జూబ్లీహిల్స్‌ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్‌రెడ్డి! | BJP set to name Jubilee Hills by-election candidate on Oct 13 | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్‌రెడ్డి!

Oct 12 2025 2:46 AM | Updated on Oct 12 2025 2:46 AM

BJP set to name Jubilee Hills by-election candidate on Oct 13

నేడో రేపో బీజేపీ అభ్యర్థి ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, డాక్టర్‌ పద్మ, మాధవీలత, ఆలపాటి లక్ష్మీనారాయణ పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.

శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీలో పార్టీ పెద్దలు బీఎల్‌ సంతోష్, సునీల్‌ బన్సల్‌కు ఆ జాబితాను అందచేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ లు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ కుల, బల సమీకరణాల ఆధా రంగా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిలు పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరిని జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం రెండు రోజుల్లో ప్రకటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement