సాక్షి,అమరావతి: చంద్రబాబు చేస్తున్న అప్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ‘చంద్రబాబు ప్రతినెలా చేస్తున్న అప్పులు సీఎం కట్టాలా? మంత్రులు కట్టాలా? ఆర్ధిక శాఖ కట్టాలా?.ఈ అప్పులన్నీ ప్రజలే కట్టాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి. విద్య,వైద్యం ఉచితంగా అందించాలి. నిరుపేదలకు మాత్రమే ఉచిత బస్సు సదుపాయం కల్పించాలి. మిగిలిన వారికి రద్దు చేయాలి’అని పిలుపు నిచ్చారు.


