ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా కేబినెట్ వరుసగా వారం నుంచి ప్రచారం చేస్తోందని.. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ పేర్కొంది. స్థానిక బీఆర్‌ఎస్ నేతలను బెదిరించి, కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందని.. స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ.. ఈ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలంటూ బీఆర్‌ఎస్ ఫిర్యాదులో పేర్కొంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర బలగాలను వినియోగించాలి. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సీసీ టీవీ కెమెరా వెబ్‌లైవ్ చేయాలి. స్థానికేతరులను నియోజకవర్గంలో ఉండకుండా చర్యలు తీసుకోవాలి. నకిలీ, డూప్లికేట్ ఓటర్లను వెరిఫై చేయాలి. ప్రత్యేక పోలీస్ ఎక్స్పెండిచర్ జనరల్ అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు సెక్యూరిటీ బఫర్ ఏర్పాటు చేయాలి’’ అని ఈసీని బీఆర్‌ఎస్ కోరింది.


