శీతాకాల విడిది హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఎప్పుడంటే? | President Droupadi Murmu visit Hyderabad December 17 to 22 | Sakshi
Sakshi News home page

శీతాకాల విడిది హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఎప్పుడంటే?

Dec 8 2025 11:09 AM | Updated on Dec 8 2025 11:28 AM

President Droupadi Murmu visit Hyderabad December 17 to 22

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము విడిది చేయనున్నారు. సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెలలో శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో బస చేస్తారు. ఈ మేరకు ఈ సంవత్సరం కూడా షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.

డిసెంబర్ 21న రాష్ట్రపతి వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించే తేనీటి విందులో ఆమె పాల్గొంటారు. చివరగా, డిసెంబర్ 22న ఉదయం ఆమె హైదరాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement