బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. | Know Which Prominent Leaders has Delhi University Produced and from which College | Sakshi
Sakshi News home page

బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..

Feb 22 2025 12:12 PM | Updated on Feb 22 2025 12:27 PM

Know Which Prominent Leaders has Delhi University Produced and from which College

న్యూఢిల్లీ: దేశంలో పేరెన్నికగన్న విద్యాలయాల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) ఒకటి. ఈ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో చదివిన పలువురు పెద్ద రాజకీయ నేతలుగా ఎదిగారు. వీరిలో చాలామంది క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) పరిధిలోని వివిధ కళాశాల్లో చదివి బడా నేతలుగా ఎదిగిన వారి జాబితాలో అరుణ్ జైట్లీ, శశి థరూర్  మొదలుకొని మొన్ననే ఢిల్లీ పీఠమెక్కిన రేఖాగుప్తా కూడా ఉన్నారు. మరి.. వీరిలో ఎవరెవరు ఏ కాలేజీలో చదివారనే వివరాల్లోకి వెళితే..


శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్
అరుణ్ జైట్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 1973లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్ ఆనర్స్ డిగ్రీని  అందుకున్నారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఎల్ఎల్‌బీ పట్టా పొందారు.

విజయ్ గోయెల్: కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయెల్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎం.కామ్ పట్టా పొందారు.

జితిన్ ప్రసాద్‌: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ  మంత్రి జితిన్ ప్రసాద్‌.. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో డిగ్రీ పట్టా పొందారు.

సెయింట్ స్టీఫెన్స్ కళాశాల
శశి థరూర్: కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి  హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Iyer) సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బీ.ఎ. పట్టా పొందారు.

వీరభద్ర సింగ్: మాజీ కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బీ.ఎ. ఆనర్స్ డిగ్రీని  అందుకున్నారు.

ఖుష్వంత్ సింగ్: ఖుష్వంత్ సింగ్ రచయితగా, న్యాయవాదిగా, పాత్రికేయునిగా,  దౌత్యవేత్తగా పేరొందారు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు.

హిందూ కళాశాల
డాక్టర్ సుబ్రమణియన్ స్వామి: రాజకీయవేత్త, ఆర్థికవేత్త, క్యాబినెట్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

రావు ఇంద్రజిత్ సింగ్: భారత ప్రభుత్వ మాజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ హిందూ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.

మీనాక్షి లేఖి: భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.

రాంజస్ కళాశాల
చౌదరి బ్రహ్మ ప్రకాష్: ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

సోమనాథ్ భారతి: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి, రాంజస్ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.

సరూప్ సింగ్: 1990లో మొదట కేరళ గవర్నర్‌గా, ఆ తర్వాత గుజరాత్ గవర్నర్‌గా పనిచేసిన సరూప్ సింగ్, రాంజస్ కళాశాల నుండి బీ.ఎ. ఇంగ్లీష్ చదివారు.

కిరోరి మాల్ కళాశాల
నవీన్ పట్నాయక్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.

మదన్‌లాల్ ఖురానా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మదన్‌లాల్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ప్రవేశ్ వర్మ: ప్రవేశ్ వర్మ ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.  ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం  పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.

హన్స్‌రాజ్ కళాశాల
కిరణ్ రిజిజు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

అజయ్ మాకెన్: ప్రస్తుత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ హన్స్‌రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్
అనుప్రియ పటేల్: పార్లమెంటు సభ్యురాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల నుండి బీ.ఎ. పట్టా పొందారు.

మేనకా గాంధీ: మాజీ ఎంపీ, మహిళా, శిశు అభివృద్ధి మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా గాంధీ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

దయాల్ సింగ్ కళాశాల
పంకజ్ సింగ్: ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్ 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా పొందారు. ఆయన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు.

అల్కా లాంబా: జాతీయ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా 1996లో దయాళ్ సింగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

దౌలత్ రామ్ కళాశాల
రేఖ గుప్తా: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా  అందుకున్నారు.

ఇది కూడా చదవండి; Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement