కార్మిక హక్కులు కాలరాస్తే ఖబడ్దార్ | C ITU government leaders warning | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులు కాలరాస్తే ఖబడ్దార్

May 23 2016 3:59 AM | Updated on Sep 4 2017 12:41 AM

కార్మిక హక్కులు   కాలరాస్తే ఖబడ్దార్

కార్మిక హక్కులు కాలరాస్తే ఖబడ్దార్

కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం .......

ప్రభుత్వానికి సీఐటీయూ నేతల హెచ్చరిక
ముగిసిన జిల్లా మహా సభలు
 

ఆదోని: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా 10వ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న పలు అంశాలపై చ ర్చించారు. మొదటి రోజు స్థానిక మున్సిపల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అజయ్‌కుమార్, పట్టుభద్రుల ఎమ్మెల్సీ గేయానంద్, సీఐటీయూకు మద్దతుగా ఉన్న పలు కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్రస్థాయిలో దుయ్య బట్టారు.

రెండో రోజు ఆదివారం ఇంటర్‌నేషనల్ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు జెండా ఆవిష్కరించి సభనుప్రారంభించారు. ఇటీవలే మృతి చెందిన యూనియన్ సీనియర్ నాయకుడు పర్శ సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. సభ ప్రాంగణానికి ఆయన పేరు పెట్టారు. కార్మిక సమస్యలు, వాటి పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కార్మిక ప్రతినిధు లు చర్చించారు. 

భవిష్యత్ కార్యాచరణపై 8 తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సీఐటీయూ ప్రకటించింది. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూ ర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి రా ధాకృష్ణ, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర న్న, మహానంద రెడ్డి, నాయకులు తిప్పన్న  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement