దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ సాయంత్రం(నవంబర్ 10, 2025) భారీ పేలుడు సంభవించింది.
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఓ కారులో పేలుడు చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.


