అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌..! | Actress Sneha Loves These Fashion Brands | Sakshi
Sakshi News home page

అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌..!

Aug 24 2025 10:52 AM | Updated on Aug 24 2025 11:09 AM

Actress Sneha Loves These Fashion Brands

స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్‌ కాంచీపురం నుంచి మోనోటోన్‌ బనారసీ, ఫ్లోరల్‌ నుంచి బ్రోకేడ్‌ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్‌ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.

ఆభరణాల పండుగ! 
పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్‌ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్‌. 

ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్‌ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్‌ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్‌ మోటిఫ్స్‌తో వచ్చే టెంపుల్‌ హారాలకు బాగా డిమాండ్‌ ఉంది.

చీర బ్రాండ్‌:  స్నేహాలయ సిల్క్స్‌, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్‌ : ఇతిహాస జ్యూలర్స్‌ 
ధర: ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

(చదవండి: డ్రెస్‌ స్టైల్‌నూ మార్చేయచ్చు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement