breaking news
vengal rao nagar
-
డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన కాంగ్రెస్ నేత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతలు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. వెంగళరావు నగర్ డివిజన్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బూత్ నెం.205, జవహర్‌నగర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికిపోయారు. ఆ నేతను బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు.నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహంనాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌కు రావడంపై సీరియస్ అయ్యింది. బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ 60 ఫిర్యాదు చేసింది. స్థానికేతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇంకా జూబ్లీహిల్స్లోనే ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. -
కల్లు దుకాణాలపై దాడి చేసిన మహిళలు
-
సాగు నీరిస్తారా..ఇవ్వరా?
కావలి/జలదంకి, న్యూస్‌లైన్ : సాగునీరు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ జలదంకి మండల రైతులు శనివారం కావలి వెంగళరావునగర్‌లో ఉన్న సోమశిల ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. జలదంకి మండల రైతు సంఘం నాయకుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండపాళెం, బ్రాహ్మణక్రాక, బీకే అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. కావలి కాలువ డీఈ రాజేంద్రప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. పంటలు ఎండుతున్నా కనికరం కూడా లేదంటూ మండిపడ్డారు. ఐఏబీ సమావేశం నిర్ణయం మేరకు తాము సాగు చేపట్టామన్నారు. వరినాట్లు వేసి రోజులు తరబడి ఎదురుచూస్తున్న కావలి కాలువ నుంచి సాగు నీరు విడుదల కాలేదన్నారు. రెండు రోజుల్లో నీరు విడుదల కాకుంటే తమ పైర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి కూడా అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రతి సీజన్లో కావలి కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడిక తీత పనులు నాసిరకంగా చేసి నీటి విడుదల కూడా జాప్యం చేయడం వెనుక కారణమేమిటని నిలదీశారు. నీరు విడుదల ఎప్పుడు చేసేది చెప్పేంత వరకు కార్యాలయం నుంచి కదలబోమని రైతులు భీష్మించారు. డీఈ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నీరు విడుదలకు ఆలస్యం ఎందుకు అవుతుందనే విషయాలను తాను నేరుగా చెప్పలేనన్నారు. ఈనెల 18వ తేదీ ఉదయం చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కావలి కాలువ నుంచి నీటిని పంపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 19న ఉదయం హనుమకొండపాళెం పెద్ద చెరువుకు కావలి కాలువ నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పంటలు ఎండుతున్న విషయంపై తమకు బాధ కలుగుతుందన్నారు.


