
హైదరాబాద్: ప్రతీ ప్రభుత్వ పారశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ‘ పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి.
తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించండి. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించండి
సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించండి. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయండి విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.