breaking news
Back Bench Student
-
ఇక తెలంగాణ సర్కారు బడుల్లో నో బ్యాక్ బెంచ్!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఇక బ్యాక్ బెంచ్‌లు కనిపించవు. ‘యూ’ఆకారంలో బెంచీలను అమర్చి వినూత్నంగా విద్యాబోధన చేపట్టేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఇటీవల వినేశ్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా ‘స్థానార్థి శ్రీకుట్టన్’ క్లైమాక్స్’ సీన్ స్ఫూర్తితో తొలుత ప్రయోగాత్మకంగా కేరళలోని కొల్లం జిల్లాలోని రామవిలాసం ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అక్కడి అధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ విధానం సత్ఫలితాలిచి్చనట్లుగా అధికారులు గుర్తించారు. కేరళతోపాటు ఒడిశా, పంజాబ్, తమిళనాడుల్లోని పలు పాఠశాలల తరగతి గదుల్లో కూడా విజయవంతంగా యూ ఆకారపు బెంచీల అమరిక విధానం అమలవుతున్న తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సికింద్రాబాద్ బోయనపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఒక తరగతి గదిలోని బెంచీ లను ‘యూ’ఆకారంలో ఏర్పాటు చేయించారు. మధ్యలో టీచర్ నిలబడి పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో కూడా ముచ్చటించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అన్ని సర్కారు పాఠశాలలో యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి విద్యాబోధన జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా.. సాధారణంగా బ్యాక్ బెంచ్ అనే పదం వినగానే సరిగ్గా చదవని పిల్లలు అందులో కూర్చుంటారన్న భావన అందరి మదిని తడుతుంది. అయితే వెనుక బెంచీల్లో ఉన్న విద్యార్థులు తక్కువ శ్రద్ధ, ముందు భాగంలో ఉన్నవారు ఎక్కువ శ్రద్ధ కనబర్చడంతోపాటు పాఠ్యాంశాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో కూడా వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు. యూ టైప్ సిట్టింగ్‌లో టీచర్ సందేహాలను నివృత్తిలో వ్యక్తిగత శ్రద్ధ సాధ్యమవుతోందనే అంచనా అధికారుల్లో ఉంది. ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, అభ్యాస ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుందని భావిస్తున్నారు. ఇది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులందరూ ఒకే స్థాయిలో అభ్యసన ప్రక్రియలో పాలుపంచుకోవడానికి అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్..ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వృత్తాకార, సెమీ–వృత్తాకార తరగతి గది అమరికలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా ఇంటరాక్టివ్ లెరి్నంగ్కు ప్రాధాన్యతనిచ్చే విద్యాసంస్థల్లో అమలులో ఉన్నాయి. ఫిన్లాండ్ వంటి దేశాలు విద్యార్థుల మధ్య పరస్పర చర్చలను ప్రోత్సహించడానికి ఇలాంటి అమరికలను ఉపయోగిస్తాయి. యూ–టైప్ అమరిక అనేది కేవలం కూర్చునే విధానాన్ని మార్చడం మాత్రమే కాకుండా, సమగ్రమైన సమానమైన విద్యావ్యవస్థను రూపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అధికారులు భావిస్తున్నారు. యూ టైప్ సిట్టింగ్‌తో సత్ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో యూ టైప్ సిట్టింగ్ విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు రావచ్చని భావిస్తున్నాం. సంప్రదాయ తరగతి గది సిట్టింగ్‌ను మార్చడం ద్వారా బ్యాక్ బెంచర్ సంస్కృతికి చెక్ పడుతోంది. యూ ఆకారం సిట్టింగ్ అమరిక విద్యార్థుల్లో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. చదువుపట్ల మరింత ఆసక్తి పెంపోందిస్తోంది. ఉపాధ్యాయులు స్పష్టమైన సూచనలు ఇవ్వడానికి, విద్యార్థులు సులభంగా వినడం, ఆచరించడం, చర్చల్లో మెరుగ్గా సంభాíÙంచడానికి ఎంతో దోహడపడుతోంది. :::హరిచందన దాసరి, హైదరాబాద్ కలెక్టర్ మరింత ఇంటరాక్షన్ పెరుగుతుంది తరగతి గదిలో యూ ఆకారంలో సిట్టింగ్ ఉపాధ్యాయులు– విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్‌ను పెంచుతుంది. తరగతి గదిలో సాధారణంగా టీచర్‌తో మాట్లాడటానికి ఇష్టపడని విద్యార్థులు ఈ తరహా సిట్టింగ్‌తో చురుగ్గా సంభావిస్తారు. తరగతి గదిలో విద్యార్థులందరూ ఏం చేస్తున్నారో టీచర్ సులువుగా గమనించవచ్చు. :::ఆర్.రోహిణి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారివిద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది తరగతి గదిలో సరికొత్త యూ–టైప్ సిట్టింగ్‌తో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది. టీచర్ల దృష్టి విద్యార్థులందరిపైనా ఉంటుంది. ప్రతి విద్యార్థి క్రమశిక్షణగా పాఠాలు వినక తప్పదు. విద్యార్థులు యూ టైప్ సిట్టింగ్‌పై ఆసక్తి కనబర్చుతున్నారు. :::డాక్టర్ విశ్వనాథ గుప్త్త, జీహెచ్ఎం, నాంపల్లి -
ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..
క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్బెంచ్లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్బెంచ్లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి. సెకండరీ హయ్యర్స్కూల్కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఎందుకు?ఆ సినిమా కథ ఏమిటి?కె.ఆర్.నారాయణన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్ సి సెక్షన్లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్’. శ్రీకుట్టన్ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లంతా అల్లరి గ్యాంగ్ అని క్లాస్‌లో ఫ్రంట్ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్ స్కూల్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.1996లో కేంద్రం చెప్పినా...క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. (చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు! ) -
రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్
Actress Archana Kavi Alleges Rude Behaviour by Kochi Police: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ మలయాళ నటి అర్చనా కవి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ప్రస్తుతం సదరు కానిస్టేబుల్‌ను అంతర్గతంగా విచారిస్తున్నట్లు కొచ్చి డీసీపీ వెల్లడించారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్‌తో కలిస బయటకు వెళ్లి వస్తుండగా కానిస్టేబుల్ వల్ల తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. ఈ సంఘటన తనని ఎంతో బాధించిందని, ఆభద్రత భావానికి లోనయ్యానంటూ వాపోయింది. ఈ మేరకు ఆమె ‘‘నేను, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె ఇద్దరు పిల్లలు కలిసి ఆదివారం సరదాగా బయటకు వెళ్లాం. చదవండి: జీవితాన్ని.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్ తర్వాత అని చెప్పాలి: నటి ఆటోలో రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాం. ఈ క్రమంలో పెట్రోలింగ్‌లో భాగంగా కొచ్చి పోలీసులు మేం వస్తున్న ఆటోను ఆపారు. అనంతరం ‘ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వస్తున్నారని, ఈ పిల్లలు ఎవరూ.. ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు’ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి వేధించారు. మేం ఇంటికి వెళుతున్నామని అని చెప్పిన వినిపించుకోలేదు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ మమ్మల్ని నమ్మడానికి కూడా రెడీగా లేరు. దీంతో మమ్మల్ని ఇబ్బందికర ప్రశ్నలతో వేధించారు. ఈ ఘటన నన్ను ఎంతో వేధించింది’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సంఘటనపై తాను పోలీసులను నిందించడం లేదని, వారి డ్యూటి వారు చేశారంది. చదవండి: ముంబై గ్రాండ్ పార్టీకి విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం? అయితే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనిపై కొచ్చి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నమన్నారు. సినీనటి, పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరి వాదనలు విన్నామని, రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. వారిని ఆపి ప్రశ్నించారన్నారు. ఆ సమయంలో నటి తన ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల కానిస్టేబుల్ ఆమెను గుర్తు పట్టేలేదని చెప్పారు. ఆ పరిస్థితుల్లో నటి అయినా, సాధారణ మహిళ అయినా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదన్నారు. చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పెట్రోలింగ్‌లో భాగంగా వారి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారన్నారు. అయితే ఇద్దరు వెర్షన్లు విన్నాక నటి ఈ ఘటన వల్ల ఇబ్బంది పడ్డారని, అభద్రత భావానికి లోనయ్యారని అర్థమైందన్నారు. సెక్యూరిటి, భద్రత ఇవ్వాల్సిన అధికారే వారిని ఇబ్బంది పడేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో కావాలంటే సదరు కానిస్టేబుల్‌కు సమాన్లు ఇస్తామన్నారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు. కాగా నటి అర్చనా కవి మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె బ్యాక్ బెంచ్ స్టూడెంట్ హీరోయిన్గా నటించింది. -
ప్రేయసిని వివాహమాడిన హీరో
చెన్నై : బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3 ఫేమ్ మహత్ రాఘవేంద్ర ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్ ప్రాచీ మిశ్రాతో మహత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రైవేటుగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, పెళ్లి మూడు రోజుల క్రితం మహత్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అందులో ప్రాచీతో తన జర్నీని వివరించాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాతో మహత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. తమిళ ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు. -
ఆ క్రికెటర్ కథతో సినిమా తీస్తా!
‘‘మూస ధోరణిలో ఉన్న కథలు నాకిష్టం ఉండదు. అందుకే కొత్త కథలతో సినిమాలు తీస్తుంటాను. నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరికేంతవరకూ అన్వేషిస్తాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. దర్శకునిగా స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి వినూత్న కథలు తెరకెక్కించిన శ్రీధర్ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ చెబుతూ - ‘‘ఓ క్రికెటర్, ఓ నటి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. పీబీ మంజునాథ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ‘‘ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఇంటర్నెట్ ఎలా మార్చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఈ ఐదేళ్లల్లో ప్రేక్షకులు ఇలాంటి బోల్డ్ చిత్రాన్ని చూసి ఉండరు’’ అని శ్రీధర్ చెప్పారు. -
అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్
‘‘హిందీ రంగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ తదితరులు దర్శకులుగా కొనసాగుతూనే ఇతర దర్శకులతో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వారి బాటలో మనం ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మాయ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహ గీతం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మంచి కథ కుదిరితేనే దర్శకునిగా చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో నీలకంఠ చెప్పిన ‘మాయ’ కథ నచ్చి, నిర్మించాను. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ఉంటుంది. రషెస్ చూడక ముందు ఏ, బి సెంటర్స్‌కే పరిమితం అవుతుందన్నవారు, సినిమా చూసిన తర్వాత ‘సి’ సెంటర్స్‌లో కూడా ఆడుతుందన్నారు. ఎమ్మెస్ రాజు, విజయేంద్రప్రసాద్, బోయపాటి శ్రీను రషెస్ చూసి, ‘తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయి’ అన్నారు. అతీంద్రయ దృష్టి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. క్రికెటర్ శ్రీశాంత్ స్ఫూర్తితో ‘సచిన్’, హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ ఆధారంగా ‘దానకర్ణ’ చిత్రాలు చేయబోతున్నాన’’ని ఆయన తెలిపారు.