బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి | The victim's family to protect | Sakshi
Sakshi News home page

బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి

Mar 3 2016 2:27 AM | Updated on Sep 3 2017 6:51 PM

బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి

బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి

చల్లూరు సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు ............

వీణవంక: చల్లూరు సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడీ సుదర్శన్, బాలలహక్కుల ప్రజాధ్వని జిల్లా అధ్యక్షురాలు శోభారాణి డిమాండ్‌చేశారు. చల్లూరులో బాధితురాలిని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిందితుల్లో ఇద్దరు మైనర్లు అని పోలీసులు ప్రకటించడంలో అనుమానాలున్నాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారి వెంట చిట్యాల సంపత్ ఉన్నారు.

 ఎస్సైని ఉద్యోగం నుంచి తొలగించాలి
దళిత యువతి అత్యాచార ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని ఉద్యోగం నుంచి తొలిగించాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్ డిమాండ్‌చేశారు. చల్లూరులో బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలికి షరతులు లేకుండా ఎస్సై ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాలని  కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement