హైదరాబాద్: దేశ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోయి సింగిల్ డిజిట్‌కి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పులి పంజా విసురుతుంది. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. ఉత్తర తెలంగాణకు కోల్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,, చలి బారి నుంఇ కాపాడుకునే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రాంతాలు, గోదావరికి అత్యంత సమీపంలో ఉండే గ్రామాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలైన లంబసింగి, పాడేరు, అరకుల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

చలి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకునే కొన్ని మార్గాలు..
శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వెచ్చని బట్టలు ధరించండి స్వెటర్లు, జాకెట్లు, గ్లౌవ్స్, స్కార్ఫ్‌లు, సాక్స్‌లు తప్పనిసరిగా ధరించాలి.
పోషకాహారం తీసుకోవాలి
ప్రోటీన్, విటమిన్ C, విటమిన్ D, ఐరన్, జింక్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
తగినంత నీరు తాగండి.. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా, నీరు తాగకపోతే డీహైడ్రేషన్, చర్మం పొడిబారడం జరుగుతుంది.
మాయిశ్చరైజర్ వాడాలి. పొడిబారడం, చర్మం చిట్లిపోవడం నివారించవచ్చు.
వ్యాయామం చేయండి.. చలికాలంలో శరీరాన్ని చురుకుగా ఉంచడం చాలా ముఖ్యం. ఇంట్లోనే యోగా, స్ట్రెచింగ్, లైట్ వర్కౌట్స్ చేయవచ్చు.
హైజీన్ పాటించండి.. చేతులు తరచుగా కడగాలి. ఫ్లూ, జలుబు, దగ్గు వంటి వ్యాధులు చలికాలంలో ఎక్కువగా వ్యాపిస్తాయి.


