సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని పాలేరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్‌ఎస్ వర్గీయలు దాడి చేశారు. దీంతో, గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఇది మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం గమనార్హం.
వివరాల ప్రకారం.. పాలేరులోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్ధిని బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయుల దాడి చేశారు. అయితే, బీఆర్‌ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నిక కావడంతో గులాబీ శ్రేణులు దాడికి దిగినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి కారణంగా గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్ నేతల దౌర్జన్యంపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


