సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి వెంకటరత్నం అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వవ్యక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతుండటంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.


