
చాలామంది ఆడవారు తన చర్మానికి లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ మచ్చలు లేని మృదువైన చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వయసు పెరిగే కొద్ది ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చినా, ఎన్ని తాత్కాలిక చిట్కాలు పాటించినా కాంతిమంతమైన, మృదువైన చర్మం కావాలంటే టెక్నాలజీని నమ్ముకోవాల్సిందే! అందులో భాగమే ఈ గాడ్జెట్! దీని పేరు ‘ఆర్ అండ్ ఎఫ్ స్కిన్ టైటెనింగ్ రిజువనేషన్ మెషిన్!’
ఈ చిత్రంలోని రింకిల్ రిమూవల్ మెషిన్‌తో ముడతలను తొలగించుకోవడంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. డబుల్ చిన్, ఐ బ్యాగ్స్ వంటి వయసుతో వచ్చే ఎన్నో సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ స్కిన్ కేర్ డివైస్‌తో ట్రీట్‌మెంట్ పొందితే వయసును దాచేయవచ్చు. యవ్వనంగా కనిపించొచ్చు.
స్మూత్ రింకిల్స్, లిఫ్ట్ ఐ కాంటౌర్, కాంపాక్ట్ పోర్స్, వి–షేప్డ్ ఫేస్, సబ్‌ట్రాక్టివ్ డబుల్ చిన్, గో ఐ బ్యాగ్స్ అండ్ డార్క్ సర్కిల్స్, రోజీ ఫేస్ కలర్ వంటి 11 ఆప్షన్స్ ఈ డివైస్‌లో ఉంటాయి. అందుకు తగ్గ హెడ్స్ కూడా లభిస్తాయి. వాటిని వినియోగించుకుని చర్మాన్ని నిగనిగలాడేలా మార్చుకోవచ్చు. దీని ధర సుమారుగా 110 డాలర్లు. అంటే 9,634 రూపాయలన్న మాట! ఇందులో అదనపు టెక్నాలజీని బట్టి ఆప్షన్స్‌ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.
సౌందర్య చికిత్స..
మెరుగైన చర్మ సౌందర్యానికి ఎక్స్‌ఫోలియేషన్ చికిత్స చక్కని మార్గం. ఈ చికిత్స ముఖ్యమైన ప్రక్రియ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడమే! ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను, మురికిని తొలగించి, కొత్త చర్మ కణాలు పునరుజ్జీవం పొందేందుకు దోహదపడుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌తో చర్మం మరింత కాంతిమంతంగా, మృదువుగా మారుతుంది. అయితే ఈ ట్రీట్‌మెంట్‌లో రెండు రకాలున్నాయి.
ఒకటి ఫిజికల్ ఎక్స్‌ఫోలియేషన్! ఇందులో స్క్రబ్‌లు, బ్రష్‌లు లేదా గ్లోవ్స్ వంటి వాటిని ఉపయోగించి చర్మాన్ని బాగా రుద్దుతారు. ఈ పద్ధతి సాధారణంగా ఇంట్లోనే చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఓట్ మీల్ లేదా షుగర్ స్క్రబ్‌లను ఉపయోగించవచ్చు.
ఇక రెండవ రకం కెమికల్ ఎక్స్‌ఫోలియేషన్! ఈ పద్ధతిలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వంటి రసాయన పీలింగ్‌లను ఉపయోగిస్తారు. వీటివల్ల మృతకణాలు, జిడ్డు వంటి సమస్యలు సులభంగా తొలగిపోయి, ప్రత్యేకమైన కాంతి వస్తుంది. ఈ ట్రీట్‌మెంట్లను సాధారణంగా నిపుణుల పర్యవేక్షణలో పొందడమే ఉత్తమం.
(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!)