
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదం ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు.
టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉంటే తప్పేంటి?. ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు.. దానం నాగేందర్ సపోర్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి?. ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ చూసుకుంటారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం.
కొండా సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మళ్ళీ ఇలాంటివి జరగవని కొండా దంపతులు ముఖ్యమంత్రితో చెప్పారు. కొండా సురేఖ వివాదం ముగిసింది. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఢిల్లీ వెళ్తాం. డీసీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.
