మన విషయం అందరికీ తెలిసిపోయింది..! | Man Ends His Sister In Law Life After She Rejects His Advances In Dharmapuri, More Details Inside | Sakshi
Sakshi News home page

మన విషయం అందరికీ తెలిసిపోయింది..!

Jan 12 2026 8:53 AM | Updated on Jan 12 2026 9:18 AM

love affair that made dharmapuri

చెన్నై: కోరిక తీర్చలేదని బావ మరదలను హత్య చేసిన ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. ఇండోర్‌ సమీపంలోని ఓషా అల్లిపుత్తూర్‌కు చెందిన ప్రభు (40). ఇతని భార్య రాజేశ్వరి (30). వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభు బెంగళూరులో భవన కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి సోదరి మునియమ్మన్‌ భర్త హనుమంతన్‌ (40) భవన కాంట్రాక్టర్‌. ఇతను సొంత ట్రాక్టర్‌ కలిగి ఉన్నాడు. ప్రభు, హనుమంతన్‌ ఇద్దరూ భాగస్వాములు. ఈ స్థితిలో బెంగళూరులో నివసించే ప్రభు నెలలో ఒకటి, రెండుసార్లు స్వస్థలానికి వెళ్తాడు. 

ఈక్రమంలో రాజేశ్వరి, హనుమంత్‌న్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరుగు పొరుగుకు విఝయం తెలియడంతో హనుమంతన్‌తో రాజేవ్వరి మాట్లాడడం ఆపేసింది. అయినా హనుమంతన్‌ తన కోరికను తీర్చాలని ఆమె కోరడంతో నిరాకరించింది. ఈక్రమంలో రాజేశ్వరి శనివారం మధ్యాహ్నం కొడుకు చదువుతున్న పాఠశాలకు వెళ్లినప్పుడు, హనుమంతన్‌ ఆమెను అడ్డుకుని, చివరిసారిగా ఏకాంతంగా మాట్లాడడానికి పిలిచాడు. దీంతో, రాజేశ్వరి తన ఇంటికి సమీపంలోని తలవాయిఅల్లి ప్రాంతంలోని కల్లుకొల్లైమేడు ప్రదేశానికి వెళ్ళారు. 

అక్కడ ఇద్దరూ గొడవ పడ్డారు. ఆగ్రహించిన హనుమంతన్‌ రాజేశ్వరిని సమీపంలోని గుంతలోకితోసి రాయితో కొట్టాడు. తర్వాత ట్రాక్టర్‌లోని మట్టిని ఆమెపై పడేశాడు. ఇదంతా సమీపంలోని వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న వ్యక్తులు ఇద్దరూ వాదించుకోవడం చూశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హనుమంత్‌న్‌ను అరెస్టు చేసి, రాజేశ్వరిని హత్య చేసి మట్టిలో పాతిపెట్టానని అతను పేర్కొన్నాడు. పోలీసులు మట్టిని తవ్వి రాజేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి హనుమంత్‌ను అరెస్టు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement