జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంతుపట్టని నాడి
నియోజకవర్గంలో సుమారు 15 వేల మంది ఓటర్లు
ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలతో సతమతం
అసంతృప్తి ఎవరికీ నష్టం కలిగిస్తోందోనని అభ్యర్థుల్లో గుబులు
ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల తంటాలు
బంజారాహిల్స్: ఈనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ కార్మికుల ఓటు ఎటువైపు అన్నది అంతుపట్టకుండా ఉన్నది. పార్టీలు తీసిన లెక్కల ప్రకారం నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న సినీ కారి్మకులు సుమారుగా 15 వేలు ఉండగా ఇందులో 12 వేల మంది ఓటు వేసే అవకాశం ఉన్నది. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కార్మికుల నాడి మాత్రం పట్టుకోలేకపోతున్నారు. దివంగత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉండేది. ఆయన 3 సినిమాలు కూడా నిర్మించి వారి ఆదరణ చూరగొన్నారు. మొన్నటివరకు సినీ కారి్మకులు బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని నిఘా వర్గాల నివేదికల నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు.
ఇటీవల ఆయన సినీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రధాన డిమాండ్ హెల్త్‌కార్డుల విషయంలో హామీనివ్వడంతో ఏళ్ల కల సీఎం ద్వారా నెరవేరబోతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెల్లగా కార్మిక లోకంలో చర్చ మొదలైంది. అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ వారు సినీ కారి్మకుల మద్దతు తమకంటే తమకంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పుడు ఆయనకు సినీ పరిశ్రమతో సంబంధాలు మెరుగ్గా ఉండేవి. ఇప్పటికీ కొనసాగుతుండడంతో వారి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఇలా ప్రధాన పారీ్టలకు సినీ కార్మికులతో సంబంధాలు ఉండడంతో వీరు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వీరి అంతరంగాన్ని పట్టుకోవడంలో ఈ మూడు పార్టీలు తలమనకలయ్యాయి. ఇదిలాఉంటే కొన్నిచోట్ల కార్మికులు తమ ఇండ్ల విషయంలో అభ్యర్థులను నిలదీస్తున్నారు. చాలామంది కార్మికులు నియోజకవర్గ పరిధి కిందికి వచ్చే యూసుఫ్‌గూడ, వెంకటగిరి, బోరబండ, రహమత్‌నగర్, శ్రీకృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో అద్దె ఇండ్లలోనే ఉంటున్నారు. వీరి నివాసాల కోసం చిత్రపురికాలనీలో స్థలాలు కేటాయించినా అర్హులైన కార్మికులకు దక్కలేదు. దీంతో వీరంతా మూడు దశాబ్దాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వాలు సినీ కారి్మకులకు సొంతింటి విషయంలో న్యాయం చేయలేదనే చెప్పాలి. వీరికి కేటాయించిన ఇండ్లను అనర్హులకు విక్రయించిన సినీ పెద్దలపై పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి.
వేతనాల పెంపు 15 శాతమే..
సినీ కారి్మకులకు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలని నిబంధన ఉంది. అయితే గత జూన్‌లో వేతనాలు పెంచకుండా సినీపెద్దలు మోకాలడ్డారు. దీంతో కార్మిక లోకం అంతా 30 శాతం వేతనాలు పెంచాలంటూ డ్యూటీలు బంద్ చేయడమే గాకుండా రోడ్డెక్కి గళమెత్తారు. దీంతో స్వయంగా సీఎం జోక్యం చేసుకోవడంతో దిగివచి్చన సినీ పెద్దలు ప్రస్తుతానికి 15 శాతం మాత్రమే వేతనాలు పెంచి ఇస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదనే అసంతృప్తి వారిలో ఉంది. ఇది ఏ పారీ్టపై చూపుతారో వేచి చూడాల్సి ఉంది.
అద్దెలకే సరిపోతున్న వేతనాలు
నియోజకవర్గ పరిధిలోని సినీ కారి్మకులు ఎక్కువగా అద్దెలకు ఉంటున్నారు. నెలలో 18–20 రోజులు మాత్రమే వీరికి షూటింగ్ ఉంటుంది. ప్రొడక్షన్ యూనియన్, లైట్‌మేన్ యూనియన్, మేకప్, సెట్ వర్కర్స్, డ్రైవర్లు, కాస్ట్యూమర్స్, డబ్బింగ్ ఆరి్టస్ట్‌లు, జూనియర్ ఆరి్టస్ట్‌లు, ఏజెంట్లు.. ఇలా ఫిలిం ఫెడరేషన్ పరిధిలో 24 క్రాఫ్టŠస్ ఉంటుండగా వీరందరికీ నెలంతా పని దొరకడం కష్టంగా ఉంది. వచ్చిన వేతనాలు ఇంటి అద్దెలకే సరిపోతున్నాయని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న తమ తలరాతలు మారడం లేదని వాపోతున్నారు. వీరిని దోపిడీ చేస్తున్న నాయకులూ ఉన్నారు. ఆ నాయకులకు వంతపాడుతున్న పారీ్టలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారంతా ఉప ఎన్నికలో తమ ప్రతాపం చూపాలని భావిస్తున్నారు. ఇది ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందో చూడాల్సి ఉంది. అయితే సినీ కారి్మకుల నాడిని పట్టుకోవడం మాత్రం కష్టంగా ఉందని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు.


