
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఇక బ్యాక్ బెంచ్‌లు కనిపించవు. ‘యూ’ఆకారంలో బెంచీలను అమర్చి వినూత్నంగా విద్యాబోధన చేపట్టేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఇటీవల వినేశ్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా ‘స్థానార్థి శ్రీకుట్టన్’ క్లైమాక్స్’ సీన్ స్ఫూర్తితో తొలుత ప్రయోగాత్మకంగా కేరళలోని కొల్లం జిల్లాలోని రామవిలాసం ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో అక్కడి అధికారులు ఈ
విధానాన్ని ప్రారంభించారు. అయితే..
ఈ విధానం సత్ఫలితాలిచి్చనట్లుగా అధికారులు గుర్తించారు. కేరళతోపాటు ఒడిశా, పంజాబ్, తమిళనాడుల్లోని పలు పాఠశాలల తరగతి గదుల్లో కూడా విజయవంతంగా యూ ఆకారపు బెంచీల అమరిక విధానం అమలవుతున్న తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సికింద్రాబాద్ బోయనపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఒక తరగతి గదిలోని బెంచీ లను ‘యూ’ఆకారంలో ఏర్పాటు చేయించారు. మధ్యలో టీచర్ నిలబడి పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో కూడా ముచ్చటించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అన్ని సర్కారు పాఠశాలలో యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి విద్యాబోధన జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
సంప్రదాయ పద్ధతికి భిన్నంగా..
సాధారణంగా బ్యాక్ బెంచ్ అనే పదం వినగానే సరిగ్గా చదవని పిల్లలు అందులో కూర్చుంటారన్న భావన అందరి మదిని తడుతుంది. అయితే వెనుక బెంచీల్లో ఉన్న విద్యార్థులు తక్కువ శ్రద్ధ, ముందు భాగంలో ఉన్నవారు ఎక్కువ శ్రద్ధ కనబర్చడంతోపాటు పాఠ్యాంశాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో కూడా వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు. యూ టైప్ సిట్టింగ్‌లో టీచర్ సందేహాలను నివృత్తిలో వ్యక్తిగత శ్రద్ధ సాధ్యమవుతోందనే అంచనా అధికారుల్లో ఉంది. ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, అభ్యాస ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుందని భావిస్తున్నారు. ఇది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులందరూ ఒకే స్థాయిలో అభ్యసన ప్రక్రియలో పాలుపంచుకోవడానికి అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇంటరాక్టివ్ లెర్నింగ్..
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వృత్తాకార, సెమీ–వృత్తాకార తరగతి గది అమరికలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా ఇంటరాక్టివ్ లెరి్నంగ్‌కు ప్రాధాన్యతనిచ్చే విద్యాసంస్థల్లో అమలులో ఉన్నాయి. ఫిన్‌లాండ్ వంటి దేశాలు విద్యార్థుల మధ్య పరస్పర చర్చలను ప్రోత్సహించడానికి ఇలాంటి అమరికలను ఉపయోగిస్తాయి. యూ–టైప్ అమరిక అనేది కేవలం కూర్చునే విధానాన్ని మార్చడం మాత్రమే కాకుండా, సమగ్రమైన సమానమైన విద్యావ్యవస్థను రూపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అధికారులు భావిస్తున్నారు.
యూ టైప్ సిట్టింగ్‌తో సత్ఫలితాలు
ప్రభుత్వ పాఠశాలల్లో యూ టైప్ సిట్టింగ్ విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు రావచ్చని భావిస్తున్నాం. సంప్రదాయ తరగతి గది సిట్టింగ్‌ను మార్చడం ద్వారా బ్యాక్ బెంచర్ సంస్కృతికి చెక్ పడుతోంది. యూ ఆకారం సిట్టింగ్ అమరిక విద్యార్థుల్లో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. చదువుపట్ల మరింత ఆసక్తి పెంపోందిస్తోంది. ఉపాధ్యాయులు స్పష్టమైన సూచనలు ఇవ్వడానికి, విద్యార్థులు సులభంగా వినడం, ఆచరించడం, చర్చల్లో మెరుగ్గా సంభాíÙంచడానికి ఎంతో దోహడపడుతోంది.
:::హరిచందన దాసరి, హైదరాబాద్ కలెక్టర్
మరింత ఇంటరాక్షన్ పెరుగుతుంది
తరగతి గదిలో యూ ఆకారంలో సిట్టింగ్ ఉపాధ్యాయులు– విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్‌ను పెంచుతుంది. తరగతి గదిలో సాధారణంగా టీచర్‌తో మాట్లాడటానికి ఇష్టపడని విద్యార్థులు ఈ తరహా సిట్టింగ్‌తో చురుగ్గా సంభావిస్తారు. తరగతి గదిలో విద్యార్థులందరూ ఏం చేస్తున్నారో టీచర్ సులువుగా గమనించవచ్చు.
:::ఆర్.రోహిణి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి
విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది
తరగతి గదిలో సరికొత్త యూ–టైప్ సిట్టింగ్‌తో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది. టీచర్ల దృష్టి విద్యార్థులందరిపైనా ఉంటుంది. ప్రతి విద్యార్థి క్రమశిక్షణగా పాఠాలు వినక తప్పదు. విద్యార్థులు యూ టైప్ సిట్టింగ్‌పై ఆసక్తి కనబర్చుతున్నారు.
:::డాక్టర్ విశ్వనాథ గుప్త్త, జీహెచ్‌ఎం, నాంపల్లి