హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తమ విజన్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమ్మిటకు వందలాది మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నాయన్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోరుకునేవారంతా ఇందులో పాల్గొనాలని మల్లు సూచించారు. ‘
‘6 ఖండాలు 44 దేశాలు 154 మంది ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన ఎకనమిక్ సమ్మిట్ ఇది. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగకరం. డిసెంబర్ 8న 1.30 గంటలకు ప్రారంభం అవుతుంది. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు’ అని భట్టి తెలిపారు.
8న 2.30కి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మొదటి రోజు 8న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, కర్ణాటక డిప్యూటీ సిఎం డీ కె శివ కుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు.
ఏర్పాట్లపై సీఎం రేవంత్ ఆరా..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే అతిథులు, డెలిగేట్స్‌కు కల్పించే సదుపాయాలతో పాటు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై అధికారులను అరా తీశారు సీఎం రేవంత్.


