
ఛత్తీస్‌గఢ్‌లోని సారా గోండి అనే ఊళ్లో...రెండు దశాబ్దాల క్రితం డియోల బాయి నాటిన రావి మొక్క రావి చెట్టు అయ్యింది. ‘ఇది నేను ప్రాణం పోసిన చెట్టు’ అని ఆ చెట్టును చూస్తూ గర్వంగా చెప్పేది డియోల బాయి. ‘ఇది డియోల బాయి చెట్టు’ అని గ్రామస్తులు పిలుచుకునేవాళ్లు.
అయితే ఆ రావి చెట్టును ఒక వ్యక్తి తన స్వార్థం కోసం కొట్టివేయడంతో డియోల బాయి కుప్పకూలిపోయింది. కొట్టివేసిన రావి చెట్టును చూస్తూ 85 సంవత్సరాల డియోల బాయి కన్నీరు మున్నీరు అయింది. ఈ సంఘటన గ్రామాన్ని దుఃఖంలో ముంచెత్తింది. స్థానికులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. చెట్టుకొట్టి వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘ఇది ఆమె బాధ కాదు. ఊరంతటి దుఃఖం’ అంటున్నారు గ్రామస్థులు. ‘ఇది కేవలం చెట్టు కాదు. మా విశ్వాసం. మా భక్తికి చిహ్నం’ అంటున్నాడు మాజీ సర్పంచ్ సంజయ్‌సింగ్. ఈ సంఘటన తరువాత గ్రామస్తులు అదే స్థలంలో కొత్త రావి మొక్కను నాటారు. దాన్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేశారు.డియోల బాయి ఆ మొక్క దగ్గర ప్రార్థనలు చేసింది.
(చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్)