గూగుల్‌ స్ట్రీట్‌.. టాటా రోడ్డు.. ట్రంప్‌ అవెన్యూ! | Major roads in Hyderabad are named after international tech companies and celebrities | Sakshi
Sakshi News home page

గూగుల్‌ స్ట్రీట్‌.. టాటా రోడ్డు.. ట్రంప్‌ అవెన్యూ!

Dec 8 2025 3:18 AM | Updated on Dec 8 2025 3:18 AM

Major roads in Hyderabad are named after international tech companies and celebrities

హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లకుఅంతర్జాతీయ టెక్‌ కంపెనీలు, ప్రముఖుల పేర్లు 

గూగుల్‌ సేవల్ని గుర్తిస్తూ ఓ ముఖ్య రోడ్డునగూగుల్‌ స్ట్రీట్‌గా పిలవాలని నిర్ణయం 

మైక్రోసాఫ్ట్‌ రోడ్డు, విప్రో జంక్షన్‌ పేర్లను కూడాపరిశీలిస్తున్న ప్రభుత్వం.. ఓఆర్‌ఆర్‌ను ఫ్యూచర్‌ సిటీతో అనుసంధానించే మార్గానికి రతన్‌ టాటా పేరు 

అమెరికా కాన్సులేట్‌ రహదారిని డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూగా మార్చాలని యోచన  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్‌కు మరింతగా ప్రపంచ పటంలో చోటు కల్పించేందుకు ఆయన సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్‌లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమైన ప్రతిపాదిత భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డుకు దివంగత రతన్‌ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. 

ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ‘టాటా ఇంటర్‌చేంజ్‌’అని పేరు పెట్టారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ముందు నుంచి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది.  

మరికొన్ని ప్రధాన రోడ్లకు కూడా.. 
ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్‌–ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌íÙప్‌ ఫోరమ్‌ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, హైదరాబాద్‌లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని ‘గూగుల్‌ స్ట్రీట్‌’గా ప్రకటించాలని నిర్ణయించారు. 

మైక్రోసాఫ్ట్‌ రోడ్, విప్రో జంక్షన్‌ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించిన వారికి కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement