సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న వేళ శంషాబాద్ విమానాశ్రయానికి(Shamshabad Airport) బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తనిఖీలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని ల్యాండింగ్ చేయగా.. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులను సురక్షితంగా దింపి ఐసోలేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
On 7th December 2025, late at night, a bomb threat email was received on the Hyderabad airport customer support ID for three flights.
6E 7178 from Kannur to Hyderabad. Landed safely at 10:50 pm on 7th Dec.
LH 752 from Frankfurt to Hyderabad. Landed safely at 02:00 am (early…— ANI (@ANI) December 8, 2025


