ్జెక్టు టీచర్లను బదిలీ చేసినా, వారి స్థానంలో పాఠం చెప్పేందుకు ఒక్క టీచర్‌ను కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని 3 వేలకు పైగా యూపీ స్కూళ్లలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి ఉండడం గమనార్హం. స్కూళ్లల్లో మిగులుగా ఉన్న టీచర్లను లేనిచోటకు పంపించాల్సి ఉంది. అయితే మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో అక్కడ ఉన్న టీచర్లను స్థానికంగానే సర్దుబాటు చేశారు. మిగిలిన టీచర్లను సైతం విద్యార్థులు లేకున్నా అక్కడే ఉంచారు. టీచర్లు లేని చోటుకు పక్క మండలం నుంచి పంపాల్సి ఉన్నా పట్టించుకోలేదు. జీవో 117 రద్దుకు కూటమి సర్కారు చర్యలు » పలు సర్వేల అనంతరం విద్యా రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలని, జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ఒకే విధమైన విధానాలు అనుసరించాలని పేర్కొంది. ఇందుకోసం ఉపాధ్యాయ–విద్యార్థుల నిష్పత్తిని తగ్గించాలంది. » విద్యా బోధనను 5+3+3+4 విధానంలో పునర్నిర్మించాలని సూచించింది. ఎన్ఈపీ–2020 సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం 2022లో జీవో 117 జారీ చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి మార్చారు. ఇలా 4,900 ఎలిమెంటరీ స్కూళ్లలోని 2.43 లక్షల మంది విద్యార్థులను కి.మీ. లోపు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. » 8 వేల మంది అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించి సబ్జెక్టు టీచర్ బోధన అందుబాటులోకి తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన అందించడంతో పాటు ఉపాధ్యాయులపై బోధన ఒత్తిడి తగ్గించేందుకు టీచర్ విద్యార్థుల నిష్పత్తిని 1:20 ఉండేలా చర్యలు తీసుకున్నారు. » దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఏపీ మోడల్ విద్యా విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం నుంచి 1– 5 తరగతులను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చడంతో పాటు ప్రస్తుతం హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ బోధన పొందుతున్న 3– 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయనుంది. హైస్కూల్ స్థాయిలో (6–10) ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని నిర్ణయించింది. అంటే ఐదో తరగతి వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకేసారి ఆరో తరగతిని ఇంగ్లిష్ మీడియం ఎలా చదవగలరన్న కనీస అవగాహన లేకుండా మార్పులకు శ్రీకారం చుడుతోంది. మున్సిపల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌ల్లో బోధన గాలికి.. » బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, వారికి సమీపంలోనే జూనియర్ కాలేజీ ఉంటే మేలు జరుగుతుందన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో మండల స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలో 502 స్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా మార్చి, ఇంటర్ విద్యను ప్రారంభించారు. దీంతో గతేడాది 294 బాలికల జూనియర్ కాలేజీలు, మరో 208 కో ఎడ్యుకేషన్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి బోధనకు స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్లను నియమించారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల సర్దుబాటులో హైస్కూల్ ప్లస్‌లను మినహాయించడం, ఉన్న అధ్యాపకుల్లో కొందరు రిటైర్ అవ్వడంతో అక్కడ ఇంటర్ విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది. » మున్సిపల్ హైస్కూళ్లల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉంది. దీంతో గత ప్రభుత్వంలో అర్హత ఉన్న సీనియర్ ఎస్జీటీలను కొరత ఉన్న హైస్కూళ్లకు డీఈవో కార్యాలయం ద్వారా సర్దుబాటు లేదా డెప్యుటేషన్‌పై నియమించి బోధన అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల కోసం రూపొందించిన సర్దుబాటు నిబంధనలను మున్సిపల్ స్కూళ్లకూ వర్తింపజేయడంతో ఇప్పటి వరకు డెప్యుటేషన్‌పై వచ్చి హైస్కూళ్లల్లో బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లల్లో అత్యంత జూనియర్ మిగులు ఉపాధ్యాయులను హైస్కూళ్లలో సర్దారు. దీంతో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. గతంలో జిల్లా స్థాయిలోనే సర్దుబాటు» విద్యా రంగానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. జీవో నంబర్ 117 ప్రకారం ప్రభుత్వ మేనేజ్మెంట్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులను విద్యార్థులకు అవసరం ఉన్న చోటుకు జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేశారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా పక్క మండలాల స్కూళ్లలోనే సర్దుబాటు చేసేవారు. » విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా చేసిన ఈ మార్పుతో విద్యా సంవత్సరంలో ఎక్కడా బోధనకు ఆటంకం ఏర్పడలేదు. ఎక్కడా ఉపాధ్యాయుల కొరత అనేది రాలేదు. తాజాగా కూటమి సర్కారు అసంపూర్ణ సర్దుబాటుతో ఈ ఏడాది విద్యా ఫలితాలు అత్యంత దారుణంగా పడిపోతాయని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో రాష్ట్ర టాపర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలవగా, ఈసారి ఆ పరిస్థితి ఉండేలా లేదని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యా రంగం నాశనమైంది. బడుల్లో ఉపాధ్యాయులు లేకుండా చేసింది. దాన్ని గాడిన పెట్టడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత. అందుకే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోటు నుంచి లేని చోటుకు సర్దుబాటు చేస్తున్నాం. – ఆగస్టులో విద్యా శాఖ మంత్రి లోకేష్, ఉన్నతాధికారులు కాకినాడ జిల్లా తుని మండలంలో 58 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నట్టుగా విద్యా శాఖ గుర్తించింది. అయితే సర్దుబాటులో ఒక్కరు కూడా బదిలీ కాలేదు. ఈ మండలానికి పక్కనే ఉన్న రౌతులపూడిమండలంలోని ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలకు గాను.. ఐదు స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్లను తొలగించారు. పైగా 20 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నా ఒక్కరినీ ఇవ్వలేదు. -
5 నెలలకే విద్యార్థులను రోడ్డుకు ఎక్కేలా చేశారు
-
ఉద్యోగం నుంచి తొలగించడం సబబే
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్‌కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాలివీ2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది. -
ఏఏఐ చైర్మన్‌గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
సాక్షి స్పెల్ బి పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన
-
ఇదేం కమిషన్?
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తొలిదశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, తమను సంప్రదించకుండానే సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు.సలహా మండలిలో చేరేదే లేదని ఇప్పటికే ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారని.. మరో ఇద్దరు ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటు చేసినా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం, సలహాదారుల ఎంపికలో తనకు ప్రమేయమే లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదని తెలిసింది. విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నీ తానే అయి నడిపిస్తుండటమే దీనికి కారణమని విద్యాశాఖ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ఇవేం నియామకాలు? విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. చాలా రోజుల తర్వాత కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించింది. వాస్తవానికి విద్యా రంగంలోని వివిధ విభాగాల నుంచి సభ్యుల నియామకం జరగాలని కొన్ని నెలల క్రితం జరిగిన మేధావుల సమావేశంలో సీఎంకు పలువురు సూచించారు. కానీ ఒక కార్పొరేటర్, అధికార పారీ్టకి చెందిన ఓ స్కాలర్ సహా మరో వ్యక్తిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల సభ్యులు రాజకీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని.. విద్యా రంగంలో పారదర్శకంగా సంస్కరణలు చేపట్టలేమనే అభిప్రాయాలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్‌కు సలహా కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రొఫెసర్లను నియమించారు. అయితే ఈ నియామకాలు విద్యా కమిషన్ పరిధిలో జరిగి ఉంటే బాగుండేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కొందరి సూచనల మేరకు సలహా కమిటీని సీఎం వేశారని అంటున్నారు. సలహా కమిటీ కేవలం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు విద్యా కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు సాధ్యమేనా? విద్యా కమిషన్‌పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. విద్యా రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేయడం లేదని సలహా కమిటీలో నియమితులైన సభ్యుడొకరు మండిపడ్డారు. కర్నాటకలోనూ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ మొత్తం 14 సబ్ కమిటీలను వేసుకుందని.. వాటి ద్వారా మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రాజకీయ, సామాజిక కోణంలోని వారినే ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చారని.. సాంకేతిక విద్య, అంగన్వాడీ, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నిపుణులను భాగస్వామ్యం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతేగాకుండా అసలు విధులేమిటో చెప్పలేదని, ఏం సలహాలివ్వాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టతా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యా కమిషన్‌కు ఆదిలోనే తలపోట్లు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యాశాఖలో భారీగా మార్పులు!
సాక్షి, అమరావతి: విద్యాశాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతోపాటు సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులను సైతం మార్చనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో), ఆర్జేడీలకు కూడా స్థానచలనం కల్పించనున్నారు. ఈ అంశంపై నెల రోజుల క్రితమే వివరాలు తీసుకున్న విద్యాశాఖ మంత్రి కార్యాలయం... అధికారుల మార్పుపై తుది ఫైల్‌ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిని పదో తరగతి పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు) డైరెక్టర్‌గా బదిలీ చేస్తారని తెలిసింది. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న దేవానందరెడ్డిని ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డిని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా బదిలీ చేస్తారని సమాచారం. అలాగే కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్‌లలో ఒకరిని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ గంగాభవానీలను సమగ్ర శిక్షకు బదిలీ చేస్తారని సమాచారం. మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌గా ఇంటర్ విద్యలో పని చేస్తున్న శ్రీనివాసరావును, ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్రావును ఇంటర్ విద్యకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. వీరితోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం బదిలీ చేయనున్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా డీఈవో తప్ప మిగిలిన 25 జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆరు నెలల క్రితమే మార్చారు. అయినా ఇప్పుడు మరోసారి వీరందరికీ స్థానచలనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. -
విద్యా కమిషన్‌కు సలహా కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా కమిషన్‌కు ఆరుగురితో సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొఫెసర్ హరగోపాల్, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు కె.మురళీ మోహన్, కె.వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎంవీఎఫ్ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి, యూనిసెఫ్ విద్యా నిపుణుడు కె.ఎం.శేషగిరి ఈ కమిటీలో ఉన్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కమిషన్ సభ్యులను కూడా నియమించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత ఉన్నతస్థాయికి చేర్చడానికి వీలుగా ఈ సలహా కమిటీ కమిషన్‌కు సూచనలు చేస్తుంది. -
అద్దెలు లేవు.. అన్నం కూడా లేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని, విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ శాఖలో నెలకొన్న సమస్యలు తెలుసుకునే ఓపిక లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురుకుల పాఠశాలల భవనాల అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం..విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టలేని స్థితికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిరవధికంగా మూసివేశారన్నారు. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మూసీనది ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల విద్యా సంస్థల భవనాల అద్దె, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్íÙప్ల డబ్బు ఇచ్చేందుకు చేతకావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. చదువుకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ, మరోవైపు ప్రైవేట్ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందకుండా చేసే కుట్రలకు పాల్పడుతోందని కేటీఆర్ అన్నారు. నాసిరకం భోజనం, భద్రత లోపాలతో ఇప్పటికే గురుకుల విద్యార్థుల్లో భయాందోళన నెలకొందని చెప్పారు. ఫీజు బకాయిలను సాకుగా చూపుతూ కాలేజీ యాజమాన్యాలు మెమో, టీసీలు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు పైచదువులు, ఉద్యోగాలకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 2 వేల కోట్ల ఫీజు బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. సీఎం రేవంత్‌కు పాలన అనుభవం లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ఢిల్లీకి మూటలు పంపడంలో తీరిక లేకుండా ఉన్న ఆయనకు విద్యార్థులు, కాలేజీల సమస్యలు పట్టడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
కేసీఆర్ కేజీ టు పీజీ కథ చెప్పి చేసిన మోసం
-
కొత్త టీచర్లకు నేడు నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు 10 వేల మంది వరకూ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా చేరబోతున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి బుధవారం నియామక ఉత్తర్వులు నేరుగా అందించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంపికైన కొత్త టీచర్లకు సంబంధిత జిల్లా కేంద్రాల డీఈవోల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఉదయం డీఈవో ఆఫీసుకు రావాలని కోరారు. జిల్లాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర టీచర్లు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ ఆన్లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహించారు. సెపె్టంబర్ 30న డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రతి పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, జిల్లా సెలక్షన్ కమిటీకి పంపారు. వారం రోజుల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముగ్గురిలో ఒకరిని జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరికి నియామక పత్రాలను అందించబోతున్నారు. 10,006 పోస్టుల భర్తీ.. మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 10,006 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా పోస్టుల్లో కొన్ని బ్యాక్‌లాగ్‌లపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల ఆగిపోయాయి. కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థి దొరకలేదని అధికారులు తెలిపారు. ఎస్జీటీ, ఎస్ఏ రెండు ఉద్యోగాలు వచ్చిన వాళ్లు 700 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి, ఏదైనా ఒకదానిలో కొనసాగేందుకు ఐచ్ఛికం ఇచ్చారు. ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశారు. -
కొత్త గురువులకు సరికొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్త టీచర్లు రాబోతున్నారు. 11,062 మందిని డీఎస్సీ ద్వారా నియమించబోతున్నారు. వాస్తవానికి వీళ్లంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వాళ్లే. బోధనకు అవసరమైన బీఈడీ, డీఎడ్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వాళ్లే. అంతిమంగా డీఎస్సీ పరీక్షలోనూ ర్యాంకు కొట్టినోళ్లే. ఇన్ని ఉండీ వీళ్ళకు మళ్లీ శిక్షణ ఏంటి? అనే అనుమానం రావొచ్చు. కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు చెప్పింది. దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్‌ను రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) తీసుకుంటోంది. అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్‌ను కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9న టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా, ఆ తర్వాత నెల రోజులపాటు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నారు. విలువలే ముఖ్యం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్రమార్గం పడుతోందన్న ఆరోపణలున్నాయి. విలువల్లేని టీచర్లపై విమర్శలొస్తున్నాయి. అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడైన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాలికల చట్టాలు, మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు. అవసరమైతే మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు కృషి చేసేలా ప్రేరణపరమైన క్లాసులు ఇప్పించనున్నారు. టెక్నాలజీపై పట్టు విద్యా వ్యవస్థలో సాంకేతికత వేగంగా చొచ్చుకుపోతోంది. టీచర్ కన్నా విద్యార్థే ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా సవాలక్ష అంశాలను తెరమీదకు తెస్తున్నాడు. వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం. టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయడం వంటి మెళకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు. బోధనలో త్రీడీ, వర్చువల్ రియాలిటీ, ఆగుమెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైనా మెళకువలు నేరి్పంచనున్నారు. మార్పు దిశగా అడుగులు కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశారు. ఆ సమయంలో వారి బీఈడీ సిలబస్‌లో ఉన్న పాఠ్యాంశాలు వేరు. ఇప్పుడు బోధన విధానం, విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కన్పిస్తోందనేది జాతీయ విద్యా సర్వే నివేదికల సారాంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్ధికి మధ్య సమన్వయం, సరికొత్త మెళకువలతో బోధన వంటి టెక్నిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ మంచిదే: పింగిళి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) నేటి విద్యావిధానంలో మార్పులను అందిపుచ్చుకునేందుకు కొత్త టీచర్లకు శిక్షణ అవసరం. చట్టాలను వారికి తెలియజెప్పాలి. ఎప్పుడో బీఈడీ చేసిన వారికి ఈ తరహా పునశ్చరణ మేలు చేస్తుంది. అయితే, వేగంగా మారుతున్న సమాజంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు తరచూ చేపట్టాల్సిన అవసరం ఉంది. అంకిత భావం పెరుగుతుంది : సయ్యద్ ఫౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) పోటీ పరీక్షల్లో విజయం సాధించి, టీచర్‌గా వచ్చే వ్యక్తికి ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అంకిత భావం పెరుగుతుంది. కొత్త తరం ఉపాధ్యాయులకు సరైన మార్గనిర్దేశం ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తెస్తారు. -
విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?
అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపి స్తామని అంటున్నారు. కామన్ స్కూల్‌కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. చదవండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.-ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులు -
ఏపీ నిట్‌లో 125 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్ రిజర్వ్డ్ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్ రిజర్వ్‌డ్‌కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కు 2 పోస్టులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్ రిజర్వ్‌డ్‌కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్ 14ఏ గ్రేడ్‌కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్ రిజర్వుడ్‌కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు. బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యా«థ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు. -
అన్ని వర్సిటీలకు ఉమ్మడి చట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలి పారు. ఐఐఎం, ఐఐటీలకు ఉన్న విధంగా బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్‌పర్సన్స్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించాలని అధికారులకు సూచించారు. సీఎం మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ విధానంలో) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వర్సిటీని ఏర్పా టు చేయాలని ఆదేశించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాల ని చెప్పారు. అధ్యాపకులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు వర్సిటీలను కూడా ప్రోత్సహించాలని చెప్పారు. విదేశీ వర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు జాయింట్ డిగ్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. నవంబర్‌లోగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆధార్‌తో అనుసంధానం చేసి డీజీ లాకర్లో చేర్చాలని ఆదేశించా రు. రాష్ట్రంలో కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థుల స్థూల నమోదు (గ్రాస్ ఎన్ రోల్మెంట్ రేషియో) 36 శాతం ఉండగా 2029 నాటికి 60 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి అధికారులు పాల్గొన్నారు. పౌర సేవలను సులభతరం చేయండిరియల్ టైమ్ గవర్నెన్స్ సరీ్వసెస్ (ఆరీ్టజీఎస్) ద్వారా పౌర సేవలను సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న ఆరీ్టజీఎస్ సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించి పనితీరును పరిశీలించారు. అనంతరం సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. -
Telangana: బడి.. ఇక త్రీడీ!
సాక్షి, హైదరాబాద్: క్లాస్ రూంలో తాజ్‌మహల్ పాఠం చెప్పడం కాదు.. తాజ్‌మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్టుగా ఉంటే.. విత్తనం మొలకెత్తే దగ్గర్నుంచి.. చెట్టుగా మారి.. పూలు, కాయడం మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే.. విద్యార్థులకు ఈ థ్రిల్లే వేరు. సబ్జెక్ట్‌పై మంచి అవగాహన రావడమేకాదు, చదువుకోవడం, నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడమూ ఖాయమే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది. ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా.. అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కిందటి నుంచే ప్రయత్నాలు వర్చువల్ రియాలిటీ, త్రీడీ వంటి డిజిటల్ బోధన వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర అధ్యయనాలు తేల్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకుని, డిజటల్ బోధనను అమలు చేయాలని కేంద్రం కోరింది. ఇందుకోసం అయ్యే వ్యయంలో 60శాతం భరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రయత్నం 2022లోనే మొదలైంది. అవసరమైన మౌలిక వసతులనూ గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై రెండేళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది. త్రీడీ విద్యను రెండు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కానీ ప్రతిపాదనల దశలోనే అది ఆగిపోయింది. ఆధునిక విద్యకు ఎన్నో అవసరాలు! స్కూళ్లలో డిజిటల్ బోధనకు 75 అంగుళాల మానిటర్లు అవసరం. కంప్యూటర్లు, వర్చువల్ రియాలిటీ, త్రీడీ పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్రూంలు, మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డ్, పాఠ్యాంశాల బోధన కోసం యాప్‌లు, ట్యూబ్‌లైట్లు, గ్రీన్‌బోర్డ్‌లు, విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది రాకుండా యూపీఎస్‌లు వంటివి అవసరం. దీనికితోడు వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై తప్పనిసరి. విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియో, త్రీడీ చిత్రాలు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. యానిమేషన్, త్రీడీ చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలి. కొత్త టెక్నాలజీలతో సులువుగా.. ఇప్పుడు డిజిటల్, త్రీడీ, వర్చువల్ విద్యా బోధన సులువుగా మారిందని నిపుణులు తెలిపారు. గతంలో ప్రొథీయమ్ బోర్డ్ వాడాల్సి వచ్చేదని.. దానితో ఒక్కో బడికి రూ.25 లక్షల దాకా వెచ్చించాల్సి వచ్చేదని.. ఇప్పుడు తక్కువ ఖర్చయ్యే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ప్రొజెక్టర్, స్మార్ట్ టచ్ స్క్రీన్ టీవీలను వాడుతున్నారని.. బోధనకోసం వాడే కంటెంట్‌ను బడిలోని కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేయడానికి వీలుందని వెల్లడించారు. బోధన కంటెంట్ ఉచితంగా కూడా దొరుకుతుందని.. కాకపోతే స్థానికతను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ రూపొందించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కంటెంట్‌ను తగిన మెళకువలతో అందిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. సూచనలు, అంచనాలివీ.. – 6 నుంచి 10 తరగతుల వరకు రికార్డు చేసిన డిజిటల్ కంటెంట్‌ను ఇంటర్నెట్ సాయంతో వినేలా చేయవచ్చు. టీచర్లు చెప్పే లైవ్ పాఠాలు ఇంటివద్దే వినే, చూసే వీలుంటుంది. – ప్రతి పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు.. ఇలా మొత్తం 25 ఎల్రక్టానిక్ పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. – ప్రయోగాత్మక పరిశీలన కోసం రాష్ట్రంలో 3 వేల స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోనే వర్చువల్, డిజిటల్, త్రీడీ పాఠాలు చెప్పవచ్చు. ఒక్కో స్కూల్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఇలా మొత్తంగా 300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. ఇంటర్నెట్, ఇతర వసతులు కల్పించాలి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన అంశం. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ముఖ్యం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు ఇంటర్నెట్ నెట్ సదుపాయం లేదు. కొన్నిచోట్ల వేగం సరిగారాదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకల్ కంటెంట్ అవసరం డిజిటల్, త్రీడీ విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తుంది. అయితే ఎక్కడి నుంచో పాఠాలు దిగుమతి చేసుకుంటే లాభం లేదు. జాతీయ స్థాయిలో రూపొందించిన పాఠాలు. స్థానిక పరిస్థితులను ప్రతిబింబించేలా వీడియోలు, యానిమేషన్ ఉండాలి. దీనిపై రాష్ట్రంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. విద్యార్థులకు పాఠం చెప్పే సమయంలోనే డిజిటల్, త్రీడీ విధానాలను వినియోగించాలి. కేవలం రివిజన్ సమయంలో వాడితే ప్రయోజనం ఉండదు. – పన్నీరు భానుప్రసాద్, సూపర్ టీచర్ ఎడ్యు రీఫారŠమ్స్ సీఈవో -
2 నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబర్ 2 నుంచి 14 వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. సెలవుల తర్వాత సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులకు సూచించారు. -
క్లాస్ రూమ్‌కు సెల్ తీసుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: తరగతి గదిలోసెల్‌ఫోన్ వాడొద్దని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫోన్ వాడే టీచర్లను ఓ కంట కనిపెట్టాలని అధికారులకు సూచించింది. క్లాస్ రూ మ్‌లోకి అసలు ఫోన్ లేకుండానే వెళ్ళాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతేనే ఫోన్ తీసుకెళ్ళాలని, దానికీ ప్రధానోపాధ్యాయుడి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. వాస్తవానికి ఈ నిబంధన పాతదేనని ఉన్నతాధికారులు అంటుండగా, ఇకపై దీన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు డీఈవోలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు సెల్‌ఫోన్ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇది టీచర్లకు ఇబ్బందికరంగా మారుతుందని, హెచ్ఎంలు వేధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాట్సాప్ చూస్తూ..ఫోన్ మాట్లాడుతూ..! ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకమంది టీచర్లు సెల్ఫోన్లో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫాలో అవుతూ గడుపుతున్నారని గుర్తించారు. కొంతమంది ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దాదాపు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఉదంతాలను జిల్లా అధికారులు గుర్తించారు. వీటిని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపారు. సెల్‌ఫోన్‌పై క్లాస్‌రూంలో నిషేధం విధించాలని సూచించారు. పైగా టీచర్లు బోధనకు ముందుగా సన్నద్ధమవ్వడం లేదని, క్లాస్ రూంలో సెల్‌ఫోన్ ద్వారా సెర్చ్ చేసి పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు సెల్ఫోన్లో సెర్చ్‌చేసి సమాధానమిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచి్చంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెల్‌ఫోన్‌పై నిషేధం విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ లేకుండా స్కూల్ నడుస్తుందా? టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్ వాడుతున్నారని చెప్పడం అర్థం లేని మాట. అసలు సెల్‌ఫోన్ లేకుండా స్కూళ్ళు నడిచే అవకాశం ఉందా? విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలంటే ఫోన్ కావాలి. ఉన్నతాధికారులకు పంపే అన్ని రిపోర్టులను సెల్ లేదా ట్యాబ్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. సెల్‌ఫోన్‌తో పనులు చేయాలని చెప్పే అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) స్వీయ నియంత్రణ మంచిది తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం కన్నా.. టీచర్లు స్వీయ నియంత్రణ పాటించేలా చర్య లు తీసుకోవాలి. బోధనకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిషేధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హెచ్ఎంలు అనవసరంగా టీచర్లను వేధించకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్కూల్లో ఫోన్ వినియోగానికి టీచర్లు దూరంగా ఉండాలి. – సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) -
ఇంటర్ నుంచి వర్సిటీ దాకా...
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీ ఇలా ఉన్నత విద్యావ్యవస్థలోని నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా కాలేజీ సర్వీస్ కమిషన్‌ను తెర మీదకు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతికవిద్య విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాలేజీ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వల్ల నియామక విధానంలో కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు.కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు?..: రాష్ట్రంలో 11 యూనివర్సిటీలున్నాయి. వాటి పరిధిలో నియామకాలన్నీ ఆయా యూనివర్సిటీలే కామన్‌గా నోటిఫికేషన్ ఇచ్చి.. చేపడుతున్నాయి. ఈ విధానంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ని యూనివర్సిటీలకు కలిపి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ సహా, పలువురు విద్యావేత్తలను బోర్డులో చేర్చింది. అయితే, ఈ బోర్డు ఇప్పటి వరకూ ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీనిపై యూనివర్సిటీల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీల అధ్యాపకుల నియామకాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్స్, ఇతర పరీక్షలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్నాయి. అధ్యాపకులు, ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టడం వల్ల జాప్యం కూడా జరుగుతోందనే విమర్శలొస్తున్నాయి. కమిషన్ పాతదే...కాలేజీ సర్వీస్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉంది. కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను గుర్తించి, కమిషన్‌కు తెలియజేస్తారు. కమిషన్ నేతృత్వంలోని కమిటీ పరీక్షలు చేపడుతుంది. అయితే 1985లో ఈ కమిషన్‌ను రద్దు చేశారు. నియామకాలన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి తెచ్చారు. మళ్లీ కాలేజీ సర్వీస్ కమిషన్‌కు ఊపిరి పోయడంతోపాటు విశిష్టమైన అధికారాలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో అర్హత లేని ఫ్యాకల్టీని నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతలను ఈ కమిషన్ పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. ఐటీఐలను కూడా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్య కాలేజీల్లో నియామకాలనూ ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉన్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
ప్రైవేటుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో పనిచేసే ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఏయే విద్యార్హతలున్నాయో ఆరా తీయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాలవిద్య డైరెక్టరేట్ కార్యాలయం ఇప్పటికే అంతర్గత ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలల వివరాలను ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి..అందులో పొందుపర్చాలని అధికారులు భావిస్తున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత విద్య బోధించే ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్రాలు కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూళ్లలో అర్హత లేనివారు బోధిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు వివరించాలని సీఎం భావించినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్కూ అందించాలి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల డేటా ఏటా పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతులు ఏమున్నాయో ఇందులో పేర్కొనాలి. విద్యాశాఖ ఇప్పటివరకూ ప్రభుత్వ స్కూళ్లలోని వివరాలనే యూడైస్‌కు సమగ్రంగా ఇస్తోంది. ప్రైవేటు స్కూళ్ల నుంచి అన్ని వివరాలు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాల కోసం ఎన్ని లేఖలు రాసినా ప్రైవేట్ స్కూళ్లు స్పందించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర వివరాలు తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్‌లోనే టీచర్లు ఎక్కువ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 29 వేలు, ప్రైవేట్ 11 వేల వరకూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1.35 లక్షల మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్లలో 2 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అయితే సర్కారీ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేట్ స్కూళ్లలో 34 లక్షల మంది చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కనీసం మౌలిక వసతులు కూడా లేని, ఏ అర్హత లేనివారు బోధిస్తున్నా విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ బాట పడుతున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల అర్హతలను వెల్లడించే అవకాశమే లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. బీఈడీ అర్హతతో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి. దీనికి మండల స్థాయిలోఎంఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓలు దృష్టి పెట్టాలి. అయితే డీఈఓ, ఎంఈఓ పోస్టుల్లో మెజారిటీగా ఇన్చార్జ్లనే కొనసాగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ లోపాలు వెంటాడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మార్పులు, బలోపేతంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో తెలంగాణ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది.చైర్మన్, సభ్యులు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపకల్పనకు ఈ కమిషన్ పనిచేయనుంది.కాగా, తెలంగాణలోని మల్టి జోన్-1,2 పరిధిలో నాయబ్ తహసీల్దార్లకు.. తహసీల్దార్‌గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టి జోన్ 1-2 కలిపి 76 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. పరిస్థితిని బట్టి ఆ తర్వాత తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితిని డీఈవోలు పలు జిల్లాల్లో కలెక్టర్లకు వివరించారు. పిల్లలు పాఠశాలలకు వచ్చే పరిస్థితి లేదని, పాఠశాలల ప్రాంగణాలు వరద నీటితో నిండిపోయాయని, కొన్ని పాఠశాల భవనాలు కురుస్తున్నాయని, ఇక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించలేని పరిస్థితి ఉందని తెలిపారు. పలు చోట్ల వాగులు పొంగుతున్నాయని, రహదారుల్లో వెళ్లలేని పరిస్థితి ఉందని డీఈవోలు తమ నివేదికల్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇంకా వర్షాలు కురిస్తే మంగళవారం స్కూళ్లు తెరవాలా? లేదా? అనేది ఆలోచిస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. 3వ తేదీన జరగాల్సిన పలు పరీక్షలు యథావిధిగా ఉంటాయని తెలిపారు. -
ఇదొక నిశ్శబ్ద విధ్వంసం!
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్‌లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు. అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు. విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్ఈ సిలబస్‌ను ఎత్తేశారు. ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్‌కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్‌పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్‌కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్‌కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్‌కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్‌ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్‌లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విద్యా సమాచారం
అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు తిరుపతి సిటీ: థాయిలాండ్‌లోని ప్రిన్స్ ఆఫ్ సొంజ్కలా యూనివర్సిటీ వేదికగా గురువారం నుంచి రెండురోజుల పాటు జరగనున్న రీజనల్ నెట్వర్క్స్ ఆన్ పావర్టీ ఎరాడికేషన్ అనే అంతర్జాతీయ సదస్సుకు మహిళా వర్సిటీ అధ్యాపకులు హాజరుకానున్నారు. 14దేశాలకు చెందిన వర్సిటీ అధ్యాపకులు హాజరుకాన్ను ఈ సదస్సుకు మహిళా వర్సిటీ నుంచి రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రజిని, డీన్ ఆర్ ఉషా, ప్రొఫెసర్ జ్యోత్న్స పాల్గొంటారని వర్సిటీ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఒన్ హెల్త్ రాష్ట్రస్థాయి సదస్సు తిరుపతి కల్చరల్: ఐఏపీఎస్ఎం, ఐపీహెచ్ఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రపంచ వ్యాప్తంగా మనిíÙతో పాటు మనిషి చుట్టూ ఉన్న వాతావరణం, జంతువుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఒన్ హెల్త్ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సామాజిక వైద్య విభాగాధిపతి సునీత తెలిపారు. ఈ నెల 31 ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ నెల 31 న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. 31 వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉద్యోగ మేళాలో టయోటా, హోండా కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత దృవీకరణపత్రాలతో ఉద్యోగ మేళాలో పాల్గొనాలని తెలిపారు. జాబ్‌డ్రైవ్‌లో పలువురికి ఉద్యోగాలు వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రవీంద్రనాథ్ తెలిపారు. కళాశాల జేకేసీ, హెటిరోల్యాబ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో 26 మంది అభ్యర్థులు పాల్గొనగా, 16 మంది అభ్యర్థులు జూనియర్ కెమిస్ట్ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు. తెలుగు భాషను కాపాడుకుందాం మనుబోలు (వెంకటాచలం): తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ విజయ్‌భాస్కర్‌రావు అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలోని తిక్కన సాహితీ పీఠం నెల్లూరు తెలుగు శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పిలువబడే తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులరి్పంచారు. -
విద్యా సమాచారం
రేపు ఉద్యోగ మేళా శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గురువారం జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ ట్రెయినీ కెమిస్ట్‌గా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలో పనిచేసేందుకు పురుషులు, తిరుపతి యంగ్ ఇండియా శాఖలో పనిచేసేందుకు 21–32 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు, టీసీఎల్‌లో పనిచేసేందుకు 21–32 వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు కావాలన్నారు. విద్యార్హత 10 నుంచి డిగ్రీ చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10గంటలకు విద్యార్హత ద్రువపత్రాల జిరాక్సు కాపీలు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో హాజరు కావాలన్నారు. శ్రీ పద్మావతిలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం తిరుపతి తుడా: స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లో ఎంబిబిఎస్ 2024 –25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఆరుగురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి కుమార్ చేతులమీదుగా వీరు అడ్మిషన్ పత్రాలను అందుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ 26వ తేదీ నుంచి ఆల్ ఇండియా కోట అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. 30న ఎస్వీయూలో జాబ్ మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి టి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. మూడు ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9533889902, 7989810194 నంబర్ల నందు సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపిక ఉప్పలగుప్తం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలానికి చెందిన భీమనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంగ్లిష్ వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీల్లో శిరంగు శృతి, కుంపట్ల చాతుర్య ప్రథమ స్థానంలో నిలిచారు. వారు వచ్చే నెల సెప్టెంబర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. గొల్లపాలెం పాఠశాలకు మూడోసారి ప్రతిభా పురస్కారం కాజులూరు: స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, క్రీడా ప్రతిభా పురస్కారానికి కాకినాడ జిల్లా గొల్లపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల మరోసారి ఎంపికైనట్టు పీడీ జి.సునీల్‌కుమార్ తెలిపారు. గతేడాది స్కూల్ గేమ్స్‌లో తమ పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో 40 మంది, జాతీయ స్థాయిలో ఇద్దరు క్రీడాకారులు మెరిట్లో రాణించినందుకు ఈ పురస్కారం వచి్చందన్నారు. గత మూడేళ్లుగా తమ పాఠశాల వరుసగా అవార్డు సాధిస్తుందన్నారు. యోగా శిక్షకుల నియామకానికి దరఖాస్తుల ఆహా్వనం రంగంపేట: హోమియో ఆసుపత్రిలో యోగా శిక్షకుల నియామకానికి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు ప్రభుత్వ హోమియో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె.విద్యాసాగర్ మంగళవారం తెలిపారు. యోగాలో పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమా చేసి అనుభవం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 83282 75475 నంబరులో సంప్రదించాలన్నారు. స్పౌజ్ కేటగిరీకీ కొత్త భాష్యం చెబుతున్న విద్యాశాఖ గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియలో విద్యాశాఖ రోజుకో కొత్త నిబంధన పేరుతో ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేయడం తగదని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఏఐఎస్టీఎఫ్ ఆరి్థక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సు«దీర్‌బాబు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. డివిజన్‌స్థాయిలో నిర్వహించనున్న సర్దుబాటు కౌన్సెలింగ్ నిర్వహణపై మంగళవారం విద్యాశాఖ డైరెక్టర్ నిర్వహించిన వెబ్ ఎక్స్‌లో భాగంగా స్పౌజ్ కేటగిరీపై కొత్త నిబంధనలు విధించడం తగదన్నారు. పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్‌కు కౌన్సిలింగ్ గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు మంగళవారం వైద్య కళాశాల అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు ఎలాట్ చేశారు. వైద్య కళాశాలలో డీఎంఎల్టీ, ఎనస్థీషియా టెక్నీషియన్, ఈసీజీ టెక్నీíÙయన్, కార్డియాలజి టెక్నీషియన్, తదితర కోర్సుల్లో చేరేందుకు గత నెల 30న దరఖాస్తులకు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. సుమారు వంద సీట్ల కోసం 600 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారు. ఏయూలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి చర్యలు విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్శిటీలోని అన్ని విభాగాల్లో బోధన పటిష్టతకు అవసరమైన గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించుకోడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్‌కు ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్ కొరత లేకుండా చూస్తామని, ఎక్కడా కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆపిన గెస్ట్ ఫ్యాకలీ్టలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
విద్యా సమాచారం
రేపటి వరకు పీజీసెట్ వెబ్ ఆప్షన్లకు అవకాశం తిరుపతి సిటీ: తిరుపతి జిల్లాలోని వర్సిటీల పరిధిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పీజీసెట్–2024 వెబ్ఆప్షన్లకు బుధవారం వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పీజీసెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 23వరకు వెబ్ ఆప్షన్లకు చివరి తేదీగా నిర్ణయించిన అధికారులు విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 28వరకు పొడిగిస్తున్నట్లు తెలియజేశారు. 29వతేదీ ఆప్షన్ల మార్పునకు అవకాశమిస్తూ, 31వతేదీన మొదటి విడత సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వర్సిటీల్లో వచ్చేనెల 2వతేదీ నుంచి 5వతేదీ లోపు ఒరిజినల్ ధృవపత్రాలతో అడ్మిషన్లు పొందాలని తెలియజేశారు. ఎమ్మెస్సీ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సులను కొనసాగించండి తిరుపతి సిటీ: ఎస్వీయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఒక్కొక్కటిగా తొలగించడం దారుణమని విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్లో ఎంతో డిమాండు ఉన్న ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సు కోసం వెబ్ఆప్షన్లలో ఎంత వెతికినా కనబడకపోవడంతో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు నిరాశే ఎదురైందని తెలిపారు. ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కోర్సును పూర్తి స్థాయిలో ఆపివేయాలని కుట్రపూరితంగా కొందరు వర్సిటీ అధికారులను తప్పుదోవపట్టించడం దారుణమన్నారు. ఈ నెల 28వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం ఉందని, తిరిగి ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ సెల్ఫ్ సపోరి్టంగ్ కోర్సును కొనసాగేలా అధికారులు చొరవ చూపాలని ఆ ప్రకటనలో వారు విజ్ఞప్తి చేశారు. ఏయూ హాస్టళ్లు, మెస్‌ల తనిఖీ విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టళ్లు, మెస్‌లను సోమవారం ఏయూ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్‌బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఎం.వి.ఆర్.రాజు, చీఫ్ వార్డెన్లు ఆచార్య ఎస్.హరనాథ్, ఆచార్య కె.రమే‹Ùబాబు ముందుగా మెస్‌లలో భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందించే టిఫిన్‌ను స్వయంగా రుచిచూశారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థుల హాస్టళ్లు తనిఖీ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి పార్వతీపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం అంగీకారం కాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ్ణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పథకం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ వంటిదేనని, సరీ్వసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమన్నారు. ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు మరో రూపమే తప్ప పాత పెన్షన్ విధానం కాదని సీపీఎస్ పథకంలో లాగానే ఉద్యోగి జీతంలో నుంచి 10% మినహాయింపు ఉంటుందన్నారు. ఏప్రిల్ ఒకటి 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అండర్–19 ఏపీ జట్టుకు ఎంపిక అమలాపురం రూరల్: ది అమలాపురం కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వర్ధబండి బాలప్రసాద్రెడ్డి కడపలో జరిగిన అండర్–19 క్రికెట్ జట్టు సెలక్షన్స్‌లో ఏపీ జట్టుకు అర్హత సాధించాడు. గతంలో ఢిల్లీలో జరిగిన యంగ్ స్టార్ ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో 100 పరుగులు చేశాడు. అదేవిధంగా హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌పీఎల్ లీగ్‌లో సత్తా చాటిన బాలప్రసాద్రెడ్డిను అండర్–19 ఏపీ టీమ్ సెలక్షన్స్‌కు ఎంపిక చేశారు. కర్ణాటకలో జరిగే ఐపీఎల్, ఎన్సీఎల్ జోనల్ సెలక్షన్స్‌కు ఎంపికయ్యాడు. సోమవారం ఆ కళాశాలలో బాలప్రసాద్రెడ్డిని డైరెక్టర్లు కిరణ్‌కుమార్, నాయుడు, సతీ‹Ù, ఎం.రాంబాబులు అభినందించారు. -
ఐదేళ్లు ఒకేచోట ఉంటే స్థానచలనం అంటూనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో విద్యాశాఖను మినహాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో గతేడాది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవడం, విడతల వారీగా డీఈవోలు, ఆర్జేడీల బదిలీలు పూర్తవడంతో ఈ శాఖను ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామీణ నేపథ్యం ఉన్న మండలాల్లో పనిచేస్తున్న వారు, ఆరోగ్య సమస్యలున్న ఎంఈవోలు మరోచోటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో ఐదు సంవత్సరాలు ఒకేచోట సర్వీసు ఉన్నవారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని నిర్ణయించింది. అంతకంటే సర్వీసు ఉన్నవారి అభ్యర్థన (రిక్వెస్ట్) మేరకు జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్న ప్పటికీ.. ఆ పరిధి నుంచి విద్యాశాఖను పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో సర్వీసులోకి వచ్చిన దాదాపు 679 మంది మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) గత ఏడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా.. వారిని ప్రభుత్వం విస్మరించడం పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..వాస్తవానికి విద్యాశాఖలో మండలానికి ఒకరు చొప్పున మొత్తం 679 మంది ఎంఈవో పోస్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం ఎంఈవో పోస్టుల సంఖ్య 692కి చేరింది. ఇదిలా ఉండగా, మండల స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు గత ప్రభుత్వం 2023లో మండలానికి రెండో ఎంఈవో పోస్టును మంజూరు చేసి, జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 679 మంది ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఎంఈవో–2గా నియమించింది. దీంతో ఎంఈవో పోస్టుల సంఖ్య 1,371కి పెరిగింది. ఎంఈవో–2లు తాజాగా రావడంతో పాటు దాదాపు అందరూ కోరుకున్న చోటనే పోస్టింగ్ పొందారు. కానీ, గత ఏడేళ్లుగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఎంఈవో–1లకు ప్రస్తుతం చేపట్టిన సాధారణ బదిలీ ల్లో అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ఎంఈవో–1 రాష్ట్ర అసోసియేషన్ విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. -
తెలంగాణ అంతటా భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
రంగారెడ్డి/హైదరాబాద్, సాక్షి: భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల భవనాల పరిస్థితి, అక్కడ వాతావరణాన్ని బట్టి మండల విద్యా శాఖ అధికారులు సెలవు ఇవ్వాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. జీహెచ్ఎంసీలో పరిధిలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చాలా చోట్ల స్కూళ్ల నిర్వాహకులు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రుల మెబైల్స్కు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇంకోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికార ప్రకటన ఇవ్వకున్నా.. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అంతటా మరో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. -
కౌన్సెలింగ్ తర్వాతే క్లాసులు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీలు, జాతీయఇంజనీరింగ్ కాలేజీల్లో క్లాసుల నిర్వహణకుసన్నాహాలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులను ముందుగా మానసికంగా బలోపేతం చేయాలని కేంద్ర విద్యాశాఖ అన్ని విద్యాసంస్థలను ఆదేశించింది. బోధన ప్రారంభించేముందే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. కాలేజీ పరిస్థితులు, తోటి విద్యార్థులతో సమన్వయం, అధ్యాపకులతో సాన్నిహిత్యం ఇందులో కీలకాంశాలుగా తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ విద్యారి్థని సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరగా పరిశీలించాలని, వారిలో భయం పోగొట్టాల్సిన అవసరముందని చెప్పింది. విద్యార్థి పూర్వచరిత్ర, అతనిలో ఉన్న భయం, ఆందోళనను గుర్తించి అవసరమైన ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరింది. ప్రతీ కాలేజీలోనూ కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటును గత ఏడాది కూడా సూచించింది. విశ్వాసమే బలం అత్యుత్తమ ర్యాంకులు వచ్చిన వారికే ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఇలా ప్రతిభ ఉన్న విద్యార్థులు చిన్న సమస్యలకే బెంబేలెత్తుతున్నారు. భయంకరమైన డిప్రెషన్లోకి వెళుతున్నారు. ఇవి బలవన్మరణాలకు కారణమవుతున్నాయనేది కేంద్ర ఆరోగ్యశాఖతోపాటు ఐఐటీలు జరిపిన పలు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని ఐఐటీల్లో 2005– 2024 సంవత్సరాల మధ్య 115 మంది విద్యార్థులు తనువు చాలించారు. ఒక్క మద్రాస్ ఐఐటీలోనే 26 మంది విద్యార్థులు చనిపోయారు. ఐఐటీ కాన్పూర్‌లో 18 మంది, ఖరగ్‌పూర్ ఐఐటీలో 10 మంది, ఐఐటీ బాంబేలో 10 మంది విద్యార్థులు చనిపోయారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ఐఐటీ క్యాంపస్‌లోనే 98 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 17 మంది క్యాంపస్ వెలుపల ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత భయంకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారి మానసిక పరిస్థితులే కారణమని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. వారిలో విశ్వాసం సన్నగిల్లడమే కారణమని గుర్తించారు. ఇలాంటి వారిని ముందే తెలుసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతోందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ముందుగా విశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలని సూచించింది. తొలి ఏడాదే కీలకం ఇప్పటి వరకూ జరిగిన బలవన్మరణాల్లో ఎక్కువమంది తొలి ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్‌విద్యలో బట్టీ పట్టే విధానం ఉంది. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఈ మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు జేఈఈలో మంచి ర్యాంకులు పొందుతున్నారు. అయితే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో విద్యాబోధన, ప్రాక్టికల్ వర్క్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. విద్యార్థులు తమ స్వీయ ప్రావీణ్యాన్ని వెలికితీయాలి. సొంతంగా ఆలోచించడం, కొత్తదాన్ని అన్వేíÙంచేలా సిలబస్ ఉంటుంది. ఇదంతా కొంతమంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. మొదటి సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని మద్రాస్ ఐఐటీ అధ్యయన నివేదికలో పేర్కొంది. వీటిని పరిగణనలోనికి తీసుకొని, తొలి ఏడాది సిలబస్‌లో మార్పు చేయాలని అన్ని ఐఐటీలు భావించాయి. ఏదేమైనా కాలేజీలో చేరిన విద్యారి్థకి ముందుగా పూర్తిస్థాయి కౌన్సెలింగ్ చేసి, మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని జాతీయ విద్యా సంస్థలు నిర్ణయించాయి. రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే విధంగా చేయాలని, ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది. -
చంద్రబాబూ అండ్ కో.. ఇదేం లాజిక్?
ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత తెలుగుదేశపు కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖకు సంబంధించి చేసిన సమీక్షలను, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్షను పోల్చి చూడండి. అప్పట్లో జగన్ విద్యకు అత్యధిక ప్రాదాన్యత ఇచ్చారు. పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యేనని చెప్పేవారు. విద్యార్ధులకు తన పార్టీ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు గురించి ప్రోగ్రెస్ అడిగేవారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేసిన అభివృద్ది పనుల గురించి మాట్లాడేవారు. ఆంగ్ల మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్‌ను, టోఫెల్ వంటి వాటిని విద్యార్దులకు అందుబాటులోకి తేవడం ద్వారా వారిని ఎలా పైకి తేవాలా? అనే ఆలోచన చేసేవారు. స్కూళ్లలో పిల్లలకు టాయిలెట్ సదుపాయంతో సహా అన్ని వసతులు, వాటి పర్యవేక్షణ మొదలైనవాటి గురించి జగన్ తన సమీక్షలో చర్చించేవారు. పిల్లలకు గోరుముద్ద కింద పెట్టే ఆహార పదార్దాల నాణ్యత, వారికి డ్రెస్ లు సకాలంలో అందాయా?లేదా?బూట్లు సరిగా ఉన్నాయా?లేదా?టీచర్లకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి?వారికి ఇవ్వవలసిన శిక్షణ గురించి మాట్లాడేవారు. పిల్లలు చదువులు మానకుండా ఉండడానికి తల్లులకు ఇచ్చిన అమ్మ ఒడి పథకం డబ్బులు అందరికి చేరాయా?లేదా? అని పరిశీలించేవారు. అలా జగన్ విద్యారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తే.. చంద్రబాబు నాయుడు తన సమీక్షలో గత ప్రభుత్వంపై విమర్శలు కురిపించడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ స్కూళ్లలోవిద్యా ప్రమాణాలు పడిపోయాయని అన్యాయమైన ఆరోపణ చేశారు. తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో విద్యార్ధులకు, వారి తల్లులకు ఇచ్చిన హామీలేమిటి?. వాటి అమలు పరిస్తితిపై సమీక్ష జరిపినట్లు కనిపించదు. ఈ విషయాల గురించి టీడీపీ అధికార మీడియా ఈనాడు పత్రికలో కనీస ప్రస్తావన చేయదు. గతంలో జగన్ పై దారుణమైన అబద్దాలను వండి వార్చిన ఈ మీడియాకు టీడీపీ అధికారంలోకి రాగానే అంతా బ్రహ్మాండం అయిపోయినట్లు బాజా వాయించడమే సరిపోతోంది. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ పత్రిక హెడింగ్ పెట్టింది. మంచిదే. చంద్రబాబు ఆ మాట అనడం సరైనదే. కానీ ఎవరూ చదువులు మానకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకుంటున్నది మాత్రం మాట్లాడినట్లు కనిపించలేదు. జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద తల్లులకు పదిహేనువేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే.. చంద్రబాబు, పవన్,లోకేష్ లు తమ ప్రచారంలో తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఇలా ఇస్తామని, ఆ తర్వాత నెలకు రూ.1,500 స్కీమ్ అమలు చేస్తామని ఊదరగొట్టారు. అమాయక ప్రజలు కూడా దీనిని నమ్మారనే అనుకోవాలి. పైగా ఇంకా పిల్లలను కనండి అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఒక బిడ్డ ఉంటే పదిహేనువేలు, ఇద్దరు ఉంటే ముప్పైవేలు, ముగ్గురు ఉంటే నలభై ఐదువేలు అంటూ ఊరించారు.కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకు పదిహేనువేలు ఇచ్చి సరిపెడదామని ఆలోచన చేశారు. అయితే ప్రజలలో వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ స్కీమ్ ను వాయిదా వేశామని విద్యా మంత్రి లోకేష్ ప్రకటించారు.అవసరమైన డేటా సేకరణకు టైమ్ కావాలని ప్రభుత్వం తెలిపింది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. అసలు మొత్తం పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినప్పుడు వేరే డేటాతో అవసరం ఏమిటో తెలియదు. చంద్రబాబు తన సమీక్షలో దీని గురించి ప్రస్తావించాలి కదా!. ఎప్పటి నుంచి ఏ రకంగా ఈ స్కీమ్ అమలు చేసేది చెప్పాలి కదా!. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీలు లేదని చంద్రబాబు అంటున్నారు. జగన్ ఆ ఉద్దేశంతోనే కదా అమ్మ ఒడిని అమలు చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆర్ధిక సాయం చేసింది. జగన్ టైమ్ లో బడి మానేసినవారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పడం అసత్యమో కాదో అందరికి తెలుసు. బడి మానేసినవారందరిని స్కూల్ కు తీసుకకు రావడానికి అమ్మ ఒడి కింద 15వేల డబ్బు ఇస్తామని చెప్పారు కదా?. హామీ ప్రకారం అమ్మ ఒడి అమలు చేస్తే పిల్లలు స్కూళ్లు మానారా?. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేయకపోయినా పిల్లలంతా స్కూళ్లకు ఎగబడుతున్నారా?. ఏమి లాజిక్ అండి. చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటివి ప్రచారం చేయగలరు.కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన జాతీయ విద్యా విధానాన్ని జగన్ అమలు చేస్తే, నానా రకాలుగా విమర్శలు చేసిన టీడీపీ ,జనసేనలు ఇప్పుడు అదే విధానాన్ని పాలో అవుతాయా? లేక వ్యతిరేకిస్తాయా?ఈ ఏడాది సకాలంలో డ్రెస్ లు,పుస్తకాలు అందలేదని అంటున్నారు. అది నిజమా?కాదా?అన్నదానిపై అదికారులను చంద్రబాబు ప్రశ్నించాలి కదా!. ఆంగ్ల మీడియం కు వ్యతిరేకం కాదని ఒకసారి, ఇంగ్లీష్ చదివితేనే పైకి వెళతారా అని ఇంకోసారి ప్రశ్నించిన వీరు ఇప్పుడు స్పష్టమైన ఆలోచన వెల్లడిస్తారా?. జగన్ తెలుగును ఒక పాఠ్యాంశం చేసి, మిగిలిన సబ్జెక్టులను ఆంగ్లంలో బోదించడానికి,ఎవరైనా తెలుగులో చదువుతామని కోరితే వారికోసం ద్విభాష పుస్తకాలను తయారు చేయించారు. ఇప్పుడు అదే పద్దతి అనుసరిస్తారా? లేక ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు పెట్టి, మిగిలినవాటిని తెలుగులో బోధించాలన్నది చంద్రబాబు ఉద్దేశమా?. తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే వివరంగా చెప్పాలి కదా!. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లల టాయిలెట్ల పరిశుభ్రతకు విశేష ప్రాధాన్యం ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోవడం మానివేశారని వార్తలు వస్తున్నాయి. టీచర్లు సకాలంలో వస్తున్నారా?లేదా? అనేదానిని చెక్ చేయడానికి ఉన్న యాప్ లను ఎత్తివేస్తామని అంటున్నారు. అది మంచిదేనా?కాదా?. ఇవేవి చర్చించకుండా ప్రభుత్వ స్కూళ్లకు రేటింగ్ ఇస్తామని, ప్రతి విద్యార్ధికి శాశ్వత నెంబర్ ఇవ్వాలని,ఇలాంటి ఏవేవో ఉబుసుపోక విషయాల గురించి ఆదేశాలు ఇస్తే ఏమి ఫలితం ఉంటుంది. గతంలో వివిధ యాప్ ల ద్వారా పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని తీసివేశారట. అంటే కేవలం టీచర్ల సంఘాలను సంతృప్తిపరచడానికే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందా?ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఉందా?మరి పేదవారి పరిస్థితి ఏమిటి?గతంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు అనేవారు. ఇప్పటికీ అదే ఆయన ఉద్దేశమా?. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లపై జగన్ పూర్తి స్థాయి దృష్టి పెడితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ సీరియస్ నెస్ తో వ్యవహరించడం లేదని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఏమేరకు ప్రామాణికమైందో ప్రశ్నార్థకంగా మారింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ తప్పుడు సమాచారంతో మరింత ప్రమాదం చేకూరుతుంది. విద్యార్థి దశలోనే దానిపై సరైన అవగాహన పెంపొందించుకుంటే మేలని కేరళ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల సాధికారత కోసం కేరళ జనరల్ ఎడ్యుకేషన్ విభాగం ఐదు, ఏడో తరగతుల్లోని ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ‘ఫ్యాక్ట్ చెకింగ్’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది నకిలీ వార్తలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో నిజాలను నిర్ధారించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పాయి.ఈ సందర్భంగా కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) సీఈఓ కె.అన్వర్‌సాదత్ మాట్లాడుతూ..‘ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి ఐదు, ఏడో తరగతి విద్యార్థుల ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఆన్లైన్ ‘ఫ్యాక్ట్ చెకింగ్’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టాం. గతంలో ఏర్పాటు చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. నకిలీ వార్తలు, హానికరమైన కంటెంట్‌ను గుర్తించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. చదువుకునే దశలోనే నకిలీ సమాచారంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఆరు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సహాయం తీసుకుంటున్నాం. ఏడో తరగతికి సంబంధించిన కొత్త ఐసీటీ పుస్తకంలో దేశంలోనే తొలిసారిగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏఐ నేర్చుకునే అవకాశం ఉంది. ఈ పుస్తకాలు మలయాళం, ఇంగ్లీష్, కన్నడ, తమిళ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.2022లో కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) ‘డిజిటల్ మీడియా లిటరసీ కార్యక్రమం’ను చేపట్టింది. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 19.72 లక్షల మంది విద్యార్థులకు నకిలీ వార్తలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఇందులో 9.48 లక్షల మంది అప్పర్ ప్రైమరీ, 10.24 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంత భారీ శిక్షణ ఇవ్వడం దేశంలో అదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో 5920 మంది శిక్షకుల పాల్గొన్నారు. ‘సత్యమేవే జయతే’ పేరుతో 2.5 గంటలపాటు సాగిన ఈ శిక్షణలో ‘రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ వినియోగం’, ‘సోషల్ మీడియా అవసరం’, ‘సోషల్ మీడియాలో హక్కులు-తప్పులు’ అనే నాలుగు విభాగాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’విద్యార్థి దశలో సమాచారాన్ని విపులంగా అర్థం చేసుకోవాలి. అందులో నకిలీ వివరాలు ఎలా గుర్తించాలో అవగాహన పెంపొందించుకుంటే ‘క్రిటికల్ థింకింగ్’ వృద్ధి చెందుతుంది. దానివల్ల చదువుల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో మేలు జరుగుతుంది. ఇది కేవలం నకిలీ వివరాలు గుర్తించడానికి మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. -
టీచర్ల ‘సర్దుబాటు’పై కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘పని సర్దుబాటు’ బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను సోమవారం నుంచి ఈనెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవీ మార్గదర్శకాలు.. » ఒకే సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లు (ఎస్ఏ), ఎస్జీటీలను సర్దుబాటు చేయాలి. మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఇతర సబ్జెక్టుల ప్రకారం, వారి మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి » అర్హత గల మిగులు ఎస్జీటీలు, సంబంధిత డిగ్రీ, బీఈడీ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకుని ప్రీ హైస్కూల్, హైసూ్కల్స్‌లో సర్దుబాటు చేస్తారు » ఒక స్కూల్లో ఒకటికంటే ఎక్కువ మంది ఎస్ఏ (పీడీ) లేదా పీఈటీ ఉన్నవారిని గుర్తించి అదనపు సిబ్బందిని లేని స్కూళ్లకు పంపిస్తారు » ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు సర్దుబాటులో ప్రాధాన్యం ఇస్తారు » యూపీ స్కూల్స్‌లో ఎన్రోల్మెంట్ 98 కంటే తక్కువ ఉంటే 3 నుంచి 8 తరగతులు, 1 – 2 తరగతులను విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పాత నిబంధనల ప్రకారమే సద్దుబాటు చేస్తారు. » కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించినట్లయితే వారిని అవరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు » ఎస్ఏ (పీడీ), పీఈటీలను ఈ సేవలు లేని స్కూళ్లకు పంపిస్తారు రెండు దశల్లో సర్దుబాటు కొత్త నిబంధనల ప్రకారం రెండు దశల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది. మొదటి దశలో మండలంలోని ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూళ్లకు, ఇంటర్ సబ్జెక్టుకు సంబంధించి అదే మండలానికి, మండల పరిధిలోని అర్హత కలిగిన అదే మండల పరిధిలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగులు ఉపాధ్యాయులు ఉంటే ఇంటర్ మేనేజ్మెంట్ కింద రెండో దశలో డివిజన్ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్జెక్టు ఉన్నవారికి అదే డివిజన్లో, డివిజన్లోని ఇంటర్ సబ్జెక్ట్, ఎస్జీటీలను డివిజన్ పరిధిలో స్కూళ్లకు సర్దుబాటు చేస్తారు. కేడర్ సీనియారిటీలో అత్యంత జూనియర్‌ను మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు. ఎక్కడ సబ్జెక్టు టీచర్, ఎస్జీటీలు లేరో ఆ స్కూల్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.పాత నిబంధనలే కొత్తగాపాఠశాల విద్యా శాఖ ఆదివారం ప్రకటించిన మార్గదర్శకాల్లో ‘కేడర్ సీనియారిటీ’ మినహా మిగిలినవన్నీ పాతవే. తొలుత ఈనెల 9న ఒకసారి మార్గదర్శకాలు విడుదల చేయగా, ఉపాధ్యాయవర్గాలు పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తాయి. పలు సూచనలు చేశాయి. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సర్దుబాటు ప్రక్రియ చేపట్టనుండగా ఆదివారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో అన్నీ పాతవే ఉన్నాయి. వాటినే కొత్తగా ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, మరెందుకు చర్చలకు పిలిచారని ప్రశి్నస్తున్నాయి. -
Telangana: డీఎస్సీ’ మరింత ఆలస్యం?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తామని.. అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా? అనే సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడేనా? రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 2,79,957 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. సోమవారంతో ముగిసిన ఈ పరీక్ష ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. సెపె్టంబర్ మూడో వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్‌లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు, సీఎం ప్రకటన వెలువడటం డీఎస్సీ భవితవ్యంపై సందేహాలకు తావిస్తోంది. ఫలితాల వెల్లడిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉప వర్గీకరణ డేటా సేకరణ, అమలు, దాని ప్రకారం డీఎస్సీలో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితిలో అధికారులున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖకు లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. ఎవరి వాదన వారిదే.. ఇప్పుడు జరిపే నియామకాల్లో వర్గీకరణ చేపట్టాలన్నది మాదిగ వర్గీయుల వాదన. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. అవసరమైతే నిబంధనలు మార్చాలంటున్నారు. ఇదే వాదనతో అధికారులు, ప్రభుత్వ నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మాల సామాజికవర్గం భిన్న స్వరం వినిపిస్తోంది. తీర్పు రాకముందే ఇచ్చిన డీఎస్సీని వర్గీకరణ పేరుతో ఆపడం సరికాదని అభిప్రాయపడుతోంది. అలా చేస్తే న్యాయపోరాటంతోపాటు వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇంకోవైపు పరీక్ష రాసిన విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. రూ. లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నామని ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ ఆపితే ఆందోళన చేస్తాం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పునకు ముందే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడెలా నియామకాలు ఆపుతారు? సీఎం ఒక కులాన్ని భుజానికెత్తుకోవడం మంచిదికాదు. ఇది మా మనోభావాలు దెబ్బతీసే అంశం. డీఎస్సీ నియామక ప్రక్రియ ఆపితే ఆందోళనలు చేస్తాం. ఇప్పటికే కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నాం. – జి. చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అమలు చేయాల్సిందే ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణను అమలు చేస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. డీఎస్సీ నియామకాల్లోనూ ఇది అమలు కావాల్సిందే. అవసరమైతే నిబంధనలు సవరించాలి. గతంలో కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లోనూ కటాఫ్ రిజర్వేషన్ల విధానంలో సవరణలు తెచ్చారు. ఇప్పుడు దీన్ని అనుసరించడంలో తప్పేం లేదు. దీని అమలు కోసం మేం ఎంత దూరమైనా వెళ్తాం. – గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్‌పీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ నేపథ్యంలో డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ విషయంలో లక్షల మంది విద్యార్థుల మానసిక ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి. టీచర్ల బదిలీలు, పదోన్నతుల తర్వాత మరిన్ని టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుత డీఎస్సీపైనే సందేహాలుంటే కొత్త ఉద్యోగాల పరిస్థితి ఏంటనే ఆందోళన నిరుద్యోగుల్లో ఉంది. – రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
గాడి తప్పిన వర్సిటీలు..! పడిపోతున్న విద్యా ప్రమాణాలు
కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నామ్‌కే వాస్తేగా మారిపోతున్నాయి. పరిశోధనల మాటేమోగానీ.. సాధారణ విద్యా ప్రమాణాలే నానాటికీ పడిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికితోడు అధ్యాపకుల పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీల్లో చదువు గతి తప్పుతోంది. విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిఫికెట్లతో మార్కెట్లో ఉద్యోగాలు రావడం లేదని సీఎం రేవంత్ ఇటీవల స్వయంగా పేర్కొన్నారు కూడా. ఇలాంటి సమయంలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైనా దృష్టిపెడితే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నిధులు లేక.. పట్టించుకోక.. వందేళ్లపైన చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిదా్యలయం కూడా ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపులో వెనుకబడి ఉంది. ర్యాంకు ఏటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితీ ఇదే. ఎన్నో సమస్యలున్నాయని ప్రతీ ప్రభుత్వం చెప్తున్నా.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది. కొత్త వీసీలు వస్తేగానీ.. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. కానీ అది ముందుకు పడలేదు. నిజానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలే లేరు. ఈ ఏడాది మేలోనే వీసీల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకానికి సెర్చ్ కమిటీలు వేశారు. దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ సెర్చ్ కమిటీలు ఇంతవరకు సమావేశం కాలేదు. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. ఖాళీలు భర్తీ చేస్తే తప్ప బోధన గాడినపడేందుకు ఆస్కారం లేదు. చదువు చేప్పేవాళ్లెక్కడ? రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీయే. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుంది? పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే వర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నియామకాలు ఆగిపోయాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మరిన్ని పోస్టులూ ఖాళీ అయ్యాయి. మరోవైపు బోధనేతర సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయని.. మొత్తంగా 4,500కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఏ వర్సిటీ చూసినా.. అన్నీ ఖాళీలే..! కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలేవీ ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలున్నాయి. ల్యాబ్‌లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు లేవు. జేఎన్టీయూహెచ్లోనూ ఇదే దుస్థితి. నిజాం కాలేజీ, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదు. – కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. – మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేరు. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా కొనసాగిస్తున్నారు. – ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత చెప్పుకోదగ్గ వర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు. ఈ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీయే. – నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి. కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. – నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేథ్స్, ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. సదుపాయాలూ సరిగా లేక.. చాలా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయాలంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెప్తున్నారు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులే.. విశ్వవిద్యాలయాల్లో 11 ఏళ్లుగా బోధన సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. వారిపైనా విపరీతమైన పనిభారం ఉంటోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పరి్మనెంట్ చేయలేదు. తక్షణమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, ఉన్నత ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.పరమేశ్వర్ (తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సంఘం నేత) -
చదువులకూ ‘చంద్ర’ గ్రహణం!
రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదువులు గాడి తప్పాయా? విద్యార్థులందరికీ యూనిఫాం అందలేదా?కొంత మందికే బూట్లు ఇచ్చారా? టీచర్ల కొరత వేధిస్తోందా? మధ్యాహ్నం పిల్లలకు రుచీపచీ లేని భోజనం పెడుతున్నారా? ఇదివరకటి మెనూ అమలు కావడం లేదా? వంట వాళ్లను ఇష్టానుసారం మార్చేస్తున్నారా? టోఫెల్‌కు మంగళం పాడారా? ఇంగ్లిష్ మీడియంను చిన్నచూపు చూస్తున్నారా? స్టూడెంట్ కిట్లను కూటమి నేతలు పంపిణీ చేస్తున్నారా?.... ఈ ప్రశ్నలన్నింటికీ ప్రతి జిల్లాలో,ప్రతి ఊళ్లో, ప్రతి ఒక్కరూ ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇన్నాళ్లూ బంగారంలా చక్కగా సాగిపోతున్న చదువులకు గ్రహణం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు సమీపిస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, బ్యాగులు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి పిల్లలకు బడి తెరిచిన మొదటి రోజే అందాల్సిన స్టూడెంట్ కిట్లు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అందించండంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. గత విద్యా సంవత్సరం వరకు వేడుకగా సాగిన చదువులను నిస్తేజంగా మార్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులకు యూనిఫారం అందనే లేదు. చాలా జిల్లాలకు బ్యాగులు చేరలేదు. పుస్తకాలు సైతం అందరికీ పంపిణీ చేయలేదు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ప్రతిరోజు పుస్తకాలు, బ్యాగులు, ఇతర విద్యా సమగ్రిని ’సర్దుబాటు’ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. స్కూళ్లకు చేరిన వస్తువులను సైతం స్థానిక కూటమి నేతల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ‘ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుంది. అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగానే జరుగుతాయి. ఇది మీకు నేను ఇస్తున్న వాగ్దానం’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో పుస్తకాల పంపిణీలో కూడా ‘తమ్ముళ్లు’ భాగస్వాములవుతున్నారు. పంపిణీ ఆలస్యం అవడానికి ఇది కూడా ఓ కారణం. రెండు నెలలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ ప్రహసనంగా సాగుతోంది. ఈ నెలాఖరున ఫార్మాటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పుస్తకాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. 35.60 లక్షల కిట్లకు ఆర్డర్.. అందినవి అంతంతే.. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం గతేడాది సెపె్టంబర్లో విద్యా కానుక కిట్ల సరఫరాకు విద్యా శాఖ ఆర్డర్ పెట్టింది. హైస్కూల్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, టోఫెల్ వర్క్ బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ అందించాలి. గత నాలుగేళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 35.60 లక్షల స్టూడెంట్ కిట్ల సరఫరాకు సమగ్ర శిక్షణ ఆదేశాలు జారీ చేసింది. అన్ని వస్తువులను మే చివరి నాటికి మండల స్టాక్ పాయింట్లకు చేర్చి, అక్కడి నుంచి జూన్ మొదటి వారంలో ఆయా స్కూళ్లకు తరలించి కిట్‌గా రూపొందించాలి. బడులు తెరిచిన మొదటి రోజే 9 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు నేరుగా స్కూల్లోనే అందించాలి. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. కొత్తగా చేరే విద్యార్థులకు మండల స్టాక్ పాయింట్ నుంచి ఎప్పటికప్పుడు తెప్పించి ఇవ్వాలి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా జరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో మిగిలిన 90 వేల కిట్లు మాత్రమే నూరు శాతం పంపిణీ చేశారు. ఆపై కంపెనీల నుంచి వస్తున్న వస్తువులను స్కూళ్లకు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు విద్యా కానుక కిట్‌లో అందించే 9 వస్తువుల్లో ఏ ఒక్కటీ స్కూల్‌కు సరిపడినన్ని ఇవ్వకపోవడం గమనార్హం. జగన్ సర్కారులో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులున్న తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్ధిక భారం ఉండకూడదన్న లక్ష్యంతో ‘జగనన్న విద్యా కానుక’ (జేవీకే)ను 2020–21 విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చింది. ఈ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు సమానంగా ఆత్వవిశ్వాసంతో బడికి వెళ్లాలని రూ.2,900 విలువైన కిట్‌లో నాణ్యమైన స్కూలు బ్యాగు, టెక్స్స్ట బుక్స్, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై అందించింది. వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. 2024–25 విద్యా సంవత్సరానికి రూ.1,042.51 కోట్లతో విద్యా కానుక కిట్ల సరఫరాకు గత సెపె్టంబర్ నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12 కోట్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఈ విద్యా సంవత్సరం అదనంగా టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకం కూడా అందించాలి. కానీ 80 శాతం పుస్తకాలను సరఫరా చేసి, మిగిలిన వస్తువులను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ‘సర్దుబాటు’తో నెట్టుకొస్తున్న వైనం గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది. విద్యార్థులకు ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు అందే పరిస్థితి లేదు. యూనిఫారాలు ఇప్పటికీ బడులకు చేరలేదు. వస్తువుల కొరత కారణంగా ప్రతి మండలంలో ఏరోజుకారోజు వస్తువులను ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు సర్దుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా పుస్తకాల విషయంలో ప్రతిరోజు విద్యార్థుల చేరికను బట్టి స్టాక్ ఉంచుకుని మిగిలిన వాటిని ఉన్నతాధికారులు సూచించిన స్కూలుకు తరలిస్తున్నారు. ఇక్కడి బడిలో విద్యార్థులు చేరితే, ఆ మేరకు వస్తువులను ఇంకో స్కూల్ నుంచి తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అందిన వస్తువులను సైతం విద్యార్థులకు వెంటనే అందించకుండా బడుల్లో స్టాక్ పెట్టి, స్థానిక కూటమి నాయకులు వస్తేనే వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. నాయకులు రానిచోట వస్తువుల పంపిణీ నిలిపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో జూన్ 13న స్కూళ్లు తెరిచిన నాటి నుంచి ఆగస్టు వచ్చినా పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా కొనసాగుతోంది.టోఫెల్‌కు రాం రాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లల్లో ఇంగ్లిష్ ప్రావీణ్యం పెంపొందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని టోఫెల్ క్లాసులు ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్ కూడా కేటాయించింది. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల వారి కోసం టోఫెల్ జూనియర్ క్లాసులు నిర్వహించి మార్చిలో పరీక్షలు కూడా జరిపింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ పరీక్ష ఫలితాలు ప్రకటించకపోగా, ఏకంగా టోఫెల్‌కే తిలోదకాలు ఇచ్చింది. పేదలకు ఇంగ్లిష్ మీడియమే ఎక్కువ.. అనుకుంటుంటే ఆ భాషపై మరింత పట్టు సాధించేలా టోఫెల్ అవసరమే లేదని ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది. దీనికి తోడు అమ్మ ఒడి (తల్లికి వందనం) పథకం అమలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల కాక పోవడం చూస్తుంటే ఈ పథకానికీ ఈ ఏడాది మంగళం పాడినట్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు సాయం అందించింది.జిల్లాల్లో ఇదీ పరిస్థితి⇒ అనంతపురం జిల్లాలో 450కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలోని ఏ ఒక్క స్కూల్‌కూ యూనిఫాం క్లాత్ చేరలేదు. కొన్ని స్కూళ్లకు బూట్లు, మరి కొన్ని స్కూళ్లకు డిక్షనరీలు అందలేదు. జిల్లాలో 677 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను మార్చారు. ఆహారంలో నాణ్యత లోపించింది. ⇒ శ్రీసత్యసాయి జిల్లాలో 345 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు మంజూరైన విద్యా కానుక కిట్లు 1,38,634 పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, పలు చోట్ల విద్యార్థులకు కొన్ని వస్తువులు అందలేదు. కిట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను మార్చివేశారు. చాలాచోట్ల భోజనం నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. ఇటీలవల ఆళ్లగడ్డ పట్టణంలోని పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయున్ని తాత్కాలికంగా డిప్యుటేషన్‌పై పంపారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం సరిగా అమలు కావడం లేదు. వంట ఏజెన్సీలు మార్చాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 1,07,225 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉంది. 2,600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో గోరుముద్ద పేరు తొలగించి, ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ అని బోర్డు రాయిస్తున్నారు. కొద్ది రోజులుగా దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. 909 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీ ఇంకా అందలేదు. తిరుపతి జిల్లాలో దాదాపు 4 వేల జతల బూట్ల కొలతల్లో తేడా రావడంతో పంపిణీ చేయలేదు. ⇒ వైఎస్సార్ జిల్లాలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో చాలా మంది విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదు. మండల స్థాయికి కిట్లు అందినా, పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ⇒ ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదు. బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది. వందల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదు. దీంతో విద్యార్థులకు బోరు నీరే దిక్కయింది. ఇంకా 20 శాతం మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్ పంపిణీ చేయాల్సి ఉంది. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,208 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో 140 మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఈ ఏడాది మూతపడ్డాయి. ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తారో లేదోనన్న అనుమానంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. బేతపూడి ఎంపీపీ స్కూల్, సీతంపేట ఎంపీపీ స్కూల్, కె.ఎం పాలెం పంచాయితీలో గల ఎండపల్లిపాలెం ఎంపీపీ స్కూల్, మారేపల్లి పంచాయితీ శివరామచేనులపాలెంలో ఎంపీపీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. ⇒ ఏలూరు జిల్లాలో 1035 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. విద్యా కానుక కిట్లు వైఎస్సార్సీపీ హయాంలో సిద్ధం చేసినవే పంపిణీ చేశారు. పశి్చమగోదావరి జిల్లాలో వందకు పైగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం బాగోలేదని పిల్లలు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కిట్లు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. కోనసీమ జిల్లాలో 464 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఐఆర్ వెంటనే ప్రకటించాలిఏపీ జేఏసీ అమరావతిఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో శనివారం నిర్వహించిన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీరు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే కొత్త కమిషనర్‌ను నియమించాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక, ఇతర వేధింపులపై ఫిర్యాదుల కోసం ప్రతి కలెక్టరేట్లో ‘షీ బాక్స్’లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన పిల్లల సంరక్షణ సెలవుల అమలుపై ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులివ్వాలని పేర్కొన్నారు. – సాక్షి, అమరావతిఫీజు రీయింబర్స్మెంట్ ఏదీ?ఏబీవీపీ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ ప్రత్యేకంగా జీవో తెస్తానని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హమీ మేరకు జీవో మంజూరు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్.యచంద్ర డిమాండ్ చేశారు. జీవో–77 రద్దు చేసేంత వరకు పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఏబీవీపీ నాయకులు ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ రామ్మోహనరావును మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రమిచ్చారు. జీవో 77ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ మరో జీవో విడుదల చేసిన తర్వాతే పీజీ సెట్ కౌన్సెలింగ్ చేపట్టాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ జీవో–77 రద్దు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందన్నారు. – మొగల్రాజపురం (విజయవాడ తూర్పు)సర్కారు వారూ..సమస్యలివిగో..!ఉద్యోగ భద్రత కల్పించాలి‘ఔట్ సోర్సింగ్’ ఉద్యోగులురాష్ట్రంలో ఆరోగ్య (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద సేవలందిస్తున్న వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఏపీ వైద్య సేవ దళిత, గిరిజన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పల్లాను కలిసిన ప్రతినిధులు గత 17 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. పల్లాను కలిసి వారిలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి, ప్రధాన కార్యదర్శి ప్రత్యూష ఉన్నారు. – సాక్షి, అమరావతిఈహెచ్ఎస్ పరిధి పెంచాలిఏపీ ఉపాధ్యాయ సంఘంఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలతో పాటు ఈహెచ్ఎస్ అమల్లో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలాజీ, సత్యనారాయణ, సంఘం నేతలు శనివారం ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) పథకంలో కొన్ని ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలు అందించడం లేదని, ఈ మేరకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు. అలాగే రీయింబర్స్మెంట్ సీలింగ్‌ను రూ.5లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. – సాక్షి, అమరావతిపదోన్నతులు ఇవ్వాలిటీఎన్యూఎస్డీఈవో పూల్‌లో ఉన్న భాషా పండితులకు పదోన్నతి కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌కు భాషా పండితులు మాత్రమే అర్హులుగా కాగా, 2019లో లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను అప్‌గ్రేడ్ చేసి సెకండ్ గ్రేడ్ టీచర్లు కూడా అర్హులుగా పరిగణించడంతో దాదాపు 1,100 మంది భాషా పండితులకు డీఈవో పూల్‌లో చోటు దక్కలేదని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజుకు శనివారం విజ్ఞప్తి చేశారు. – సాక్షి, అమరావతిసబ్సిడీ సరిచేయాలిగొర్రెలు, మేకల పెంపకందార్లురాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ అందించడంలో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసి అందరికీ సమన్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం విజ్ఞప్తి చేసింది. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను కలిసి సంఘం నేతలు వినతిపత్రమిచ్చారు. ప్రభుత్వం గేదెలు, ఆవుల షెడ్ల నిర్మాణానికి 90శాతం, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణానికి 70శాతం సబ్సిడీని ప్రకటించిందని, అలా కాకుండా అన్నింటికి 90శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వర్షాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలి గొర్రెలు మేకలు మృత్యువాత పడుతున్నాయని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన టీకాలు, డీ వారి్మంగ్ మందులు ఉచితంగా అందించాలన్నారు. – సాక్షి, అమరావతి -
చదువుకు పెరిగిన పద్దు
సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి 2024–25 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 21,292 కోట్లు కేటాయించింది. 2023–24లో కేటాయించిన రూ. 19,093 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 2,199 కోట్లు ఎక్కువ కేటాయింపులు చేయడం విశేషం. మొత్తం బడ్జెట్లో గతేడాది విద్యారంగం కేటాయింపులు 6.57 శాతం మేర ఉండగా తాజాగా అవి 7.31 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాలకు గతంలో మాదిరిగానే రూ. 500 కోట్లు కేటాయించారు. విద్య పరిశోధన, శిక్షణ వ్యవహారాల రాష్ట్ర మండలి (ఎస్సీఈఆర్టీ) నిధులు రూ. 425.54 కోట్ల నుంచి రూ. 705 కోట్లకు పెంచారు. సెకండరీ పాఠశాలలకు కేటాయింపులు రూ. 390 కోట్ల నుంచి రూ. 925 కోట్లకు పెంచారు. గురుకుల విద్యకు 2023లో రూ. 662 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 694 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజనం వంటి కేంద్ర పథకాలకు కేటాయింపులు దాదాపు రూ. 300 కోట్ల వరకూ పెరిగాయి. కళాశాల విద్యకు స్వల్పంగా రూ. 60 కోట్లు పెంచారు. అయితే పెరిగిన బడ్జెట్లో 90 శాతం వేతనాలకే సరిపోతుందని విద్యావేత్తలు అంటున్నారు. ఈ నిధులు ఏ మూలకు? విద్యకు 15 శాతం నిధులిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో సగం కూడా కేటాయించలేదు. పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా నిర్మాణాలకు నిధులు ఇవ్వలేదు. 3వ తరగతి వరకు అంగన్వాడీల్లో కలపాలన్న ప్రతిపాదన సమర్థనీయం కాదు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.కాగా, తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9-30 నుంచి తొమ్మిది గంటలకు మార్పు చేశారు. అలాగే, సాయంత్రం 4-45కి బదులుగా 4-15 గంటలకు పని వేళలు ముగుస్తాయని విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది.అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. -
త్వరలో విద్యాకమిషన్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యాకమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధికల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో సచివాలయంలో సీఎం శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు.ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని..విద్యావేత్తలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తామన్నారు. భేటీలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పీఎల్.విశ్వేశ్వరరావు, శాంతాసిన్హా, ఆల్దాస్ జానయ్య, పద్మజాషా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు. నియమాకాలు, నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణలోపంతో పాఠశాలవిద్యలో తెలంగాణ 35వ స్థానంలో ఉందని వారు సీఎంకు వివరించారు. పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని.. తద్వారా విద్యార్థులు చేరడానికి ఆసక్తి కనపరుస్తారని సూచించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని వివరించారు.అంగన్వాడీల్లోనే మూడో తరగతి వరకు ప్రీసూ్కల్‌లో బోధన అందేలా చూసి, నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సీఎం తెలిపారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామన్నారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలని, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయా లని ఆల్దాస్ జానయ్య సీఎంను కోరారు. తాము చదువుకున్న ఉస్మానియాలో ప్రస్తుతం విద్యాప్రమాణాలు పడిపోయాయని హరగోపాల్, శాంతాసిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.విద్యావ్యవస్థలో మార్పులపై విధానపత్రం రూపొందిస్తే.. దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి, దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య చెప్పగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, తాను, భట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’బిల్లు! తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్స్ యూనివర్సిటీపై శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం ముసాయిదా రూపొందించిందని చెప్పారు. అందరికీ హైదరాబాద్‌లోనే శిక్షణ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్‌లు) ఏర్పాటు చేసే విషయం సమావేశంలో చర్చకొచి్చంది. అయితే అందరూ హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు పోటీ పడతారని సీఎం అన్నారు. హైదరాబాద్‌లోనే అందరికీ శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)తో పాటు న్యాక్ క్యాంపస్‌ను ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలున్న ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. పీపీపీ మోడల్లో స్కిల్స్ వర్సిటీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం (పీపీపీ)తో స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పనున్నారు. మూడు, నాలుగేళ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సరి్టఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. -
అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) హాల్ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్ టికెట్‌పై అబ్బాయి ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారు. సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో పొరపాటు జరిగిందని, హాల్ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.తప్పులు సరిచేస్తామంటున్న విద్యాశాఖడీఎస్సీ పరీక్ష ఈ నెల 18 నుంచి మొదలవుతుంది. పరీక్షకు సీరియస్‌గా సన్నద్ధమవుతున్న యువత హాల్ టికెట్ల గందరగోళంతో కంగారు పడుతోంది. అయితే ఈ తప్పిదాలకు విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణ ఇచ్చారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామని వారు అంటున్నారు. సిస్టమ్ జనరేటెడ్ హాల్ టికెట్లను తాము చూసే అవకాశమే లేదంటున్నారు. తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి న్యాయం చేస్తున్నామని విద్యాశాఖ వెల్లడించింది.మొదట్నుంచీ వివాదమేడీఎస్సీ నిర్వహణ మొదట్నుంచీ వివాదాస్పదమే అవుతోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన వారికి ప్రిపరేషన్ లేకుండా డీఎస్సీ పెట్టడంపై అభ్యర్థులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ కోచింగ్ కేంద్రాలు, రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే నేతలు సృష్టించినవేనని ప్రభుత్వం కొట్టి పారేసింది. తాజాగా హాల్ టిక్కెట్లు ఈ నెల 11 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, చాలా చోట్ల అవి డౌన్లోడ్ కావడం లేదనే ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విద్యాశాఖ సోమవారం వివరణ ఇచ్చింది. అన్ని చోట్ల డౌన్లోడ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోమవారం విద్యార్థులు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఫొటోల తారుమారుమేడ్చెల్ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హాల్ టికెట్లో అతని పేరు సక్రమంగానే ఉంది. కానీ ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య డీఎస్సీలో ఎస్ఏ పోస్టుకు అప్లై చేసింది. ఆమె ఫొటో బాదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన అధికారులు ఆమె ఫొటో వచ్చేలా చేశారు.నిజంగా నెట్ సెంటర్లదే తప్పా?అభ్యర్థులు నెట్ సెంటర్లలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారి ఫొటో, సంతకాలను డిజిటల్ చేసి ఇస్తుంటారని తెలిపారు. ఎక్కువ మంది ఉండటంతో నెట్ యజమానులు ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో పెట్టారని అంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ఫొటో, సంతకం ఉంటుందో హాల్ టికెట్‌లోనూ అదే వస్తుందని, దీనికే తమను నిందిస్తే ఎలా అని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్.. ఒక్కరికే వందనం.. అందరికీ ఎగనామం!
ఎన్నికల ప్రచారంలో..తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకూ 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా.‘నేను హామీ ఇస్తున్నాను.. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకూ (విద్యార్థిని, విద్యార్థులు) 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊరూరా లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా మాట ఇచ్చారు. బాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇంటింటా ఇవే మాటలు చెప్పారు. ఇలా మాయ మాటలు చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. మరీ ఇంత దుర్మార్గమా.. అని ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించడం ఆయన నైజం. సూపర్ సిక్స్‌లో మిగతా హామీలన్నింటిలో కోతలు.. దాటవేతలేనని బాబు వాలకం చెబుతోంది.సాక్షి, అమరావతి: మాట మార్చడంలో డబుల్ పీహెచ్డీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి తన నైజాన్ని చూపించారు. ‘తల్లికి వందనం’ పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామన్న అంశంపై మాట తప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి.. ఒక్కరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తామని లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా ఇచ్చిన మాటను గాలికి వదిలేశారు. ఇప్పుడు ఈ పథకాన్ని చదువుకునే పిల్లల్లో ఒక ఇంట్లో ఒక్కరికే అమలు చేస్తామని ప్రకటించారు. ఆధార్ అనుసంధానం పేరుతో అనేక కొర్రీలు వేసి లబ్ధిదారులను తగ్గించే పనిలో ఉన్నారు. అందుకే ఏటా జూన్ నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన పథకంపై కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జీవో నం.29 విడుదల చేసి.. పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అంటే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన 42.62 లక్షల మంది లబ్ధిదారుల కంటే తక్కువ మందికే ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఆ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటిస్తే.. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ పథకం గురించి తనదైన శైలిలో ‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు..’ అంటూ చిన్న పిల్లలను చూపిస్తూ ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇన్ని ఆధారాలు ఉన్నా ఇప్పుడు ‘వందనం ఒక్కరికే’ అనడంపై తల్లులు మండి పడుతున్నారు. కోటి మంది పిల్లల్లో భారీగా కోత రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి రాగానే అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను తగ్గించండంతో పాటు రుణ మాఫీని సైతం భారీగా కుదించేశారు. ఇప్పుడు తల్లికి వందనం పైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభ్వుం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తూ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చేసిన ప్రకటనకు విరుద్ధంగా ముందుకెళుతోంది. అందుకు అనుగుణంగానే జీవో నం.29లో జారీ చేసింది. పిల్లలు అందరికీ ఇస్తామన్న పథకాన్ని ‘తల్లికి మాత్రమే రూ.15000’ అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంటే రాష్ట్రంలో దాదాపు కోటి మందికి పైగా పిల్లలున్నారు. ఇందులోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఆధార్‌తో లింక్ అయ్యి ఉన్న అన్ని ఆస్తుల వివరాలను తీసుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలను కాకుండా మరిత కఠినంగా నిబంధనలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతి బిడ్డా చదువుకునేందుకు బడికి వెళ్లడమే లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలను ప్రోత్సహించేందుకు వారి తల్లులకు ఏటా రూ.15 వేలు జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లో చదివే పిల్లలకు మాత్రమే పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిలోనూ వివిధ ఆదాయ మార్గాలను సాకుగా చూపి పిల్ల సంఖ్యను భారీగా తగ్గించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో అమ్మ ఒడి అందుకున్న 42.62 లక్షల మందిలో చాలా మంది ఈ పథకానికి దూరమవుతారు. మూడుసార్లు మాట మార్చిన కూటమి చదువుతో సంబంధం లేకుండా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలకు మాట ఇచ్చారు. ‘స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఆర్ధిక సాయం’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలున్న తల్లికే ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అంటే ఒకే అంశంపై మూడుసార్లు మాట మార్చారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీలు, ప్రయివేట్ ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలు గల తల్లులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా స్కూళ్లు, కాలేజీల ప్రస్తావన చేయలేదు. సర్వే పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేసి, అనంతరం తీరిగ్గా మార్గదర్శకాలు విడుదల చేస్తే తాము అర్ధికంగా నష్టపోతామని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల డేటా ఉన్నా కాలయాపన స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యపై రాష్ట్రాలు ఏటా ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’ (యూడైస్ ప్లస్) ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఈ ఏడాది నుంచి విద్యార్థుల చేరికలు, బదిలీలు నేరుగా ‘యూడైస్ ప్లస్’ ద్వారానే చేయాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. యూడైస్ ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు మొత్తం 82,29,858 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య కూడా దీనికి జత చేయాలి. విద్యార్థుల చేరిక సమయంలోనే ఆధార్‌తో పాటు కుటుంబ నేపథ్యం, ఆర్ధిక స్థాయి కూడా నమోదు చేస్తున్నారు. ఇదంతా ఆన్లైన్లో జరిగేదే. పైగా గతేడాది కూడా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పిల్లల వివరాలను ప్రభుత్వానికి అందించారు. ఈ వివరాలు ప్రభుత్వం వద్ద నూరు శాతం ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం విద్యార్థుల డేటా ఆధారంగా గత ప్రభుత్వం తొలి ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. 2020లోనూ ముందు సంవత్సరం విద్యార్థుల సంఖ్య (డేటా) ఆధారంగా పథకాన్ని అందించింది. ఇలా నాలుగు విద్యా సంవత్సరాల్లో ముగిసిన ఏడాది డేటా ఆధారంగా అమ్మ ఒడి జమ చేసింది. దీంతో పాటు 75 శాతం హాజరు శాతం తప్పనిసరి అన్న నిబంధన విధించినా, పేద కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదన్న మానవతా దృష్టితో హాజరు సరిపడినంత లేకున్నా ఇతర అర్హతలు గల ప్రతి తల్లికీ అమ్మఒడి అమలు చేశారు. పది, ఇంటర్ ఫెయిల్ అయ్యి, తిరిగి ప్రవేశం పొందిన విద్యార్థులు, మధ్యలో స్కూల్లో చేరిన అర్హత గల పిల్లలకు కూడా పథకాన్ని అమలు చేశారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్యను సర్వే చేసి తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వం వద్ద పూర్తి డేటా ఉన్నా కేవలం పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా దాట వేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రభుత్వమే ఉండి ఉంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కొనసాగుతూ ఉండిఉంటే ఈ పాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా పథకాలు అమలై ఉండేవి. గత ఐదేళ్లలో ఈ పథకాలన్నీ చెప్పిన రోజు చెప్పినట్లు అర్హత గల లబ్ధిదారులందరికీ అందాయి. అర్హత ఉండీ కూడా ఏ కారణం వల్లనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి మరీ మేలు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నిజంగా పిల్లలపై ప్రేమ ఉంటే జూన్ నెలలోనే తల్లికి వందనం (అమ్మ ఒడి) పథకాన్ని అమలు చేసి ఉండేది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఎలా కోత పెట్టాలా.. అని నెల రోజులకు పైగా ఆలోచించి ఇప్పుడు తీరిగ్గా గైడ్‌లైన్స్ మాత్రమే జారీ చేసింది. పిల్లలందరికీ అని చెప్పి ఇప్పుడు ఒక్కరికే అంటూ ప్లేటు ఫిరాయించింది. అది కూడా ఎప్పుడిస్తారో చెప్పక పోవడం గమనార్హం. ఆశ పెట్టి.. మాట మార్చకూడదు మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకరు ఈపూరు యూపీ పాఠశాలలో, మరొకరు అనంతవరం జెడ్పీ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పదో తరగతి చదువుతున్న మా మేనకోడలిని కూడా మేమే పెంచుతున్నాం. గత ప్రభుత్వంలో మా బిడ్డలతోపాటు, మా మేనకోడలికి సైతం మా బ్యాంక్ ఖాతాలో అమ్మ ఒడి సొమ్ము జమైంది. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామన్న హామీని నిలుపుకోవాలి. అధికారంలోకి వచ్చాక టీడీపీ హామీని విస్మరించడం మంచిది కాదు. మాలాంటి కుటుంబాలను ఆశ పెట్టి.. ఇలా ఏమార్చి కష్టాల్లోకి నెట్టడం తగదు. – బూసే జోత్న్స, ఈపూరు, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? మాకు నలుగురు పిల్లలున్నారు. ప్రభుత్వం ‘తల్లికి వదనం’ ద్వారా సాయం చేస్తుందని అందరినీ ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నాం. వారి ఫీజులు, పుస్తకాలు, డ్రస్సులు, బూట్లు ఇలా అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా ఖర్చు అవుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలు పాఠశాలకు వెళితే వారందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తాన్ని త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పథకంలో కొర్రీలు వేయాలని చూడటం మంచిది కాదు. ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు..? – షాఫియా భాను, హస్నాబాద్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లామరీ ఇంత మోసమా!? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి సంవత్సరం చెప్పిన తేదీన బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ పథకం అర్హతకు కొత్త నిబంధనలు పెట్టడం ఆందోళనకరంగా ఉంది. నాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఐదో తరగతి, రెండో కొడుకు నాలుగో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కూతురు అంగన్వాడీ చదువు పూర్తి చేసుకుంది. పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.45 వేలు వస్తుందని ఆశించాం. కూతుర్ని ప్రయివేటు స్కూల్లో చేరుద్దామనుకున్నాం. హామీ ఇచ్చి మరీ ఇంత మోసం చేస్తారనుకోలేదు. – ఎం.పూజిత నాగలక్ష్మి, ఎనికేపాడు, విజయవాడ రూరల్ మండలంరూ.60 వేలు వస్తాయని ఎదురు చూస్తున్నాం మేము విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది దరి కె1 కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి రుషిత్ సింగ్ 10వ తరగతి, రెండవ అబ్బాయి సౌమిత్రి సింగ్ 6వ తరగతి, మూడవ అబ్బాయి హేమంత్ సింగ్ మూడవ తరగతి, నాలుగవ అబ్బాయి ప్రకృత్ సింగ్ నర్సరీ చదువుతున్నాడు. గతంలో ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, ఒక అబ్బాయిని ప్రైవేట్ పాఠశాలలో చదివించే వాళ్లం. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతీ విద్యార్ధికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని చెప్పడంతో నలుగురినీ ప్రైవేట్ పాఠశాలలో చేరి్పంచాం. పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం మాపై ఒత్తిడి తెస్తున్నాయి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తల్లికి వందనం పథకం కింద రూ.60 వేలు ఇవ్వాలి. – లక్ష్మీ కౌర్ -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 'బదిలీల ఫీవర్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల ఫీవర్ మొదలైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారు స్థానచలనం కోసం కసరత్తు మొదలుపెట్టారు. సీనియార్టీ, ఖాళీల స్థితిని అంచనా వేసుకుంటూ బదిలీలకు ఉన్న అవకాశాలను విశ్లేషించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈనెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి. 20లోగా పూర్తి చేయాలి ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఈనెల 20వ తేదీ వరకు సడలిస్తూ.. నిర్దేశించిన షెడ్యూల్లోగా అన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు విడివిడిగా బదిలీల మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే పలు విభాగాలు మార్గదర్శకాలు విడుదల చేయగా... ఒకట్రెండు రోజుల్లో దాదాపు అన్ని శాఖలు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. బదిలీలకు సంబంధించిన రోజువారీ షెడ్యూల్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి బదిలీల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వాటిని పరిశీలించడం, అర్హుల జాబితాను విడుదల చేయడం పూర్తి చేసిన తర్వాత ఈనెల 19, 20 తేదీల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పాఠశాల విద్యాశాఖలో బదిలీల ప్రక్రియ ఇప్పటికే ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లాలో ఒకట్రెండు కేటగిరీలు మినహా టీచర్ల బదిలీ దాదాపు పూర్తయింది. ప్రస్తుత బదిలీల్లో జీఓ 317 కింద నూతన కేటాయింపులు జరిగిన ఉద్యోగులు మినహా మిగతా వారిలో చాలామందికి, ప్రధానంగా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మరోవైపు 317 కింద కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ కొందరు ప్రభుత్వానికి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. సీనియర్లకే స్థానచలనం! ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. గరిష్టంగా 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దని ఆదేశించింది. ఈ నిబంధన జూనియర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీల జాబితాలోకి చేరతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగిన ఆరేళ్లు కావస్తోంది. దీంతో కొత్తగా నియమితులైన ఉద్యోగులు, జీఓ 317 కింద నూతన కేటాయింపుల్లో భాగంగా మారిన వారు, ఎన్నికల బదిలీలు మినహాయిస్తే దాదాపు ఉద్యోగులందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మెజార్టీ ఉద్యోగులు బదిలీ జాబితాలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే 40 శాతానికి మించి ఉద్యోగుల బదిలీలు చేయొద్దనే నిబంధన కారణంగా పలువురు తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నప్పటికీ స్థానచలనం కలిగే అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది . ఆన్లైన్..మాన్యువల్ ప్రస్తుతం బదిలీల ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది. ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సీనియార్టీ జాబితా ప్రకారం బదిలీలకు ఎంతమందికి అవకాశం దక్కుతుందో ఓ అంచానా వేసేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా బదిలీ విధానం మారనుంది. 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో బదిలీ అయ్యే చోట వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేసుకున్నాయి. రాష్ట్రస్థాయి కార్యాలయంలో అయితే పరిమిత సంఖ్యలో ఉద్యోగులుండడంతో మాన్యువల్ కౌన్సెలింగ్‌కు అవకాశం ఉండగా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆన్లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచి్చంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాయి. పాలనకు తాత్కాలిక విరామం! రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మొదలు జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యాలయాల్లో ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. శాఖల వారీగా మార్గదర్శకాలు వెలువడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలోపు సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడంతో పాటు ఏయే స్థానాలకు బదిలీపై వెళ్లాలనే అంశంపై ఉద్యోగులు విశ్లేషణ చేసుకుంటున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉద్యోగులంతా ఈ ప్రక్రియలోనే బిజీ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రెడీ స్టడి గో
⇒ వచ్చే నెల నుంచే పలు దేశాల్లో అడ్మిషన్ల ప్రక్రియలు ప్రారంభం⇒ సరైన అవగాహనతో ముందుకెళితే సమస్యలు రాకుండా ఉంటాయంటున్న నిపుణులు⇒ విదేశీ విద్యకు అర్హతలు, అవకాశాలపై సూచనలివీ ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా విదేశీ విద్య వైపు చూస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.వారంతా విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్‌కే చేరుతున్నారు. ఇక్కడున్న కన్సల్టెన్సీలను సంప్రదించి విదేశీ విద్య కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చే నెలలోనే కొత్తగా అడ్మిషన్ల ప్రక్రియలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సరైన అవగాహనతో ముందుకెళితే.. సులువుగా విదేశీ విద్య పూర్తి చేసుకోవచ్చని, మంచి జాబ్ కూడా సంపాదించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అసలు విదేశీ విద్యకు అర్హతలు, తీసుకో వాల్సిన జాగ్రత్తలేమిటో స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.అవకాశం, అవగాహన పెరగడంతో..విదేశాల్లో విద్య అంటే ఒకప్పుడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమన్న భావన ఉండేది. దానికితోడు పెద్దగా అవగాహన లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లడం ఎందుకులేనన్న పరిస్థితి ఉండేది. కానీ పెరిగిన అవకాశాలు, అవగాహన, ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారితో సులువుగా అనుసంధానమయ్యే వీలు వంటివి.. విదేశాలకు వెళ్లి చదువుకునేవారి సంఖ్య పెరిగేందుకు దారితీస్తోంది. పాస్‌పోర్టు జారీ విధానం సులభతరం కావడం, విదేశాల వీసాలు సులువుగా దొరుకుతుండటం, స్కాలర్ షిప్‌లతో అవకాశాలూ పెరిగాయి. మరోవైపు స్థానికంగా విద్య కోసం ఖర్చులు కూడా బాగా పెరిగిన నేపథ్యంలో.. మరింత అదనంగా ఖర్చు చేస్తే విదేశాల్లో చదువుకోవచ్చని, అక్కడే ఉద్యోగమూ సంపాదించవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు.స్టూడెంట్ వీసా తీసుకుని..⇒ స్టూడెంట్ వీసా ఉంటే ఆ దేశంలోసంబంధిత కోర్సు పూర్తయ్యేంత వరకు ఉండి చదువుకునేందుకు అనుమతిఉంటుంది. తర్వాత కూడా రెండేళ్ల పాటు వర్క్ పర్మిట్ మీద ఉండేందుకు అనుమతిస్తారు.ఆ రెండేళ్లలోగా సరైన ఉద్యోగం పొందలేకపోతే.. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.⇒ స్టూడెంట్ వీసా కోసం ఏ దేశానికి వెళ్లాలనుకుంటే ఆ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయం లేదా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా వీసా అప్లికేషన్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.⇒ విద్యార్థులకు అమెరికా అయితే ఎఫ్, ఎం, జే వీసాలు ఇస్తుంది. యూకే అయితే టైర్–4 వీసాలు జారీ చేస్తుంది. కెనడా స్టడీ పర్మిట్స్ పేరిట ఇస్తుంది.హైదరాబాద్ నుంచే ఎక్కువఅమెరికాకు గతేడాది 75,000 మంది ఇండియా నుంచి వెళ్తే..అందులో హైదరాబాద్ నుంచే 22,500 మంది ఉన్నట్టు అంచనా. ఇక కెనడాకు మొత్తం 1.3 లక్షల మంది వెళ్లగా.. దాదాపు 35,000 మంది హైదరాబాద్ మీదుగా వెళ్లారని.. ఇందులో సిటీవారే ఎక్కువని ఓపెన్ డోర్ సంస్థ నివేదిక చెబుతోంది. మిగతా దేశాలకు కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిన విద్యార్థులే ఎక్కువని పేర్కొంటోంది.ఏమేం అర్హతలు ఉండాలి?⇒ చదువుకున్న కాలేజీ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి.⇒ సరైన పాస్‌పోర్టు ఉండాలి. ⇒ ఆదాయ వనరులు సరిగ్గా ఉండాలి⇒ ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి (ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్లో మంచి స్కోర్ కలిగి ఉండాలి)⇒ మెడికల్, పోలీస్ క్లియరెన్స్ ఉండాలి.⇒ టోఫెల్, ఐఈఎల్టీఎస్, డుయో లింగో, ఎస్ఏటీ, జీఆర్ఈ వంటి పరీక్షల్లో స్కోరును బట్టి యూనివర్సిటీలు అడ్మిషన్లు ఇస్తుంటాయి. ఒక్కో దేశంలోని ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పరీక్షలో స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది.⇒ వీసా కోసం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కాన్సులర్ అధికారితో ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు దరఖాస్తులో అందజేసిన వివరాలు సరైనవేనా, కాదా అనే విషయాన్ని ఇంటర్వ్యూలో రూఢి చేసుకుంటారు. అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? చదువు అయిపోయాక ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలపై సమగ్రంగా ప్రశ్నలు అడుగుతారు.వీసాలు రిజెక్ట్ అవుతుంటాయి.. ఎందుకు? ⇒విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నవారికి ఒక్కోసారి వీసా రిజెక్ట్అవుతుంటుంది. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి.⇒ ఆదాయ వనరులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడం⇒ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడం.⇒ చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశం వెళతామని రుజువు చేయలేకపోవడం⇒ చదువులో మంచి మార్కులు లేకపోవడం ళీఏదైనా తప్పులు లేదా ఫ్రాడ్ చేయడంవిదేశాల్లో స్కాలర్షిప్ పొందడమెలా?విదేశాలకు చదువు కోసం వెళ్తున్న అందరికీ అక్కడి వర్సిటీల్లోఫీజులు చెల్లించే స్తోమత ఉండకపోవచ్చు. అందువల్ల కాస్త ఆర్థిక భారంతగ్గించుకునేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కాలర్షిప్ పొందడం కూడా సులువే..1. విదేశాల్లో వర్సిటీలు మాత్రమే కాకుండా వేరే సంస్థలు కూడా స్కాలర్షిప్స్ ఇస్తుంటాయి. అందుకే యూనివర్సిటీ వెబ్సైట్లతోపాటు స్కాలర్షిప్లు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను కూడా తరచూ చూస్తుండాలి.2. విదేశాలకు వెళ్లాలనుకోవడానికి ఏడాది ముందే స్కాలర్‌షిప్‌ల గురించి వెతుకుతుండాలి. ముందుగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.3. చాలా స్కాలర్షిప్ టెస్టుల కోసం అడ్మిషన్ లెటర్ అవసరం ఉండదు. అందుకే అడ్మిషన్ లెటర్ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలనుకోవడం సరికాదు.4. పూర్తి స్థాయి స్కాలర్షిప్ కాకుండా కొంతమేరకే వస్తే మాత్రం వేరే స్కాలర్‌షిప్‌ల కోసం కూడా వెతకాలి. ఒకటికన్నా ఎక్కువ స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా ఉంటుంది.5. మెరిట్ ఉన్న విద్యార్థులకే స్కాలర్షిప్ వస్తుందనుకోవడం పొరపాటు. స్పోర్ట్స్, ఇతర నైపుణ్యాల ఆధారంగా కూడా స్కాలర్షిప్ ఆఫర్ చేసే సంస్థలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించాలి.టోఫెల్లో అక్రమాలతో ఇబ్బంది..గతేడాది టోఫెల్ పరీక్షలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. టోఫెల్, జీఆర్ఈలో మార్కులు ఎక్కువ వచ్చేలా చేస్తామంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వల వేసిన గుట్టు రట్టయింది. అలాంటి వారిని నమ్మి పరీక్షలు రాయిస్తే.. తీరా విదేశాలకు వెళ్లాక అది ఫేక్ అని తేలితే చిక్కులు తప్పవు. ఆ విద్యార్థులను భారత్‌కు తిప్పిపంపడమేగాక.. భవిష్యత్తులో మళ్లీ విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంటుంది. స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్‌తో వెళ్లొచ్చుభారత విద్యార్థులు విదేశాల్లోని అవకాశాలు అందిపుచ్చుకునేలా.. ఆయా దేశాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటిద్వారా మన విద్యార్థులు విదేశాల్లోని వర్సిటీల్లో కొంతకాలం చదువుకొనేందుకు అవకాశం ఉంటుంది. ‘సెమిస్టర్ ఎట్ సీ, రోటరీ యూత్ ఎక్సే్ఛంజ్ , ఎరామస్ ప్లస్, ఫుల్ బ్రైట్ నెహ్రూ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్, యూత్ ఫర్ అండర్ స్టాండింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా విదేశాల్లోని విద్యార్థులతో కలసి చదువుకుని, అక్కడి స్థితిగతులను అర్థం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.ఉద్యోగ అనుభవంతో వెళ్తే మేలు..విదేశాల్లో చదువుతోపాటు అక్కడే స్థిరపడాలనుకునే వారు డిగ్రీ అయిపోయాక ఇక్కడ కనీసం రెండేళ్లపాటు ఏదైనా ఉద్యోగం చేసిఉంటే మంచిది. దీనివల్ల విదేశాల్లో ఎంఎస్ అయ్యాక.. ఇక్కడి అనుభవంతో అక్కడ ఉద్యోగం సులువుగా పొంది, స్థిరపడేందుకు అవకాశాలు మెండుగాఉంటాయి. ఏ దేశంలో త్వరగా సెటిల్ కాగలమో ముందుగానే తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఐర్లాండ్ వంటి దేశాల్లో ఐదేళ్లలోనే గ్రీన్‌కార్డు వస్తుంది.సందీప్‌రెడ్డి , ఐర్లాండ్ ప్రస్తుత పరిస్థితులు బాగోలేవుఅమెరికాలో ప్రస్తుత పరిస్థితులు అంత బాగోలేవు. ఆర్థిక మాంద్యం నడుస్తోంది. రెండేళ్ల నుంచీ ఉద్యోగాల్లేవు. ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. స్టూడెంట్స్ చాలా మంది చదువు కోసం వస్తున్నారు. వారికి పార్ట్‌టైమ్ జాబ్స్ దొరకట్లేదు. ఇంటి అద్దెతోపాటు కూరగాయలు, నిత్యావసర ధరలు కూడాభారీగా పెరిగాయి. దీంతో ఇక్కడ జీవనం కష్టంగా మారుతోంది. సాయి సింధూజ న్యూజెర్సీ వర్సిటీలపై స్టడీ చేయాలి ముందుగానే ఏ యూనివర్సిటీమంచిదో కాస్త పరిశోధన చేయాలి. ఆ తర్వాతే కన్సల్టెన్సీల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అదే నేరుగా కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తే.. సరైన కాలేజీ లేదా యూనివర్సిటీకి దరఖాస్తు చేయకపోవచ్చు. తర్వాత బాధపడి ఏమీ లాభం ఉండదు. కొన్ని కన్సల్టెన్సీలు ఎక్కువ కమీషన్ ఇచ్చే వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తుంటాయి. అందుకే వర్సిటీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.నిఖిల్ మండల, మాంచెస్టర్, బ్రిటన్ -
25 వేల మంది ఎస్జీటీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ చేపట్టిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 25 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) బదిలీ ఉత్తర్వులు అందాయి. వీరితో పాటు స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు.. అంతా కలిపి ఇప్పటివరకూ 40 వేల మందికి స్థానచలనం కలిగింది. కొత్తగా కేటాయించిన స్థానాల్లో వీలైనంత త్వరగా చేరాలని, విద్యార్థుల బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం టీచర్లకు సూచించింది. కాగా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వారంలో సమస్యలన్నీ పరిష్కరించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు కొలిక్కి.. టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం కోర్టు వివాదాలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలతో కొన్నేళ్లుగా జటిలంగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత 317 జీవో అమలు సందర్భంగానూ ఈ వ్యవహారం అనేక సమస్యలకు దారి తీసింది. సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జూనియర్లు దూర ప్రాంతాలకు వెళ్లారని, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమైంది. కాగా ప్రస్తుతం ఇవన్నీ కొలిక్కి వచ్చినట్టేనని అధికారులు చెబుతుండగా, మరోవైపు బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలేంటి? స్కూల్ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు బోధించే అర్హత ఉండటంతో అన్నింటికీ ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఒక్కదాంట్లోనే ప్రమోట్ చేయాలి. ఉదాహర ణకు సైన్స్, మేథ్స్ రెండు ప్రమోషన్లు వచ్చిన వ్యక్తి ఏదో ఒక దాంట్లోనే చేరతారు. దీంతో ఒక పోస్టు ఖాళీ అవుతుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇస్తే ప్రస్తుతం 17 వేల మంది విధుల్లో చేరారు. దీంతో మిగతా దాదాపు 2 వేల మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వివిధ మండలాల్లో ఒకే ఊరు పేరుతో ఉన్న స్కూళ్ళు ఉండటంతో ఆన్లైన్లో సమస్యలు వచ్చాయి. వీటిని సరి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వారం రోజుల్లో సమస్యల పరిష్కార ప్రక్రియ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖాళీలపై దృష్టి అన్ని స్థాయిల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు ముగియడంతో పాఠశాల విద్యాశాఖలో వాస్తవ ఖాళీలపై అధికారులు దృష్టి పెట్టారు. స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల లెక్కతో హేతుబధ్దీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మేరకు కొన్ని బదిలీలు చేసే ఆలోచనలో ఉంది. విద్యార్థులు లేని స్కూళ్ళల్లో ఎక్కువగా ఉన్న టీచర్లను.. విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్ళకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం క్షేత్రస్థాయిలో టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తించాల్సి ఉంటుంది. మలీ్టజోన్–1, జోన్–2 పరిధిలో దాదాపు 11 వేల మంది ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. దీంతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే విధంగా 2 వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. హెచ్ఎంల పదోన్నతులతో కూడా కలుపుకుంటే మొత్తం 18,942 మందికి ప్రమోషన్లు దక్కాయి. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్ అయ్యే టీచర్లను కలుపుకుంటే దాదాపు 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
చదువుల తొలకరి
వర్షరుతువు ఊరికే రాదు, చదువుల ఋతువును వెంటబెట్టుకుని వస్తుంది. వేసవి కర్ఫ్యూ నుంచి బయటపడి ఆడా, మగా పిల్లలు గుంపులుగా, అనేక రంగుల పూదోటల్లా వీథుల్లోకి ప్రవహించే దృశ్యం– దేహానికి తొలకరి లానే చూపులకు చందనమవుతుంది. పుస్తకాల బరువుతో బుడిబుడి అడుగుల బాలసరస్వతుల నవ్వుల తళతళలు, మాటల గలగలలు పరిసరాలకు సరికొత్త బాల్యశోభనిస్తాయి. చదువుల నిచ్చెన మీద పిల్లలూ, వాళ్లపై పెట్టుకున్న ఆశల నిచ్చెనపై కన్నవారూ ఏకకాలంలో కొత్తమెట్టు ఎక్కడం ఎల్లెడలా కనిపిస్తుంది. చదువుల చరిత్రనే రాస్తే, అది మెరుపులు; మంచి చెడుల మలుపుల మీదుగా సాగిపోతుంది. ప్రాచీనకాలంలో ఋష్యాశ్రమాలే విద్యాలయాలు. అధికార, ధనబలాలలో తేడాలున్న క్షత్రియుల పిల్లలూ, బ్రాహ్మణుల పిల్లలూ కలసి చదువుకునేవారు. అలా చదువుకున్న ద్రుపద, ద్రోణాచార్యుల మధ్య ఆ తర్వాత వచ్చిన అంతస్తుల తారతమ్యాలు శత్రుత్వానికి దారితీసి మహాభారతంలో కొన్ని కీలక పరిణామాలకు కారణమయ్యాయి. వేటకొచ్చిన రాజులు పరివారాన్ని దూరంగా విడిచి పాదచారులై వెళ్ళి గౌరవప్రపత్తులతో ఋషిని దర్శించుకోవడం గురించి వింటాం. అలాంటి గురుస్థానం చిరుస్థానమై బతకలేని బడిపంతుల స్థాయికి కుదించుకోవడమూ చూశాం. అయితే, నాటి చదువుల వ్యవస్థలోని ఏ కాస్త వెలుగునూ హరించే చీకట్లూ లెక్కలేనన్నే. కొన్ని చదువుల్ని సార్వత్రికం చేయకపోవడం ఒకటైతే; చదువుల్లో ఎక్కువ, తక్కువ తేడాలు ఇంకొకటి. ‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నా’లలో వేటికవే చదువుల తల్లి సిగ పువ్వులన్నది నేటి అవగాహన. సాధారణ విద్యపై సాంకేతిక విద్యది పైచేయి కావడం చూస్తూనే ఉన్నాం. అలా కాలక్రమంలో చదువుల నిర్వచనమూ, ప్రయోజనమూ కూడా మారిపోయాయి. హిరణ్యకశిపుడు రాక్షసుడే అనుకున్నా చదువుల ప్రయోజనం గురించి ఆనాటి అవగాహనతోనే మాట్లాడతాడు. ‘చదవనివాడు అజ్ఞాని అవుతాడు, చదివితే సదసద్వివేచన కలుగుతుంది’ అని కొడుకు ప్రహ్లాదుడితో అంటాడు. ‘సదసద్వివేచన’ అనే మాటకు ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. మంచి చెడుల వివేచన ఒక అర్థమైతే; పారలౌకికంగా సత్యాసత్యాలు, నిత్యానిత్యాలనేవి మరికొన్ని. చదువుకుని వచ్చి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన సమాధానమూ దానికి దీటుగానే ఉంటుంది. ‘ధర్మార్థాలతో సహా ముఖ్యశాస్త్రాలనే కాదు, చదువులలోని మర్మమంతా చదివేశా’నంటాడు. చదువులలోని మర్మమంటే అతని ఉద్దేశం – భక్తి, ఆధ్యాత్మికతలనే! ఆనాడు చదువంటే కేవలం ఉద్యోగానికి ఓ అర్హత కాదు; బ్రహ్మచర్యం, గృహస్థం,వానప్రస్థం, సన్యాసమనే నాలుగు ఆశ్రమాల మీదుగా సాగాల్సిన జీవనయానంలో తొలి అంకం. నాడు రాజాస్థానాల్లో గణకులు, వ్రాయసకాండ్ర వంటి ఉద్యోగాలున్నా వాటి అందుబాటు పరిమితం. దాచుకున్న ధనమూ; పురుషుడికి రూపమూ, కీర్తీ, భోగమూ కలిగించేదీ, విదేశబంధువూ, విశిష్ట దైవమూ, రాజపూజితమూ అంటూ ఏనుగు లక్ష్మణకవి చేసిన అభివర్ణన అన్ని విద్యలకూ వర్తించేదే అయినా పెద్ద పీట వేదశాస్త్రాలదే. ఈ విద్యార్థతలున్నవారు ‘సర్టిఫికెట్’ పుచ్చుకుని ఉద్యోగం వేటలో పడాల్సిన అవసరమే లేదు; గుర్తింపు, గౌరవం, మడిమాన్యాలు అన్నీ వాళ్ళ దగ్గరికే వచ్చేవి. భాషలో అపర శేషువూ; యజ్ఞయాగాదుల్లో, వేదాధ్యాపనలో మునిగితేలేవాడే అయినా సంపన్నుడు కనుక; రాజులేమైనా ఇవ్వబోతే సాలగ్రామాన్ని సైతం పుచ్చుకోడానికి నిరాకరించే ‘మనుచరిత్ర’లోని ప్రవరాఖ్యుడూ కనిపిస్తాడు. వేదాలకు గాదెగా, శాస్త్రాలకు పుట్టిల్లుగా, కళాకలాపాల రచ్చగా తెనాలి రామకృష్ణుడు తన ‘పాండురంగ మాహాత్మ్యం’లో పరిచయం చేసిన సభాపతి అనే ఆయన పశు శిశు దాసీజనం కలిగిన ధనికుడు; ఆపైన వడ్డీవ్యాపారం, సేద్యం కూడా చేస్తూ రాజు దగ్గరికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. తన పేరును నేతిబీరను చేస్తూ చెడు తిరుగుళ్లు మరిగిన నిగమశర్మ ఇతని కొడుకే! ఈ పండితపుత్రుడు ఆగమవాదాల్లో నోరువిప్పడు కానీ విటుల వివాదాలను తీర్చడంలో మాత్రం మహా చురుకని– కవి చురక. బ్రిటిష్ ఏలుబడిలో డిగ్రీ చదువులొచ్చి ఉద్యోగంతో లంకె పడ్డాయి. స్వతంత్ర భారతంలో ఆ లంకె ఇంకా బిగిసింది తప్ప సడలలేదు. అదే సమయంలో దాదాపు అన్ని చదువులూ సార్వత్రికమై మేలూ చేశాయి. సంధిదశలో రెంటికీ చెడ్డ రేవళ్ళను గిరీశం, వెంకటేశం పాత్రల ద్వారా గురజాడ ‘కన్యాశుల్కం’లో బొమ్మ కట్టారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చి రికామీగా తిరిగేవాడు గిరీశమైతే, ‘మీ వల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే’ నని వాపోయినవాడు వెంకటేశం. ఇంగ్లీషు చదువులు కుదురుకొని చదువు బడులు సమాజాన్ని చదువుకునే బడులుగా మారుతున్న వైనాన్ని కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవలలో అద్భుతంగా చిత్రిస్తారు. చదువుల సారమైన సదసద్వివేచన అడుగంటి చదువు వ్యాపారమై వందలాది కోచింగ్ సెంటర్లను, వేలాది చీటింగ్ తుంటర్లను సృష్టించింది. నీతి తప్పిన ‘నీట్’ ద్రోహంతో కొత్త విద్యాసంవత్సరం మొదలవడం ఈ దుఃస్థితికి ప్రతీకాత్మక అభివ్యక్తి. నిఖిలదేశం హర్షించే మంచికాలం రహించాలని చదువులమ్మను కోరుకుందాం. -
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్‌లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్‌కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్‌లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
డీఎస్సీ షెడ్యూల్ విడుదల ?
-
తక్షణమే తప్పుకోండి..
అనంతపురం/విశాఖ సిటీ/గుడుపల్లె (చిత్తూరు జిల్లా)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పీఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగినా..లోకేశ్ పీఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ప్రాంక్ కాల్చేసి ఉండవచ్చని వీసీలు మిన్నకుండిపోయారు. దీంతో నేరుగా వైస్‌ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులో అధికారికంగా మెసేజ్ పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. జేఎన్టీయూ (ఏ), ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..» జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. సి.శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణను నియమించిన వీసీ శ్రీనివాసరావు.. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. » అలాగే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. హుస్సేన్‌రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. » ద్రవిడ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ వÆటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా గవర్నరుకు పంపించారు. సాయంత్రమే ద్రవిడ వర్సిటీ వదిలి వెళ్లిపోయారు. » అలాగే, కృష్ణా యూనివర్శిటీ వీసీ జి. జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా..నిజానికి.. జేఎన్టీయూ (ఏ)లో అప్పటి వీసీ ప్రొ. శ్రీనివాస్‌కుమార్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. 2019లో రాష్ర్టంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా.. శ్రీనివాస్‌కుమార్‌ను వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్ కూడా 2015లో నియమితులైనా.. ఆరేళ్లపాటు చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్ఛాన్సలర్లనే తప్పుకోమనే సంస్కృతికి తెరతీసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు.పదవి కోసం వైఎస్సార్ విగ్రహం తాకట్టు..ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో జీవితాలకు బాటలు వేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ఈ ఏడాది ఆరంభంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడో రోజే విగ్రహాన్ని తొలగించాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విగ్రహం తొలగిస్తే మీరు పదవుల్లో కొనసాగుతారని వీసీ, రిజిస్ట్రార్లను హెచ్చరించారు. దీంతో వారు 24 గంటల్లో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారికంగా తొలగించారు. అయినప్పటికీ వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లుచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జేఎన్టీయూ (ఏ)లో అధునాతనంగా నిర్మించిన ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం ఔన్నత్యాన్ని కాపాడారు. కానీ, టీడీపీ మాత్రం ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.ఏయూ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్ స్టీఫెన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ఏయూ అకడమిక్ డీన్‌గా ఉన్న ప్రొ.కిషోర్‌బాబును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రసాదరెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసాదరెడ్డిపై రాజకీయ ఆరోపణలు ఎక్కుపెట్టగా.. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ఫోన్లుచేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చెయ్యకపోతే దాడులకు తెగబడతామని పార్టీ శ్రేణులు సైతం హెచ్చరించాయి. దీనిపై ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, ఏయూలోని వీసీ కార్యాలయం వద్ద నిత్యం నిరసనల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావుడి చేసూ్తనే ఉన్నారు. పలుమార్లు వీసీని అడ్డుకోడానికి ప్రయత్నించారు. -
ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?
మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.ఎన్నికల సమయంలో చండీగఢ్‌లో జరిగిన రాజ్యాంగ రక్షణ సదస్సుకు నేను వక్తగా వెళ్ళాను. అది ఆఖరి ఘట్టం ఎన్నికల ముందు. చివరి ఘట్టంలో పంజాబు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సదస్సు మే 22న జరిగింది. మరుసటి రోజు అక్కడి మేధావులు పంజాబు గ్రామాల్లో నాకోసం సమావేశాలు ఏర్పాటు చేశారు. నేను మూడు గ్రామాల్లో జరిగిన మూడు మీటింగుల్లో పాల్గొని మాట్లాడాను. మీటింగులో ఆడా, మగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పంజాబులో ప్రభుత్వ పాఠశాల విద్య పంజాబీ భాషలోనే బోధిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు ఒక్క సబ్జెక్టు మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో నడుస్తాయి. పంజాబీలు ఇతర దేశాలకు ఎక్కువ వలసపోతారు కనుక వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అని నేను అడిగాను. వాళ్ళు లేదు అన్నారు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం గురించీ, అది గ్రామాల్లోని పిల్లల్లో తెస్తున్న మార్పుల గురించీ వివరించాను. ‘మా పిల్లలకు కచ్చితంగా అటువంటి ఇంగ్లీషు మీడియం విద్య కావాలి; వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ముందు ఈ డిమాండ్ పెడతా’మని వాళ్లు తీర్మానించుకున్నారు. మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు క్యాబినేట్ ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఉన్నవారంతా గ్రామీణ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించినవారే. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి శాసించే అమిత్ షా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ళను స్థాపించి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసిన నారాయణ మళ్ళీ మంత్రి అయ్యారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు చంద్రబాబు ప్రైవేటీకరణలో భాగంగా ఎదిగాయి.ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం విద్య ఒక సంక్షేమ పథకం కాదు. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వ రంగంలోనే ఉన్నది. కానీ, భారతదేశంలో ప్రైవేట్ పాఠశాల విద్య ప్రభుత్వ రంగ విద్యను సర్వనాశనం చేసింది. అటువంటి విద్యావిధానం నుండి గ్రామీణ విద్యార్థులను కాపాడే విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, 2024–25 ఎకడమిక్ సంవత్సర స్కూళ్ల ప్రారంభం ఏకకాలంలో జరిగాయి. అయితే ఈ సంవత్సరానికి కావలసిన బైలింగ్వల్ బుక్స్(ఉభయ భాషా పుస్తకాలు), పిల్లలకిచ్చే డ్రెస్సులు, బూట్లు ఈ ప్రభుత్వం సకాలంలో ఇస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో బీదవారు, అగ్రకులాలలో బీదవారి పిల్లలకు 2029 ఎన్నికల నాటికి ఈ విద్యావ్యవస్థ తమకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వనుందో అర్థమయ్యే దశ వస్తుంది. కానీ ఇప్పుడు స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత అటు వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, ఇటు పిల్లల తలిదండ్రుల మీద ఉంది. ఇప్పటి నుండి గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం విద్యా పరిరక్షణ కమిటీలు వేసుకోవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను అధిగమించి విద్యారంగ పరిరక్షణ కోసం కమిటీలు వేసుకుని గ్రామంలోని పిల్లలందరి భవిష్యత్ కాపాడవలసిన బాధ్యత ఉంది. గ్రామాల్లో కూడా ధనవంతులున్నారు. వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదివించగలిగేవారూ ఉన్నారు. ఇటువంటివారు, ఉద్యోగులు, పట్టణాల్లోని ధనవంతులు... బీద బక్క పిల్లలందరికి ఇంగ్లీషు వస్తే తమ పిల్లలు వారితో పోటీ పడాల్సి వస్తుందని భావించి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగస్థులు, కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర ధనవంతులు వ్యతిరేకించడంలో తమ పిల్లల భవిష్యత్ స్వార్థం పనిచేసింది. ఈ స్వార్థం కులాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి రిజర్వేషన్ కేటగిరిలో డబ్బున్నవారు తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించి, ప్రభుత్వ తెలుగు మీడియం పిల్లలు తమ పిల్లలతో పోటీ పడకుండా ఉండాలనే స్వార్థం ఓటు వేసే దగ్గర కూడా పనిచేస్తుంది. ఈ స్వార్థపు వేళ్లను తెంపడం చాలా కష్టం. మార్పు తెచ్చే ప్రభుత్వాలను దింపెయ్యాలనే ఈ ధనిక వర్గం ఓటు వ్యవస్థను తమకు అనుకూలంగా తిప్పుకుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వర్గం, హోదా, ఆధిక్యత... నాణ్యమైన ఇంగ్లీష్ విద్యతో ముడిపడి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్మాణాల్లో కూడా ఈ విధంగా ఆలోచించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మార్పు తమ వర్గ శత్రువు అనుకునే శక్తులు వీరు. వీరు గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా స్కూలు విద్య ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అది చర్చనీయాంశం అయింది. బహిరంగ సభల్లో సైతం స్కూలు పిల్లలు ఇంగ్లీషు, తెలుగులో వాగ్దాటితో మాట్లాడటం, అదీ బీద కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడటం ఆ యా గ్రామాల్లో, పట్టణాల్లో ధనవంతులు జీర్ణించుకోలేని విషయం. మార్పును అంగీకరించదల్చుకోని విషయం. ఇది వైసీపీ ఓటమికి కొంత దోహదపడి ఉండవచ్చు. ఈ ధోరణిని తిప్పి కొట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రుల తిరుగుబాటు మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో విద్య మీద గ్రామీణ స్థాయిలో చర్యలు, పోరాటాలు జరగలేదు. కమ్యూనిస్టులు కూడా ఇటువంటి పోరాటాన్ని జరపలేదు. ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో కొత్త విద్యావిధానాన్ని ఓడించడానికి కమ్యూనిస్టులు కూడా సహకరించారు. ఆ విధంగా వీరు బీజేపీ భావజాలానికి మద్దతిచ్చారు. అందుకే రానున్న ఐదేండ్లలో సమాన భాష, పురోగామి భావజాల పాఠశాల విద్య కోసం బలమైన పోరాటం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ పోరాటానికి నేతృత్వం వహించాల్సి ఉంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
తగ్గేదే లే! టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ముందుకే...
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకూడదని విద్యాశాఖ తీర్మానించుకుంది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడంతో విద్యాశాఖ నిస్తేజంగా ఉందని ఆమె అనేక సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాల వద్ద అభిప్రాయపడ్డారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఈ కేసు విచారణకు రాగా, బదిలీలు, పదోన్నతులపై న్యాయస్థానం అధికారుల తీరును ప్రశ్నించింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడుతుందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. కోర్టు పరిణామాల తర్వాత పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నతాధికారులను కలుస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్ ఓపికగా వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు అభ్యంతరాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిసింది. ఇప్పటికే మల్టీజోన్–1 పరిధిలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పూర్తయ్యాయి. మల్టీజోన్–2 పరిధిలో ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అనేక మంది టీచర్లు బదిలీలు, పదోన్నతులు పొందారు. ప్రక్రియను నిలిపివేస్తే ఈ విద్యా సంవత్సరంలో బోధన సాగడం కష్టమని అధికారులు సీఎంకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అంతా పకడ్బందీగానే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పేరెత్తితే తరచూ కోర్టు వివాదాలు వెంటాడుతుంటాయి. 2023లోనూ విద్యాశాఖ ఇలాంటి అనుభవాలే చూసింది. స్పౌజ్‌లు, పండిట్లు, పీఈటీలు, సీనియారిటీ వ్యవహారం అనేక చిక్కుముడులు వెంటాడాయి. దీంతో గత ఏడాది షెడ్యూల్ ఇచ్చినా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాశాఖపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. టెట్ అర్హత ఉన్న టీచర్లకు మాత్రమే పదోన్నతి కల్పించాలన్న కేంద్ర నిబంధనలపై గత ఏడాది కొంతమంది కోర్టుకెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. ఈసారి ఇలాంటి చిక్కులు తలెత్తకుండా అధికారులు ముందే న్యాయ సలహాలు తీసుకున్నారు. ఏయే అంశాలపై ఇబ్బందులు వచ్చే వీలుందని, వాటిని ఎలా ఎదుర్కొనాలనే విషయాలపై దేవసేన కసరత్తు చేశారు. అయినప్పటికీ టెట్ అర్హతపై సింగిల్ జడ్జి తీర్పు, డివిజన్ బెంచ్‌కు వెళ్లడం, అక్కడ పాఠశాల విద్య కమిషనర్ సమాధానం చెప్పాల్సి రావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, డివిజన్ బెంచ్ ఇప్పటివరకూ ప్రక్రియను నిలిపివేయాలని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో అనుకున్న ప్రకారం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి మల్టీ జోన్–2లో... మల్టీజోన్–1 పరిధిలో 10వేల మంది టీచర్లకు పదోన్నతులు దక్కాయి. ఎస్జీటీలు, పీఈటీలు, భాషా పండితులు దాదాపు 10 వేల మంది బదిలీ అయ్యారు. కొన్నిచోట్ల ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు గురువారం నుంచి మల్టీజోన్–2 పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌తో కలుపుకొని మొత్తం 14 జిల్లాలు మల్టీజోన్–2 పరిధిలో ఉన్నాయి. ముందు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాక, ఎస్జీటీలకు పదోన్నతి కల్పిస్తారు. ఆ తర్వాత వీళ్లను బదిలీ చేస్తారు. ఈ జోన్ పరిధిలో 10 వేల మంది ప్రమోషన్లు పొందుతారు. ఇదేస్థాయిలో బదిలీలు కూడా జరుగుతాయి. అయితే, రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రక్రియపై కోర్టు వివాదం ఉండటంతో ప్రక్రియ ఆగిపోయింది. ఏదేమైనా కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బదిలీలు, పదోన్నతులపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యువత.. తన కాళ్లపై తాను నిలవాలి!
మనుషులు తప్ప జీవ ప్రపంచంలోని ఏ జీవి అయినా పెరిగి పెద్దదైన తరువాత తల్లితండ్రులపై ఆధారపడటం తగ్గిస్తుంది. తన కాళ్లమీద తాను స్వతంత్రంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల్లో కూడా చాలా సమాజాల్లో యువత టీనేజ్ దాటే సమయానికి బతకడం నేర్చుకుంటుంది. మన భారతీయుల్లోనే తల్లి తండ్రులపై ఎక్కువకాలం ఆధారపడుతున్నారు.అమెరికాలో ఒకవ్యక్తికి 15 ఏళ్లు వచ్చాయంటే, తల్లి తండ్రులకు అతన్ని ఇక పెంచి పోషించాల్సిన బాధ్యతల నుండి విముక్తి లభించినట్లే. ఒకసారి కళాశాలలో అడుగు పెడితే, వారి ఖర్చులకు డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ, పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవటం విదేశాలలో చూస్తుంటాము. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి తండ్రులే పోషించాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వృద్ధులైన తల్లి తండ్రులను పోషిస్తూ, ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించటం వల్ల మధ్యతరగతి వర్గం చితికి పోతున్నారన్నది వాస్తవం. అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే, కొంతైనా భారం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకై వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యాగాలు చేసుకుంటూ... తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునే వాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్లూ అదే దారిలో నడిచేవాళ్లు. కాని, ఇప్పుడు అక్కడ కూడా తల్లితండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి తండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లి తండ్రులు మన దేశంలో ఎక్కువ ఆవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధాలు కారణం. ఎదిగి వచ్చినా బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పుల పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్ళి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసివస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడలిని కూడా పోషించాల్సి వస్తోంది. ఒకప్పుడు 1970వ దశకంలో చదువు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ల సంఖ్య ఎక్కువగా వుండేది. లండన్, జపాన్ వంటి దేశాల్లో సైతం వీరి సంఖ్య ఎక్కువగా వుండేది. వీళ్ళను ‘ఫీటర్’ అని పిలిచే వాళ్ళు. ఎప్పుడు అయితే కంప్యూటర్ సెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరిగాయో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కాని, మళ్ళీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నత చదువులు చదువుతున్న వారి సంఖ్య పెరిగినంతగా ఉద్యోగాలు పెరగకపోవటం, చదివిన చదువులు బతకటం ఎలాగో నేర్పక పోవటం, విలాస జీవనానికి అలవాటు పడటం, ధరల పెరుగుదల వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఏదో ఒక పనిలో చేరి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. ‘శ్రమ విలువ తెలిసిన వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో బతకాలని కోరుకుంటారు. కాని, పరాన్న జీవులే వయసు మీద పడుతున్నా తల్లితండ్రుల దగ్గర చెయ్యి చాస్తూవుంటారు. నేటి ఇంటర్నెట్ యుగంలో... సామాజిక మాధ్యమాలు, చలన చిత్రాల వల్ల చెడు అలవాట్లకు గురై తమ శ్రమ విలువను గుర్తించ లేకపోతున్నారు. ఇటువంటి వాళ్లు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనబడుతుంటారు. దేశంలో అంత కంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా దీనికి కారణమే. ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోత మనదేశానికి వరంగా భావిస్తున్న యువశక్తి శాపంగా మారి పరాన్న జీవుల సమాజంగా తయారవుతుంది అనటంలో ఏ సందేహం లేదు.ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పుస్తకాలన్నీంటినీ సేకరిస్తున్నారు.కాగా, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. -
World Day Against Child Labour 2024: వెట్టిని జయించి..పది పూర్తి చేసి
‘బడీడు పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం’.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రధాన సారం ఇదే. కానీ ఇప్పటికీ పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. పిల్లలతో పని చేయిస్తున్న ఘటనలను బాధ్యతగల పౌరులో, సామాజిక కార్యకర్తలో ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని పునరావాస కేంద్రాలకు పంపించడం చూస్తూనే ఉంటాం. సరిగ్గా కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా టేకల్ తాలూకాలోని ఓబట్టు గ్రామంలో ఆరేళ్ల క్రితం చేసిన రెస్కూ ఆపరేషన్ ఎంతో మంది పిల్లలను పుస్తకాల బాట పట్టించింది.ఓ క్వారీలో పది కుటుంబాలను వెట్టిచాకిరీ చేయిస్తున్న దారుణంపై స్పందించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారికి విముక్తి కలిగించి సొంత రాష్ట్రానికి పంపింది. అలా వచ్చిన కుటుంబాలు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్‌లో జీవనం సాగిస్తున్నాయి. ఆ ఆపరేషన్ తర్వాత ఆయా కుటుంబాల్లోని పిల్లలను వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించారు. ఆ క్రమంలో చదువును సాగించిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు పదోతరగతి పాసై పైచదువుల కోసం ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. వారి కుటుంబంలో పదోతరగతి చదివిన తొలితరం కూడా అదే. బుధవారం అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రం టేకల్ తాలూకా ఓబట్టు గ్రామంలోని ఓ క్వారీలో పనిలో చేరింది అనూష, నందిని కుటుంబం. తల్లిదండ్రులు మంజుల, శ్రీనివాస్ నిరక్షరాస్యులు. వారికి తెలిసిందల్లా కూలి పనిచేయడం. క్వారీ యజమాని చెప్పిన మాయమాటలకు నమ్మి తెల్లకాగితాలపై వేలిముద్రలు పెట్టి అక్కడ బాండెడ్ లేబర్‌గా మారిపోయారు. రోజుకు 14 గంటల పాటు పని చేస్తూ చిత్రవధను అనుభవించారు.తల్లిదండ్రులకు సహాయంగా పిల్లలు సైతం చేతులు కలిపేవారు. అక్కడ జరుగుతున్న తంతును గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో 2018లో యంత్రాంగం చేసిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా విముక్తి పొందారు. ఆ తర్వాత శ్రీనివాస్ కుటుంబం పొట్ట చేతపట్టుకుని మహబూబ్‌నగర్ టౌన్‌కు వచ్చి గుడిసె వేసుకుని కూలి పనితోనే జీవనం సాగిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే పిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆలోచనతో బడికి పంపాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఇతరుల సాయంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనూష, నందినిలను చేరి్పంచారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పదోతరగతి పాసయ్యారు. పై చదువులు చదువుకుంటాననే ఆసక్తి వెలిబుచ్చుతూ స్పూర్తిదాయకంగా నిలిచారు.వాళ్లు చదువుకోకున్నా మమ్మల్ని మాత్రం చదివిస్తున్నారు: నందినిమాకు ఇల్లు లేదు. క్వారీ ప్రాంతంలో పుట్టి, అక్కడే పెళ్లి చేసుకుని ప్రసవించింది మా అమ్మ. ఒక క్వారీ నుండి మరో క్వారీకి మారుతూ జీవించారు. ఎందుకంటే వారికి తెలిసిన ఏకైక జీవితం అదే. వారికి ఆధార్ కార్డు గురించి తెలియదు. ఓటు వేయడం కూడా తెలియదు. అయినప్పటికీ బాండెడ్ లేబర్ నుంచి విముక్తి పొందిన తర్వాత మమ్మల్ని చదివించాలనే ఆలోచన వచ్చింది. పది పూర్తి చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.నర్సు ఉద్యోగం చేస్తా: అనూషకోవిడ్–19 సమయంలో మా ఇబ్బందులు చెప్పుకునేందుకు మాటలు లేవు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోయాక ఏమీ అర్థం కాకపోయేది. ఇల్లు లేకపోవడంతో పుస్తకాల బ్యాగులు ఎక్కడ దాచుకోవాలో అర్థం కాలేదు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పదోతరగతి పాసవడం ఆనందంగా ఉంది. మా చదువు ఇంతటితో ఆగదు. నర్సు కోర్సు పూర్తి చేయాలని మేమిద్దరం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. -
జగనన్న విద్యాకానుక రెడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదేశాలు జారీచేశారు.అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్‌బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్‌లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు. పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ రూపంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గా ఇంజినీరింగ్ విద్యార్థులుఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది. -
TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదలు చేసింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్లో పేర్కొంది. -
AP: ప్రారంభమైన ఈఏపీ సెట్ పరీక్షలు
విజయవాడ: ఏపీ ఈఏపీ సెట్(ఎంసెట్) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష ప్రారంభం అయింది. అనంతరం మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌గా పరీక్షలు జరగనుంది. రేపు( శుక్రవార) బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయి. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి.రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఎప్‌సెట్‌కి హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య 3,61,640. ఇందులో మహిళలు1,81,536 మంది. పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 22 వేలకి పైగా విద్యార్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక.. ఒక నిమిషం నిబందన పక్కాగా అమలు చేయనున్న ఉన్నత విద్యా మండలి పేర్కొంది. విద్యార్ధులను పరీక్షా కేంద్రం లోపలికి గంటన్నర ముందుగానే అనుమతి ఉంటుంది. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. విద్యార్ధులు చేతులకి మెహందీ పెట్డుకోకూడదు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంపైనా నిషేదం ఉన్నట్లు ఉన్నతి విద్యామండలి తెలిపింది. -
మూడో నేత్రానికి 'మామయ్య' రాచబాట
‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది విజయనగరం శివారు జమ్మునారాయణపురానికి చెందిన అల్లం రామకృష్ణారెడ్డి కుటుంబం. భార్య ఉదయలక్షి్మ, ఇద్దరు కుమార్తెలు. తన పిల్లలను పెద్ద చదువులు చెప్పించి ప్రయోజకులను చేయాలన్నది ఆయన తపన. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డికి వచ్చే కొద్దిపాటి ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుంది, పిల్లలను చదివించుకునేందుకు ఎన్నో ఆరి్థక కష్టాలు పడేవారు. వైఎస్ జగన్ సీఎం కాగానే వచి్చన అమ్మఒడితో తన పిల్లల చదువు కష్టాలు తీరిపోయాంటున్నారాయన. పెద్ద కుమార్తె హోషితారెడ్డి జగనన్న విద్యా దీవెన పథకంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతుండగా, చిన్న కుమార్తె రిషితారెడ్డి స్థానిక కస్పా మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పదో తరగతిలో 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.గతేడాది ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి పంపిన 10 మంది విద్యార్థుల బృందంలో రిషితారెడ్డి కూడా ఒకరు. ‘ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారనేదానికన్నా ఈ పరీక్షలో విజయం సాధిస్తే జగనన్నను కలిసే అవకాశం దొరుకుందని భావించి అర్హత పరీక్షను పట్టుదలతో రాశాను. ఆమెరికా వెళుతున్నాన్న ఆనందం కంటే.. ఇలాగైనా జగన్ సర్‌ను కలుస్తానన్న ఆనందమే ఎక్కువగా ఉంది’ అని రిషితారెడ్డి తన సంతోషాన్ని పంచుకుంది. తల్లి ఉదయలక్ష్మి మాట్లాడుతూ ‘చాలీచాలని ఆదాయంతో ఇద్దరు పిల్లల చదువులు ఎలా అని బెంగ పడేవాళ్లం.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ స్కూళ్లు చాలా బాగుపడ్డాయి. మా పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదువుకుని ఉన్నతంగా రాణించారు. రిషితా కూడా నూజివీడు ట్రీపుల్ ఐటీలోనే చేరింది’ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులు. వీరే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యలో వచి్చన మార్పులు, సంస్కరణలతో పిల్లలను అద్భుతంగా చదివించుకుంటున్న లక్షలాది మంది తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ఇదే’. నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఈ ప్రభుత్వం సర్కారు బడుల రూపురేఖలను మార్చేసింది. చదువుకునే ఆసక్తే అర్హతగా నిర్ణయించి, ప్రతి పేదింటి బిడ్డను ఉన్నత చదువులు చదివిస్తోంది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత దేశంలో ఏపీకి మాత్రమే దక్కింది. కార్పొరేట్ విద్యారంగం ఈర్ష పడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 12 రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఏపీలోనే సాధ్యమైంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేయనుంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది.ప్రతి విద్యార్థి అంతర్జాతీయంగా ఎదిగేందుకు ఇంగ్లిష్ ల్యాబ్స్‌తో పాటు టోఫెల్ శిక్షణను అందిస్తోంది. గోరుముద్దతో వారంలో ఆరు రోజులు 16 రకాల వంటకాలతో పోషకాహారం అందిస్తోంది. బైలింగ్వుల్ టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లి‹Ùను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. ఏపీలోని విద్యా సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐక్యరాజ్య సమితిలో సైతం ప్రపంచ దేశాలు అభినందించాయి. ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఈ మార్పును అద్భుతమైన సంస్కరణగా కొనియాడుతున్నారు. నాడు–నేడుతో బడులకు కొత్త సొబగులువిద్యార్థులు చదివేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచేలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 12 సదుపాలను కలి్పంచింది. నిరంత నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించి పాఠశాల వాతావరణాన్ని అభ్యసన కేంద్రాలుగా మార్చింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించి ప్రజలకు అంకితం చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు. ప్రపంచ టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణవిద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది.నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా ప్రభుత్వం నియమించింది. అంగన్వాడీ నుంచి పాఠ్యాంశాలు సంస్కరణమూస పద్ధతిలో సాగుతున్న పాఠాల బోధనను 2020–21 నుంచి మార్చింది. కొత్త పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పొందుపరిచి, పౌండేషనల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను రూపొందించి అమలు చేస్తోంది. పీపీ–1, పీపీ–2 విధానం అమలు చేసేలా 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు భారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’పై ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్ల నిపుణలతో శిక్షణనిచి్చంది. జగనన్న ‘గోరుముద్ద’..ఇదో నూతన ఒరవడి ⇒ పేద పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రే ‘గోరుముద్ద’ పథకాన్ని రూపొందించారు. ⇒ 45 వేల పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ⇒ విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం వడ్డన ⇒ సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూ చొప్పున 16 రకాల పదార్థాలు గోరుముద్దలో చేర్చారు. ⇒ ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు. ⇒ రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ అందజేత ⇒ ఉడికించిన గుడ్డు ఐదు రోజులు తప్పనిసరిగా అందజేత ⇒ మారిన మెనూతో ప్రతిరోజు సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. ⇒ మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. ⇒ ప్రతి గురువారం బడి పిల్లలను ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి పరీక్షలు ⇒ రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలన. ⇒ గత ఐదేళ్లలో పాఠశాల విద్యార్థుల్లో దాదాపుగా తగ్గిపోయిన రక్తహీనత ⇒ గత ప్రభుత్వం 2014–2019 మధ్య పిల్లల భోజన ఖర్చు ఏడాది వ్యయం రూ.450 కోట్లే ⇒ అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది రూ.1,400 కోట్లకు పెంచింది. ⇒ వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ⇒ ఈ ఐదేళ్లల్లో గోరుముద్దకు రూ.6995.34 కోట్ల నిధులు ఖర్చు సీబీఎస్ఈ బోధన, మండలానికో జూ.కాలేజీ ⇒ విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడేందుకు మొదటి విడతలో 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ⇒ హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోను బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ⇒ 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ⇒ మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ను ప్రవేశపెట్టారు. ⇒ 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలు గరల్స్ జూనియర్ కళాశాలలుగా మార్పు ⇒ మొత్తంగా 679 మండలాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి ..బాలికలు ‘స్వేచ్ఛ’గా ఎదిగేలా.. ⇒ దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడి ⇒ రాష్ట్రంలోనూ పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణం ⇒ ఈ సమస్యలు, నివారణపై ప్రతి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా విద్యారి్థనులకు అవగాహన ⇒ డ్రాప్ అవుట్స్‌కు కారణంగా ఉన్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ‘స్వేచ్ఛ’ పథకం ప్రారంభం ⇒ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్ అందజేత ⇒ వీటికోసం ఏడాదికి 12 కోట్ల ఫ్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందజేత ⇒ గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా టాయిలెట్లు ⇒ టాయిలెట్ల లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. ⇒ మనబడి నాడు–నేడు ప్రాజెక్టుతో ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం ⇒ ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచి్చనట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు ⇒ 45,137 పాఠశాలల్లో బాలికలు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటన ⇒ ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. ⇒ 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. ⇒ డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది.‘డిజిటల్’లో దుమ్ము దులిపేలా బోధన⇒ బ్లాక్ బోర్డులపై రాసే సుద్ద ముక్కలు సరఫరా లేక ఇబ్బంది పడిన ప్రభుత్వ బడిలో నేడు డిజిటల్ బోధన సాగుతోంది. ⇒ నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)తో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ⇒ ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. ⇒ నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. ⇒ దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ విప్లవం. ⇒ ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి, ఇంటి వద్దా డిజిటల్ పాఠాలు నేర్చుకునే అవకాశం కలి్పంచింది. ⇒ డిజిటల్ పాఠాలను ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూస్తున్నారు. ⇒ ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. ⇒ విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ⇒ ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లి‹Ù, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను సునాయాసంగా నివృత్తి చేస్తోంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించింది. ⇒ అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. ⇒ ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లి‹Ùపై పట్టు సాధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు యూఎస్ఏకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సరీ్వసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ⇒ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. ⇒ ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ⇒విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ శిక్షణనిస్తోంది. ⇒ఇందుకోసం అర్హత గల 25 వేల మందికి పైగా ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హైసూ్కళ్లల్లో నియమించింది. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు⇒ విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలు ⇒మనబడి నాడు–నేడు’లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు ⇒ రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ⇒ ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ⇒వారికి అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభం ⇒నవరత్నాల పథకంలో ఒకటి నుంచి ఇంటరీ్మడియట్ వరకు పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6349.6 కోట్లు జమ ⇒ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారీకీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు రూ.26,067 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ ⇒విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ⇒ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటినవారి ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది.⇒ 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందజేత ⇒ 2024 మార్చిలో విడుదలైన ఫలితాల్లోనూ దాదాపు 35 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధన -
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
నాడుప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ వర్సిటీ బిల్లు. నేడు మెరిట్ సాధించిన పేద విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను సొంతం చేసుకోవచ్చు. గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కన్వినర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా సీఎం జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిభ గల పేదింటి విద్యార్థులను టాప్ క్లాస్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో పైసా ఖర్చులేకుండా చదివిస్తూ, వారు ఉన్నత లక్ష్యాన్ని అధిగమించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు మాత్రమే అందుకునే ప్రైవేట్ యూనివర్సిటీ విద్యను తొలిసారిగా పేదింటి విద్యార్థులకు చేరువ చేశారు. ఏపీఈఏపీ సెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా మెరిట్ సాధించిన పేదింటి విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పించి, ఉత్తమ విద్య అందేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. రెండేళ్లలో 6,996 సీట్లు భర్తీ ఏపీలోని ప్రైవేట్ వర్సిటీల్లో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులన్నింటా ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు దక్కుతున్నాయి. ఈ వర్సిటీల్లో ఏడాదికి రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ నిర్ణయంతో పేద మెరిట్ విద్యార్థులకు గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం సీట్లు, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లు లభిస్తున్నాయి. ఇందులో ఎస్ఆర్ఎం–అమరావతి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపీ వీఐటీ), సెంచూరియన్, అపోలో వర్సిటీ, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, మోహన్‌బాబు యూనివర్సిటీలలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో 6,996 సీట్లు పేద విద్యార్థులకు దక్కాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా ప్రభుత్వం ఐదేళ్లలో ఏకంగా రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్ వర్సిటీల్లో కన్వినర్ కేటగిరీలో చేరిన విద్యార్థులకు ఉచితంగానే చదువులు చెప్పిస్తోంది. అప్పట్లో ప్రైవేట్ వర్సిటీలకు చంద్రబాబు అండ ప్రైవేట్ వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం వర్సిటీ యాజమాన్యాలకు లబ్ధి చేకూరేలా నిబంధనలు పెట్టింది. ఆయా వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతో పాటు ఇతర రాయితీలూ కల్పించింది. ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్నింటా వర్సిటీల ఇష్టానికే వదిలేసింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే కేటాయించేవి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం జగన్ దార్శనికత సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిస్థితి మారింది. ఉన్నత బోధన, వనరులు ఉన్న ప్రైవేట్ వర్సిటీ విద్య పేద విద్యార్థులకూ దక్కాలనుకున్నారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా గ్రీన్‌ఫీల్డ్ విధానంలో ఏర్పాటైన ప్రైవేట్ వర్సిటీల్లో చదువుకునే అవకాశాలపై తొలుత దృష్టి సారించారు. ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ ద్వారా ఆయా వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 35 శాతం సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల ఏర్పాటుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు.ఇప్పటికే కొనసాగుతున్న కాలేజీలు నిరీ్ణత నిబంధనలతో, వనరులను కలిగి ఉంటే ఆయా యాజమాన్యాలు తమ సంస్థలను బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీలుగా మార్చుకునే అవకాశమిచ్చారు. అయితే వర్సిటీగా మారక ముందు వరకు ఈ కాలేజీల్లోని సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో పేద మెరిట్ విద్యార్థులకు దక్కేవి. వర్సిటీగా మారాక 35 శాతం సీట్లే దక్కితే పేద మెరిట్ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని సీఎం జగన్ భావించారు. దీంతో బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లోని 70 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాలో కేటాయించేలా చట్టాన్ని సవరించారు.బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా ఏర్పాటయ్యాక కొత్త కోర్సులు ప్రారంభించినా, అదనపు సీట్లు తెచ్చుకున్నా వాటిలో మాత్రం గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల మాదిరి 35 శాతం సీట్లు రాష్ట్ర కన్వినర్ కోటాకు దక్కుతాయి. ఇటీవల మరో మూడు విద్యా సంస్థలు బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిల్లో మరిన్ని అదనపు సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. -
నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
బాగా చదివే విద్యార్థులను వెన్నుతట్టి...ప్రోత్సహిస్తే ..మరింతగా వారు రాణిస్తారు..ఆ విద్యార్థుల ప్రతిభకే ప్రభుత్వం పట్టం గడుతూ... దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు వారికి చేయూతనందిస్తుంటే...వారి తల్లిదండ్రులే వేనోళ్ల కొనియాడుతున్న అపురూప దృశ్యం ఈ రోజు నవ్యాంధ్రలో అపూర్వంగా కనిపిస్తోంది.. రామోజీరావుకు ఒక్కరికే విద్యారంగ ప్రగతి నచ్చడం లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ పచ్చమద్దతుదారుకు ఒంటిపై తేళ్లూ జెర్రులు పాకుతున్నట్లుగా ఉంది... పచ్చపార్టీ కొమ్ముకాయకపోతే తనకు రోజు గడవదు...పచ్చను రోజూ ఏదోలా పైకి లేపనిదే తనకు నిద్ర పట్టదు...ఈ మానసిక అల్లకల్లోలంలో మంచినీ చెడుగా చెప్పడం పెద్ద దురలవాటుగా మార్చుకున్నారు...శనివారం నాటి ఈనాడులో తన పిచి్చని, దౌర్భాగ్యాన్నంతా రంగరించి ‘ఈ చదువులు మాకొద్దు మామా’ శీర్షికన ప్రచురించిన కథనం ఇలాంటిదే...విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడమంటే నాణ్యమైన విద్యను నేరి్పంచడం...వారి భవిష్యత్తుకు జీవితకాల భరోసా ఇవ్వడం...ఇవేవీ చంద్రబాబు పద్నాలుగేళ్లలో చేయలేక, చేవలేక చతికిల పడితే కేవలం అయిదంటే అయిదేళ్లలో చేసి చూపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి రామోజీరావుకు మహా కంటగింపుగా ఉంది...మా బాబు సాధించలేకపోయిన ఘనతను జగన్ సాధిస్తారా? ...అనే ఈర‡్ష్య అణువణువునా జీరి్ణంచుకుపోయిన రామోజీలోని విషమంతా అక్షరాల్లో కుమ్మరించి, జనంలోకి వదులుతున్నారు...ఈ అవాస్తవాల విషానికి విరుగుడుగా వాస్తవాల ఫ్యాక్ట్‌చెక్ ఇది...సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నా, ఈనాడు రామోజీరావుకొక్కరికే అవేవీ కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం ఎందుకూ కొరగాకుండా పోయినా, అదే అద్భుతమన్నట్లు వరి్ణంచిన ఈనాడు ఇప్పుడు విద్యారంగం పురోభివృద్ధి సాధిస్తున్నా అవాస్తవాలను అచ్చేస్తోంది.. ఓ రిక్షా కార్మికుడు, వ్యవసాయ కూలీ, వెయిటర్..ఇలా రోజు పనిచేస్తే గానీ పొద్దుగడవని కుటుంబాల బిడ్డలు పెద్ద చదువుల్లో రాణిస్తుంటే అక్కసు వెళ్లగక్కుతోంది.ప్రతిభ ఉంటే ఆ విద్యారి్థకి ఎంత సాయమైనా చేసి చదివించే సంస్కరణలను సీఎం జగన్ ప్రవేశపెడితే.. కుట్ర కథనాలతో అసత్యాలను ప్రచారం చేస్తోంది. సీఎం జగన్ ఉన్నత విద్యను మొత్తం ఉచితం చేసేశారు. టీడీపీ ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు చెల్లిస్తే.. 59 నెలల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18 వేల కోట్లకు పైగా చెల్లిస్తుండటం విశేషం. ఇందులో గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలూ ఉన్నాయి ఉన్నత చదువుల్లో భాగంగా పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తోంది. గతంలో కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇంత మేలు చేస్తుంటే ఎన్నికల్లో చతికిలపడ్డ చంద్రబాబును ఎలాగైనా గద్దెనెక్కించేందుకు తనవంతు దుష్ట యజ్ఞాన్ని చేస్తోంది. ఆరోపణ: వర్సిటీల్లో 76 శాతం పోస్టుల ఖాళీ వాస్తవం: విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం గత ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు, రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినైనా నియమించారా? దీనిపై ఎప్పుడైనా రామోజీరావు చంద్రబాబును ప్రశి్నంచారా? గత ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు నియామక ప్రక్రియపై పలు కేసులు అప్పుడే కోర్టుల్లో నమోదయ్యాయి. వాటిని కోర్టులో పరిష్కరించి గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం వర్సిటీల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీని ప్రకారం 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిని భర్తీ చేస్తే సీఎం జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోనన్న కుట్రలతో చంద్రబాబు వాటిపైనా కోర్టుల్లో కేసులు వేయించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆరోపణ: పీజీ చదివినా ఏం లాభం? ఉద్యోగాలు రావట్లేదు... వాస్తవం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన తర్వాత ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. కరిక్యులమ్‌ను పూర్తి స్థాయిలో మార్పు చేయడంతో పాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దారు. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్íÙప్తో చదువు సమయంలోనే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి అప్‌స్కిల్లింగ్ చేపట్టారు. ఇవన్నీ చేయడంతోనే డిగ్రీ, బీటెక్‌లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ యువత ఎంఎన్సీ కంపెనీల్లో భారీ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తోంది.ఇలా చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ ఉద్యోగాలు 2022–23 విద్యా సంవత్సరంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీతోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు సాధించారు. వీటిల్లో మళ్లీ 17 వేల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులూ ఉండటం మరో విశేషం. ఇలా డిగ్రీ స్థాయిలో మంచి ఉద్యోగాలు రావడంతో యువత కుటుంబ ఆరి్థక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ముందుగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.అనంతరం ఆన్లైన్ సరి్టఫికేషన్, దూరవిద్య.. ఇలా వివిధ రూపాల్లో తమకు నచి్చన పీజీ కోర్సులను అభ్యసిస్తున్నారు. కొన్ని కంపెనీలయితే తమ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు అవే ప్రైవేట్ వర్సిటీలతో అనుసంధానమైన పీజీ, ఎంటెక్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే నేరుగా పీజీ చదివే వారి సంఖ్య కొంత తగ్గింది.ఆరోపణ: ఓట్ల కోసమే ఎడెక్స్ కోర్సులువాస్తవం: విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ప్రఖ్యాత ప్రపంచ వర్సిటీల కోర్సులను సీఎం జగన్ ప్రభుత్వం ఎడెక్స్ ద్వారా అందిస్తోంది. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతం సంపాదిస్తారని బలంగా విశ్వసిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ ‘‘ఎడెక్స్’’ ద్వారా 260కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2 వేలకు పైగా కోర్సులను అందుబాటులోకి తెచి్చంది.హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సరి్టఫికేషన్లు పొందేలా ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏకంగా 1.80 లక్షలకు పైగా విద్యార్థులు సరి్టఫికేషన్లు సాధించారు. ఈ ఎడెక్స్ కోర్సులను బయట నేర్చుకోవాలంటే ఒక్కో కోర్సుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.తొలి విడతలో 4 లక్షల మందికి ఈ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. వీరందరూ ఒక్కో కోర్సు చొప్పున చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్ల వ్యయమవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఎడెక్స్ ద్వారా స్థానికంగా అధ్యాపకుల కొరతను అధిగమించడంతో పాటు నాణ్యమైన బోధననూ అందించగలుగుతోంది. ఆరోపణ: డిగ్రీ విద్య అస్తవ్యస్తం... నాణ్యమైన బీఈడీ విద్య లేదు.. వాస్తవం: డిగ్రీలో సింగిల్ మేజర్, మైనర్ విధానంతో విద్యారి్థని ఒక ప్రధాన సబ్జెక్టులో నిపుణుడిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఈ తరహా విద్యా విధానాన్ని అవలంబించడంతోనే అక్కడ ఉన్నత విద్యలో విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి తోడు 100కి పైగా మైనర్ సబ్జెక్టుల్లో విద్యార్థులు నచి్చన వాటిని చదువుకోవడానికి అవకాశమూ కలి్పస్తోంది.మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీని (హానర్స్) ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని యూజీసీ సైతం ప్రశంసించింది. చంద్రబాబు హయాంలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, బయటి రాష్ట్రాల విద్యార్థులను నిలువు దోపిడీ చేసేందుకు బీఈడీ, డీఈడీ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మౌలిక సౌకర్యాలు లేకుండా కాగితాలపై విద్యార్థులను చూపించి ప్రజాధనాన్ని దోపిడీ చేసేవారు.వీటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, తన అనుయాయులకు అక్రమార్జన నిలిచిపోవడంతోనే రామోజీరావు ఏడుపు ఎక్కువైంది. ఎంటెక్ కోర్సుల్లోనే ఇదే తంతు నడిచేది. బీటెక్‌లో సున్నా ప్రవేశాలు ఉన్న కాలేజీల్లో ఎంటెక్ 90–100 శాతం ప్రవేశాలు ఉండేవి. అంటే ఇక్కడ చదువు చెప్పేది ఉండదు. కేవలం ఫీజుల కోసమే కళాశాలల బోర్డులు తగిలించుకుని కనిపించేవి. ఆరోపణ: ఈఏపీసెట్‌లో 500లోపు ర్యాంకర్లు ఏపీలో చేరడం లేదు.. ప్రతిభావంతులు బయటికి వెళ్లిపోతున్నారు.. వాస్తవం: ఈఏపీసెట్‌లో టాప్ 500 లోపు ర్యాంకర్లు కచి్చతంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కచి్చతంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లోనూ అర్హత సాధిస్తున్నారు. అలాంటప్పుడు వారు జాతీయ వర్సిటీలను కోరుకోవడంలో తప్పేముంది. వారు మినహా ఏపీలో మిగిలిన విద్యార్థులు ఇంజనీరింగ్ చేరుతున్నారు కదా. వీరిలో నుంచే దాదాపు అర కోటికిపైగా ప్యాకేజీలు పొందుతున్న విద్యార్థులు ఏటా కనిపిస్తున్నారు. మరి వీరంతా ఈనాడు దృష్టిలో ప్రతిభావంతులు కాదా? ఆరోపణ: నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు చూపు? వాస్తవం: చంద్రబాబు హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచి్చంచాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. సీఎం జగన్ మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను అందిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కనీ్వనర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. రెండేళ్లలో 7 వేల మంది వరకు విట్, ఎస్ఆర్ఎం, మోహన్‌బాబు, సెంచూరియన్ వంటి ప్రైవేటు వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. -
విద్యలో సరికొత్త విప్లవం
» ఇదీ జగన్ బ్రాండ్ గవర్నెన్స్ » పేద విద్యార్థుల చెంతకు ఇంగ్లిష్ చదువులు » ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లలు రాణించేలా నైపుణ్య శిక్షణ » అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్ పాఠ్యపుస్తకాల రూపకల్పన » ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం » నిత్య జీవిత సమస్యలను అధిగమించేందుకు ‘సంకల్పం’ శిక్షణ » డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ » ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు సోమవారంహాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారంఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారంవెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారంఅన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్–సాక్షి, అమరావతిమన ఇంగ్లిష్ విద్యపై ప్రశంసల జల్లు » ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ » ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ » ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు అమలుకు సిద్ధం’’ » ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు మొత్తం రూ.25,809.5 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేశారు. నాడు– నేడులో చేసిన ఖర్చు విడత పాఠశాలలు ఖర్చు (రూ.కోట్లలో) మొదటి 15,715 3,669 రెండో 22,344 8,000 -
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య
నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు, పథకాలపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంస్కరణలకు తెరతీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తూ ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాసంస్కరణలపై ప్రపంచవ్యాప్తంగా మేధావులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విద్యా సంస్కరణలు, పథకాల తీరుతెన్నులను పరిశీలించి వెళ్లారు. తమ దేశాల్లోనూ వాటిని అమలు చేస్తామని చెప్పడం ఏపీ విద్యకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపునకు నిదర్శనం. ఇలా ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను వారికి దూరం చేయాలని కుట్రలు పన్నుతోంది. నాణ్యమైన విద్యే మార్గం..‘పేదరికాన్ని జయించాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఒక్కటే మార్గం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. అన్ని దేశాలు దీన్ని అంగీకరించాలి. దీన్ని ఐదేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం గొప్ప ముందడుగు’.. స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నాజియో క్యాసిస్ ఇచ్చిన కితాబు ఇది. గతేడాది ఫిబ్రవరిలో జెనీవాలో ‘ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ అంశంపై మాట్లాడిన ఇగ్నాజియో.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యా పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచాన్ని ప్రగతి వైపు నడిపించే విద్యా బోధన, సంస్కరణలను ఏపీ అమలు చేయడం గొప్ప ముందడుగని పేర్కొన్నారు. అలాగే కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ సాచ్ ఏపీ విద్యా విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో గ్లోబల్ విద్యా విధానం అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప అంశంగా పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్ విద్య, ట్యాబ్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు, టోఫెల్ శిక్షణ భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమన్నారు. తాజాగా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతిని«దులు సాక్షి ప్రతినిధితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రపంచ పౌరులుగా పేద విద్యార్థులు..పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేయడం పేద పిల్లలకు దక్కిన గొప్ప గౌరవం. విద్యా సాధనలో అట్టడుగు స్థాయిల్లో ఇలాంటి సంస్కరణలనే కోరుకుంటున్నాం.స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి కార్యాలయం అట్టడుగు స్థాయిలో నాణ్యమైన, సమగ్ర విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందిస్తున్నా. – లిడియా గ్రిగొరెవా, చీఫ్ ఆఫ్ క్యాబినెట్, యూఎన్వో డైరెక్టర్ జనరల్ ఆఫీస్, జెనీవా ఏపీ పాఠశాలల్లో మార్పులను చూసి ఆశ్చర్యపోయా కంపారిటివ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీలో దక్షిణాసియా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) చైర్‌గా నేను భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మార్పులను చూసి ఆశ్చర్యపోయాను. గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కొలంబియా విశ్వవిద్యాలయంలో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఏపీలో విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాల గురించి వారు అనర్గళంగా వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా విద్యార్థులతో పోటీపడుతూ మాట్లాడారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్ బోర్డులు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీని వినియోగించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ మార్పులతో ఏపీ విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు. – రాధిక అయ్యంగార్, సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌ప్రపంచ అవసరాలకు తగ్గట్టు ఏపీ విద్యార్థులుఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఆకర్షించింది. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ అందించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఏపీ విద్యార్థులు ప్రపంచ అవసరాలకు తగ్గట్టు మారుతున్నారు. ఇది ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకునేందుకు, పరస్పరం సహాయానికి, భవిష్యత్‌ను అద్భుతంగా మార్చుకునేందుకు దోహదం చేస్తుంది.బాలికల డ్రాపవుట్లను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10 లక్షల మంది బాలికలకు ఉచిత బ్రాండెడ్ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా రన్నింగ్ వాటర్ సదుపాయంతో మరుగుదొడ్లను నిర్మించింది. యుక్త వయసు బాలికల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాను. – దివ్యాన్షి వాధ్వా, ప్రపంచ బ్యాంక్ డేటా సైంటిస్ట్, వాషింగ్టన్ఏపీలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యఆకలిని, పేదరికాన్ని జయించాలంటే మొదట విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోంది. నైపుణ్య శిక్షణ అనేక మంది పేద విద్యార్థుల జీవితాలను మారుస్తోంది.దీనిద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను, వేతనాలను పొందగలరు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం సమకాలీన ప్రపంచ సవాళ్లను అధిగమించి అవకాశాలను అందుకునేదిగా ఉంది. ప్రీ–స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు చేసిన మార్పులతో నాణ్యమైన విద్యాభివృద్ధిని సాధిస్తుంది. – రజనీ ఘోష్, బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ ఎఫైర్స్ ఇండియా డెస్క్ ఆఫీసర్, అమెరికా ప్రభుత్వంకార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలునా చిన్నప్పటికి, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, ఇంగ్లిష్ మీడియం బోధన వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారడం గర్వకారణం.ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుతో ప్రతిభ గల నాణ్యమైన విద్యార్థులను బయటకు తీసుకురావచ్చు. పేద విద్యార్థులకు ఆంగ్లంలో మంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో రాణించేందుకు మార్గం సుగమమవుతుంది. పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. – ఉపేందర్‌రెడ్డి గాదె, విజ్డమ్ టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్, సిడ్నీ, ఆస్ట్రేలియాఆంధ్రప్రదేశ్లోనే ఇంత గొప్ప మార్పు..ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణలను ప్రభుత్వ విద్యార్థులే నేరుగా ఐక్యరాజ్యసమితిలో వివరించారు. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప మార్పును ఏపీలో చూస్తున్నామని ప్రపంచ దేశాల ప్రతినిధులు అభినందించారు. కొలంబియా యూనివర్సిటీలో మన విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్‌లో మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.స్టాన్‌ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్, జెనీవా యూనివర్సిటీ, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ గర్ల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్కూల్స్ ఫోరమ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ ఇన్‌క్లూజన్ వంటి వాటిలో గత ఐదేళ్లుగా ఏపీ విద్య సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ప్రతిచోటా ఏపీ విద్యకు ప్రశంసలు లభిస్తున్నాయి. – ఉన్నవ షకిన్ కుమార్, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ సభ్యుడు -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
స్కూలు ఫీజులు తగ్గుతాయా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీకి చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తోంది. ఈమేరకు కసరత్తు వేగవంతం చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.2024–25 విద్యా సంవత్సరం జూన్ 12నుంచి పునః ప్రారంభం కానుంది. ఆలోపు ఫీజు నియంత్రణకు సంబంధించి స్పష్టత, ఉత్తర్వు లు వస్తే ఆ మేరకు తల్లిదండ్రులు పిల్లల స్కూల్ ఫీజుల చెల్లింపులపై అంచనాలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే జూన్ 6వ తేదీ వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత కసరత్తు వేగవంతం చేసినప్పటికీ ఫీజు నియంత్రణ చట్టం ఖరారయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు అనుమానంగానే ఉంది. చట్టం రూపకల్పన, ఆ తర్వాత చట్టసభల్లో ఆమెదం తర్వాతే ఫీజు నియంత్రణకు లైన్ క్లియర్ కానుందని, దీంతో 2025–26 నుంచి ఈ చట్టం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఒకటో తరగతికి ఆరేళ్ల మాటేమిటి?మరోవైపు ఒకటో తరగతిలో ప్రవేశానికి 6 సంవత్సరాల వయసు నిండి ఉండాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నిబంధనల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ ఈ అంశంపైనా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన రాష్ట్రంతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు, కేరళ, హర్యానా సహా చాలా రాష్ట్ర ప్రభు త్వాలు ఈ వయస్సు ప్రమాణా లపై ఎలాంటి నిర్ణ యం తీసుకోని నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నాటికే ఈ అంశంపై స్పష్టత రానుందని అధి కారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఒకటో తరగతి ప్రవేశానికి ఆరేళ్ల వయోపరి మితి నిబంధనతో జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ప్రచారం ఉంది. కాగా, 2024–25 విద్యా సంవత్సరంలో ఐదేళ్ల వయోపరిమతి నిబంధనతోనే ప్రవేశాలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
టెన్త్‌లో మళ్లీ నిర్మల్ టాప్.. అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో మాదిరిగానే టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్ విభాగంలో బాలురు కన్నా 3.81 శాతం, ప్రైవేటు (కంపార్ట్మెంటల్) విభాగంలో 6.74 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 91.31 శాతం, ప్రైవేటు విద్యార్థులు 49.73 శాతం పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. 5,05,813 మంది పరీక్షలు రాస్తే 4,57,044 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. రెగ్యులర్‌గా రాసిన వారిలో బాలికలు 2,28,616 (93.23%), బాలురు 2,22,656 (89.42%) మంది పాసయ్యారు. ప్రైవేటులో బాలికలు 2,178 (54.14%) మంది, బాలురు 3,594 (47.40%) మంది పాసయ్యారు. ఆరు స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు స్కూళ్ళలో ఒక్కరు కూడా పాసవ్వలేదు. గురుకుల పాఠశాలలు 98.71 శాతం అత్యధిక పాస్ పర్సంటేజీతో దూసుకెళ్ళాయి. జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు సగటు ఉత్తీర్ణత శాతం కన్నా తక్కువ పర్సంటేజీ దక్కించుకున్నాయి. 15 రోజుల్లోగా రీ కౌంటింగ్, వెరిఫికేషన్ మార్కుల రీ కౌంటింగ్, ఫలితాల రీ వెరిఫికేషన్ కోరుకునేవారు 15 రోజుల్లో (మే 15లోగా) దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. రీ కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500 చెల్లించి, దరఖాస్తులను పాఠశాల విద్య కార్యాలయానికి పంపాలి. రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాలి. హాల్ టిక్కెట్ జిరాక్స్, మార్కుల మెమో కాపీతో కూడిన రీ వెరిఫికేషన్ దరఖాస్తును సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపాలి. వీరికి మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం ప్రతిని పంపుతారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఎదురు చూడకుండా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ కోరింది. మే 16లోగా సంబంధిత స్కూల్ హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒత్తిడికి లోనవ్వొద్దు : బుర్రా వెంకటేశం ఫెయిల్ అయిన, గ్రేడ్లు తగ్గిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురికావద్దంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విజ్ఞప్తి చేశారు. ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ రాసుకుని ఇంటర్లో చేరేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఫెయిల్ అయినా, జీవితంలో అద్భుతంగా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘పది’లో సత్తా చాటిన గురుకులాలు రాష్ట్రవ్యాప్తంగా సగటున 96.33 శాతం ఉత్తీర్ణత అత్యధికంగా జనరల్ సొసైటీలో 98.70శాతం పాస్ పెరుగుతున్న టెన్త్ ఉత్తీర్ణత – 2015లో 77 శాతం.. 2024లో 91 శాతం ఉత్తీర్ణత – 8 రెట్లు పెరిగిన 10 జీపీఏ విద్యార్థులు – ప్రైవేటుతో పోటీ పడుతున్న గురుకులాలు, మోడల్ స్కూల్స్ -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్‌లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్‌ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్‌ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్‌ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్‌కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన బోర్రుడ్ ఎల్జి, నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ, ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
త్వరలో ఇంటర్, పది ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 26న ఇంటర్, మే 6న టెన్త్ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తరువాత పునఃపరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూర్తికానుంది. ఈ ఫలితాలను సైతం వారం, పదిరోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022–23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు. -
ఏపీ బడులకు ఈ 24 నుంచి వేసవి సెలవులు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో బడులకు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుండి ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యా శాఖ.. వచ్చే అకడమిక్ ఇయర్ కోసం జూన్ 12న తిరిగి స్కూల్స్ తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్ పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
టెట్.. సర్వీస్ టీచర్లు లైట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని.. దానికితోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని.. అలాంటిది టెట్కెలా సన్నద్ధమవు తామని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2012కు ముందు సర్వీస్‌లో చేరిన 80వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ).. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. పరీక్షపై స్పష్టత ఏదీ? వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని.. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు డీఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్–1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి. వారు పేపర్–2 రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్–2 రాయలేరు. పదోన్నతులూ పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా మాత్రం వెళ్లే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్లాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదనేది టీచర్ల అభిప్రాయం. అంతేగాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సన్నద్ధతకు సమయమేదీ? చాలా మంది టీచర్లు పదేళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి, ఇప్పటికి బీఈడీ, డీఎడ్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెన్త్ పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్‌గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. టీచర్లు ఆ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెప్తున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు అన్ని తరగతులకు సంబంధించిన అని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్‌లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్‌లోని అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సీకి చాన్స్ లేనట్టే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. వీళ్లు గతంలో టెట్ పాసయినా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 25 వేల మంది డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్ డీఎడ్ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు. టెట్ దరఖాస్తులో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసేవాళ్లు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది. రెగ్యులర్ డీఎడ్‌తో ఇది సమానం కాదని పేర్కొంది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్తో కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. టెట్‌కు, డీఎస్సీకి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్‌లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ 9:30 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఇక, ఈ నెల 30 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగుస్తాయి. కాగా, మరో రెండు రోజులు అంటే మార్చి 30 వరకు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. 2023–24లో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు కాగా 3,05,153 మంది బాలికలు. కాగా, గతేడాది ఉత్తీర్ణులు కాకపోవడంతో తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా పరీక్షలు రాయనున్నారు. అలాగే ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అవకాశం కల్పించారు. పరీక్షల పర్యవేక్షణకు 3,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 3,473 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 35,119 మంది ఇని్వజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను నియమించారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో అదనంగా సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. పేపర్ లీకులకు ‘క్యూఆర్’ కోడ్‌తో చెక్ మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఈ ఏడాది పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇని్వజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్–టీచింగ్ సిబ్బంది, ఏఎన్ఎంలు, చీఫ్ ఇని్వజిలేటర్లు ఇలా ఎవరైనా సరే సెల్ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి రావడాన్ని నిషేధించామన్నారు. ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను తేవద్దన్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా పదో తగరతి పరీక్ష పేపర్లపైనా, ప్రతి ప్రశ్నకు ‘క్యూఆర్’ కోడ్‌ను ముద్రించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డా, పేపర్ లీక్ చేసినా.. ఏ సెంటర్లో ఏ విద్యార్థి పేపర్ లీక్ అయిందో ప్రత్యేక టెక్నాలజీ ద్వారా తెలుసుకోనున్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ చేపట్టనున్నారు. ఆ తర్వాత వెంటనే ఫలితాలను వెల్లడించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చు. అల్ట్రా పల్లె వెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా వెళ్లి రావొచ్చని విద్యాశాఖ ప్రకటించింది. -
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమా న్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండ టంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.