సీఎం చంద్రబాబు మరో అపచారం | Chandrababu's Another Blunder In Vinukonda Sabha | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు మరో అపచారం

Feb 21 2026 7:06 PM | Updated on Feb 21 2026 8:58 PM

Chandrababu's Another Blunder In Vinukonda Sabha

గుంటూరు: దేవుని ప్రతిమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాళ్లకు బూట్లు ఉండగానే తీసుకోవడంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. వినుకొండ ప్రభుత్వ సభలో చంద్రబాబు నాయుడు.. చీఫ్‌ విప్‌ ఆంజనేయుల చేతుల మీదుగా వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందుకున్నారు. ఆ సమయం‍లో చంద్రబాబు కాళ్లకు బూట్లు ఉండటం విమర్శలకు దారి తీసింది. 

సాధారణంగా దేవుడి ప్రతిమలను తీసుకునేటప్పుడు కాళ్లకు చెప్పులు, బూట్లు వంటి ఉంటే వాటిని తీసేయడం జరుగుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు ఇలా బూట్లు ఉండగానే దేవుని ప్రతిమను అందుకోవడం మరొకసారి చర్చనీయాంశమైంది. ఇది వినుకొండ సభ సాక్షిగా జరిగింది. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు మళ్లీ పాత పాట పాడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇది చోటు చేసుకుంది.  అయితే సెక్యూరిటీ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆంజనేయులు తమ కాళ్లకు ఉన్న బూట్లను తీసేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement