బెంగళూరు: బెంగళూరులో భార్యాభర్తల వివాదం రచ్చకెక్కింది. తనపై ఫిర్యాదు చేసిన భార్యే అసలు మోసగత్తె అని భర్త ఆరోపిస్తున్నాడు. వివరాలు.. తన భర్త ఇంట్లో తల్లిదండ్రులు ముందు నగ్నంగా తిరుగుతాడని, వీడియోలు చూపించి అలా లైంగిక క్రియకు ఒత్తిడి చేస్తాడని మేఘశ్రీ అనే యువతి కేంద్ర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. విల్సన్‌గార్డెన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే వీరికి 3 నెలల కిందటే పెళ్లయింది.
ఇప్పుడు భర్త మంజునాథ్ స్పందిస్తూ మేఘశ్రీ అబద్ధాలు చెబుతోందని, రూ.30 లక్షల నగదు, 50 గ్రాముల బంగారం కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. ఆమె నిత్య పెళ్లికూతురని, గతంలో రెండు వివాహాలు చేసుకుందని, భర్తలపై పోలీసులకు ఫిర్యాదులు చేసి విడాకులు తీసుకుని, తనను పెళ్లాడిందని చెప్పాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ, పరిచయమై వివాహం చేసుకున్నామని మంజునాథ్ తెలిపాడు. మేఘశ్రీ స్పందిస్తూ నేను మంజునాథ్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదని, నాకు రెండు వివాహాలు జరిగిన మాట నిజమని చెప్పింది. భర్త లైంగికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించింది.
సినీ నటి కేసులో మలుపు
సాక్షి బెంగళూరు: నగరంలో ఓ శాండల్‌వుడ్ నటిని నిర్మాత అరవింద్ వెంకటేశ్ రెడ్డి లైంగికంగా వేధించాడని కేసు పెట్టగా అతనిని పోలీసులు విచారించారు. అయితే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. తనను నటి మోసం చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు, ఇందుకు అవసరమైన వారిద్దరు కలిసి ఉన్న ప్రైవేటు ఫోటోను కూడా అందించినట్లు తెలిసింది. తాను ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు చెప్పాడు.


