
హైదరాబాద్: తయారు చేసి వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జీహెచ్‌ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా సినీతారలు రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాల ఫొటోలను ముద్రించి నియోజకవర్గ ఓటర్లుగా గుర్తు తెలియని వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.