
కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఐదుగురికి ఉన్నత విద్యాభ్యాసం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, మకుట డెవలపర్స్ ఛైర్మన్ కొంపల్లి జనార్ధన్. ఇటీవలే ముగిసిన వార్షిక సమావేశంలో పూర్వవిద్యార్థులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో కొంపల్లి జనార్ధన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
మెరిటోరియస్ విద్యార్థులు ఐదుగురిని ఎంపిక చేసి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఇది వారి ఉన్నత విద్యాభ్యాసానికి, లేదా నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాలేజీ యాజమాన్యం, పూర్వవిద్యార్థులు పలువురు ఈ విరాళంపై హర్షం వ్యక్తం చేశారు.
భావితరాలకు విద్యాభ్యాసానికి ఉపయుక్తమని కొనియాడారు. కొంపల్లి జనార్ధన్ 2-006లో స్థాపించిన మకుట డెవలపర్స్ దక్షిణ భారతదేశం మొత్తమ్మీద అనేక వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
(చదవండి: ఇలా అయితే కష్టం సుమీ!)