
కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా, మోచేతులు, మోకాళ్లలో నలుపుతో బాధపడుతుంటారు. వీటి నివారణకు క్రీముల కన్నా సహజసిద్ధమైన చిట్కాలే బాగా పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో అలోవెరా జెల్ ముందుంటుంది. ఎందుకంటే, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మెరిపించడంలో తోడ్పడతాయి.
ముఖ్యంగా దురద, చర్మం పొడి బారడం లాంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్ ని తగ్గించడంలోనూ సహకరిస్తాయి. ఇందుకోసం అలోవెరా జెల్‌ని నేరుగా మోచేతులు, మోకాళ్లపై ఎక్కడైతే నలుపుదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసి కనీసం అరగంట టు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలకు బాగా తేమ అంది, నల్లబడిన స్కిన్ టోన్ మారుతుంది. నలుపు సమస్య ఇక రానే రాదు.
కురులకు ఆముదం, రోజ్‌మేరీ ఆయిల్
రకరకాల కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఆడ, మగ తేడా లేకుండా అందరికీ జుట్టు సమస్యలు ఎక్కువ అయి΄ోతున్నాయి. అలాంటి వాళ్లు కొబ్బరినూనెలో ఆముదం, రోజ్‌మేరీ ఆయిల్ రెండూ కలిపి రాయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.
అంతేకాకుండా, జుట్టుకి పోషణ అంది జుట్టు రాలి΄ోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఇందులో ఒక్కో నూనెలో ఒక్కో పోషకం ఉంటుంది. ఇవి జుట్టుకి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. జుట్టు చిట్లడం, డ్రై హెయిర్ వంటి సమస్యలుంటే మీరు కొబ్బరినూనె మాత్రమే కాకుండా కొబ్బరినూనెలో కొద్దిగా రోజ్‌మేరీ ఆయిల్, ఆముదం కలిపి రాసి చూడండి. మీకే తేడా తెలుస్తుంది.
(చదవండి: ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!)