breaking news
Jubilee Hills bypoll
-
ఓడిన చోటే గెలిచి చూపిద్దాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ గెలవలేదని, నిరాశ పడొద్దని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌వర్క్ మొదలు పెట్టి విజయం సాధిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓడిన చోటే గెలిచి చూపిద్దామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మె ల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డిసెంబర్‌లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని 407 బూత్‌ల్లో ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున, మొత్తం 4 వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారుపడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణభవన్, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు. – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాట స్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమని చెప్పారు. – రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు. -
రేవంత్ పరపతి పెంచిన జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చే అంశం. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించాడు. గెలుపు ద్వారా పార్టీలో తన పట్టు పెంచుకున్నాడు. రాష్ట్రంలో తనపై వ్యతిరేకత పెరుగుతోందన్న వదంతులు పుంజుకుంటున్న సమయంలో దాన్ని పూర్వపక్షం చేసేందుకు రేవంత్ ఈ ఉప ఎన్నికలను వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘట్టం మొదలైనప్పుడు రాజకీయ వాతావరణం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌లు విస్తృత ప్రచారం చేశారు కూడా. కాంగ్రెస్ తరఫున తొలుత ముగ్గురు.. ఆ తరువాత మరింత మంది మంత్రులు, పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్సహా ఇతర నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఆగలేదు. రేవంత్ స్వయంగా పలు సభలు నిర్వహించారు. ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటి అర సభల్లో పాల్గొనడం కద్దు. కానీ రేవంత్ ఈ రిస్క్ తీసుకోలేదు. ఎప్పటికప్పుడు అన్ని మార్గాల ద్వారా సమాచారం సేకరించుకుని తన వ్యూహాలకు పదును పెట్టుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం అలాంటిదే. మైనార్టీ ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశంతో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ను మంత్రిని చేసేశారు. అంతేకాక ఆ వర్గం బాగా బలంగా ఉన్న చోట మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు మనుగడ అన్న రీతిలో ప్రసంగాలు చేశారు. మజ్లిస్ మద్దతు కూడా కాంగ్రెస్‌కు లాభించింది. రాజీలేకుండా డబ్బులు ఖర్చు చేశారన్న అభిప్రాయమూ సర్వత్రా ఉంది. వీటన్నింటి ఫలితంగా అప్పటివరకూ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న మౌత్ టాక్ కాస్తా చివరి మూడు రోజుల్లో కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా డబ్బు పంపిణీ చేసినా అది అధికార పక్షానికి సరితూగలేదని తెలుస్తోంది. ఈ రోజుల్లో ఎలా గెలిచారన్నది ముఖ్యం కాకుండా పోతోంది. ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం పెరిగిపోతోంది. గెలిచాక మాత్రం ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకోవడం రివాజుగా మారింది. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో తప్ప, మిగిలిన ఉప ఎన్నికలలో విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రచారానికి వచ్చారు. అయినా బీఆర్ఎస్ గెలవగలిగింది. బీజేపీ జూబ్లి హిల్స్ ఉపఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ, జనసేనలు ప్రచారంలో పాల్గొనలేదు. పైగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయినా బీజేపీ నేతలు ప్రశ్నించలేకపోయారు. గత సాధారణ ఎన్నికలవరకు కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగున్నట్లు కనిపించేది కాదు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం, కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం,నాయకులందరిని ఏకం చేయడం తదితర వ్యూహాలతో అధికారంలోకి తేగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా, పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకోగలిగారు.ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విజయం ద్వారా అసమ్మతి ఆలోచన చేసే నేతలు కూడా కిమ్మనే పరిస్థితి ఉండదు. అధిష్టానం వీక్ గా ఉండడం, బీహారులో దారుణమైన పరాజయం చెందడం కూడా రేవంత్ కు కలిసి వచ్చే అంశమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ బీసీ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసిందనాలి. నవీన్‌పై కుటుంబపరంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారం జరిగేలా చేసుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జరిగిన ఈ ఉప ఎన్నికకు సానుభూతి ఉపకరిస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ ఆయన భార్య సునీతను ఎంపిక చేసుకుంది. అయినా అది ఫలించలేదు. కాకపోతే గత లోక్‌సభ ఎన్నికలలో మాదిరి మూడో స్థానంలోకి పడిపోకుండా గట్టిపోటీ ఇవ్వగలగడం, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని కేడర్‌లో కలిగించే విధంగా 74 వేల ఓట్లు సాధించగలిగింది. కాంగ్రెస్ కు 99 వేల ఓట్లు రావడం బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందే అయినా, లోక్ సభ ఎన్నికలతో పోల్చితే బెటర్ పొజిషన్ లోనే ఉన్నాం కదా అన్న భావన కలుగుతుంది. అధతికార దుర్వినియోగంతో కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు. బీజేపీ పరిస్థితి మాత్రం కాస్త గడ్డుగా మారిందనే చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం పరువు తక్కువే. బీహారులో ఎన్డీయే విజయ దుందుభి మోగించిన తరుణంలో జూబ్లిహిల్స్‌లో ఈ రిజల్ట్ రావడం మింగుడుపడని విషయమే. అయితే వచ్చే ఎన్నికలకు హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు కృషి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అది ఏ రూపం దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాగా ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన అంతా సజావుగా ఉందని కాంగ్రెస్ భావిస్తే అది తప్పే అవుతుంది. విజయం సాధించారు కనుక ఆ ఉత్సాహం ఉంటుంది.కాని దాని వెనుక ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఖర్చు చేయాల్సి వచ్చింది వారికే తెలుసు. ఏపీలో 2018 నాటి నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్ధి విజయం కోసం అన్ని వ్యూహాలు అమలు చేశారు. తద్వారా గెలవగలిగారు.కాని ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆ సీటు మళ్లీ వైసీపీ పరమైంది.అన్నిసార్లు అలా జరగాలని లేదు.కాని అలాంటి ఉదాహరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అడుగుజాడలోనే నడిచి ఉప ఎన్నికలో గెలిచారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. ఉప ఎన్నికలో గెలిచినంతమాత్రాన ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులకు, హైడ్రా యాక్టివిటి అంతటికి ప్రజామోదం లభించిందని కూడా అనుకోరాదు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల రేవంత్ పరపతి పెరిగే మాట నిజం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్థానికంపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల తన సోదరి భర్త, హరీశ్‌రావు తండ్రి మరణం నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని కేసీఆర్ ఎర్రవల్లికి ఆహ్వానించినట్లు తెలిసింది. కేటీఆర్ కూడా ఎర్రవల్లికి వెళ్లడంతో ఈ కీలక భేటీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఫలితంపై వివిధ కోణాల్లో చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతను కూడా ఇప్పటి నుంచే ప్రారంభించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాలు, కొత్త తరాన్ని ప్రోత్సహించడం తదితరాలను అభ్యర్థుల ఎంపికలో ప్రామాణికంగా తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. పార్టీకి దూరమైన వర్గాలను గుర్తించి రాబోయే రోజుల్లో ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు తదితరాలు స్థానిక ఎన్నికల షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలని ఆదేశించారు. మరింత లోతుగా అధ్యయనం జూబ్లీహిల్స్ ఫలితాలను బూత్‌ల వారీగా మరింత లోతుగా అధ్యయనం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధత, పార్టీ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో నేతల మోహరింపు, ప్రచారం తీరుతెన్నులు తదితరాలపై సమీక్షించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అనుసరించిన ఎత్తుగడలు, పోలింగ్ వ్యూహం తదితరాలను కేసీఆర్ విశ్లేíÙంచారు.కాంగ్రెస్ అనుసరించిన ప్రలోభాలు, బెదిరింపుల పర్వంతోపాటు అధికార దుర్వినియోగం మూలంగా ఫలితం ఆశించిన రీతిలో రాలేదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వశక్తులూ కేంద్రీకరించడం వల్లే పార్టీ అభ్యర్థికి గణనీయమైన ఓట్లు వచ్చినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నేతలను కేసీఆర్ అభినందించారు. త్వరలో తెలంగాణ భవన్ లేదా ఎర్రవల్లిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
స్థానికోత్సాహం...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి... జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్లో నిర్ణయం: మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు. సిబల్ విందుకు సీఎం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్లో ‘దిల్సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. -
బీఆర్ఎస్ ఓటమి.. అసలేం జరిగింది?
సాక్షి, సిద్దిపేట: జూబ్లీహిల్స్ రూపంలో మరో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలను ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు రప్పించుకున్నారు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావుతో పలువురు సీనియర్లతో శనివారం సాయంత్రం కేసీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై వీళ్లిద్దరితో కేసీఆర్ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందని.. ఓటమికి గల కారణాలపై ఆయన వాళ్ల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. అదే సమయంలో కేటీఆర్, హరీష్‌రావులపై ఆ పార్టీ మాజీ నేత, తనయ అయిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీలో ఈ వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఓటమితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా కేసీఆర్ వాళ్లతో చర్చించారు. వీళ్లద్దరితో పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మాగంటి గోపినాథ్ సతీమణి సునీత 25 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అయితే రౌడీయిజంతో ఈ ఎన్నికలో గెలిచారని.. నైతిక విజయం తనదేనంటూ ఫలితాలు వెలువడ్డాక ఆమె మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో ప్రజలు చూశారని, పోరాటాలు తమ పార్టీకి కొత్త కాదని.. ప్రతిపక్ష పాత్రను మరింత బలంగా పోషించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేస్తామని కేటీఆర్ ఫలితాల అనంతరం మీడియా ద్వారా తెలిపారు. -
జూబ్లీహిల్స్ ఓటమిపై స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ ఫలితాన్ని పట్టించుకోబోమని అన్నారాయన. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయి. చివరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసు. బైపోల్ మాకు కొత్త బలాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే. జూబ్లీహిల్స్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలకు తెలుసు. మాగంటి సునీత చివరి దాకా పోరాటం చేశారు. ఈ ఎన్నిక కోసం మేం కుల, మత రాజకీయాలు చేయలేదు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ అన్నివిధాలా అభివృద్ధి చెందింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. జూబ్లీహిల్స్ ఫలితాలపై మాకు నిరాశ లేదు. బీఆర్ఎస్కు పోరాటాలు కొత్త కాదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా మా పని మేం చేసుకుంటూపోతాం. మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యేదాకా పోరాటం చేస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. -
‘జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం నాదే’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ ఉపఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. రౌడీల కనుసన్నల్లోనే ఈ ఎన్నికలు జరిగాయన్నారు. ఒక ఆడబిడ్డను ఎంత హింసపెట్టాలో అంతా పెట్టారని.. బీఆర్ఎస్ పార్టీకి మద్ధతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సునీత.. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌లు చేయించి, రౌడీయిజంతో గెలిచిందని ఆరోపించారు. పోలింగ్ సెంటర్లోనూ తమపై ర్యాగింగ్ జరిగిందన్నారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ కు మద్ధతివ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజారిటీ వచ్చిందన్నారు. వారిది అడ్డదారిలో గెలిచిన గెలుపన్నారు. ఎలక్షన్ల సందర్భంగా తాను నవ్వినా, ఏడ్చినా తప్పే అన్నట్లు ప్రచారం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. నైతిక విజయం మాత్రం తనదే అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచింది. -
కాంగ్రెస్ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)
-
గాంధీ భవన్లో సంబరాలు.. పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కంటోన్మెంట్ మాదిరిగానే ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు అని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ సానుభూతి, డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి, ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. కంటోన్మెంట్ మాదిరి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు. మహిళల సెంటిమెంట్ వాడుకోవడానికి బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు మాకు అండగా ఉన్నారు.మా ప్రభుత్వం అన్ని అంశాలు క్షేత్ర స్థాయిలో చేరేలా పని చేస్తున్నాం.. ఈ ఫలితం ప్రభుత్వ కార్యక్రమాలకు నిదర్శనం. బీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారం పరిగణనలోకి తీసుకొని మా ప్రభుత్వం మరింత బలంగా పని చేస్తుంది. ఓడిపోతున్నామని అసహనంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు చేసింది.. వాళ్ళే మా పార్టీ కార్యాలయంపై దాడి కి ప్రయత్నం చేశారు. మీ సంగతి చూస్తా అనే మాటలు ఆశ్చర్యం కలిగించింది. పోలీసులు మా నాయకులు అక్కడ ఉండవద్దు అని కేసులు పెట్టారు. వాళ్ళలో అనేక మంది బయట వాళ్ళు ఉన్నారు.. సికింద్రాబాద్ కార్పొరేటర్ అక్కడే ఉండి టీవీలకు బైట్ ఇచ్చారు. వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.. అసహనంతో ఇలా మాట్లాడుతున్నారు.కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారు.. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపిస్తున్నారు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. ముందు నుండి చెప్తున్నట్టు బీజేపీకి 10వేల ఓట్లు కూడా రావు. \కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బీఆర్ఎస్తో కుమ్మక్కు అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కిషన్ రెడ్డి గురు దక్షిణ కింద బీఆర్ఎస్కి సహకరించారు. దీనికి కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సహకరిస్తే మంచిది.. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీసుకి తాళాలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు. -
అభివృద్ధికే జూబ్లీహిల్స్ ఓటర్ల పట్టం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ.. ఎర్లీ ట్రెండ్స్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సాక్షితో స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని శుక్రవారం ఉదయం అన్నారాయన. ‘‘జూబ్లీహిల్స్ ఓటర్లు మూడు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి కాలేదు. అధికారం కోల్పోయి.. ఇప్పుడు సిట్టింగ్ స్థానం కోల్పోతున్నామనే బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వాళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడ చేస్తామనుకుంటున్నారు, వాళ్లు చేసినట్లు మద్యం, డబ్బులు పంచుతామని అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ల పదేళ్ల కాలంలో ఆ కోరికలను కూడా తీర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని అన్నారాయన. -
జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ ఫలితాలు.. అభ్యర్థి మృతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, విషాదఛాయలు అములుకున్నాయి.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అన్వర్ చేశారు. అయితే, ఈరోజు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, వారి కుటంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మహమ్మద్ అన్వర్ ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 42 టేబుల్స్ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఒక్కో రౌండు ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో 14 టేబుళ్లకు బదులు వరుసకు 21 టేబుళ్ల చొప్పున రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 42 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితం వెల్లడయ్యేందుకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి... -
గెలుపు మాదే..! 20 వేల మెజారిటీ పక్కా..!!
-
జూబ్లీహిల్స్ కౌంటింగ్.. వారికే మాత్రమే అనుమతి: ఆర్వీ కర్ణన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఎవరికి అనుమతి ఉండదు అని సూచించారు.జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తాం. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. స్పెషల్ పర్మిషన్తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేశాం. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 186 మంది కౌంటింగ్ సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు RO పరిశీలిస్తారు. LED స్క్రీన్ ద్వారా, EC యాప్ ద్వారా ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తాం. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఎవరికి అనుమతి ఉండదు అని చెప్పుకొచ్చారు.జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ..‘రేపు కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాం. అన్ని విభాగాల పోలీసు బృందాలను అందుబాటులో ఉంచాం. రేపు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. -
జూబ్లీహిల్స్ ఫలితం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు రేపు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మెజార్టీలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు పక్కా ఖాయమైంది. ఫలితాల కోసం రేపటి వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నికలో 20వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. పోలైన ఓట్లలో 70 శాతం ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..పీపుల్స్ పల్స్ -కాంగ్రెస్ 48శాతం, బీఆర్ఎస్-41శాతం, బీజేపీ-6శాతంచాణక్య స్ట్రాటజీస్- కాంగ్రెస్-46శాతం, బీఆర్ఎస్-43శాతం, బీజేపీ-6శాతంహెచ్ఎంఆర్ సర్వే.. కాంగ్రెస్-48.3 శాతం, బీఆర్ఎస్- 43.18శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు -
Jubilee Hills bypoll: ‘జూబ్లీహిల్స్‌లో’ చిత్ర విచిత్రం
హైదరాబాద్: అన్ని ప్రధాన పార్టీలకు హేమాహేమీల్లాంటి నాయకులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించారు. కానీ.. ఓటింగ్ శాతం పెరగకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు, పార్టీల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ 48.49 శాతమే నమోదు కావడానికి కారణాలెన్నో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఏపీలోని బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, మన రాష్ట్ర మంత్రులు, ప్రముఖ నేతలు ప్రచారం చేసినా ఓటింగ్ 50 శాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సుమారు నాలుగు లక్షల ఓటర్లతో ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ శాతం దాదాపుగా 55 శాతానికి పైగా రావచ్చనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంచనాలు వేశాయి. హేమాహేమీల ప్రచారంతో పాటు అన్ని పారీ్టలు గెలుపు ధీమాతో ఓటర్లను ఆకట్టుకోనే ప్రయత్నాలు చేశాయి. కారణాలివీ.. గందరగోళం: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలు అధికం. ఈ ప్రాంతంలో అత్యధికంగా బస్తీలున్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, కాలనీలు ఉన్నాయి. సినిమాలు, టీవీ సీరియళ్లలో పనిచేసే టెక్నీషియన్లు, కూలీలు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు అధికం. కానీ.. ప్రధాన సమస్య ఏమిటంటే.. ఒక కుటుంబంలో 5 ఓట్లుంటే అవి దూర ప్రాంతంలో వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉండటం గమనార్హం. కుటుంబంతో ఇంకొకరు అదనంగా ఓటర్‌గా చేరితే అదే అడ్రస్ ఉన్నా కానీ ఓటు మాత్రం ఎక్కడో వేరేచోట పోలింగ్ బూత్‌లో ఉన్నాయి. ఒక్కోసారి గత అసెంబ్లీలో ఒక బూత్‌లో వేస్తే ఈ ఉప ఎన్నికలకు వచ్చే సరికి మరోచోట ఉండటం సమస్యగా మారింది. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఉద్యోగానికి బయలుదేరి ఓటు వేద్దామని బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ తన ఓటు లేదని.. మరోచోట ఉందని చెప్పడంతో సదరు వ్యక్తి అసహనానికి గురై ఓటు వేయకుండా వెళ్లిపోయిన ఘటనలున్నాయి. చుట్టూ తిరిగి రాలేక: అంతేకాకుండా ఎర్రగడ్డలోని పలు బస్తీల్లోని వ్యక్తుల ఓట్లు వారికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని డాన్‌బాస్కో స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఉండటంతో వారు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. 10 నుంచి 15 బూత్‌ల ఓట్లు ఒకే చోట ఏర్పాటు చేయడం ప్రధాన సమస్యగా మారింది. అదనంగా ఓటర్లు రావడానికి మధ్యలో ఉన్న పోలింగ్ బూత్‌ల దారులు పోలీసులు మూసివేశారు. దీంతో వారు ఆటోలలో రావడానికి చుట్టూ మూడు కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలు ఒక్క ఎర్రగడ్డలోనే కాకుండా అన్ని డివిజన్లలో నెలకొంది. నిరాసక్తత: అపార్ట్‌మెంట్‌వాసులు కూడా ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా, పనుల నిమిత్తం బయట ఉండటంతో మనం ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిరాసక్తత చూపించారు. ఇక్కడి ప్రాంతాల ప్రజలు ఓటు హక్కును పొంది, మరోచోటకు మారుతూ ఉంటున్నారు. అందులో ప్రధానంగా సినీ, చిరు వ్యాపారులు, ఉపాధి అవకశాలకోసం వచ్చే హాస్టల్ విద్యార్థులు, ఇతర రాష్ట్రాల కూలీలు అధికం. ఇలాంటి ఓట్లు కూడా వేలల్లో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా, భారీ ప్రచారాలకు తెరలేపినా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ పెరగకపోవడానికి కారణాలను మరింత లోతుగా ఈసీ విశ్లేషించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బ్లాక్మెయిల్ రాజకీయాలు!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ నేతల వ్యాఖ్యలు చూస్తే రాజకీయాల్లో బ్లాక్‌మెయిలింగ్ ఎంత కీలకమైపోయిందో అర్థమవుతుంది. ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో కాలేజీలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అసలు బ్లాక్‌మెయిలర్ సీఎం అని విమర్శించారు. హరీశ్ ఇంకో అడుగు ముందుకేసి సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించేవారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌లు హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతూ బ్యాడ్ బ్రదర్స్‌గా మారారని రేవంత్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆయా వర్గాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్నంతా దీనికోసమే వాడేస్తున్నారు. చంద్రబాబు అనుంగు శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా అదే బాట పట్టినట్లు కనిపిస్తోంది.తెలంగాణలో ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిల కోసం కాలేజీలు బంద్‌కు దిగాయి. ఒక రోజు బంద్ తర్వాత చర్చలు జరిగి కొంత పలించాయి. ఈలోగానే రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆ కాలేజీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పినా వినకుండా కాలేజీలను బంద్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీల అండ చూసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. కాలేజీల యాజమాన్యాలు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ను నష్టపరచేలా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయంతో సీఎం అంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వైపు ఉన్న లోపాలను కూడా సరి చేసుకుంటామని చెప్పి ఉండాల్సింది. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రభుత్వాలు ఇంత అధ్వాన్నంగా పని చేస్తున్నాయా అన్న భావన కలిగించాయి. విద్య సేవ మాత్రమే అని, వ్యాపారంలా చేస్తూ సహించేది లేదని ఆయన అన్నారు. వ్యాపార తెలివితేటలు చూపిస్తే చట్టప్రకారంగా ముందుకు వెళతానని కూడా రేవంత్ హెచ్చరించారు. భవనాలు, ల్యాబ్‌లు ఫ్యాకల్టీ, విద్యార్థులు ఉన్నారో, లేరో చూడడానికి విజిలెన్స్ అధికారులు వస్తారంటే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి ఎంత మొత్తం డొనేషన్లు వసూలు చేస్తారో తమకు తెలుసునని, వచ్చేసారి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తానని రేవంత్ అన్నారు. ఈ మాటలు వింటే ముఖ్యమంత్రే కాలేజీలను బెదిరిస్తున్నారన్న భావన కలగదా? కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే శక్తి ఎంత ఉంటుందన్నది ఒక ప్రశ్న. సమయం చూసి ఆయా సంఘాల వారు ప్రభుత్వాలను బెదిరించేలా వ్యవహరించడం కొంత వాస్తవమే కావచ్చు. ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతుంటాయి. అవి నెరవేర్చకపోతే సమ్మెలు చేస్తామని కూడా హెచ్చరిస్తుంటాయి. అయితే కాలేజీల డిమాండ్ సహేతుకత ఉందో, లేదో చూడాలి. సుమారు 1200 కాలేజీలకు సుమారు రూ.3600 కోట్లు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వీరి ఆందోళనలు స్పందించిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి చర్చలు జరిపి రూ.300 కోట్లు విడుదలకు అంగీకరించారు. కానీ అందులో రూ.60 కోట్లు మాత్రమే విడుదలైనట్లు సమాచారం. దీంతో కాలేజీలు మళ్లీ బంద్ పిలుపు ఇచ్చాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. ఉప ఎన్నిక సమయంలో ఇది పెద్ద ఇష్యూగా చేయవచ్చని, ప్రభుత్వం దిగి వస్తుందని అనుకుని ఉండవచ్చు. తదుపరి మల్లు భట్టి వీరితో మళ్లీ చర్చలు జరిపి రూ. 900 కోట్లు విడుదల చేస్తామని చెప్పి రాజీపడ్డారు. ఈలోగానే రేవంత్ కాలేజీలపై తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కాలేజీల యాజమాన్యాలపై ఆయన ఆరోపణలు చేసిన తీరులో ప్రభుత్వ బలహీనతలు కూడా బయటపడ్డాయి. కాలేజీలు తగిన మౌలిక సదుపాయాలు లేకుండానే కాలేజీలు నడుపుతున్నట్లు.. ఆ మేరకు ప్రభుత్వంలోని వారిని మేనేజ్ చేస్తున్నట్లు ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. లేదా తమను డబ్బు అడగనంతవరకు ఎలాగోలా చేసుకునివ్వులే అని వదలివేసినట్లే కదా!దీనివల్ల విద్యా ప్రమాణాలు పడిపోయినా, విద్యార్ధులకు సరైన బోధన జరగకపోయినా, ప్రభుత్వం రాజీ పడినట్లే కదా! అధికారులు తమ బాధ్యతలు నిర్వహించడం లేదని వెల్లడైనట్లే కదా! విద్య అన్నది సేవ అని, వ్యాపారం కాదని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని కాలేజీల నిర్వహణకు డబ్బులు అవసరం. రీయంబర్స్మెంట్ హామీలిచ్చిన రాజకీయ పార్టీలు దాన్ని నెరవేర్చకపోతే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. లేదా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. కాలేజీలు డొనేషన్లు వసూలు చేస్తున్నాయని అన్నారు. వచ్చేసారి అలా జరగనివ్వబోమని కాలేజీలను రేవంత్ బెదిరిస్తున్నారా! అసలు డొనేషన్లు ఎలా వసూలు చేస్తున్నారు? వాటిలో రాజకీయ పార్టీల నేతలకు ఎంత మేర వాటాలు ఇస్తున్నారు? వాటిని నియంత్రించవలసిన ప్రభుత్వమే ఇలా మాట్లాడితే వ్యవస్థలో ఉన్న డొల్లతనం తెలిసిపోవడం లేదా?ప్రభుత్వం తన విధులను సక్రమంగా చేయడం లేదని అంగీకరించినట్లే అవుతుంది కదా!యాజమాన్యాల నేత ఆరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగారని సీఎం వెల్లడించారు. వాటిని ఇవ్వనందునే బ్లాక్ మెయిల్‌కు దిగారని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఆరోరా రమేష్ తప్పు చేస్తుంటే చర్య తీసుకోవల్సిన సీఎం ఇలా బేలగా మాట్లాడడం ఏమిటో తెలియదు. కాలేజీలను బంద్ పెట్టిన తర్వాత చర్చించడానికి ఏముంది అని రేవంత్ అన్నప్పటికి, మరో వైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వీరితో సంప్రదింపులు జరిపి రాజీ కుదుర్చుకున్నారు.బహుశా రేవంత్ అనుమతితోనే ఇది జరిగి ఉంటుంది. ఈలోగానే ఆయన ఇన్ని మాటలు మాట్లాడితే పలచన అయ్యేది ఆయన ప్రభుత్వమే కదా!కొద్ది కాలం క్రితం ఏపీలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.3000 కోట్లు రాబట్టుకునేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేశాయి. ప్రభుత్వం ఆసుపత్రుల యజమానులను బెదిరించినట్టుగా వార్తలొచ్చాయి. చివరకు కొంతమేరకు నిధుల విడుదలతో సమ్మె విరమణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీల ఫీ రీయంబర్స్మెంట్ మొత్తం కూడా రూ.4000 కోట్ల వరకూ ఉంది. సకాలంలో చెల్లించకపోవడం వల్ల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై కేసులు పెడుతూ నిత్యం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది. తెలంగాణలో సైతం అదే మాదిరి ప్రభుత్వాన్ని నడపడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి కొంత బెటర్ అయినప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.ఇదే సందర్భంలో రేవంత్ మరికొన్ని విషయాలు చెప్పారు.ప్రభుత్వానికి నెలకు వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు అని, ఇందులో వేతనాలు,పెన్షన్లకు రూ.6500 కోట్లు, కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీతోసహా అసలు కట్టడానికి రూ.6500 కోట్లు పోతే మిగిలేది 5500 కోట్లేనని వెల్లడించారు. ఈ మొత్తంతోనే అభివృద్ది కార్యక్రమాలు, ఫీజ్ రీయంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర స్కీములు అంటూ పెద్ద జాబితానే చదివి వీటిలో దేనిని ఆపాలో,దేనిని అమలు చేయాలో చెప్పాలని ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ చెప్పాలని అనడం వింతగా ఉంటుంది.ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తాయి.ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తామని ఎలా చెప్పగలిగారు?అప్పుడు ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెబితే, సూపర్ సిక్స్ అంటూ ఏపీలో తెలుగుదేశం,జనసేన కూటమి ఊదరగొట్టింది.వంద రోజుల్లో గ్యారంటీలను చట్టబద్దం చేసి, అన్నిటిని అమలు చేసి చూపుతామని పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆ రోజుల్లో ఎలా చెప్పారు?చంద్రబాబు అయితే తనకు సంపద సృష్టించడం తెలుసునని, తద్వారా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేస్తానని ప్రచారం చేశారు.తీరా అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ ఇప్పుడు ఆర్దిక కష్టాల గురించి ఏకరువు పెడుతున్నారు. కేసీఆర్ అప్పుల కుప్ప చేసేశారని రేవంత్ ఆరోపించడం వవల్ల ఉపయోగం ఏమి ఉంటుంది. అవన్ని తెలిసే ఆనాడు మాట్లాడారా?లేదా? చంద్రబాబు నాయుడు సైతం ఖజానా ఖాళీగా కనబడుస్తోందంటూ ప్రజల ముందు మాట్లాడుతున్నారు.రెండు రాష్ట్రాలలోను ప్రస్తుతం ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? ఏపీలో రికార్డుస్థాయిలో అప్పులు చేశారే? ఎదుటివారిపై ఆరోపణలు చేయడానికి ముందు తాము ఏమి చేస్తున్నామో కూడా గమనించాలి కదా!అధికారంలోకి రావడానికి ముందేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అధికారంలోకి వచ్చాక ఇలా వ్యవహరించడం చూస్తే దీనిని బ్లాక్ మెయిలింగ్ అని ప్రతిపక్షాలు విమర్శించవా?అందుకే రేవంత్ పై హరీశ్ రావు ఆరోపణలు గుప్పించారు. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ పరిశ్రమల వారిని, రియల్ ఎస్టేట్ వారిని బ్లాక్ మెయిల్ చేసేవారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాలేజీలు,తదితర వర్గాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ బకాయిలు అడిగితే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఏమిటి అని హరీశ్ ప్రశ్నించారు.కాగా జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయన్నట్టుగా రేవంత్ మాట్లాడడాన్ని కూడా బ్లాక్ మెయిలింగ్ అన్న ప్రచారం జరిగింది. రేవంత్ కూడా ఇలా ప్రసంగం చేసి ఉండాల్సింది కాదు. గతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగితే ఆనాడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు తను వేసిన రోడ్లను వాడుకుంటూ తనకు ఎందుకు ఓటు వేయరని, తను ఇచ్చిన ఇల్లు, తను ఇచ్చిన బాత్ రూమ్ ఉపయోగించుకుంటున్నారని,కనుక తన పార్టీకే ఓటు వేయాలని ప్రజలను హెచ్చరించిన ఘట్టాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.కాగా హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని, కేటీఆర్ ఆరోపిస్తే, హైడ్రా ద్వారా ప్రజలకు మేలు చేస్తుంటే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.ఏది ఏమైనా రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్నికలకు ముందు ఒకరకంగాను, ఆ తర్వాత మరో రకంగాను వ్యవహరించడం మామూలు అయింది.ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు మారుతుందా అన్నది సందేహమే.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సెల్ఫీ తీసుకో.. స్టేటస్ పెట్టుకో..
హైదరాబాద్: ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతీసారి ఎన్నికల అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటు వేసిన అనంతరం ఈ బూత్‌లోకి వచ్చి ఫొటోలు దిగి స్టేటస్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన ఫొటో బూత్‌లో చాలా మంది ఓటర్లు ఫొటోలు దిగి స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీని వల్ల ఓటు వేయని వారు చూసి స్ఫూర్తి పొంది ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.చంటిబిడ్డతో వచ్చి..బంజారాహిల్స్: శ్రీకృష్ణానగర్‌కు చెందిన కీర్తి తన 50 రోజుల చంటి బిడ్డతో వచ్చి కృష్ణానగర్‌లో ఓటు వేసింది. అదేవిధంగా ఇదే బస్తీకి చెందిన ఎనిమిది నెలలు దాటిన గర్భిణి రూప ఓటరు కేంద్రానికి భర్తతో వచ్చి ఓటు వినియోగించుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన వీరికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసి వారికి త్వరగా ఓటు వేసే అవకాశం కలి్పంచారు. -
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకే ప్రజామద్దతు
-
Jubilee Hills bypoll: గెలుపెవరిదో?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఓటరు నాడి ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పక్షాల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార పర్వాన్ని హోరెత్తించినప్పటికీ.. ఓటింగ్ శాతం పెరగలేదు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా పోలింగ్ 50 శాతానికి మించలేదు. అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 14న తేలనుంది. మంగళవారం జరిగిన పోలింగ్‌పై ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ప్రముఖులు, సినీతారలు, ఉన్నత హోదాలోని అధికారులు మాత్రమే ఉదయం తమ ఓటుహక్కు వినియోగించున్నారు. ఆ తర్వాత సాయంత్రం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. సామాన్య ఓటర్లు పెద్దగా గడప దాటలేదు. చివరి గంటలో మాత్రం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సందడి పెరిగింది. మొత్తమ్మీద ప్రతి రెండు గంటలకు పది శాతం చొప్పున పోలింగ్ నమోదవుతూ వచ్చింది. ఆదిలోనే సాంకేతిక సమస్య పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సుమారు 9 నుంచి 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సాంకేతిక సమస్య ఏర్పడింది. తొమ్మిది చోట్ల పాత ఈవీఎంలను మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో ఉదయమే ఓటు వేసేందుకు వెళ్లిన ఉద్యోగులు, పనులకు ఇతరులు ఇబ్బందుల పాలయ్యారు. రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్లు కొరత కారణంగా దివ్యాంగ ఓటర్లు అవస్థలుపడ్డారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలు దూరం ఉండటంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు.యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు అడుగడుగునా చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఆ తర్వాత అరగంట నుంచే ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో యథేచ్ఛగా సంచరించారు. కొందరైతే పోలింగ్ బూత్‌ల ముందే తిష్ట వేశారు. ఓ ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ ముందు నిలబడి తమ పార్టీ అభ్యర్ధి ఫొటో చూపిస్తూ ఓటు వేయాలంటూ కోరారు. కొంతమంది అమాత్యులు సైతం నియోజకవర్గంలో పర్యటించడం, వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. మధ్యాహ్నం 2 నుంచి అధికార, ప్రతిపక్ష పారీ్టలకు చెందిన నేతలంతా నియోజకవర్గంలో దిగిపోయారు. నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని నేతలంతా ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచే నియోజకవర్గాన్ని వీడాల్సి ఉంది. కొందరు మంత్రులు మాత్రం సోమవారం రాత్రి కూడా నియోజకవర్గంలో తిరిగారు. మంగళవారం ఉదయం నుంచే ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా రెండు ప్రధాన పారీ్టలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యథేచ్ఛగా బూత్‌ల వద్ద సంచరించారు. ఓ పార్టీ కార్యకర్తలు తమ టేబుల్ వద్ద పార్టీ జెండాతో పాటు కరపత్రాలను పంపిణీ చేశారు. ఓ అభ్యర్థి బైక్ ర్యాలీ నిర్వహించారు. యూసుఫ్‌గూడ, షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగింది. బోరబండలో కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్ అధికార పారీ్టకి ఓటు వేయాల్సిందిగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర గొడవ జరిగింది. షేక్‌పేటలో ఎంఐఎం కార్యకర్తలు, నేతలు పోలింగ్ బూత్‌ల వద్ద తిష్టవేసి ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది చోద్యం చూసింది. అధికార పారీ్టకి చెందిన ఓ ఎమ్మెల్సీ డబ్బులు పంచుతూ కాలర్ ఎగరవేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వెబ్ కాస్టింగ్ పరిశీలన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ, పీఆర్ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ కంట్రోల్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. కంట్రోల్ రూం పనితీరును కర్ణన్ వివరించారు.కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పీఆర్ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ లో ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారులు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. -
Jubilee Hills bypoll: పోలింగ్ శాతం పెంచుకోవడంలో ఫెయిల్
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీల అధ్యక్షులు, ప్రధాన నేతలు, జాతీయ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రెండు వారాల పాటు పర్యటించి తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రోడ్డు షోలు నిర్వహించారు. కార్నర్ మీటింగ్‌లు పెట్టారు. పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు. చివరకు చీరల పంపిణీ కూడా జరిగింది. అయితే పోలింగ్ శాతాన్ని పెంచుకోవడంలో మాత్రం దాదాపు అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకురావడంలో అటు పార్టీలతో పాటు ఇటు ఎన్నికల అధికారులు కూడా చేతులెత్తేశారు. ఓట్లు వేయడానికి చాలామంది ఓటర్లు నిరాసక్తత కనబర్చినట్లు రాత్రి 9 గంటల వరకు నమోదైన 48.47 శాతం పోలింగ్ కళ్లకు కట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, పార్టీల అధ్యక్షులు ప్రచారంలో పాల్గొన్నారే తప్ప ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎక్కడా చెప్పిన దాఖలా లేదు. ఈసారి కనీసం 60 శాతం పోలింగ్ నమోదవుతుందని అంతా భావించారు. చివరకు 50 శాతం లోపు పోలింగ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచి్చంది. -
వార్ వన్ సైడ్ తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్
-
ప్రలోభాలు ఎదురైనా ఫలితం మనదే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన బీఆర్ఎస్ మంగళవారం జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపోటములకు ఉన్న అవకాశాలపై లెక్కలు కడుతోంది. అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర ఒత్తిళ్లు, పోటీ ఎదురైనా ఈ నెల 14న వెలువడే ఉప ఎన్నిక ఫలితాల్లో విజయం సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకత్వంలో నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ అభ్యర్థిపై సానుభూతి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనుకూల ఫలితాన్ని సాధించి పెడుతుందనే ధీమా పార్టీ శిబిరంలో కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఫోన్లు చేసి అభినందించడంతోపాటు బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.వార్ రూమ్‌లోనే c, హరీశ్పోలింగ్ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు మంగళవారం తెల్లవారుజామునే వార్ రూమ్‌కు చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ నేతలు, కేడర్‌ను సమన్వయం చేస్తూ దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ ముగిసే వరకు వార్ రూమ్‌లోనే గడిపిన కేటీఆర్, హరీశ్‌రావు.. డివిజన్లు, బూత్‌లు, క్లస్టర్ల వారీగా పోలింగ్ వివరాలను విశ్లేషించారు. కాంగ్రెస్ నుంచి ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కు అనుకూలంగా పోలైందనే అంచనాకు వచ్చారు. కనీసం 2 శాతం ఓట్లతో కాంగ్రెస్‌పై పైచేయి సాధిస్తామని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది.ఉదయం నుంచే ఫిర్యాదుల పర్వం: పోలింగ్ ప్రారంభమైన మరుక్షణం నుంచే కాంగ్రెస్ నేతల కదలికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యా దుల ప్రక్రియను మొదలు పెట్టింది. డబ్బుల పంపిణీ, బెది రింపులు, దాడులు, రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల నుంచి ఏజెంట్లను బయటకు పంపడం, దొంగ ఓట్లు, బయటి నేతలు నియోజకవర్గంలోనే తిష్టవేయడం తదితరాలకు సంబంధించి బీఆర్ఎస్ 60కి పైగా ఫిర్యాదులు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు నియోజ కవర్గంలో సంచరిస్తుండటంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.పార్టీ శ్రేణులు, ఓటర్లకు ధన్యవాదాలు: కేటీఆర్‘గడిచిన నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన నేతలు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురి చేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
విజయం మాదే...!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ దేనన్న ధీమా అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనపడుతోంది. అటు పోలింగ్ సరళి, ఇటు పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఉప ఎన్నికలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ పరంగా అమలు చేసిన వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగినట్లు పోలింగ్ సరళి చెబుతోందని అంటున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు, పార్టీ కేడర్ సహకారంతో తమ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్‌కు 10వేల ఓట్ల మెజార్టీ లభిస్తుందనే ధీమా గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.స్థానికతకు తోడు అభివృద్ధి నినాదం, మంత్రుల మోహరింపు, సీఎం ప్రచారం, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల బలహీన తలు, ముస్లిం మైనార్టీల మద్దతు తమకు అనుకూలంగా మారిందని చెబుతున్నారు. అయితే, బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురైందనే అభిప్రాయంతో వారు ఏకీభవిస్తు న్నారు. కాగా, మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైన సమయం నుంచి ముగిసేంతవరకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ఎన్నిక కోసం ఇన్చార్జులుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎప్పటికప్పు డు పోలింగ్ సరళిని ఆరా తీశారు. స్థానిక నేతలతో మాట్లా డుతూ పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందుల్లేకుండా, తమ ఓట ర్లను పోలింగ్ స్టేషన్లకు చేర్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాం: పీసీసీ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకా ల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమకు మద్దతిచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పా రు. తమ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్ పెద్ద మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని, ఈ ఎన్నికలో కష్టపడి పనిచేసిన పార్టీ నేత లు, కార్యకర్తలందరికీ ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ 48.47 శాతమే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్, సాయంత్రం వరకు కూడా అంతంత మాత్రంగానే సాగింది. అయితే చివరి గంటలో మాత్రం పోలింగ్ బూత్‌లలో ఓటర్ల సందడి కనిపించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ గడువు ముగియడంతో గేట్లు మూసివేసి అప్పటివరకు క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. మొరాయించిన ఈవీఎంలు పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఉదయమే ఓట్లు వేసి డ్యూటీలు, వివిధ పనులకు వెళ్లాలనుకున్న ఓటర్లు తీవ్ర ఇబ్బంది గురయ్యారు. తర్వాత పరిస్థితి చక్కబడినా సాయంత్రం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు పెద్దగా రాలేదు. బస్తీల్లో మాత్రమే కొంత హడావుడి కనిపించింది. ఇక నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రముఖులు, సినీ తారలు, అధికారులు మాత్రం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా కోడ్ ఉల్లంఘన, దొంగ ఓట్లు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పర్సపరంగా ఆరోపణలు చేశాయి. ప్రధాన పక్షాల అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్‌లు తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతర నేతలు తిరుగుతున్నారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించి ఆదేశాల ఇవ్వడంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం సాంకేతికతను వినియోగిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే తెలిసేలా 136 డ్రోన్లతో పర్యవేక్షించింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పలు పొలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాటలు వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసే సమయంలో..యూసుఫ్‌గూడలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌తో కలిసి ఆందోళనకు దిగారు. దీనిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు షేక్‌పేట్ డివిజన్ అపెక్స్ హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఇక యూసుఫ్‌గూడ సవేర ఫంక్షన్ హాల్ వద్ద కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి బూత్‌కీ ఎందుకు తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీకష్ణానగర్లోని ఎ బ్లాక్ పోలింగ్ బూత్‌లో దొంగఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ సునీత బైఠాయించారు. షేక్‌పేట్ అల్ఫల స్కూల్, సమత కాలనీల వద్ద గల పోలింగ్ స్టేషన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఆయా పోలింగ్ బూత్‌ల ముందు బైఠాయించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉండడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 1 శాతం అధికంగా పోలింగ్ చివరిసారిగా అందిన సమాచారం మేరకు ఈ ఉప ఎన్నికలో 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చూసి తాజా ఎన్నికలో 50 శాతానికి పైగా పోలింగ్ ఉంటుందని పలువురు భావించినప్పటికీ ఎప్పటి మాదిరే నమోదైంది. రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికలకు ఎంతోకాలం ముందునుంచే ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తప్పకుండా ఓట్లు వేయాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం కన్పించలేదు. అధికారుల అవగాహన కార్యక్రమాలను కూడా స్థానికులు పట్టించుకోలేదు. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. గెలిచేది ఆ పార్టీనే?
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ పల్స్ -కాంగ్రెస్ 48శాతం,బీఆర్ఎస్-41శాతం,బీజేపీ-6శాతంచాణక్య స్ట్రాటజీస్- కాంగ్రెస్-46శాతం,బీఆర్ఎస్-43శాతం,బీజేపీ-6శాతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించింది.ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా..బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14 (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఇదీ చదవండి: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ -
డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ నేత
-
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
-
జోరుగా పోలింగ్.. భారీగా ఓటింగ్
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)
-
డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన కాంగ్రెస్ నేత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతలు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. వెంగళరావు నగర్ డివిజన్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బూత్ నెం.205, జవహర్‌నగర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికిపోయారు. ఆ నేతను బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు.నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహంనాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌కు రావడంపై సీరియస్ అయ్యింది. బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ 60 ఫిర్యాదు చేసింది. స్థానికేతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇంకా జూబ్లీహిల్స్లోనే ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటేసిన మాగంటి సునీత
-
Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్
-
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
Jubilee Hills By Election Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు తీర్పు ఇచ్చే రోజు రానే వచ్చింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(భారత రాష్ట్ర సమితి) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, భాజపా తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
నేడే పోలింగ్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతోపాటు డ్రోన్ల ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సర్వశక్తు లూ ఒడ్డాయి. నెలరోజులకు పైగా జరిగిన ప్రచారపర్వంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే.. ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పార్టీలు ప్ర లోభాలకు తెరలేపాయి. ఓటర్లను రహస్యంగా కలుస్తూ నగ దు పంపిణీకి తెరలేపాయి. ఆది, సోమవారాల్లో గుట్టుగా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2,500 చొప్పున నగదు పంపిణీ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు తాయిలాలు కూడా అందిస్తున్నాయని తెలుస్తోంది. బోరబండ, రహమత్‌నగర్ డివిజన్లలోని మహిళల కు నగదుతోపాటు చీరలు కూడా పంచినట్లు సమాచారం. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ ప్రధాన రాజకీ య పార్టీ గట్టిగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని.. ఓటరుగా ఉన్న వారికి నగదు ఇవ్వడంతోపాటు గ్రూపు సభ్యులుగా ఉన్న మహిళలకు అదనంగా రూ. 2,500, గ్రూపు లీడర్లకు రూ. 5 వేల చొప్పున నగదు పంచినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన పార్టీ ఓటర్లకు రూ. 1,000 నగదు పంపిణీని పూర్తి చేసిందని సమాచారం.పోలింగ్ పర్యవేక్షణ కోసం... నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల కు ఆదేశాలు అందాయి. పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి అభ్యర్థి వరకు అందరూ సాయంత్రం పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలకు తరలేంత వరకు జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ ప్రచార తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారని.. మంగళవారం పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పోలింగ్ సరళి పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. -
కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..
-
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కోసం తొలిసారిగా..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం డీఆర్సీ (Distribution, Reception and Counting Center) నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ నడుస్తోందని ఆయన అన్నారు. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని పంపిణీ ప్రాసెస్ నడుస్తోందని ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సహా సిబ్బంది చేరుకుంటారు. ఒక్కో అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్ పాస్ ఇస్తున్నాం. ఈ ఉప ఎన్నిక కోసం తొలిసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేయబోతున్నాం. అభ్యర్థులు ఎక్కువ ఉన్నందునే సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ పొడిగించాం అని తెలిపారాయన. రేపు(మంగళవారం) ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ జరగనుంది. 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. కేంద్ర బలగాలు 800 మందితో బందోబస్తు కల్పించారు. నియోజకవర్గంలోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి.. 144 సెక్షన్ విధించారు. పోలింగ్ పర్యవేక్షణ కోసం 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. -
జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓటర్ ఐడీలు! ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ జనాలను రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని.. కానీ, ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. లక్షకు పైగా చీరలతో పాటు మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించడం జరిగింది. కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. అందుకేనేమో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ని కోరాం. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ కూడా ఇస్తున్నాం. .. ఇంత అధికార దుర్వినియోగం జరుగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చాం. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమర్పించాం. ఓటర్ ఐడీ గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూతులకు పంపించకూడదు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారు. ఫేక్ ఐడీ కార్డుల వీడియోను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడి వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని కోరాం. ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం.. ఫేక్ ఐడీ కార్డుల వివరాలను అందించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధికారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.యూసుఫ్‌గూడాలో కాంగ్రెస్ కార్యాలయంను ఆనుకునే పోలింగ్ బూత్ ఉంది. కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారు?. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. సీఎం రేవంత్‌పై సెటైర్లుముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై రివ్యూ పెట్టడానికి టైం దొరకలేదు. ఈరోజు 6 గ్యారంటీలపై రివ్యూ పెట్టడం ఎందుకు?. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ జరిగింది. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడు. ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమే.... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా లాభం లేదు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు. తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు’’ అని హరీష్‌రావు అన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యమ కాస్ట్లీ గురూ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడగా, పంపకాల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. గెలవడం వాటికి ప్రతిష్టాత్మకంగా మారింది. గత మూడు రోజుల నుంచి బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా అంతటా యథేచ్ఛగా ‘ఓటుకు నోటు’ బేరం సాగుతోంది. ఓటర్లకు ఏ పార్టీ ఎంత పంపిణీ చేస్తోందన్న విషయాన్ని ఒకదానికొకటి ఆరా తీస్తున్నాయి. తామే ఎక్కువ డబ్బులను పంచాలనే ప్రణాళికలు రూపొందించుకుని గడపగడపనూ టచ్ చేస్తున్నాయి. కొన్ని పార్టీలైతే అపార్ట్మెంట్లో రూ.2,500, బస్తీల్లో రూ.3,000 చొప్పున పంచుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ పార్టీవారైనా ఓటర్లకు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేస్తే.. ప్రత్యర్థి పార్టీ వారు పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఇప్పుడు ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. ‘డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకు వేయండి..’ అంటూ బహిరంగంగానే ఓటర్లకు పిలుపు ఇస్తున్నారు. తాము ఫలానా పార్టీవాళ్లమని కొందరు ఓటర్లు చెప్పినా ‘ఫర్వాలేదు. ఉంచుకోండి’ అంటూ బొట్టుపెట్టి అప్పగింతలు చేసినట్లే చెప్పేస్తున్నారు. ఆయా బస్తీల్లో మహిళా నేతలకు ఈ పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మధ్యవర్తులకు పండుగే పండుగ.. గత కొద్దిరోజుల నుంచి వివిధ పార్టీల ప్రచారాలకు జనాన్ని తీసుకువెళ్లడంలో కొందరు మధ్యవర్తులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన జనాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రోజువారీగా ఇస్తున్నారు. అయితే కొందరు మధ్యవర్తులు రూ.300 నొక్కేసి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా పారామౌంట్ కాలనీలో తమకు రూ.500 ఇవ్వాల్సిందేనంటూ ప్రచారానికి హాజరైన మహిళలు మధ్యవర్తి ముందు బైఠాయించారు. ‘రూ.200 ఇస్తాను తీసుకోండి.. లేదంటే వెళ్లండి’ అంటూ సదరు మధ్యవర్తి తెగేసి చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇటు మధ్యవర్తులు, అటు కిందిస్థాయి నేతలు అందినంత జేబులో వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీగా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా అడుగు తీసి అడుగు వేస్తే పరిస్థితి డబ్బులు మయమైపోయిందని నేతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బుల ప్రవాహానికి అంతులేకుండా పోయిందని గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికల తీరును చూస్తున్న కొందరు ఓటర్లు పెదవి విరుస్తున్నారు.మూగబోయిన మైకులు బంజారాహిల్స్: గడిచిన 18 రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో హోరెత్తిన ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ప్రచార రథాలకు ఏర్పాటుచేసిన మైక్‌లను సరిగ్గా 6 గంటల సమయంలో నిర్వాహకులు తొలగించడంతో ప్రచారంలో మైకులు మూగబోయాయి. గల్లీ గల్లీలో 58 మంది అభ్యర్ధులు తమ ప్రచార రథాలకు మైకులు ఏర్పాటుచేసుకుని వారి సందేశాలు వినిపించారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా తమ స్థాయికి తగ్గ ప్రచార రథాన్ని తయారుచేసుకుని ఒక మైక్ తగిలించి గెలిస్తే తాము ఏమి చేస్తామో పాటల రూపంలో, ప్రసంగం రూపంలో వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పారీ్టలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార రథాలు గల్లీగల్లీలో కదం తొక్కాయి. పాటలు, ప్రసంగాలు తమ పార్టీ మేనిఫెస్టోను తెలియజేస్తూ మైక్‌ల్లో ఊదరగొట్టారు. ప్రచార రథాలకు ఉన్న మైకులు తొలగిపోవడంతో ప్రచారం కాస్తా ఆకర్షణ కోల్పోయిందనే చెప్పారు. రథానికి మైక్ ఉంటేనే ఉర్రూతలూగించి పార్టీ పాటలతో వచ్చిన జనం ఎక్కువ సేపు ఉండేవారు. కాగా ప్రచార పర్వం ముగియడంతో ఆయా పారీ్టల అభ్యర్థులు పోలింగ్‌పై దృష్టిపెట్టారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అనుచరులు, ఇతర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మనీ, మద్యం పంపకాలపైనా తెరచాటు వ్యవహారాలు ప్రారంభించినట్లు గుసగుసలు విని్పస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో ప్రధాన పారీ్టల నేతలంతా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న ఫలితాల వెల్లడి రోజు తెలియనుంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు
-
కేసీఆర్ బాటలోనే రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి వివిధ కాలనీల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెబితే, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు అంటున్నారు. ఇద్దరూ మోసం చేస్తున్నారు. ఇండ్లు ఆశ చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మరచిపోవడం అలవాటైంది.ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఈ వెనకబాటుకు కారణం ఎవరు? గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దీనికి బాధ్యులు కావా? ఆ పార్టీల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి పట్టింది’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘మజ్లిస్ కార్పొరేటర్లు, నాయకులు దాదాగిరి చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వీరి ఆగడాలు మరింత పెరిగే అవకాశం ఉంది.మన బిడ్డలను మనం రక్షించుకోవాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, నియోజకవర్గం బాగుపడాలన్నా బీజేపీని గెలిపించాలి’అని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు, రూ.4వేల నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ, కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ ఈ పార్టీలు కేంద్రంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని, కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని తెలిపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందని, 2023 జూన్ 7న తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పేరిట బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తాను ప్రజెంటేషన్ ఇచ్చానని వివరించారు.మరోసారి తెలంగాణ అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చ జరిగేవిధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు కిషన్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బహిరంగ చర్చ జరిపేందుకు రెడీగా ఉన్నామన్నారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరినీ ఆహ్వానించాలని ప్రెస్ క్లబ్‌ను కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష పార్లమెంటరీ పద్ధతిలో ఉండేలా, సానుకూల చర్చ జరిగే విధంగా చూడాలని సూచించారు. -
ప్రచారం సమాప్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రచార గడువు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల మైకులు బందయ్యాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా, అంతకుముందు అంతర్గతంగా ప్రచార పర్వంలో నిమగ్నమై కాళ్లకు బలపాలు కట్టుకొని నియోజకవర్గమంతా చుట్టివచి్చన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం ముగియడంతో సేద దీరారు.అయితే, ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రలోభాలకు తెరలేచాయనే చర్చ జరుగుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు ఇతర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభపర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతోపాటు పలు రకాల తాయిలాలు ఇస్తున్నారని, గల్లీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, కులాలు, వర్గాల వారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.ముఖ్యంగా ఈసారి ఓటుకు రూ. 1,500 నుంచి రూ.5,000 వరకు ఇస్తున్నారని, ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అపార్ట్మెంట్ ఓటర్లకు రూ.3 వేలు, బస్తీల్లో రూ.5 వేల వరకు పంచేందుకు రాజకీయ పక్షాలు వెనుకాడడం లేదని, చివరి క్షణాల్లో గెలుపునకు అవసరమైన అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బహిరంగ రహస్యంగానే మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంమీద ప్రచార పర్వం ముగియడంతో సోమవారం ప్రలోభాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఇప్పటివరకు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, గడప గడపకూ ప్రచారాలతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ప్రలోభాలతో సందడిగా మారింది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఈసీ మంగళవారం జరగనున్న పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్‌లలో దాదాపు రెండువేలకు పైగా సిబ్బందిని పోలింగ్ నిర్వహణకు నియమించారు. 2,494 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించి ఈ పోలింగ్ నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. పోలీసు బందోబస్తు కోసం వేల సంఖ్యలో సిబ్బందిని నియమించారు. సోమవారం రాత్రికి పోలింగ్స్టేషన్ల వారీగా అటు ఎన్నికల నిర్వహణ, ఇటు బందోబస్తు సిబ్బందిని పంపడం ద్వారా పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలంటున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
2034 వరకు మేమే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను చెబుతున్నది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్లో రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్ వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. పదేళ్లు టీడీపీ, పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు కేసీఆర్‌కు ప్రజలు అవకాశమిచ్చారు. మాకు కూడా పదేళ్లు అధికారమిస్తారు. ఈ పదేళ్లలో 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రచించి ముందుకు తీసుకెళ్తాం. 2004–14 వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోయిన అభివృద్ధిని 2024–34 మధ్య కొనసాగిస్తాం. ఇప్పటికి రెండేళ్లయింది. ఇంకో ఎనిమిదేళ్లలో అన్నీ పూర్తి చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఓ హోటల్లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047ను వచ్చే నెలలో ఆవిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత విలేకరుల ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘కాళేశ్వరం’పై సీబీఐ దర్యాప్తులో ముందడుగేదీ?కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులెవరో నిగ్గుతేల్చేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాపై ఆరోపణలు చేశారు. అందుకే దీనిపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాం. కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే నిందితులను జైల్లో పెడతామని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ ఇప్పటికి 3 నెలలైనా విచారణ ఇంకా మొదలుకాలేదు. సీబీఐ కాళ్లకు బంధం వేస్తున్నదెవరో మీరే (మీడియా) తేల్చాలి. కాలేజీల బంద్‌తో ‘ఫీజు’సమస్య పరిష్కారం కాదు... నేను ఇవ్వాల్సింది ప్రతి విద్యార్థికి రూ. 35 వేలే. కానీ కాలేజీలు రూ. లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. యాజమాన్యాల కోరికలు తీర్చలేదనే పగతో కళాశాలలు బంద్ చేస్తామంటున్నారు. బంద్ చేస్తే పిల్లలు నష్టపోయే విద్యాసంవత్సరాన్ని ఎవరు తెచ్చిస్తారు? బంద్ బందూకుల వల్ల సమస్య పరిష్కారం కాదు. రూల్ బుక్ ప్రకారం ఏం చేస్తున్నారో చూద్దాం. మీడియా, విజిలెన్స్, కళాశాలల యాజమాన్యాలతో నిజనిర్ధారణ చేద్దాం. 100 శాతం కరెక్టుగా ఉందని ఈ కమిటీ నిర్ధారిస్తే ఆ కళాశాల కోసం తల తాకట్టు పెట్టయినా ఆ రోజే 100 శాతం రీయింబర్స్మెంట్ ఇస్తా. బీఆర్ఎస్ను గెలిపించాలని కేసీఆర్ కోరలేదేం? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మద్దతు అడిగితే బాగుండేది. కానీ ఆ పార్టీ నాయకుడే శాసనసభకు రాడు. టీఆర్ఎస్ పుట్టుక నుంచి మరణశయ్యపైకి చేరుకొనే సమయంలో ఆ పార్టీకి ఎప్పుడైనా సున్నా సీట్లు వచ్చాయా? కేసీఆర్ బతికి ఉన్నప్పుడే, కేటీఆర్ నాయకత్వంలో గుండుసున్నా వచ్చాక ఎవరి కోసం ఈ బుకాయింపులు? వాళ్ల పనైపోయింది. బీఆర్ఎస్ కాలగర్భంలో కలవబోతోంది. ఆ బాధతోనే కేసీఆర్ బయటకు రావట్లేదు. ఇప్పటివరకు ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరలేదు. ఇది దేనికి సంకేతం? కేసీఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులే వచ్చాయి తప్ప ప్రత్యర్థిగా చూడాల్సిన పరిస్థితుల్లేవు. ఫార్ములా–ఈ రేసులో అవకతవకలపై నమోదైన కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ 3 నెలల క్రితమే గవర్నర్‌కు లేఖ రాసినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. నాది కార్యకర్త మనస్తత్వం. పార్టీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ఇంట్లో కూర్చోను. నా మనసు ఒప్పుకోదు. హుజూరాబాద్, హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లోనూ ఇలాగే తిరిగా. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఆ తర్వాత ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే ముఖ్యమంత్రిని. సెక్యూరిటీ వాళ్లు అనుమతిస్తే గడపగడపకూ ప్రచారం చేసేవాడిని. పంచాయతీ ఎన్నికలపై... బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసమే పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యమయ్యాయి. ఆ మేరకు రిజర్వేషన్లు కలి్పంచి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. మాకు ఆర్థికంగా సమస్యలున్నాయి కానీ మా ఆలోచనలు, ప్రణాళికల్లో లోపం లేదు. కేంద్ర సాయానికి కిషన్‌రెడ్డే అడ్డంకి.. కేంద్రంతో విభేదాలు, తగాదాలు మేం పెట్టుకోదల్చుకోలేదు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చామో ప్రజలకు వివరిస్తా. బీజేపీలోనూ కిషన్‌రెడ్డితో తప్ప మిగిలిన వారితో ఇబ్బంది లేదు. హైదరాబాద్ సమస్యల పరిష్కారంలో కేంద్ర సాయానికి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు. కేటీఆర్, కిషన్‌రెడ్డి ఇద్దరూ బ్యాడ్ బ్రదర్స్. బ్యాడ్ మైండ్‌సెట్‌లో ఉన్నారు. వైఎస్, కేసీఆర్ పాలనను ప్రజలు పోల్చి చూడాలి.. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ ప్రజలే నిర్ణయించుకోవాలి. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించగలిగాం. ఈ నిబద్ధత మీద తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 2004–09 మధ్య, ఆ తర్వాత 2009–14 మధ్య రెండుసార్లు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో 2014–23 మధ్య కేసీఆర్ ఆధ్వర్యంలో రెండుసార్లు ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజలు పోల్చి చూడాలి. నాడు కాంగ్రెస్ రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ. 69 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆ తర్వాత పదేళ్లు పాలించిన కేసీఆర్ మాకు రూ. 8.11 లక్షల కోట్ల అప్పుతో అప్పగించాడు. రెండు పార్టీల పాలనలను పోల్చుకొని ప్రజలు ఓటేయాలని అడుగుతున్నా. మైనారిటీలంతా మావైపే... మైనారిటీల మద్దతుతోనే మేం అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ ముస్లింలు సహా మైనారిటీలంతా మా వైపే ఉంటారు’అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ రవికాంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించగా, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల తదితరులు పాల్గొన్నారు. ‘జూబ్లీహిల్స్’లో గెలుపు కాంగ్రెస్‌దే.. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఓడిపోతుంది. కిషన్‌రెడ్డికి చెబుతున్నా... మీకు డిపాజిట్ రాదు. మీ దోస్తు ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడుపుఠాణీలు చేసినా 14న సాయంత్రం ఇదే ఫలితం వస్తుంది. పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు,పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వారు ఇద్దరూ ఏకమై మాపై ముప్పేట దాడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఒకవేళ గెలిస్తే దేశంలోనే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోనూ ఆ పార్టీ గెలిచినట్టే. -
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ దగా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తోన్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందంటూ వ్యాఖ్యానించారు.జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే షాక్‌కి అసలు మూడేళ్లు రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారో.. లేక మూడు నెలల్లోనే దిగిపోతారో తేలిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు చూసి.. ఢిల్లీలో వాళ్ల అధిష్టానం కూడా కత్తులు నూరుతోందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల తరఫున బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకి వచ్చిందని… ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. రేవంత్ రెడ్డి అంత చిల్లరగా వ్యవహరించిన నాయకుడిని చూడలేదంటూ కేటీఆర్ మండిపడ్డారు. పెన్షన్ పెంచాలని అడిగినా.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసినా రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే.. రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విద్యార్థులు దాకా ప్రతి వర్గానికి మొండి చేస్తున్న రేవంత్ రెడ్డి కొత్తగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. అసలు గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తుందంటే మాత్రం ఎవరు నమ్ముతారంటూ మండిపడ్డారు.పదేళ్ల కేసీఆర్ పాలన ఉండేదో.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు కేటీఆర్. పదేళ్ల పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఒకవైపు అభివృద్ధితో పాటు.. మరోవైపు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. -
జూబ్లీహిల్స్‌లో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.4,01,365 మంది ఓటర్లు...జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.పారా మిలిటరీ బలగాలు..‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి NCC వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం...అక్కడ పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయి. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తాం. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ పెట్టాం. ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుంది. ఇప్పటినుంచి 11 సాయంత్రం వరకు వైన్ షాప్‌లు క్లోజ్ ఉంటాయి. ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలి’’ అని ఆర్వీ కర్ణన్ తెలిపారు.226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు..హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. 65 లొకేషన్స్ లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారా మిలిటరీ బలగాలు ఉంటాయి. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుంది. ఎన్నికల ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయి. ఇప్పటివరకు 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నాం. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ఇప్పటివరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదు. 230 రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశాం. 1,761 లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటారు. 8 కంపెనీల CISF బలగాలు బందోబస్తులో ఉంటాయికాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేశాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. -
మహిళా ఓటర్లే టార్గెట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు సోషలిస్ట్ పార్టీ (ఇండియా) నుంచి రచ్చా సుభద్రా రెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇంక్విలాబ్–ఏ–మిల్లత్ (ఏఐఎంఐఎం–ఇంక్విలాబ్) నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై సోషలిస్ట్ పార్టీ (ఇండియా) తరుఫున పోటీ చేసిన సుభద్రారెడ్డి..ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బరిలోకి దిగింది. బరిలో చిన్న వయస్కురాలు.. నలుగురు మహిళా అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలు.. 32 ఏళ్ల అస్మా బేగం కాగా.. 75 ఏళ్ల సుభద్రా రెడ్డి అధిక వయస్కురాలు. బంజారాహిల్స్ నివాసి అయిన సుభద్రా.. చేనేత–జౌళి శాఖ రిటైర్డ్ గెజిటెడ్ అధికారిణి. ఈమె 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేరడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎన్నికల పోరాటంలో ఆమె సుపరిచితురాలే. సుభద్రా రెడ్డి 2009లో లోక్‌సత్తా అభ్యర్థిగా భువనగిరి లోకసభ స్థానం కోసం పోటీ చేశారు. ఆ తర్వాత 2021లో స్వతంత్ర అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. 2023లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయగా సుభద్రకు 721 ఓట్లు పోలయ్యాయి. స్థిరచరాస్తులు, కేసులు.. షేక్ రఫత్ జహాన్‌కు ఈ ఉప ఎన్నికే రాజకీయ ఆరంగేట్రం. ఆమె భర్త గతంలో చేవెళ్ల లోకసభ నుంచి పోటీ చేశారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థి అస్మా బేగం కూడా చురుగ్గానే ప్రచారం చేస్తున్నారు. సుభద్రకు రూ.52 లక్షలు, షేక్ రఫత్ జహాన్‌కు రూ.10 లక్షలు, సునీతకు రూ.7 కోట్లకు పైగా విలువ చేసే స్థిరచరాస్తులున్నాయి. ఈమె మీద జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు ఉంది. ఇక, అస్మా బేగం మీద పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు గాను ఓయూ ఠాణాలో కేసు ఉంది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 3.99 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1.91 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో మహిళా అభ్యర్థులందరూ ‘ఆమె’ కేంద్రంగానే ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. అతివలను తమ వైపు తిప్పుకుంటే ఆయా కుటుంబాల్లోని ఓట్లు సంపూర్ణంగా తమకే పడే అవకాశాలున్నాయని బలంగా నమ్ముతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు హామీలు, తాయిళాలతో ఆమె ఓట్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలీసుల ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 9న సాయంత్రం 6 నుంచి ఈనెల 11న సాయంత్రం 6 గంటల వరకు అలాగే ఈనెల 14న ఉదయం 6 గంటల నుంచి ఈనెల 15న ఉదయం 6 గంటల వరకు వైన్స్, రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లు స్టార్ హోటళ్లు వంటి దుకాణాలు బంద్ ఉంటాయి. అలాగే కౌంటింగ్ రోజైన ఈనెల 14న ఉదయం 6 గంటల నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు పబ్లిక్ రోడ్లు, ప్రాంతాలలో టపాసులు కాల్చడాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ రోజు ప్రతీ పోలింగ్ బూత్ నుంచి, అలాగే కౌంటింగ్ రోజు ఈనెల 14న కోట్ల విజయ భాస్కర్ స్టేడియం నుంచి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని ఆదేశాలు జారీ చేశారు. -
Jubilee Hills bypoll: సాయంత్రం 6 గంటల వరకే..
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఇరవై రోజులుగా ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్, షేక్‌పేట, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న సందడి ఆదివారంతో ముగియనుంది. బస్తీలు, కాలనీలు, రోడ్లు, క్యాంటీన్లు, సెలూన్లు ఎక్కడ పడితే అక్కడ పర్యటించిన నేతలు ఆప్రాంతాలను వీడిపోనున్నారు. ఆయా పారీ్టల రంగురంగుల జెండాలు, మైకుల హడావుడి ముగిసిపోనుంది. ఎక్కే గడప, దిగే గడప అన్నట్లుగా ఇంటింటికీ వెళ్లిన వివిధ పార్టీల నాయకులతో, ప్రజలతో మాటా ముచ్చట్లతో కార్యకర్తల ఆటపాటలతో కళకళలాడిన కాలనీలు, బస్తీలు ఇక మూగబోనున్నాయి. బస్తీల్లో, బార్లలో, హోటళ్లలో విందులు, ప్రచారాల్లో డ్యాన్సుల చిందులు ఆగిపోనున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగిసిపోనుండటంతో ఈ కార్యక్రమాలన్నింటికీ తెరపడనుంది. వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన పార్టీల నేతలు సైతం ఇక నియోజకవర్గాన్ని వీడి పోవాల్సి ఉంది. ఇప్పటి వరకు రోడ్‌షోలు, పార్టీ హేమాహేమీ నేతల ప్రసంగాలు, ఇతరత్రా హడావుడి ముగిసిపోనుంది. ఇక తెరచాటు వ్యవహారాలే.. ప్రచారం ముగిస్తే..మద్యం, డబ్బు పంపిణీ వంటి తెరచాటు అక్రమాలూ మాత్రం రాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయి. వివిధ వర్గాలు, సంఘాలతో చివరి ప్రయత్నాలు, సమావేశాలు జరగనున్నాయి. వీరికి తాయిలాలు ప్రకటించేందుకు పారీ్టలు సిద్ధమయ్యాయి. చివరి రోజు బైక్‌ర్యాలీలు వంటివి నిర్వహించనున్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే కాకుండా సవాల్‌గానూ తీసుకున్నాయి. రాబోయే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలకు వీటిని ఇండెక్స్‌గా భావిస్తున్నాయి. అందుకే హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న మార్గాలను ఎంచుకున్నాయి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలపై శ్రద్ధ చూపిన రాజకీయ పారీ్టలు.. ఇక ఓటరు దేవుళ్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించే పనిలో పడనున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దాకా వచ్చి ఓట్లేసేలా చూడటంలో బూత్‌కమిటీలు ముఖ్యభూమిక వహించనున్నాయి. వీటి పని ముమ్మరం కానుంది. తటస్థులను తమవైపు తిప్పుకునేందుకు తమవంతు కృషి చేయనున్నాయి. ఇప్పటికే సంచుల కొద్దీ డబ్బుల పంపిణీ జరుగుతోందనే ప్రచారాలు జరుగుతున్నాయి.ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ అందాయి. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం తెలిసిందే. -
'జూబ్లీ'యేషన్ ఎవరికో!?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార బరిలోకి సీఎం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హైడ్రా చేపట్టిన పేదలు, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడం ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రియల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని, ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల దృష్యా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ విపక్ష బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికులకు కొన్నేళ్లుగా చిరపరిమితుడు కావడం.. గతంలోనూ పోటీ చేసి ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అలాగే సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం, మజ్లిస్ మద్దతిస్తుండటం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజావ్యతిరేకత చాటాలని బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో విపక్ష బీఆర్ఎస్ ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా ప్రజావ్యతిరేకతను గట్టిగా చాటేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలుస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రచారంలో అధిక ప్రాధాన్యం ఇస్తోందని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారంలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నగరం నలుమూలలా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వడం, బీఆర్ఎస్ హయాంలో సాగిన 42 ఫ్లైఓవర్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వడం, ఆ పార్టీ హయాంలో ఐటీ సంస్థలకు ఇచ్చిన తోడ్పాటు వంటి అంశాలు బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో కలిసి వచ్చే అంశాలు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన సతీమణి బరిలో నిలవడం కూడా బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో దోహదపడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ సైతం ఆశల పల్లకీలో.. ఇక బీజేపీ సైతం ఉపఎన్నికలో సత్తా చాటేందుకు ప్రచారంలో వేగం పెంచింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రచారపర్వాన్ని బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. ఆ పార్టీలను గెలిపించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని.. తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవడం ద్వారా గతంతో పోలిస్తే పుంజుకున్నామని.. అదే స్థాయిలో ఈ ఉప ఎన్నికలోనూ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ వర్గం ఓటర్లపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ ఇతర వర్గాల ఓటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమకు అండగా నిలుస్తారని ఆ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల మౌనం.. పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో మంచిచెడుల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరేం చెప్పినా, ఎవరికి ఓటు వేయాలని సూచించినా పోలింగ్ రోజు మనసులో ఉన్న దానిని బట్టి ప్రాధాన్యతలను తేల్చుకుంటామని ఇంకొందరు బస్తీలవాసులు అంటున్నారు. అయితే ఆటో కార్మీకులు, చిరువ్యాపారులు, కూలీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఉందని ఆటో డ్రైవర్లు... రియల్టీ నిదానించడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని భవన నిర్మాణ కూలీలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. దశలవారీగా అయినా రాబోయే రోజుల్లో గ్యారెంటీలు అమలవుతాయనే ఆశాభావం సైతం కొందరిలో కనిపించింది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అంశాలను బస్తీ ఓటర్లు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాగా, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభాల పర్వాన్ని మొదలుపెట్టాయి. -
‘సీఎం మాటల్లో ఓటమి భయం కనిపిస్తుంది’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి భయం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. ఈరోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లక్ష్మణ్.. సీఎం మాటల్ని బట్టే కాంగ్రెస్ ఓటమి భయం అర్థమవుతుందన్నారు. సీఎం ఫ్రస్టేషన్లో బీజేపీపై నిందలు వేస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ ఈ ఎన్నికలకు ఎందుకు దడుసుకుంటున్నారు?, మీ వైఫల్యాలు తప్పించుకునేందుకు మాపై నిందాల?, ఇంటికొక్క ఉద్యోగం అంటూ....మీ మిత్రుడు బిహార్ లో హామీ ఇచ్చారు. 7 కోట్ల మంది ఉన్న బీహార్ లో ఇంటికొక ఉద్యోగం సాధ్యమేనా?, మీ జన్మదినం సందర్భంగా ప్రజలకు మీరిచ్చే గిఫ్ట్ ఏంటి?, కాంగ్రెస్, బీఆర్ఎస్ చెట్టపట్టలు వేసుకొని అధికారాన్ని పంచుకున్నారు. 20 శాతం ఓట్ల కోసం ఇంకా దిగజారి మాట్లాడితే 80 శాతం ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం’ అని హెచ్చరించారు. -
‘గోపీనాథ్ ఆస్తులను కాజేయలని కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతుందని కేంద్ర మంత్రి ,బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల కన్నుపడిందన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షేక్ పేట శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ గోపీనాథ్ ఆస్తులపై సీఎం, కేటీఆర్ కన్ను. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారుఅందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరు. ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా. సీఎం.. నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడను. 80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ’ అని స్పష్టం చేశారు. -
రేవంత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు: కిషన్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.బీజేపీ ఆఫీసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల హామీల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కమాట మాట్లాడరు. హామీలు ఏం అమలు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పరు. సీఎం రేవంత్ నాపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి. ఆయన నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా నేను భయపడను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు రేవంత్ ఏం చేశారో చెప్పాలి. రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి తథ్యం. వాస్తవాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది?. ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వేల కోట్లు వసూలు చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. నేను ఏం చేశాను అనేది ప్రజలకు తెలుసు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బ్యాడ్ బ్రదర్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా కేంద్రంలో పని చేస్తున్నాం. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ సైతం అదే విధంగా గెలవాలని చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్లు కక్కిస్తామని ఊరూరా ప్రచారం చేశారు. లక్ష రూపాయలైన కక్కించరా?. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరింది నిజం కాదా?.బీఆర్ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. మరి కనీసం ఒక్కరి మీద అయిన కేసులు ఎందుకు పెట్టలేదు?. ఖర్చు లేనిది కాబట్టి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. హైదరాబాద్‌కు కేంద్రం చేసిన అభివృద్ధిపై వివరాలు ఇచ్చాను. మీరు టైమ్ ఇస్తే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం. రాహుల్-కేసీఆర్ బ్రదర్స్. కేసీఆర్‌ను కాపాడుతోంది రాహుల్ గాంధీ కాదా?. కాకుంటే కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రేవంత్ ది ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. రేవంత్ తెలంగాణకు పట్టిన శాపం. తెర వెనుక రాజకీయాలు చేయడంలో రేవంత్ దిట్ట అని ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్: రేవంత్ రెడ్డి -
లక్ష ఓట్ల లక్ష్యమే జూబ్లీహిల్స్ గెలుపు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి హేమాహేమీలైన రాష్ట్ర నేతలు గల్లీలు, బస్తీల్లో తిరుగుతున్నారు. వందల సంఖ్యల్లో పెద్ద నేతలు తమ ఇళ్ల ముందుకు వస్తుండటం చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ప్రతి ఒక్క ఓటు కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. ఏ ఒక్క ఓటూ ప్రత్యర్థికి పోవద్దని భావిస్తున్నారు. ఇంతకీ, జూబ్లీ‘హిల్స్’ను ఎక్కాలంటే ఎన్ని ఓట్లు రావాలో అవలోకిస్తే.. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికలో అర్హులైన ఓటర్లు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. నగరంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ 50 శాతానికంటే తక్కువ పోలింగే నమోదైంది. ఈసారి పార్టీల ప్రయత్నాలతో ఎక్కువ పోలింగ్ జరుగుతుందనుకున్నా 50 శాతం పోలింగ్ నమోదైతే 2 లక్షల ఓట్లన్న మాట. వాటిల్లో సగం అంటే లక్ష ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపు ఖాయమే. ఓట్లు ఎక్కువగా చీలి అందరు అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తే 50 వేలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద లక్ష ఓట్లు పొందడం ఇప్పుడు కీలకం. గత ఎన్నికల సరళి చూసినా 50 వేల ఓట్లు దాటిన అభ్యర్థులే గెలిచారు. నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డికి దాదాపు 54 వేల ఓట్లు, మలి ఎన్నికలో గెలిచిన గోపీనాథ్‌కు దాదాపు 51 వేల ఓట్లే వచ్చాయి. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓట్లు పెరిగే కొద్దీ మెజార్టీ పెరిగింది. మూడు పర్యాయాలు గెలిచిన గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో గోపీనాథ్‌కు 80 వేల ఓట్లు రావడంతో..సునీతకు ఈసారి లక్ష లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ఓట్ షేరింగ్ ఇలా.. పోలైన ఓట్లలో గెలిచిన అభ్యర్థులకు తొలి రెండు ఎన్నికల కంటే, మలి రెండు ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. 2014లో గోపీనాథ్‌కు కేవలం 31 శాతం ఓట్లు రాగా, 2023కు దాదాపు 44 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్ష ఓట్లు వస్తే (పోలింగ్ శాతం భారీగా పెరిగినా) గెలుస్తారన్నమాట. కానీ, కనిపిస్తున్న పోటీ తీవ్రత దష్ట్యా అన్ని కూడా అవసరం కాబోదని కొందరు లెక్కలేస్తున్నారు. సంపన్న ప్రాంతం కాదు గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం 2008 డీలిమిటేషన్‌తో ఏర్పడింది. తొలిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. జూబ్లీహిల్స్ అనగానే సంపన్న ప్రాంతమనే గుర్తుకొస్తుంది. కానీ, సంపన్న ప్రాంతాల కంటే పేద ప్రాంతాలే ఎక్కువ. ఉన్నతవర్గాల ప్రజలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉండే ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే అనుకుంటారు కానీ. వారంతా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్నారు. డీలిమిటేషన్ సందర్భంగా రాజకీయ కారణాలు కావచ్చు. ఇతరత్రా కావచ్చు కానీ ఈ నియోజకవర్గమే గందరగోళంగా ఉంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్‌నెంబర్ 36, ఫిల్మ్‌నగర్ వంటి ప్రాంతాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటాయనే అనుకుంటారు. కానీ అవి ఈ నియోజకవర్గంలో లేవు. నియోజకవర్గం షేక్‌పేట నుంచి గోల్కొండ దాకా విస్తరించి ఉండటంతో నియోజకవర్గ సరిహద్దులు అధికారులకు తప్ప సామాన్యులకు అర్థం కావు. సినీపరిశ్రమలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, కార్మికులు, తదితరులుండే యూసుఫ్‌గూడ, బోరబండ వంటి ప్రాంతాలు మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక నియోజకవర్గంలోని దాదాపు 24 శాతం మైనార్టీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే పరిస్థితిలో ఉన్నారు. అయోమయంగా సర్వేలు ఇక వివిధ చానళ్లు, యూట్యూబ్ సంస్థల సర్వేలూ ప్రజల్లో గందరగోళం రేపుతున్నాయి. వాటిని సైతం నమ్మే పరిస్థితి లేదంటున్నారు. చివరి వరకు అన్నింటినీ మనీ మేనేజ్ చేస్తుందంటున్నారు. పోలింగ్ నాటినుంచే మొదలయ్యే అవినీతితో గెలిచేవారెవరైనా..ఏ మేరకు నీతిమంతులుగా మిగులుతారో కాలమే సమాధానం చెబుతుంది. టఫ్ ఫైట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరి గెలుపైనా నేరోగానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రెండు పార్టీలూ ఒక్క ఓటును కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు, బీఆర్ఎస్ నుంచి మాజీలైన మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు రెండు పారీ్టల్లోని తాజా, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు వందల సంఖ్యలో గల్లీ, బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా ఇల్లిల్లూ ఒక్కసారి కాదు రెండు మూడు పర్యాయాలు తిరుగుతున్నారు. అంతేకాదు. కులాలు, వర్గాలు, మతాల వారీగానూ గంపగుత్త ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఎంత డబ్బు వెదజల్లడానికైనా వెనుకాడటం లేరనే ప్రచారం జరుగుతోంది. -
‘హిల్స్’లో అమీతుమీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించడంతో నియోజకవర్గం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వివిధ పార్టీల తరఫున ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరటంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నాయి. ‘హస్త’గతానికి సీఎం రేవంత్ పావులు తమ రెండేళ్ల పాలనను చూపుతూ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాన వేసుకొని క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండేళ్ల పాలనలో అమలు చేసిన మహాలక్షి్మ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలను బలంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫోర్త్ సిటీ వంటి అంశాలను కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.ప్రతి ఓటర్ను చేరుకునేలా 14 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరి, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు డివిజన్లవారీగా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగించారు. సోషల్ ఇంజనీరింగ్ పేరిట యాదవులు, ఎస్సీలు, ముస్లిం, రెడ్డి, కమ్మ సామాజికవర్గం ఓటర్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు ప్రచార శైలిని బట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు, ఎంఐఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి. కమల వికాసానికి కిషన్‌రెడ్డి వ్యూహాలు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన లంకల దీపక్‌రెడ్డినే ఈసారి కూడా బరిలో నిలిపింది. ఏపీలో ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, మారి్నంగ్ వాక్‌ల రూపంలో ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాసవర్మ, గజేంద్ర షెకావత్, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్‌తోపాటు ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.కారు స్టీరింగ్‌ను తిప్పుతున్న కేటీఆర్కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత అభ్యరి్థత్వాన్ని ఇతర పార్టీల కంటే ముందే ఖరారు చేసింది. నియోజకవర్గం పరిధిలోని డివిజన్లకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఇన్‌చార్జీలుగా ప్రకటించి మూడు నెలల ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీతో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ప్రధాన ప్రచారకర్తలుగా ప్రకటించారు.నియోజకవర్గాన్ని 61 క్లస్టర్లుగా, 200కు పైగా బ్లాకులుగా విభజించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఆ స్థాయి నేతలు 60 మందికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అన్ని రకాల ప్రచార పద్ధతులను బీఆర్ఎస్ ఆచరణలో పెడుతూ ప్రతి ఓటర్ను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి, హైడ్రా కూల్చివేతలను ప్రచార అ్రస్తాలుగా సంధిస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ ప్రచారానికి సారథ్యం వహిస్తూ రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చివరి రోజున కేటీఆర్, హరీశ్‌రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా వేర్వేరుగా బైక్ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
కేటీఆర్, కిషన్‌రెడ్డి బ్యాడ్ బ్రదర్స్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవడానికి ఒక్క ఓటు ఇవ్వండి.. హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తా.. నగర అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ (కేటీఆర్, కిషన్‌రెడ్డి) అడుగడుగునా అడ్డుకుంటున్నారు. 2004–14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో, 2014–2023 మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని జూబ్లీహిల్స్ ప్రజలు బేరీజు వేసుకుని ఓటు వేయండి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓఆర్ఆర్, విమానాశ్రయం, నగరానికి కృష్ణా–గోదావరి తాగునీరు, నాలెడ్జి సెంటర్, ఐటీ, ఫార్మా.. ఇలా అన్నీ కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయని తెలిపారు.గత రెండేళ్ల తమ పాలనలో 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి సీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లముందు సీసీటీవీలు పెట్టి చూడడానికి, ఫోన్‌ట్యాపింగ్ కోసం బీఆర్ఎస్ హయాంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలుకు ఏం ఒరిగింది? బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీఎం విమర్శించారు. ‘కుమారుడు సీఎం కావటం కోసం వాస్తు బాగాలేదని సచివాలయాన్ని కూల్చారు. విలాసవంతమైన జీవితం కోసం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో బాత్రూమ్ కట్టించుకున్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదు. ఈ నాలుగింటితో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? లక్షల మందికి ఐటీ కొలువులు రావడానికి ఐటీఐఆర్‌ను మన్మోహన్ సర్కారు ఇస్తే.. దానిని రద్దు చేసింది మోదీ, కేసీఆర్.వాళ్ల పదేళ్ల పాలనలో మెట్రో విస్తరణకు ఎందుకు ప్రయత్నించలేదు? ఎల్అండ్టీ కంపెనీని కమీషన్ల కోసం బ్లాక్ మెయిల్ చేసిందే కేసీఆర్, కేటీఆర్. హైదరాబాద్‌ను గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందే కేటీఆర్. ఆయన బావమరిది ఇచి్చన పార్టీలో కొకైన్ సేవించి దొరికిన విషయం నిజం కాదా? పాఠశాలల వద్ద గంజాయి చాక్లెట్లు విచ్చలవిడిగా దొరికేలా చేసిందే కేటీఆర్. చెరువులను, ప్రభుత్వ స్థలాలను హైడ్రా కాపాడుతుంటే.. తమ ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో అసలు దానిని లేకుండా చేయడానికి యత్నిస్తున్నారు. ‘ఈగల్’డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతుంటే దానిని కూడా అడ్డుకుంటున్నారు.రూ.16 వేల కోట్ల మిగులు, రూ.69 వేల కోట్ల అప్పుతో కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. 10 ఏళ్లలో ఆయన రూ.8.11 లక్షల కోట్ల అప్పుచేసి మాకు అప్పగించారు. కేసీఆర్ హయాంలో రూ.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను దేని కోసం ఖర్చు చేశారో చెప్పాలి. హైదరాబాద్ నగర ప్రజల కోసం పరితపించిన పీ జనార్ధన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేటీఆర్, కిషన్‌రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌పై చార్జిïÙట్ వేయడానికి, అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతినివ్వడం లేదు. కాళేశ్వరంపై సీబీఐ ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? కాళేశ్వరం మొత్తంపై విచారణ చేయమనండి.. ఎవరు వద్దన్నారు?’అని సీఎం ప్రశ్నించారు. ఓఆర్ఆర్ను పల్లీ, బఠానీళ్లా అమ్మేశారు.. ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ, బఠానీల మాదిరిగా రూ.7.5 వేల కోట్లకు అమ్మేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘మెట్రో విస్తరణ, గోదావరి జలాల తరలింపు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్ రాకుండా అడ్డుపడుతున్నారు. మేము వరంగల్, ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టులు మంజూరు చేయించాం. బేగంపేట ఎయిర్‌పోర్టు కింద నుంచి అండర్‌పాస్ నిర్మించనున్నాం. కొత్తగూడెం విమానాశ్రయం కోసం ప్రయతి్నస్తున్నాం. 2034 వరకు మాకు అవకాశమిస్తే.. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపేలా ప్రణాళిక వేస్తున్నాం. డ్రైపోర్టు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు తెచ్చాం.బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక్క ప్రాజెక్టునైనా చూపండి? నగరాభివృద్ధిపై బ్యాడ్ బ్రదర్స్‌తో చర్చించడానికి నేను ఎక్కడైనా సిద్ధమే. మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారు? కిషన్‌రెడ్డి ఎందుకు కేటీఆర్‌కు లొంగిపోయారు? 645 చెరువులకుగాను 44 చెరువుల్లో బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు కట్టి అమ్మేశారు. 127 చెరువులను పాక్షికంగా ఆక్రమించారు. హైడ్రాతో ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగితే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నగరంలో భారీ వర్షాలు పడినా ఈసారి ఎక్కడా ముంపు సమస్య రాకుండా చేశాం. భారీగా సంపాదించుకుని చెల్లెలు ఎక్కడ వాటా అడుగుతుందోనని బయటకు పంపించిన వ్యక్తి కేటీఆర్’అని సీఎం విమర్శించారు. ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే.. సాధారణ ఎన్నికైనా.. ఉప ఎన్నికైనా తమకు ప్రతీది ప్రతిష్ఠాత్మకమేనని సీఎం అన్నారు. ‘ప్రతి ఎన్నికల్లోనూ నా ఎన్నిక మాదిరేగానే పోరాడుతా.. ఏ ఎన్నికైనా నా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగానే చూస్తా. హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు.. ఎన్నిక ఏదైనా సరే.. దానికి బాధ్యత వహిస్తా. నవీన్ యాదవ్‌ను రౌడీ అంటున్నారు. ఎవరు రౌడీ? దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతాడా.. పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతాడా? అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే మీ ఏడుపు ఏంది? నేను సచివాలయానికి రావట్లేదని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు.సచివాలయంలో చేయాల్సినవి అక్కడ చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ మా తాతదా? క్యాంపు ఆఫీస్ లా ఉపయోగిస్తున్నా. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా’అని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ను ఓడించి, బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 75 శాతం మంది హిందువులు బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ అంటున్నారని, వారికి డిపాజిట్ దక్కపోతే హిందువులంతా బీజేపీకి వ్యతిరేకమని ఆయన అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. 8 ఎంపీ సీట్లలో గెలిపించినందుకు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను గెలిపించడానికి కిషన్‌రెడ్డి ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు.బీఆర్ఎస్ను కబళించడానికి హరీశ్‌రావు ఒక్క అడుగు దూరంలో ఉన్నారని సీఎం అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంపై బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చట్టం తనపని తాను చేసుకు పోతుందని తెలిపారు. మసీదులకు వెళ్లినప్పుడు ముస్లిం సంప్రదాయాలను పాటించాలని, ప్రధాని మోదీ సైతం టోపీలు పెట్టుకున్నారని, చాలా మంది బీజేపీ నేతలు టోపీలు పెట్టుకున్నారని సీఎం చెప్పారు. -
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తమాషాలు చేస్తే.. తాట తీస్తానంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. ‘‘విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకుతెలుసు’’ అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. అరోరా కాలేజీ రమేష్‌కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి?. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా? అంటూ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రేవంత్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.‘‘గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారింది. మెట్రో,ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఇలా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. నేడు ఉన్న అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే. కొడుకు భవిష్యత్ కోసం, వాస్తు కారణంగానే కేసీఆర్ సచివాలయం కూలగొట్టారు.’’ అని రేవంత్ మండిపడ్డారు.‘‘వరదల్లో హైదరాబాద్ ముగినిపోతే కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి చిల్లి గవ్వ తీసుకురాలేదు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయింది. హైదరాబాద్ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచన చేయండి. ఆనాడు మిగుల బడ్జెట్‌తో కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగించాం. సచివాలయం కారణంగా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?. కొత్త సచివాలయం నిర్మాణం వల్ల ప్రజలకు అణా పైసా మేలు జరిగిందా?. హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ కాదా?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. -
సీఈసీ అధికారులతో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు కె ఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వారు కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వ్యంలో ఎన్నికల నిర్వహించాలని ఈసీని కోరారు బీఆర్ఎస్ ఎంపీలు. జూబ్లీహిల్స్‌లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ మహిళా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలా జరగని పక్షంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందనే విషయాన్ని సీఈసీకి తెలిపినట్లు మీడియాకు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి స్పష్టంచేశారు. -
‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నది’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విపల్లవం రాబోతుందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు. జూబ్లీహిల్స్ ఎన్నికల అనేది నాలుగు లక్షల మంది భవిష్యత్తు కాదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్ అని స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) మీట్ ద ప్రెస్‌లో హరీష్ రావు మాట్లాడారు. ‘ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలి. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారు. కేసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం. ప్రజలు వికాసం కావాలా, వికాసం కావాలా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశాడు.ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అంటే, కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 9,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించింది. రెండేళ్లలో రేవంత్ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలను బందు పెట్టారు. ఆ పిల్లలు జూబ్లీహిల్స్ లో కూడా ఉన్నారు. ఆరోగ్య శ్రీ వైస్సార్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు.. ఆ పథకం అమలు చేయడం లేదు. ఆసుపత్రులను బెదిరిస్తున్నారు. రూ. 1900 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వలేదు.బకాయిలు అడిగితే అధికారులు, విజిలెన్స్ దాడులు, పోలీసు దాడులు. రాష్ట్రంలో 11 పెద్ద ప్రాజెక్టులు, 13 వేల కోట్ల విలువైనవి చెరువుల్లో కడుతున్నారు, ఆపాలి అని భట్టి గారు అన్నారు. భట్టి ప్రెస్ మీట్,. సీఎం సెటిల్మెంట్. ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు. దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ. చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చేసింది చెప్పుకునేది లేక జూబ్లీహిల్స్ నాయకులు, ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చివరకు ప్రజలను బెదిరిస్తున్నారు. పథకాలు ఆగిపోతాయి అని. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకున్నది. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు. ఓటమి భయంతో ఫ్రస్టేషన్లోకి పోయిండు. బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి’ అని ధ్వజమెత్తారు హరీష్‌రావు.ప్రచారానికి రావడం లేదని నాపై ఫిర్యాదు చేయొద్దు -
జూబ్లీహిల్స్ ప్రచారానికి రాకపోవడంపై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్
నిజామాబాద్: హైరదాబాద్ నగర పరిధిలో జరిగే జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి తాను రావడం లేదనే వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జూబ్లీహిల్స్ ప్రచారానికి రాకపోయినా, సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ ప్రచారం చేస్తున్నానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి రాలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా బలంతో చేసే ప్రచారం కానీ వారు చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉందని స్పష్టం చేశారు.‘ మేము గ్రామస్తులం. గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. జూబ్లీహిల్స్ ప్రచారానికి రావట్లలేదని నాపై ఫిర్యాదు చేయకండి రామచంద్రరావు గారు. నేను సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం.. మీరు ఫిజికల్‌గా చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉంది. నా సోషల్ మీడియా బలంతో నేను ఎన్నికల ప్రచారం చేస్తున్నా. జూబ్లీహిల్స్‌కు రావట్లేదని నాపై అధిష్టానానికి ఫిర్యాదు చేయకండి, అక్కడ మా నాయకులున్నరు. మా సీనియర్ నేతలు ఉన్నారు. మా ఎంపీలు ఉన్నారు. మా మంత్రులు కూడా ఉన్నారు. ఆ ప్రచారాన్ని వారు చూసుకుంటారు’ అంటూ వ్యాఖ్యానించారాయన.బండి సంజయ్‌కు నో.. కేటీఆర్‌కు ఓకే -
ఎన్టీఆర్‌తో రేవంత్ రాజకీయం.. ప్లాన్ ఫలించేనా?
హైదరాబాద్‌లోని అమీర్‌పేట సెంటర్లో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలోనూ.. కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి విగ్రహాన్ని బోరబండలోనూ ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.అంతేకాదు.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరని, ఆయన విగ్రహం ఏర్పాటును ఎవరైనా వ్యతిరేకిస్తే మూసీలో పడేసి తొక్కుతామని కొన్ని అభ్యంతరకరమై వ్యాఖ్యలు ఆయన చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు బోలెడన్ని హామీలివ్వడం కొత్త కాదు కానీ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఏపీలో కాంగ్రెస్‌ను ఓడించి దేశంలోనే సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం. కాంగ్రెస్ నేతలను కుక్కమూతి పిందెలుగా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన వారంటూ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున విమర్శించడం ఇప్పటికీ చాలామందికి గుర్తే. హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్యను ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ అవమానించారన్న ప్రచారాన్ని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఈ ఆత్మగౌరవ నినాదాన్ని తలకెత్తుకున్నారు. తరువాతి కాలంలో అంటే 1989లో కాంగ్రెస్.. టీడీపీని ఓడించగా 1994లో మళ్లీ గెలిచింది. 1984లో టీడీపీ మంత్రి నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ సహకారంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ, 1995లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడుతో, ఇతర కుటుంబ సభ్యుల చేతిలో పరాభవానికి గురై ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ఎన్టీఆర్ అనుకున్నప్పటికీ 1996 జనవరిలో ఆయన మరణంతో సాధ్యం కాలేదు. అయితే చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ఎన్టీఆర్ చరిష్మాను వాడుకోవడం ఇప్పటికీ వదల్లేదు.2001లో కేసీఆర్ నేతృత్వంలో మొదలైన తెలంగాణ ఉద్యమంలో కొన్నిసార్లు ఆంధ్ర ప్రాంత నేతల విగ్రహాలు కూడా టార్గెట్ అయ్యాయి. 1987 ప్రాంతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాలలో ఆంధ్ర ప్రముఖులవి కొందరు ఉద్యమకారులు 2012 ప్రాంతంలో ధ్వంసం చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పునరుద్దరించింది. ఇలా తెలంగాణలో నాయకుల విగ్రహాలకు కొంత చరిత్ర ఉంది. ఎన్టీఆర్ మరణించిన తర్వాత నెక్లెస్ రోడ్డులో అంత్యక్రియలు జరిగాయి. నగరం నడిబొడ్డున ఎలా చేస్తారని వ్యతిరేకించిన వారిలో కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరు లేకపోలేదు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఘాట్‌ను ఏర్పాటు చేసి, అధికారికంగా జయంతి, వర్ధంతులు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొంతకాలం ఆ జీవోని అమలు చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ ప్రభుత్వం తరపున పుష్పగుచ్చం పెట్టి నివాళి అర్పించేవారు. తదుపరి కాలంలో టీడీపీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కొంతమంది అభిమానులు మాత్రమే అక్కడకు వెళుతుండేవారు. ఇంతలో 2009లో తెలంగాణ ఉద్యమం రావడం, రాజకీయాలు కొత్త రూపుదాల్చడం తదితర కారణాలతో ఎన్టీఆర్ ప్రస్తావన తగ్గిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించలేదనే చెప్పాలి. 2018లో చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పార్టీ మూల సిద్ధాంతానికే విరుద్దంగా ప్రవర్తించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీల కూటమి ఓటమి పాలైంది.2023 ఎన్నికల్లో ఒకప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించడం ఏకంగా ముఖ్యమంత్రి కావడం విశేషం. చంద్రబాబుకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య సంబంధాలు మెరుగయ్యేందుకు రేవంత్ కారణమయ్యాడన్న ఒక ప్రచారం కూడా ఉంది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ గురించి మాట్లాడింది లేదు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ ప్రస్తావన తెచ్చారు. తద్వారా టీడీపీ అభిమానుల, కమ్మ సామాజికవర్గం ఆదరణ పొందే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది.అభిమానులు కోరుకుంటున్నట్లు విగ్రహాన్ని నెలకొల్పుతామని, దుర్మార్గులు ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే మూసీలో తొక్కుతామని రేవంత్ వ్యాఖ్య అంత భావ్యంగా అనిపించదు. సినీ నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌పై తెలుగు వారిలో అభిమానం ఉండవచ్చు. అంతమాత్రాన విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించరాదని ఎలా అంటారు?. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా వాడుకునేందుకు మాత్రమే రేవంత్ ఇలా మాట్లాడారు అనిపిస్తోంది. అయితే, బీఆర్ఎస్ ఈ విగ్రహం ఊసే ఎత్తడం లేదు. ఎన్టీఆర్‌ను ఒక కుల ప్రతినిధిగా మాత్రమే చూడటం రాజకీయ పార్టీలకు అమర్యాదే అవుతుంది. విగ్రహాలను చూసి ఓట్లు వేసే రోజులా ఇవి? అలా అయితే హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహంతో పాటు ట్యాంక్ బండ్‌పై పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలు స్థాపించిన ఎన్టీఆర్ ప్రభుత్వం 1989లో ఓటమిపాలైంది. ఎన్టీఆర్ స్వయంగా తెలంగాణ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అంతమాత్రాన విజయం సాధించిందా?.విగ్రహాలకు, రాజకీయాలకు ముడిపెట్టడం, సెంటిమెంట్‌ను వాడుకోవాలని ప్రయత్నించడం రాజకీయ నేతలకు కొత్త కాకపోవచ్చు. తెలుగుతల్లి విగ్రహం బదులు బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం ఈ కోవలోనిదే. కొత్త రూపుతో రేవంత్ ప్రభుత్వం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సచివాలయం వెలుపల రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య విగ్రహం ‘లక్డీకాపుల్’ వద్ద ఏర్పాటైంది. విగ్రహాల ఏర్పాటు దేశ, రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ఉంటాయి. గొప్ప నేతల నుంచి ప్రేరణ పొందడానికి నెలకొల్పుతారు. అదేమీ కొత్తకాదు. తప్పుకాదు. కాకపోతే ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడంతో దీని పూర్వాపరాలు తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. విశేషం ఏమిటంటే ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి కొన్నిసార్లు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు పేరు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. తద్వారా టీడీపీ లేదా, ఒక సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు.ఇక్కడ మరో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇదే తరహాలో కాంగ్రెస్ జాతీయ నేతలకు గౌరవం ఇవ్వడం లేదు. ప్రధాని మోదీ బాటలోనే ఆయన కూడా జవహర్ లాల్ నెహ్రూను విమర్శించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినా పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖరరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన స్కీముల పేర్లను మార్చివేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్ అని పెట్టిన పేరును టీడీపీ ప్రభుత్వం తీసివేసింది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం గమనించదగిన విషయమే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ముందంజలో ఉందని కొన్ని సర్వేలు రావడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించింది. అవి ఫేక్ సర్వేలు అని రేవంత్ కొట్టి పారేశారు. ఒకట్రెండు సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి చేస్తున్న ఉపన్యాసాలు ఎన్టీఆర్, పీజేఆర్ విగ్రహాల స్థాపనపై ప్రకటనలు, స్కీముల కొనసాగింపుపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ ఆత్మరక్షణలో ఉందేమోనన్న అభిప్రాయానికి తావిస్తున్నాయని చెప్పక తప్పదు.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బండి సంజయ్‌కు నో.. కేటీఆర్‌కు ఓకే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో రహమత్ నగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో రహమత్ నగర్లో మీటింగ్ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతి ఇవ్వడం లేదని ఇప్పుడు చెప్పడమేంటి?. ఈనెల నాలుగో తేదీన అనుమతి కోసం అప్లై చేసుకుంటే ఇప్పటిదాకా నాన్చడం వెనుక మతలబు ఏంటి?. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. అందుకే బీఆర్ఎస్ సభలకు అనుమతి ఇచ్చి.. మా సభలకు ఇబ్బందులు కలిగించడమేంటి?. బీజేపీ సభలకు అనుమతి ఇస్తే.. ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుంది. జూబ్లీహిల్స్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మరోవైపు.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తాజాగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పది వేల ఓట్లు తెచ్చుకుంటే బీజేపీ గొప్ప. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఒకరికి ఒకరు సహాకరించుకుంటుంన్నారు. కుండ మార్పిడి లాగా ఓట్ల మార్పిడి చేసుకుంటున్నారు. గతంలో కిషన్ రెడ్డి గెలుపునకు బీఆర్ఎస్ సహకరించింది కాబట్టే.. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం బీజేపీ అభ్యర్థిని బలి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వెళ్తాం. బీజేపీ మతతత్వ పార్టీ.. విభజించి ఓట్లు అడుగుతారు అని కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ జనార్దన్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఉదయం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతోంది. మోతీ నగర్‌లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్థన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మర్రి జనార్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారు. పోలీసులే బ్యాగులను నా ఇంట్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. డైవర్షన్ కోసమే మా ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రౌడీయిజం చేస్తోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రౌడీయిజమా?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రౌడీయిజం చేస్తారని అనుకోలేదు’ అంటూ మండిపడ్డారు.ఇక, తాజాగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు జరిపిన ఎన్నికల అధికారులు సోదాలపై పంచనామా రిపోర్ట్ సిద్ధం చేసి సంతకాలు తీసుకున్నారు. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్.. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏసీలు కూడా పూర్తిగా ఓపెన్ చేసి చూశారు. ఓ లాకర్ ఉంటే వాటి తాళలు తెప్పించి మరీ సోదాలు జరిపారు. ఇంట్లో ఎలాంటి నగదు లభ్యం కాకపోవడం.. ఖాళీ చేతులతో వెనుదిరిగారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే, ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు. ఇక.. పోలీసుల సోదాల నేపథ్యంలో వారి ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ..మమ్మల్ని పోలీసులు బెదిరిస్తున్నారు. సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారు. బహిరంగంగా రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిర్లక్ష్యం వద్దు.. ప్రతిష్టాత్మకమనే విషయం మరువద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే ఉందని.. అందువల్ల ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన అధికారిక నివాసానికి సమీపంలో గురువారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ సమక్షంలో సీఎం రేవంత్ అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా డివిజన్లకు ఇన్చార్జిలుగా ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమనే విషయాన్ని మరువద్దని మంత్రులు, నేతలను సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అసత్య ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. రూ. 200 కోట్ల పనులకు శ్రీకారం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, పార్టీ నేతలకు చెప్పారు. ఈ రెండు నెలల్లో ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూ. 200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికారంలోకి వస్తే రూ. 400 కోట్లను కేటాయించడంతోపాటు 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామన్న హామీ ఇచ్చామని.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు, సన్న బియ్యం పంపిణీ నుంచి రుణమాఫీ, మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేసే పథకానికి శ్రీకారం చుట్టడం వంటి పథకాలను వివరించి చెప్పాలన్నారు. సర్వేలన్నీ మనకే అనుకూలం.. ఉపఎన్నిక సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని.. ఘన విజయం సాధిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నివేదికలతోపాటు వేర్వేరు సంస్థల నుంచి క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలను తెప్పించుకొని అధ్యయనం చేసినట్లు చెప్పారు. అనంతరం ఒక్కో మంత్రితో సీఎం విడిగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 4 రోజుల టైంటేబుల్ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి 4 రోజుల ప్రచార టైంటేబుల్ ఇచ్చారు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు, క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఎవరికి కేటాయించిన డివిజన్లలో వారు ఉండాలని స్పష్టం చేశారు. ఉదయం 5 గంటలకే నియోజకవర్గంలోని పార్కులకు వెళ్లి మార్నింగ్ వాక్కు వచ్చే వారిని కలవాలని.. ఉదయమంతా బస్తీలు, కాలనీల్లో పర్యటించి మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి 4 గంటలకు ప్రచారం ప్రారంభించి రాత్రి దాకా ఇంటింటి ప్రచారం కొనసాగించాలని సూచించారు. శుక్రవారం నుంచి మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. బస్తీలు, కాలనీల్లో పాదయాత్రలు చేయకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను నేరుగా కలవాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లతోపాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న బీసీ ఓటర్ల మద్దతు కాంగ్రెస్‌కే లభిస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చి జీవనం సాగిస్తున్న ఓటర్ల సంఖ్య జూబ్లీహిల్స్‌లోని మురికివాడల్లో అధికంగా ఉన్నందున బస్తీలపై దృష్టి పెట్టాలన్నారు. -
హైదరాబాద్‌లో నాలుగు రోజులు వైన్ షాపులు బంద్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లో జిల్లాలో నాలుగు రోజుల వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఈ నెల 9 నుంచి 12 వరకు వైన్ షాపులు మూత పడనున్నాయి. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు (నవంబర్ 12) వరకు కొనసాగనున్నాయి.కాగా, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టి సర్వశక్తులూ లొడ్డుతుండటంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్‌పై పడింది. ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర రథ సారథులు, కేంద్ర, రాష్ట్ర ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు యావత్ పార్టీ యంత్రాంగాలు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తుండటంతో గెలుపోటములపై ఉత్కంఠ పెరుగుతోంది.రాష్ట్రంలో ప్రధాన పక్షాల రాజకీయ భవిష్యత్తు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండటం బెట్టింగ్‌లకు మరింత ఆజ్యం పోస్తోంది. అధికార పక్షం రెండేళ్ల పాలనను రిఫరెండం, బీఆర్ఎస్ భవిష్యత్తు ఆరాటం, బీజేపీ రాబోయే అధికార పగ్గాల సంకేత ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి వాస్తవంగా ఇక్కడ మూడు పార్టీలకు గెలుపు ఎంతో కీలకం. బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోరు కూడా మరింత ప్రతిష్టాత్మకంగా తయారైంది. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా గెలుపు ఓటములపై పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా కేబినెట్ వరుసగా వారం నుంచి ప్రచారం చేస్తోందని.. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. స్థానిక బీఆర్ఎస్ నేతలను బెదిరించి, కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందని.. స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ.. ఈ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర బలగాలను వినియోగించాలి. ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ టీవీ కెమెరా వెబ్‌లైవ్ చేయాలి. స్థానికేతరులను నియోజకవర్గంలో ఉండకుండా చర్యలు తీసుకోవాలి. నకిలీ, డూప్లికేట్ ఓటర్లను వెరిఫై చేయాలి. ప్రత్యేక పోలీస్ ఎక్స్పెండిచర్ జనరల్ అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు సెక్యూరిటీ బఫర్ ఏర్పాటు చేయాలి’’ అని ఈసీని బీఆర్ఎస్ కోరింది. -
సినీ కార్మికులు ఎటు వైపు..?
బంజారాహిల్స్: ఈనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ కార్మికుల ఓటు ఎటువైపు అన్నది అంతుపట్టకుండా ఉన్నది. పార్టీలు తీసిన లెక్కల ప్రకారం నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న సినీ కారి్మకులు సుమారుగా 15 వేలు ఉండగా ఇందులో 12 వేల మంది ఓటు వేసే అవకాశం ఉన్నది. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కార్మికుల నాడి మాత్రం పట్టుకోలేకపోతున్నారు. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉండేది. ఆయన 3 సినిమాలు కూడా నిర్మించి వారి ఆదరణ చూరగొన్నారు. మొన్నటివరకు సినీ కారి్మకులు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని నిఘా వర్గాల నివేదికల నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇటీవల ఆయన సినీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రధాన డిమాండ్ హెల్త్‌కార్డుల విషయంలో హామీనివ్వడంతో ఏళ్ల కల సీఎం ద్వారా నెరవేరబోతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెల్లగా కార్మిక లోకంలో చర్చ మొదలైంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వారు సినీ కారి్మకుల మద్దతు తమకంటే తమకంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పుడు ఆయనకు సినీ పరిశ్రమతో సంబంధాలు మెరుగ్గా ఉండేవి. ఇప్పటికీ కొనసాగుతుండడంతో వారి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఇలా ప్రధాన పారీ్టలకు సినీ కార్మికులతో సంబంధాలు ఉండడంతో వీరు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీరి అంతరంగాన్ని పట్టుకోవడంలో ఈ మూడు పార్టీలు తలమనకలయ్యాయి. ఇదిలాఉంటే కొన్నిచోట్ల కార్మికులు తమ ఇండ్ల విషయంలో అభ్యర్థులను నిలదీస్తున్నారు. చాలామంది కార్మికులు నియోజకవర్గ పరిధి కిందికి వచ్చే యూసుఫ్‌గూడ, వెంకటగిరి, బోరబండ, రహమత్‌నగర్, శ్రీకృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో అద్దె ఇండ్లలోనే ఉంటున్నారు. వీరి నివాసాల కోసం చిత్రపురికాలనీలో స్థలాలు కేటాయించినా అర్హులైన కార్మికులకు దక్కలేదు. దీంతో వీరంతా మూడు దశాబ్దాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వాలు సినీ కారి్మకులకు సొంతింటి విషయంలో న్యాయం చేయలేదనే చెప్పాలి. వీరికి కేటాయించిన ఇండ్లను అనర్హులకు విక్రయించిన సినీ పెద్దలపై పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. వేతనాల పెంపు 15 శాతమే.. సినీ కారి్మకులకు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలని నిబంధన ఉంది. అయితే గత జూన్‌లో వేతనాలు పెంచకుండా సినీపెద్దలు మోకాలడ్డారు. దీంతో కార్మిక లోకం అంతా 30 శాతం వేతనాలు పెంచాలంటూ డ్యూటీలు బంద్ చేయడమే గాకుండా రోడ్డెక్కి గళమెత్తారు. దీంతో స్వయంగా సీఎం జోక్యం చేసుకోవడంతో దిగివచి్చన సినీ పెద్దలు ప్రస్తుతానికి 15 శాతం మాత్రమే వేతనాలు పెంచి ఇస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదనే అసంతృప్తి వారిలో ఉంది. ఇది ఏ పారీ్టపై చూపుతారో వేచి చూడాల్సి ఉంది. అద్దెలకే సరిపోతున్న వేతనాలు నియోజకవర్గ పరిధిలోని సినీ కారి్మకులు ఎక్కువగా అద్దెలకు ఉంటున్నారు. నెలలో 18–20 రోజులు మాత్రమే వీరికి షూటింగ్ ఉంటుంది. ప్రొడక్షన్ యూనియన్, లైట్‌మేన్ యూనియన్, మేకప్, సెట్ వర్కర్స్, డ్రైవర్లు, కాస్ట్యూమర్స్, డబ్బింగ్ ఆరి్టస్ట్‌లు, జూనియర్ ఆరి్టస్ట్‌లు, ఏజెంట్లు.. ఇలా ఫిలిం ఫెడరేషన్ పరిధిలో 24 క్రాఫ్టŠస్ ఉంటుండగా వీరందరికీ నెలంతా పని దొరకడం కష్టంగా ఉంది. వచ్చిన వేతనాలు ఇంటి అద్దెలకే సరిపోతున్నాయని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న తమ తలరాతలు మారడం లేదని వాపోతున్నారు. వీరిని దోపిడీ చేస్తున్న నాయకులూ ఉన్నారు. ఆ నాయకులకు వంతపాడుతున్న పారీ్టలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారంతా ఉప ఎన్నికలో తమ ప్రతాపం చూపాలని భావిస్తున్నారు. ఇది ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందో చూడాల్సి ఉంది. అయితే సినీ కారి్మకుల నాడిని పట్టుకోవడం మాత్రం కష్టంగా ఉందని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు. -
జూబ్లీహిల్స్ మాదే.. కేటీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
వికాసమా..? విధ్యంసమా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం.ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి రూ.వేలకోట్ల ముడుపులు ముట్టజెపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండుసార్లు, 2023 శాసనసభ ఎన్నికల్లో నగరంలో బీఆర్ఎస్ గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సాక్షి: సీఎం రేవంత్, బీజేపీ నడుమ బంధం అంటూ మీరు ఏ ఆధారాలతో విమర్శలు చేస్తున్నారు? కేటీఆర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోంది. ఓ వైపు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ఢిల్లీలో రాహుల్‌గాందీకి రేవంత్ రూ.వేల కోట్ల ముడుపులు ఇస్తున్నారు. అందుకు బీజేపీ కూడా సహకరిస్తోంది. అందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు తెలంగాణలో రూ.1,300 కోట్ల కాంట్రాక్టు దక్కింది. హర్యానా, మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి రేవంత్ నిధులు పంపుతుంటే బీజేపీ ఎందుకు వదిలేస్తోంది? రేవంత్ తన రాజకీయ ఎదుగుదల కోసం ఏ పార్టీని అయినా వాడుకుంటారు. ఏబీవీపీ నుంచి మొదలై బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మీదుగా సాగుతున్న ఆయన ప్రయాణం వచ్చే రెండేళ్లలో తిరిగి బీజేపీకి చేరుకుంటుంది. రేవంత్ వైఖరితో రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు కాబట్టే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ ఎంపీలతో కలిసి రేవంత్ అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రేవంత్‌ను రాహుల్ భరిస్తున్నారు. సాక్షి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కనీసం చెత్త కుప్పలు కూడా తీయలేదన్న సీఎం రేవంత్ విమర్శలపై మీ స్పందనేంటి? కేటీఆర్: హైదరాబాద్ నగరానికి మేము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఎందుకు జై కొడుతారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్‌కు వణుకు పుడుతోంది. సీఎం రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సొంత గడువు పెట్టుకున్న కాంగ్రెస్.. ఏడు వందల రోజులు కావస్తున్నా ఒక్కటీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌కు మరోమారు ఓటేస్తే రాష్ట్రాన్ని అడుగు పట్టించడం ఖాయం. నేను మంత్రిగా పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో అయినా చర్చకు సిద్ధమే. దమ్ముంటే సీఎం చర్చకు రావాలి. పేమెంట్ కోటా సీఎం రేవంత్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుని మమ్మల్ని దూషిస్తే ధీటుగా సమాధానం చెప్తాం. సాక్షి: ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్, బీజేపీ నడుమ బంధాన్ని సీఎం రేవంత్ లేవనెత్తడంపై ఏమంటారు? కేటీఆర్: ఫార్ములా ఈ రేసు కేసులో నన్ను విచారించేందుకు ప్రభుత్వం గతంలోనే గవర్నర్ అనుమతి తీసుకుంది. ఆ తర్వాతే నా మీద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నన్ను అరెస్టు చేసేందుకు మరోమారు గవర్నర్ అనుమతి అవసరం లేదు. మగాడివైతే ‘ఫార్ములా ఈ’కేసులో నాపై చార్జిïÙటు వేయించు (సీఎంను ఉద్దేశించి). నాతోపాటు సీఎం రేవంత్‌పైనా ఏసీబీ కేసులు ఉన్నాయి. ఈ విషయంలో నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ‘కాళేశ్వరం ప్రాజెక్టు’పై విచారణ పేరిట కొండను తవ్వి ఎలుకను పట్టింది. బీజేపీకి సీబీఐ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ విమర్శిస్తూ ఉంటారు. కానీ రేవంత్ మాత్రం అదే సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగిస్తారు. రాష్ట్రంలో సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు లేవా? సీబీఐ కేసు పెట్టి ఏం పీకుతాడు. మేము తప్పు చేయలేదు. ఎవరికీ భయపడం. సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ఎలా భావిస్తోంది? కేటీఆర్: ఉప ఎన్నికలను తెలంగాణ ఉద్యమంలో సాధనంగా వాడుకుని రాజకీయ పార్టీల డొల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు రాజకీయ అనివార్యత సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీర్పు ఇచ్చే అవకాశం ప్రజలకు వచ్చింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు గొంతు వినిపించేందుకు అరుదైన సందర్భం ఇది. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, సంక్షేమానికి.. కాంగ్రెస్ రెండేళ్ల అరాచక, సంక్షోభ, విధ్వంసకర పాలనకు నడుమ పోటీ ఈ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది. సాక్షి: ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా కూల్చివేతలనే ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? కేటీఆర్: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శిస్తారు. కానీ ఇక్కడ హైడ్రా పేరిట పేదల ఇళ్లను రేవంత్ సర్కారు కూల్చివేయటం ఆయనకు కనిపించడం లేదు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ తదితరుల భవనాలు చెరువుల్లో ఉన్నా హైడ్రా ఎందుకు ముట్టుకోవడం లేదు? మూసీకి అడ్డుగా భారీ బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నా హైడ్రాకు కనిపించడం లేదా? ఇళ్లు కూల్చుతూ, మా పార్టీ తరఫున పనిచేస్తున్న చిన్నా చితక వ్యాపారుల దుకాణాలను తొలగిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దమ్ముంటే రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలి. సాక్షి: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రభావం చూపుతుందా? కేటీఆర్: బీఆర్ఎస్ హయాంలో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రికి రెవెన్యూ, హోమ్ వంటి కీలక శాఖలు ఇచ్చాం. అజహరుద్దీన్‌కు ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమం తప్ప వేరే శాఖలు లేవా? అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశతో ఉంది. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు, బీజేపీ లేకపోతే హిందువులు ఉండరనుకోవటం ఆ పారీ్టల భావదారిద్య్రం. రేవంత్ మూలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మరో 15 ఏళ్లపాటు తిరిగి లేచే పరిస్థితి ఉండదు. బీజేపీకి ఎంఐఎం పార్టీ బీటీమ్ అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శిస్తున్నా ఆ పార్టీ ఎందుకో స్పదించడం లేదు. సాక్షి: రౌడీ షీటర్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పెట్టారని మీ పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఏమంటారు? కేటీఆర్: కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. కానీ రాష్ట్రంలో సీఎం సర్కారు నడుపుతున్నారో.. రౌడీ దర్భారు నడుపుతున్నారో అర్ధం కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు అడిగిన ప్రైవేటు విద్యా సంస్థలను విజిలెన్స్ దాడుల పేరిట భయపెడుతున్నారు. ఏరియర్స్ అడిగిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు, రిటైర్డు ఉద్యోగులపై కేసులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న మా నాయకుల మీద దాడులు చేస్తూ సీఎం రేవంత్ నీచ రాజకీయం చేస్తున్నారు. సాక్షి: మీ సోదరి కవితతో విభేదాలు, మీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకపోవడాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి కదా? కేటీఆర్: కేసీఆర్ తమను ఫుట్‌బాల్ ఆడుకుంటారని బీజేపీ, కాంగ్రెస్‌లకు భయం. ఆ రెండు పారీ్టలకు అభివృద్ధి, సంక్షేమం గురించి తెలంగాణలో ఏం చెప్పాలో తెలియడం లేదు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. దీంతో కేసీఆర్, బీఆర్ఎస్ లక్ష్యంగా అనేక విమర్శలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ప్రచారానికి సంబంధించి దిశా నిర్దేశం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. కవిత విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. సాక్షి: జూబ్లీహిల్స్‌లో మీ ప్రచార తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? కేటీఆర్: గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం. సాక్షి: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా? కేటీఆర్: మా అధినేత ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కథానాయకుడు క్లైమాక్స్‌లోనే వస్తాడు. -
ఉపఎన్నికల ప్రచారంలో మారుమోగుతున్న KCR పేరు
-
జోరు.. టాప్ గేరు!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో గేరు మార్చాయి. వీధులన్నీ రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలతో హోరెత్తుతున్నాయి. ఈ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీధివీధిలో పాదయాత్రలు నిర్వహిస్తూ, ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన విమర్శనా్రస్తాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మాస్ క్యాంపెయిన్‌పై దృష్టి.. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రచార శైలికి భిన్నంగా బీజేపీ ముందుకెళుతోంది. ప్రత్యర్థి పార్టీలు కార్నర్ మీటింగ్, రోడ్ షో అంటూ పెద్దఎత్తున జన సమీకరణ చేస్తుండగా, బీజేపీ నేరుగా కాలనీల్లో ఓటర్ల ఇంటికి పాదయాత్రగా వెళుతోంది. బీజేపీ 50 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితా విడుదల చేసింది. కార్పెట్ బాంబింగ్ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రం జన సమీకరణకు మొగ్గుచూపుతున్నాయి. కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారంతో నాయకులు బస్తీల్లో కలియదిరుగుతున్నారు. పేరుకు పెద్దదే అయినా.. పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినా ఆ రాజసం ఆ ప్రాంతంలో కనిపించదు. బస్తీల్లో గుంతలుగా మారిన అంతర్గత రహదారులు, పొంగుతున్న మురుగు నీటి పారుదల వ్యవస్థ, వెలగని విద్యుత్తు లైట్లు, పార్కులు, ఫుట్ పాత్ల ఆక్రమణలపై విమర్శణా్రస్తాలు సంధిస్తున్నాయి. ఈ పాపం మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు నిందిస్తుండగా, ఈ దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణమంటూ బీజేపీ వాదిస్తోంది. ఈసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటోంది. ఆ ముగ్గురే కీలకం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్లో కేటీఆర్ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఇతర నేతలంతా కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, జన సమీకరణ, ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఎవరెవరిని గెస్ట్లుగా పిలవాలి తదితర అంశాలన్నీ ఆయా నేతలు చూస్తున్నారు. పార్టీ అభ్యరి్థని విజయ తీరాలకు చేర్చే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. -
Jubilee Hills Bypoll: ముందే ఓటేసిన 97 మంది
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ నెల 11వ తేదీన జరగనుండగా 97 మంది ఓటర్లు ముందస్తుగానే మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హోం ఓటింగ్‌కు 103 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 4, 6వ తేదీల్లో రెండు విడతలుగా హోం ఓటింగ్ జరిపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య 97 మంది ఓటర్లు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే హోం ఓటింగ్ జరిపే నివాసాల వద్ద పోలింగ్ బూత్ ఎలా ఉండాలో అలాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంటి వద్ద సాయుధ బలగాలను మోహరించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి రజనీకాంత్‌రెడ్డితో పాటు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పర్యవేక్షించారు. మిగతా వారు ఈ నెల 6వ తేదీన హోం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇద్దరు ఓటర్ల మృతి.. హోం ఓటింగ్‌లో పాల్గొనేందుకు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 80 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్‌లో ఇద్దరు ఓటింగ్‌కు ముందే మృతి చెందారు. మంగళవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లగా మూడు రోజుల క్రితం ఒకరు, వారం రోజుల క్రితం మరొకరు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఓటింగ్‌లో పాల్గొనకుండానే వీరు మృతి చెందడం పట్ల అధికారులు కూడా కొంత ఆవేదనకు గురయ్యారు. -
ఇది సర్కారా? రౌడీ దర్బారా..? : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే మహోన్నత లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్య పొందే హక్కు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ అంధకారం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడలో భారీ రోడ్‌షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విజిలెన్స్ దాడులతో కాలేజీలను బెదిరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు డీఏ, పీఆర్సీలు లేవు. రిటైరైనవారు, ఉద్యోగులు, విద్యార్థులను బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్‌రెడ్డీ? తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కటింగ్ అన్నారు కదా! పెన్షనర్లు నీ తల్లిదండ్రుల్లాంటి వారేకదా.. నీ జీతంలోంచి కోత పెట్టాలా? ఇంతమందిని వేధించి ఏం సాధిస్తావు? మీరు నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా?’అని దుయ్యబట్డారు. మీరే న్యాయమూర్తులు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ ఎన్నిక కాదు. పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధికి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ. ఇది బీఆర్ఎస్ వికాసానికి, కాంగ్రెస్ విధ్వంసానికి, సంక్షేమానికి– సంక్షోభానికి మధ్య జరుగుతున్న పోటీ. ఎవరి పాలన బాగుంటే వారికి ఓటెయ్యండి. 4 కోట్ల మంది 4 లక్షల ఓటర్ల వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సరైన వారినే గెలిపించండి. మీరే న్యాయనిర్ణేతలు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడున్న జనరేటర్లు, ఇన్వర్టర్లు, నీటికోసం ధర్నాల వంటి సమస్యల్ని ఒక్కటొక్కటిగా పరిష్కరించాం. అందరినీ అమ్మలా అక్కున చేర్చుకునే హైదరాబాద్‌లో కార్మీకులకు పని కల్పించాం. పదిలక్షలకు పెరిగిన ఐటీ ఉద్యోగులతోపాటే రియల్ ఎస్టేట్, వివిధ వ్యాపారాలు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యల్లేకుండా నగరాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్‌ది. మడిలో ఉండే రైతును, బడిలో ఉండే టీచర్‌ను, గుడిలో ఉండే పూజారిని, చర్చిలో ఉండే పాస్టర్‌ను, మసీదులో ఉండే ఇమాంను ఇలా.. సబ్బండ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. కేసీఆర్, కేటీఆర్‌ల రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చనందున ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’అని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత నీటి పథకం కూడా ఎత్తివేసి వేలకువేల బిల్లులు ఇస్తుందని అన్నారు. హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతుందని.. మంత్రులు, పెద్దల జోలికి పోదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ కావాలని తెలిపారు. -
కేటీఆర్ అరెస్ట్‌కు అనుమతివ్వాలి..: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్‌తో అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. లోపాయికారీ ఒప్పందం కారణంగానే కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని షేక్‌పేట, రహమత్‌నగర్‌లలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. ‘రాబోయే రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది. ఇది నేను అంటున్న మాట కాదు. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్న మాటే. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామని పదేపదే చెప్పారు. తీరా కాళేశ్వరంపై దర్యాప్తు చేయాలని కేసును మేము సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలలైనా స్పందన లేదు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని దీనితోనే తేలిపోతుంది’అని ఆరోపించారు. కారుగుర్తుకు ఓటేస్తే కమలంగా మారుతుంది బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఆ తర్వాత కమలం గుర్తుగా రూపాంతరం చేందుతుందని, కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుపోతుందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రతి నిర్ణయానికి కేసీఆర్ వత్తాసు పలికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ‘కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ దక్కదు. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. 2007లో పీజేఆర్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంపై కేసీఆర్ అభ్యరి్థని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పీజేఆర్ సతీమణి కలిసేందుకు వెళితే మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు ఒక నీతి, ఇప్పుడు ఒక నీతినా? ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టినందు రహమత్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సెంటిమెంట్ మాట్లాడటమా? బీఆర్ఎస్కు మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే హక్కు లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటినుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్. ఆయన మాగంటి సునీతమ్మను ఆదుకుంటాడంటే నమ్మేది ఎలా? ఇలాంటి వాడు ఎవరింట్లోనైనా ఉంటే అక్కాచెల్లెళ్లు వాతలు పెడుతారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో సమాధానం చెప్పాలి. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు రద్దు చేయడానికా? ఉప ఎన్నిక తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు 4 వేల ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’అని సీఎం హామీ ఇచ్చారు. సభల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజహరుద్దీన్, డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నేటి నుంచి హోమ్ ఓటింగ్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు.. రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ప్రచారం సాగిస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, కార్యక్తరలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు హోమ్ ఓటింగ్ (ఇంటి దగ్గర నుంచే ఓటు) సదుపాయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది.భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది: కోమటిరెడ్డిజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్, PJR టెంపుల్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల మేలు కోరే కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని జూబ్లిహిల్స్ ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... “కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం పూర్తి చేశారు, కానీ రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు” అని గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను విమర్శించారు.“కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ మూడు సంవత్సరాలు కాదు, రాబోయే ఐదేళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. “పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు. వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది” అని చెప్పారు.అలాగే బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను వ్యంగ్యంగా ఎత్తిచూపుతూ, “కేటీఆర్ చెబుతున్నట్టు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందట, కానీ కెసీఆర్ ఇప్పుడు ఫార్మ్‌హౌస్ లోకి వెళ్లి బయటకు రారు” అని వ్యాఖ్యానించారు.ప్రజలు, బుద్ధిజీవులు,మేధావులు ఆలోచన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.నేడు సీఎం ప్రచారం ఇలా..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు షేక్ పేట డివిజన్ లో కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.కేటీఆర్ రోడ్ షోబీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ రోజు రాత్రి 7 గంటలకు సోమాజిగూడ డివిజన్లో భారీ రోడ్ షో నిర్వహిస్తారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కల్పతరువు రెసిడెన్సీ, మల్టీపర్పస్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.నేటి నుంచి హోమ్ ఓటింగ్జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హోమ్ ఓటింగ్ సదుపాయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇవాళ, ఎల్లుండి ఇంటి వద్దనే ఓటు వేసేందుకు వికలాంగులు, వృద్ధులకు అవకాశం ఉంటుంది. హోమ్ ఓటింగ్‌కి 84 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు.కాంగ్రెస్‌ను ఆదరించండి: శ్రీధర్ బాబుమంగళవారం శ్రీనగర్ కాలనీ లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి.. నిరంతరం జూబ్లీహిల్స్ ఓటర్లకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
Jubilee hills bypoll: నువ్వా.. నేనా!
సాక్షి, హైదరబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సర్వేల పేరిట మౌత్ టాక్ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధాన పక్షాలు ప్రత్యర్థుల బలహీనతలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు తేచ్చేందుకు పాట్లు పడుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బలమైన సామాజిక వర్గాలను అనుకూలంగా తమకు మల్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఆయా పక్షాల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగడంతో మాటలు తూటాలు పేలుతున్నాయి. రోడ్ షోలు, కార్నర్ సభలకు పోటాపోటీగా జనసమీకరణలతో ప్రచార పర్వం ఊపందుకుంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో ఓటర్లను గాలం వేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రధాన పక్షాల బూత్‌ల వారీగా బాధ్యులు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తుండగా, మరో పక్షం మాత్రం దూకుడు పెంచి స్లిప్‌తో పాటు కొంత నగదు అడ్వాన్స్‌గా అందిస్తునట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం.. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఇజ్జత్‌గా సవాల్ తీసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా.. మారుతున్న ప్రజానాడిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల మౌత్ టాక్ ప్రభావం ఓటర్లపై పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవద్దని పార్టీ భవిష్యత్ దృష్ట్యా బూత్ స్థాయి మేనేజ్మెంట్ పకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్‌లో గెలుపు బావుటా ఎగురవేసి పరువు దక్కించుకునేందుకు ముమ్మరం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఫలితాన్ని రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పుగా చూపించే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో గత పదేళ్ల వైఫల్యాలను ఎత్తిచూపుతూ అభివృద్ధి సెంటిమెంట్‌ను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తోంది.వ్యూహాత్మకంగా బీఆర్ఎస్.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టి చావోరేవోగా పరిగణిస్తోంది. ప్రత్యర్థుల మౌత్ టాక్‌కు అడ్డకట్ట వేసి ఎదురుదాడితో ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా రెండేళ్లలో ఆరు గ్యారంటీల బాకీ కార్డు ప్రయోగిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ మాదిరిగా కాకుండా సిట్టింగ్ స్థానం పదిలం చేసుకొని పార్టీ బంగారు భవిష్యత్‌కు సంకేతం ఇవ్వాలని భావిస్తోంది. మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం కావడంతో సానుభూతితో గట్టి ఓటు బ్యాంక్ పదిలపర్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులుకదుపుతోంది. పార్టీ యంత్రాంగాన్ని మొత్తం రంగంలో దింపి రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాన ప్రచారా్రస్తాలుగా సంధిస్తోంది. పట్టు కోసం కమలదళం జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ ఎజెండా ప్రయోగిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. రాష్ట్రంలో టార్గెట్– 2028గా పావులు కదుపుతున్నా... పత్యర్థులకు దీటుగా ప్రచారంలో మాత్రం వెనుకబడినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, మజ్లిస్‌తో కాంగ్రెస్ మిలాఖత్‌పై ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
బీజేపీనే కింగ్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కింగ్ మేకర్‌గా మిగలబోదని, కింగ్ గానే విజయం సాధిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరగనున్నందున, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి గెలుస్తారనే నమ్మకం తమకుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా జూబ్లీ హిల్స్‌లో పార్టీ విజయానికి తనదే బాధ్యత అని, తెలంగాణలో రాజకీయాలకు బీజేపీ కేంద్ర బిందువుగా మారబోతోందని అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పారు. సోమవారం కిషన్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉప ఎన్నికకు పాకిస్తాన్‌కు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్సు తప్ప ఇంకే హామీ అమలు చేయలేదని, అలాంటిది కాంగ్రెస్‌ను గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని సీఎం బెదిరించడం ఏమిటని నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 421 హామీలను అమలు చేయని రేవంత్‌ను ప్రజలెందుకు నమ్మాలని ప్రశ్నించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. మహిళలు రోజూ పొద్దున్నే పనులు పూర్తి చేసుకుని ‘విండో షాపింగ్’(ఏమీ కొనకుండానే) చేసి తిరిగి వచ్చేందుకు ఉచిత బస్సు సదుపాయం ఉపయోగపడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి జనగణన షురూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలై 2027 ఫిబ్రవరి 28న ముగుస్తుందని సెన్సెస్ కమిషనర్ ప్రకటించారని కిషన్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో ఇళ్ల వారీగా జనాభా లెక్కలు, కులాల వారీగా సమాచారం సేకరిస్తారని, వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్‌గా పంపించే వీలు కూడా కల్పిస్తున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన వారికి మంత్రి పదవి ఇచ్చిన పార్టీ నేత కేటీఆర్.. ఫిరాయింపులపై కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, ఖైరతాబాద్ స్థానంలోనూ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో తమ పార్టీపరంగా కేసు దాఖలు చేశామని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో మొదటి విడత ఇస్తామన్న రూ.600 కోట్లు వెంటనే ఇవ్వాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఒక్క చాన్సిస్తేనే రాష్ట్రం భ్రష్టుపట్టింది.. మరో చాన్స్ కావాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కారు–బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోటీలో పేదలపైకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే, హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు గుర్తునే గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమవారం రాత్రి బోరబండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సీఎం కుర్చీ కాపాడుకునేందుకు మాత్రం రాహుల్‌గాందీకి, ఢిల్లీకి వందలు, వేల కోట్లు పంపే రేవంత్‌రెడ్డికి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మాత్రం పైసలుండవని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి రెండేళ్ల కింద ఒక్క ఛాన్సిచ్చినందుకే కదా ఏ ఒక్క పథకమూ అమలు కాకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్సిచ్చినందుకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారర్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయకుండా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని, నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అట్టర్‌ఫ్లాప్ అనే పేరొచ్చిందని మండిపడ్డారు. 700 మంది రైతులు చనిపోయే దుస్థితి ఏర్పడిందని, కౌలురైతులు, రైతు కూలీలను కూడా మోసగించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మరో ఛాన్సివ్వొద్దని పిలుపునిచ్చారు. హింస, అరాచకత్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే చరమగీతం పాడాలన్నారు. గల్లాపట్టి అమలు చేయిస్తాం బీఆర్ఎస్ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పట్టి సంక్షేమ పథకాలు అమలు చేయిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. తమను మోసగించినందుకు నిరుద్యోగులు పోటీచేస్తే వారిపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని లూటిఫికేషన్ చేయడం తప్ప నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాలేదన్నారు. మీఠా మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ పత్తాలేడని విమర్శించారు. ‘ప్రజలు తలచుకుంటే హిట్లర్ వంటి వాళ్లేపోయారు. నువ్వెంత’అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసలివ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. అందుకే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వంద కోట్లు కావాలని ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు కులాలు, మతాలకతీతంగా అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్, రేవంత్ పాలనను పోలుస్తూ కొన్ని ఉర్దూ కవితలతో ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించారు. పథకాలు అమలు చేయని తీరు, హైడ్రా బాధితుల కడగండ్లు టీవీల ద్వారా ప్రదర్శించి చూపారు. ‘రేపు మీ బోరబండకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే కారునే గెలిపించాలి. మీకు అండగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామ’ని అన్నారు. పార్టీ మారలేదని టార్చర్ చేసి తమ ఇల్లు కూల్చారని ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ భార్య యాస్మిన్ కేటీఆర్ దృష్టికి తెచ్చారు. -
మజ్లిస్‌కు రేవంత్ జీహుజూర్
గోల్కొండ: రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గులామ్‌గా మారి జీహుజూర్ అంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడానికి మజ్లిస్ పార్టీకి గులామ్‌గా మారిందని ఆరోపించారు.మజ్లిస్ పార్టీ అడిగినవాటినల్లా మంజూరు చేస్తూ మైనార్టీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మార్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని హద్దులూ దాటి హడావుడిగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి విలువైన ఆర్మీ స్థలాలను ముస్లిం స్మశానవాటికలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పథకాలకు నిధులు కేంద్రానివే.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులే అందుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లేనని తెలిపారు. రాష్ట్రంలో రైతంగానికి అందుతున్న ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.గత రెండేళ్ల రేవంత్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తనకు తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. -
జూబ్లీహిల్స్ 'డూ ఆర్ డై'
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నిక ఫలితంతో తనతోపాటు మంత్రులందరి భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా వస్తుందనే ధీమాతో ఉండొద్దని, మంత్రులు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన కేబినెట్ సహచరులకు లంచ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దాదాపు గంటన్నరకు పైగా అక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళిని ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలవాల్సిన ఆవశ్యకతను మంత్రులకు వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్న తీరును అధిష్టానం కూలంకషంగా పరిశీలిస్తోందని, డివిజన్లవారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని చెప్పారు. డివిజన్లు, బస్తీలతో సహా బూత్ స్థాయిలో ప్రచార మేనేజ్మెంట్ పకడ్బందీగా జరగాలని, ఈ వారం రోజులపాటు ప్రతి మంత్రి ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని సూచించారు. ‘ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సీఎంగా నా ఒక్కడిపైనే ప్రభావం ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఓ ఇమేజ్ కల్పిస్తుంది. ఈ ఎన్నికలో సానుకూల ఫలితం రాకపోతే నాతోపాటు వ్యవస్థకు నష్టం చేస్తుంది. డూ ఆర్ డై తరహాలో ఈ ఎన్నికను తీసుకోవాలి. తూతూమంత్రపు వ్యవహారాలకు స్వస్తి చెప్పి మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి. మంచి మెజార్టీతో ఈ ఎన్నికలో గెలవాలి’అని దిశానిర్దేశం చేశారు. కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా? ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండంలో, సోషల్ మీడియా ప్రచారంలో ఆశించిన మేర మంత్రులు పనిచేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన విధ్వంసాన్ని అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ విషయాలను జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరంగా చెప్పాలని మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. సోషల్‌మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టేందుకు స్వయంగా మంత్రులే సోషల్ మీడియాను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వారియర్లను అప్రమత్తం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను వెంటనే తిప్పికొట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితోపాటు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కోఆర్డినేషన్ కమిటీని వేసిన కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కోఆర్డినేషన్ కమిటీని వేసిన కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు కమిటీని వేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.మొత్తం 16 మందితో కమిటీ వేసిన టిపిసిసి. ఈ కమిటీలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు సిటీ కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికను గెలవాలనే సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. -
రేసు మొదలైంది: ముగ్గురు నేతలు, ఒక విజేత!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు అగ్ని పరీక్షగా మారింది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అ్రస్తాలను ప్రయోగిస్తూ సర్వశక్తులొడ్డుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, బీసీ కార్డు, సినీ కార్మికుల సంక్షేమం, మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కాగా.. బీఆర్ఎస్ సానుభూతి, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం, ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు, ప్రత్యర్థుల కుటుంబ నేపథ్యం తమకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటోంది. మూడు పక్షాలూ హేమాహేమీలను ఎన్నికల ప్రచారంలో దింపడంతో మాటల తూటాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. ఆయా పారీ్టల గెలుపోటములపై బలాలతో పాటు బలహీనతలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు అనుకూల అంశాలు రాష్ట్రంలో అధికారంలో ఉండటం, కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, పార్టీ అభ్యరిత్వం ఎంపికలో బీసీ కార్డు ప్రయోగం. ఎన్నికల బరిలో దిగిన యువనేత నవీన్ యాదవ్‌కు వ్యక్తిగత పరిచయాలు, మజ్లిస్, వాపపక్షాలు, టీజేసీ, సినీ కారి్మకులు, బీసీ సంఘాల మద్దతు, సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఫోకస్ పెట్టడం. గత 12 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలు. ప్రతికూల అంశాలు: నియోజకవర్గంలో సంస్థాగత పట్టుతో పాటు స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీలలోని కొత్త, పాత కేడర్‌లో అంతర్గత కుమ్ములాటలు, కొరవడిన సమన్వయం, నవీన్ యాదవ్ కుటుంబ నేపథ్యం, దివంగత మాగంటి గోపీనాథ్ మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహించడం. బీఆర్ఎస్కు గట్టి కేడర్, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థుల ప్రచారం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి. బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలు.. సానుభూతి గత మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం, సంస్థాగతంగా గట్టి ఓటు బ్యాంక్, స్థానిక ప్రాతినిధ్యం, ముస్లిం మైనారిటీల్లో పట్టున్న సోషల్ వర్కర్ పారీ్టలో చేరడం, ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోవడం, గత రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు. ప్రతికూల అంశాలు: అధికారంలో లేకపోవడం, పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం, అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైన మజ్లిస్ కాంగ్రెస్ పంచన చేరడం. తాజాగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, ప్రత్యర్థి యువకుడు కావడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు అధికంగా ఉండటం.కమలం పార్టీకి అనుకూల అంశాలు హిందూత్వ ఎజెండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్మిషా. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మజ్లిస్ నేత కావడం, మజ్లిస్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, టీడీపీ, జనసేన పారీ్టల మద్దతు. అభ్యర్థి దీపక్ రెడ్డికి విరివిగా వ్యక్తిగత పరిచయాలు ఉండటం ప్రతికూల అంశాలు: సంస్థాగతంగా బలహీనంగా ఉండటం. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీ పోటీ చేయడం రెండోసారి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు లభించడం. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోలిస్తే పారీ్టకి బలమైన కేడర్ నెట్వర్క్ లేకపోవడం. -
మజ్లిస్ ముందు మోకరిల్లుతున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్‌కు మోకరిల్లుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఇప్పుడు మజ్లిస్ కనుసన్నల్లో ఉందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మజ్లిస్ ఓటు బ్యాంకే ముఖ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి జూబ్లీహిల్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాదని.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా కీలకంగా మారిందని చెప్పారు. మజ్లిస్ సానుభూతిపరుల ఓట్ల కోసమే సోనియా, రాహుల్‌గాం«దీలు అజహరుద్దీన్‌ను మంత్రి పదవి కట్టబెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ అవకాశవాద రాజకీయాలపై కార్పెట్ బాంబింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట, రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదలను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, వివాహమైతే తులం బంగారం వంటి పథకాలను అమలు చేయాలంటూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ సొంత కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం పథకం కేవలం ప్రచారానికి వాడుకొని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేశాయని పార్టీలకు ప్రజలు ఓటు వేయాలని కిషన్‌రెడ్డి నిలదీశారు. పాకిస్తాన్ అంటే వాళ్లకు ప్రేమ శత్రు దేశమైన పాకిస్తాన్‌పై కాంగ్రెస్ పార్టీ గురు, శిష్యులకు ప్రేమ ఎక్కువని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌ను చులకన చేసి భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పాక్‌కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. -
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/రహ్మత్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి రహ్మత్‌నగర్ డివిజన్లో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశతో సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయకుంటే అన్నీ రద్దుచేస్తామని ధమ్కీ ఇస్తున్నారని విమర్శించారు. ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు ప్రభుత్వమే పతనమయ్యే రోజు వస్తుందని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. ‘గోపన్న లేడని, సునీతమ్మ ఆడబిడ్డ అని అనుకోవద్దు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి. రౌడీలు సతాయిస్తే ఎట్లా అని అనుకోవద్దు. జనతా గ్యారేజ్ వంటి బీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంది. మీరు ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వస్తా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది’అని భరోసా ఇచ్చారు. గోపీనాథ్ కాపాడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ స్థలంలో పెద్ద స్టేడియం కట్టించి ఆయన పేరు పెడతామన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం, మంత్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో రేవంత్‌రెడ్డిది పేగుబంధం సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధమైతే.. బీజేపీతో ఉన్నది పేగు బంధమని కేటీఆర్ ఆరోపించారు. బతికి ఉన్నప్పుడు ఆయన మామ జైపాల్‌రెడ్డిని బండబూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సెటిల్మెంట్లు చేసే బ్లాక్‌మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రూపాయి ఆమ్దానీ లేకున్నా కేసీఆర్ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని, ఇప్పుడు సీఎంకు కనీసం గురుకుల పాఠశాలలు నడపడం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్కు భారీ విజయం దక్కబోతోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు దేశపతి శ్రీనివాస్, మాగంటి సునీత, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీఆర్ఎస్లో చేశారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. -
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షొ నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో ప్రజలనుద్దేశంచి ఆయన ప్రసంగించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లు మహిళా మంత్రి లేదని.. తాము అధికారంలోకి రాగానే సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాన్ని రద్దు చేయాలని మాట్లాడటం బీఆర్ఎస్ బద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ కేటీఆర్ చెల్లెలే బయటకు వచ్చి చెబుతోందన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతానంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లు పట్టించుకోలేదేం? ఉపఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని బీఆర్ఎస్ చూస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. మాయమాటలు చెప్పే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పనిచేసిందని.. అందుకు ప్రతిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రతి సందర్భంలో మోదీ సర్కారుకు కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తేలేని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్తగా సమస్యలు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి.. దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలోని బోరబండకు వచ్చి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సీఎం నిలదీశారు. ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో అభివృద్ధి ‘బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశం కల్పించినా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో అజహరుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. స్థానికుడైన నవీన్ యాదవ్‌ను ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడన్నారు. రోడ్ షో కార్నర్ మీటింగ్‌లలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్‌రెడ్డిని బీఆర్ఎస్ ఓడించ గలిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.మైసూర్ పాక్‌లో మైసూర్ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్‌పేట, రహ మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్‌కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. క్రీడారంగంలో దేశానికి అజర్ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్‌కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.ఆరు మాసాల్లోగా అజర్ భాయ్ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్‌గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్ కేసును ఎదు ర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టవుతుంది.మజ్లిస్ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్‌ఖాన్‌తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్ ఒకటి జూబ్లీ హిల్స్‌లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్ హయాంలో తమకు అందిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్‌ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.గడచిన రెండేళ్ళలో మార్కెట్లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఏమీ లేదు. కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్ఎస్ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
రియల్ ఎస్టేట్ నాశనం చేశారు.. ఎందుకు ఓటేయాలి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ తోక కత్తిరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ నాశనం చేశారు.. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైరయ్యారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అంటున్న కాంగ్రెస్‌కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్న కేటీఆర్.. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. అన్ని సర్వేలు హాస్తం వైపే: ఉత్తమ్జూబ్లిహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు హస్తం వైపే వెలువడడమే ఇందుకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుండి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్‌లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కటంటే ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 89 లక్షల నుండి కోటి 15 లక్షలకు తెల్ల రేషన్ కార్డులు పెంచామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసనసభ్యులు ఇదూలపల్లి శంకరయ్య,కాంగ్రెస్ పార్టీ నేత అజారుద్దీన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు: పొన్నంరాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల కుట్రలను ఛేదించడానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారని మంత్రి పొన్నం సూటిగా ప్రశ్నించారు.జూబీహిల్స్‌లో పొంగులేటి పాదయాత్ర రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జూబీహిల్స్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీజేఆర్ తల్లితండ్రుల పేరు కలిగిన శివమ్మ, పాపిరెడ్డి హిల్స్‌లో మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గజపూల మాల, నృత్యాలతో అక్కడి ప్రజలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వందమంది మైనార్టీ యువకులకు, మరో వంద మంది మహిళలకు కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకతాను ముక్కలే, గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందని అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తధ్యమని అందువల్లే బీఆర్ఎస్ మాజీ మంత్రులు అక్కసుతో మాట్లాడుతున్నారని, ఆ మాజీ మంత్రులు భాష సంస్కరించుకోవాలని పొంగులేటి హితవు పలికారు.సీఎం రోడ్ షో.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులుజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఎర్రగడ్డ డివిజన్ లోని విజయ థియేటర్ నుంచి ప్రారంభమయ్యే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఏర్పాట్లను పర్యవేక్షించారు.విజేత థియేటర్ నుంచి మోతీనగర్ ఎక్స్ రోడ్, డాన్ బోస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ సైడ్ వరకు రోడ్ షో సాగుతుంది. జనప్రియ బ్యాక్ సైడ్ (బి శంకర్‌లాల్ నగర్)లో బహిరంగ సభ నిర్వహిస్తారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, డా. ఆర్. భూపతి రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, డా. రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎనగల వెంకట్రామ్ రెడ్డి తదితరులు రోడ్ షోలో పాల్గొంటారు.రెండో రోజు సీఎం ప్రచారం ఇలా..⇒ రెండో రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి⇒ ఇవాళ బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారంలో పాల్గొననున్న సీఎం⇒ సాయంత్రం 7 గంటలకు బోరబండ డివిజన్ లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం⇒ అనంతరం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి జనప్రియ వరకు రోడ్ షో⇒ జనప్రియ వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డికేటీఆర్ రోడ్ షోజూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం కేటీఆర్ (KTR) రోడ్ షో నిర్వహించనున్నారు. రెహమత్నగర్ డివిజన్ పరిధిలోని ప్రతిభ నగర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది. శ్రీరామ్ నగర్ హోటల్ SD వద్ద ప్రసంగించి, రెహమత్నగర్ వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వరకు కేటీఆర్ రోడ్ షో కొనసాగించనున్నారు. -
మైనార్టీ మంత్రి కాంగ్రెస్‌ను ఒడ్డున పడేస్తారా?
ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్లో మంత్రి అయ్యారు. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సంతోషించాల్సిన వార్తే కానీ.. ఇంకో పది రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఈయన ఒక్కరినే మంత్రిని చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అజహర్‌పై తీవ్రమైన అభియోగాలు మోపుతూ, మతపరంగా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేరుగా ఆరోపణలు చేయకుండా, రేవంత్ ఈ పదవి మైనార్టీలను మోసం చేయడానికి ఇచ్చారని, ఇది ఆరు నెలల పదవేనని వ్యాఖ్యానిస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసిందన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల సంఖ్య సుమారు లక్ష. పైగా రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలెవరూ లేకపోవడంపై అసంతృప్తి ఉందని సీఎం రేవంత్‌కు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధంగా మంత్రి పదవి ఇవ్వడమేమిటని బీజేపీ ప్రశ్నించింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ కూడా ఉప ఎన్నికల సమయంలోనే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో ఈ వాదన వీగిపోయినట్లయింది. బీజేపీ మైనార్టీల ప్రయోజనాలకు అడ్డుపడుతోందని, గవర్నర్‌పై కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం జరక్కుండా చూసే ప్రయత్నమూ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ అనుభవం లేకపోతే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఉండేదేమో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లోనే అధికారం చేపట్టినప్పటికీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో కేబినెట్లో ఈ వర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశించినా సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజహర్‌ను మంత్రిని చేయడం మైనార్టీ ప్రాతినిథ్యం కోసం కాదని, ఉప ఎన్నికల్లో పరిస్థితి అంత బాగాలేదన్న సమాచారంతోనేనని కొందరు విశ్లేషకుల అంచనా. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు సీఎం రేవంత్‌ను సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచార సభే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెబుతున్నా లోలోపలి అనుమానం కారణంగానే మైనార్టీ వర్గానికి చెందిన అజహర్‌ను మంత్రి చేశారని వీరు అంటున్నారు.ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణంగా జరిగేదే కానీ.. ఓటమి ప్రభావం రాష్ట్రం మొత్తమ్మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని అంచనా. ఇప్పటివరకూ జరిగిన సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. కొందరు మైనార్టీ నేతలను కూడా ఆకర్శించడం కూడా కాంగ్రెస్ దృష్టిని మీరిపోలేదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున సీఎం సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావులు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. దీంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మైనార్టీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఇంతకీ అజహర్ నియామకం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమా? కాదా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా వ్యవహరించరాదనే చెప్పాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు రాకపోయినా, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయయపడ్డారు. అయితే ఈ కాలంలో రాజకీయ పార్టీల నుంచి నైతికత ఆశించడం అత్యాశే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అజహర్‌పై దేశద్రోహంతోపాటు తీవ్రమైన కేసులున్నాయని వ్యాఖ్యానించారు. క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన అజహర్‌కు ఆ తరువాత ఫిక్సింగ్ అభియోగాల మరకలూ అంటాయి. క్రికెట్‌కు దూరమయ్యారు. రాజకీయాలకు దగ్గరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత రాజస్థాన్ నుంచి పోటీ చేశారు కానీ గెలవలేదు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రముఖుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగాలని ఆశించినా టిక్కెట్ నవీన్ యాదవ్‌కు ఇవ్వాలన్న రేవంత్ నిర్ణయంతో అది జరగలేదు. అజహర్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం కూడా వ్యతిరేకించిందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది కానీ.. దానికి ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అంటే.. ఎమ్మెల్సీ కాకముందే అజహర్ నేరుగా మంత్రి అయ్యారన్నమాట. ఇంకో ఆరు నెలల్లోపు అజహర్ ఎమ్మెల్సీ కాలేకపోతే మంత్రి పదవి వదలుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి మూడు నెలల క్రితమే అజహర్‌ను మంత్రిని చేయడంపై నిర్ణయం జరిగిందని మహేష్ గౌడ్ చెబుతున్న మాటలు నమ్మ శక్యంగా లేవు. ఎందుకంటే కొంత కాలం క్రితమే ఆయన అజహర్‌కు మంత్రి పదవి ఇస్తున్న సంగతి తనకు తెలియదని చెప్పారు. ఏతావాతా... అజహర్‌కు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? లేదా? అన్నది ఇంకో పది రోజుల్లో తేలనుంది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హీటెక్కిన పాలి'ట్రిక్స్'..
సాక్షి, హైదరాబాద్: అధికార, ప్రతిపక్షాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే.. నియమావళి ఉల్లఘనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర కొన సాగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొనగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగినట్లయింది. మరోవైపు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్లో డివిజన్లవారీగా తిష్ట వేసి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభివృద్ధి మంత్రం జపిస్తుండగా, విజయం సాధిస్తామని ధీమాతో బీఆర్ఎస్, పాగా వేసేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. అందరి దృష్టి ఇక్కడే.. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, సెలబ్రిటీలు, సంపన్నుల ఓట్లు కూడా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పక్షా లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊ హకు అందని విధంగా నిర్ణయాలతో ట్విస్టులపై ట్విస్టు లు ఇస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఏకంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాటా ముచ్చటా కార్యక్రమంతో టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలన విజయాలను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది. రోడ్ షోలు అదుర్స్ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి పోటా పోటీగా నిర్వహించిన రోడ్ షోలు ఆ పారీ్టల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన రోడ్ షోకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షో గులాబీవనాన్ని తలపించింది. నందినగర్‌లోని నివాసం నుంచి రోడ్ షోకు బయలుదేరేముందు పార్టీ మహిళా నేతలు కేటీఆర్‌కు హారతి పట్టారు. అడుగడుగునా గులాబీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. వారి ఉత్సాహం చూసి కేటీఆర్ సైతం జెండా ఊపారు. ‘అందరూ బాగున్నారా. ‘కొడుతున్నామా జూబ్లీహిల్స్‌ను మళ్లీ. కేసీఆర్ నాయకత్వం వరి్ధల్లాలి’ అన్నారు. దీనికి స్పందిస్తూ జనం చేయి చూపడంతో అది చూపొద్దు. మొండిచేయి డేంజర్. పిడికిలి బిగించాలి అని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. -
కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్రగా అందరినీ పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచి్చన హామీలను అమలు చేయట్లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేక దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా గుంతల రహదారులు, పొంగుతున్న మురుగు కాల్వలు, వెలగని వీధి దీపాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు.నియోజకవర్గానికి చుట్టూ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలు గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందినప్పటికీ జూబ్లీహిల్స్ మాత్రం అలాగే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలు.. ఈసారి బీజేపీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల్లా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని.. తమ నిజాయతీనే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల గూండాయిజం, రౌడీయిజాన్ని అంగీకరించబోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ప్రభావం లేదని.. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపించట్లేదని అన్నారు. మజ్లిస్ ఓట్లపై నమ్మకంతోనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే మజ్లిస్ నుంచి అభ్యర్థి ని తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉంటాడని.. ఆయనకు ఒక్క ఫోన్ కాల్ చేయగానే ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండి నడుస్తాడని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. -
ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పేదల ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్‌రెడ్డి సర్కారు హైడ్రా బుల్డోజర్తో వేల ఇళ్లు కూల్చిందని ఆరోపించారు. ఆ పేదల శాపాలే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉరితాళ్లై చుట్టుకుంటాయని దుయ్యబట్టారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలుచోట్ల ఆయన రోడ్ షోలు నిర్వహించారు. తొలుత షేక్‌పేటలో ప్రచార వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద 1.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. ఒక్క జూబ్లీహిల్స్లోనే 3,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు సరికదా పేదల ఇళ్లు కూలగొడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ పోతేనే ప్రజలకు బాకీలన్నీ వస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చే అవకాశం 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి చిత్తుచిత్తుగా ఓడితేనే ప్రజలకు రావాల్సిన బాకీలన్నీ వస్తాయన్నారు. మైనారిటీలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్‌ను కొనసాగించిన రేవంత్‌రెడ్డి.. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ కులమతాల పునాదులపై పనిచేయదని.. కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ప్రజలకు రూ. 5 వేల చొప్పున ఇచ్చి ఓట్లు కొనేందుకు వస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలిచ్చే డబ్బు తీసుకొని ఆడపడుచులైతే మిగతా రూ. 55 వేలు ఏవని అడగాలని.. మిగతా వారు వారికిచ్చిన హామీలకు అనుగుణంగా మిగతా అప్పు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు అగ్రస్థానం.. నేడు అట్టడుగుకు.. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టిలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలనలో అట్టడుగున 28వ ర్యాంక్‌కు పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిందని.. ఆటోవాళ్ల ఉపాధి దెబ్బతీయడం వల్ల 162 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నగర ప్రజల్ని, గ్రామీణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, పదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. -
మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం నేడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఒక్కరినే కేబినెట్లోకి తీసుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సీఎస్‌కు లేఖ రాశారు. ఈసీ ఉత్తర్వులనుబట్టే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే అజహరుద్దీన్‌ను ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. గతంలో గోవాలో ఇలాగే ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. బీజేపీ నేతల ఫిర్యాదుపై సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈసీ ఇచ్చే ఉత్తర్వులను అనుసరించి ఆయన కార్యాచరణ ఉండనుంది. ఏ శాఖ ఇస్తారో?అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి మహమూద్ అలీకి రెండు దఫాల్లోనూ కీలకమైన హోం, రెవెన్యూ శాఖలను కేసీఆర్ అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలను ఇచ్చే పక్షంలో పెద్దగా మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని.. లేదంటే మంత్రుల శాఖలు స్వల్పంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
కోడ్ ఉండగా మంత్రిని నియమించవచ్చా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, రాష్ట్ర మంత్రిగా ఎవరినైనా నియమించవచ్చా?. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కాదా?. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు గవర్నర్ కొత్త మంత్రిని నియమించవచ్చా?. ఈ సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్‌తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.నాడు సీఎంకు నేరుగా ఈసీ ఫోన్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గంలో కొత్త మంత్రిని నియమించవచ్చా? గతంలో ఇలాంటి ఘటనలెక్కడైన జరిగాయా? అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేసింది? అనే సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా ఇటీవల హైదరాబాద్‌లో ఇచ్చిన ఓ ఉపన్యాసంలో నివృత్తి చేశారు. మంతన్ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ 13న నగరంలోని విద్యా అరణ్య పాఠశాలలో నిర్వహించిన సంస్థ సహా వ్యవస్థాపకుడు ‘అజయ్ గాంధీ’ స్మారక ఉపన్యాసంలో ఈ మేరకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గతంలో గోవాలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, ఆ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న సామాజికవర్గానికి సంబంధించిన ఓ వ్యక్తిని రాష్ట్రమంత్రిగా నియమించాలని అప్పటి సీఎం మనోహర్ పారికర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నేరుగా మనోహర్ పారికర్‌కు ఫోన్ చేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు కొత్త మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారని అశోక్ లావాసా వెల్లడించారు. మంత్రుల నియాయకం విషయంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను సైతం వాడుకోలేనా? అని మనోహర్ పారికర్ బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయిస్తే ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని ప్రధాన కమిషనర్ నచ్చజెప్పడంతో అప్పట్లో మనోహర్ పారికర్ వెనక్కుతగ్గి ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారని అశోక్ లావాసా తెలిపారు. రాష్ట్రంలో కొత్త మంత్రిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై సీఈఓ కార్యాలయం స్పందనను ‘సాక్షి’ కోరగా, దీనిపై తమకు ఏమైన ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని బదులిచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -ముహమ్మద్ ఫసియుద్దీన్. -
‘మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే!’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తుండడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి గురువారం బీజేపీ ఫిర్యాదు చేసింది. అజారుద్దీన్ మంత్రి పదవి అంశంపై తెలంగాణ బీజేపీ బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీఈవోతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ లీగల్ టీం పాల్గొంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియామకాన్ని Model Code of Conduct (MCC) ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.ఈ అంశంపై బీఆర్కే భవన్ వద్ద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మంత్రివర్గ విస్తరణకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే పదవి కి పోటీ చేశారు. ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లే. ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ వర్గం ప్రజలు ఇది గమనించాలి. కేవలం ఓట్ల కోసమే ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మినిస్ట్రీ ఇస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసమే మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ పాల్పడుతోంది. సీఎం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన విషయంలో సంబంధిత అధికారులకు ఈసీ నోటీసులు ఇవ్వాలి’’ అని అన్నారు..పాయల్ శంకర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఉల్లంఘించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ ఉండగా...ప్రకటన చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. ఎలక్షన్ కోడ్ ఉండగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కోడ్ ఉల్లంఘించడమే. ఒక వర్గం ఓటర్లతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొక పది రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ ముగిసిపోతుంది కదా!. 20శాతం వర్గం మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను 80శాతం వర్గం ప్రజలు గమనిస్తున్నారు. CEO మంత్రి వర్గ విస్తరణ ను ఆపాలని కోరాం. జూబ్లీహిల్స్ ప్రాంత ఓటర్లకు ప్రభావితం చేసే ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అన్నారు.కేటీఆర్ ఏమన్నారంటే.. మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకోవడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనని అన్నారాయన. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపదమొక్కులు మొక్కుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనం. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని కేటీఆర్ అన్నారు. అయితే అజారుద్దీన్ వ్యవహారంపై ఈసీని ఆశ్రయించే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. I guess desperate times call for desperate measures 😁After 2 years in Govt, looks like Congress party is finally waking up to ground realities Promising the moon to cine workers, inducting Azharuddin in cabinet and ministers desperately running around in Hyderabad Gullies…— KTR (@KTRBRS) October 30, 2025మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్.. ఈ ఉప ఎన్నిక బరిలో నిలబడతారనే ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే అనూహ్యంగా ఆయన్ని గవర్నర్ కోటా ద్వారా MLCని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో అజారుద్దీన్ నేడో, రేపో మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఉంటే.. ఎలక్షన్ కోడ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఈసీ అనుమతిస్తుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో?? చూడాలి. -
అజహర్‌ను వరించిన అదృష్టం
సాక్షి, హైదరబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మెజారిటీగా ఉన్న మైనారిటీ ఓట్లను తన ఖాతాలో జమ చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను కేబినెట్ బెర్త్‌లోకి తీసుకోవాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తద్వారా ఉప ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కెపె్టన్సీలోని మంత్రివర్గ టీంలో అజహరుద్దీన్ చేరనున్నారు. శుక్రవారం విస్తరించనున్న తెలంగాణ కేబినెట్లో అజారుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనారిటీని ఒక మంత్రి పదవి దక్కేది. ఈసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం మైనారిటీలు ఎన్నికల్లో గెలవకపోవడంతో ఆ వర్గానికి కేబినెట్లో అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఏదో విధంగా మంత్రివర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి కూడా స్థానం కలి్పంచాలని కాంగ్రెస్ అధిష్టానం యోచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్ల కోసం పాచికగా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఉప ఎన్నికల బరి నుంచి తప్పించి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజహరుద్దీన్ ఓటమి పాలయ్యారు. అనంతరం.. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక్కడి నుంచే అజహర్ మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆయనను బరి నుంచి తప్పించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినప్పటికీ.. అది ఇంకా ఆమోదం పొందలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోయినప్పటికీ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. అన్ని విధాలా అనుకూలంగా మల్చుకునేందుకు.. అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వార్‌లో అజహర్‌ను సూపర్ ఓవర్ కోసం రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇది రెండో ఉప ఎన్నిక కావడంతోపాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా నోటిఫికేషన్ కంటే రెండు నెలల ముందు నుంచే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్న్చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. మరోవైపు సీనియర్లు పోటీ పడినప్పటికీ.. వారిని కాదని, యువనేత నవీన్ యాదవ్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసి బీసీ కార్డు ప్రయోగిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 24 శాతం మైనారిటీ ఓట్లు ఉండగా.. ఆ వర్గం ఓటు బ్యాంక్‌ను సైతం అనుకూలంగా మల్చుకునేందుకు అజహర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. అలాగే.. నగరం నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కలి్పంచినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కని పక్షంలో.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజాహరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో మరో ముగ్గురికి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఒకవేళ గవర్నర్ కోటాలో అజహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో.. త్వరలో ఖాళీ కానున్న కొన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానానికి ఆయనను ఎంపిక చేసే అవకాశమూ లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మంత్రివర్గంలోకి అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అజహరుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. దానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపింది. నవంబర్ 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలో గెలుపొందాలని రెండు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేలా ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహమూద్ అలీ హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మైనారిటీలకు కీలక ప్రాతినిధ్యం ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, పార్టీ పదవుల్లోనూ అంతగా అవకాశాలు రావడం లేదన్న ప్రచారం ఉంది. పైగా మైనారిటీల నుంచి వస్తున్న అసంతృప్తి నేపథ్యంలోనే అజాహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేబినెట్ బెర్తులు 18: రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మందికి అవకాశం ఉంటుంది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార సందర్భంలో ఆయనతోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్స్వామితోపాటు వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. తాజాగా కేబినెట్లోకి అజాహరుద్దీన్‌ను తీసుకున్నా, మరో ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది. గవర్నర్ కోటాకు ఆమోదముద్ర ఎప్పుడో ? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, కోదండరాం పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పంపింది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఇప్పటివరకు ఆమోదముద్ర వేయలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకున్నా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుత ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లతో జూబ్లీహిల్స్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అజాహరుద్దీన్కు మంత్రి పదవిని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈనెల 31వ తేదీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ అజాహరుద్దీన్కు ఇస్తారని మొదట్లో విస్తృత ప్రచారం జరిగినా, చివరకు బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్యాదవ్ను దక్కిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరికి లేనట్టేనా..! మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసారీ నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశించినా, అవకాశం దక్కలేదు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో సామాజిక సమీకరణల నేపథ్యంలో అవకాశం దక్కలేదు. సుదర్శన్‌రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించినా నిరాశ మిగిలింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో మంత్రివర్గంలో అజాహరుద్దీన్కు మాత్రమే బెర్త్ లభించింది. సీఎంతో భేటీ అయిన మైనారిటీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం వివిధ మైనారిటీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు మైనారిటీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రకటించారు. సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, అజాహరుద్దీన్, ఫహీం ఖురేష్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అజాహరుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించినట్లు తెలిసిందని, ప్రజలు ఎలాగూ ఓటు వేయరని తెలిసి, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఈ నియోజకవర్గంలో 13 వేల దొంగ ఓట్లు సృష్టించారని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్‌కు చెందిన వారు ఎవరో ఒకరు ఓటు వేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన ‘మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం’లో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రులు కొత్త వేషాలు వేసుకుని అభివృద్ధి చేస్తామని గల్లీ లీడర్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను అంగట్లో సరుకులా కొని ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆయన గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓటర్లు ఆలోచించాలని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క పని చేయలేదన్నారు. అభివృద్ధి నిధుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్కరూ సంతోషంగా లేరు ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించడంతో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటూ.. పేదల కోసం ఒక్క ఇల్లు కట్టకున్నా హైడ్రా పేరిట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చారు. యూసుఫ్‌గూడలో సన్మానం పేరిట ముఖ్యమంత్రే వెళ్లి సినీ కార్మికులతో శాలువాలు కప్పించుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట మోసగించారు. బడ్జెట్లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు పెడతామని, ఆ దిశగా రేవంత్ ప్రయత్నం చేయలేదు’అని కేటీఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. -
జాక్‌పాట్ కొట్టిన నల్లగొండ దంపతులు
సాక్షి, హైదరాబాద్,సూర్యాపేట టౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రాజేశ్వర్‌రావు, సాంబలక్ష్మి దంపతులు ఈసారి మద్యం దుకాణాల్లో జాక్‌పాట్ కొట్టారు. లక్కీడ్రాలో రాజేశ్వర్‌రావు, సాంబ లక్ష్మిలకు చెరో దుకాణం మంజూరైంది. 25 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉంటున్న వీరు ఈసారి కూడా టెండర్లు దాఖలు చేశారు. జి.సాంబలక్ష్మి నర్సంపేట –5 నంబర్ దుకాణం దక్కించుకోగా భర్త జి.రాజేశ్వర్‌రావు ఆత్మకూర్–38 షాపు లాటరీ డ్రాలో విజేతగా నిలిచాడు. కాగా, రెండు షాపులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని భార్యాభర్తలు తెలిపారు. వందలో ఒక్కడు.. హనుమకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని 14 గ్రామాలకు కలిపి ఒకే వైన్‌షాపు ఉంది. ఈ దుకాణానికి 100 అప్లికేషన్లు వచ్చాయి. సోమవారం లాటరీ పద్ధతిలో డ్రా తీయగా 100 అప్లికేషన్ల నుంచి జి.రమణారెడ్డి అనే వ్యక్తికి లక్కు తగిలింది. వందలో ఒక్కడు అంటూ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. భార్యాభర్తలను వరించిన అదృష్టం మద్యం దుకాణాల టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్, ఆయన భార్య శ్రావణి సూర్యాపేట పట్టణంలో చెరో మద్యం షాపును దక్కించుకున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి మద్యం దుకాణాలు దక్కాయి. మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిలకత్తుల ఉప్పల మల్లయ్యకు సూర్యాపేటలో, ఆయన కుమారుడు నవీన్‌కు మద్దిరాలలో, కోడలు సృజనకు తిరుమలగిరిలోని వైన్ షాపులు డ్రాలో వచ్చాయి. ఉప్పల మల్లయ్య కొన్ని సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలోనే ఉన్నారు. 2,601 మద్యం దుకాణాల డ్రా... తెలంగాణలో రెండేళ్లపాటు మద్యం దుకాణాలు నడుపుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీశారు. మొత్తం 2,620 దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా అందులో 2,601 దుకాణాలకు డ్రా తీసి గెలుపొందిన వారికి అనుమతినిచ్చారు. డ్రా సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. 2,620 దుకాణాలకు మొత్తం 95,137 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు ఫీజు కింద రూ.3 లక్షల లెక్కన రూ. 28.54 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరుగకుండా డ్రా ప్రక్రియ ముగియడంపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ యంత్రాంగాన్ని అభినందించారు. కాగా, మిగిలిన 19 మద్యం దుకాణాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నవంబర్ 1 వరకు మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ, నవంబర్ 3న 19 మద్యం షాపులకు డ్రా తీయనున్నట్లు ఎౖMð్సజ్ ఉన్నతాధికారి పేర్కొన్నారు.ప్రభుత్వ టీచర్కుమద్యం దుకాణం.. విచారణ చేస్తామన్న డీఈఓ మహబూబ్‌నగర్ క్రైం: మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్‌లో ఓ ప్రభుత్వ టీచర్‌కు మద్యం దుకాణం దక్కింది. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి ఆధ్వర్యంలో ఏ4 మద్యం దుకాణాలకు లక్కీడిప్ నిర్వహించారు. ఇందులో గెజిట్ నంబర్ 16వ దుకాణానికి లక్కీడిప్ తీసిన క్రమంలో 17వ టోకెన్ నంబర్ కలిగిన బి.పుష్ప అనే ప్రభుత్వ పీఈటీ ఉపాధ్యాయురాలికి దుకాణం వచ్చింది. ఆమె ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా, సీసీఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారాలు చేయరాదని, ఒకవేళ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈఓ తెలిపారు. -
ఒక్కసారి కాదు.. పదిసార్లు అంటా
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని మాజీమంత్రి టి.హరీశ్‌రావు మరోమారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి కాదు..పదిసార్లు అయినా అంటానని, ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య పంచాయితీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణభవన్ వేదికగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాలి’అని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన రజక సంఘం సమావేశంలోనూ హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెండేళ్లలో విపక్షాలను దుర్భాషలాడటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అడ్డమైన భాషతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం ప్రజలు కూడా అదే భాషతో సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చపాతీ మేకర్, రోడ్ రోలర్ వంటి గుర్తులతో అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. మద్యం ధరలను పెంచి ప్రజల నుంచి విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమితోనే తెలంగాణకు లాభం జరుగుతుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
Jubilee Hills bypoll: అగ్గిపెట్టె.. సబ్బుపెట్టె..
హైదరాబాద్: అగ్గిపెట్టె, సబ్బుపెట్టె, పండ్లబుట్ట, ఇటుక, కత్తెర, గాజు.. ఇవన్ని ఏమిటని అనుకుంటున్నారా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉండగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కనబెడితే మిగతావారికీ గుర్తుల కేటాయింపు ఎన్నికల అధికారులకు సవాల్‌గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో రకరకాల గుర్తులను తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో ఇటుకలతో పాటు కత్తెర, గాజులు కూడా కేటాయించారు. సీసీ టీవీ కెమెరా, కూలర్, బెలూన్, ల్యాప్‌ట్యాప్, టీవీ రిమోట్, డిష్ యాంటెనా, డోలి, సైకిల్‌కు గాలి కొట్టే పంపు, బెల్టు, హెల్మెట్, బేబీ వాకర్, ఆపిల్, ద్రాక్ష.. ఇలా చిత్ర విచిత్రంగా గుర్తులు కేటాయించారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పటివరకు 58 మంది అభ్యర్థులు పోటీపడిన దాఖలాలు లేవు. ఇందులో 50 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వారిక గుర్తుల కేటాయింపు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఈసారి ప్రెషర్ కుక్కర్, చపతీ రూలర్, బ్రీఫ్‌కేస్, ఉంగరం, వజ్రం, బైనోక్యూలర్స్.. ఇన్నో ఎన్నో రకాల గుర్తులను కేటాయించారు. ఇక అభ్యర్థులు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి బెల్టు కూడా ఓ అభ్యర్థికి గుర్తుగా వచి్చంది. గుర్తులను సేకరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఎంతో వడబోసి చివరకు గుర్తులను సేకరించి కేటాయించి హమ్మయ్యా..! అంటూ ఊపిరిపీల్చుకున్నారు. -
Jubilee Hills Bypoll: ఏంటీ కార్పెట్ బాంబింగ్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమల దళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన సభ, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది.ఏంటీ కార్పెట్ బాంబింగ్?కుండపోత వర్షానికి క్లౌబ్ బరెస్ట్ అన్నట్లు రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ నేతలతో నియోకవర్గ వీధులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయమని నేతలు పేర్కొంటున్నారు.ప్రాంతీయ అభిమానాన్ని కొల్లగొట్టాలి..నియోజకవర్గంలో ప్రాంతీయాభిమానాన్ని కొల్లగొట్లాని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు. వారిని ప్రభావితం చేసే నేతలను గుర్తించి, ప్రచార కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. దీంతో ఉత్తరాది నుంచి వచి్చన వలస ఓటర్ల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్, ఇతర నేతలను ప్రచారంలోకి దించుతున్నారు. అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించడం, జీఎఎస్టీ స్లాబ్‌లను తగ్గించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు ఇతర నేతలను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లోముమ్మరంగా పాల్గొనున్నారు.ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే శాసన సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అంటూ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో నాంధి పలకాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అంతంతే. బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీలో బీజేపీ జెండా ఎగురవేయాలని క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో, రాష్ట్రంలో బీజేపీ కుర్చీ దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలని నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కేంద్ర, రాష్ట్ర ముఖ్య నేతలతో స్టార్ క్యాంపెయినర్స్‌ను ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి దించుతున్నారు. -
ఎవరికి సినిమా చూపిస్తారో..?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల అభ్యర్థులు అందుకు తగిన ప్రచారంతో, హామీలతో ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉండే సినీ తారలు, దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీ నటులు ఈ నియోజక వర్గంలో లేకపోయినా తెర వెనుక పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్‌లకు పనిచేసే కారి్మకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినా అక్కడున్న రాజకీయాలు, అవినీతి అక్రమాలు స్వార్థపూరిత నాయకత్వంతో వేలాది మంది కారి్మకులకు ఇళ్లు దక్కలేదు. అంతేకాదు వీరికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా సినీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామని నేతలు హామీ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కరు చొరవ చూపింది లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఆయా పార్టీల అభ్యర్ధులకు సినీ కార్మికులు గుర్తుకు వస్తున్నారు.పరిశ్రమతో ముగ్గురికీ అనుబంధం..సినీ పరిశ్రమతో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన రవన్న, పాతబస్తీ అనే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొదటి నుంచి సినీ వర్గాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు. కారి్మక సంఘాలతోనూ అనుబంధం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీకార్మికులులతో సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కార్మికుల మద్దతు పొందేందుకు బీఆర్ఎస్ తగిన వ్యూహాలు రచిస్తోంది.⇒ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు గత నాలుగు దశాబ్ధాలుగా సినీ కార్మిమక సంఘాలతోనూ, వర్కర్స్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్‌కు పలుమార్లు సార్లు సలహాదారుగా పని చేశారు. ఆయన తనయుడు వెంకట్ హీరోగా సినిమాలు కూడా నిర్మించారు. సినీ హీరో సుమన్, ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో సినీ కార్మికుల మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ⇒ బీజేపీ అభ్యర్ధి లంకల్ దీపక్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా కారి్మక నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినీ కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ఆయన తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నారు. ⇒ గత మూడు నాలుగు రోజులుగా ఆయా పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలంటూ సినీ కార్మికులతో పాటు వారి నాయకులను కూడా అభ్యర్థిస్తున్నారు. సినీ తారలతో సినీ కార్మికులు ఉండే ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారితో ప్రచారం నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.. మొత్తానికి మొట్ట మొదటిసారిగా సినీ కారి్మకుల మద్దతు కూడగట్టేందుకు వారిని ఆకట్టుకునేందుకు , బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ⇒ ఆ దిశగా ప్రచారం కూడా చేయాలని వారి సమస్యలను పరిష్కరిస్తామని, హామీ ఇవ్వాలని కూడా వీరు పేర్కొంటున్నారు. నియోజక వర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో సినీ కారి్మకులు ఉంండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు, ఆ ఆప్రాంతాల్లో తమకు స్నేహితులైన హీరోలతో ప్రచారం చేయించనున్నారు. సుమారుగా 24 వేల మంది సినీ కార్మికులు ఉన్న ఈ నియోజక వర్గంలో నవంబర్ 11న మెజార్టీ కారి్మకులు ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇళ్లు దక్కకపోగా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిపోయింది. ఇప్పుడు కారి్మకులంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. -
రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రోడ్ షో
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 28న సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు డి విజన్లలో రోడ్‌షోలో పాల్గొంటారన్నారు.అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్: కేటీఆర్
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు. తుపాకీ రోహిన్‌రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని, ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్‌లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు. -
కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదే బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తోంది.కిషన్‌రెడ్డిపైనే భారం.. ఎన్నికల ప్రచారంలో ముఖ్యనేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్‌రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్‌రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటంతో ఈసారి కచి్చతంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఇమేజ్.. నియోజకవర్గంలో దీపక్‌రెడ్డికి ఉన్న పరిచయాలను బేరీజు వేస్తే బీజేపీ గెలుపు కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలున్నారు. ఏపీ ప్రాంత ఓట్లకు గాలం... ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో ఆ ఓట్లపై కన్నేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులున్నారు. వీరి ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వారి ఓట్లను వేయించుకోగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ దిశలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వివిధ కులాలు, వర్గాల ముఖ్యనేతలు, సంఘాలు, ప్రభావం చూపే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ పార్టీల్లోని ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా... ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పైకి చెబుతున్నా.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. -
ఏం చేసిందని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందని.. హస్తం పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ బీ టీమ్ అంటూ మాపై నిందలు వేసి.. కాంగ్రెస్ నేతలు మాత్రం దోస్తీ చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అని చెప్పుకొచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి షేక్‌పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. గంగా-జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్ హిందు. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. ఆయన సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి?. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో ఆదరణ లేకుండా చేస్తాయి. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు?. కేంద్రంలో సీబీఐపీ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది.వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.తెలంగాణలో అన్ని అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మేము కుల రాజకీయం, మత రాజకీయం చేయం. మేం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీలో ఉద్యోగాలు మూడు రేట్లు పెరిగాయి. మైనారిటీ విద్యార్థుల కోసం 204 విద్యాలయాలు ఏర్పాటు చేశాం. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల ద్వారా మైనారిటీ విద్యార్థులకు చేయూతనిచ్చాం. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించాం. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో మేము బ్రహ్మాండంగా గెలిచాం. మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ప్రస్తుతం అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.బీఆర్ఎస్ పాలనా కాలంలో కరోనా సమయంలో కూడా అభివృద్ధి ఆగలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో రోడ్లు నిర్మించాం. విద్యావంతులు ఓటు వేయడానికి నిరాసక్త చూపిస్తారు. మీరు కూడా ఓటు వెయ్యాలి. రాజకీయాలపై విద్యావంతులు ఆసక్తిగా ఉండరని అందుకే ఓటు వేయరని నాకు తెలుస్తుంది. కానీ అలా చేయడం సరికాదు. మీరు ఓటు వేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మీ భవిష్యత్తును నిర్ధారిస్తారు. కాబట్టి మంచి నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఓటు అడిగే వారిని ఓటు ఎందుకు వేయాలి మీరు ఎదురు ప్రశ్నించాలి అని’ కామెంట్స్ చేశారు. -
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్‌గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్‌రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్‌బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్‌గా మారనుంది. కేటీఆర్‌కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్‌కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్‌స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్‌గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్‌రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్‌రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్‌కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్‌రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. ఈసీ నిర్ణయంతో బీఆర్ఎస్కు కొత్త టెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తుల కేటాయింపులు చేసింది. దీంతో, గుర్తుల విషయమై గత అనుభవాల దృష్ట్యా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.గతంలో ఈ సింబల్స్ తొలగించాలని బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా సింబల్స్ గుర్తింపులో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను సైతం ఎన్నికల సంఘం ఇవ్వనుంది. కాగా, బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్‌యాదవ్ (హస్తం), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ (కారు)కు కేటాయించారు.ఇదిలా ఉండగా.. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో సాయిరాం వెల్లడించారు. అయితే, ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈ సారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. -
ఎన్నికల విధులకు ఆటంకం.. సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్: అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను బీఆర్ఎస్ నేత సల్మాన్‌ఖాన్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బోరబండకు చెందిన సల్మాన్‌ఖాన్ హెచ్వైసీ పార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. బుధవారం స్క్రూట్నీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాం తన నామినేషన్‌ను తిరస్కరించడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేగాక విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో దూషించారు. తన నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని, దీనిపై కాంగ్రెస్ ఒత్తిడి ఉందంటూ ఆరోపించారు. అతడి వైఖరి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనందున అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సల్మాన్‌ఖాన్ గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 100 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పత్రాల స్రూ్కట్నీ కూడా పూర్తయ్యింది. అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారంతో పాటు ర్యాలీలు, రోడ్‌షోలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈమేరకు అందరూ సమన్వయంగా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి కిందికి వచ్చే టోలిచౌకి, గోల్కోండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట, సనత్‌నగర్ తదితర ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషిటర్లను బైండోవర్ చేశారు. నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలకు విభాగం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచడానికి ఎన్నికల సమయంలో రౌడీషిటర్ల బైండోవర్ చేస్తుంటారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలోని 100 మంది రౌడీషీటర్లతో పాటు 50 మంది సస్పెక్ట్ïÙట్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ ప్రక్రియలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానం ముందు హామీపత్రంపై సంతకం చేయాలని పోలీసులు కోరతారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.నేర కార్యకలాపాలను నివారించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, రౌడీషిటర్లు తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రోత్సహించడం బైండోవర్ల ముఖ్య ఉద్దేశ్యం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే పోలీసులు అడుగడుడుగునా పికెటింగ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానితుల కదలికలపై దృష్టిపెట్టారు. రౌడీషిటర్ల కదలికలను కూడా గమనిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషిటర్ల కదలికలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా..? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. వీరందరికీ ఇప్పటికే కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచి్చన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లను బైండోవర్ చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో వీరు పాల్గొంటున్నారా..? లేకపోతే ఏదైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయతి్నస్తున్నారా..? అన్నది పోలీసులు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే సోమాజీగూడ, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ తదితర ఏడు డివిజన్ల పరిధిలో 407 పోలింగ్ బూత్‌లను 139 లొకేషన్లలో ఏర్పాటుచేశారు. ఇందులో 57 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. క్రిటికల్ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉంటున్న రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టారు. -
జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటినీ పూర్తి.. మిగిలింది 81 మందే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByPoll) బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం, బుధవారం నామినేషన్ల స్క్రూటినీ(Nominations Scrutiny Completed) ప్రక్రియ ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇక, రేపు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంత మంది విత్‌డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. స్క్రూటినీ సందర్బంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఇది కూడా చదవండి: స్థానికంపై నేడు నిర్ణయం! -
‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్‌లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
‘దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి?.. కొండా ఫ్యామిలీ వివాదం ముగిసింది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదం ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు.టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉంటే తప్పేంటి?. ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు.. దానం నాగేందర్ సపోర్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి?. ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ చూసుకుంటారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం.కొండా సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మళ్ళీ ఇలాంటివి జరగవని కొండా దంపతులు ముఖ్యమంత్రితో చెప్పారు. కొండా సురేఖ వివాదం ముగిసింది. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఢిల్లీ వెళ్తాం. డీసీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
Jubilee Hills By Poll: స్వతంత్ర అభ్యర్థిగా వీరబోగ వసంత రాయలు
హైదరాబాద్: నెత్తిమీద మహరాజులు ధరించే టోపీ, ఒంటి మీద కుర్తా, అలనాటి లెగ్గిన్, వంకీలు తిరిగిన బూట్లు, మెడలో రాజహారాలు, చేతులకు కడియాలు, రాజసంగా ఓ చేతిలో కత్తి ధరించి గుర్రపు బగ్గీపై నామినేషన్ వేసేందుకు వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరబోగ వసంత రాయలు ప్రజాపతి (వీబీవీఆర్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం నియోజకవర్గానికి వచ్చారు. యూసుఫ్‌గూడలోని పోచమ్మబస్తీ నుంచి ఆయన ఈ విధమైన వేషధారణతో గుర్రపు బగ్గీపై వెళ్తుండగా అందరూ మొబైల్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ప్రజాక్షేమమే లక్ష్యమని, సంపాదన ముఖ్యం కాదని అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పార్టీలకు షాకిస్తూ భారీ సంఖ్యలో నామినేషన్లు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వచ్చారు. దీంతో, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్‌పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. బుధవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.నామినేషన్ల చివరిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మంగళవారం గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బుధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు.. రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
Hyd: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు
హైదరాబాద్: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 21వ తేదీ) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయం కాంపౌండ్క భారీగా క్యూకట్టారు స్వతంత్ర్య అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వేసినట్ల తెలుస్తోంది. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లన మాత్రమే ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) సైతం ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గత బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.ఇదీ చదవండిపార్టీలో నా న్థానం ఏమిటి..? -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్‌ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
Jubilee Hills by poll: 127కు చేరిన నామినేషన్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 127కు చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 94కు చేరింది. నామినేషన్లకు ఆదివారం, సోమవారం సెలవు దినాలు కాగా, మంగళ వారం ఒక్కరోజే నామినేషన్లకు తుది గడువు కాగా ఆ రోజు ఎంతమంది వేస్తారనేది చూడాల్సి ఉంది. -
ఎన్నికల వేళ ఆయుధాల డిపాజిట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి పొందిన ఆయుధాలను లైసెన్స్‌దారులు తమ సమీప ఠాణాల్లో అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వెపన్ లైసెన్స్ హోల్డర్లు తమ ఆయుధాలను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వెపన్ లైసెన్స్‌దారులకు గత రెండు నెలల నుంచే ఆయా పోలీస్స్టేషన్ల అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిని ఠాణాల్లో గానీ, గుర్తింపు పొందిన సంబంధిత ఆయుధ విక్రయ కేంద్రాల్లో గానీ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సమయంలో తుపాకులను డిపాజిట్ చేయాలనే నిబంధనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని పరిధి కిందికి వచ్చే పోలీస్ స్టేషన్లలో లైసెన్స్‌దారులు గత కొద్ది రోజుల నుంచి వాటిని అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి కిందికి పంజగుట్ట, మధురానగర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, గోల్కొండ, సనత్‌నగర్ తదితర పోలీస్స్టేషన్లు వస్తాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ఎనిమిది ఠాణాల పరిధిలో 234 లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులు తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రియల్టర్లు ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తుపాకులు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు వాటిని డిపాజిట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతిఒక్కరికీ ఐడీ నెంబర్ కేటాయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 234 మంది లైసెన్స్‌దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి తుపాకులను డిపాజిట్ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేయడం జరిగింది.క్రిమినల్ కేసులు నమోదైతే లైసెన్స్ రద్దు.. ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. అంతేకాకుండా ఆయుధాన్ని అనవసరంగా ఉపయోగించినా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల్లో ఆయుధం సంచరించినా లైసెన్స్‌ను రద్దు చేస్తారు. -
నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పి.నవీన్‌యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్‌ను ఆయన జతపర్చారు. ఈ మేరకు తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.4 లక్షలు, భార్య చేతిలో రూ.2 లక్షలు నగదు ఉందని, ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ.37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున రెండు అకౌంట్లలో రూ.10 వేలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. రూ. 7 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని, తన పేరున స్కోడా కారు, తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు తన పేరిట, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పొందుపర్చారు. -
సినీతారల మార్ఫింగ్ ఫొటోలతో ఓటు ముద్రించిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తయారు చేసి వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా సినీతారలు రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాల ఫొటోలను ముద్రించి నియోజకవర్గ ఓటర్లుగా గుర్తు తెలియని వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Jubilee Hills Bypoll: పోలింగ్ రోజు సెలవు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అలాగే, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసిగా ఉండి ఓటరుగా పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ రోజున ఈసీ సెలవు ప్రకటించింది. బీహార్‌తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. మొదటి దశ: నవంబర్ 6, 2025 (గురువారం), ద్వితీయ దశ: నవంబర్ 11, 2025 (మంగళవారం), 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా నవంబర్ 11, 2025న జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని విభాగం 135B ప్రకారం.. వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, ఇతర ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, తాను ఓటు హక్కు కలిగిన నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఒక చెల్లింపు సెలవు (Paid Holiday) మంజూరు చేయాలని ఈసీ పేర్కొంది. -
హీరోయిన్ల ఓటరు కార్డులు.. అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ల పేర్లు, ఫోటోలు ఉన్న నకిలీ ఓటరు కార్డులు వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్ డివిజన్ల పరిధిల్లో వెలిశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తమ ఫోన్లలో వచ్చిన ఆయా కార్డులను చూసి విస్తుపోతున్నారు. ప్రముఖ హీరోయిన్లయిన రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాలు వీరంతా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. వారు నిజంగా మా ప్రాంతాల్లో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు.ఈ ఓటరు కార్డులు వైరల్ (Viral) కావడంతో అటుతిరిగి ఇటు తిరిగి అధికారుల దృష్టికి వెళ్ళింది. దాంతో వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆయా కార్డులు నకిలీవంటూ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్డులు ముద్రించి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.78.85 లక్షలు సీజ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బులు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, మధురానగర్, పంజగుట్ట, సనత్‌నగర్, టోలిచౌకి, గోల్కోండ పోలీస్స్టేషన్ల పరిధిలో గత 5 రోజుల నుంచి వేర్వేరు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.78.85 లక్షలు సీజ్ చేశారు. రూ.10 లక్షలు.. వెంగళరావునగర్ : అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదును బుధవారం ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు స్వాదీనం చేసుకున్నాయి. అమీర్‌పేట చౌరస్తా, వెంకటగిరి కాలనీ రోడ్డు, మధురానగర్కాలనీతో పాటు తదితర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో సరైన రసీదులు లేని డబ్బును స్వాదీనం చేసుకున్నారు. రూ.21.21 లక్షలు విడుదల చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల (Jubilee hills by poll) సందర్భంగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద స్వా«దీనం చేసుకున్న రూ.21.21 లక్షలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ బుధవారం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ కె.మంగతాయారు అధ్యక్షతన గల కమిటీ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో విచారణలు నిర్వహించింది. మొత్తం 5 కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలు పరిశీలించింది. ఎన్నికలకు సంబంధం లేని నగదు అని రూఢీ చేసుకున్న తర్వాత స్వాదీనం చేసుకున్న రూ.21,21,600 నగదును విడుదల చేసింది. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు వసుంధర, శరత్ చంద్ర పాల్గొన్నారు.చదవండి: సీఎం రేవంత్‌పై కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టు విచారణ చేపట్టింది. బోగస్ ఓట్లు తొలగించాలంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటీషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు కోర్టుకు వినిపించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. కొంతమందికి రెండు ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయి’’ అని ఆయన కోర్టుకు తెలిపారు.పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్.. కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ.. 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారన్న ఈసీ తరఫు న్యాయవాది.. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.పిటీషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈసీ తరఫు న్యాయవాది వాదనలను సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటీషనర్ విజ్ఞప్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న ఈసీ న్యాయవాది వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ పిటీషన్లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
Jubilee Hills bypoll: ఎగ్జిట్ పోల్స్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, ప్రచారం నవంబర్ 6 నుంచి 11 వరకు నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈ నెల 13న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదు, ప్రచురించరాదు, ఎలాంటి మాధ్యమంలోనూ ప్రచారం చేయరాదని పేర్కొన్నారు. ఈ నిషేధం టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని 126ఏ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే, పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎటువంటి ఎన్నికల సంబంధిత విషయాలు, సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలు ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో ప్రదర్శించరాదు. మీడియా సంస్థలు, రాజకీయ పారీ్టలు, సోషల్ మీడియా వినియోగదారులు, ఎన్నికల సంబంధిత అన్ని వర్గాలు ఈ మార్గదర్శకాలను కచి్చతంగా పాటించాలని, స్వేచ్ఛా, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగస్వాములుగా నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విజ్ఞప్తి చేశారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 120మంది నామినేషన్లు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..!సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక ఫలితం భవిష్యత్ సూచిక అనే అభిప్రాయాలున్నాయి. అందుకే వేటికవిగా అన్నివిధాలుగా శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అధికార యంత్రాంగానికి సైతం ఈ ఉపఎన్నిక పెనుసవాల్‌గా మారింది. సాధారణంగా ఏ ఎన్నికలో అయినా పది మందో, ఇరవై మందో పోటీలో ఉంటారు. కానీ.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో వివిధ వర్గాల వారు, అసంతుషు్టలు ఈ ఉపఎన్నికతో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ద్వారా ప్రజలకు తమ వేదన వెల్లడించడంతో పాటు ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలనుకుంటున్నారు. ట్రిపుల్ఆర్, ఫార్మాసిటీ, లగచర్ల ప్రాజెక్టుల భూసేకరణ బాధితులు, గ్రూప్–1 అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి మాలలు, తదితర వర్గాలు, గ్రూపులకు చెందిన వారు భారీ సంఖ్యలో ఇండింపెండెంట్లుగా నామినేషన్లు వేసేందుకు ‘జూబ్లీహిల్స్’ను వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే బుధవారం వరకు 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు మరో 120 మందికి పైగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయముంది. ఆలోగా ఇంకెంతమంది నామినేషన్లు వేయనున్నారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఇరకాటం బ్యాలెట్ పేపర్ల కాలం ముగిశాక ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతుండటం తెలిసిందే. ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 మంది అభ్యర్థులు, గుర్తులకు అవకాశం ఉంది. వీటిల్లో ఒకటి నోటాకు పోను 15 మంది అభ్యర్థులుంటారు. ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే గతంలో ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు బ్యాలెట్ యూనిట్లు జత చేసేవారు. తద్వారా నోటా పోను 63 మంది అభ్యర్థులకు అవకాశం ఉండేది. 2013 తర్వాత నుంచి ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వీటిని ఒక కంట్రోల్ యూనిట్‌కు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు. నోటా పోను 383 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు బరిలో మిగిలితే సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్ విధానానికి వెళ్లాల్సి వస్తుంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు సిద్ధం చేసుకున్నారు. రెండు బ్యాలెట్ యూనిట్లు మించి అవసరం రాకపోవచ్చునని అంచనా వేశారు. కానీ నామినేషన్లు పెరిగితే అదనపు యూనిట్లు సమకూర్చుకోవడం, ర్యాండమైజేషన్ వంటివి చేయాల్సి వస్తుంది. ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో తెలుసుకునే వీవీప్యాట్లను కూడా అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. గతంలో 1996లో నల్లగొండ పార్లమెంట్‌కు 470 మందికి పైగా ఇండిపెండెంట్లు, ఈవీఎంలు వచ్చాక గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దాదాపు 185 మంది పోటీలో ఉండటం తెలిసిందే. -
అందరికీ సవాలే!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయి.కాంగ్రెస్: విజయం కోసం ప్రణాళికలు అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని భావిస్తోంది. అధికారంలో ఉన్నా గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని ప్రణాళికలు చేపడుతుంది.బీఆర్ఎస్: పట్టు నిలుపుకునే యత్నం బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్లో అన్నివర్గాలు తమవైపే ఉన్నాయని చూపించింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న ఉపఎన్నికల్లో మాగంటి సతీమణి సునీతకు సీటు కేటాయించి సెంటిమెంట్‌తో పాటు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలంతో మరోసారి పాగా వేయాలని చూస్తోంది. కేటీఆర్, హరీష్‌రావులు తప్పక విజయం సాధించాలనే తపనతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తొంది. గ్రేటర్ పీఠాన్ని కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలి మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని చూస్తుంది.బీజేపీ: వ్యూహం మారింది.. లేటుగా అయినా లేటెస్ట్ అంటూ..బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్ ఇచి్చంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి 26 వేల ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటాయని, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయని, అనూహ్యంగా రేసులో ముందుండి గెలుస్తామని ధీమాగా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకోకుండా గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ కూడా భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తమ వ్యూహాలను ఎవరికీ తెలియకుండా గుంభనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. -
మాగంటి సునీత ఆస్తులివే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయగా..తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ మేరకు ఆమె వద్ద 4097 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే చేతిలో నగదు 38,800 రూపాయల నగదు ఉండగా మూడు బ్యాంకు ఖాతాల్లో కలిసి సుమారు 32 లక్షలు, బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు వెండి ఆభరణాలు మొత్తం కలిపి 6,18,54,274 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల పేరిట షేర్లు, ఆభరణాల విలువ సుమారు రూ.4.62 కోట్లుగా పేర్కొన్నారు. సిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఓ ప్లాటు, గోపనపల్లిలో ఓ ప్లాటు ఉన్నట్లు, వీటి మొత్తం విలువ 6.11 కోట్ల రూపాయలు, పిల్లల పేరిట 8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సునీత పేరిట రూ.4.44 కోట్లు అప్పు ఉండగా, పిల్లల పేరుపై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమెపై ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు గతవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Elections) ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది. -
కేసీఆర్ రీఎంట్రీకి ఇదే మొదటి మెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. .. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్ఎస్కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.నామినేషన్ వేసిన సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..? -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో సల్మాన్‌ఖాన్..!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండి పడనుందా? అంటే అవుననే రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నియోజక వర్గంలో మైనారిటీ ఓట్లు కీలకం. మొత్తం ఓట్లలో 24 శాతానికిపైగా మైనారిటీ ఓటర్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ పార్టీకి మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. ఈసారి మజ్లిస్ ఉప ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంక్‌తో పాటు మజ్లిస్ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల బరిలో సోషల్ వర్కర్ సల్మాన్‌ఖాన్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ప్రధాన ప్రక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్థానికుడైన సల్మాన్ క్రౌడ్ ఫండింగ్‌తో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో నిరుపేద మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. యువత ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సల్మాన్ ఎన్నికల బరిలో ఉంటే మొత్తం మీద 20 శాతంపైగా కుటుంబాలు అతని వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మైనారిటీ ఓటర్లు 96 వేలపైనే జూబ్లీహిల్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉండగా అందులో 96 వేలపైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో మైనారిటీ ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా మారారు. మజ్లిస్ పార్టీ గతంలో పాగా వేసేందుకు ప్రయతి్నంచింది. మొదటి సారి 2014 ఎన్నికలలో నవీన్ యాదవ్‌ను బరిలో దింపగా 41,656 ఓట్లు దక్కించుకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్తో దోస్తీ కారణంగా పోటీకి దూరం పాటించడంతో నవీన్ యాదవ్ పారీ్టకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18,817 ఓట్లు వచ్చాయి.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌ను ఎన్నికల బరిలో దింపినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్దిగా భారత క్రికెటర్ దిగ్గజం అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగడంతో మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. బీఆర్ఎస్కు మైనారిటీ ఓటు బ్యాంక్ కలిసి రావడంతో ఎన్నికల్లో గట్టెక్కగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన నవీన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్నా.. సోషల్ వర్కర్ సల్మాన్ ఎన్నికల బరిలో దిగడం మింగుడు పడని అంశంగా తయారైంది. -
Jubilee Hills Bypoll: అదృష్టం కలిసి రావాలని..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా అభ్యర్థులు నమ్మే స్వాములు, పంచాంగ కర్తలు వారి జాతకం, నక్షత్రం ప్రకారం ఏ రోజు, ఏ సమయంలో వేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా స్వామీజీలు, పంచాంగకర్తలు, జ్యోతిషులు బిజీబిజీగా మారి వారికి తగు సలహాలు, సూచనలు, ఏదైనా సమస్య ఉండే దానికి చేయాల్సిన పరిహారాలు కూడా చెబుతున్నారు. కొందరు నేతలు మా అభ్యర్థే గెలవాలని పూజలు, హోమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు వందల దాకా నామినేషన్లు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం విశేషం. అయితే.. 16, 17, 18 తేదీల్లో దశమి, ఏకాదశి, ద్వాదశి మంచి రోజులు కావడంతో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ నెల 17న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బుధవారం కొందరు నేతలతో కలిసి నామమాత్రపు నామినేషన్ వేసి, 18వ తేదీలోపు పార్టీ క్రియాశీల నేతలతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీపై నేడు హైకోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓటర్లను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు ద్వారా అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఓట్ చోరీకి సంబంధించిన రుజువులను తమ పార్టీ కార్యకర్తల సహకారంతో రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల ముందు పెట్టామన్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అసాధారణంగా ఓట్లు పెరిగాయ్.. ‘తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలి. బిహార్‌లో ఓటు చోరీ జరిగితే తెలంగాణలో ఓట్ల చోరీ ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకొని ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశంపై స్పందించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 23వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరో 12వేల ఓట్లు తొలగించామని చెబుతున్నా అసాధారణంగా ఓట్లు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి అక్రమంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందనే అనుమానం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్న తర్వాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుందని ఎలా అనుకోవాలి. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ భగ్గుమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుంది? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నియోజకవర్గంలో వేలుపెట్టడం మీకు అలవాటు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెళ్లడం పక్కా’’ అంటూ రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై పడింది. రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఉపఎన్నిక ఆసక్తిగా మారింది. ఎన్నికల బరికి ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు చిన్నా చితక పార్టీలు, సామాజిక వేత్తలు, నిరసనకారులు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరసన గళం తలనొప్పిగా తయారైంది. కుల, నిరుద్యోగ సంఘాలతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల వేసేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో జూబ్లీహిల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకొని ముందస్తుగానే ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్లు చైర్మన్లను రంగంలోకి దింపారు. గత రెండు మాసాల్లో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి బీసీ కార్డు ప్రయోగించి యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను ఎన్నికల బరిలో దింపింది. టికెట్ ఆశించిన సీనియర్లు అసంతృప్తికి గురి కావడంతో మంత్రులను రంగంలోకి దింపి బుజ్జగించడంలో సఫలీకృతమైంది. తాజాగా నిరసనగళం ఆందోళన కలిగిస్తోంది. -
ఒకే ఇంట్లో 42 ఓట్లు
హైదరాబాద్: యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఎన్నికల అధికారులు కొట్టివేశారు. శ్రీకృష్ణానగర్‌లోని బి–బ్లాక్‌లో ఉన్న 8–3–231/బి/160 నెంబర్‌గల సంస్కృతి ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌ను సోమవారం ఎన్నికల అధికారులు సందర్శించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఖైరతాబాద్ తహశీల్దార్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఎల్ఓలు సోమవారం విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రామకృష్ణ, ప్రసన్న, సుబ్బరత్నమ్మ అనే ముగ్గురు మాత్రమే ఓటర్లు ఉంటున్నారు. అయితే మిగిలిన 39 మంది మాత్రం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లారు. సిని పరిశ్రమకు చెందిన వారుగా గుర్తించిన అధికారులు అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి వారి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టŠస్లో వారు విధులు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇంటి నెంబర్‌తో మరో ఓటును కూడా పొందారా అనే క్రమంలో విచారించగా ఇంకో ఓటు లేదని నిర్థరణకు వచ్చారు. తమ ఓటు అదే ఇంటి నెంబర్లో ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశామని అధికారులకు తెలియజేశారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఓట్లు వేస్తున్నట్లుగా తెలిపారను. కాగా ఇల్లు ఖాళీ చేసిన వారి ఓట్లను వారి అనుమతి లేకుండా తొలగించే హక్కు బీఎల్ఓలకు లేని కారణంగా వాటిని తొలగించలేదని, 43 ఓటర్లను గుర్తించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. -
Jubilee Hills by Election: బీఆర్ఎస్ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు. పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రచారాల్లో మునిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. దీంతో, తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టకోవడమే కాక, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పేందుకు ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే తలంపులో బీఆర్ఎస్ ఉంది. గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే తమ అభ్యర్థిగా అందరి కంటే ముందే ప్రకటించిన బీఆర్ఎస్, ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించగా, తాజాగా సోమవారం రహ్మత్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపు ఇప్పటికే ఖాయమైందని, ఎక్కువ మెజార్టీ పొందడమే ముందున్న లక్ష్యమని కార్యకర్తలను ప్రోత్సహించారు. అనంతరం కేటీఆర్, అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ యెత్తున దొంగ ఓట్లు చేర్చిందంటూ ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఓవైపు పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. మరోవైపు బస్తీల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల్లోని వారి సహకారం కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులను కలిసి ఎన్నికలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడంతో బహిరంగంగా ప్రచార కార్యక్రమాలేవీ లేనప్పటికీ, లోపాయికారీగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల తొలిరోజు దృశ్యాలిలా ఉండగా, మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశాక ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పారీ్టకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఇంకా బీజేపీ అభ్యరి్థని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి ఉంది. ఈఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నువ్వా..నేనా..! అన్నట్లుగా మారడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వేడెక్కుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యరి్థగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇక స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ యువనేత వి.నవీన్యాదవ్ను అభ్యరి్థగా ప్రకటించింది. నేడో రేపో భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 (43.9 శాతం)ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212 (35 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 (14.1 శాతం) ఓట్లు, ఎంఐఎం అభ్యరి్ధగా పోటీ చేసిన మహ్మద్ రాషేద్ పరాజుద్దీన్కు 7,848 (4.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా..? కాంగ్రెస్‌దే పై‘చేయి’ అవుతుందా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నవీన్.. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్ పైనే పోటీ చేశారు. తాజాగా మూడోసారి మాగంటి భార్యతో పోటీ పడుతున్నారు. -
ఢిల్లీ కాంగ్రెస్‌కు సెగ తగలాలి: కేటీఆర్
రహమత్‌నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మేలు కాంక్షించే కారు పార్టీకి మధ్యే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలో, హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్‌నగర్ డివిజన్ క్వారీ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని ‘హైడ్రా’బాద్‌గా మార్చి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్చోరీ అంటుంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీయే ఓట్‌చోరీకి పాల్పడిందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లను చేర్చిందని ఆరోపించారు. ఇదే మోకా.. బీఆర్ఎస్ కార్యకర్తల కసి, పట్టుదల, తపన పార్టీ విజయానికి నాంది కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచి్చంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి. గులాబీ జెండా రెపరెపలాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి’అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వృద్ధులకు రూ.48 వేలు, పెళ్లి అయిన ఆడబిడ్డలకు తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.40 వేల చొప్పున బాకీ ఉందని అన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అందులో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల వరకు అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందని కేటీఆర్ అన్నారు. ‘ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, ప్రజలు తనకే ఓట్లు వేస్తారని సీఎం రేవంత్ అనుకుంటారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని, ఇంత దివాళాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సునీత గెలుపు ఖాయం: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమే. భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గ అభివృద్ధితో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నేతలు వద్దిరాజు రవిచంద్ర, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌషిక్ రెడ్డి, వేములు ప్రశాంత్‌రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, వివేకానంద్‌గౌడ్, సుధీర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దాసోజు శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీత కంటతడి.. ఓదార్చిన సబిత ఎస్పీఆర్ హిల్స్‌లో సోమవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నాయకులు మౌనంగా ఉండిపోయారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతను ఓదార్చారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు(Jubilee Hills By Elections ) సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం.. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. -
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే పార్టీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడు పేర్లను ముందు పెట్టుకుని చర్చించిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. అందులో ఒక పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధానంగా పోటీలో ఉన్న దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల్లో ఒకరి పేరును ఖరారుచేసినట్లు తెలుస్తోంది. బిహార్ సహా జూబ్లీహిల్స్ అభ్యరి్థత్వాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కమిటీ ఆదివారం సమావేశమైంది.ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఇప్పటికే అధిష్టానం పెద్దలకు నివేదిక అందించారు. దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల పేర్లతోనే ఆ నివేదిక అందింది. కమిటీ దీపక్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. అభ్యరి్థని సోమవారం ప్రకటించే అవకాశం ఉందని కె.లక్ష్మణ్ చెప్పారు. -
మీకు తెలుసా?: జూబ్లీహిల్స్‌లో 80 శాతం బస్తీలే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్‌లో, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావన్న సంగతి తెలియదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మైసూర్పాక్లో మైసూర్ లేనట్టే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు. 20 శాతం కాలనీలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80 శాతం బస్తీలే ఉంటాయి. పేద, మధ్యతరగతి వర్గాలే అధికం. కేవలం శ్రీనగర్ కాలనీ, మధురానగర్ కాలనీ ప్రాంతాలు, రాజీవ్‌నగర్ కాలనీ, సారథినగర్ సొసైటీ, కళ్యాణ్‌నగర్, మోతీనగర్‌లో కొంత ప్రాంతం కాలనీలు ఉండగా, బ్రిగేడ్ గేటెడ్ కమ్యూనిటీ, కల్పతరు, వాసవి బృందావన్, జనప్రియ అపార్ట్మెంట్స్ లాంటి కమ్యూనిటీలు ఉన్నాయి. అధికంగా మైనారిటీలు మెజారిటీ ఉండగా తదుపరి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలు ఉన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ ప్రధానంగా ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డి గూడ, శ్రీనగర్ కాలనీ ఉంటాయి. జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్ లేనట్లు నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉండటం కూడా ఓ విచిత్రమే. – శ్రీనగర్‌కాలనీ -
జూబ్లీహిల్స్ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, ఆలపాటి లక్ష్మీనారాయణ పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీలో పార్టీ పెద్దలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్‌కు ఆ జాబితాను అందచేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ కుల, బల సమీకరణాల ఆధా రంగా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిలు పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం రెండు రోజుల్లో ప్రకటించనుంది. -
ఏమి‘టీ’ విచిత్రం! చాయ్ రూ.5.. కాఫీ రూ.6..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులు చేసే ఖర్చు రూ.కోట్లలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల నిబంధనల మేరకు మాత్రం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 40 లక్షలు మించరాదు. అభ్యర్థులు తాము ఎంతమొత్తంలో ఖర్చు చేసినా లెక్క మాత్రం అంతకు లోబడే ఉండాలి. అందుకుగాను అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలకు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారికి , ప్రజలను ఆకట్టుకునేందుకు చాటుమాటుగా పంచే నగదు, కానుకలకు ఎలాగూ లెక్కలుండవు. కానీ.. ప్రచారంలో పాల్గొనే వారికి ఇచ్చే టీ, కాఫీలు, భోజనాలు, ప్రచారంలో వినియోగించేందుకు కొనుగోలు చేసే, అద్దెకు తీసుకునే వస్తువులు, సరుకులు మాత్రం దాచలేరు. వ్యయపరిమితి మించకుండా ఉండేందుకు అభ్యర్థులు ఎలాగూ తక్కువ ఖర్చు చూపిస్తారు కాబట్టి, కనీసం టీ, కాఫీల వంటివాటికైనా వారు ఎక్కువ తిప్పలు పడి ఖర్చులు దాచనవసరం లేకుండా తక్కువ వ్యయాన్నే ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. అన్నింటి ధరలు కాదు గానీ కొన్నింటికి మాత్రం ఏడేళ్ల నాటి ధరలే ఇంకా ఉండటం విశేషం. అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి గతంలో రూ. 28 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని రూ.40 లక్షలకు పెంచారు. అయినప్పటికీ కొన్నింటి ధరలు మాత్రం అలాగే ఖరారు చేయడం విచిత్రం. అంటే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ.. తక్కువగా చూపించేందుకు అవకాశం ఇచ్చారన్న మాట! 2018 నాటి ధరలే.. గ్రేటర్ నగరంలో ఎక్కడైనా రూ.5కే కప్పు టీ దొరుకుతుందా? ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకునే ధరల పట్టికలో మాత్రం టీ (చిన్నకప్పు) ధర రూ. 5గానే ఖరారు చేశారు. కాఫీ చిన్న కప్పు ధర రూ.6గా ఖరారు చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం ఇవే ధరలున్నాయి. నగరంలో రోడ్డు పక్క చాయ్‌వాలా వద్ద కూడా ఇంత తక్కువ ధర ఉండదు. 200 మి.లీ. వాటర్ బాటిల్ ధర 2018లో, 2023లో, ఇప్పుడు కూడా రూ.6గానే చూపారు. నాలుగు ఇడ్లీల ధరలు, రెండు వడల ధరలు సైతం అప్పుడు, ఇప్పుడు రూ.20గానే ఉన్నాయి. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు, అభిమానులకు ఆహార పదార్థాలు అందజేయాల్సి ఉంటుంది కాబట్టి వాటివల్లే ఎక్కువ వ్యయం కాకుండా ఉండేందుకు వీటి ధరలు పెంచలేదేమో ? ఆహార పదార్థాలతోపాటు కొనుగోలు చేసే ఆయా ఐటమ్లలోనూ, అద్దెలకు తీసుకునే సామాన్లు, వాహనాలు, టెంట్లు , తదితరమైన వాటిల్లోనూ పాత ధరలకు, ప్రస్తుత ధరలకు కొన్నింట్లో తేడాలున్నా, కొన్ని అలాగే ఉన్నాయి. చిన్న క్లాత్ బ్యానర్ గతంలో రూ.30 మాత్రమే ఉండగా, వాస్తవ ధరలకనుగుణంగా ప్రస్తుతం రూ.140 ఖరారు చేశారు. అలాగే.. పెద్ద బ్యానర్ గతంలో రూ. 55– 71 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.180కి పెరిగింది. ప్రస్తుత ధరలుప్రస్తుతం కండువా రూ. 25, పులిహోర రూ.40, చికెన్ బిర్యానీ రూ.170, ఫొటో గ్రాఫర్‌కు రోజుకు రూ.1500, వీడియోగ్రాఫర్‌కు రూ.1800, చిన్న పూల దండ రూ.100, పెద్ద పూలదండ రూ.250, ఆరు సీట్ల వరకు మోటార్ క్యాబ్ అద్దె రోజుకు రూ.1430గా ఉన్నాయి. మొత్తం 80 రకాల వస్తువులు, సామగ్రి, ఆహార పదార్థాలకు హాళ్లు, వాహనాల అద్దెలకు రేట్లు ఖరారు చేశారు. జాబితాలో లేని వాటికి అభ్యర్థులు సమరి్పంచే ఓచర్లను సంబంధిత అధికారులు çపరిశీలిస్తారు. -
బీఆర్ఎస్కు మా బలమేంటో చూపిస్తాం: నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు.


