‘అర్హత లేకున్నా వారసత్వ రాజకీయాలు..’

venkaiah Naidu Says Governments do not care about projects - Sakshi

సాక్షి, నెల్లూరు: ప్రభుత్వం ప్రాజెక్టులపై శ్రద్ధపెట్టడం లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలు రైతులకు అందుతాయని ఆయన అన్నారు. ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో బుధవారం మాట్లాడారు. 

కొందరు రాజకీయ నాయకులు తమ సంతానాన్ని అర్హత లేకున్నా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లభించటం లేదని చెప్పారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కూడా పాల్గొన్నారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో.. ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top