సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతలు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. వెంగళరావు నగర్ డివిజన్‌లో ఓటర్లకు డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బూత్ నెం.205, జవహర్‌నగర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికిపోయారు. ఆ నేతను బీఆర్‌ఎస్ కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు.
నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం
నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌కు రావడంపై సీరియస్ అయ్యింది. బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. రిటర్నింగ్ అధికారికి బీఆర్‌ఎస్ 60 ఫిర్యాదు చేసింది. స్థానికేతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇంకా జూబ్లీహిల్స్‌లోనే ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.



