ఓట్లు ఎలా లెక్కకట్టారో.. ఫలితం ఎలా ప్రకటిస్తున్నారో తెలీదు: పరకాల | Parakala Prabhakar On Doubts Of Votes Counting | Sakshi
Sakshi News home page

ఓట్లు ఎలా లెక్కకట్టారో.. ఫలితం ఎలా ప్రకటిస్తున్నారో తెలీదు: పరకాల

Feb 21 2026 9:30 PM | Updated on Feb 21 2026 9:50 PM

Parakala Prabhakar On Doubts Of Votes Counting

కడప:  దేశంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేదన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్త డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌. ఈ నూతన భారతదేశంలో 20 సెక్లనకి ఒక ఓటు పడుతుందని, మరి అటువంటి అర్థరాత్రి ఒక బూత్‌లో 2 గంటల్లో 490 ఓట్లు పడ్డాయని పునరుద్ఘాటించారు. ‘కూలిపోతున్న ప్రజాస్వామ్యం’  అనే అంశంపై కడపలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఓట్లను ఎలా లెక్కకట్టారో, ఫలితాలు ఎలా ప్రకటిస్తున్నారో తెలియడం లేదన్నారు. 

‘2024 లోక్ సభ ఎన్నికల్లో జూన్ 1న 7వ విడత పోలింగ్ జరిగి.. 4వ తేదీ లెక్కింపు జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పారు..ఇదే ఇప్పటి మన ప్రజాస్వామ్యం. ప్రజలకు మతం అనే మత్తు మందు ఇచ్చిన తర్వాత ఏమి చేసినా కనపడదు. దయచేసి అలవాటు పడకండి...ప్రశ్నించండి.. సహిస్తూ పోతే ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మీరు వేసిన ఓటు వేసిన వారికి పడిందో లేదో గ్యారంటీ లేదు. అవి సక్రమంగా లెక్కిస్తున్నారనే గ్యారంటీ లేదు’ అని స్పష్టం చేశారు. 

ఏపీలో అర్థరాత్రి ఓట్ల మిస్టరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement